English | Telugu
భూం భూం బీరుపై ఆర్జీవీ శిష్యుడు కామెంట్స్...వీడియో వైరల్
Updated : Sep 12, 2023
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్. విలక్షణ దర్శకుడు ఆర్జీవీ శిష్యుడీయన. గురువు ఏమో ఏపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంటే.. శిష్యుడేమో ఇన్ డైరెక్ట్‌గా సెటైర్స్ వేస్తున్నారు. అసలు ఏపీ ప్రభుత్వం శ్రీకాంత్ అయ్యంగార్ ఏం మాట్లాడారు? అనే విషయాల్లోకి వెళితే, శ్రీకాంత్ అయ్యంగార్ పోస్ట్ చేసిన వీడియోను గమనిస్తే.. విజయవాడ వచ్చానని, ఏపీలో బీరు తాగుతున్నానని అన్నారు. ఆయన భూం భూం బీరుని చూపించారు. ఇంట్లో చెప్పలేదని, ఏమవుతుందో ఏమోనని భయపడుతూ దాన్ని తాగారు. ఇప్పుడదే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్స్ విసురుతున్నారు.
నెటిజన్స్ ఈ రేంజ్‌లో రియాక్ట్ కావటానికి కారణం.. ఏపీ దొరికే మద్యం అక్కడే తయారవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కొందరైతే అక్కడి మద్యం తాగలేక బయట రాష్ట్రాలకు వెళ్లి అక్కడి మద్యం కొనుక్కుని తాగుతుంటారు. అక్కడ దొరికే బ్రాండ్స్‌పై నెటిజన్స్ ట్రోలింగ్స్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ భూం భూం బీరు తాగే వీడియోను పోస్ట్ చేయటంతో మరోసారి ట్రోలర్స్‌కి పని కల్పించినట్లయ్యింది. ఇంకా బతికే ఉన్నావా? ఆ బీరు తాగి త్వరగా హాస్పిటల్‌కి వెళ్లు అని ఒకరంటే.. తను సరదాగా చేసుంటారని సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని కొందరంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మద్దతుదారులు మాత్రం శ్రీకాంత్ అయ్యంగార్‌పై విరుచుకుపడుతున్నారు.
అయితే కొందరు మాత్రం అసలు మందు తాగితే తాగు, లేదా తాగకపో.. కానీ దాన్ని వీడియోగా చేసి ఏదో భయపడి తాగుతున్నట్లు వీడియో ఎందుకు చేయటం దీని వల్ల లేని పోని సమస్యలు వస్తాయే తప్ప.. మరేమీ ఉండదని అంటున్నారు. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం ఆర్జీవీ శిష్యుడు ఇలా వీడియో చేయటం అనేది వైరల్‌గా మారింది.