English | Telugu
ఐదో రోజు పడిపోయిన 'జవాన్' కలెక్షన్స్.. కారణమిదే!
Updated : Sep 12, 2023
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తండ్రీకొడుకులుగా నటించిన సినిమా 'జవాన్'. కోలీవుడ్ కెప్టెన్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్ కి జంటగా నయనతార కనిపించింది. దీపికా పదుకొణె స్పెషల్ రోల్ లో దర్శనమిచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా ఎంటర్టైన్ చేశాడు.
ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన 'జవాన్' తొలి నాలుగు రోజులు రూ. వందకోట్లకి తగ్గకుండా గ్రాస్ ఆర్జించి.. ఓవరాల్ గా ఫస్ట్ వీకెండ్ (నాలుగు రోజులు)లో రూ. 520. 65 కోట్ల గ్రాస్ చూసింది. అయితే, ఐదో రోజైన సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ రూ. 54.80 కోట్ల గ్రాస్ కి పడిపోయాయి. మొత్తంగా.. 5 రోజుల్లో ఈ సినిమా రూ. 575. 45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లయ్యింది.
ఏరియాల వారిగా 'జవాన్' 5 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.36.40 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.29.90 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ. 30.75 కోట్ల గ్రాస్
కేరళ: రూ. 10.10 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 275. 85 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.192.45 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల కలెక్షన్స్ : రూ.575.45 కోట్ల గ్రాస్
హిందీ వెర్షన్ 5 రోజుల నెట్: రూ. 282. 58 కోట్లు