English | Telugu

పుష్పరాజ్ మళ్ళీ వస్తుండు.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

"తగ్గేదేలే".. అంటూ 'పుష్ప - ది రైజ్'తోనేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు.. పుష్పరాజ్ గా తన అభినయంతో బెస్ట్ యాక్టర్ గా తొలి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు.

ఇదిలా ఉంటే, పుష్ప ది రైజ్ పేరుతో 2021 డిసెంబర్ 17న మొదటి భాగం రాగా, రెండో భాగం పుష్ప ది రూల్ కి కూడా మంచి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు సుకుమార్ అండ్ టీమ్. 2024 ఆగస్టు 15కి పుష్ప ది రూల్ తెరపైకి రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. మరి.. పుష్ప ది రైజ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ.. పుష్ప ది రూల్ తో అంతకుమించి ఫలితాన్ని అందుకుంటాడేమో చూడాలి.

కాగా, పుష్ప ది రూల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఇందులో బన్నీకి జంటగా రష్మికా మందన్న నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ గా కొనసాగనున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.