English | Telugu
35 దేశాల్లో 'జైలర్' ట్రెండింగ్.. తలైవా ఎక్కడైనా తగ్గేదేలే
Updated : Sep 12, 2023
'రోబో' తరువాత సరైన విజయం లేని సూపర్ స్టార్ రజినీకాంత్.. రీసెంట్ మూవీ 'జైలర్'తో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆగస్టు 10న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా.. అద్భుత విజయం సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ మూవీ.. రూ. 600 కోట్లకి పైగా గ్రాస్ ఆర్జించి సంచలనం సృష్టించింది. అంతేకాదు.. తమిళనాట ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కూడా.
ఇదిలా ఉంటే, గత గురువారం (సెప్టెంబర్ 7) నుంచి ఓటీటీలోనూ 'జైలర్' స్ట్రీమ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్స్ లో ఎలాగైతే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఓటీటీలోనూ అదే బాటలో పయనిస్తోంది. 2023 వీక్ 37లో అమెజాన్ ప్రైమ్ నుంచి వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతున్న సినిమాల్లో జైలర్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే, 37 దేశాల్లో ఈ సెన్సేషనల్ మూవీ ట్రెండింగ్ లో ఉందని సమాచారం. దీంతో.. "తలైవా ఎక్కడైనా తగ్గేదేలే" అంటూ రజినీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా, 'జైలర్'కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.