English | Telugu
మండే టెస్ట్ లోనూ పాసైన 'శెట్టి అండ్ శెట్టి'.. బాక్సాఫీస్ 'జాతిరత్నాలు' అంటే మీరే!
Updated : Sep 12, 2023
డీసెంట్ కంటెంట్ తో స్టడీగా వసూళ్ళు రాబట్టడమంటే మాటలు కాదు. అది కూడా.. వీక్ డేస్ లో. లేటెస్ట్ హిట్ మూవీ.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'ని ఈ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. బోల్డ్ పాయింట్ ని ఎంచుకున్నా.. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఈ సినిమాని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. వారాంతం నాటికే దాదాపుగా బ్రేక్ ఈవెన్ రేంజ్ కి వెళ్లిన ఈ అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ మూవీ.. సోమవారం రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టింది. ఇంకా చెప్పాలంటే.. మండే టెస్ట్ లోనూ భలేగా పాసైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఓ మీడియం బడ్జెట్ మూవీ.. సోమవారం (వర్కింగ్ డే) రూ. కోటి షేర్ కి తగ్గకుండా వసూళ్ళు రాబట్టిందంటే.. అది బాక్సాఫీస్ పరంగా గొప్ప విషయమే. ఆ రకంగా.. శెట్టి (అనుష్క) అండ్ శెట్టి(నవీన్)నిబాక్సాఫీస్ జాతిరత్నాలుగా అభివర్ణిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఏదేమైనా.. రూ. 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. మొత్తం 5 రోజుల్లో రూ. 14. 68 కోట్ల షేర్ ఆర్జించి లాభాల బాట పట్టడం యూనిట్ కి ఆనందాన్నిచ్చే అంశమే. మరి.. ఫుల్ రన్ లో ఈ మూవీ ఏ స్థాయి వసూళ్ళు ఆర్జిస్తుందో చూడాలి.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 5 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 4.57 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 74 లక్షల షేర్
ఆంధ్రా: రూ. 2.85 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.8.16 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.16 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.5.36 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల కలెక్షన్స్ : రూ.14.68 కోట్ల షేర్