English | Telugu

ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్‌ అభయ హస్తం!.. రిలాక్స్‌ అయిన యూనిట్‌

ఒక సినిమా రిలీజ్‌కి సీజన్‌ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందులోనూ ఒక భారీ పాన్‌ ఇండియా మూవీ అంటే ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. అలాంటి లెక్కలతోనే ఎన్టీఆర్‌ లేటెస్ట్‌ మూవీ ‘దేవర’ ముందుగానే సమ్మర్‌ సీజన్‌ని బ్లాక్‌ చేసింది. సినిమా షూటింగ్‌ కూడా మొదలు పెట్టకుండానే ఏప్రిల్‌ 5, 2024 అంటూ రిలీజ్‌ డేట్‌ని ఎనౌన్స్‌ చేసింది యూనిట్‌. రిలీజ్‌ డేట్‌ అనేది టార్గెట్‌గా పెట్టుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకొని, షూటింగ్‌ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే కొన్నాళ్ళుగా ఒక భారీ పాన్‌ ఇండియా మూవీ.. ‘దేవర’ చిత్రాన్ని టెన్షన్‌ పెడుతుందా అనే అనుమానం అందరికీ వచ్చింది.


అదే అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప 2’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సెన్సేషనల్‌ హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్‌ అయిన అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా రెండు జాతీయ అవార్డులు గెలుచుకోవడంతో ‘పుష్ప2’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదిలా ఉంటే ‘పుష్ప2’ మార్చి 22న రాబోతోందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. రెండు వారాల ముందు రిలీజ్‌ అయినా ‘పుష్ప2’ వల్ల ‘దేవర’కు టెన్షన్‌ తప్పదు. ఎందుకంటే బాలీవుడ్‌లో సైతం ‘పుష్ప2’పై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో కొన్నివారాల పాటు ఈ సినిమాకి రన్‌ వుండే అవకాశం ఉంది. అదే జరిగితే ‘దేవర’ మనుగడ కష్టమే అవుతుంది. ఇదే టెన్షన్‌తో వున్న టీమ్‌కి ‘పుష్ప2’ రిలీజ్‌ ఆగస్ట్‌కి వెళ్ళిందన్న తీపి కబురు వినిపించింది. దీంతో అందరూ రిలాక్స్‌ అయ్యారు. ప్రస్తుతం వున్న షెడ్యూల్‌ ప్రకారం మార్చి ఏప్రిల్‌ నెలల్లో రిలీజ్‌ అయ్యే భారీ సినిమాలు ఏవీ లేవు. ఒకవేళ పవన్‌కళ్యాణ్‌ ‘ఒజి’ సమ్మర్‌కి వచ్చినా ‘దేవర’తో క్లాష్‌ అయ్యే అవకాశాలు తక్కువ.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.