అక్కడ సంజయ్ రౌత్.. ఇక్కడ కేటీఆర్ ?
ప్రపంచం మొత్తం మీద మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అదేమో, కానీ, ఈ మధ్య కాలంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, తెలంగాణ మంత్రి కేటీఅర్ మధ్య చాలా దగ్గరి పోలికలున్నాయనే మాట అక్కడక్కడ వినిపిస్తోంది. అయితే ఆ ఇద్దరి మధ్య ఉన్నది భౌతిక పోలికలు కాదు. వ్యక్తిత్వ సారుప్యతని అంటున్నారు. నడక, నడత, మాట తీరు, ఈ అన్నిటినీ మించి కూర్చున్న కొమ్మను నరుక్కునే విపరీత దురహంకార ధోరణి విషయంలో ఇద్దరి మధ్య స్పష్టమైన సారుప్యత కనిపిస్తోందనే మాట ఎప్పటి నుంచో అక్కడక్కడా వినిపిస్తున్నా ఈ మధ్య కాలంలో మరింత గట్టిగా వినిపిస్తోందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. నిజానికి, కేటీఆర్ తీరు పట్ల పార్టీలో ఒక విధమైన ఆందోళన వ్యక్తంవుతోందని అంటున్నారు.
అయితే, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కీలక నేతగా చెలామణి అవుతున్నారు.అందులో మరో అభిప్రాయం లేదు. నిజానికి, కేటీఆర్ తెరాస రాజకీయాల్లో కీలక నేతగా చెలామణి అవడమే కాదు, కాబోయే ముఖ్యమంత్రిగానూ ప్రచారం జరుగుతోంది. అందుకే కావచ్చును, కొంతమంది ఆయనంటే గిట్టని వాళ్ళు కేటీఆర్’ను మహా రాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్’తో పోలుస్తున్నారు, సంజయ్ రౌత్ కూడా సామ్నా పత్రికలో ఉద్యోగిగాచేరి అలా అలా ఎదిగి ఇలా ఏకుమేకై కూర్చున్నారని, కేటీఆర్’ కూడా సన్ అఫ్ కేసీఆర్’ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇలా తయారయ్యారని అంటున్నారు.
అదొకటి అలా ఉంటే, శివసేన పతనంలో రౌతు పోషించి పాత్రను, తెరాస పతనంలో కేటీఆర్ పోషితున్నారనే మాట కూడా అక్కడక్కడ వినిపిస్తోంది.మితి మీరిన అహంకారం, అతి తెలివి చూపడం ఈరెండు అంతిమంగా పతననానికి దారి తీస్తాయి, సంజయ రౌత్’లో పుష్కలంగా పేరుకు పోయిన ఈ అవలక్షణాల కారణంగానే, శివసేనలో చిచ్చు రాజుకుంది. శివసేనలో చీలిక తెచ్చాయి. కేటీఆర్’లోనూ అవే లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడుకునేటప్పుడు,, షిండే పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ, శివసేన రెండు ముక్కలుగా చీలిపోవడానికి మూల కారణం సంజయ్ రౌత్, ఆయన కారణంగానే,శివసేనలో అశాంతి రాజుకుందని విశ్లేషకులు పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
మహారాష్ట్రలో శివసేన అధినేత్ మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై సైలెంట్’గా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఎవరిని అడిగినా, తిరుగుబాటుకు, ఇంకా ఇతర కారణాలు అనేకం ఉన్నా, సంజయ్ రౌత్. దురుసు ప్రవర్తన, దురంకార ధోరణి ఒక ప్రధాన కారణంగా పేర్కొంటారు. ఇక్కడ తెలంగాణలో, మంత్రి కేటీఆర్ ధోరణిలోనూ అలాంటి పోకడలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కేటీఆర్ తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే, ఎరికి వారు సహించి ఉరుకుంటున్నా, ఎక్కడో అక్కడ అగ్గిరాజుకుంటే, ఇప్పుడ కాకపోయినా, ఎప్పడు అప్పడు మహారాష్ట్ర పరిణామాలు తెలంగాణ ల్ల్నూ పునరావృతం అయ్యే ప్రమాదం లేక పోలేదని అంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల దురహంకారం గురించి మాట్లాడుతున్నారే, కానీ, సొంత పార్టీలో పెరుగతున్న దురహంకార ధోరణినీ, సొంత పార్టీలో రగులుతున్న అసమ్మతినీ గుర్తించడం లేదని తెరాస నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, పదిమంది పొతే పోతారని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను చులక చేయడం సరి కాదని అంటున్నారు. మహారాష్ట్రలోనూ తిరుగుబాటు, ముగ్గురితో మొదలై 11 కు చేరి అక్కడి నుంచి 40 ప్లస్ ‘ కు చేరిందని గుర్తు చేస్తున్నారు. అదెలా ఉన్నా, అన్నిటికంటే ముఖ్యంగా తెరాసలో అంతా బాగుంది అనేందుకు లేదు. నివురు గప్పిన నిప్పుల ఉందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.