జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో గ్యాంగ్ రేప్.. రేవంత్ సంచలన ఆరోపణ.. విష్ణు ఖండన

 తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ రేప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం గురించి మాట్లాడిన బిజెపి నాయకులు హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలొ గ్యాంగ్ రేప్ జరిగితే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎఐంఎం నాయకుల పిల్లలు పెద్దమ్మతల్లి గుడి ప్రాంగణంలో గ్యాంగ్ రేప్ కు పాల్పడితే హిందూ మతానికి వారసులుగా చెప్పుకునే బిజెపి నరాయకులు పల్లెత్తు మాట అనలేదనీ, కంటే దుర్మార్గం వుంటుందా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఎలాంటి ఉప ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయ లబ్ధి ఉండదు కనుకే  బిజెపి నాయకులు ఈ రేప్ కేసు గురించి పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ ఆరోపణలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో సంచలనానికి వేదికయ్యాయి. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేత, దివంగత పీజేఆర్ కుమారుడు పి. విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను విష్ణువర్ధన్ రెడ్డి  ఖండించారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆ దారుణం జరిగిందంటూ అసంబద్ధంగా మాట్లాడటం సరికాదని, పవిత్ర ఆలయంపై అసత్యాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ ఏసీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  వివరాలిలా ఉన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట   జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన ఆరోపణలు చేశారు. పెద్దమ్మ గుడి ప్రాంగణంలోనే బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపించారు. హై ప్రొఫైల్ కేసు అయినప్పటికీ ఈ విషయంలో బీజేపీ నేతలు మౌనం వహించడానికి కారణమేమిటని నిలదీశారు. అయితే ఈ విషయంలో బీజేపీ నేతల నుంచి ఎటువంటి స్పందనా రాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోపణలు సత్యదూరమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం ఛైర్మన్‌గా ఉన్న  విష్ణువర్ధన్ రెడ్డి  పెద్దమ్మ గుడిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని  స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా ఇష్టారీతిన మాట్లాడితే సొంత పార్టీ వారినైనా సహించేది లేదని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు.  జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి.. పీసీసీ చీఫ్‌పై ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. 

వంగవీటి రాధాకు బీజేపీ గాలం?

ఉత్తరాదిలో ఒక వెలుగు వెలుగుతున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా స్థానం సంపాదించుకోడానికి చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహం లేదు. ఉత్తరాది నేతల చేతుల్లో ఉండే పార్టీగా పేరు పడిన బీజేపీ దక్షిణాదిలో ఒక్క కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణలో పాగా వేసేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు తరచూ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉనికే నామమాత్రం అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా బీజేపీ నేతలు ఏపీని కూడా ఎలాగైనా చిక్కించుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రేశ్ ను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని విభజిత ఏపీ ప్రజలు నిట్ట నిలువునా పాతేశారు. అలాగే ఏపీ విభజనకు తోడ్పడి, ఆ తరువాత రాష్ట్రానికి రావలసిన విభజన హామీలకు ఎగనామం పెట్టిన  బీజేపీ అన్నా కూడా ఆంధ్ర ప్రజలలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అందుకే బీజేపీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏపీలో విజయం సాధించిన దాఖలాలు దాదాపు మృగ్యం. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా బీజేపీకి ఏమీ ఒరగలేదు. తర్వాత అదే సామాజికవర్గానికే చెందిన సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించినా బీజేపీ పెద్దల పాచిక పారలేదు. ఎన్ని రకాల పిల్లి మొగ్గలు వేసినా బీజేపీ ఆటలు ఏపీలో అరటిపండు మాదిరిగానే మిగిలిపోయాయి(ఆటలో అరటి పండు).  ఈ నేపథ్యంలోనే బీజేపీ మరో  కొత్త వ్యూహానికి పదును పెట్టినట్లు సమాచారం.  ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలు, తరగతుల్లోని నాయకులకు తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ఏదో ఒక మేరకు ప్రభావితం చేయగల కాపు సామాజికవర్గం ఓట్లను వచ్చే ఎన్నికల నాటికి   అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వివిధ మార్గాల్లో యత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గంలో బలీయమైన మద్దతు ఉన్న వంగవీటి రాధాకు తాము అనుకూలమనే సంకేతాలు బీజేపీ నేతలు పంపుతున్నారు. దివంగత కాపు నేత వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ఆ సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉందనేది నిస్సందేహం. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధా  అంతకు ముందు   కాంగ్రెస్ పార్టీలో,  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో చేరి, అదే పార్టీలో కొనసాగుతున్నారు.  టీడీపీలో వంగవీటి రాధా ఉన్నప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో అప్పుడప్పుడు వినవస్తుంటాయి. టీడీపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి తనకు ఉన్నట్లు ఏనాడూ రాధా స్వయంగా బయటికి చెప్పలేదు. అయినప్పటికీ వంగవీటి రాధాను తమ వైపు తిప్పుకుని కాపు సామాజికవర్గం ఓట్లను రాబట్టుకోవాలనే యోచనతో బీజేపీ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ రాజకీయ వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‘వంగవీటి రాధా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టం. టీడీపీలో ఉన్నానని రాధా చెబుతున్నా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ వస్తుందనే గ్యారంటీ లేదు. అందుకే రాధా మా పార్టీలోకి వస్తే.. ఆయన భవిష్యత్తు బాగుంటుంది’ అని విజయవాడలోని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కూడా రాధా ప్రొఫైల్ గురించి వాకబు చేసినట్లు చెబుతున్నారు. రాధాయే గనుక బీజేపీలోకి వస్తే.. ఆయన కోరుకున్న స్థానంలో పార్టీ టిక్కెట్ ఇప్పించే బాధ్యత సోము వీర్రాజు తీసుకున్నారంటున్నారు. ఈ విషయమే రాధాకు ఏదో ఒక విధంగా చేరవేసి, ఆయనను బీజేపీలో చేర్చుకునే యత్నాలు మొదలయ్యాయని సమాచారం. బీజేపీ యత్నాలు సఫలమై, ఆ పార్టీలో రాధా చేరితే.. ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందో చూడాలి మరి.

నేరాల్లోనూ నెంబర్ వన్

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం .. అన్నిట్లోనూ తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్ ...ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు తెరాస నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రతి రోజు పలికే పలుకులే ఇవీ. ఈ పలుకుల్లో ఎంత  నిజముంది, ఏమిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ విషయాన్ని అలావుంచి, అసలు విషయంలోకి వస్తే, రాష్ట్రంలో  నేరాల సంఖ్య దినదిన ప్రవర్థమానంగా, దిగ్విజయంగా ముందుకు దూసుకు పోతోంది. దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా, ఎక్కడ ఏ ఉగ్రవాద ఘాతుకం జరిగినా దాని మూలాలు హైదరాబాద్’లో తేలడం మొదటి నుంచి ఉన్నదే.. అయితే ఇప్పడు, ఇదీ అదీ అని కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయినా, అంతర్జాతీయా కాసినో కుంభ కోణమే అయినా, ఇంకో ఆర్థిక నేరం అరాచకం ఏదైనా అన్నిని మూలాలు హైదరాబాద్’ లోనే తేలుతున్నాయి.  అదలా ఉంటే, గడచినా మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఎవరో కాదు, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. ఎన్సీఆర్బీ నివేదిక  ప్రకారం రాష్ట్రంలో 2020లో 1 లక్షా 47 వేల 504 నేరాలు నమొదయితే, 2021లో  1 లక్షా ,58 వేల 809 నేరాలు నమోదయ్యాయి. హత్యలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు, వృద్ధులపై దాడులు, సూసైడ్స్‌‌‌‌ పెరిగాయని ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ వెల్లడించింది. గతేడాది 21,315 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 7,447 మంది మృతి చెందారు. రోజూ 20 మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో గతేడాది 10,171 మంది సూసైడ్ చేసుకోగా అందులో కుటుంబ కలహాలు, అనారోగ్యంతో సూసైడ్‌‌‌‌ చేసుకున్న వారి సంఖ్య 4,464. ఇందులో 45 నుంచి-60 ఏండ్ల వారే ఎక్కువ‌యంతగా ఉన్నారు. ఆత్మహ‌‌య త్యల్లో దేశంలోనే మొద‌ేసుటిస్థానంలో మ‌ ో హారాష్ట్ర నిల‌ంచ వ‌ గ గా త‌ జ మిళ‌152నాడు, ఎంపీ, బెంగాల్‌‌‌‌, క‌్మ ర్నాట‌యల క, తెలంగాణ  త‌్థార్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2020లో 802 హత్యలు జరిగితే 2021లో ఆ సంఖ్య 1,026కు పెరిగింది. ఇక కిడ్నాపులు 2,056 నుంచి 2,760కు పెరిగాయి. మహళలపై దాడుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020లో 17,791గా నమోదైతే.. 2021లో అది 20,865కు చేరింది. చిన్నారులపై దాడులు కూడా 4,200 నుంచి 5,667కు పెరిగాయి. సో .. ముఖ్యమంత్రి మొదలు తెరాస చోటామోటా నాయకులవరకు, ప్రతి ఒక్కరూ, ప్రతి రోజు ‘మేమే నెంబర్ వన్’ అని చెప్పుకోవడం తప్పు కాదని, అనుకోవచ్చునో ఏమూ ..

తెలుగు వాడ‌కం త‌గ్గిందా?

వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాతి గిడుగు రామ్మూర్తి  జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... తెలుగు సాహిత్యాన్ని సరళీక రించి, తెలుగుభాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు తెలుగు భాషా సంస్క ర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారంటూ సీఎం జగన్  ట్వీట్ చేశారు. తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజంలో మార్పు తేవడానికి.. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో.. అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంతే కృషి చేశారు. వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపు కోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగు లో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచే స్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తు న్నారు. ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువు తున్నా రని లెక్కలు కూడా తెలియజేస్తున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాల్లో పర భాష పదాల వాడుక పెరిగిపోతున్నది.  ఇలాగే కొనసాగితే ,  తెలుగు వాడుకలో తగ్గిపోయి, ఆంగ్లం మాతృభాషగా మారే ప్రమాదము న్నది. ఐక్య రాజ్య  సమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మా నంలో ప్రపంచంలోని  ఆరువేల‌ భాషలలో 3వేలు కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయా ళం మిగులుతాయని  భాషా నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు.  కాలానుగుణంగా సామాజిక‌, రాజ‌కీయ‌,సాంకేతిక ప‌రిణామాల అనుస‌రించి భాష‌లో కొన్ని కొత్త ప‌దాలు వ‌చ్చి చేరాయి. సాంకేతిక అభివృద్ధి ప‌థంలో భాషా వినియోగం కాస్తంత త‌గ్గుముఖం ప‌ట్టింది. ఇది తెలుగు ప్ర‌జ‌లు ఆశించ‌ద‌గిన‌ది కాదు. మాతృభాష‌లో మాట్లాడ‌టం నామోషీగా భావించే రోజులు రావడం విచారక‌రం. ఆంగ్ల‌మాధ్య‌మాల హ‌డావుడి, ఆంగ్ల‌భాషా వాడ‌కం మితిమీరిపోవ‌డంతో తెలుగు మాట్లాడే వారు ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంగ్లం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూప‌డం వ‌ల్ల తెలుగును కాద‌న‌డం, తెలుగు మీడియాకు ఆద‌ర‌ణ త‌గ్గ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఇది వాస్త‌వానికి ఆశించ ద‌గ్గ ప‌రిణామం కాద‌ని విమ‌ర్శ‌కుల మాట‌. 

ఏపీలో గణేష్ మండపాల నుంచి ప్రభుత్వ వసూళ్లు

ఏపీ ప్రభుత్వం గణేష్ మండపాల నిర్వాహకుల నుంచి వసూళ్లు ఆరంభించింది.  కరెంట్ చార్జీలు, సౌండ్ బాక్స్లు, మండపాల సైజుల వారీగా భారీగా వడ్డించింది. అనుమతులు కావాలంటే సొమ్ములు చెల్లించకతప్పదని ఖరాకండీగా చెప్పేసింది. అన్నీ చేసినా కూడా చివరికి రాజకీయ ప్రత్యర్థులు అంటే తెలుగుదేశం వారి మండపాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్లు కేవలం హిందూ పండుగలకే ఎందుకు అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇది హిందూ పండుగలపై ఏపీ సర్కార్ చేస్తున్న దాడిగా ప్రకటించి.. ఎలాంటి రుసుమూ చేసుకోకుండానే మండపాలు ఏర్పటు చేసుకోవాలని పిలుపు ఇచ్చింది.  వివాదం పెద్దది అవుతుండటం, ఎక్కడికక్కడ జనం తిరగబడుతుండటంతో ఏపీ సర్కార్ ప్లేట్ ఫిరాయించింది.  గణేష్ మండపాల నుంచి ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని, అదంతా దుష్ప్రచారమేనని ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. అయితే ఇదంతా దుష్ప్రచారమే అయితే, పండుగ రెండు  రోజుల ముందు వరకూ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మండపాల నిర్వాహకులు నిలదీస్తున్నారు. ఇప్పట వరకూ చేసిన వసూళ్ల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు.  నిజానికి ఏపీలో గణేష్ మండపాలు పెట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డామనీ, సర్కార్ హుకుం మేరకు అడిగినంతా చెల్లించామనీ, తీరా ఇప్పుడు పండుగ రెండు రోజులలో ఉందనగా రుసుములేమీ అవసరం లేదంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకోవడమేమిటని జనం నిలదీస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఈ సారి పండుగ సందడే కనిపించడం లేదనీ, ఇందుకు ప్రభుత్వ తీరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండపానికి రోజుకు మండపం సైజును బట్టి కనీసం వేయి రూపాయలు చెల్లించాల్సిందేనని అధికారులు ఖరాకండీగా చెప్పారని స్థానికులు అంటున్నారు.  

ఈడీ, సీబీఐ పొంచి ఉన్నాయ్ తస్మాత్ జాగ్రత్త!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్రమత్తమయ్యారు. తాను అప్రమత్తం కావడమే కాకుండా పార్టీ నేతలనూ అప్రమత్తం చేస్తున్నారు. అదేదో మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనో లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రజావ్యతిరేకతను అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలపైనో కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు విషయంలో. రాష్ట్రంలో తెరాస అగ్రనాయకత్వం, నాయకులే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ చాలా కీన్ గా పరిశీలిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఆప్రమత్తమయ్యారు, పార్టీ నేతలనూ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఈడీ, సీబీఐలు అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాయి. ఏదో తీగే కదా లాగుతున్నాయి అని పట్టీపట్టనట్టు ఉంటే డొంకలు కదిలే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఈడీ సీబీఐ దాడులు, వాటి వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన సమీక్షంచారు. ఎర్రవల్లిలోని పాంహౌజ్ లో నిర్వహించిన సమావేశంలో  ఈ మేరకు ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో సమావేశం నిర్వహించారని పార్గీ వర్గాలు తెలిపాయి. సీబీఐ,  ఈడీ, ఐటీ విభాగాలు హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేపడుతున్న విషయాన్ని ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఎండగడుతున్ననేపథ్యంలో గులాబీ నేతలు ఎక్కడ దొరుకుతారా కేసులు పెడదామా అని మోడీ ప్రభుత్వం కాచుకొని కూర్చుందని కేసీఆర్‌ ఈ భేటీలో పార్టీ నేతలను హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తుండటాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు తెలిసింది.  ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన ప్రతిఒక్కరు, ప్రజాప్రతినిధులు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్‌ హెచ్చరించినట్లు చెబుతున్నారు.   అవినీతి, అవకతవకలు, కుంభకోణాల్లో ఇరుక్కో వద్దని, తద్వారా అనవసర ప్రచారాలకు, చెడ్డ పేరుకు తావు ఇవ్వొద్దంటూ ముఖ్యమంత్రి  హెచ్చరించారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. పాదయాత్రలో ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేయటం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల తలెత్తిన సంఘటనలను సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ఉటంకించినట్లు సమాచారం.  గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ నాయకులు మతం పేరుతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ తన సన్నిహిత వర్గాల వద్ద పేర్కొన్నట్లు చెబుతున్నారు.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలుచేసిన పలు ఆదర్శవంతమైన విధానాల వల్ల దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెరిగాయని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతున్నాయని ఆయన చెప్పారని సంబంధిత వర్గాలు అన్నాయి. ఈ ప్రగతిని కాపాడుకోవాలని పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.

విమ‌ర్శించే ముందు అభివృద్ధిని గ‌మ‌నించండి... మంత్రి ద‌యాక‌ర్‌

అవ‌త‌లివారు  ప్ర‌శాంతంగా ఉండ‌కూడ‌ద‌ని కోరుకుంటే ఎన్ని అడ్డంకులైనా సృష్టిస్తారు. దానికి సామా జిక, రాజ‌కీయాల‌నే వ్య‌త్యాసం ఉండ‌దు. ఎలాంటి స‌మస్యా లేని చోట కూడా ఉంద‌ని భ్ర‌మింప‌ చేసి, గొడ‌వ‌లు సృష్టించి విభేదాలు తేవ‌డం వారికి మించిన‌వారుండ‌రు. ఆ కోవ‌కి చెందిన‌వారే బీజేపీ నాయ‌కుల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది. బీజేపీ కావాల‌నే ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని టీఆర్ ఎస్ మండిప‌డుతోంది. తెలంగాణా అభివృద్ధి బాట‌లో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంద‌న్న అభిప్రాయాలు తెలంగాణాలో ప్ర‌చారంలో ఉన్నాయి. త‌మ అభి వృద్ధికి ఓర్వ‌లేకే బీజేపీ, కాంగ్రె స్ లు  విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ఆగ‌ష్టు 29 సోమ‌వారం  రాయపర్తి మండలం కొండూరులో 14 కోట్ల50 లక్షలతో చేపట్టిన పలుఅభివృద్ది పనులను ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణా ప్ర‌భుత్వంమీద విమ‌ర్శ‌లు చేసే ముందు అభివృద్ధిని ని ప‌రిశీలించాల‌ న్నారు.  అస‌లు తెలంగాణాలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమ‌ల‌వు తున్న‌దీ లేని దీ తెలుసుకోవాల‌ని అన్నారు.   బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావద్దని ప్ర‌జ‌ల‌కు హిత‌వు ప‌లికారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తుంటే.. రైతుల నడ్డి విరిచేలా బీజేపీ కుట్రలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమి దేళ్ల కేసీఆర్  పాలనలో తెలంగాణ అభివృద్ది చెందుతుందని తెలిపారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 

జాబిల్లి రాదు.. మనమే వెల్దాం!

అర్ధ శతాబ్బం తరువాత మళ్లీ చంద్రునిపై మనుషులు అడుగు పెట్టేందుకు తొలి అడుగు పడిందివ. తర్వాత చంద్రునిపై మళ్లీ  ఆర్టెమిస్‌-1 మిషన్‌లో భాగంగా   నాసా మూన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెడుతోంది. చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగు పెట్టి ఏభై ఏళ్లు దాటింది.   1969లో అమెరికాకు చెందిన   నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ తొలిసారిగా చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్‌ ద్వారా 24 మందిని నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలు మోపారు. అంతే ఆ తరువాత ఆ తర్వాత ఎవ్వరు ఇంత వరకూ చంద్రుని మీద అడుగు పెట్టలేదు.  నాసా అపోలో 17 మిషన్‌కు 2022 డిసెంబర్‌తో  ఐదు దశాబ్దాలు  పూర్తవుతాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుట్టింది. ఈసారి మూన్ మిషన్‌కు  ఆర్టిమిస్ ప్రోగ్రామ్  అని నామకరణం చేసింది.   

ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవల్ సోమవారం (ఆగస్టు 29) అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న అమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల మధ్య కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికీ బీజేపీ రూ. 20 కోట్లు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. సంతలో పశువుల్లో కొనుగోలుకు బీజేపీ సిద్ధపడినా.. తమ పార్టీ వారెవరూ అందుకు సిద్ధంగా లేరన్న కేజ్రీవాల్.. ఆ విషయాన్ని రుజువు చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న్ట్లట్లు పేర్కొన్నారు. అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మహాత్మా గాంధీ స్మారక రాజ్‌ఘాట్‌లో ప్రార్థనలకు నాయకత్వం వహించారు, ఆ తర్వాత ఢిల్లీలోని ఆప్‌కి చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో 53 మంది ఆయన నివాసంలో సమావేశానికి హాజరైన సంగతి విదితమే.  రాజ్‌ఘాట్‌ను సందర్శించిన అనంతరం కేజ్రీవాల్ ఆప్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు  బీజేపీవారు లంచం ఇచ్చి తమ పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నరనీ, అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ దుష్టపన్నాగాలకు లొంగకుండా నిలిచినందుకు  గర్వపడుతున్నాననీ పేర్కొన్నారు.   బీజేపీ ఆపరేషన్ కమలం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం కుట్ర పన్నిందని కేజీవాల్ ఆరోపించారు. తాను ఆప్‌ని వదిలేసి కమలం గూటికి చేరితే తనపై ఉన్న అన్ని కేసులను మూసివేస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు, అవినీతికి సంబంధించిన కేసులో సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మంది నిందితుల జాబితాలో సిసోడియా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.    2024 సార్వత్రిక ఎన్నికలు మిస్టర్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య పోటీ అని ఆప్ పేర్కొంది. విద్యారంగంలో చేసిన సేవలకు గానూప్రజాదరణ పొందుతున్న ఆప్ నాయకుడిని ఆపడానికి బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆమ్‌ ఆద్వీ పార్టీ ఆరోపించింది.   

ఎన్డీఏ, టీడీపీ క‌ల‌యిక ఖాయం...ర‌ఘురామ‌రాజు

ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేం పార్టీ మ‌రోసారి జ‌త‌క‌ట్టే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. ఎన్డీఏ లో టీడీపీ చేరికపై జాతీయ  మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే, గ్రౌండ్‌ ప్రిపరేషన్‌ మొత్తం జరిగిపోయిందని, చేరికపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందనే రీతిలో వార్తలు వినిపిస్తు న్నాయి. తాజాగా ఢిల్లీలో వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, ఒక ఉపద్రవం వచ్చినప్పుడు రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని, రాష్ట్రంలో అది జరుగుతుందని విశ్వసిస్తున్నాన‌ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.  ప్రధాని  మోదీని టీడీపీ అధినేత చంద్రబా బు కలిసి మాట్లాడడం శుభ పరిణామం. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కలిసినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ పరిశీ లిస్తే ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే త‌మ  పార్టీకి నష్టమ‌ని  ఆయ‌న అన్నారు.  సీఎం జగన్‌ విచారణ కోసం కోర్టుకు హాజరు కావలసిన అవసరం లేదని హైకోర్టు తీర్పును ఇవ్వడాన్ని తప్పుపట్టారు. చట్టం ముందు అందరూ సమానమే అని తాను ఇప్పటివరకూ నమ్మూతూ వచ్చినది నిజం కాదని తెలిసిందన్నారు. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్తుందో లేదో చూడాల న్నారు. త‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టుగా  సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉన్నదేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు టీడీపీ-ఎన్డీఏ మధ్య కొత్త పొత్తు పొడుస్తుందా లేక పాత పొత్తు కొనసాగుతుందా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడారు.  కాని, ఎవరికీ తెలియని  విషయం ఏంటంటే.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా మాట్లాడారని  వార్త ఇచ్చింది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పై  రెండు పార్టీలు ఒక  అవగాహనకు వచ్చాయని, ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి. బీజేపీకి టీడీపీ  క్రమంగా దగ్గరవుతోందంటూ  ఇప్పటికే ఏపీ రాజకీయాల్లోనూ, అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది.  ఈ కథనాలకు బలాన్నిస్తూ, ఈ మధ్య  మునుగోడు సభకు  వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా  వెళ్తూ వెళ్తూ హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు, ఎన్టీ ఆర్‌ను  ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఇవన్నీ టీడీపీ-ఎన్డీఏ పొత్తు గురించి జరిగినవే నన్న చర్చ జరుగుతోంది. అమిత్‌షాతో రామోజీరావు, ఎన్టీఆర్‌ మధ్య జరిగిన సమావేశంలో ఏపీ రాజకీ యాలపైనే ప్రధా న చర్చ జరిగిందని తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు సైతం మాట్లాడుకుం టున్నారు.

బుద్ధి లేని అమ్మాయి.. ఆమె ప్రియుడిపై ప్రజాధనం వృధా కేసు

భర్తతో వెళ్లి విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. కోటి ప్రజాధనం వృధాకు కారణమయ్యారంటూ కేసు పెట్టారు.  సాయిప్రియ, రవితేజపై ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్‌గార్డ్‌, పోలీసుల సమయం వృథా అయ్యిందంటున్నారు పోలీసులు. మరోవైపు, తనకు భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు దిగాలనుకున్నారు త్రీటౌన్‌ పోలీసులు. అసలు విషయమేమిటంటే.. విశాఖ‌ప‌ట్నానికి చెందిన 21 ఏళ్ల సాయిప్రియకు 2020లో వివాహమైంది. భ‌ర్త శ్రీ‌నివాస‌రావు హైద‌రా బాద్‌లో ఒక ఫార్మాకంపెనీలో ప‌నిచేస్తున్నాడు. త‌మ మ్యారేజ్ యానివ‌ర్స‌రీ జ‌రుపుకోవ‌డానికి అత‌ను విశాఖ వెళ్లా డు. ఆరోజు సాయింత్రం అలా బీచ్‌కీ  తీసికెళ్లాడు. బీచ్ అన‌గానే స‌ర‌దాగా గ‌డ‌ప‌డ‌మే క‌దా.  ఏవో నాలుగు క‌బుర్లు, రెండు ఐస్క్రీమ్ ల‌తో  సాయింత్రం గ‌డిపేయ‌చ్చ‌ని, మాట్లాడుకోవ‌చ్చ‌ని వాళ్లి ద్ద‌రే వెళ్లారు. కొంత సేప‌టికి  శ్రీ‌నివాస్‌కి  ఫోన్ వ‌చ్చి కొద్దిగా అవ‌త‌ల‌కి న‌డుస్తూ ఫోన్ మాట్లాడాడు. అయి పోయి  వెనక్కి తిరిగి చూస్తే భార్య సాయిప్రియ  క‌న‌ప‌డలేదు. రాకాసి అల లాక్కెళ్లిందేమో అని భ‌య‌ప‌డ్డాడు. బీచ్ అంతా  క‌ల‌య తిరి గాడు. కానీ ఎక్క‌డా ఆమె జాడ లేదు. అంతే అక్క‌డి పోలీసులు రంగంలోకి దిగారు. అంతా  వెతికినా వారికీ క‌నిపించ‌లేదు. ఏకంగా శ్రీ‌నివాస్ నే  కొంత‌మంది అనుమానించారు.  యావ‌త్ విశాఖ ఖంగారెత్తింది.  శ్రీ‌నివాస్ అత్తింటివారు, స్నేహితులు జ‌ల్లెడ ప‌ట్టినా ఆ అమ్మాయి చున్నీ కూడా దొర‌క‌లేదు. ఇదేం మాయ‌రా నాయ‌నా అని అనుకున్నారు. బాద‌పడ్డా రు. అంత‌లో ఒక‌వేళ నిజంగానే ఏదో పెద్ద అలా స‌ముద్రంలోకి లాక్కెళ్లిందేమోన‌ని సందేహాలు వ్య‌క్త‌మ య్యాయి. చాలామంది అదీ జ‌ర‌గ‌వ‌చ్చ‌నుకున్నారు. అంతే వెంట‌నే భ‌ద్ర‌తాద‌ళాలు, హెలి కాప్ట‌ర్ల‌తో  సిద్ధ మ‌య్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లకూ ఇది మ‌రింత ఆసక్తిక‌ర అంశ‌మైంది. అమ్మాయి దొర‌క‌లేదు గాని కోటిరూపాయ‌ల ఖ‌ర్చు అయింది. ఆ త‌ర్వాత ఆ అమ్మాయి నుంచి వీడియో కాల్ వ‌చ్చింద‌ని అమ్మాయి తండ్రే పోలీసుల‌కు చెప్పారు. విష‌య‌మేమంటే, ఆమెగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ర‌వి అనే అబ్బాయిని విశాఖ‌లో ప్రేమించింది. అత‌నితో  బంగ‌ళూరులో ఉంది. అక్క‌డికి వెళ్ల‌డా నికి పెద్ద స్కెచ్ వేసింది. దానికి బ‌ల‌యింది శ్రీ‌నివాస్‌, త‌ల్లిదండ్రుల ప‌రువు.  ప్ర‌జాధ‌నం కోటి రూపాయ‌ ల ఖ‌ర్చు.  మ‌రో షాకింగ్ సంగ‌తేమిటే, ఆ రోజు బీచ్‌కి స‌ద‌రు ప్రేమికుడు కూడా రావ‌డం!  అంతా తెలిసిన తరువాత పోలీసులు ఇప్పుడు సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.

పాక్‌ను బెంబేలెత్తించిన పాండ్యా.. ఆసియాక‌ప్ లో భార‌త్ విజ‌యం

ఆసియాక‌ప్ అన‌గానే ఉత్కంఠ‌భ‌రిత దాయాదుల పోరే ఆశిస్తారు ప్ర‌పంచ క్రికెట్ వీరాభిమానులంతా. స‌రిగ్గా అంతే పోటాపోటీగా జ‌రిగిన ఆసియాక‌ప్ 2022 గ్రూప్-ఏ  రెండ‌వ మ్యాచ్‌లో పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో భార‌త్ సునాయాస విజ‌యం సాధిం చింది. ఈ మ్యాచ్‌ లో మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకు న్నాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. అతని నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపిం చా రు. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ‌ర్‌గా స‌త్తా చాట‌డంలో పాకిస్తాన్‌కు చుక్క‌లు చూపించాడ‌నాలి. కింగ్ కోహ్లీ, ర‌వీంద్ర‌జ‌డేజా, భువనేశ్వ‌ర్కుమార్‌, పాండ్యా లు న‌లుగురు పాకిస్తాన్‌కు ఊహించ‌ని ప్ర‌ద‌ర్శ‌న‌తో బెంబే లెత్తించారు.  తొలుత బ్యాటిం గ్ చేసిన పాక్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ప‌ది నెల‌ల క్రితం ఇక్క‌డే ఈ వేదిక మీద‌నే ప‌ది వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఓడిన భార‌త్ ఇపుడు ప‌గ‌దీర్చుకుంద‌నాలి. టాప్ ముగ్గురు బ్యాటర్లూ అంత‌గా రాణించలేక కేవ‌లం 18 ప‌రుగుల‌కే వెనుదిరిగి పాక్ కి ఆనందం క‌లిగించారు. వారిలో గెలుస్తామ‌న్న ధీమా వారి కొత్త పేస‌ర్ క‌లిగించాడు. ముఖ్యంగా మొద‌టి ఓవ‌ర్ రెండో బంతికే కే.ఎల్ వికెట్ కోల్పోవ‌డం భార‌త్‌కు నిరాశ‌క‌లిగించిన మాట వాస్త‌వ‌మే. టాప్ఆర్డ‌ర్ చెప్పుకోద‌గ్గ స్వేచ్ఛ‌తో ఆడ‌లేక పోయినా మిడిల్ ఆర్డ‌ర్‌, చివ‌ర‌గా వ‌చ్చిన‌వారంతా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఎంతో స్వేచ్ఛ‌గా త‌న అనుభవాన్ని, ఆట‌లో చురుకుద‌నాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంలో పాక్ బౌల‌ర్ల‌కు, ఫీల్డ‌ర్ల‌ను ఖంగారెత్తించాడు. పాండ్యా 33 ప‌రుగులు మెరుపు వేగంతో చేయ‌డం, చివ‌రిగా ఒక అద్భుత సిక్స్ కొట్టి విజ‌యాన్ని అందించ‌డం .. అంతా ధోనీని త‌ల‌పించాడు.  విరాట్ 34 బంతుల్తో 35 ప‌రుగులు చేసి త‌న పాత ఫామ్‌లోకి వ‌చ్చి అంద‌రినీన ఎంతో ఆక‌ట్టుకున్నాడు. అత‌ను క్రీజ్‌లో ఉన్నంత‌సేపూ విజ‌యం అత‌నితోనే సాధ్య‌మ‌వు తుంద‌నుకున్నారు. కానీ 35 ప‌రుగులు మించి ప‌రుగులు చేయ‌లేదు. కానీ చాలా రోజుల త‌ర్వా త ప్రేక్ష‌కులు అత‌ని మెరుపు బ్య‌టింగ్ కి ఫిదా అయ్యారు. అయితే అంద‌రూ ఎంతగానో ఎదురుచూసిన  సూర్య కుమార్ (18)అంత‌గా రాణించ‌లేక‌పోయాడు. నసీమ షా క్లీన్ బౌల్డ్ చేశాడు. నసీమ్ డెలివరీని సరిగా అర్ధం చేసుకోలేక‌పోయాడు.  దీంతో భారత జట్టు 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. కానీ పాండ్యా ప్ర‌ద‌ర్శ‌న‌తో కోహ్లీ ప‌రుగుల ధాటిని ప్రేక్ష‌కులు అం త‌గా గుర్తుంచుకోరేమోన‌నిపించింది. కార‌ణం పాండ్యా అంత‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. 15వ ఓవర్‌ ముగిసే సరికి భారత్‌ కేవలం 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా, హార్దిక్ కలిసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నారు. 18వ ఓవర్‌లో నసీమ్ షా ఓవర్‌లో జడేజా ఒక ఫోర్, సిక్సర్ బాదగా, ఆ తర్వాతి ఓవర్‌లోనే హార్దిక్ మూడు ఫోర్లు బాది భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. అయితే చక్కటి ఇన్నింగ్స్‌ఆడిన జడేజా ఆఖరి ఓవర్ తొలి బంతికే అవుటయ్యాడు. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. అయితే హార్దిక్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. పాండ్యా ముందు బౌలింగ్‌లోనూ 25 ప‌రుగు లిచ్చి 3 వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను కూల‌దోయ‌డంలో భువ‌నేశ్వ‌ర్‌కు ఎంతో స‌హ‌కరించాడ‌నాలి.   పాక్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో మహమ్మద్‌ రిజ్వాన్ (43), ఇఫ్తికార్‌ అహ్మ ద్ (28) మాత్రమే రాణించారు. కోహ్లీతో స‌మాన‌ధీరుడుగా పేరున్న రిజ్వాన్ క్రీజ్‌లో ఉన్నంత‌సేపూ మెరుపు వేగంతో ప‌రుగులు సాధించాడు. దీంతో పాక్ భారీ స్కోర్ సాధిస్తుంద‌ని అంద‌రూ భావించారు. అత‌ని వికెట్ కోస‌మే భార‌త్ పేస‌ర్లు ఎదురుచూశారు. అర్ధ‌సెంచ‌రీకి ద‌గ్గ‌ర‌లో ప‌డిన రిజ్వాన్ ఊహించ‌నివిధంగా ఓ సిక్స్ కొట్ట‌బోయి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. వేగంగా స్కోర్ చేయ‌గ‌ల పాక్ ఓపెన‌ర్‌, కెప్టెన్ రిజ్వాన్ వెనుదిర‌గ‌డంతోనే భార‌త్ ప్లేయ‌ర్లు, ప్రేక్ష‌కుల్లో సంతోషం అంద‌లాన్ని దాకింది. పాక్ బ్యాట‌ర్ల‌లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఎవ‌రూ ఆక‌ట్టుకోలేక‌పోయారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో పోటాపోటీగా ఆట ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ పాక్ బ్యాట‌ర్లు జ‌ట్టు స్కోర్ 100 త‌ర్వాత అంత‌గా రాణించ‌లేక‌పోయారు. భార‌త్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన‌డంలో కొంత ఇబ్బందిప‌డ్డారు.

అక్టోబర్’లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

చివరాఖరుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూలు ఖరారైంది. ఈ రోజు (ఆదివారం) జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సి డబ్ల్యూసీ) సమావేశంలో ముందుగా అనుకున్నట్లుగానీ, ఎన్నికల షెడ్యూలు ఖరారైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 22న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ తేదీని ఖరారు చేసేందుకు భేటీ అయిన సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 19న ఫలితాల ప్రకటన ఉంటుందని  చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఎన్నికల షెడ్యూల్ను ఆమోదించారని వేణుగోపాల్ వివరించారు. సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య నామినేషన్లు సమర్పించవచ్చని వివరించారు. నామినేషన్లు సమర్పించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ అగ్రనేతలతో ఎన్నికల తేదీ ఖరారుతో పాటు పార్టీ చేపట్టదలచిన పలు కార్యక్రమాలపైనా సీడబ్ల్యూసీ చర్చించింది. ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన హల్లాబోల్ ర్యాలీని సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించనున్నట్లు వివరించింది. దీంతో పాటు, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని సీడబ్ల్యూసీ ఆకాంక్షించింది. ఎన్నికల తేదీ ఖరారు చేసేందుకు ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి.. సోనియా గాంధీ వర్చువల్గా హాజరయ్యారు. వైద్య పరీక్షల కోసం సోనియా విదేశాలకు వెళ్లారు. ఆమె వెంటే రాహుల్, ప్రియాంకా గాంధీలు వెళ్లారు. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి వర్చువల్గా భేటీకి హాజరయ్యారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జీ23 నేత ఆనంద్ శర్మ, కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, పీ చిదంబరం, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సహా పలువురు కీలక భేటీలో పాల్గొన్నారు.  అయితే, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ సందిగ్దత అలాగే, కొనసాగుతోంది. మరోవంక నెహ్రూ గాంధీ కుటుంబ వెలుపల వ్యక్తికి అధ్యక్ష పదవి అప్పగించేందుకు, రాహుల్ గాంధీ సుముఖంగా ఉన్నా, సోనియా గాంధీ మాత్రం పార్టీ పగ్గాలు ‘పరాయి’ చేతికి అప్పగించేందుకు సుముఖంగా లేరని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, దినదినప్రవర్తమనంగా దిగజారి పోతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సీనియర్ నాయకులు ఎవరైనా ముందుకు వస్తారా, అనేది అనుమానంగానే కనిపిస్తోందని అంటున్నారు.  కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికవ్వాలని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని పేర్కొన్నారు.'కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ నడిపించాలి.పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలి.కాంగ్రెస్ పార్టీని ఆయన ఏకం చేయగలరు. పార్టీని బలోపేతం చేసే సత్తా ఆయనకు ఉంది' అని ఖర్గే వ్యాఖ్యానించారు.

 ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో వై.ఎస్‌.భార‌తి పాత్ర‌... ఆనం

ఎంత దాచినా దాగ‌ని స‌త్యాలూ ఉంటాయి. పైకి ఎంత గంభీరంగా ఉన్నా చేసిన త‌ప్పులు ఏదో ఒక రూపంలో బ‌య‌ట‌ప‌డ‌కా త‌ప్ప దు. గోడ‌మీద పెద్ద నీడ ద‌గ్గ‌ర‌కి వెళితే చిన్న‌ద‌వుతుంది.  పెద్ద ప‌దవుల్లోనో, పెద్ద స్థాయిల్లోనో ఉన్నామ‌ని త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టిం చుకోర‌న్న ధైర్యంతో చేసే దుర్మార్గం బ‌య‌ట‌ప‌డ‌కా త‌ప్ప‌దు. దేశంలో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లింకులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి  వై.ఎస్‌. భార‌తి పాత్ర ఉంద‌న్న గుట్టు బ‌య‌ట‌ప‌డింది.  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో  సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి , ఎంపి విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని టిడిపి నేత ఆనం వెంకట రమణా రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  విజయసాయిరెడ్డితో ఆర్థిక సంబంధా లున్న పనాక శరత్ రెడ్డిని, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ విచారిస్తోందన్నారు.  తన లావాదేవీల కోసమే జగన్‌ దావోస్‌ వెళ్లారు. ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్‌ స్కామ్‌ జరుగుతోంది. ఆదాన్‌ అనే డిస్టిలరీ స్థాపించి ఎంపీ విజయసాయిరెడ్డి స్కామ్‌లు చేస్తున్నారు. ఢిల్లీలో తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్‌ పునాదులు కదులుతున్నాయి. జగతి పబ్లికేషన్స్‌కు, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు ఆర్థిక సంబంధాలు న్నా యి. క్విడ్‌ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కు ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కోట్లు మళ్లించింద‌ని ఆయన ఆరోపించారు.  అదాన్ డిస్టిలరీస్ ద్వారా అక్ర మంగా సంపాదించిన రూ.5 వేల కోట్ల సొమ్ము ను ఢిల్లీ స్కామ్‌లో ఉపయోగించినట్లు చెప్పారు. హైదరాబాదులో 19 కంపెనీలు ఒకే చిరునామాతో ఉన్నాయని వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయా కంపెనీల్లో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ డైరెక్టర్ గా ఉన్నాడని వెల్లడించారు. అవి జగన్, విజయసాయిల సూట్ కేసు కంపెనీలేనని  ఆనం ఆరోపించారు. రోహిత్ కంపెనీలో అదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. 2019లో అదాన్ డిస్టిలరీకి ఎవరు అనుమ తిచ్చారని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో రూ.2,400 కోట్ల మద్యం ఎలా అమ్మారని నిలదీశారు. ప్రభుత్వంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు గుప్పించారు.  ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్ స్కామ్ జరుగు తోందని ఆరోపించారు. ఆదాన్ అనే డిస్టిలరీ స్థాపించి ఎంపీ విజయసాయిరెడ్డి స్కామ్లు చేస్తున్నారని విమర్శించారు. జగతి పబ్లి కేషన్స్‌కు, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు ఆర్థిక సంబం ధాలున్నాయని ఆరోపించారు. క్విడ్‌ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కు ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కోట్లు మళ్లించిందన్నారు. విజయ సాయి రెడ్డితో ఆర్థిక సంబంధాలున్న పనాక శరత్‌రెడ్డిని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారిస్తోందని తెలిపారు. తన లావాదేవీల కోసమే జగన్ దావోస్‌ వెళ్లారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో వైఎస్ భారతి విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు

ఎందుకు వ‌స్తున్నారు?  రావ‌ద్దు..  వైసీపీ నేత‌ల‌పై తిర‌గ‌బ‌డిన‌  ప్ర‌జ‌లు

మంచిచేస్తే న‌లుగురూ చెప్పుకుంటారు, ఆద‌రిస్తారు. ప్ర‌జల మ‌ధ్య ఉండాల్సిన‌వారు ప్ర‌జావ్య‌తిరేకత‌ను ఎదుర్కొన‌డం క‌ష్టం. ప్ర‌జాభీష్టానికి త‌గ్గ‌ట్టు పాల‌న చేసిన‌వారికే ఆద‌ర‌ణ ఉంటుంది. అధికారంలో ఉన్నామ‌ని విర్ర‌వీగి, తోచిన‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌లు ఓట‌ర్లు లా కాకుండా తిర‌గ‌బ‌డతారు. ఎన్ని భ్ర‌మ‌లు పెట్టినా, ఎంత ఉచితాలు అందించినా, సంక్షేమ‌ప‌థ‌కాలు, ప్ర‌జారోగ్యం, రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ధి మాత్ర‌మే చివ‌ర‌కు ప్ర‌జాద‌ర‌ణ‌ను అందిస్తాయి. వీటిలో దేన్ని విస్మ‌రించినా, నిర్ల‌క్ష్యం చేసినా ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తారు. ప్ర‌జాహితం కోరుకునేవారు ప్రజాసంక్షేమాన్ని కోరుకోవాలి. పాల‌నాప‌ర నిర్ణ‌యాలు ప్ర‌జల‌కు ఏమాత్రం ప్ర‌యోజ నాన్ని క‌ల్పిస్తాయ‌న్న ఆలోచ‌న ఉండాలి. అన్ని అంశాల్లోనూ ప్ర‌జాశ్రేయ‌స్సును  దృష్టిలో పెట్టుకున్న‌వారినే ప్ర‌జ‌లు నాయ‌కు లుగా, దేవుళ్లుగానూ గుర్తిస్తారు. అంతే త‌ప్ప ప‌థ‌కాల‌పేర్లు మార్చి, ప్ర‌చారం చేసుకోవ‌డంతోనే కాలం గ‌డిపేస్తే, ప్ర‌జ‌లు వెర్రిగా వెన‌క‌నే ఉంటార‌నుకోవ‌డం శుద్ధ పొర‌పాటు.  ఏపీలో మూడేళ్ల పాల‌న పూర్తి అయిన త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నారంటే అర్ధం జ‌గ‌న్ పాల‌న అంత‌గా ఆక‌ట్టు కోలే ద‌న్న‌ది సుస్ప‌ష్టం. అన్ని రంగాల్లోనూ ప్ర‌జ‌ల‌ను ద‌రిచేర‌లేదు. కేవ‌లం విప‌క్షాన్ని తిట్టుకోవ‌డం, దాడులు చేయ‌డం త‌ప్ప ప్ర‌త్యే కించి రాష్ట్రంలో ఎలాంటి గొప్ప అభివృద్ధి ఈ మూడేళ్ల‌లో జ‌ర‌గ‌లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ప్ర‌జ‌లు కూడా జ‌గ‌న్ మీద ఎంతో న‌మ్మ‌క‌మే పెట్టుకున్నారు. ఇచ్చిన గొప్ప అవ‌కాశాన్ని చేజేతులా పాడుచేసుకున్నది వైసీపీ. ప్ర‌జాగ్ర‌హానికి గుర‌యిన నాయ‌కు లు, పార్టీలు భ‌విష్య‌త్తులో ఇబ్బందుల‌పాల‌వుతాయ‌న్న‌ది అనాదిగా గ‌మ‌నిస్తున్న‌దే. ఇపుడు వైసీపీకీ అదే ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ అంటూ ఒక కార్య‌క్ర‌మం పెట్టుకుని తాము చేసిన గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళుతున్నారు. కానీ ప్ర‌జ‌లు విన‌డం, ఆద‌రించ‌డం అనేది ఎప్పుడూ క‌నిపించ‌లేదు. ప్ర‌జ‌లు జ‌గ‌న్ త‌మ‌కు మోసం చేశాడ‌న్న అభిప్రాయంలో ఉన్నారు.  రాష్ట్రంలో తమ గ్రామాలకు వస్తున్న వైసీపీ నేతలపై స్థానికులు తిరగబడుతున్నారు. ఎందుకు వస్తున్నారని నిలదీస్తున్నారు. కుప్పం గ్రామానికి కాన్వాయ్‌లలో వచ్చిన వైసీపీ నాయకులను స్థానికులు తరిమికొట్టారు. ఏం చేశారని మళ్లీ వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు భద్రతగా వస్తున్న పోలీసులపై కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు రోజుల పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ శ్రేణులు గ్రామాల్లో తిరుగుతూ టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, బ్యానర్లు , ఫ్లెక్సీలు చించివేడం లాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. కుప్పంలో అన్నా క్యాంటిన్‌పై దాడులు చేసి, ర్యాలీలు నిర్వహించి బీభీత్సం సృష్టించిన విషయం విధితమే. 

స్వ‌రాజ్ సీరియ‌ల్ చూడండి... మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని

దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న స్వరాజ్ సీరియల్‌ను చూడాలని ప్రజలను కోరారు. స్వాతంత్ర్య సమర యోధుల జీవిత విశే షాలను, వారు చేసిన త్యాగాలను ఈ సీరియల్‌లో చూపిస్తున్నారని తెలిపారు. అమృత మహోత్సవాల అమృత ధార దేశం నలు మూలలా ప్రవహిస్తోందన్నారు. అమృత స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మన దేశ సమష్టి బలాన్ని మనం చూడ గలిగా మనితెలిపారు.  ప్రతినెలా ఆయన నిర్వహించే ‘మన్ కీ బాత్’రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆఆయన మాట్లా డారు.  భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమం ఘన విజయం సాధించిందని చెప్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమృత స్వాతంత్ర్య మహోత్సవాలను ఇతర దేశాల్లో కూడా నిర్వహించారని తెలిపారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు సైతం జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు.  సెప్టెంబరు నెలను పోషణ మాసంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. పోషకాహార లోపా నికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలని చెప్తూ, సెప్టెంబరు నెలను పోషకాహార మాసంగా జరుపుకోవాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అమృత సరోవరాల నిర్మాణం సామూహిక ఉద్యమంగా మారింద న్నారు. దేశ వ్యాప్తంగా ప్రశంసనీయమైన కృషి జరుగుతోందని చెప్పారు.  మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం 2014 అక్టోబరు 3న ప్రారంభమైంది. ప్రతి నెలా చివరి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని మోదీ కోరారు. ప్రజలు న మో యాప్ ద్వారా కానీ, 1800-11-7800 నెంబరుకు ఫోన్ చేసి కానీ తమ అభిప్రాయాలను, సలహాలను తెలియజేయవచ్చు. 

పేకమేడ‌లా కూలిన  నోయిడా ట్విన్ ట‌వ‌ర్స్‌ 

ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ ట్విన్ టవర్స్‌ను ఆదివారం  విజయవంతంగా కూల్చివేశారు. జంట టవర్లు క్షణాల్లో కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున ధూళి విరజిమ్మింది. న‌ల‌భ‌యి అంతస్తుల ట్విన్ టవర్స్.. నాలుగు టన్నుల మందు గుండు.. కేవలం తొమ్మిది  సెకన్లలో నేలమట్టం! అవును  ఇది నిజమే. కానీ సినిమా సీన్ త‌ల‌పించింది.  నోయిడాలో ఉన్న సూపర్‌ టెక్‌ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్‌ కోర్ట్‌ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను కేవలం 9 సెకన్లలో నేలమట్టం చేస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ భవనాలను మే 22 నాటికి కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీం కోర్టుకు ఇటీవల తెలియజేసింది. సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ హౌసింగ్ సొసైటీని మొదట మంజూరు చేసినప్పుడు, బిల్డింగ్ ప్లాన్‌లో 14 టవర్లు, తొమ్మిది అంతస్తులు చూపించారు. తరువాత, ప్లాన్ సవరించారు.  ప్రతి టవర్‌లో 40 అంతస్తులను నిర్మించడానికి బిల్డర్‌ను అనుమతించారు. అసలు ప్లాన్ ప్రకారం టవర్లు నిర్మించిన ప్రాంతాన్ని ఉద్యానవనంగా మార్చాలి. దీంతో సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు సొసైటీ నివాసితులు 2012లో ఈ నిర్మాణం అక్రమమని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. సూపర్‌టెక్ గ్రూప్ మరిన్ని ఫ్లాట్లను విక్రయించడానికి, వారి లాభాల మార్జిన్‌లను పెంచుకోవడానికి నిబంధనలను ఉల్లంఘించిందని పిటిషనర్లు వాదించారు. దీని ప్రకారం, ఆర్డర్ దాఖ లు చేసిన తేదీ నుండి నాలుగు నెలల్లో (సొంత ఖర్చుతో) టవర్లను కూల్చివేయాలని 2014లో కోర్టు అథారిటీని ఆదేశించింది. ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. గత ఆగస్టులో, కోర్టు టవర్లను కూల్చివేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది ఒక సంవత్సరం పట్టింది. నోయిడా అధికారులతో కుమ్మక్కై బిల్డర్ భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని సుప్రీంకోర్టు పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ గృహ కొనుగోలు దారులు సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. నిర్ణీత సమయానికి డిటొనేషన్ బటన్‌ను నొక్కిన వెంటనే పేలుడు పదార్థాలు పేలడంతో వంద‌ మీటర్ల ఎత్తయిన ఈ జంట టవర్లు కుప్పకూలిపోయాయి. కాంక్రీట్‌తో నిర్మించిన ఈ కట్టడాలు 10 సెకండ్లలో పేక మేడలా కూలిపోవడం అందరినీ ఆశ్చర్య పరచింది, అందరూ ఆనందం వ్యక్తం చేశారు. జంట టవర్లు కూలిపోవడంతో దుమ్ము, ధూళి మేఘాలు ఆ ప్రాంతంలో వ్యాపిం చాయి. ఢిల్లీ లోని ప్రతిష్టాత్మక కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తుగా సూపర్‌టెక్‌ సంస్థ ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో నిర్మించిన జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ట్విన్‌ టవర్స్‌ పేకమేడల్లా కుప్ప కూలాయి. ముంబయికి చెందిన ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్‌ డిమాలిషన్స్‌ కలిసి ఈ పని చేపట్టాయి. గతంలో తెలంగాణ సచి వాలయం, సెంట్రల్‌ జైలును, గుజరాత్‌లో పాత మొతెరా స్టేడియంను ఈ సంస్థే కూల్చింది. అయితే ఈ కూల్చివేతకు సంబంధిం చిన అన్ని ఏర్పాట్లను ఆదివారం ఉదయమే అధికారులు పూర్తి చేశారు. సూపర్‌టెక్ ట్విన్ టవర్ల చుట్టూ గాలి దిశ తూర్పు వైపు న‌కు మారిందని, దీని వల్ల ధూళి కణాలు ఢిల్లీకి బదులుగా గ్రేటర్ నోయిడా, బులంద్‌షహర్ వైపు మళ్లుతాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా పశ్చిమ దిశగా గాలి వీస్తున్నప్పటికీ ఒక్కసారిగా మార్పు వచ్చిందని ఉత్తర్​ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు.

లిక్కర్ లింక్స్ ఇది అంతం కాదు .. ఆరంభమే

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత, ఈ కుంభకోణంలో తన పాత్ర ఏమాత్రం లేదని మరో మారు స్పష్టం చేశారు. కేంద్రం పై యుద్ధం ప్రకటించిన, ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్’గా, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తనపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని, అయినా భయపడేది లేదని చెప్పు కొచ్చారు. ఒక న్యూస్ చానల్‌ బిగ్ డిబేట్‌ కార్యక్రమంలో ఆమె లిక్కర్ కుంభకోణంతో పాటుగా రాష్ట్ర, జాతీయ  రాజకీయాలకు సంబంధించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి, న్యాయ పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదని చెప్పారు.అదే సమయంలో ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పు కొచ్చారు. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితిలో  కవిత అయినా ఇంకొకరు అయినా చేయగలిగింది ఏమీలేదు. ఎందుకంటే, ప్రాధమిక ఆధారాలను బట్టి చూస్తే, అందులో కవిత పాత్ర ఏమిటనేది పక్కన పెడితే, కుంభకోణం జరిగిందినే విషయంలో అనుమానాలు క్రమక్రమంగా తొలిగి పోతున్నాయి. ఇతర విషయాలు ఎలా ఉన్నా, సీబీఐ విచారణ మొదలు కాగానే, ఢిల్లీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు మూలాదారంగా ఉన్న, కొత్త లిక్కర్ పాలసీని తీసి పక్కన పెట్టేసింది. మళ్ళీ పాతపాలసీనే అమలు చేయాలని నిర్ణయించింది. నిర్ణయించడమే కాదు, ఆఘమేఘాల మీద, కొత్త సీసాను పాత సారాయితో నింపేసింది. దీంతో, ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ‘దాల్ మే కుచ్’ కాలా హై’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా, కేజ్రీవాల్  చర్చను పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్నికూల్చేందుకు కుట్రలు చేస్తోందని కొత్త చర్చను తెరమీదకు తెచ్చారు   సరే,ఆ విషయం ఎలా ఉన్నా, సుమారు గంటకు పైగా సాగిన ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి బిగ్ డిబేట్  ఇంటర్వ్యూలో,కవిత హావభావాలు, చేసిన వ్యాఖ్యలు, వ్యక్తపరిచిన మర్మగర్భ అభిప్రాయాలను గమనిస్తే  జరగరానిది ఏదో జరుగుతుందనే ఆందోళన ఆమెలో చాలా స్పష్టంగా కనిపించిందని, విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, కార్యక్రమం ప్రారంభంలోనే, ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ‘టెన్షన్’ ఫీల్ అవుతున్నారా? అంటూనే చర్చ ప్రారంభించారు. ఆమె అలాంటిదేమీ లేదని, చెప్పుకున్నా ఇంటర్వ్యూ పొడుగునా ఆమె మాటలో, హవా భావాల్లో చివరకు, ఆమె నవ్వులోనూ భయంతో కూడిన టెన్షన్’ కనిపించిందనే అంటున్నారు. అంతే కాకుండా ముందున్న ఉపద్రవాన్ని ఫేస్ చేసేందుకు కూడా ఆమె మానసికంగా సిద్దమయినట్లుందని, ఆమె సన్నిహితులే చెవులు కోరుకుంటున్నారు.   రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంపై యుద్ధం కొనసాగిస్తారని చెప్పిన కవిత, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసేఆర్’ కు భయపడుతోందని అందుకే తనను టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ని చూసి భయపడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వం ఆయన్ని ఏమి చేయలేక తనకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంబంధం ఉందనే ఆరోపణలతో భయపెట్టాలని చూస్తోందన్నారు. ఈడీ, బోడీకి భయపడను అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని బీజేపీ ఆయనపై రివేంజ్ తీర్చుకుంటోందన్నారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటక్స్ చేస్తోందని ఆరోపించారు. యుద్ధంలో రాజును ఓడించాలంటే తొలుత చుట్టూ ఉన్న వారిని కొడతారని తెలంగాణ విషయంలో బీజేపీ ప్రస్తుతం అదే చేస్తోందన్నారు. అలాగే, ఇది అంతం  కాదు ఆరంభం మాత్రమే అన్నారు. ముందు ముందు కేంద్ర ప్రభుత్వం ఇంకా అనేక దాడులకు పాల్పడే అవకాశం లేక పోలేదని, ముందుగానే ఒక హింట్ కూడా ఇచ్చారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించే పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం పరిపాటిగా చేసుకుందన్నారు.  ప్రధాని మోడీ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదన్నారామె. కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా, కన్యాకుమారిలో స్టాలిన్ కుటుంబంపైనా కేసులు పెట్టారని గుర్తుచేశారు. మహారాష్ట్రలో శివసేన , ఎన్సీపీ ఎంపీలపై కేసులు పెట్టి జైల్లో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందన్న కవిత ఇలాంటి సమయంలో అందరూ ప్రశ్నించకపోతే ప్రమాదం ఊహించని విధంగా ఉంటుందన్నారు. ఇదంతా ఒకెత్తు అయితే, ఈ మొత్తం వ్యవహారంలో పరోక్షంగానే  అయినా,  చాలా కాలంగా ‘విశ్వసనీయ’ వర్గాల ద్వారా వినవస్తున్న కేసీఆర్ కుటుంబ కలహాల ప్రస్తావన కూడా వచ్చింది. నిజానికి, కవిత చుట్టూ ఇంత దుమారం చెలరేగుతున్నా, ముఖ్యమంత్రి, తండ్రి కేసీఆర్’, మంత్రి, అన్న రామన్న (కేటీఆర్) ఆమెపై వచ్చిన ఆరోపణలను ఖండించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించి కవిత కొంత స్మార్ట్’గా సామ్,సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి, వారు స్పందించవలసిన అవసరం లేదని, అందుకే వారుస్పందించలేదని అన్నారు. అయితే, పార్టీ నేతలంతా ఈవిషయంలో తనకు అండగా ఉన్నారన్న కవిత అవసరమైనప్పుడు కేసీఆర్, కేటీఆర్ బహిరంగంగా స్పందిస్తారని చెప్పారు.అయితే ఆ ఇద్దరి మౌనం వెనక ఇంకేదో వ్యూహం ఉందని అంటున్నారు. తొందరపడి స్పందిస్తే చిక్కుల్లో పడతామనే భయం కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు. అయితే కవిత అన్నట్లుగా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అయితే, ముందుముందు బుల్లి తెరపై చూడాల్సింది చాలానే ఉందని అనుకోవచ్చును.

టీఆర్ ఎస్ వారి  గొడుగు 

ఒకాయ‌న త‌న స్నేహితుడి ఇంటికి వెళ్లి మార్కెట్‌కి రావ‌డం లేదే అని అడిగాడు. ఎందు కు డ‌బ్బు దండ‌గ‌న్నా డు ఆ స్నేహితుడు. అన్నీ రాజ‌కీయ‌పార్టీ వారే ఇస్తామ‌న్న‌పుడు మ‌ళ్లీ కొన‌డం దేనిక‌న్నా డు. మొన్న‌నే గోడ గ‌డి యారం ఒక‌టి కొనాల‌ నుకునాను.మ‌రుక్ష‌ణం ఒకాయ‌నొచ్చి ఏ బ్రాండ్ కావాలో అడిగి మ‌రీ కొనిచ్చి వెళ్లాడు. నిన్న భారీ వ‌ర్షంప‌డింది. ఇంట్లో గొడుగుల్లేవు ఎలా బ‌య‌ట‌కి వెళ్లాలా అనుకున్నాన‌నా, పొద్దున్నే ఒకాయ‌న సీఎం బొమ్మ‌తో ఉన్న గొడుగులు రెండిచ్చి స‌మ‌స్య‌తీర్చి వెళ్లాడు. రేపె వర‌న్నా వ‌చ్చి ఫ్లాస్కో, ఫ్రిజ్జో ఇచ్చేస్తే బావుణ్ను అనుకున్నాడు. ఫ్రిజ్ సంగ‌తి ఎలా ఉన్నా రాజ‌కీయ‌ పార్టీల తీరుతెన్నులు ఇలా మారిపోయాయ‌న్న‌ది ఆ పెద్దాయ‌న చూచాయిగా చెప్పాడు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మం గా అమ‌లుచేసి వారి  మేలు కోరితే అంత‌కంటే మ‌రేమీ అక్క‌ర్లేద‌నుకునే ఓట‌ర్ల‌కు ఇలాంటి కానుక‌ల‌తో బ‌ద్ధ‌కాన్ని పెంచి పోషిస్తు న్నార‌న్న ఆరోప‌ణ‌లు బాగానే ఉన్నాయి.  అస‌లే ఉచితాల‌తో ప్ర‌జ‌ల్ని బాగా ఆక‌ట్టుకోవ‌డం అల‌వాటుగా చేసుకున్న పార్టీలు ఇపుడు ఈ చిరు కానుక‌ల‌తోనూ క‌ట్టిప‌డే స్తున్నారు. చిత్ర‌మేమంటే, ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పాపం బీద ఓట‌ర్లంతా ఒక్క‌సారిగా రాజ‌కీయ‌నాయ‌కుల క‌ల‌ల్లో క‌న‌ప‌డ తారు. వీరికి ఎవ‌రూ ఏమీ ఇవ్వ‌లేక‌పోతే ఎలా? అనే చింత‌నా వ్య‌ధ‌తో తెల్లార‌గానే గ‌డియారాలు, గొడుగులు, ఇస్త్రీపెట్టెలు వంటి వాటితో వీధుల్లో, చిన్న‌గ‌ల్లీలోనూ స‌మావేశాలు పెట్టి మ‌రీ గొప్ప స‌త్కారం చేసిన‌ట్టు ఇవ్వ‌డం ప‌రిపాటి అయింది. ఎన్నిక‌ల రోజు ప్ర‌త్యేక బ‌ళ్లు ఏర్పాటు చేయ‌డం, ఇళ్ల‌కి వెళ్లి ఓట‌ర్ల‌ను చ‌క్క‌గా ప‌ల‌క‌రించ‌డం, వీలైతే కుంకుమ భ‌రిణ‌తో స‌హా స‌తీ స‌మేతంగా వెళ్లి ప‌ల‌క‌రించ‌డం ఆన‌వాయితీగా చేసుకున్నారు. ఇదో గొప్ప ఆక‌ర్ష్ క‌ళ‌. ఇదింకా పాపం బీజేపీవారికి తెలియ‌లేదు.  మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడన్నది ఇంకా తెలియకపోయినప్పటికీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలపర్వం మాత్రం జోరుగా కొనసాగుతోంది. నిన్నటి దాకా గోడ గడియారాలు పంచిన టీఆర్‌ఎస్‌ నేతలు తాజాగా గొడుగుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఒకటి రెండు చోట్ల ఓటర్లు గోడ గడియారాలను తిరస్కరించినా ప్రలోభాలను మాత్రం ఆపడం లేదు. తాజాగా సీఎం కేసీఆర్‌ నవ్వుతున్న ఫొటో, పార్టీ కారు గుర్తు ముద్రించిన గొడుగులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మునిసిపాలిటీతో పాటు మండలవ్యాప్తంగా శనివారం రాత్రి పంచారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ఓటర్లు అనుకున్న వారితోపాటు తటస్థులకు కూడా  గొడుగు లు పంపిణీ చేశారు. అధికార పార్టీ తన గుర్తును విస్తృతంగా మునుగోడు ఓటర్లకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే రోజువారీగా ఉపయోగించే వస్తువులను ప్రలోభాలకు అస్త్రంగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ గొడుగు టెక్నిక్ మ‌రి ఓట్ల‌ను ఏ మేర‌కు వేయిస్తుంద‌నేది చూడాలి. వ‌ర్షాలు, ఎండ‌ల రాక‌పోక‌లు తెలియ‌ని ఈ రోజుల్లో గొడుగులు ఇచ్చి త‌మ ప్ర‌త్యేక‌త‌నీ టీఆర్ ఎస్ చాటుకుంది.