ప్ర‌పంచ‌ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్స్ చేరిన  చోప్రా, అన్నూ

జావెలిన్ త్రో సూప‌ర్ స్టార్ నీర‌జ్ చోప్రా ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్ ఫైల్లోకి దూసుకెళ్లాడు. చోప్రా 2009లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్ త‌ర్వాత ఒలింపిక్స్‌, ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌లు రెండిం టిలోనూ ఒకే స‌మ‌యంలో టైటిల్ సాధించిన మొద‌టి పురుష జావెలిన్ త్రో క్రీడాకారుడిగా నిలిచాడు. చోప్రా ఒరెగాన్‌లోని యూజీన్‌లో క్వాలిఫ‌యింగ్‌లో త‌న మొద‌టి య‌త్నంలో 88.39 మీటర్ల త్రోతో తన తొలి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. అలాగే, భారత జావెలిన్‌ త్రోయర్‌ అన్నూ రాణి వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకొంది. గురువారం జరిగిన మహిళల జావెలిన్‌త్రో క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-బిలో అన్నూ 59.60 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచింది. 24 ఏళ్ల  నీరజ్ పురుషుల జావెలిన్ త్రో గ్రూప్ ఏ క్వాలిఫికేషన్ రౌండ్‌ను ప్రారంభిం చాడు శుక్రవారం భారత కాలమానం ప్రకారం తన కెరీర్-బెస్ట్ త్రో కోసం తన జావెలిన్‌ను 88.39 మీటర్లకు విసిరాడు. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డును సాధించాడు. పోలాండ్‌లో జరిగిన జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా 86.48 మీటర్ల విన్నింగ్ త్రో కొత్త అండర్-20 ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు. మునుపటి హోల్డర్ లాట్వియా స్థాపించిన 84.69 మీటర్ల మార్కును అధిగమించాడు.అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు నీరజ్ చోప్రా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు నీరజ్.డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనడాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ తన మూడో ప్రయత్నంలో 90.31 మీటర్ల భారీ త్రోతో 16 ఏళ్ల మీట్ రికార్డును బద్దలు కొట్టాడు.టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల త్రోతో తన జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. భారత జావెలిన్‌ త్రోయర్‌ అన్నూ రాణి వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు చేరు కొంది. గురువారం జరిగిన మహిళల జావెలిన్‌త్రో క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-బిలో అన్నూ 59.60 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచింది. అయితే, గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి నుంచి ఫైనల్‌కు ఎంపిక చేసిన టాప్‌-8లో అన్నూ చాన్స్‌ పట్టేసింది. తొలి త్రోలోనే ఫౌల్‌ చేయడంతో క్వాలిఫయర్స్‌లోనే నిష్క్రమణ అంచున నిలిచింది. కానీ, రెండో త్రోలో 55.35 మీ. విసిరిన రాణి.. మూడో త్రోలో 59.60 మీటర్లు త్రో చేసింది. ఇది ఆమె సీజన్‌ బెస్ట్‌ కాకపోయినా.. ఫైనల్‌కు అర్హత సాధించడంలో సఫలమైంది. శనివారం ఫైనల్‌ జరగనుంది. 29 ఏళ్ల అన్నూ వ్యక్తిగత బెస్ట్‌ 63.82 మీటర్లు. 2019లో దోహాలో జరిగిన చాంపియన్‌షి్‌ప ఫైనల్లో అన్నూ 61.12 మీటర్లు విసిరి ఎనిమిదో స్థానంలో నిలిచింది. 

వరద బాధితుల కష్టాలు చూస్తుంటే గుండె తరక్కు పోతోంది.. చంద్రబాబు

బటన్ నొక్కడమే తన పని అనుకుని తాడేపల్లి ప్యాలెస్ లో దర్జాగా కాలం వెళ్లదీస్తున్న ఏపీ సీఎం జగన్ ను జనం బటన్ నొక్కే ఇంటికి పంపేస్తారని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి బాధితులను పరామర్శించిన ఆయన ఆ సందర్భంగా మాట్టాడారు. జనానికి బటన్ నొక్కి డబ్బులిచ్చేస్తే చాలని భావిస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మరో శ్రీలంకగా మార్చేస్తున్న జగన్ ను గద్దె దింపడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు.  గోదావరి వరదలో ప్రజల కష్టాలను చూస్తే గుండె తరుక్కు పోతోందన్నారు. వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అవధులు దాటిందని దుయ్యబట్టారు.  జనాలను బురదలోకి తోసేసి జగన్ గాలిలో తిరగడాన్ని తప్పుపట్టారు. నేరుగా వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు తీరిక లేదా అని ప్రశ్నించారు.   బురదలోనే నడుచుకుంటూ కూలిన ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. కోనసీమలో సోంపల్లి, చాకలిపాలెం జంక్షన్‌, మానేపల్లి, అప్పనపల్లి ప్రాంతాల్లో రాత్రి విస్తృతంగా పర్యటించి బాధితులతో మాట్లాడారు.  వరద అంచనాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు అన్నారు. ఎంత ప్రవాహం వస్తుంది. ఏ యే ప్రాంతాలకు ముంపు ముప్పు ఉంటుందన్నది ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి.. ముంపు ప్రాతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని, ప్రభుత్వం ఆ విషయంలో క్షంతవ్యం కాని నిర్లక్ష్యంతో వ్యవహరించిందని విమర్శించారు.   బాధితులకు భరోసా కలిగించాల్సిన సీఎం గాలిలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారని దుయ్య బట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తిత్లీ, హుద్‌హుద్‌, హరికేన్‌ తుఫాన్లు వచ్చినా తక్షణం స్పందించి సమర్థంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నామనీ,  ఇప్పుడు గోదావరి వరదలో ప్రజల ఇబ్బందులను వైసీపీ పట్టించుకోలేదనీ, వారి బాధలు వారే పడాలన్నట్లుగా వదిలేసిందనీ విమర్శించారు. ప్రభుత్వం వరద బాధితుల కోసం పడవలు ఏర్పాటు చేయలేదు.  కనీసం భోజనం కూడా పెట్టలేదన్నారు. నాలుగు రోజుల పాటు వరద బాధితులను గోదావరికి వదిలేసి.. ఇప్పుడు తానొస్తున్నానని రెండు వేల రూపాయలు సాయం  అంటూ ఇచ్చి నాటకాలాడుతున్నారని దుయ్య బట్టారు. రెండు వేల రూపాయలు వరదతో ఇంట్లో మేట వేసిన బురద కడుక్కోవడానికైనా సరిపోతుందా అని ప్రశ్రించారు.  బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేవరకు మళ్లీ మళ్లీ వరద ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. వరద బాధితులకు ప్రతి ఇంటికీ రూ. పది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే విలీన గ్రామాల ప్రజలు ఏపీలో ఉండం, తెలంగాణలో కలిపేయండని అంటున్నారన్నారు.   

వందేళ్ల త‌ర్వాత ద‌క్కిన ఆస్తి! 

ఎక్క‌డ‌న్నా యాభైగ‌జాల స్థ‌లం ఉందంటే ఎలా కాజేద్దామా అని క‌బ్జాదారులు వేటాడే రోజులు ఇవి. చాలారోజులుగా ఎవ‌రూ ప‌ట్టించుకోని స్థ‌లాన్ని ఎలాగైనా కాజేయాల‌ని విచిత్ర‌ప‌ద్ధ‌తుల‌తో ప‌త్రాలు సృష్టించి మ‌రీ కొట్టేస్తుంటారు. అలాంటిది న‌ల్ల‌జాతి కుటుంబానికి వందేళ్ల త‌ర్వాత వారికి నిజంగా చెందాల్సిన బ్రూస్ బీచ్ భ‌వ‌నాన్నిఅధికారులు ఇవ్వ‌డం క‌బ్జాదారుల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తుందేమో!  వందేళ్ల క్రితం బ్రూస్ పూర్వీకులు విల్లా, చార్లెస్ బ్రూస్ కుటుంబం మాన్‌హ‌ట‌న్ తీర ప్రాంతానికి వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. అక్క‌డే కొంత భూమిలో చిన్న భ‌వ‌నాన్ని నిర్మించుకున్నారు. కానీ తెల్ల‌వారి ఆగ‌డాలు భ‌రించ‌లేక‌పోతుండేవారు. ఈ కుటుంబాన్ని ఎలా గ‌యినా ఆ ప్రాంతంనుంచీ త‌రిమేయాల‌ని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. క్ర‌మంగా వారినుంచి, ఇత‌రుల నుంచీ కూడా స‌మ స్య‌లు పెరిగేస‌రికి త‌ప్ప‌నిప‌రిస్థితుల్లో ఆ ప్రాంతంలోని వారి భూమిని, ఆస్తిని వ‌దిలేసుకుని దూర‌ప్రాంతాల‌కు వెళిపోవాల్సి వ‌చ్చింది. అప్ప‌ట్లో  జాతి వివ‌క్ష‌త ప‌రి స్థితులు అంత దారుణంగా ఉండేవి. స‌ముద్ర‌తీరంలో బ్ర‌హ్మాండ‌మైన భూమిని భ‌య‌పెట్టి తెల్ల‌వాళ్లు కొట్టేశారు. కాలం గ‌డిచేకొద్దీ ఆ ఆస్తిమీద బ్రూస్ కుటుంబీకులు, బంధువుల‌కు ఆశ‌లు పోయాయి. ఇక అది మ‌న‌ది కాద‌నుకుని వేరే న‌గ రాల్లో స్థిర‌ప‌డి జీవితాన్ని సాగిస్తూ వ‌చ్చారు. కానీ అదృష్ట‌దేవ‌త వారి త‌లుపులు త‌ట్టింది. లాస్ ఏంజెల్స్ కౌంటీ అధికారి జానీస్ హాన్ ఇప్ప‌టి బ్రూస్ కుటుంబానికి వాళ్ల పూర్వీకుల ఆస్తిగా పేర్కొన్న భూమి, ఇప్పుడున్న రిసార్ట్ రెండూ త‌మ‌వే అంటూ తెలియ‌జేశారు. ఇంత‌కాలం వారు న‌ల్ల‌వార‌న్న ఒకే ఒక కార‌ణంతో త‌ర‌త‌రాలుగా మంచి జీవితాన్ని కోల్పోయారు బ్రూస్ కుటుంబీకులు. కానీ ఇప్ప‌టికి అది వారి స్వంత‌మ‌యింది.1995లో బ్రూస్ పూర్వీకుల భూమి, ఇప్ప‌టి భ‌వ‌నం లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో లెక్క‌ల్లోకి వ‌చ్చింది. అయితే దీని అస‌లు వార‌సులను గుర్తించారు. కానీ పూర్తిగా ఆ కుటుంబం చేతికి ఇవ్వ‌డానికి ఇంత కాలంప‌ట్టింది. ఏమ‌యిన‌ప్ప‌టికీ పూర్వీకుల ఆస్తి వందేళ్ల‌కి చేజిక్కుతుంద‌ని ఎవ‌ర‌న్నా ఊహిస్తారా? ఈమ‌ధ్య‌నే మాన్‌హ‌ట‌న్ కౌంటీ రిజిస్ట్రార్ డీన్‌ లొగాన్ బ్రూస్ కుటుంబానికి అధికారిక ప‌త్రాలు అంద‌జేయ‌డంతో  బ్రూస్ కుటుం బం క‌ల నిజ‌మ‌యింది. ఇది మిరాకిల్ అన్నారు కొంద‌రు, మ‌రికొంద‌ర‌యితే ప్ర‌భుత్వం, అధికారులు, మారిన సామాజిక ప‌రిస్థి తులు అన్నీ వెర‌సి బ్రూస్ కుటుంబానికి ద‌క్కాల్సిన ఆనందాన్న, భాగ్యాన్ని క‌ల్పించాయ‌న్నారు.

ఎంద చాట.. కాట్రవల్లి .. అంతేనా అలీ!

 అసలు దురదంటూ రాకూడదు కానీ, వచ్చిందంటే ఇక అంతే, గోక్కుంటూనే ఉండాలి...ఆ దురద రాజకీయ దురదయితే, ఇక చెప్పనే అక్కరలేదు. కంటికి కనిపించకుండా అలా గోకుతూ...నే ఉంటుంది. పొరుగువాడిని పట్టుకుని మరీ  గోకమంటుంది. నువ్వు గోకినా గోకక పోయినా నేను మాత్రం గోకుతూనే ఉంటానంటూ వెంటపడి మరీ గోకుతుంది.   లేదు, లేదు మీరు పొరపడుతున్నారు, ఈ గోకుడుకు ఆ గోకుడుకు అసలు సంబంధమే లేదు. నో రిలేషన్, ఎటాల్ ఐ సే .. సంబంధమే లేదు అన్నమాట. నేను మాట్లాడుతున్నది, శ్రీ కేసీఆర్ సార్ వినిపించిన గోకుడు పురాణంలోని గోకుడోపఖ్యానం గురించి కానే కాదు. ఇదంతా మా ఆలీ గోకుడు గోల, ఎస్.. అవును.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది సరదాగా అలీతో .. కూర్చి... గురింఛి అన్నమాట.  ఎస్...కమెడియన్ ఆలీకి ఎప్పడు ఎక్కడ ఎలా తగిలిందో ఏమో కానీ, రాజకీయ దురద గుంటాకు, ఒళ్లంతా తాకేసింది. ఇక అక్కడ నుంచి ఆలీని రాజకీయం రాజకీయాలను ఆలీ గోకుతూనే ఉన్నారు. అయితే, అదేమిటో కానీ, ఆలీ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ కమెడియన్’ గానే మిగిలి పోయారు. పాపం ... ఫర్ ది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్, పోలిటికల్ ఎంట్రీ కోసం ... కనిపించిన వారందరినీ గోకుతూనే ఉన్నారు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు , ఆయన  ఓకే ఈసారి.. ముగ్గురు నాయకులను గోకారు .. మూడు పార్టీలలో చేరి పోయినంత పనిచేశారు.  ఓ ఫైన్ మార్నింగ్ ఆయన పొద్దుగాల, పొద్దుగాల  లేస్తూనే... పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత  జగన్ రెడ్డి  తలుపు తట్టారు. సో ..న్యాచురల్లీ ఆయన వైసీపీలో చేరిపోతున్నారని స్ర్కోలింగ్ లు పరుగులు తీశాయి. ముహూర్తం, వేదిక ఎవ్రీథింగ్ ఫిక్స్ అయి పోయాయి. బట్ ..ద వెరీ నెక్స్ట్ డే .. అలీ కామెడీగా అమరావతిలో వాలిపోయారు, ఎక్కడేమిటి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో .. ఆయనతో ఓ గంటో రెండు గంటలో భేటీ జరిపి బయట కొచ్చారు .. ఆతర్వాత టీవీ స్ర్కోలింగ్గ్స్ ఫాలో అయ్యాయి. అయితే .. అంతే కాదు .. అంతే అయితే అందులో ‘పంచ్’  ఏముందని పవన్ కళ్యాణ్ ఇంటి కెళ్ళారు. మిగిలిన కథంతా సేమ్.. టూ... సేమ్.. అదేదో సినిమాలో బండి మీద ఇసుక మూట పెట్టుకుని బోర్డర్ దాటేస్తాడు చూడండి .. కామెడిగా అలాగన్న మాట.. అయితే చివరకు ఆయన, ఆ ఎన్నికల్లొ పోటీ అయితే చేయలేదు కానీ, వైసీపీ తరపున ప్రచారం చేశారు. ఇక అక్కడి నుంచి చకోర పక్షిలా ఏదో ఒక పదవి వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు.. జగనన్న పదవి ఇవ్వక పోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్యనో మారు జగనన్న పిలిచారని, కొత్త బట్ట లేసుకుని తాడేపల్లి ప్యాలెస్ లో వాలి పోయారు అలీ. ముఖ్యమంత్రిని కలిశారు. ఆతర్వాత మీడియా ముందు కొచ్చిన అలీ, ముసి ముసిగా మురిపెంగా నవ్వుతూ,  “ఈ రోజు రమ్మని పిలిచారు. వచ్చాను. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని  కలిశాను, అతి త్వరలోనే పార్టీ ఆఫీసు నుంచి శుభవార్త వస్తుందని తెలిపారు. ఏ పదవి ఇస్తారన్నది మాత్రం చెప్పలేదని’ ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యారు. సిగ్గులొలక పోశారు. రాజ్యసభ టికెట్ మొదలు వక్స్ బోర్డు చైర్మన్’ వరకు ఏదో ఒక పదవి వస్తుందని,ఆయన ఎదరుచూస్తున్నారు. పదవుల పందేరం అయిపొయింది, రాజ్య సభ టికెట్ పక్క రాష్ట్రానికి చెందిన బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు ఇచ్చారు కానీ, అలీకి మాత్రం శుభ వార్త రాలేదు. గతంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రుద్వీరాజ్ కూడా ఇలాగే, జగన్ రెడ్డి మీద చాలా ఆశలు పెట్టుకుని అటూ ఇటూ కాకుండా పొయారు ..  ఎంద చాట.. కాట్రవల్లి .. అంతేనా అలీ ..

దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

అంతా కేంద్రం అనుకున్నట్లే జరిగింది. విపక్షాలు ఊహించిన అద్భుతమేమీ జరగలేదు. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. తిరుగులేని మెజారిటీతో ఆమె విజయం ఓట్ల లెక్కింపునకు ముందే ఖరారైంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఆమె  మొత్తం 64శాతం ఓట్లు సాధించిట్లు తేలింది. ఎంపలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ద్రౌపది ముర్ముకు ఆరు లక్షల 76 వేల 803 ఓట్లు దక్కాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మూడు లక్షల 80 వేల 117 ఓట్లు లభించాయి.   ఇప్పటి వరకూ దేశ రాష్ట్రపతులలో ద్రౌపది ముర్ముయే అతి పిన్న వయస్కురాలు. ఇలా ఉండగా ఓట్ల లెక్కుంపు మూడో రౌండ్ పూర్తయ్యే సమయానికే ఆమెకు 53శాతం ఓట్లు దక్కడంతో ఆమె విజయం ఖరారైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించి ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా విపక్షాలు ఆశించినట్లుగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అయితే అది విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా కాకుండా ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు అనుకూలంగా జరిగింది. విపక్షాలకు చెందిన 17 మంది ఎంపీలు, 102 మంది ఎమ్మెల్యేలూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ముఖ్యంగా అసోం, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని భావిస్తున్నారు. విశేషమేమిటంటే బీజేపీకి కానీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కానీ అసలు ప్రాతినిథ్యమేలేని ఏపీలో మర్ముకు వంద శాతం ఓట్లు లభించాయి. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూడా ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు పలికి ఆమెకే ఓటేశారు. ముర్ము తిరుగులేని విజయం అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉంటుందని ప్రకటించారు.   దాంతో ఉప రాష్ట్రపతిగా బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ విజయం నల్లేరుపై నడకే అవుతుంది.   రాష్ట్రపతి ఎన్నిక ఫలితం వెలువడగానే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.  భారతీయులు ఆజాదీగా అమృతోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణంలో  తూర్పు భారత దేశంలోని మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా ఎన్నుకుని చరిత్ర  దేశం చరిత్ర సృష్టించిందని మోడీ ట్వీట్ చేశారు.  

ప‌తాక రూప‌క‌ర్త‌కు  ఇక‌నైనా  భార‌త ర‌త్న ఇస్తారా

స్వాతంత్య్ర‌దినోత్స‌వంనాడు మాత్ర‌మే మ‌న‌కు జాతీయ ప‌తాకం మీద దృష్టి వెళుతుంటుంది. ఆ రోజే దేశ‌భ‌క్తి  పెల్లుబుకుతుం టుంది. ల‌త‌మంగేష్క‌ర్‌, ర‌ఫీ పాడిన పాట‌లే దేశ‌భ‌క్తి పాట‌లుగా ప్ర‌తీ న‌గ‌రం, ప‌ట్ట‌ణం, ప‌ల్లెల్లో కూడా విన‌ప‌డుతూంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెస్ సుబ్బ‌ల‌క్ష్మి పాడిన భ‌జ‌న విన‌ప‌డుతూంటుంది. అంతే, త‌ప్ప భార‌తీయులంతా ఎప్ప‌టికీ గ‌ర్వ‌ప‌డే, ప్రాతః స్మ‌రణీయుడు పింగ‌ళి వెంక‌య్య‌గారు మాత్రం ఇవాళే గుర్తుకువ‌స్తారు. దేశానికి జాతీయ‌ప‌తాకానికి మౌలిక రూపా న్నిచ్చిన మ‌హానుభావుడు ఆయ‌న‌. 1947లో ఇదే రోజున‌ రాజ్యాంగ పరిషత్ సమావేశంలో భారతదేశ జాతీయ జెండా ప్రస్తుత రూపంలో ఆమోదించబడింది. చిత్ర‌మేమంటే ల‌తామంగేష్క‌ర్‌కి, సుబ్బ‌లక్ష్మిగారికీ ఇచ్చిన భార‌త‌ర‌త్న మాత్రం ఇంత‌వ‌ర‌కూ ఇవ్వ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. 1947లో స్వాతంత్ర్యం సాధించడానికి ముందు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారు వివిధ జాతీయ ప‌తాకాలను ఉపయోగించారు. కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య,  1921 ఏప్రిల్ 1న గాంధీ విజయవాడ నగర పర్యటన సందర్భంగా జాతీయ జెండాను రూపొందించి ఆయ‌న‌కు అందించారు. ప్రస్తుతం మ‌నంద‌రం చూస్తున్న ప‌తాకం 1923లో ఉనికిలోకి వచ్చింది. దీనిని పింగళి వెంకయ్య రూపొందించారు. కుంకుమ, తెలుపు , ఆకుపచ్చ రంగు చారలతో తెల్లటి భాగంలో ఉంచారు. ఇది ఏప్రిల్ 13, 1923న నాగ్‌పూర్‌లో జలియన్‌వాలా బాగ్ ఊచ కోత జ్ఞాపకార్థం జరిగిన కార్యక్రమంలో ఎగురవేశారు. దీనికి స్వరాజ్ జెండా అని పేరు పెట్టారు, భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వం లోని స్వయం పాలన కోసం భారతదేశం డిమాండ్‌కు చిహ్నంగా మారింది.     పింగళి వెంకయ్య భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు. ఆంధ్రప్రదేశ్  మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రులో 1876 ఆగ‌ష్టు రెండ‌వ తేదీన జ‌న్మించారు. పింగళి వెంకయ్య వ్యవ సాయదారుడు, మ‌చిలీప‌ట్నంలో విద్యా సంస్థను స్థాపించిన విద్యావేత్త కూడా. ఆయ‌న 1963 జులై 4వ త‌దీన విజ‌య‌వాడ‌లో క‌నుమూశారు.  ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయాన్ని ఆశించ‌ని గొప్ప దేశ‌భ‌క్తుడు ఆయ‌న‌. 2009లో ఆయన స్మారకార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేశారు.  2011లో మరణానంతరం ఆయనకు భారతరత్న ప్రదానం చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కేంద్రం నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. 2009లో అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం పింగ‌ళి వెంక‌య్య గౌర‌వార్ధం స్టాంపును విడుద‌ల చేసింది. 2014లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని కేంద్రానికి ప్ర‌తిపాద‌న చేసింది.   

దేవుడి దయవల్ల బతికి బయటపడ్డా : దేవినేని ఉమ

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం సాయంత్రం కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద బోటు ప్రమాదం జరిగిన సంగతి విదితమే. ఆ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ సంఘటనలో పలువురు నేతలు గోదవరిలో పడిపోయారు. అలా పడిపోయిన వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన అనంతరం వలేకరులతో మాట్లాడిన దేవినేని ఉమ నీటిలో పడగానే ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పారు. ప్రాణం పోయిందనే అనుకున్నాననీ, భగవంతుడి దయవల్లే బతికి బయటపడ్డానని చెప్పారు. ప్రమాదం జరగడానికి క్షణాల ముందు చంద్రబాబు వేరే పడవలోకి మారారు. ఈ సంఘటనలో దేవినేని ఉమతో పాటు మాజీ మంత్రి ప్ర‌మాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా ప‌రిధిలోని సోంప‌ల్లి స‌మీపంలో ఓ ప‌డ‌వ నుంచి టీడీపీ నేత‌లు మ‌రో ప‌డ‌వ‌లోకి మారుతున్న స‌మ‌యంలో వారున్న ప‌డ‌వ ఓ వైపున‌కు ఒరిగిపోయింది. ఈ ఘటనలో దేవినేని ఉమతో పాటు పితాని స‌త్య‌నారాయ‌ణ‌, ఉండి ఎమ్మెల్యే రామ‌రాజు, త‌ణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ‌ కూడా గోదావరిలో పడిపోయారు. అయితే వీరందరినీ సిబ్బంది, సమీపంలో ఉన్న మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.  ప్రమాదం ఒడ్డుకు సమీపంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది.

గోదారిలో ప్రమాదం.. తృటిలొ తప్పించుకున్న చంద్రబాబు

 మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటు ర్యాంపు తెగిపోయింది. అయితే ఆ సమయానికి ఒక్క క్షణం ముందు ఆయన వేరు పడవలోకి మారడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే పంటు ర్యాంపు తెగిన ఘటనలో పలువురు తెలుగుదేశం నేతలు గోదవరిలో పడిపోయారు. వెంటనే సిబ్బంది లైఫ్ జాకెట్లు అందించి వారిని సురక్షితంగా కాపాడారు. గోదవరిలో పడిపోయిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ మంతన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే రామరాజు, పార్టీ నేతలు ఉన్నారు. అలాగే జడ్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్జీ సిబ్బంది. ఆయన పర్యటనను కవర్ చేస్తున్న మీడియా సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడ్డారు.   

ఉగాది న‌గ‌దు పుర‌స్కారం మ‌రీ ఎక్కువేమో జ‌గ‌న్‌!

వెన‌క‌టికి ఓ పెద్దాయ‌న మోకాలు నొప్పిగా ఉంది ఇంటికి తీసికెళ్ల‌మ‌ని అడిగితే ఓ పోలీసాయ‌న బండి మీద ఎక్కించుకుని మ‌రీ జాగ్ర‌త్త‌గా ఇంటి ద‌గ్గ‌ర దింపాడు. దిగిన వెంట‌నే చిరున‌వ్వు న‌వ్వి శ‌భాష్ అని బుజం త‌ట్టి మామూలుగానే న‌డుచుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. పోలీసాయ‌న‌కు కోపంరాలేదు. న‌వ్వుకున్నాడు. పెద్దాయ‌న‌లోనూ మ‌హా న‌టుడు ఉన్నాడ‌ని.  అదుగో అలా ఉంది  జ‌గ‌న్‌ స‌ర్కారు నిర్ణ‌యం. ఉగాది పుర‌స్కా రంలో భాగంగా వారికి ఇచ్చే న‌గ‌దు బ‌హుమ‌తిని రూ.500 నుంచి రూ.150కి త‌గ్గిస్తూ ఉత్త‌ర్వులు   జారీ చేసింది. వ‌ర్షాలు, వ‌ర‌ద‌లొచ్చి ఇల్లు మునిగిపోతున్నా, కుర్ర‌కారు సెల్ఫీ వ్యామోహంలో ఏ న‌దిలోనో  కొట్టుకు పోతు న్నా, పోనీ ఏ ఇల్లు త‌గ‌ల‌డుతున్నా ప‌రుగున వ‌చ్చి కాపాడేది, క‌నీసం వెంట‌నే ఆస్ప‌త్రికి తీసికెళ్లేది పోలీ సులు, అగ్నిమాప‌క‌ద‌ళంవారే.  వారికి తన‌, ప‌ర తేడాలుండ‌వు. వారి దృష్టిలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రిక యినా అవ‌స‌ర‌మై పిలిస్తే సేవ‌చేస్తారు. అది వారి వృత్తి ధ‌ర్మంగా భావిస్తారు. కానీ వారి సేవ‌ల‌కు త‌గిన ప‌త కాల‌తో పాటు ఇచ్చేపారితోషికం కూడా కాస్తంత జేబు నిండేలా అన్నా ఇవ్వ‌రు. పైగా ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భు త్వం కేవ‌లం ప‌తకానికే అధిక ప్రాధాన్య‌త‌నిస్తూ ఇచ్చే కాస్తింత న‌గ‌దులోనూ కోత విధించ‌డం దారుణం.  ఊళ్లో గొడ‌వ‌లు, ధ‌ర్నాలు, రౌడీల దాడులు జ‌రుగుతున్నా అడ్డుకోవ‌డానికి ఈల‌ వేస్తే వ‌చ్చేది  పోలీసు బ‌ల‌గాలే. మ‌రీ అవ‌స‌ర‌మైతే అగ్నిమాప‌క‌ ద‌ళాలూ వ‌చ్చేస్తాయి. వారి శిక్ష‌ణ అలా ఉంటుంది. మాన‌వ సేవే మాధ‌వ సేవ అనే త‌త్వం ఇమిడి ఉంటుంది. వారి శిక్ష‌ణ‌కు, వారి క‌ష్టానికి ప్ర‌భుత్వాలు ఇవ్వాల్సిన గౌర‌వ మ‌ర్యాద‌లు కేవ‌లం వారు చ‌నిపోయిన త‌ర్వాత ఇంటికి పెన్స‌న్ డ‌బ్బో, కాయితాలో  పంప‌డం కాదు.   ఉగాది పురాస్కారాల పేరిట చేసే గౌర‌వ మ‌ర్యాద‌లూ మ‌రింత  గౌర‌వ‌ ప్ర‌దంగా ఉండాలి. కానీ  జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం ఈసారి నుంచి ఉగాది పుర‌స్కారాలు ప్ర‌త్యేకంగా పోలీసులు, అగ్నిమాప‌క‌ద‌ళాల వారికి ఇచ్చే పుర‌స్కారంలో భాగంగా కేవ‌లం ప‌థ‌కం, 150 రూపాయ‌ల న‌గ‌దు మాత్ర‌మే  ఇవ్వాల‌ని  నిర్ణ‌యిం చింది. గ‌తంలో ఈ న‌గ‌దు 500 రూపాయ‌లు ఉండేది. దాన్ని రూ.150కి త‌గ్గించ‌డం విని న‌వ్వాలో, ఏడ వాలో అర్ధంగావ‌డం లేదు. 

ఆర్ధిక అరాచ‌క‌త్వం.. ఆంధ్రా గ‌తి శ్రీ‌లంకే.. ర‌ఘురామ‌రాజు

వైసీసీ రెబెల్ ఎంపి ర‌ఘురామ కృష్ణంరాజు లోక్‌స‌భ లో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ దుస్థితిని కేంద్రానికి  తెలిపే ప్ర‌య త్నం చేశారు. ఆయ‌న ప్ర‌సంగాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పదే ప‌దే అడ్డుకున్నారు.  ఈ స‌మ‌యం లో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. రాష్ట్రంలో జ‌గ‌న్  పాల‌న ప్ర‌జావ్య‌తిరేక‌, రైతాంగ వ్య‌తిరేక ధోర‌ణిలో సాగుతోంద‌ని  ర‌ఘురామ విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ప్ర‌సంగాన్ని మిథున్ రెడ్డి  అడ్డుప‌డుతున్న‌ప్ప‌టికీ ర‌ఘురామ ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.  రాష్ట్రంలో ఆర్ధిక ప‌రిస్థితులు ఊహించ‌ని విధంగా ఉన్నాయ‌ని కేంద్రం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొన‌క‌పోతే ఆంధ్ర‌ప్రదేశ్ శ్రీ‌లంక ప‌రిస్థితిని ఎదుర్కొంటుంద‌ని వైసీపీ ఎంపి ర‌ఘురామ‌కృష్ణం రాజు అన్నారు. ఆయ‌న గురువారం లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్ తీరుపై విరుచుకుప‌డ్డారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల విష‌యంలో కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద న్నారు. రాష్ట్ర ఖ‌జానాకు చేరాల్సిన ఆదాయం ఏపీ బేవ‌రేజెస్ కార్పోరేష‌న్‌కు మ‌ళ్లిస్తున్నార‌ని దుయ్య బ‌ట్టా రు.  ఇలా మ‌ళ్ళించిన ఆదాయాన్ని ఆ కార్పోరేష‌న్ ఆదాయంగా చూపుతున్నార‌న్నారు. పైగా ఆ కార్పోరేష‌న్ పేరు మీద అప్పులు చేస్తున్నార‌ని  వైసీపీ ఎంపీ ఆరోపించారు.   అమ‌రావ‌తి రైతులు త‌మ స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వానికి తెలిసేలా చేయాల‌ని త‌ల‌పెట్టిన  మ‌హాపాద‌యాత్ర జ‌ర‌గకుండా అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. 

పొలిటికల్ మైలేజి కోసమేనా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు ?

నేషనల్‌ హెరాల్డ్‌-ఏజేఎల్‌ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ, అలాగే అదే పార్టీకి చెందిన మరి కొందరు ముఖ్య నేతలపై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. ఇది ఇప్పుడు నమోదైన కేసు కాదు, కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో నమోదైన కేసు. అయితే, అప్పట్లో విచారణ లేకుండానే, విచారణ సంస్థలు కేసును కొట్టేశాయి.ఆ తర్వాత  సుభ్రమణ్య స్వామి కోర్టును ఆశ్రయించడంతో,కోర్టు ఆదేశాల  మేరకు ఈడీ విచారణ చేపట్టింది.   ఈ నేపధ్యంలో కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్,(ఈడీ) ఇతరులతో పాటుగా సోనియా గాంధీకి కూడా సమన్లు జారీ చేసింది. నిజానికి,  గత నెలలోనే ఈడీ నోటీసులు జారీ అయినా... అనారోగ్యం (కొవిడ్) కారణంగా ఆమె, అప్పుడు ఈడీ విచారణకు హాజరు కాలేక పోయారు. వాయిదా కోరారు.ఈడీ ఆమె కోరిన విధంగా వాయిదాకు అంగీకరించి, తాజాగా జులై 21, 22 తేదీల్లో విచారణకు హాజరు కావాలని మరో మారు సమన్లు జారీ చేసింది.ఈ నేపధ్యంలో, ఆమె ఈ రోజు ( జులై  21) ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.   అయితే, సోనియా గాంధీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోది. కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల ద్వారా రాజకీయ వేధింపులకు దిగుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకక్ కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రతిపక్షాలు అన్నీ అదే ఆరోపణ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్సనలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే కేసులో రాహుల్ గాంధీని విచారించిన సమయంలోనూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఇదే తరహ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, కేసు ఏమిటి? విచారణ ఏమిటి? తీర్పు ఎలా ఉంటుంది? చివరకు ఎమి జరుగుతుంది, ఏమి జరగదు, అనే విషయాలను పక్కన పెడితే, కాంగ్రెస్ శ్రేణులు నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనల వలన పార్టీకి కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి, అనే విషయంలో రాజకీయ వర్గాల్లో , ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  గతంలో మాజే ప్రధాని పీవీ నరసింహ రావు, ఇతర నేతలు కూడా సీబీఐ,ఈడీ, ఎన్ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ఎదుర్కున్నారు. గోద్రా అనంతర గుజరాత్ అల్లర్ల కేసులో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ , ‘సిట్’ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఎదుట, గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో రోజుల తరబడి విచారణకు హాజరయ్యారు. ఇంకా విచారణను హుందాగా ఎదుర్కున్న నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అప్పట్లో పార్టీ మొత్తంగా వీధుల్లోకి రాలేదు. నిరసన ర్యాలీలు నిర్వహించిన దాఖలాలూ లేవు. చట్టాన్ని గౌరవించారు. నిజానికి, ఇదే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ మరో సీనియర్ నేత పవన్ బన్సల్ ను కూడా ఈడీ విచారించింది. అయినా, ఖర్గే , బన్సల్ విచారణకు కాంగ్రెస్ అభ్యంతరం చెప్పలేదు. నిరసన ప్రదర్శనలు చేయలేదు. అసలు విచారణ ఎప్పుడు జరిగిందో కూడా ఎవరికీ తెలియకుండా విచారణ పూర్తయింది. కానీ, రాహుల్ గాంధీని విచారించిన ఐదు రోజులూ కాంగ్రెస్ పార్టీ దెశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఇప్పడు మళ్ళీ సోనియా  గాంధీ విచారణ సందర్భంగా, పార్టీ  సీనియర్ నేతలంతా రోడ్డు మీదకు వచ్చారు. అయితే, ఈనిరసన ప్రదర్శనల వలన విచారణ సంస్థలు ప్రభావితం అవుతాయా అంటే, అలాంటి అవకాశం కనిపించడం లేదు. అలాగే, నిరసన ప్రదర్శనల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్న పొలిటికల్ మైలేజి అయినా వస్తుందా, అంటే  అదీ అనుమానమే అంటున్నారు.

విప‌క్షాల భేటీ .. తోడికోడ‌ళ్ల స‌మావేశ‌మ‌వుతుందా?

అత్తింటి ఆరిళ్ల‌ను త‌ట్టుకోలేక తోడికోడ‌ళ్లంతా స‌మావేశ‌మయ్యారు వెన‌క‌టికి. వారి మ‌ధ్య ఘోర విభేదాల‌న్నీ తిట్లూ శాప‌నార్ధాల‌న్నీ ఒక్కింత మ‌రిచిపోయి మ‌న‌మంతా అక్క‌చెల్లెళ్లం అత్త‌మ్మే దుర్మార్గురాలు ఆమె ప‌నిప‌ట్టాల్సిందే అని ఓ పండ‌గ రోజు గుడిలో స‌మావేశ‌మ‌య్యారు. దాని ఫ‌లితం ఎలా ఉన్నా గురువారం కాంగ్రెస్ అధినేత సోనియా ఈడీ  పిలుపు మేర‌కు పార్ల‌మెంటులో కాంగ్రెస్ కార్యాల‌యంలో  దాదాపు 13 విప‌క్షాలు స‌మావేశ‌మయ్యాయి. ఈ పార్టీల నాయ‌కుల ల‌క్ష్యం మోదీ ప్ర‌భుత్వాన్ని వీల‌యినంత వెంట‌నే గ‌ద్దె దించే య‌డం. కానీ అంతకంటే ముందుగా, నిజంగానే వారి మ‌ధ్య అంత స‌ఖ్య‌త‌నూ చివ‌రంటా కొన‌సాగిస్తారా లేదా తోడికోడ ళ్ల‌లా ఇంటికెళ్లాక మ‌ళ్లీ క‌ధ మొద‌టికేనా అన్న‌ది చూడాలి. తెలంగాణలో ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్, తెరాసల మధ్య దూరంతగ్గుతోందా అనిపించేలా ఈ భేటీలో తెరాస కూడా పాల్గొంది. పార్లమెంటులోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన  భేటీకి టీఆర్ఎస్ ఎంపీలు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని  నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో మ‌రోసారి ఎన్‌ఫెర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడి) సోనియాను విచారణ నిమిత్తం కార్యాలయాలనికి పిలిచిన నేపథ్యంలో విపక్షాల బేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  బీజేపీ నాయ‌క‌త్వంలోని కేంద్రం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గా సోనియాపై ఈడిని ప్రేరేపిస్తోంద‌ని విప‌క్షాలు మోదీ స‌ర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈడి ని బిజెపి నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తోంద‌ని ప్ర‌తిప‌క్షాలు స‌మావేశం అనంత‌రం  విడు ద‌ల చేసిన ఒక  ప్ర‌క‌టన‌లో ఆరోపించాయి.     దేశంలో ప్ర‌తిప‌క్షాల‌న్నింటిపైనా మోదీ స‌ర్కార్ ప‌నిగ‌ట్టుకుని విరుచుకుప‌డుతోందని, అందుకు ఇన్‌వెస్టి గేటింగ్ సంస్థ‌ల‌న్నింటినీ ఉప‌యోగించుకుంటోంద‌ని మండిప‌డుతున్నాయి. అనేక పార్టీల ప్ర‌ముఖ నాయ కుల‌ను ప‌నిగ‌ట్టుకుని ల‌క్ష్యంగా చేసుకుని మ‌రీ వేధింపుల‌కు గురిచేస్తున్నారని, ఈ విధంగా వేధిం పుల‌కు గురిచేయ‌డం మ‌రింత కొన‌సాగిస్తున్న‌ద‌ని విప‌క్షాలు మండిప‌డ్డాయి. కేంద్రం దారుణంగా వ్య‌వ‌హ‌రి స్తోంద‌ని దీన్ని విప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా ఖండించాయి, ఇక ముందుకూడా కేంద్రం ఆటలు సాగ‌నీయ మ‌ని విప‌క్షాలు సంయుక్తంగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాయి.  కేంద్రం చేప‌డుతున్న ప్ర‌జా వ్య‌తిరేక‌, రైతాంగ వ్య‌తిరేక‌, రాజ్యాంగ వ్య‌తిరేక విధానాలు స‌మాజంలో శాంతిభ‌ద్ర‌త‌ల నూ విచ్ఛిన్నం చేస్తున్నాయ‌ని వారు ఆరోపిచారు.     ఇటువంటి స‌మావేశాల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ దూరంగానే ఉన్న కేసీర్ నాయ‌క‌త్వంలోని టీఆర్ ఎస్ పార్టీ మొట్ట‌మొద‌టి సారిగా  సోనియా  ఈడీ విచారణకు నిరసనగా జరిగిన భేటీకి హాజరైంది.  ఇద్ద‌రి ల‌క్ష్యం బీజేపీకి  బుద్ధి చెప్పడ‌మే గ‌నుక కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి టీఆర్ఎస్ హాజరైందని చెప్పవచ్చు.  గురువారం నాటి స‌మావేశంలో కాంగ్రెస్‌, డిఎంకె, సిపిఐ-ఎం, సిపిఐ, ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ (ఐయుఎం ఎల్‌) పార్టీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు. కాగా జ‌మ్ము కాశ్మీర్ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌(జెకెఎన్‌సి), టిఆర్ ఎస్‌, ఎండిఎంకె, ఎన్‌సిపి, విడుత‌లై చిరుతైగ‌ల్ క‌చ్చి(విసికె), శివ‌సేన‌, ఆర్‌జెడి పార్టీల నాయ‌కులు మాత్రం ప్ర‌తిప‌క్ష నేత కార్యాల‌యంలో క‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.  కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని మ‌ధ్యాన్నం త‌మ కార్యాల‌యానికి రావ‌ల‌సిందిగా ఇ.డి. స‌మాచారం పంపింది. ఆమెకు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, సంబంధిత సంస్థ‌ల నాయ‌కులు ర్యాలీగా వెళ‌తా ర‌ని స‌మాచారం. ఇటీవ‌ల ఆమె కోవిడ్‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స‌కు చేరారు. ఈ కార‌ణంగా ఆమె ఇ.డి విచార‌ణ‌కు హాజ‌రుకాలేక‌పోయారు. జూన్ రెండ‌వ వారంలో ఆమె ఆస్ప‌త్రి నుంచి బ‌య‌టికి రాగానే ఆమెను త‌మ కార్యాల‌యానికి రావాల‌ని అనేక‌ప‌ర్యాయాలు ఇ.డి.  కోరింది.  అయితే ఆమెను ఇలా త‌మ కార్యాల‌యానికి పిల‌వ‌డం స‌మంజ‌సం కాద‌ని ఆ విచార‌ణా సంస్థ అధికారులే సోనియా నివాసానికి రావ‌ల‌సింద‌ని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత అశోక్ ఘెలాట్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇ.డి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు పై మండిప‌డుతూ ప్ర‌ధాని మోదీ,  కేంద్రం ప‌ట్ల అస హ‌నం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం లోపాల‌ను, వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతున్నందువ‌ల్ల‌నే విప‌క్షాల మీద మోదీ ప్ర‌భుత్వం ఈ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఇదిలా ఉండ‌గా, బిజెపి నాయ‌క‌త్వంలోని కేంద్ర‌ప్ర‌భుత్వం ఇడి, సిబిఐ వంటి సంస్థ‌ల‌ను త‌మ స్వార్ధానికి వినియోగించుకుంటోంద‌ని, దీన్ని గురించి స‌భ‌లో చ‌ర్చించాల‌ని కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్  గోగోయ్ గురు వారం లోక్‌స‌భ‌లో వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర‌ప్ర‌భుత్వం ఆ సంస్థ‌ల‌ను కేవ‌లం విప‌క్షాల‌ను తొక్కేయ‌డానికి, దేశంలో అస‌లు విప‌క్షం అంటూ లేకుండా చేసుకోవ‌డానికి మోదీ ప్ర‌భుత్వం వినియోగిం చుకుంటోంద‌ని గోగోయ్ అన్నారు. కేంద్రం వ్య‌వ‌హారం ప్ర‌జాస్వామ్యానికి ఎంతో హానిక‌రం అని విమ‌ర్శిం చారు.   

అంతా భార‌తి మాయ‌!

అమ్మా..దుర్గా.. అని మ‌న‌సారా స్మ‌రించే స‌రికి శివాజీకి దుర్గా మాత ఖ‌డ్గం ఇచ్చిందంటారు.  రామా న‌ను బ్రోవ‌రా అని త్యాగ‌య్య వేడుకోగానే రాముడు మారువేషంలో వెళ్లి ప‌రిస్థితులు తెలుసుకుని క‌రుణించాడు. ఏదేమైన‌ప్ప‌టికీ, భ‌క్తుల క‌థ‌లు తేల్చిన‌దేమంటే.. అయ్య‌వారికంటే అమ్మ‌వారి ద‌యే బ‌హు దొడ్డ‌ది, జీవితాన్నిస్తుంది, చింత‌ లేకుండా బ‌తికేయ‌మని. ఇలాంటివి ఒట్టి క‌థ‌లే అంటారు నిర‌సించేవారు. కానీ  ఈ రోజు ల్లోనూ అలాంటి అమ్మ‌వారు, అలాంటి సంపూర్ణ భ‌క్తుడూ మ‌న క‌ళ్ల‌ముందే ఉన్నార‌న్న‌ది చాలా ఆలస్యం గా వెలుగు చూసింది. ఆ అమ్మవారు భార‌తీ అమ్మ‌వారు.. ఆ భ‌క్తుడు విజ‌య‌సాయి!  అవును దేవ‌ర వారు ఏమన్నా, అమ్మ‌వారి ప‌లుకులు ఆంగ్లంలో వ‌చ్చినా దాని వల్ల విజ‌య‌సాయిరెడ్డి కి మాత్రమే మేలు జ‌రుగుతోంది. యావ‌త్‌ భార‌త దేశంలో కాంగ్రెస్ నాయ‌కులు, అభిమాన‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు వారి అధి దేవ‌త సోనియా గాంధీ నే. ఆమె మాటే శాస‌నం, కాదంటే ఇర‌కాట‌మే! ఇపుడు అలాంటి గొప్ప సంప్ర‌దాయం వైసీపీలోనూ ఉంద న్నది కేవ‌లం అనుమానం కాదు వాస్త‌వ‌మేమో అనిపిస్తుంది. కార‌ణం పార్టీ హైక‌మాండ్ లా భార‌తి తెర వెనుక క‌థ న‌డుపుతున్నార‌న్న సంగ‌తి పార్టీ వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది. కాకుంటే, పార్టీ వ‌ర్గాలు గ‌ట్టిగా పైకి చెప్ప లేకపోతున్నాయి. కానీ కీల‌క ఎత్తుగ‌డ‌లు, నిర్ణ‌యాల్లో ఆమె మాట చెల్లుబాట‌వుతోంద‌న్న టాక్ ఉంది.  తాజాగా విజయసాయిరెడ్డి.. పెద్దల సభ రాజ్యసభలో మళ్లీ సభ్యుడిగా ప్రమాణం చేసిన వీడియోతో పాటు వైయస్ జగన్, వైయస్ భారతమ్మకు  తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ అంశం పై  మళ్లీ ఫ్యాన్ నేతల్లో సందేహాలు పెరిగాయి. ఇటీవల ఉత్తరాంధ్రలో పార్టీ  ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి  తప్పించి.. పార్టీలో సాధారణ  బాధ్యతలను విజయసాయికి అప్పగించింది తాడేపల్లి ప్యాలెస్‌లోని పార్టీ అధిష్టానం. అలా జరిగిన రెండు మూడు రోజు లకే  పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు సైతం విజయసాయిరెడ్డికి దఖలు పడ్డాయి.  ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలకు దఖలు పడిన వాటిని మళ్లీ  విజయసాయిరెడ్డి చేతు ల్లోకి తీసుకు వెళ్లి మరీ పెట్టారు. ఆ క్రమంలోనే మళ్లీ విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు  ఆటోమెటిక్‌గా రెన్యూవల్ జరిగిపోయింది. ఆ వెంటనే విజయసాయిరెడ్డి  మీడియా సాక్షిగా వైయస్ జగన్‌తోపాటు వైయస్ భారతమ్మకు ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో దీనిపై మీడియాలోనే కాదు  సోషల్ మీడియాలో సైతం చర్చ రచ్చ రచ్చగా జరిగింది కూడా. వాస్త‌వానికి  విజయసాయిరెడ్డిని మళ్లీ రాజ్యసభకు పంపరంటూ తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా    గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఆయ‌న‌కి మళ్లీ పెద్దల సభలో సభ్యుడిగా అవకాశం వ‌చ్చింది. ఇదెలా సాధ్య‌మ‌ని చాలా మంది చాలా ఆలోచించారు.   అసలు మళ్లీ ఆయన ఎలా చాన్స్ కొట్టే శారంటూ ఓ చర్చ  తాడేపల్లి ప్యాలెస్‌లోనే యమ జోరుగా నడిచిందట. మాత ద‌య ఉంటే ఏద‌న్నా, ఎలాగైనా జ‌రిగిపోద్దంతే! జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత  విజయసాయి దాదాపుగా కనుమరుగు అయ్యిపోయారు. అంటే ఉత్త రాంధ్ర భాధ్య‌తలు చేపట్టి.. విశాఖలోనే మకాం పెట్టేరు.  ఆయనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నా రట. ఆ క్రమంలో  సదరు వర్గం  విశాఖలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయిందట. దీంతో  వీరిపై  ఫిర్యాదులు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో  సీఎం  జగన్‌ రంగంలోకి దిగి విజయాసాయిరెడ్డి.. ఉత్తరాంధ్ర బాధ్యతలకు చెక్ పెట్టి.. తాడేపల్లి ప్యాలెస్‌లో  కొలువు చేసుకోవాలంటూ ఆదేశించారట. అలా ఆదేశాలు వెలువడిన రెండు మూడు రోజులకే ప్యాలెస్‌లోని.. పెద్ద అమ్మ గారు తెరపైకి వచ్చి విజయ సాయిరెడ్డికి పూర్వవైభవం కల్పించాలంటూ ఆదేశించారని సమాచారం. అమ్మవారి నుండి.. అదీ సీఎం గారి హోం మినిస్టర్ నుంచి ఆదేశాలు రావడంతో ఇక చేసేది లేక.. అప్పటి కప్పుడు.. యుద్ద ప్రాతిపదికన విజయసాయిరెడ్డివారికి అన్ని కీలక బాధ్యతలు దఖలు పడ్డాయట. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తాడేపల్లి ప్యాలెస్‌లోని వారంతా..  అంతా భారతీ మాయ అంటున్నారట.  అలాగే మళ్లీ ఎన్నికలు సీజన్ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల్లో అనుకూలురైన వారిని ఎక్కడ ఉంచాలి.. వ్యతిరేకంగా ఉన్న వారికి ఎక్కడ తుంచాలి అనే తరహా మంత్రాంగంలో   అమ్మ గారు  ప్రస్తుతం నిమగ్నమైనట్లు సమాచారం. ఏదీ ఏమైనా.. తమ గోడు.. అయ్యవారికి  చెప్పుకొంటే.. ఆ పని.. కొంతే వరకే జరుగుతోందని.. అదే అమ్మ వారిని  ఫ‌లం పుష్పం తోయంతో పాటు అష్టోత్తర శత సహస్ర నామాలతో జపిస్తే.. ఏమి తెలియని కాళిదాసును అమ్మవారు కరుణించి  మహాకవిని చేసినట్టు  ఈ విజయ సాయిరెడ్డిని మళ్లీ పెద్దల సభకు పంపించారనే ఓ టాక్  అయితే మళ్లీ ఫ్యాన్ పార్టీలో ఫ్యాన్  తిరిగినట్లు గింగరాలు తిరుగుతోందట.

బాధితుల మధ్య బాబు.. తాడేపల్లి ప్యాలస్ లో జగన్

నాయకుడంటే ఎలా ఉండాలి? కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి.. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారి మధ్యన నిలవాలి.. వారి కష్టాలను స్వయంగా వినాలి.. చేతనైనంత సాయం సాయం చేయాలి.. లేదంటే కనీసం కాస్త ఓదార్పు అయినా ఇవ్వాలి.. ఇవి కదా నాయకుడనిపించుకోవాల్సినవాడు చేయాల్సిన పనులు..? ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందే ఉంటారనడంలో సందేహమే లేదు. రాష్ట్రంలోని ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టం ఎదురైనా ముందుగా పరుగెత్తుకుని వెళ్లి అండగా నిలుస్తుండడం చంద్రబాబు నైజం. మరి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ఆంధ్ర ప్రజలకు సీఎం జగన్ రెడ్డి చేస్తున్నదేంటి? ఒక్కసారి అవకాశం ఇవ్వండని గత ఎన్నికలకు ముందు అమ్మా, అయ్యా, అవ్వా, తాత, అన్నా, తమ్ముడు, అక్కా చెల్లెమ్మల ముందు ప్రాధేయపడిన జగన్ ఏపీ ప్రజలకు ఇప్పుడు వచ్చిపడిన భారీ వరద కష్టం సమయంలో చేస్తున్నదేంటి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ వస్తోంది. అటు చంద్రబాబు- ఇటు జగన్ మధ్య ఉన్న తేడా గురించి బేరీజు వేసుకుంటున్నారు. ఏపీలో 1986లో వచ్చిన అతి భారీ వరదల తర్వాత ఇంచుమించు అంతే స్థాయిలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వందలాది లంక గ్రామాలను ముంచెత్తింది. వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ఇంకా  అనేక లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. గ్రామంలో ఉండే వీలు లేక, సర్వం కోల్పోయిన స్థితిలో తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్న తమకు అరకొరగా ఆహారం సరఫరా చేసి చేతులు దులుపుకున్న జగన్ సర్కార్ తీరును వరద బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంకో పక్కన వెళ్లేందుకు ఇప్పటికీ సరైన దారీ తెన్నూ లేని వరద ముంపు లంక గ్రామాల్లో స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శించేందుకు, వారికి అండగా నిలిచేందుకు  టీడీపీ జాతీయ అధ్యక్షుడు హుటాహుటిన ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల పర్యటకు రావడాన్ని   బాధితులు  స్వాగతిస్తున్నారు. జగన్ తీరును చంద్రబాబు తీరుతో బేరీజు వేసుకుంటున్నారు.  వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఇప్పటికే టీడీపీ శ్రేణులను పురమాయించిన చంద్రబాబు, అక్కడితో ఆగకుండా  తానే స్వయంగా బాధితుల మధ్యకు వెళ్ళడం గమనార్హం.  చంద్రబాబు కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొలిరోజు లంక గ్రామాల పర్యటనలో భాగంగా సిద్ధాంతం నుంచి కరుగోరుమిల్లి చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి గోదావరి నది మధ్యలో ఉన్న అయోధ్యలంక గ్రామానికి వెళ్తారు. అక్కడి నుంచి బోటులో కోనసీమ జిల్లా చాకలిపాలెం చేరుకుని తర్వాత రోడ్డు మార్గంలో మానేపల్లిపాలెం వెళ్తారు. గోదావరి వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తర్వాత అప్పనపల్లి వెళ్లి బాధిత కుటుంబాలను పలకరిస్తారు. సాయంత్రానికి రోడ్డు మార్గంలో రాజోలు వెళ్లి రాత్రికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు చేరుకునేలా షెడ్యూల్ వేసుకుని పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వరద బాధితులకు సాయం అందిస్తారు. నాయకుడనేవాడు బాధితులకు భరోసా ఇవ్వాలని, మాటల్లో కాకుండా ఆ భరోసాను చేతల్లో చూపించాలని పలువురు ప్రత్యక్షంగానే చంద్రబాబబును ప్రశంసిస్తున్నారు. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా చంద్రబాబు చేసేది అదే అని వారు గుర్తు చేస్తున్నారు. సీఎం కుర్చీలో కూర్చునేదాకా తమ చుట్టూ తిరిగిన జగన్ రెడ్డి ఇలాంటి కష్టకాలంలో తమను గాలికి వదిలేశారని, తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. వరద ముంపు ఒక్క రాత్రిలో తమ జీవితాను తారుమారు చేసేసిందని, అష్ట కష్టాల్లో ఉన్న తమను ఆదుకునేవాడు, భరోసా ఇచ్చేవాడు లేడని బాధితులు బావురుమంటున్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. వరదల్ని నివారించే శక్తి లేకపోయినా ప్రజల్లో కచ్చితంగా భరోసా నింపేవారని చెప్పుకుంటున్నారు. గతంలో విశాఖపట్నాన్ని హుద్ హుద్ తుపాను అతలాకుతలం చేసినప్పుడు విశాఖ నగరంలోనే మకా వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన చంద్రబాబు ఎక్కడ? తామంతా ఇంత కష్టంలో ఉంటే ప్యాలెస్ కే పరిమితం అయిన జగన్ ఎక్కడ అని జనమంతా బేరీజు వేసుకుని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల నుంచి కొందరిని సహాయ శిబిరాలకు తరలించి, అరకొరగా భోజనం, అల్పాహారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  ఇంకా వరదనీటిలోనే ఉన్న  తమకు ప్రుభుత్వం అందజేసిన నాలుగు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చిలు, నాలుగు దొండకాయలు, నాలుగు వంకాయలు, ఐదు కిలోల బియ్యంను ఏం చేసుకోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

కేంద్రంతో రాష్టం మళ్ళీ కయ్యం

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ , కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే రాజకీయ మంటలు భగ్గుమంటున్నాయి. నిత్యం ఏదో ఒక వివాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కయ్యం నడుస్తూనే వుంది. ముఖ్యంగా జులై మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ  సమావేశాలు నేపధ్యంగా, బీజీపే, తెరాసల మధ్య భగ్గుమన్న రాజకీయ రగడ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని పతాక స్థాయికి తీసుకుపోయింది. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.  ఇతర విషయాలు, వివాదాలు ఎలా ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం మొదలైనప్పటి నుంచి ధాన్యం సేకరణ అంశం చుట్టూనే రాజకీయం నడుస్తోంది. గతం విషయం ఎలా ఉన్నా, తాజాగా తెరపైకొచ్చిన  బియ్యం వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్’ను బోనులో నిలబెట్టింది, ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ అన్న యోజన కింద, పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన ఉచిత బియ్యాని, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌, మే నెలల్లో పంపిణీ చేయలేదు. నిజానికి, పేదల ఉచిత బియ్యం పంపిణీ జరగక పోవదానికి  సంబంధించి చాలా కాలంగా, రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. మంత్రు;లు, తెరాస నాయకులు ఆ చర్చను పక్కదారి పట్టించారు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నీ వివరాలను బయట పెట్టింది. ఒక విధంగా  రాష్ట్ర ప్రభుత్వాన్ని  కార్నర్ చేసిందని, తెరాస నాయకులే అంగీకరిస్తున్నారు.  ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీతో పాటుగా, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ తప్పుల చిట్టాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే,సెంట్రల్ పూల్‌లోకి తెలంగాణ నుంచి బియ్యం సేకరణను నిలిపివేయవలసి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం సవివరంగా వివరించింది.అంతే కాదు, బ్లాక్ అండ్ వైట్’లో ఇచ్చిన వివారాలకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మరింత వివరంగా వాటి గురించి చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పుల గురించి వివరించారు.  ఈసందర్భంగా పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు విమర్శలు,.రాష్ట్ర ప్రభుత్వానికి తల వంపులు తెచ్చేలా ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల కారణంగానే రాష్ట్రంలో ధాన్యం సేకరణ నిలిపివేయవలసి వచ్చిందని పేర్కొంటూ, బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం సూచనలను పెడచెవిన పెట్టడం, ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ అన్న యోజన కింద ఏప్రిల్‌, మే నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోవడం వల్ల గతంలో ఆంక్షలు విధించినట్లు ఆయన ఇచ్చిన వివరణ, అలాగే, జూన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని మొదలుపెట్టడం, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆంక్షలను ఉపసంహరించుకుంటున్నట్లు యాన్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ డొల్ల తనాన్ని బయట పెట్టిందని అంటున్నారు.

తండ్రి మాట కోసం కోట్ల ఎస్టేట్‌కి దూరంగా బ్రౌన్‌

తండ్రి అనారోగ్యంతో బాధ‌ప‌డుతూంటాడు, కొడుకులూ, కోడ‌ళ్లూ వీలునామా మీద సంత‌కంకోసం ఆయ న్ను ఇబ్బందిపెడుతూంటారు.. ఇది అనాదిగా చాలా క‌థ‌ల్లో, సినిమాల్లో చ‌దివిన‌, చూసిన దృశ్యం. అయినా  కోట్ల రూపాయ‌లు మురుగుతూ పడి ఉంటే పెద్దాయ‌న ఆరోగ్యం గురించి చుల‌క‌న భావంతోనే వ్య‌వహ‌రించే కాలంలోనే ఉన్నాం. కానీ సిడ్నీకి చెందిన క్లారా బ్రౌన్ మాత్రం త‌న తండ్రి ఆనందంగా అంగీ క‌రిస్తూ ఇస్తేనే కోట్ల ఆస్తి తీసుకుంటాన‌న్న‌ది.  నిజానికి ఆమె ప‌రిస్థితిలో ఎవ‌రున్నా పెద్దాయ‌న్ను ఇబ్బంది పెట్టి లాక్కునేవారే. కానీ బ్రౌన్ అలా చేయ‌లేదు. కార‌ణం ఆమెను ముందు మంచి చ‌దువు చ‌దివి మంచి ఉద్యోగం సంపాదించాల‌ని ఆమె తండ్రి కోరిక‌. అది తీర్చ‌డానికి ఆ సంప‌ద వేపు ఆమె ఆస‌క్తి చూప‌డం లేదు.  బ్రౌన్ కి సుమారు 12 మిలియ‌న్ డాల‌ర్ల ఖ‌రీద‌యిన ఎస్టేట్ వార‌సురాలిగా దాన్ని స్వాధీనం చేసుకోను అవ కాశం, హ‌క్కూ ఉంద‌ని సిడ్నీవాసులే చెబుతున్నారు. తండ్రి త‌న‌కు చ‌దువుకునే అవ‌కాశం క‌ల్పించా రు. క‌నుక మంచి స్థాయిలో ఉన్నాన‌న్న‌ది తండ్రికి తెలిసేలా చేస్తేనే ఆయ‌న కోరిక తీరిన‌ట్టు అవుతుది, క‌నుక బ్రౌన్ కి ఎస్టేట్ రాయించేసుకోవాల‌ని అనిపించ‌లేదు. ఆమె ప్ర‌స్తుతం సిడ్నీ స‌రిహ‌ద్దు ప్రాంతంలో త‌న ఏడాదిన్న‌ర పిల్లాడితో చిన్న ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె ఏమాత్రం ప్ర‌శాంతంగా మాత్రం లేదు. కార‌ణం తండ్రి వ‌ద్ద‌కి రోజూ వెళ్ల‌లేక‌పోతోంది, చేసే ఉద్యోగం అంతంత మాత్ర‌మైన‌దే. అదేమీ ఆర్ధికంగా ఆమెకు ధైర్యాన్నివ్వ‌డం లేదు. అనారోగ్యంవ‌ల్ల అదీ  స‌రిగా చేయ‌లేక‌పోతోంది.  ఆమె చాలారోజులుగా ఆటిజంతో బాధ‌ప‌డుతోంది. ఆమెకు పిల్లాడిని చూసుకోవాలి, ఆస్ప‌త్రి చుట్టూ తిర‌గా ల్సిన అవ‌స‌రమూ ఉంది. ఆమెకు నిజానికి ఎంతో డ‌బ్బు అవ‌స‌రం ఉంది. పిల్లాడిని చూసుకోవడానికి  ఒక న‌ర్సును పెట్టుకోవాలి, ఆమె ఇంట లేని స‌మ‌యంలో పిల్లాడిని జాగ్ర‌త్త‌గా చూసుకునేవారు దొర‌క‌డం ఆమె ఉన్న ప్రాంతంలో చాలా క‌ష్టంట‌.  క్లారా బ్రౌన్  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను తెలుసుకున్న ఆమె తండ్రి స్నేహితులు, హితులూ ఆమెను తండ్రి ఎస్టేట్‌కి తిరిగి వ‌చ్చేయ‌మ‌ని చెబుతున్నారు. చాలామంది వ‌చ్చి మ‌రీ బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా రు. కానీ ఆమె మాత్రం తండ్రి నుంచి ర‌మ్మ‌ని ఒక్క మాట, ఎలాంటి స‌మాచారం లేకుండా తాను ఎస్టేట్ స్వాధీనం చేసుకోలేన‌ని అది త‌న మ‌న‌సుకు నచ్చ‌ద‌ని, త‌న తండ్రిని మోసం చేసిన‌ట్టే అవుతుంద‌ని వ‌చ్చిన వారికి స‌మాధానంగా చెబుతోంది. మ‌రి ఇలాంటి కూతురు ఉన్నందుకు పెద్దాయ‌న గ‌ర్వ ప‌డాలా, అంత‌టి ఎస్టేట్ దూరం చేసుకుంటున్నందుకు క్లారా బ్రౌన్‌ను దుర‌దృష్ట‌వంతురాలు అనాలా?  ఏమ‌ యినా ఆమె మ‌న‌సు బంగారం.

జగన్ సర్కార్ కేంద్రం మధ్య బియ్యం లొల్లి

వైసీపీ, బీజేపీ సయోధ్యకు ఫుల్ స్టాప్ పడింది. అందుకు తార్కానాలు ఒక్కటొక్కటిగా  బయటపడుతున్నాయి. నిన్న కాక మొన్న అఖిల పక్షంలో ఏపీ అప్పులను వేలెత్తి చూపిన కేంద్రం ఇప్పుడు కేంద్రం అందిచే ఉచిత బియ్యం పంపిణీ ఏపీలో నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ ఉచిత బియ్యం పంపిణీ గత నాలుగు నెలలుగా నిలిచిపోయినా ఇప్పటి వరకూ కిమ్మనని కేంద్రం.. రాష్ట్ర పతి ఎన్నిక ముచ్చట ముగియగానే వైసీపీ సర్కార్ పై బియ్యం పంపిణీ నిలిపివేతపై సీరియస్ అయ్యింది. బియ్యం లేవన్న సాకుతో ఏపీ సర్కార్  ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు జూలై నెలలో కూడా పరిస్థితి అదే. ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేతపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఇంత కాలం కిమ్మనకుండా ఊరుకున్న కేంద్రం ఇప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకుంది. మరో వైపు ఏపీ బీజేపీ నాయకులు కూడా స్వరం పెంచి విమర్శల తీవ్రతను పెంచారు. అక్కడితో ఊరుకోకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కేంద్రం పేదల కోసం ఉచితంగా బియ్యం అందిస్తుంటే.. ఆ పేదల బియ్యాన్ని కూడా వైసీపీ సర్కార్ బొక్కేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు చేస్తున్న విమర్శలపై జగన్ సర్కార్ స్పందించడం లేదు. కానీ పేదల బియ్యాన్ని వైసీపీ సర్కార్ నొక్కేస్తోందన్న విమర్శల వల్ల ప్రజా వ్యతిరేకత మరింత ఎక్కువ అవుతుందన్న ఆందోళన మాత్రం వైసీపీ వర్గాలలో వ్యక్తమౌతోంది. అసలు సంగతి ఏమిటంటే కోవిడ్ తో నష్ట పోయిన ప్రజలకు కొంత ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కంద  ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. 2022 మార్చితో ఉచిత పంపిణీ పథకం ముగిసినప్పటికీ దానికి కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే ఈ ఏడాది అక్టోబర్ వరకూ ఈ పథకం కొనసాగుతుంది. అయితే  ఏపీలో మాత్రం ఉచిత బియ్యం పంపిణీ పథకం ఏప్రిల్ నుంచే నిలిచిపోయింది. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికీ 5 కిలోల చొప్పున ఈ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి ఇందుకకోసం బియ్యం సకాలంలో ఎలాంటి జాప్యం లేకుండా రాష్ట్రానికి చేరుతోంది. అయితే జగన్ సర్కార్ మాత్రం గత నాలుగు లెలలుగా బియ్యం నిల్వలు లేవనో.. సాంకేతిక సమస్యలనో సాకులుగా చూపుతూ బియ్యం పంపిణీకి తిలోదకాలిచ్చేసింది.  దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సవ్యంగా ఉచిత బియ్యం పథకం అమలులో ఉన్నా, ఏపీలో మాత్రం మొండి చేయి చూపుతుండడం పట్ల   కేంద్రం సీరియస్ అయ్యింది. ఉచిత బియ్యం పేదలకు అందించకుంటే రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణతో పాటు బియ్యం పంపిణీని సైతం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అధికార వైసీపీని ఇరుకున పెట్టే విధంగా   బీజేపీ   రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారని నినాదంతో నిరసన కార్యక్రమాలకు తెరలేపింది. ప్రధాని మోదీ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం అందిస్తుంటే జగన్ సర్కారు అడ్డుకుంటోందని    ఇలా ఉండగా కేంద్ర  ఉచిత బియ్యం పంపీణీని నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో అందించి ఇక్కడ మాత్రం మొండిచేయి చూపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. అటు లబ్దిదారులు సైతం ప్రభుత్వం తీరును గర్హిస్తున్నారు.

175 కాదు 13 స్థానాల్లో గెలిస్తే గొప్పే .. రఘురామ కృష్ణం రాజు

గతం మరిచిన జగన్ సీఎంగా తాను  సూపర్ మేన్ గా ఊహించుకుంటున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. అందుకే జనం ఆగ్రహ జ్వాలలను గమనించి కూడా వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాలలోనూ విజయం సాధిస్తామని చెబుతున్నారని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో జగన్ వైఫల్యాన్ని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధించలేనప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం నుంచి ఏం సాధించుకోగలమన్నది యోచించాలనీ, ప్రత్యేక ఆర్థిక ప్యాకేసీ కోసం గత ముఖ్యమంత్రి చంద్రబాబు అదే చేశారని వివరించారు.  గత ముఖ్యమంత్రి కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించిన జగన్ ఈ మూడేళ్లలో చేస్తున్నది ఏమిటని నిలదీశారు. వైసీపీ నేతలు వేసిన ఒకటీ ఆరా కేసులు కొట్టివేసిన తరువాత చంద్రబాబుపై అసలు కేసులే లేవన్న రఘురామ రాజు.. ఏ కేసులూ లేని చంద్రబాబే భయపడ్డారని విమర్శించిన జగన్ 32 ఆర్థిక నేరాల కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ భయంతో వణికిపోతుండటం వల్లే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం వద్ద నోరు విప్పడం లేదని జనం భావిస్తే తప్పేముందని ప్రశ్నించారు.   పార్లమెంట్లో గాంధీ బొమ్మ వద్ద అందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తుంటారని, కానీ వైసీపీ  వారు అలా ఆందోళనలు చేసిన దాఖలాలే లేవన్నారు.  కేవలం ఒకే ఒక్కసారి సొంత పార్టీ ఎంపీ అయిన  తనపై అనర్హత వేయాలని కోరుతూ మాత్రమే ఆందోళన చేశారంని ఆంధ్రప్రదేశ్  జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో , అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని రఘురామకృష్ణంరాజు అన్నారు.   నీటిపారుదల శాఖ మంత్రి వ్యక్తి , 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన వీడియోను ఈ సందర్భంగా   ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 2024 జులై నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంటే, రాష్ట్ర మంత్రి మాత్రం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొనడంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి   చిత్తశుద్ధి లేదనడానికి ఇంత కంటే నిదర్శనమేముంటుందని రఘురామరాజు అన్నారు.  ముఖ్యమంత్రి పాల్గొన్న ఒంగోలు సభ ను చూసి పార్టీ శ్రేణులు డిప్రెషన్ లోకి వెళ్లొద్దనీ రఘురామకృష్ణం రాజు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సభలను మరిన్ని చూడవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ సభను చూసిన తర్వాత ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టమవుతుందని చెప్పారు.. తన గ్రాఫ్ మాత్రమే బాగున్నదని, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదన్న ముఖ్యమంత్రి తన గ్రాఫ్ గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం అని జగన్ అంటున్నారని,   13 స్థానాలలో గెలిస్తే గొప్పేనని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ముఖ్యమంత్రిని పట్టుకొని రోడ్డుమీదే కాల్చండి… బంగాళాఖాతంలో కలపండి… చెప్పులతో కొట్టండి అని జగన్ విపక్ష నేతగా చేసిన వ్యాఖ్యలకు అప్పటి  టిడిపి ప్రభుత్వం ఎన్నిసార్లు 41ఏ నోటీసులను జారీ చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభికి 41ఏ కింద నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు విమర్శించకుంటే ముఖ్యమంత్రిని పొగుడుతారా అంటూ ప్రశ్నించారు 

వ‌ర‌ద‌బాధితుల ప‌రామ‌ర్శ‌కు చంద్ర‌బాబు ప‌య‌నం

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక కే  ప్ర‌జాభిమానాన్ని పొంద‌డం కేవలం రాజకీయాలు చేయడంతోనే సాధ్యం కాదు. ప్ర‌జా నాయ‌కునిగా, ప్ర‌జ‌ల‌ ప‌క్షాన నిల‌వ‌గ‌లిగిన‌వారే నాయ‌కుడిగా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలుస్తారు. అందుకు అధికారంలోనే ఉండ‌న‌వ‌స‌రం లేదు, విప‌క్ష నేత‌గా ఉన్నా ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించి ప్ర‌జ‌ల‌ వ‌ద్ద‌కు వెళ్లి వారి ప‌రిస్థితులు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి, స్వాంతన కలిగించడం నిజమైన ప్రజానాయకుడు చేయాల్సిన పని. ఆ పని చంద్రబాబు చేస్తున్నారు. ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో   ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అనేక గ్రామాలు దెబ్బ‌తిన్నాయి. జనం జీవ‌నాధారం కోల్పోయి దీనావ‌స్థ‌లో ఉన్నారు. వారికి ప్ర‌భుత్వం నుంచి సహాయం అందడం లేదన్న విమర్శలు  ఇప్ప‌టికే వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి హెలికాప్ట‌ర్‌లో తిరిగి ప‌రిస్థితుల‌ను పరిశీలించి వెళ్లిపోయారు అందుకే వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్ర విప‌క్ష తెలుగు దేశం నేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ర‌ద బాధితుల‌కు సహాయం అందించడంలో ఘోరంగా విఫలమైన తరుణంలో  టీడీపీ అధినేత వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వారికి   ప్ర‌భుత్వం నుంచి కేంద్రం నుంచీ  కూడా స‌హా యం అందేలా ఒత్తిడి తీసుకువస్తానని చెబుతున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురు, శుక్రవారా ల్లో చంద్రబాబు పర్యటిస్తారు.   కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఆచంట, పి. గన్న వరం, రాజోలు, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బం దులను తెలుసుకుంటారు.  ఈ మేరకు గురువారం ఉద‌యం ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్ర బాబు బయల్దేరారు.  ఆయోధ్య లంక, నాగుల్లంక, మానేపల్లి, అప్పనపల్లి, రాజోలు, దొడ్డిపట్ల, అబ్బిరాజు పాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, పొన్నపల్లి గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.  మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గతంలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం ఏరియల్ సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాలికి బురద అంట కుండా హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. వరదలపై సీఎం జగన్ సీరియస్ గా లేరన్న చంద్రబాబు.. క్యాబి నెట్‌, అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో ఉన్న విపత్తు నిర్వ హణ వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.