English | Telugu

జితేందర్‌రెడ్డి.. నాని దర్శకుడు పెద్దగానే ప్లాన్ చేశాడు!

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' వంటి రొమాంటిక్‌ లవ్‌స్టోరీలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు విరించి వర్మ, కాస్త రూట్‌ మార్చి డిఫరెంట్‌ జానర్‌ కథతో 'జితేందర్‌ రెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. "హిస్టరీ(హిజ్‌ స్టోరీ) నీడ్స్‌ టు బీ టోల్డ్‌" అనేది ట్యాగ్‌లైన్‌. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక నాయకుడు చిన్న పాపను పక్కను కూర్చోబెట్టుకుని ప్రజల కష్టాలు వింటున్నట్లు పోస్టర్‌లో చూపించారు. అయితే ఆ నాయకుడు ఎవరు అనేది చూపించలేదు.. పాత్రధారి పేరు కూడా వెల్లడించలేదు. అయితే పోస్టర్‌ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. 

భూం భూం బీరుపై ఆర్జీవీ శిష్యుడు కామెంట్స్...వీడియో వైరల్

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్. విలక్షణ దర్శకుడు ఆర్జీవీ శిష్యుడీయన. గురువు ఏమో ఏపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంటే.. శిష్యుడేమో ఇన్ డైరెక్ట్‌గా సెటైర్స్ వేస్తున్నారు. అసలు ఏపీ ప్రభుత్వం శ్రీకాంత్ అయ్యంగార్ ఏం మాట్లాడారు? అనే విషయాల్లోకి వెళితే, శ్రీకాంత్ అయ్యంగార్ పోస్ట్ చేసిన వీడియోను గమనిస్తే.. విజయవాడ వచ్చానని, ఏపీలో బీరు తాగుతున్నానని అన్నారు. ఆయన భూం భూం బీరుని చూపించారు. ఇంట్లో చెప్పలేదని, ఏమవుతుందో ఏమోనని భయపడుతూ దాన్ని తాగారు. ఇప్పుడదే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్స్ విసురుతున్నారు.

‘రూల్స్ రంజన్’.. మళ్లీ డేట్ మార్పు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’. డీజే టిల్లుతో అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న బ్యూటీ డాల్ నేహా శెట్టి ఇందులో హీరోయిన్‌గా మెప్పించనుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాను ముందుగా సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కాస్త సమయం పట్టేలా ఉండటంతో డైరెక్టర్ రత్నం కృష్ణ రిక్వెస్ట్ మేరకు మేకర్స్ ‘రూల్స్ రంజన్’ను అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డేట్ మారొచ్చు కానీ ఎంటర్‌టైన్‌మెంట్ డోసు మాత్రం మారదని మేకర్స్ ఘంటా పథంగా చెబుతున్నారు.

గుంటూరు కారం హీరోయిన్‌కి న‌చ్చిన డిష్‌!

మ‌హేష్‌బాబు హీరోగా న‌టిస్తున్న సినిమా గుంటూరు కారం. ఇప్పుడు హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల హీరో మ‌హేష్‌బాబు కూడా మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో మ‌హేష్ న‌టిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ చిత్రంలో ఫ‌స్ట్ పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే ఆమె కాల్షీట్లు క్లాష్ అవుతున్నాయంటూ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. ముందు నుంచీ ఉన్న శ్రీలీల మాత్రం ఈ సినిమాలోనూ కంటిన్యూ అవుతున్నారు. ఈ సినిమాలో పూజా ప్లేస్‌కి ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి చౌద‌రి. చిన్న హీరోల ప‌క్క‌న సినిమాలు చేస్తూ, అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని హీరోయిన్ మీనాక్షి చౌద‌రి. చూడ్డానికి ప‌క్కింట‌మ్మాయిలా అనిపించే కోల‌ముఖంతో తెలుగు కుర్ర‌కారుకు య‌మాగా న‌చ్చేసింది మీనాక్షి చౌద‌రి.