English | Telugu

సినిమాలకు బ్రేక్.. ప్రభాస్ కి ఏమైంది?

ప్రస్తుతం మరే స్టార్ హీరోకి సాధ్యంకాని విధంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'ఆదిపురుష్'తో పలకరించిన ప్రభాస్.. ఏడాది చివరిలో 'సలార్-1'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే 'కల్కి 2898 AD'(ప్రాజెక్ట్ k), మారుతి ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ వెంటనే 'సలార్-2', 'స్పిరిట్' ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్.. సడెన్ గా బ్రేక్ తీసుకోబోతున్నారట. అది కూడా ఏకంగా మూడు-నాలుగు నెలలు అని తెలుస్తోంది.

మోకాలి సర్జరీ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ సర్జరీ తర్వాత ఆయన కనీసం రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట. ఆయన పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొనాలంటే మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే ప్రభాస్ సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. 'సలార్-1' షూటింగ్ ని ఇప్పటికే పూర్తి చేసిన ప్రభాస్.. డబ్బింగ్ చెప్పాల్సి ఉందట. ఈ సినిమాని నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటే డబ్బింగ్ చెప్పడం వరకు ఓకే గానీ, ప్రమోషన్స్ కి రావడం అనుమానమే. ఇక 'ప్రాజెక్ట్ k'ని మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అనుకోగా, ఇప్పటికే ఆలస్యమవుతోంది. ఇక ఇప్పుడు ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటే ఆ సినిమా మరింత లేట్ అవుతుంది. అదే బాటలో ఇతర ప్రాజెక్ట్స్ కూడా ఆలస్యమవుతాయి. మొత్తానికి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ప్రభాస్ కి ఒక్క సర్జరీ బ్రేకులు వేసిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.