English | Telugu

విశాల్‌కి షాకిచ్చిన మ‌ద్రాస్ హైకోర్ట్‌

తెలుగు, త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో విశాల్ తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేయ‌టానికి స‌ర్వం సిద్ధ‌మైంది. అస‌లు పోటీలో ఉంటుద‌నుకున్న ఇత‌ర చిత్రాలు కూడా త‌ప్పుకోవ‌టంతో విశాల్ చాలా సంబ‌ర‌డ్డాడు. వినాయ‌క చ‌వితికి త‌న సినిమానే సోలో రిలీజ్ అని అనుకున్నారు. అయితే మద్రాస్ హైకోర్ట్ హీరోకి అనుకోని షాకిచ్చింది. ‘మార్క్ ఆంటోని’ సిినిమా రిలీజ్‌పై కోర్టు స్టే విధించింది. అందుకు కార‌ణం.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ గ‌తంలో త‌మ‌కు విశాల్ డ‌బ్బులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే. వీరికి విశాల్ రూ. 21.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.15 కోట్లు క‌ట్టాల‌ని అప్ప‌ట్లో కోర్టు తీర్పు కూడా ఇచ్చింది.

16 కోట్లు చీటింగ్ కేసులో నిర్మాత‌ అరెస్ట్!

కొంద‌రు ఏ ప‌ని చేసినా త‌మ ప్ర‌మేయం లేకుండా వార్త‌ల్లో వ్య‌క్తులుగా ఉంటుంటారు. అలాంటి వారిలో త‌మిళ నిర్మాత ర‌వీంద్ర‌న్ చంద్ర‌శేఖ‌రన్ ఒక‌రు. ఈయ‌న మ‌హాల‌క్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న‌ప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యారు. అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకుంటే వైర‌ల్ కావ‌ట‌మేంట‌నే అనుమానం రావ‌చ్చు. ఆయ‌నేమో లావుగా ఉంటే అమ్మాయేమో నాజుగ్గా ఉంటుంది మ‌రి. అలా ఇద్ద‌రూ అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారారు. తాజాగా ఇప్పుడు ర‌వీంద్ర‌న్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అందుకు కార‌ణం.. ఆయ‌న‌పై చీటింగ్ కేసు న‌మోదు కావ‌ట‌మే. ఓ బిజినెస్ మ్యాన్‌ను దాదాపు రూ.16 కోట్లు మోసం చేశార‌నే దానిపై ర‌వీంద్ర‌న్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

‘7/G బృందావన్ కాలనీ’ వివాదం.. డైరెక్టర్‌కి బెదిరింపులు

తమిళ చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్న నటి సోనియా అగర్వాల్ కొన్నేళ్లకు దర్శకుడు సెల్వ రాఘవన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లకు ఇద్దరూ విడిపోయారు కూడా. ప్రస్తుతం ఆమె మళ్లీ సినిమాలతో బిజీగా మారటానికి గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆమె 7G అనే చిత్రంలో నటించారు. ఇందులో ఆమె దెయ్యం పాత్రలో కనిపించనున్నారు. వెంకట్, శ్రుతి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హారూన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హారర్ మూవీ టైటిల్ ఇప్పుడు డైరెక్టర్‌కి ఇబ్బందిగా మారింది. 7G టైటిల్‌ను పెట్టొద్దని డైరెక్టర్ హరూన్‌కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయనే తెలియజేశారు.

క్రిష్‌ చేతుల మీదుగా 'ద్రోహి' ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ద్రోహి'. ది క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి  విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు.