English | Telugu
గుంటూరు కారం హీరోయిన్‌కి నచ్చిన డిష్!
Updated : Sep 12, 2023
మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఇప్పుడు హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల హీరో మహేష్‌బాబు కూడా మరోసారి స్పష్టం చేశారు. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ డైరక్షన్‌లో మహేష్ నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ చిత్రంలో ఫస్ట్ పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే ఆమె కాల్షీట్లు క్లాష్ అవుతున్నాయంటూ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ముందు నుంచీ ఉన్న శ్రీలీల మాత్రం ఈ సినిమాలోనూ కంటిన్యూ అవుతున్నారు. ఈ సినిమాలో పూజా ప్లేస్‌కి ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి చౌదరి. చిన్న హీరోల పక్కన సినిమాలు చేస్తూ, అందాల ఆరబోతకు ఏమాత్రం వెనక్కి తగ్గని హీరోయిన్ మీనాక్షి చౌదరి. చూడ్డానికి పక్కింటమ్మాయిలా అనిపించే కోలముఖంతో తెలుగు కుర్రకారుకు యమాగా నచ్చేసింది మీనాక్షి చౌదరి.
2024కి మహేష్ పక్కన మీనాక్షి ఎలా అలరిస్తుందో తెలుసుకోవాలన్నది సూపర్‌స్టార్ ఫ్యాన్స్ కోరిక. ఇప్పటికైతే మీనాక్షి ఇష్టాయిష్టాల గురించి ఆరా తీస్తున్నారు. పర్ఫెక్ట్ సండే డిష్, అందులోనూ సేద దీరాలి, పండగ చేసుకున్నట్టు ఉండాలంటే, మీరేం ప్రిఫర్ చేస్తారనే ప్రశ్నను మీనాక్షి ముందుంచారు జర్నలిస్టులు. దీనికి ఆమె సమాధానమిస్తూ ``నేను రాజ్‌మా చావల్‌ని ప్రిఫర్ చేస్తాను. మా అమ్మ రాజ్‌మా చావల్ చాలా బాగా వండుతారు. కొసరి కొసరి తినిపిస్తారు. మా ఇంట్లో ఏమాత్రం స్పెషల్‌గా అనిపించినా, తప్పక ప్రత్యక్షమయ్యే డిష్ రాజ్‌మా చావల్. ఎంత తిన్నా తనివి తీరదు. ఇంటికి వెళ్తే తప్పకుండా అమ్మతో రాజ్‌మా చావల్ చేయించుకుని తింటాను`` అని అన్నారు మీనాక్షి చౌదరి. ప్రస్తుతం మహేష్‌తో ఈ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ వచ్చే ఏడాది ఈ పాటికి మరిన్ని అవకాశాలు కొల్లగొట్టాలని ఆశిస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.