తండ్రి మాట కోసం కోట్ల ఎస్టేట్‌కి దూరంగా బ్రౌన్
posted on Jul 21, 2022 @ 12:29PM
తండ్రి అనారోగ్యంతో బాధపడుతూంటాడు, కొడుకులూ, కోడళ్లూ వీలునామా మీద సంతకంకోసం ఆయ న్ను ఇబ్బందిపెడుతూంటారు.. ఇది అనాదిగా చాలా కథల్లో, సినిమాల్లో చదివిన, చూసిన దృశ్యం. అయినా కోట్ల రూపాయలు మురుగుతూ పడి ఉంటే పెద్దాయన ఆరోగ్యం గురించి చులకన భావంతోనే వ్యవహరించే కాలంలోనే ఉన్నాం. కానీ సిడ్నీకి చెందిన క్లారా బ్రౌన్ మాత్రం తన తండ్రి ఆనందంగా అంగీ కరిస్తూ ఇస్తేనే కోట్ల ఆస్తి తీసుకుంటానన్నది. నిజానికి ఆమె పరిస్థితిలో ఎవరున్నా పెద్దాయన్ను ఇబ్బంది పెట్టి లాక్కునేవారే. కానీ బ్రౌన్ అలా చేయలేదు. కారణం ఆమెను ముందు మంచి చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె తండ్రి కోరిక. అది తీర్చడానికి ఆ సంపద వేపు ఆమె ఆసక్తి చూపడం లేదు.
బ్రౌన్ కి సుమారు 12 మిలియన్ డాలర్ల ఖరీదయిన ఎస్టేట్ వారసురాలిగా దాన్ని స్వాధీనం చేసుకోను అవ కాశం, హక్కూ ఉందని సిడ్నీవాసులే చెబుతున్నారు. తండ్రి తనకు చదువుకునే అవకాశం కల్పించా రు. కనుక మంచి స్థాయిలో ఉన్నానన్నది తండ్రికి తెలిసేలా చేస్తేనే ఆయన కోరిక తీరినట్టు అవుతుది, కనుక బ్రౌన్ కి ఎస్టేట్ రాయించేసుకోవాలని అనిపించలేదు. ఆమె ప్రస్తుతం సిడ్నీ సరిహద్దు ప్రాంతంలో తన ఏడాదిన్నర పిల్లాడితో చిన్న ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె ఏమాత్రం ప్రశాంతంగా మాత్రం లేదు. కారణం తండ్రి వద్దకి రోజూ వెళ్లలేకపోతోంది, చేసే ఉద్యోగం అంతంత మాత్రమైనదే. అదేమీ ఆర్ధికంగా ఆమెకు ధైర్యాన్నివ్వడం లేదు. అనారోగ్యంవల్ల అదీ సరిగా చేయలేకపోతోంది. ఆమె చాలారోజులుగా ఆటిజంతో బాధపడుతోంది. ఆమెకు పిల్లాడిని చూసుకోవాలి, ఆస్పత్రి చుట్టూ తిరగా ల్సిన అవసరమూ ఉంది. ఆమెకు నిజానికి ఎంతో డబ్బు అవసరం ఉంది. పిల్లాడిని చూసుకోవడానికి ఒక నర్సును పెట్టుకోవాలి, ఆమె ఇంట లేని సమయంలో పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునేవారు దొరకడం ఆమె ఉన్న ప్రాంతంలో చాలా కష్టంట.
క్లారా బ్రౌన్ ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్న ఆమె తండ్రి స్నేహితులు, హితులూ ఆమెను తండ్రి ఎస్టేట్‌కి తిరిగి వచ్చేయమని చెబుతున్నారు. చాలామంది వచ్చి మరీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా రు. కానీ ఆమె మాత్రం తండ్రి నుంచి రమ్మని ఒక్క మాట, ఎలాంటి సమాచారం లేకుండా తాను ఎస్టేట్ స్వాధీనం చేసుకోలేనని అది తన మనసుకు నచ్చదని, తన తండ్రిని మోసం చేసినట్టే అవుతుందని వచ్చిన వారికి సమాధానంగా చెబుతోంది. మరి ఇలాంటి కూతురు ఉన్నందుకు పెద్దాయన గర్వ పడాలా, అంతటి ఎస్టేట్ దూరం చేసుకుంటున్నందుకు క్లారా బ్రౌన్‌ను దురదృష్టవంతురాలు అనాలా? ఏమ యినా ఆమె మనసు బంగారం.