English | Telugu

ఏ మతం పర్‌ఫెక్ట్‌గా ఉందో చెప్పండి : రష్మీ గౌతమ్‌ సూటి ప్రశ్న!

సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా, కరోనా వంటిదని, దాన్ని మనం నిర్మూలించాల్సిందేనని హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన వారు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా ఉదయనిధి మాత్రం తను చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని, కుల వివక్షను నిర్మూలించడానికి మాత్రమే తాను అలా వ్యాఖ్యానించానని అంటున్నాడు.
ఈ సమయంలోనే పవన్‌ కల్యాణ్‌ గతంలో సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సనాతన ధర్మం, హిందూ దేవుళ్ల మీద ఇటీవల దూషణ ఎక్కువైందని, ఈ తరహాలో హిందూత్వం మీద వ్యాఖ్యలు చేయడం సరికాదని పవన్‌కల్యాన్‌ మాట్లాడిన వీడియోలను నటి, యాంకర్‌ రష్మీగౌతమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఆమెను ట్రోల్‌ చేస్తూ రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు.
దీనిపై స్పందించిన రష్మీ ‘నా పోస్ట్‌ తర్వాత అందరూ నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ అనేది ఉంది కదా అని అందరూ నన్ను ట్రోల్‌ చేస్తున్నారు. నా నమ్మకాల గురించి, నా ఇష్టాల గురించి మాట్లాడితే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు.
దేవుళ్ళని మీరెందుకు నమ్మడం లేదు అని నేనెప్పుడైనా అడిగానా? కులవివక్ష గురించి చాలా మంది అడుగుతున్నారు. నిజానికి ఏ మతం పర్‌ఫెక్ట్‌గా ఉందో చెప్పండి. అన్ని మతాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అలాగే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఎవరి మానాన వారిని బ్రతకనివ్వండి. నా దేవుళ్ళని, నా నమ్మకాలని దూషించకండి’ అంటూ ఉద్వేగంగా పోస్ట్‌ చేసింది రష్మి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.