English | Telugu
లియో ఫస్ట్ హాఫ్... హాట్ అప్‌డేట్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్!
Updated : Sep 12, 2023
దళపతి విజయ్ నటించిన సినిమా లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తోంది. అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమవుతోంది లియో. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ కి మెల్లిమెల్లిగా అప్‌డేట్స్ అందుతున్నాయి. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చేశారు నిర్మాత లలిత్‌కుమార్. ఆయన లియో ఫస్ట్ హాఫ్ చూసేశారట. ఆనందాన్ని ఆపుకోలేక ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవాలని అనుకున్నారట. ఇటీవల విజయ్ సేతుపతి నటిస్తున్న మహారాజా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చెన్నైలో జరిగింది. ఈ వేదికమీదే లలిత్‌కుమార్ అప్‌డేట్స్ రివీల్ చేశారు.
లలిత్‌కుమార్ మాట్లాడుతూ ``నేను లియో ఫస్ట్ హాఫ్ చూశాను. ఫెనోమినల్‌గా ఉంది. ఎడిటర్ ఫిలోమిన్ రాజా అద్భుతంగా కట్ చేశారు. ఆయన పని చూసి నేను ఫిదా అయ్యాను. నేను ఎడిటర్‌కి ఎప్పుడూ ఫ్యాన్ కాలేదు. ఫస్ట్ టైమ్ లియో ఎడిటర్‌కి ఫ్యాన్ అయిపోయాను. నేను ఫస్ట్ హాఫ్ సినిమా చూడగానే ముందు లోకేష్ కనగరాజ్‌కి ఫోన్ చేశాను. అద్భుతమైన ఎడిటింగ్. ఎంతో గొప్పగా చేశారు. చాలా బావుంది అని చెప్పాను. లోకేష్ నేను చెప్పిందంతా విని, `నేను ఈ సినిమాకు డైరక్టర్‌ని సార్` అని అన్నారు. నాకు చాలా సంబరంగా అనిపించింది. ఆ తర్వాత ఎడిటర్‌తో మాట్లాడాను`` అని అన్నారు. త్రిష కృష్ణన్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, అనురాగ్ కశ్యప్‌తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించిన సినిమా లియో. లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్‌లో ఉంటుంది. ఖైదీ, విక్రమ్ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్‌లో తెరకెక్కిన సినిమాలే. లియోలో సూర్య గెస్ట్ రోల్ చేశారనే మాట వైరల్ అవుతోంది. దీంతో పాటు ఫాహద్ ఫాజిల్ కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు కేరక్టర్లనూ కమల్‌హాసన్ నటించిన విక్రమ్‌లో చూపించారు డైరక్టర్ లోకేష్.