వందేళ్ల తర్వాత దక్కిన ఆస్తి!
posted on Jul 22, 2022 7:45AM
ఎక్కడన్నా యాభైగజాల స్థలం ఉందంటే ఎలా కాజేద్దామా అని కబ్జాదారులు వేటాడే రోజులు ఇవి. చాలారోజులుగా ఎవరూ పట్టించుకోని స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని విచిత్రపద్ధతులతో పత్రాలు సృష్టించి మరీ కొట్టేస్తుంటారు. అలాంటిది నల్లజాతి కుటుంబానికి వందేళ్ల తర్వాత వారికి నిజంగా చెందాల్సిన బ్రూస్ బీచ్ భవనాన్నిఅధికారులు ఇవ్వడం కబ్జాదారులను ఆశ్చర్య పరుస్తుందేమో!
వందేళ్ల క్రితం బ్రూస్ పూర్వీకులు విల్లా, చార్లెస్ బ్రూస్ కుటుంబం మాన్‌హటన్ తీర ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే కొంత భూమిలో చిన్న భవనాన్ని నిర్మించుకున్నారు. కానీ తెల్లవారి ఆగడాలు భరించలేకపోతుండేవారు. ఈ కుటుంబాన్ని ఎలా గయినా ఆ ప్రాంతంనుంచీ తరిమేయాలని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. క్రమంగా వారినుంచి, ఇతరుల నుంచీ కూడా సమ స్యలు పెరిగేసరికి తప్పనిపరిస్థితుల్లో ఆ ప్రాంతంలోని వారి భూమిని, ఆస్తిని వదిలేసుకుని దూరప్రాంతాలకు వెళిపోవాల్సి వచ్చింది. అప్పట్లో జాతి వివక్షత పరి స్థితులు అంత దారుణంగా ఉండేవి. సముద్రతీరంలో బ్రహ్మాండమైన భూమిని భయపెట్టి తెల్లవాళ్లు కొట్టేశారు.
కాలం గడిచేకొద్దీ ఆ ఆస్తిమీద బ్రూస్ కుటుంబీకులు, బంధువులకు ఆశలు పోయాయి. ఇక అది మనది కాదనుకుని వేరే నగ రాల్లో స్థిరపడి జీవితాన్ని సాగిస్తూ వచ్చారు. కానీ అదృష్టదేవత వారి తలుపులు తట్టింది. లాస్ ఏంజెల్స్ కౌంటీ అధికారి జానీస్ హాన్ ఇప్పటి బ్రూస్ కుటుంబానికి వాళ్ల పూర్వీకుల ఆస్తిగా పేర్కొన్న భూమి, ఇప్పుడున్న రిసార్ట్ రెండూ తమవే అంటూ తెలియజేశారు. ఇంతకాలం వారు నల్లవారన్న ఒకే ఒక కారణంతో తరతరాలుగా మంచి జీవితాన్ని కోల్పోయారు బ్రూస్ కుటుంబీకులు. కానీ ఇప్పటికి అది వారి స్వంతమయింది.1995లో బ్రూస్ పూర్వీకుల భూమి, ఇప్పటి భవనం లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో లెక్కల్లోకి వచ్చింది. అయితే దీని అసలు వారసులను గుర్తించారు. కానీ పూర్తిగా ఆ కుటుంబం చేతికి ఇవ్వడానికి ఇంత కాలంపట్టింది. ఏమయినప్పటికీ పూర్వీకుల ఆస్తి వందేళ్లకి చేజిక్కుతుందని ఎవరన్నా ఊహిస్తారా?
ఈమధ్యనే మాన్‌హటన్ కౌంటీ రిజిస్ట్రార్ డీన్ లొగాన్ బ్రూస్ కుటుంబానికి అధికారిక పత్రాలు అందజేయడంతో బ్రూస్ కుటుం బం కల నిజమయింది. ఇది మిరాకిల్ అన్నారు కొందరు, మరికొందరయితే ప్రభుత్వం, అధికారులు, మారిన సామాజిక పరిస్థి తులు అన్నీ వెరసి బ్రూస్ కుటుంబానికి దక్కాల్సిన ఆనందాన్న, భాగ్యాన్ని కల్పించాయన్నారు.