ఆర్ధిక అరాచకత్వం.. ఆంధ్రా గతి శ్రీలంకే.. రఘురామరాజు
posted on Jul 21, 2022 @ 4:21PM
వైసీసీ రెబెల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు లోక్‌సభ లో ఆంధ్రప్రదేశ్ దుస్థితిని కేంద్రానికి తెలిపే ప్రయ త్నం చేశారు. ఆయన ప్రసంగాన్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పదే పదే అడ్డుకున్నారు. ఈ సమయం లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో జగన్ పాలన ప్రజావ్యతిరేక, రైతాంగ వ్యతిరేక ధోరణిలో సాగుతోందని రఘురామ విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగాన్ని మిథున్ రెడ్డి అడ్డుపడుతున్నప్పటికీ రఘురామ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రసంగాన్ని కొనసాగించారు.
రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు ఊహించని విధంగా ఉన్నాయని కేంద్రం వెంటనే చర్యలు తీసుకొనకపోతే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక పరిస్థితిని ఎదుర్కొంటుందని వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆయన గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్ తీరుపై విరుచుకుపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన ఆదాయం ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్‌కు మళ్లిస్తున్నారని దుయ్య బట్టా రు. ఇలా మళ్ళించిన ఆదాయాన్ని ఆ కార్పోరేషన్ ఆదాయంగా చూపుతున్నారన్నారు. పైగా ఆ కార్పోరేషన్ పేరు మీద అప్పులు చేస్తున్నారని వైసీపీ ఎంపీ ఆరోపించారు.
అమరావతి రైతులు తమ సమస్యల్ని ప్రభుత్వానికి తెలిసేలా చేయాలని తలపెట్టిన మహాపాదయాత్ర జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.