తప్పులెన్నడమే కాదు.. కేంద్రం తన తప్పులూ గుర్తించాలి!

కేంద్రం తన అధికార పరిధిని రాజకీయ అవసరాలకు అనుగుణంగా కుదించుకుని మరీ రాష్ట్రాలు నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ ఇష్టారీతిన అప్పులు చేయడానికి అనుమతులు ఇచ్చేసింది. అందుకు చక్కటి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఇక తెలంగాణ కూడా ఎఫ్ఆర్ బీఎం చట్టాన్ని అతిక్రమించి పరిమితికి మించి అప్పులు చేసింది. అది కూడా కేంద్రం చలవే.  ఎందుకంటే రాష్ట్రాల అప్పులను నియంత్రించాల్సింది కేంద్రమే. ఆ బాధ్యతను గాలికొదిలేసి రాష్ట్రాలు యథేచ్ఛగా.. వచ్చే ఎన్నికలలో విజయం వ్యూహింగా ఉచిత పథకాల కోసం అభివృద్ధిని, ఉత్పాదకతను కూడా ఫణంగా పెట్టి అప్పులు చేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చున్నకేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మెలకువ వచ్చినట్లు ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేసి రాష్ట్రాల అప్పులపై హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదం. నిజమే శ్రీలంక పరిస్థితులు ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించేవిగానే ఉన్నాయి. అధికారంలో ఉండటమే ఏకైక లక్ష్యంగా ప్రభుత్వాలు సంక్షేమం అంటూ ప్రజలకు పని చేయాల్సిన అవసరం లేదు.. మీ అవసరాలన్నీమేమే తీరుస్తాం అంటూ అన్నీ ఉచితంగా ఇచ్చేస్తుంటే ఏం జరుగుతుందో శ్రీలంక పరిస్థితులు తేటతెల్లం చేశాయి. తెలగు రాష్ట్రాల అడ్డగోలు అప్పుల వెనుక కేంద్రం బాధ్యత కాదు కాదు కేంద్రం తప్పు కూడా ఉందన్నది నిర్వివాదాంశం. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్ల రాష్ట్రపతి ఎన్నికలో అవసరం కనుక ఏపీ కోరడమే ఆలస్యం అప్పులకు అనుమతులిచ్చేసిన కేంద్రం.. తెలంగాణ విషయానికి వచ్చే సరికి కొంత ఇబ్బందులు పెట్టినా.. ఆ రాష్ట్రంలో అధికారంపై కన్నేసింది కనుక చివరికి మేం అన్ని విధాలుగా కేంద్రానికి సహకరిస్తున్నాం అని చెప్పుకోవడానికి అభ్యంతరాలు చెబుతూనే అప్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ తప్పులన్నీ అటకమీద దాచేసి ఇప్పుడు ఓ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలకు అప్పుల మీద క్లాస్ తీసుకోవడం ఏ విధంగా చూసినా సబబు కాదు. ముందు అద్దంలో చూసుకున్న తరువాతే ఎదుటి వారి అందంపై కామెంట్లు చేయాలి. కేంద్రానికి మాత్రం ఆ అలవాటు లేదు. తప్పులెన్ను వారు  తమ తప్పులెరుగరన్నట్లు ఎంత సేపూ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల తప్పులెన్నడంతోనే మోడీ సర్కార్ కు కాలం గడిచిపోతోంది. తెలుగు రాష్ట్రాల పరిమితి లేని అప్పులతో భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్నా చూస్తూ కూర్చున్న మోడీ సర్కార్ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పబ్బం గడిచిన తరువాత అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్రాలపై నెపం నెట్టేయడానికి చూడటం దారుణమని వివిధ రాష్ట్రాల కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. రాష్ట్రాల అప్పులపై అఖిల పక్షంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు ముందే మోడీ రాష్ట్రాల ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించారు.   చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఎనిమిదేళ్ల పాటు కేంద్రంలో మోడీ సర్కార్ కళ్లు మూసుకుందా? స్వయంగా కేంద్రం ప్రకటించిన ఉచితాల సంగతి మాట్లాడకుండా.. ఇప్పుడు పరిస్థితి విషమించడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటడం, జనంలో అసహనం పెరుగుతున్న చ్ఛాయలు కనిపించడంతో మోడీ సర్కార్ తనను తాను రక్షించుకోవడానికి రాష్ట్రాల అప్పులను వేలెత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు.   నిజమే ఏపీ వంటి రాష్ట్రాలు వేల కోట్లు అప్పులు తెచ్చి అనుత్పాదక వ్యయం చేస్తున్నాయి. దానిని నియంత్రించాల్సిన కేంద్రం ఇంత కాలం ఎందుకు మిన్నకుంది. రాష్ట్రాలు అప్పుల భారంలో మునిగి దివాలా దశకు చేరుకుంటే…అందుకు ముందుగా తప్పుపట్టాల్సింది కేంద్రాన్నే.  శ్రీలంక పరిస్థితులను బూచిగా చూపి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చి ఊరుకుంటే చేసిన తప్పిదాలు సమసిపోవు.  ఈ పరిస్థితిని మార్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి.  

మిసెస్ ప్లానెట్ విజేత ... మ‌న  బెజ‌వాడ మ‌ల్లిక‌

 అందానికి అందం ఈ పుత్త‌డి బొమ్మా... అంటూ ఓ పాత సినిమాలో చెల్లెలి గురించి అన్న డ‌ప్పు కొడుతూ మ‌రీ పాడి ప‌ర‌వ‌శించిపోతాడు. ఆమెది కేవ‌లం మామూలు అందం కాదు, శారీర‌క మాన‌సిక సౌంద‌ర్యం కూడా లెక్క‌లోకి వ‌స్తుంది. అస‌లు అందం అంటేనే లోక‌జ్ఞానంతో కూడిన అందం, అదే అస‌లు సౌంద ర్యం. పోతే అందం అన‌గానే  మిల్కీ బ్యూటీ  అనే  భ్ర‌మ‌లు ఈరోజుల్లో  అమ్మాయిలు వ‌దులుకోవాలి. అందం అనేది వ‌య‌సుతో ప‌నిలేనిది. అమ్మ‌లూ, అమ్మ‌మ్మ‌లూ అందంగానే ఉంటారు, వారిలో గొప్ప హుందాత‌నం ఉం టుంది. వారి ఆలోచ‌న‌, మాన‌వ‌త్వ‌పు విలువ‌లు వెర‌సి వారి అందాన్ని ఎన్నింత‌లైనా పెంచుతుంటాయి.   అందాల పోటీ అన‌గానే అమ్మాయిల‌కే కాదు వివాహితుల‌కూ నిర్వ‌హిస్తున్నారు చాలా కాలం నుంచే. అయితే  విదేశాల్లో జ‌రిగే పోటీల్లోనూ భార‌తీయ సంత‌తికి చెందిన‌వారు ఆ పోటీల్లో కిరీటం సాధించ‌డం మ‌న‌కు అందునా తెలుగువారికి మ‌రింత గ‌ర్వం. ఇప్పుడు తాజాగా విజ‌య‌వాడ‌కు చెందిన  దుర్గ శివ నాగ మ‌ల్లిక బిల్లుపాటి అనే మ‌హిళ అంత‌ర్జాతీయ అందాల‌పోటీలో పాల్గొన్న‌ది. బర్గాస్  సమ్మర్ ఫెస్టివల్ అండ్ మిసెస్ ప్లానెట్ అంతర్జాతీయ అందాల పోటీలను బల్గేరియా దేశంలో జులై 6 నుంచి 15 వరకూ జరిగాయి.  వివాహితల విభాగంలో 60 మంది ఇత‌ర దేశాల వారితో ఏడు రౌండ్ల త‌ర్వాత విజేత‌గా నిలిచి మిసెస్ ప్లానె ట్ టైటిల్ సాధించింది. ఇక ఇప్పుడు తెలుగు మ‌హిళ‌లు, ముఖ్యంగా వివాహిత‌లంతా ఎంతో గ‌ర్వ‌ప‌డ వ‌చ్చు. త‌మకు ఇలాంటి పోటీల్లో విజేత  ఉంద‌ని అంద‌రికీ చెప్పుకుని ఆనందాన్ని పంచుకోవ‌చ్చు. విజ‌యవాడ‌కు చెందిన మ‌హిళ గెల‌చి తెలుగువారి ఖ్యాతి మ‌రోసారి చాటింది.    గతంలో 2019లో మిసెస్ అమరావతి, 2020లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా టైటిల్స్ గెలుచుకున్న మల్లిక 2022 సంవత్సరానికి మిసెస్ ప్లానెట్ పోటీలో నెగ్గి కిరీటాన్ని స్వంతం చేసుకున్నారు. ఎంబిఏ చదివిన మల్లిక బిజినెస్ మ్రాన్ జితేంద్రను వివాహం చేసుకున్నారు. వీరికి 6 వతరగతి చదువు తున్ప ఓ కుమారుడు ఉన్నాడు. మ‌ల్లిక అందాల‌రాణి విజేత‌గా విజ‌య‌వాడ‌కు తిరిగి వ‌చ్చారు. ఆమెకు ఘ‌న‌స్వాగతం ఇవ్వ‌డానికి మ‌హిళ‌లు త‌ర‌లివ‌చ్చారు. 

రాష్ట్రంలో శ్రీలంక ప‌రిస్థితులు.. చంద్ర‌బాబు

ఇంటి గుట్టు వీధికెక్క‌ కూడ‌దంటారు. వైసీపీ ప్ర‌భుత్వం ఇంటి గుట్టునే ముందుగా బ‌య‌ట‌పెట్టుకుంది. రాష్ట్రంలో ఆర్ధిక ప‌రిస్థితుల గురించి ప్ర‌తీ ఒక్క‌రూ చ‌ర్చించుకునే స్థితికి తీసుకు వచ్చింది. బీజేపీ నాయ‌కులు ఎవ‌రు రాష్ట్రానికి వ‌చ్చినా ముందుగా వెట‌కారం జోడించి ప్ర‌శంసించేది  ఇలానే.  రాష్ట్రం దాదాపు శ్రీ‌లంక ప‌రిస్థితుల్లో ఉంద‌నే. ఇక్క‌డి నాయ‌కులు స‌రే స‌రి. వారంతా రాజ‌కీయ‌ప‌రంగా ఎద్దేవా చేసిన‌వారు. అయితే ఇప్పుడు నిజంగానే సీరియ‌స్‌గా తీసుకోవాల్సింది టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు వ్యాఖ్య‌.  ఆయ‌న స్వ‌యంగా ఆర్ధిక‌ వేత్త ఆర్ధిక‌ ప‌రిస్థితుల మీద సంపూర్ణ అవ‌గాహ‌న  ఉన్న వ్య‌క్తి  మ‌రి  ఆయ‌నే  మ‌న రాష్ట్రం లో  శ్రీ‌లంకలో ఉన్న దుర్భ‌ర ప‌రిస్థితులు ఇప్ప‌టికే ఉన్నాయ‌న్నారంటే న‌మ్మి తీరాలి.  ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించడం లేదని  టీడీపీ అధినేత అన్నారు. జీపీఎఫ్‌ కూడా విత్‌డ్రా చేసుకునే పరిస్థితి లేదన్నారు.  పదవీ విరమణ చేసినవారికి చేయాల్సిన చెల్లింపులు సక్ర మంగా చేయలేక‌పోవ‌డం రాష్ట్ర ప‌రిస్థితిని తెలియ‌జేస్తుంద‌న్నారు.  కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థి తీ లేదు.  చేసిన అప్పులకు వడ్డీలు కట్టే దిక్కులేక  కొత్త అప్పులు చేస్తుండ‌డం రాష్ట్ర ఆర్ధిక స్థితికి అద్దం ప‌డుతుంద‌న్నారు.  మూలధన వ్యయం ఎక్కడా లేదు. రహదారులకు మరమ్మతులు చేయడానికి కూడా నిధులూ లేవ‌ని ఎద్దే వా చేశారు.  ఇవన్నీ శ్రీలంకలో ఉన్న పరిస్థితులను త‌ల‌పించ‌డం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ఎవరిదో  కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించిందని , రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు.   ఇదిలా ఉండ‌గా,    రూ.350 కోట్ల వార్షిక  టర్నో వర్‌ ఉన్న తిరుపతి కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ బోర్డు డైరెక్టర్‌ పదవుల ఎన్నికల్లో అక్రమాలు  జరిగాయన్నా రు.  దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిక‌లు ర‌ద్దు చేయాలంటూ బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నాయకులు పోలీసులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ మద్దతు అభ్యర్థులకు అనుకూలంగా నకిలీ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దళిత వర్గానికి చెందిన పి.వలముని అనే అభ్య ర్థిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు.  రాజారెడ్డి రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తిరుపతి టౌన్‌ బ్యాంకు ఎన్నికల్లో జగన్‌ రెడ్డి దొంగ బతుకు మరోసారి బయటపడిందన్నారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమ యంలో టీడీపీ నాయకులను గృహనిర్భందం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. దొంగ ఓట్లు వేయ డానికి వచ్చిన వారిని పట్టుకుంటే, వారిని వదిలేసి టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగ అంటారే తప్ప నాయకుడనరని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అరెస్టు చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు.

కేసీఆర్ కు కాళేశ్వరం కష్టాలు

ఇంజనీరింగ్ అద్భుతంగా కేసీఆర్ పదే పదే అభివర్ణిస్తున్నకాళేశ్వరం ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తనకు ఏటీఎంగా మార్చేసుకున్నారన్న విమర్శలు గతం నుంచీ వినిపిస్తున్నా.. ఇటీవలి వరదకు ప్రాజెక్టు పంపులు, మోటార్లు ముంపునకు గురైన నేపథ్యంలో మరో సారి విమర్శల దాడి పెరిగింది. ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్ధకమయ్యివందా అన్న స్థాయిలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మితమైన కాళేశ్వరంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. పంపులు, మోటార్లు మునకపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం, విమర్శలకు సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కాళేశ్వరం మోటార్లు, పంపుల మునకతో  అవి మళ్లీ పని చేస్తాయా, వాటి పునరుద్ధరణ ఎప్పటికి పూర్తవుతుంది వంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి, నీటి పారుదల శాఖ నుంచి మౌనమే సమాధానం కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. చిన్న పాటి విమర్శకే భారీ స్థాయిలో స్పందించి ఎదురుదాడికి దిగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు పన్నెత్తి మాట్లాడడానికి కూడా ముందుకు రాకపోవడంతోనే కాళేశ్వరం ఎత్తిపోయిందా అన్న సందేహాలకు కారణమౌతున్నది.  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లను గోదావరి వరదలు ముంచెత్తాయి. మొత్తం 29 మోటార్లు మునిగిపోయాయి. అయినా  అక్కడేం జరగనట్లుగానే రాష్ట్ర్ర ప్రభుత్వ వైఖరి ఉంది.   కాళేశ్వరం ఉనికిపై ముసురుకున్న సందేహాలకు వివరణ ఇస్తే చర్చ విస్తృతంగా జరిగి లోపాలు మరంతగా బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం మౌనం వహించిందని పరిశీలకులు అంటున్నారు. ఇక వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఇప్పటి వరకూ ఇరిగేషన్ శాఖ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.  దానికి తోడు అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల పరిసరాల్లో పోలీస్‌‌‌‌‌‌‌‌ పహారా ఏర్పాటు చేశారు. పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల వైపునకు ఎవరినీ, కనీసం మీడియాను  కూడా అనుమతించడం లేదు.  కాళేశ్వరం నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం లేదని చెబుతూ భారీ వరదల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. కానీ ఆ వాదనలో పస లేదనడానికి   దేవాదుల ప్రాజెక్టు ముంపునకు గురి కాకపోవడమే తార్కనమని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తోందనీ, వైఫల్యాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతోందనీ విమర్శకలు అంటున్నారు,  దేవాదులలో వరద ఉధృతి ఇంకా ఉన్నప్పటికీ మోటార్లు, పంపులు మునగకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సర్కారు చెబుతున్నవి అబద్దాలన్న వాదనకు కారణం అవుతోంది. కాళేశ్వరంపై విమర్శల దాడిని, చర్చకు పక్కదారి పట్టించడానికే సీఎం కేసీఆర్   క్లౌడ్ బరస్ట్, అంతర్జాతీయ కుట్ర, పోలవరంతో భద్రాచలానికి ముప్పు వంటి అంశాలను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ జీవనాడి పోలవరంపై రాజకీయ దాడి

ఏపీకి జీవ‌నాడి పోలవరంపై రాజకీయ దాడి ప్రారంభమైంది. పోలవరం ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్యా వివాదం రగులు కొంది. రాజకీయ లబ్ధి కోసమే ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలూ ఈ వివాదాన్ని లేపాయన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూలై నెలలోనే భారీ వరదలు భద్రాచలాన్ని ముంచెత్తాయి. గోదావరి వరద ప్ర్తతి ఏటా సాధారణంగా వచ్చేదే.   అయతే  ఈ ఏడాది ఆ వరద ఉదృతి ఒకింత తీవ్రంగా ఉంది. అయినా వరద పరిస్థితి, ప్రవాహ వేగం అంచనాలలో ప్రభుత్వాల వైఫల్యాన్ని పోలవరం మీదకు నెట్టివేయడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. పోలవరం  జాతీయ ప్రాజెక్టు. బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముంపు ముప్పు వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోకుండానే డిజైన్ చేశారా?  ఆ డిజైన్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసిందా? దానికి రాష్ట్ర్ర విభజన సమయంలో ఎటువంటి అభ్యంతరాలూ చెప్పకుండానే కేసీఆర్ సహా తెలంగాణ నేతలందరూ ఆమోదించేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు అంటున్న వారు సమాధానాలు చెప్పాలి.  ఇప్పటి వరకూ రాజకీయ నాయకులే పోలవరం విషయంలో తమతమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ నీటి పారుదల శాఖను ఆ రాష్ట్ర్ర  ప్రభుత్వం రంగంలోకి దింపింది.   పోల‌వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా తెలంగాణ‌లో ఏకంగా ల‌క్ష ఎకరాల మేర పొలాలు మున‌కకు గుర‌వుతాయ‌ని తెలంగాణ నీటిపారుద‌ల శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ల‌క్ష‌ల ఎకరాల్లో పంట‌ల‌తో పాటు భ‌ద్రాచ‌లం, ప‌ర్ణ‌శాల నీటిలో మునిగిపోతాయ‌ని తెలంగాణ నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ అన్నారు.  పోల‌వ‌రం వ‌ల్లే భ‌ద్రాచ‌లం మునిగిపోయింద‌ని తెలంగాణ‌కు చెందిన మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ వ్యాఖ్య‌లు చేయ‌డం, వాటిపై ఏపీ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అంబ‌టి రాంబాబులు ఘాటుగా స్పందించిన నేప‌థ్యంలో ర‌జ‌త్ కుమార్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇంతకీ అసలు వాస్తవమేమిటంటే..  అన్ని దారులూ మూసుకుపోయి చివరకు గోదారే దిక్కు అయినట్లుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలకు. గోదావరి వరద సాక్షిగా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపాయి వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు. ఇరు రాష్ట్రాలలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిర్లిప్తత, యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో విఫలం కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు అపార నష్టానికి కారణమయ్యాయి.  ముఖ్యంగా రెండు రాష్ట్రాలూ కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యయి. అందుకే ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడంలోనూ, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంలోనూ సకాలంలో స్పందించలేకపోయాయి. దీంతో జనం రోజుల తరబడి వరద ముంపులో నానా ఇబ్బందులూ పడ్డారు. ఇప్పుడు, అసలే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న సమయంలో జనంలో వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి వారు వరద రాజకీయాలకు తెరతీశారు. దాంట్లోనూ సెంటిమెంటును రంగరించి మరీ కలుపుతున్నారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి సెంటిమెంట్ పండించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట మరొకడు. అలాగుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల పరిస్థితి. జనం వరదల్లో భారీగా నష్టపోయి నిలువ నీడ లేక అల్లాడుతుంటే.. వారిని ఆదుకోవడం పక్కన పెట్టి ముంపునకు కారణాలను రాష్ట్ర విభజనతో ముడిపెడుతున్నారు. ముందుగా ఈ క్రీడను తెరాస ఆరంభిస్తే.. క్షణం ఆలస్యం చేయకుండా వైకాపా వచ్చి చేరిపోయింది. పోలవరం కారణంగానే భద్రాచలం మునిగిపోయిందంటూ పువ్వాడ విమర్శల పర్వానికి తెరతీసి విలీన మండలాల అంశం లేవనెత్తారు. ముంపు గ్రామాలను తెలంగాణలో కలిపేస్తే కరకట్ట ఎత్తు పెంచుకుని ముంపు ముప్పును శాశ్వతంగా పరిష్కరించుకుంటామన్నది పువ్వాడ వ్యాఖ్య. అయితే మేమేం తక్కువ తినలేదంటూ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తెలుగు రాష్ట్రాలు రెంటినీ విలీనం చేసి సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆగిపోలేదు. హస్తినలో ఇరు పార్టీల ఎంపీలూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఇక మళ్లీ పువ్వాడ వ్యాఖ్యల వద్దకు వస్తే..పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం మునిగిపోతుందని భద్రాచలంలోకి వరద నీరు ప్రవేశించకుండా, భద్రాచలం రామాలయం మునిగిపోకుండా కరకట్టలు నిర్మిస్తామని.. ఇందుకు దాని చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వెంటనే   వరదలు వచ్చినప్పుడు ముంపు సహజమేనని.. ఇందుకోసమే ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని అంబటి అన్నారు. ఐదు గ్రామాలు కావాలంటే తామూ భద్రాచలం కావాలంటామన్నారు. ఇక బొత్స అయితే  రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ ఆదాయాన్ని తాము కోల్పోయామని.. మరి ఆ నగరాన్ని ఏపీలో విలీనం చేయాలంటే చేసేస్తారా అని ప్రశ్నించారు. ఇలా ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలూ ప్రజల కష్టాలను, వరదల్లో వారు పడుతున్న ఇబ్బందులనూ వదిలేసి.. రాజకీయ లబ్ధి కోసం విభజన నాటి అంశాలను తెరమీదకు తీసుకురావడం వెనుక మరో సారి అధికారం చేపట్టాలంటే ప్రజలలో సెంటిమెంట్ రగల్చడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతున్నది. అందుకే కూడబలుక్కునే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు మండలాలు ముంపునకు గురవుతాయి కనుకనే వాటిని అప్పట్లో ఏపీలో విలీనం చేశారన్నది జగద్వితం. ఆ మండలాల విలీనం తరువాతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు అప్పట్లో విస్ఫష్టంగా కేంద్రానికి చెప్పి సాధించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ విలీన మండలాలు తెలంగాణలో కలపాలంటూ టీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ సమస్యను పక్కదారి పట్టించి సెంటిమెంటును రగల్చడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు భద్రాచంల, హైదరాబాద్, సమైక్యాంధ్ర అంటూ చేస్తున్న వాదనలు కూడా ఇక్కడి సమస్యలను పక్కదారి పట్టించి మళ్లీ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా విభజన నాటి సెగలు రేపే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అంటున్నారు. ఇక ఏపీ జల వనరుల శాఖ మంత్రి ఎగువ కాపర్ డ్యాం ను ఆఘమేఘాల మీద మీటర్ ఎత్తును పెంచేశామనీ, దాని వల్లే పెనుముప్పు తప్పిందనీ చెప్పడం నేల విడిచి సాము చేశాం అని చెప్పుకోవడమే తప్ప ఒక్క రోజులో ఒక మీటర్ ఎత్తు పెంచామనడం ఏ విధంగానూ నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో స్వయంగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ అంగీకరించారని ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటు వేదికగా పోలవరం నిర్మాణంలో జాప్యానికి ఏపీలోని జగన్ సర్కార్ నిర్వాకమే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించిన రోజునే ఏపీ సర్కార్ పోలవరం పనులు జెట్ స్పీడ్ లో సాగుతున్నాయని ఏపీ చెప్పుకోవడానికి ప్రయత్నించడం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరొకందుకు కాదని, అలాగే పోలవరం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందనీ, భద్రాచలం రామాలయం ఉనికే ప్రశ్నార్థకమౌతోందని తెలంగాణ గుండెలు బాదుకోవడం కూడా జనంలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవడానికేననీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా ఏపీ సర్కార్ హైదరాబాద్ ఆదాయం కోల్పోయామనీ, కేసీఆర్ సర్కార్ ఆంధ్రాపాలకుల దోపిడీ ఇంకా ఆగడం లేదనీ సెంటిమెంట్ ను ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు జనానికి కావలసింది సెంటిమెంట్ డ్రామాలు కాదనీ, బాధల్లో  ఉన్న వారికి తక్షణ సాయం అందించడమనీ అంటున్నాయి. మొత్తంగా గోదావరి వరదను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీల డ్రామాపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

యూపీ సీఎం యోగికి అసమ్మతి సెగ.. మంత్రి రాజీనామా

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అసమ్మతి సెగ తగిలింది. ఆయన కేబినెట్ సహచరులే తిరుగుబావుటా ఎగురు వేశారు. యోగి మంత్రివర్గంలో ఇద్దరు తమ అసమ్మతిని బహిర్గతం చేశారు. యోగి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా, మరో మంత్రి పార్టీ హై కమాండ్ కు యోగి తీరుపై ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా పలు  రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీకి చోట్ల   అసమ్మతి ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా, ఎవరూ ఇలా బహిర్గతం కాలేదు.   బీజేపీ సీఎంలందరిలోనూ అత్యంత శక్తిమంతుడిగా భావించే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైనే తిరుగుబావుటా ఎగురవేయడం యోగి తీరును విమర్శిస్తూ ఏకంగా ఒక మంత్రి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది.   ఉత్తర ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దినేశ్   మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడం వల్లే సీఎం తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, వివక్ష చూపుతూ ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ దినేశ్ విమర్శించారు. దినేశ్ తన రాజీనామా లేఖను ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు పంపారు.  చూపుతున్నారని, ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. దినేశ్ తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపారు. దళితుడిని కనుకనే తన పట్ల వివక్ష చూపుతున్నారనీ, మంత్రిగా తనకు ఎటువంటి అధికారాలూ లేవనీ, గత వంద రోజులుగా తనకు ఎటువంటి పనీ అప్పగించలేదనీ, కనీసం అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం లేదనీ ఆయనా లేఖలో పేర్కొన్నారు. అలాగే యోగి కేబినెట్ లో మరో మంత్రి కూడా తన అసమ్మతిని బహిర్గతం చేశారు. ముఖ్యమంత్రి యోగి తీరుపై నేరుగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారు.   అవినీతి ఆరోపణలపై యూపీ సర్కార్ ఇటీవల సస్పెండ్ చేసిన అధికారులలో రాష్ట్ర్ర ప్రజాపనుల శాఖ మంత్రి జితిన ప్రసాద పీఏ కూడా ఉన్నారు. దాంతో సీఎం యోగి జితిన ప్రసాదను మందలించారనీ, దీంతో  ఆయన తీవ్ర ఆగ్ర్హహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జితిన ప్రసాద ఫిర్యాదు చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. యోగి తీరు నియంతలా ఉందని, మంత్రులకు, ఎమ్మెల్యేలకూ కనీస గౌరవం దక్కడం లేదనీ జితిన ఆరోపిస్తున్నారు.

వైసీపీలో అసమ్మతి భగ్గు.. పెరుగుతున్న రెబల్స్ సంఖ్య!

జ‌గ‌న్ సార‌థ్యంలోని వైసీపీలో అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీ కోసం, పార్టీ ప్ర్తిష్ట కోసం ప్రాణం పెట్టయినా పని చేస్తామనే వారి సంఖ్య తగ్గిపోతోంది.   పార్టీ నాయ‌కుడికే షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మామూలుగా ఎక్క‌డ‌యినా అధికార ప‌క్షానికి విప‌క్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది, స‌మ‌స్య‌లూ ఉంటాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీలో వ్య‌వ‌హారం రివర్స్ లో  ఉంది. పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారు, పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేసేవారు ఎక్కువ‌వుతున్నారు. ఇంటి గుట్టు ఇంటి వారే బ‌య‌ట‌ ప‌డేసుకుంటున్నారు. పార్టీలో రెబెల్ వ్య‌వ‌హారా లు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  పార్టీపై. అధినేత జగన్ పై  ఎంపీ రఘురామ రాజు మొద‌టి తిరుగు బావుటా ఎగుర వేశారు.   ఎంపీ ర‌ఘురామ‌రాజు బాట‌లోనే కొంద‌రు వైసీసీ సీనియ‌ర్ నాయ‌కులు అడుగులు వెస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ప్ర‌స్తుతం ర‌ఘురామ‌రాజు వైసీపీలో ‘రెబెల్ స్టార్‌’గా అంద‌రి గుర్తింపు పొందారు. గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా పార్టీకి ఆయ‌న‌కూ మ‌ధ్యలో ఏది ప‌డినా అది భ‌గ్గుమంటోంది.  నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద రెడ్డి, ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారు. నాయ‌కుని పాల‌నా తీరు ప‌ట్ల అంతర్గతంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.   జ‌గ‌న్  క్యాబినెట్ పునర్వవస్థీకరణ అనంతరం  మంత్రిపదవులు కోల్పోయిన వారు, ఆశించి భంగపడిన వారు చాలామంది బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. అనేకమంది ఎమ్మెల్యేలు ఇత‌ర పార్టీల వైపు చూపులు సారించారు. తాజాగా వైసీపీ నాయ‌కులు కొందరు హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీలో దీన్ని గురించి త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఎవ‌రికి వారు క‌ళ్లు మూసుకున్న పిల్లిలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వైసీపీలో ఏమి జ‌రుగుతోంద‌న్న‌ది అంద‌రికీ ఆలోచించే, మాట్లాడుకునే క‌థ‌గా మారింది.  త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దికి ఒక్క  పైసా కూడా ప్ర‌భుత్వం నుంచి అంద‌లేద‌న్న బాధ‌తో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకంగా మురికి కాల‌వ‌లోకి వెళ్లి నిల‌బ‌డి నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగతి విదితమే. ఇంత‌క‌న్నా తీవ్రంగా పార్టీ ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి ప‌ట్ల నిర‌స‌న‌ను ఎవ‌రూ వ్య‌క్తం చేయ‌లేరు. ఆయ‌న ప్ర‌భుత్వ తీరు తెన్నుల‌పై ఘాటుగానే విమ‌ర్శించారు. రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద రెడ్డి సంగ‌తి వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న చాలా కాలం నుంచే  జ‌గ‌న్ ప‌ట్ల విముఖ‌త‌తో వున్నారు. పైగా ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీని, పార్టీ అధినేత‌ను పొగుడుతూ రోజూ స్వ‌పార్టీ ప‌ట్ల నిర‌స‌న‌ను తెలియ‌జేస్తున్నారు. అలాగే ద‌ర్శి ఎమ్మెల్యే విసుర్లు మ‌రీ హాట్ గా ఉన్నాయి. మ‌ద్ది శెట్టి  వేణుగోపాల్ విమ‌ర్శ‌లతో పార్టీ ప‌రువు గంగ‌లో క‌లుస్తోంది. వీరే కాదు, ప్ర‌భుత్వ ప‌ని తీరుప‌ట్ల విసిగెత్తిన వారి సంఖ్య వైసీపీలో రోజు రోజుకూ సంఖ్య పెరుగుతోంది. చాలాకాలం మౌనం వ‌హించి మూడేళ్ల పాల‌న ముగిసిన సంద‌ర్భంగా ఆ ఆవేద‌న‌ను, నిరాస‌క్త‌త‌ను ఒక్కొ క్క‌రూ బ‌య‌టికి వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గానికి అభివృద్దికి నిధులు ఇవ్వ‌క‌పోతే ఎవ‌రు మాత్రం సీఎం ఆదేశా ల‌ను శిర‌సావ‌హిస్తారు.  జగన్ తీరు వల్ల ఇటు నియోజకవర్గంలో ప్రజల వద్ద ప్రతిష్ట మసకబారి, నిధుల గురించి అడిగితే జగన్ ఆగ్ర్హహానికి గురై రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది మా పరిస్థితి అని పలువురు ఎమ్మెల్యేలు  అంతర్గత సంభాషణల్లో వాపోతున్నారు. జగన్ తీరు పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరైతే.. అసంతృప్తిని లోలోనే ఉంచుకుని సమయం కోసం చూస్తున్న వారు మరెందరో ఉన్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

వైసీపీలో మరో ట్రబులా‘ర్’!

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీలో లుకలుకలు, ఒకటొకటిగా బయట పడుతున్నాయి. వైసీపీ  నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాటలో తిరుగుబాటు జెండా ఎగరేసే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు వచ్చి చేరిందని అంటున్నారు. నిజానికి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి చాలా కాలంగా, ప్రభుత్వ పనితీరును, ఎక్కడి కక్కడ ఎండగడుతూనే ఉన్నారు. అయితే, రఘురామ కృష్ణం రాజులా నేరుగా  కాకుండా, ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు అధికారుల మీద ఫైర్ అవుతున్నారు. అయితే, తాజాగా ముసుగును కాస్త పక్కకు తీసి, తన అసహనాన్ని, ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి మీదకు ఎక్కు పెట్టారని అంటున్నారు.   ఈ నేపధ్యంలో అయన, అధికారులు మంచివారేన‌ని, కానీ ఎక్క‌డో తేడా ఉందంటూ న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేకెత్తించాయ. రాష్ట్రంలో ఒక్క ప‌ని కూడా ముందుకు సాగ‌డంలేద‌ని, అభివృద్ధి ఎక్క‌డా లేద‌ని,  మాగుంట పరోక్షంగా ముఖ్యమంత్రి, మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాండ్ నిధులకు లెక్కలు లేవని, ఏమి చేశారని నిలదీశారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వ పరువు పోతుందని, కొంచే ఘాటుగా సొంత పార్టీ ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పించారు.  నిజానికి, గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట మొదటి నుంచీ పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న అనుయాయులు చెబుతున్నారు. వైసీపీలోని ఇత‌ర నేత‌ల‌తో మొద‌టి నుంచి ఆయ‌న‌కు సఖ్యత లేదంటూ వార్త‌లు వ‌చ్చాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా అయన దూరంగానే ఉంటున్నారు. మరో వంక వ్యాపార వ్యవహారాలను చక్క పెట్టుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో, తెలుగు దేశం సహా అన్నిపార్టీల నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారని వైసీపీ నేతలు పలు సందర్భాలలో ఆరోపించారు.  నిజానికి ఇటు అధికారుల నుంచి, అటు పార్టీ వర్గాల నుంచి కూడా మాగుంటఫై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నా, ఆయన పెద్దగా పట్టించుకోలేదని పార్టీ నాయకులు, అధికారులు అంటున్నారు. అయితే, మాగుంట చేసిన తాజా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, పార్టీ నాయకులు, అధికారులతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి, చెప్ప వలసినంత వరకు చెప్పాం, అయినా ఆయన మారడం లేదు, ఇక ఆయన్ని వదిలేయండి, అని చెప్పినట్లు సమాచారం.  ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశం వచ్చిన నేపధ్యంలో, అధికారులు ఎంపీని అసలుకే పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను చర్చించేందుకు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి నగరపాలక సంస్థ అధికారులుకానీ, సిబ్బందికానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేస్తే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒకరిని పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో, ఎంపీ మాగుంట వైసీపీలో ఉన్నారా ?  లేరా ? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే వైసీపీ నేతలు ఎవరూ ఆయన్ని కలవొద్దని, ఒకవేళ ఆయన కటువైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ శ్రేణులెవరూ స్పందించవద్దని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో మాగుంట వైసీపీ త‌ర‌ఫున పోటీచేసే అవ‌కాశాలు లేనట్లేనని,  ఆయ‌న తిరిగి తెలుగుదేశం గూటికే చేరుకుంటారంటూ ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. అదలా  ఉంటే ఎంపీలు , మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా  ఒకరొకరు పార్టీకి దూరం అవుతున్న నేపధ్యంలో, వైసీపీ నిట్టనిలువునా చీలే రోజు ఎంతో దూరంలో లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

పిల్ల‌డికి  హిందీ నేర్పుతున్న కొరియా త‌ల్లి

పిల్లాడు ప‌రుగున లోప‌లికి వ‌చ్చి మ‌మ్మీ అన‌గానే పొంగిపోతుంది త‌ల్లి. మ‌మ్మీ గిమ్మీ ఏమిటే.. చ‌క్క‌హా అమ్మా అని పిల‌వ‌డం నేర్పించ‌కుండా.. అంటూ పిల్లాడి అమ్మ‌మ్మ‌గారు గొంతుచించుకుంటుంది... ఇది దాదాపు అంద‌రి ఇళ్ల‌లోనూ ఇటీవ‌లి కాలంలో క‌నిపించే సీన్‌. నిజ‌వే మ‌న భాష‌లో ప‌ల‌క‌రించుకోవ‌డం, తిట్టుకోవ‌డం లో అందం వేరు. చిత్ర‌మేమంటే విదేశీయులు చ‌క్క‌గా తెలుగు నేర్చుకుని ఇంట్లో ప్రాక్టీసు చేస్తున్నారు. భార‌తీయుల‌ను స్నేహం చేసుకోవ‌డమే కాకుండా వారికి తెలిసిన భార‌తీయ భాష‌ను  కూడా  నేర్చుకోవడంలో వారికి అదో ఆనందం. ఇపుడు కొరియా వాళ్లూ హిందీ  నేర్చుకుని, వారి పిల్ల‌ల‌కూ మెల్ల‌గా నేర్పు తున్నార‌ట‌. అందుకు ఉదాహ‌ర‌ణ కిమ్‌.  ఇంగ్లీషు వ్యామోహం మ‌రీ పెచ్చు మీరిపోతోంద‌ని స్కూళ్ల‌లో ఉపాధ్యాయులూ అంటున్నారు. ఇంగ్లీషు నేర్చుకోవ‌డం వేరు, అదే రోజూవారీ జీవితంగా చేసుకోవ‌డం ఎంతో వేరు. పెద్ద‌వారంటే ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ ఆంగ్లం మాట్లాడ‌టం త‌ప్ప‌నిస‌రి. కానీ పిల్ల‌ల‌కూ అదే నేర్పి అదో అద్బుతం  అని ఉప్పొంగిపోతే ఎలా? ఇక మ‌న భాష పిల్ల‌ల‌కు ఎలా వ‌స్తుంది? మ‌న భాషా రావాలి, అటు ఇంగ్లీషూ  రావాలి క‌దా?! కానీ కొరియాకు చెందిన కిమ్ అనే అమె త‌న పిల్ల‌వాడికి చిన్న‌చిన్న‌ప‌దాలు నేర్పుతోంది. మొన్నా మ‌ధ్య ప‌కోడీ కూడా త‌యారు చేసింది. ఏ ప‌కోడీ హై అంటూ చిన్న‌ముక్క‌ను ప‌ట్టుకుని ఫోటో కూడా తీయిం చుకుంది.  విదేశీ భాష నేర్చుకోవ‌డంలో ఉన్న ఆస‌క్తి మ‌న భాష మీద లేక‌పోవ‌డం విచార‌క‌రం. మ‌న భాష మీద వారికి ఉన్న ఆస‌క్తి హ‌ర్ష‌ణీయ‌మే.. కానీ వారు వారి మాతృ భాష‌ను మాత్రం మ‌ర్చిపోవ‌డం లేదు. ఇది మ‌న‌వాళ్లు గుర్తుంచుకోవాలి. 

అవును ..అ ఇద్దరూ దగ్గరయ్యారు !

కాంగ్రెస్, తెరాస పార్టీలు దగ్గరవుతున్నాయా? అ రెండు పార్టీల  మధ్య దూరం తరుగుతోందా?  అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవసరం అయితే, చేతులు కలిపేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? అంటే, రెండు వైపుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఇంటి పార్టీగానే భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించడం పెద్ద కష్టం కాదనే సత్యాన్ని  అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.   2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రస్ ఎమ్మెల్యేలులో మూడొంతులకు పైగా సంవత్సరం తిరగకుండానే తెరాస గూటికి చేరిపోయారు  గులాబీ కడువా కప్పుకున్నారు.  సో.. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తెరాసకు ప్రత్యర్ధి పార్టీగా గతంలో భావించలేదు ఇప్పుడూ భావించడం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీగా  కంటే ఫ్రెండ్లీ పార్టీగానే ట్రీట్  చేస్తూ వచ్చారు. ఇది అందిరకీ తెలిసిన నిజం. జగమెరిగిన సత్యం.  అయితే, రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడు అయిన తర్వాత రెండు పార్టీల మధ్య దూరం కొంత పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ టార్గెట్’గా రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వం పై దాడి చేస్తున్నారు. అటు నుంచి కేసీఆర్, కేటీఆర్ కు అదే స్థాయిలో దాడి కొనసాగించారు.అయితే ఇప్పుడు, కేసీఆర్ కాంగెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెట్టారని ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించిన నేపధ్యంలో కీడెంచి మేలెంచడం మంచిదనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, సోనియా, కేసీఆర్ మధ్య స్నేహ బంధాన్ని పెంచేందుకు కాంగ్రెస్, తెరాస పార్టీలలలో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షులు ఇద్దరు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కీలక బాధ్యతలను నిర్వహించిన   ప్రస్తుత తెరాస రాజ్యసభ సభ్యుడు, ఆంధ్ర్ ప్రదేశ్’కు చెందిన ఇంద్దరు మాజీ ఎంపీలతో  కూడిన ఒక బృందం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల వరకు ఉభయ పార్టీల మధ్య ప్రత్యక్ష పొత్తు ఉండదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమని అంటున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటేనే, తెరాస గెలుపు సులువు అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీల బలాబలాలను బేరీజు వేసుకుంటూ, బ్యాలెన్సు చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో  రెండు జాతీయ పార్టీలను  ఒకే గాటన కట్టేసి   విమర్శిస్తూ  వచ్చారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి / పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు ప్రాంభించారు, అయితే, ప్రయత్నాలు ఫలించక పోగా, రాష్ట్రంలోనూ పరిస్థితులు తల్లకిందులు  అయ్యే సంకేతాలు స్పష్టం కావడంతో, కేసీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి విషయంలో, కాంగ్రెస్ ఉన్న కూటమిలో తెరాస ఉండదని ఖరాఖండిగా చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలో 18 జాతీయ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాను  సమర్ధించడమే కాకుండా, ఆయనకు ఏ రాష్ట్రంలో, ఏ పార్టీ ఇవ్వని స్థాయిలో హైదరాబాద్ లో  గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. కటవుట్లు పెట్టి, బ్యానర్లు కట్టి, బైక్ ర్యాలీ నిర్వహించి ఘన  స్వాగతం పలికారు. అఫ్కోర్స్ అందుకు, మోడీని అవమానించడం అనే వేరే కారణం ఉన్నా, ఉభయతారకంగా కాంగ్రెస్ కు దగ్గరయ్యే దూరాలోచన కూడా లేకపోలేదని, తెరాస వ్యూహ బృందం సమాచారం.  అలాగే, యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ స్వయంగా హాజరయ్యారు. రాహుల్ గాంధీ పక్కన చేరి ముచ్చట్లాడారు. ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో  కానీ, ఆ తర్వాత నుంచి కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్  జోలికి వెళ్ళడం లేదు. రెండున్నర గంటల ప్రెస్ మీట్ పెట్టిన రండు నిముషాలు అయినా కాంగ్రెస్ పార్టీకి కేటాయించలేదు. ఇక ఇప్పుడు  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేరుగా, కాంగ్రెస్ పార్టీ అడగక ముందే, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాకు తెరాస మద్దతు ప్రకటించింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్, తెరాస దగ్గరవుతున్నాయి అనేందుకు సంకేతాలని పరిశీలకులు భావిస్తున్నారు.   అదలా ఉంటే కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్, అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మీడియా సాక్షిగా కుండ బద్దలు కొట్టారు.  అంతే కాదు, రెండున్నర సంవత్సరాలు తెరాస (కేసీఆర్/కేటీఆర్), రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ (రేవంత్ రెడ్డి) ముఖ్యమంత్రిగా ఉంటారని  చెపుతున్నారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఢిల్లీ వేదికగా కదులుతున్న రాజకీయ ఎత్తుగడలు, అనివార్యతల దృష్ట్యా కాంగ్రెస్ అవసరం తెరాసకుంది, తెరాస అవసరం కాంగ్రెస్ పార్టీకి వుంది. సో .. రేవంత్ రెడ్డి ఎంతగా కాదన్నా, ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలేందుకు వీలు లేదన్నా చివరకు కాంగ్రెస్, తెరాస కల్సి కాపురం చేయక తప్పదని పరిశీలకులు అంటున్నారు.

వ‌ర‌ద‌బాధితుల సంగ‌తి ప‌ట్ట‌ని బీజేపీ, టీఆర్ ఎస్‌

ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే. ఎదురిళ్ల‌వారు స‌హాయానికి వెళ్లి కొట్టుకున్నార‌ట‌. అదుగో ఆలా ఉంది బీజేపీ, టీఆర్ ఎస్ వారి తంతు. అస‌లే వ‌ర‌ద‌ల‌తో గూడూ, గోతం న‌ష్ట‌పోయి  జ‌నం బాధ‌ప‌డుతున్నారు.  జ‌నానికి  ప్ర‌భుత్వం స‌హాయ స‌హ‌కారాలు అందించాలి. కానీ బీజేపీ, టీఆర్ ఎస్ నేత‌లు గొడ‌వ‌ల‌కు దిగారు. మంచిర్యాల ఐబీలో వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నేతలు దీక్ష చేశారు. అయితే జీఎస్టీ  పెంపును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు  కూడా నిరసన తెలిపారు. పరస్పర విమర్శలతో ఇరు పార్టీల నేతలు కొట్టు కున్నారు. రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు.  జిల్లాలో గతవారం రోజులనుంచి కురిసిన భారీవర్షాలు వరదల కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున పంట లకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం కార ణంగా దాదాపు 10 వేల మంది అన్నదాతలు కొలుకోలేని పరిస్థితికి చేరుకు న్నారు. వ్యవసాయాధికారులు యుద్ధ ప్రాతిపాదికన రూపొందించిన ప్రాథమిక పంటలనష్టం అంచనాలను సర్కారుకు నివేదించారు.  ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న, కందుల పంటలు పెద్దఎత్తున దెబ్బ తినడంతో ఇక మళ్లీ ఆ పంటలను సాగుచేయడం రైతులకు సవాలుగా మారనుంది. పంటలసాగు ఆలస్యం  కానున్నం దున దిగుబడుల సమయం మరింత దూరమవుతుందని చెబుతున్నారు.

నాగబాబు, నారాయణ వివాదం టీ కప్పులో తుపాను

మెగా స్టార్  చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఉవ్వెత్తున లేచిన వివాదం టీ కప్పులో తుపానుగా చల్లారిపోయింది. నటుడు చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ ఇటీవల విమర్శలు గుప్పించారు. చిరంజీవిని రంగులు మార్చే ఊసరవిల్లితో పోల్చారు.   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ హాజరైన సంగతి విదితమే.  ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఊసరవిల్లిలా రంగులు మార్చే చిరంజీవిని కాకుండా అల్లూరి సీతారామరాజుపై సినిమా నిర్మించి, నటించిన సూపర్ స్టార్ కృష్ణకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కల్యాణ్ ను ల్యాండ్ మైన్ తో పోల్చి ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదని సెటైర్లు వేశారు. దీంతో నారాయణపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే మరింత తీవ్రంగా స్పందించారు. సీపీఐ నారాయణ అన్నం తినడం మానేసి చాలా కాలమైందనని అంటూ ఆయన కేవలం గడ్డి, చెత్తా చెదారం తింటున్నారంటూ విమర్శించారు.   మెగా అభిమానులంతా కలిసి ఆయన చేత గడ్డి తినడం మాన్పించి అన్నం తినడం అలవాటు చేయాలని పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై తను చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతున్న నేపథ్యంలో సీపీఐ నారాయణ బేషరతుగా క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.   అదే సమయంలో తన వ్యాఖ్యలను కేవలం భాషా దోషంగా భావించి మన్నించాలని కోరారు. నారాయణ క్షమాపణులు కోరి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో మోగా బ్రదర్ పవన్ కల్యాణ్ శాంతించారు. క్షమాగుణం జనసైనికుల ధర్మం అని పేర్కొన్నారు. అలాగే తప్పు ఎవరు చేసిన క్షమించమని కోరితే క్షమించాలని పేర్కొన్నారు. సీపీఐ నారాయణ వయస్సును దృష్టిలోఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని జనసైనికులకు పిలుపు నిచ్చారు.  

తోపుడుబండి వ్యాపారి.. గ‌న్‌మెన్‌ల ప‌హారా! 

మొన్నామ‌ధ్య అదేదో సినిమాలో బ్ర‌హ్మానందానికి ఇద్ద‌రు తుపాకులు ధ‌రించిన బాడీగార్డుల‌ను చూసి జ‌నం తెగ‌న‌వ్వుకున్నారు. ఈయ‌న‌కెందుకా అని. అది సినిమా కాబ‌ట్టి ఏదో స‌ర‌దా సీన్‌. కానీ అంత‌కంటే విచిత్ర‌మేమంటే తోపుడు బండి వ్యాపారికి కోర్టు గ‌న్‌మెన్‌ల‌ను ఏర్పాటుచేయ‌డం. ఇది వాస్త‌వం. అస‌లు తోపుడు బండివాడికి అంత సీన్ ఎందుకా అని ఇప్ప‌టికే తెగ ఆలోచిస్తున్నారుగ‌దా. అత‌గాడికి కాదు ఆయ‌న ఊళ్లో భూమి త‌గాదా ఆయ‌న‌కు గ‌న్‌మెన్‌ల‌తోటే తిర‌గాల్సిన ప‌రిస్థితి క‌ల్పించింది.  ఆయ‌న పేరు రామేశ్వ‌ర్ ద‌యాళ్‌.  ఉత్త‌రప్ర‌దేశ్ ఎటా జిల్లా నివాసి. ఆయ‌న తోపుడు బండి మీద దుస్తు లు అమ్ము తూంటాడు. అలా రోజంతా ఊళ్లో తిరుగుతూ రోజుకు 200 నుంచి 300 రూపాయ‌లు సంపాదిస్తాడు. ఇటీవ‌ల రామేశ్వ‌ర్ అక్క‌డి ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వ‌ర్ సింగ్ సోద‌రుడు జుగేంద్ర సింగ్‌ను క‌లిశాడు. త‌న భూమికి ప‌ట్టా ఇప్పించాల‌ని కోరాడు.   వాస్త‌వానికి భూమికి ప‌ట్టా ఇప్పించ‌డం అనేది మాజీ ఎమ్మెల్యే త‌మ్ముడికి పెద్ద లెక్కేమీ కాదు. కానీ భూమిని కాజేద్దామ‌ని ఆలోచ‌న వ‌చ్చే ఉంటుంది. అందుకే ఏదో ఒక గొడ‌వ‌పెట్టుకోవాల‌నుకున్నాడు. రామేశ్వ‌ర్‌ను కులం పేరుతో తిట్టాడు. అంతే కులం మాట ఎత్త‌గానే వారి మ‌ధ్య చిన్న‌గొడ‌వ చిలికి చిలికి  గాలివానై ఏకంగా క‌న‌ప‌డితే చంపుతాన‌ని బెదిరించేదాకా పోయింది. భ‌యంతో రామేశ్వ‌ర్ ద‌యాళ్ ప‌రుగున పోలీసు స్టేష‌న్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ జుగేంద్ర అక్క‌డితో ఆగ‌క అస‌లా భూమి నాదే అంటూ హైకోర్టును ఆశ్ర యించాడు. రామేశ్వ‌ర్‌ను కోర్టువారు ర‌మ్మ‌న్నారు. అత‌ను ఒక్క‌డే భ‌యం భ‌యంగా వెళ్లాడు. అత‌నితో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం సంగ‌తి  విని కోర్టు  అత‌నికి వెంట‌నే  భ‌ద్ర‌త  క‌ల్పించ‌ మ‌ని పోలీసుల‌ను  ఆదేశిం చింది. కోర్టు ఆదేశాన్ని శిర‌సావ‌హించి పోలీసులు రామేశ్వ‌ర్‌కు ఇద్ద‌రు బాడీగార్డుల‌ను నియ‌మించారు. అంతే కాదు వారిద్ద‌రికి ఏకే 47 రైఫిళ్ల‌నూ ఇచ్చారు. రామేశ్వ‌ర్ ఇపుడు తోపుడు బండి మీద దుస్తులు అమ్ముతూ రాజ‌కీయ‌నాయకుడిలా నిటారుగా  తిరుగుతున్నాడు. మ‌రి ఏకే 47 తో వున్న‌వారిని వెంటేసుకుని తిర‌గ‌డం అంత ధైర్యాన్నిస్తుంది క‌దా! 

రైతుల్ని ప‌ల‌క‌రించిన   కొత్త  అతిథి 

మ‌న ఊరు, మ‌న గుడి, మ‌న గుట్ట‌.. అనుకుని ఓ పెద్దామె చాలారోజుల త‌ర్వాత చెట్ల‌పొద‌లు తొల‌గి స్తుంటే స‌ర్రున నాగ‌రాజు లేచి ప‌ల‌క‌రించాడు. అంతే బామ్మ‌గారు అమాంతం వెల్ల‌కిలా ప‌డి లేచి ఇంటి దాకా ప‌రిగె త్తింది. పాములు, క‌ప్ప‌లు, తేళ్ల‌కు వీలు చిక్కాలే గాని ఇళ్ల‌లోకి రావ‌డానికే మ‌హా తొంద‌ర‌ ప‌డుతూంటా యి. ఇపుడు వాటి ఆ స‌ర‌దానే భ‌ద్రాచ‌లం జిల్లాలో ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది.  భారీవ‌ర్షాలు, ఇటివల కురిసిన భారీ వర్షాలకి భద్రాచలం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిం దే. ఇప్పుడిప్పుడే అక్కడ ప్రజలు కొంత కోలుకుంటున్నారు.భారీ వర్షాలతో గోదావరి తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా  ఇప్పుడిప్పుడే  గోదారమ్మ శాంతి స్తుంది. ఈ క్రమంలో పునరావాసాల నుంచి ఇళ్ల బాట పడుతున్న ముంపు గ్రామాల  బాధితులు  ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.  వరదనీటితోపాటు ఇళ్లలో, వాడల్లో పాములు,  తేళ్లు, మొసళ్లు, ఇతర ప్రమాదకర జీవులు చేరి గజగజ వణికిస్తున్నాయి. వాటికి మ‌నుషులు లేక‌పోతే ఆ ఇల్లు త‌మ‌దేన‌న్న భావ‌న ఉంటుందేమో!  ఇళ్ల‌లోకి వ‌చ్చిన‌వాటి సంగ‌తి స‌రే. పొలంలోకి  ఎప్పుడు వ‌చ్చిందో బుర‌ద నీటిలో హాయిగా ప‌డుకున్న మొస‌లి పిల్ల కంట‌ప‌డింది. అంతే పొలంలోకి వెళ్లిన రైతులు భ‌యంతో ప‌రుగులు తీశారు. ఎక్క‌డో ఉండాల్సిన మొస‌లి పిల్ల‌ద‌యినాస‌రే ఇలా  తార‌స‌ప‌డ‌టం ఖంగారుపెట్టింది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వాపురం మండలం నెల్లిపాకలో పొలం పనులకు వెళ్లిన రైతులు కంగుతిన్నారు.  బురదలో ఏదో  క‌ద‌ల‌డం చూశారు. దగ్గరికి వెళ్లగా అది మొసలి పిల్లగా నిర్ధారించారు.  పొలంలో బురదలో ఇరుక్కుని ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న మొసలి గురించి రైతులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థ‌లానికి చేరుకున్న యానిమల్​ రెస్క్యూ టీమ్‌  పంట పొలంలో ఉన్న మొసలి పిల్లను పట్టుకు న్నారు.  అనంతరం హైదరాబాద్‌లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. వరదలకు అడవుల్లోని విష పురుగులు ఊర్లలోకి రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడవలసి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.వీటిని గుర్తిస్తే చంప కుండా. . తమకు సమాచారం అందించాలని కోరారు. మరోవైపు నల్లాలను శుభ్రం చేయకుండా వాడితే కలుషిత నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రజ లంతా నల్లాలను శుభ్రం చేసుకున్న తర్వాతే నీటిని వాడుకోవాలని కోరుతున్నారు.

బటన్ నొక్కితే బాధ్యత తీరిపోయినట్లేనా జగన్.. జనసేనాని

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చాలా గ్రామాలు దెబ్బ‌తిన్నాయి. వ‌ర్షం నీరు మోకాల్లోతు ఉన్నా య‌ని రోడ్డు క‌నిపించాక‌నే వెళ్లి బంధువుల్ని ప‌ల‌క‌రిస్తానంటే ఎలా కుదురుతుంది. కేవ‌లం స‌మాచారం అందుకోవ‌డం, అధికారుల‌కు ఆదేశాలు జారీచేసినంత మాత్రాన స‌హాయ‌క చ‌ర్య‌లు  వాటంత‌ట అవి జ‌రిగిపోవు. వాస్త‌వంగా పున‌రావాస కేంద్రాల్లో ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌ను మ‌రింత వేగిరం చేయాలి. కానీ ప్ర‌భుత్వం తీరు అందుకు భిన్నంగా ఉంద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. నాలుగు ట‌మాటాలు, రెండు ఆలూలు, నూనె ఇచ్చేసినంత మాత్రాన చాలా సేవ చేసిన‌ట్టు అవుతుందా? అది కూడా ప్ర‌భుత్వం చెప్పిన‌ది ఒక‌టి అక్క‌డ అమ‌లు చేస్తున్న‌ది మ‌రో విధంగా ఉంద‌ని విప‌క్షాలు తేల్చాయి. క‌నీసం మాన‌వత్వంతో చేయ‌వ‌ల‌సిన ప‌నులు కూడా చేయ‌లేని దుస్థితిలో ప్రభుత్వం ఉంద‌ని భావించాల్సి వ‌స్తోందని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.  గోదావ‌రి క‌న్నెర్ర చేసింది, గోదావ‌రి తీర ప్రాంతాలన్నీ దెబ్బ‌తిన్నాయి. రైతాంగం తీవ్ర‌ంగా న‌ష్ట‌పోయింది. చాలా గ్రామాల్లో ప్ర‌జ‌లు అన్నీ కోల్పోయి పున‌రావాస కేంద్రాల్లో బికుబికుమంటూ ఉన్నారు. క్ర‌మేపీ ప‌రిస్థి తులు శాంతించాయి. కానీ పున‌రావాస కేంద్రాల్లో ఉన్న‌వారి క‌ష్టాల‌ను ప్రభుత్వం విన్న పాపాన‌పోలేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వంద‌లాది గ్రామాల్లో వ‌ర‌ద నీరు ఇళ్ల‌లో నిలిచిపోయి ప్ర‌జ‌లు తిరిగి వెళ్ల‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వారి ప‌రిస్థితిని ఆకాశ‌మార్గాన ప‌ర్య‌టించి చూడ్డం కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల‌ను పంపి మ‌రీ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.  ప్రభుత్వ ప‌థ‌కాల అమ‌లు గురించి వాక‌బు చేయ‌డానికి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అంటూ గొప్ప‌కార్య‌క్ర‌మంతో అంద రి ద‌గ్గ‌రికీ వెళ్లిన నాయ‌కులు ఇపుడు వెళ్లి వారికి ఎలాంటి స‌హాయం చేయాలో తెలుసుకుంటే బాగుంటుం ద‌ని, కేవ‌లం మాట‌లు, ప్ర‌చారాలు కాకుండా ఇలాంటి స‌మ‌యంలోనే అస‌లు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టా ల‌న్న విమ‌ర్శ‌లు విన‌వ‌స్తున్నాయి. వరదనీరు ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప‌వ‌న్  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వర దల కారణాల వేలాది మంది  బాధితులు  ఇబ్బదులకు గురవుతుంటే.. ఏపీ ప్రభుత్వం పునరావాస కేంద్రా లు నామ మాత్రంగానే ఏర్పాటు చేసిందని ఆరోపించారు. వరదలపై ప్రభుత్వం చేస్తున్న చర్యలను చూ స్తుంటే ప్రభుత్వం అప్రమత్తంగా లేదని అర్థమవుతోందన్నారు. బటన్‌ నొక్కితే  బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని విమర్శించారు.  మానవత్వంతో స్పందించి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. కానీ, వరద బాధితుల గోడును పాలకులు పట్టించుకోవడం లేదని ప‌వ‌న్ ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని కోరితే రాజకీయం చేస్తున్నామని అంటూ.. పాలనా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవలు కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోయిం దని, ఆహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు.  ప్ర‌జ‌ల్ని ఈ క‌ష్ట‌కాలంలో ఆదుకోవ‌డంతో పాటు వారి భ‌విత‌కు భ‌రోసా ఇవ్వాలి. కానీ ప్రభుత్వానికి అలాంటి ఆలోచ‌నేమీ ఉన్న‌ట్టు లేదు. ప్ర‌కృతి వైప‌రీత్యం క‌నుక  తామేమీ చేయ‌లేమ‌ని చేతులెత్తేస్తే ఇక  ముంపు గ్రామాల ప్ర‌జ‌లు స‌హాయం కోసం ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ‌తారు. ప‌థ‌కాలు, ఓట్ల గురించి ఇంటింటికీ అత్యుత్సా హంతో తిరిగిన‌వారు  ఇక ఇప్పుడు వ‌ర‌ద భ‌యం త‌గ్గిన ఈ స‌మ‌యంలోనైనా స‌హాయ‌క‌చ‌ర్య‌లు వేగిరం చేప‌ట్టి ముంపుగ్రామాల ప్ర‌జ‌ల‌కు ధైర్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వం పై ఉన్న‌ది.

మళ్లీ తెరపైకి సమైక్యాంధ్రప్రదేశ్?

రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్- తెలంగాణ మళ్లీ కలిసిపోనున్నాయా? లేదా? మరో పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే ఉంచుతారా? విభజనతో అన్ని విధాలా నష్టపోయిందని, పీకి అన్యాయం జరిగిందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ప్రధాని మోడీ తలచుకుంటే ఏపీ- తెలంగాణ రాష్ట్రాలను కలిపేయడం పెద్ద కష్టమేమీ కాబోదంటున్నారు పరిశీలకులు. కాదంటే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే యోచన కూడా ఉండి ఉండొచ్చని కూడా  చెబుతున్నారు. ఈ మేరకు మోడీ స్కెచ్ వేశారని, అందులో భాగంగానే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’ ‘హైదరాబాద్ రాజధాని’ వ్యాఖ్యలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విభజన తర్వాత రాజధాని హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిందని, దాంతో ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, హైదరాబాద్ ను మళ్లీ పూర్వం మాదిరిగా ఏపీకి కలిపేయమని అడిగితే ఎలా ఉంటుందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు? అలా ఐతే హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమనండి.. తప్పులేదు అంటున్నారాయన. రాష్ట్ర విభజనను రద్దు చేసి, రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ పూర్వంలాగే సమైక్యంగా మార్చేయండి   అభ్యంతరం లేదు అని బొత్స మంగళవారం ఒక సందర్భంలో అన్నారు.   మాట్లాడిన సందర్భం ఏదైనా  ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.  దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికి కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తోంది. ఉత్తరాదిలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ దక్షిణాదిలో కూడా పాగా వేయాలని అనేక యత్నాలు చేస్తూ వస్తోంది. అయితే అవేమీ పెద్దగా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు.   ముందుగా తెలంగాణపై కన్నేసిన కమలదళం పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ పైన, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పైనా తీవ్ర స్థాయి విమర్శలతో చెలరేగిపోతున్నారు. కేంద్రంలో బీజేపీ రహిత పరిపాలనకు బాటలు వేయాలంటూ విపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే విభజన సమయంలో ఏపీకి నష్టం జరిగిందని  ప్రధాని మోడీ కొన్నిసార్లు స్వయంగా చెప్పడం గమనార్హం. దీంతో కేసీఆర్ స్పీడుకు, టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలనే వ్యూహాలు మోడీ రచిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం  అయ్యాయి. రాజధాని నగరంలేని ఏపీకి హైదరాబాద్ నే మరో పదేళ్ల పాటు రాజధానిగా కొనసాగించాలనే యోచన ఇందులో భాగమేనంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఇప్పుడు ‘ముగిసిన అధ్యాయం’ అని కేంద్రం పార్లమెంట్ లో తాజాగా మరో మారు స్పష్టం చేయడంఈ సందర్భంగా  గమనార్హం. ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల ఆర్థికంగా నష్టపోతున్న ఏపీకి కొంత వెసులుబాటు కల్పించాలని, లేదా తెలంగాణతో మళ్లీ కలపడం ద్వారా మేలు చేయాలనే ఆలోచన కూడా కేంద్రం పెద్దల్లో, ముఖ్యంగా ప్రధాని మోడీలో ఉందంటున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు ప్రధాని మోడీ తలుచుకుంటే.. తెలుగు రాష్ట్రాలను మళ్లీ విలీనం చేయొచ్చని, లేదా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి, ఆదాయంలో భాగం పంచవచ్చని,  అదీ కాకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి తెలంగాణలో కేసీఆర్ ను బలహీనం చేయడం, అదే సమయంలో ఏపీలో బలం పెంచుకునే అవకాశం కల్పించుకోవడం అన్న యోచనతో మోడీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   మోడీ స్కెచ్ లో భాగమే  ఏపీ మంత్రి బొత్స   ఉమ్మడి రాజధాని, ఇరు రాష్ట్రాల విలీనం అంశాలను ప్రస్తావించారని పరిశీలకులు భావిస్తున్నారు.

క్రికెట్‌రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గ‌చ్చు

సాగినంత‌కాలం తానే రాజ‌నుకుంటాడు.. సాగ‌క‌పోతే ఊర‌క చ‌తికిల ప‌డ‌తాడు..ఇదెక్క‌డో విన్న‌మాట‌లా ఉంది గ‌దా.. పోనీ భ‌గ‌వ‌ద్గీత‌లోదే అనుకుందాం.. కింగ్ కోహ్లీకి  ఇపుడు భ‌గ‌వ‌ద్గీత  విన‌డం అవ‌స‌ర‌మ‌ని అత‌ని వీరాభిమానులు అంటున్నారు. కానీ గ‌వాస్క‌ర్ వంటి  సీనియ‌ర్లు  అలా అన‌డం లేదు. ఒక్క ఇర‌వై నిమిషాలు స‌మ‌యం ఇస్తే.. కోహ్లీకి మ‌ళ్లీ సెంచ‌రీ కొట్టే స‌త్తాకి మార్గం బోధిస్తాన‌న్నాడు.  కోహ్లీ.. క్రికెట్‌లో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత  క్రికెట్ అభిమానుల హృద‌యాల్లో నిలిచిన సూప‌ర్ డూప‌ర్ స్టార్‌. మామూలుగానే స‌చిన్‌తో ప్ర‌తీ క్రికెట్ స్టార్‌నీ పోల్చ‌డం దేశంలో ఆన‌వాయితీ.  కానీ ఆట తీరులో కాస్తంత‌యినా వ్య‌త్యాసం ఉంటుంద‌న్న‌ది గ్ర‌హించాలి. కానీ కోహ్లీ క్రీజులోకి రాగానే ప్రేక్ష‌కు డికి మ‌రో స‌చిన్ వ‌చ్చేడ‌నే  భావ‌న బ‌లంగా  నాటుకుపోయింది. అందువ‌ల్ల  కోహ్లీ త‌న‌కు తాను ఏమ‌ను కుంటాడ‌నేది వేరే సంగ‌తి ప్రేక్ష‌కులు, క్రికెట్ పిచ్చాళ్ల దృష్టిలో అత‌ను స‌చిన్ లానే ప‌రుగుల వ‌ర‌ద సృష్టించాల్సిందే. అది రూలు .. రూల్ ఈజ్ రూల్ ఫ‌ర్ ఆల్‌!! కానీ, కాల‌క్ర‌మంలో అనేక సీరీస్‌లు ఆడిన త‌ర్వాత బ్యాటింగ్ ప‌దును కాస్తంత త‌గ్గుతుంద‌న్నది గ‌వాస్క‌ర్ కాలం నుంచి ఉన్న‌ది, గ‌మ‌నిస్తున్న‌దీను. దానికి గ‌వాస్క‌ర్ వంటివ‌రూ అంగీక‌రిస్తున్నారు.  ఫామ్ దెబ్బ‌తిన గానే హ‌ఠాత్తుగా సూప‌ర్ స్టార్, గాడ్‌.. అనే పీఠాన్నుంచి అమాంతం తోసేయాల్సిన అవ‌స‌రం అయితే లేదు. కానీ క్రికెట్ వీరాభిమానుల‌కు అదేం ప‌ట్ట‌దు. ప‌రుగుల వ‌ర‌ద సృష్టించ‌లేన‌పుడు గ‌వాస్క‌ర్ అయినా, స‌చిన్ అయినా.. ఇపుడు కోహ్లీ అయినా ఒక్క‌టే. త‌ప్ప‌దు వారి భావోద్వేగం అలాంటిది మ‌రి.  కోహ్లీ 2019 న‌వంబ‌ర్ నుంచి ఒక్క అంత‌ర్జాతీయ సెంచ‌రీ చేయ‌లేదు. దానిక్కార‌ణం అత‌ను ఆఫ్‌స్టంప్ లైన్ తో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని స్ఫుర‌ద్రూపి అయిన గ‌వాస్క‌ర్ ఇట్టే ప‌ట్టేశాడు. ఎంత‌యినా బ్యాట‌ర్ సంగ‌తి మ‌రో బ్యాట‌ర్‌కే తెలుస్తుంది. గ‌వాస్క‌ర్ అంత‌ర్జాతీయ అనుభ‌వంతో పాటు అతి ప్ర‌మాద‌క‌ర బౌల‌ర్ల ను ఎదుర్కొన్న ధీరుడుగా  పేరు గ‌డించిన పొట్టివాడు, గ‌ట్టివాడు!  కోహ్లీ సెంచ‌రీ కాదు అర్ధ సెంచ‌రీ దాట డానికి నానా యిబ్బందీ ప‌డుతున్నాడ‌ని అనేకానేక వంక‌ర కామెంట్లు అత‌న్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్లేయ‌ర్ అన్న‌వాడికి ఎపుడో ఒక‌ప్పుడు ఇలాంటి లీన్ పాచ్ రావ‌డం చాలా స‌హ‌జం. దీనికి  కోహ్లీ  మ‌రీ గుమ్మ‌డి లా  బాధ‌ప‌డిపోన‌క్క‌ర్లేదు. కాస్తంత విశ్రాంతి తీసుకుంటే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ లా విజృంభించే అవ‌కాశాలూ లేక‌పోలేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  తాజాగా లెజండ‌రీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కోహ్లీ వైపు మొగ్గుచూపి, అత‌గాడిది మ‌రీ దిగులుప‌డి పోయేంత ప‌రిస్థితేమీ కాద‌న్నాడు. చిన్న‌పాటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగ‌మించ‌డానికి తాను మందు వేస్తాన‌ని అన్నాడు. కామెంట్ల కంటే అత‌ని ఆటతీరులో వ‌చ్చిన చిన్న‌పాటి లోపాల్ని స‌రిది ద్దుకునేందుకు వీలు క‌ల్పించే మార్గాల్ని తోటి ప్లేయ‌ర్లు, సీనియ‌ర్లు క‌ల్పించాల‌ని గ‌వాస్క‌ర్ భావం కావ‌చ్చు. సాధార‌ణంగా బొంబాయి వాళ్ల‌నే నెత్తినెక్కించుకునే గ‌వాస్క‌ర్‌కు హ‌ఠాత్తుగా కోహ్లీ మీద అపార ప్రేమ‌, అభిమానం పొంగ డానికి కార‌ణం బొంబాయి కుర్రాడు శ‌ర్మ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.  క్రికెట్ రాజ‌కీయాలు బ‌య‌ట రాజ‌కీయాల‌కు ఆట్టే తేడా లేదు. కాబోతే బిసిసిఐ మేధావుల రాజ‌కీయాల ప్ర‌భావం త‌ర్వాత‌నే వెలుగులోకి వ‌స్తుంది. అప్ప‌టికి జ‌ర‌గాల్సిన అన్యాయం ప్లేయ‌ర్ల‌కు జ‌రుగుతుంది. ఇది పాతికేళ్లుగా సాగుతున్న‌దే. గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి వారికీ బొంబాయి మేధావుల రాజ‌కీయ సెగ త‌గిలింది. ఎవ‌రు అద్భుతంగా రాణిస్తున్నా, ఎవ‌రు స‌చిన్‌ను, శ‌ర్మ‌నో మించిపోతున్నా వెంట‌నే బొంబాయికి చెందిన కామెంటేట‌ర్లు, మాజీ ప్లేయ‌ర్లు త‌మ గూగ్లీల‌తో దాడి చేయ‌డం చాలా స‌హ‌జం. వారికి బొంబాయి, శివాజీ పార్కు ప్లేయ‌ర్ల కంటే లోకంలో మ‌రే ప్లేయ‌రూ అస‌లు ప్లేయ‌రే కాదు.   ధోనీ విజృంభిస్తు న్న స‌మ‌యంలో ఈ గ‌వాస్క‌ర్లంతా నోరు మూసుకోవాల్సి వ‌చ్చింది. ధోనీ ఆట‌లో స్పీడు, ఆలోచ‌న‌ల అమ‌లు, విజ‌యాల‌ను బేరీజు వేసుకుంటే ఏ బొంబాయి ప్లేయ‌రూ అత‌ని ముందు దిగ‌తుడుపే కావ‌డంతో ఎవ్వ‌రూ అత‌న్ని కాద‌న‌లేక‌పోయారు. ధోనీ అంటే విజ‌యం అనే ప్ర‌శంస‌ల‌తో అత‌ని హ‌వా సాగ‌నిచ్చేరు.  ఇపుడు కోహ్లీ మీద  అంత తొంద‌ర‌గా ఏమీ అన‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అందుకే కేవ‌లం ఆట‌లో చిన్న‌పాటి పొర‌పాట్ల‌ను స‌ద్దితే స‌రిపోతుంది, అది నా వ‌ల్లే అవుతుంద‌ని గ‌వాస్క‌ర్ త‌న వ‌ద్ద‌కు పిలిచాడు. మ‌రి వెళ్లాలా, వ‌ద్దా అన్న‌ది కోహ్లీ ఆలోచించుకోవాలి. 

భారతీయులు దేశం వదిలేస్తున్నారు

చదువు కోసమో, ఉపాధి వ్యాపారాల కోసమో విదేశాలకు వెళ్ళే భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. అమెరికా, యూకే, బ్రిటన్, జర్మనీ ఇలా ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రపంచ పటంలో ఉన్న ఏ దేశం వెళ్లినా భారతీయులు కనిపిస్తారు. ప్రపంచంలో భారతీయులు లేని దేశం లేదంటే  అతిశయోక్తి కాదు. నిజానికి, ఇప్పుడు ప్రతి భారతీయ కుటుంబంలో కనీసం ఒక్కరి వంతున విదేశాల్లో స్థిరపడుతున్నారు. అమెరికా వంటి కొన్ని దేశాల్లో అయితే రెండు మూడు తరాలుగా అక్కడే స్థిరపడి చుట్టం చూపుగా ఎప్పుడో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళుతున్న కుటుంబాలు కోకొల్లలు. నిజమే, ఇప్పుడు కాదు, చాలా కాలంగా, స్వాతంత్రానికి ముందు నుంచి కూడా  విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. ఆ సంఖ్య క్రమక్రమగా పెరుగుతోంది. అయితే, గతంలో వెళ్ళిన వారు,వెళ్ళిన పని పూర్తి చేసుకుని వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడేందుకు ఇష్ట పడే వారు. జాతిపిత మహత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఇంకా ఎందరో స్వాతంత్ర సమరయోధులు విదేశాలలో చదువుకుని, వెనక్కి వచ్చి స్వాతంత్ర పోరటంలో పాల్గొన్నారు.  అయితే, ఇప్పడు ట్రెండ్ మారింది. ఏటి కేడాది విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరిగి పోతోంది. మరో వంక అలా వెళ్ళిన వారిలో ఎక్కువగా  విదేశాల్లో   స్థిరపడుతున్నారు. అక్కడే ఆస్తులు ఏర్పరచు కుంటున్నారు.అంతే కాదు, భారత పౌరసత్వాన్ని వదులుకుని, ఆయా దేశాల పౌరసత్వాన్ని స్వీకరించేందుకు మొగ్గు చుపుతున్నారు. ఈ నేపధ్యంలో గత కొన్నేళ్లుగా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2019లో 1,44,017 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు, కాగా, 2020లో బహుశా కొవిడ్ కారణంగా కావచ్చును, 85,256 కు తగ్గింది. 2021లో అయితే ఏకంగా 1,63,370 మంది మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో వెల్లడించారు. అన్ని దేశాలలో ఇదే పరిస్థతి ఉన్నా, ఇప్పటికీ భారతీయుల ఫస్ట్ డెస్టినేషన్ అగ్రరాజ్యం అమెరికానే.  గత మూడేళ్లలో భారత పౌరసత్వాన్ని త్యజించిన వారిలో ఎక్కువ మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారని గణాంకాలను బట్టి తెలుస్తోంది.  అమెరికాలో నివసిస్తోన్న భారతీయుల్లో 2019 లో 61 వేల మందికిపైగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకోగా.. 2020లో 30 వేల మందికిపైగా, 2021లో 78,284 మంది భారత పౌరసత్వాన్ని త్యజించారు. అంటే గత ఏడాది భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో దాదాపు 48 శాతం మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా వుంది. గత ఏడాది 23,533 మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందారు. 2019లో 21,340 మంది, 2020లో 13,158 చొప్పున భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందారు.కెనడా పౌరసత్వం పొందడం కోసం కూడా భారతీయులు ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఉంది. 2019లో 14,309 మంది భారతీయులు యూకే పౌరసత్వాన్ని పొందగా.. ఆ తర్వాతి రెండేళ్లలో వరుసగా 6489, 14637 మంది చొప్పున యూకే సిటిజన్‌ షిప్ పొందారు. యూకే, ఇటలీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. గత ఏడాది 41 మంది భారతీయులు పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోవడం గమనార్హం. అంతకు ముందు ఏడాది కూడా ఏడుగురు భారతీయులు పాకిస్థాన్ పౌరసత్వం పొందారు. కాగా, 2015 నుంచి చూస్తే.. 2021 సెపెంబర్ వరకు 8,81,254 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని త్యజించారని కేంద్ర హోం శాఖ 2021 డిసెంబర్లో పార్లమెంట్‌లో వెల్లడించింది..

శిక్ష‌ణ‌లో సాంకేతిక‌ప‌రిజ్ఞానానికి  ప్రాధాన్య‌త‌నివ్వాలి..  షా

పోలీసుల శిక్ష‌ణా విధానంలో మార్పులు తీసుకురావ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభిప్రాయ‌ప‌డ్డారు.  దేశ‌భ‌క్తి, క్ర‌మ‌శిక్ష‌ణ‌, బాధితుల ప‌ట్ల సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వీటితో పాటు అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించు కోవ‌డంలో మెళ‌కువ‌లు పోలీసుల శిక్ష‌ణ‌లో భాగంగా ఉండా ల‌ని ఆయ‌న అన్నారు.  పోలీసు శిక్ష‌ణా సంస్థ‌ల రివ్యూ స‌మావేశంలో మాట్లాడుతూ పోలీసుల‌కు ఈ రోజుల్లో సాంకేతిక‌త‌, ఆధునిక ఆయుధాల శిక్ష‌ణ‌,  వినియోగం త‌ప్ప‌కుండా తెలియాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. డ్యూటీ ప‌ట్ల బాధ్య‌తాయుతంగా ఉండ‌టం, ల‌క్ష్యాల‌ను సాధించాల‌న్న ప‌ట్టుద‌ల కూడా శిక్ష‌ణ‌లో భాగంగా ఉండాల‌ని  షా సూచించారు. ప్ర‌ధాని మోదీ ఆరంభించిన మిష‌న్ క‌ర్మ‌యోగి  కార్య‌క్ర‌మం క్రింద  పోలీసు కానిస్టేబుల్, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, డిఎస్‌పి స్థాయిల వ‌ర‌కూ పోలీసు అధికారుల శిక్ష‌ణ క‌ట్టుదిట్టంగా జ‌ర‌గాల‌ని అన్నారు.  పోలీసుల‌కు 60 శాతం శిక్ష‌ణ అంద‌రికీ స‌మానంగా ఉండాల‌ని, 40 శాతం మాత్రం ఆయుధాల వినియోగం ఆధారిత ప్ర‌త్యేక శిక్ష‌ణ ఉండాల‌ని హోం మంత్రి సూచించారు. ఎప్పటికప్పుడు మారుతున్న భద్రతా సవాళ్ల స్వభావానికి సత్వర, ప్రభావంతమైన ప్రతిస్పందనలను అందించడానికి పోలీసు సిబ్బంది సామ ర్థ్యాలను పెంపొందించడానికి సరైన సమయంలో సరైన శిక్షణ  ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ కేంద్ర పోలీసు శిక్షణా సంస్థలచే ప్రదర్శనలు  చేప‌డుతున్నారు. శిక్షణా అవస రాల విశ్లేషణ, శిక్షణ వనరుల ఉత్పాదకత   ప్రాముఖ్యతతో సహా  శిక్షణా పద్ధతులు అమ‌లుచేస్తున్నారు.