గోదారిలో ప్రమాదం.. తృటిలొ తప్పించుకున్న చంద్రబాబు
posted on Jul 21, 2022 @ 11:14PM
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటు ర్యాంపు తెగిపోయింది.
అయితే ఆ సమయానికి ఒక్క క్షణం ముందు ఆయన వేరు పడవలోకి మారడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే పంటు ర్యాంపు తెగిన ఘటనలో పలువురు తెలుగుదేశం నేతలు గోదవరిలో పడిపోయారు.
వెంటనే సిబ్బంది లైఫ్ జాకెట్లు అందించి వారిని సురక్షితంగా కాపాడారు. గోదవరిలో పడిపోయిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ మంతన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే రామరాజు, పార్టీ నేతలు ఉన్నారు. అలాగే జడ్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్జీ సిబ్బంది. ఆయన పర్యటనను కవర్ చేస్తున్న మీడియా సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడ్డారు.