English | Telugu
మెగాస్టార్ ఇంట మరో విషాదం!
Updated : Sep 12, 2023
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో మమ్ముట్టి తల్లి ఫాతిమా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 93 ఏళ్ళ ఫాతిమా వయసు సంబంధిత సమస్యలతో మృతి చెందారు. ఆ విషాదం జరిగిన కొద్ది నెలలకే తాజాగా మమ్ముట్టి చెల్లెలు అమీనా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ళ అమీనా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు(సెప్టెంబర్ 12న) తుదిశ్వాస విడిచారు. ఒకే ఏడాది తల్లిని, చెల్లిని పోగొట్టుకోవడం మమ్ముట్టికి తీరని లోటు. అమీనా మరణ వార్త తెలిసి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.