వరదబాధితుల పరామర్శకు చంద్రబాబు పయనం
posted on Jul 21, 2022 @ 11:13AM
రాజకీయాల్లోకి వచ్చాక కే ప్రజాభిమానాన్ని పొందడం కేవలం రాజకీయాలు చేయడంతోనే సాధ్యం కాదు. ప్రజా నాయకునిగా, ప్రజల పక్షాన నిలవగలిగినవారే నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలుస్తారు. అందుకు అధికారంలోనే ఉండనవసరం లేదు,
విపక్ష నేతగా ఉన్నా ప్రజాసంక్షేమాన్ని ఆశించి ప్రజల వద్దకు వెళ్లి వారి పరిస్థితులు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి, స్వాంతన కలిగించడం నిజమైన ప్రజానాయకుడు చేయాల్సిన పని. ఆ పని చంద్రబాబు చేస్తున్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. జనం జీవనాధారం కోల్పోయి దీనావస్థలో ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందడం లేదన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హెలికాప్టర్‌లో తిరిగి పరిస్థితులను పరిశీలించి వెళ్లిపోయారు అందుకే వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్ర విపక్ష తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో ఘోరంగా విఫలమైన తరుణంలో టీడీపీ అధినేత వరద బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచీ కూడా సహా యం అందేలా ఒత్తిడి తీసుకువస్తానని చెబుతున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురు, శుక్రవారా ల్లో చంద్రబాబు పర్యటిస్తారు.
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఆచంట, పి. గన్న వరం, రాజోలు, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బం దులను తెలుసుకుంటారు. ఈ మేరకు గురువారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్ర బాబు బయల్దేరారు. ఆయోధ్య లంక, నాగుల్లంక, మానేపల్లి, అప్పనపల్లి, రాజోలు, దొడ్డిపట్ల, అబ్బిరాజు పాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, పొన్నపల్లి గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గతంలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం ఏరియల్ సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాలికి బురద అంట కుండా హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. వరదలపై సీఎం జగన్ సీరియస్ గా లేరన్న చంద్రబాబు.. క్యాబి నెట్, అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో ఉన్న విపత్తు నిర్వ హణ వ్యవస్థలను జగన్ నాశనం చేశారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.