టీఆర్ ఎస్ వారి గొడుగు
posted on Aug 28, 2022 @ 3:38PM
ఒకాయన తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మార్కెట్‌కి రావడం లేదే అని అడిగాడు. ఎందు కు డబ్బు దండగన్నా డు ఆ స్నేహితుడు. అన్నీ రాజకీయపార్టీ వారే ఇస్తామన్నపుడు మళ్లీ కొనడం దేనికన్నా డు. మొన్ననే గోడ గడి యారం ఒకటి కొనాల నుకునాను.మరుక్షణం ఒకాయనొచ్చి ఏ బ్రాండ్ కావాలో అడిగి మరీ కొనిచ్చి వెళ్లాడు. నిన్న భారీ వర్షంపడింది. ఇంట్లో గొడుగుల్లేవు ఎలా బయటకి వెళ్లాలా అనుకున్నాననా, పొద్దున్నే ఒకాయన సీఎం బొమ్మతో ఉన్న గొడుగులు రెండిచ్చి సమస్యతీర్చి వెళ్లాడు. రేపె వరన్నా వచ్చి ఫ్లాస్కో, ఫ్రిజ్జో ఇచ్చేస్తే బావుణ్ను అనుకున్నాడు. ఫ్రిజ్ సంగతి ఎలా ఉన్నా రాజకీయ పార్టీల తీరుతెన్నులు ఇలా మారిపోయాయన్నది ఆ పెద్దాయన చూచాయిగా చెప్పాడు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమం గా అమలుచేసి వారి మేలు కోరితే అంతకంటే మరేమీ అక్కర్లేదనుకునే ఓటర్లకు ఇలాంటి కానుకలతో బద్ధకాన్ని పెంచి పోషిస్తు న్నారన్న ఆరోపణలు బాగానే ఉన్నాయి.
అసలే ఉచితాలతో ప్రజల్ని బాగా ఆకట్టుకోవడం అలవాటుగా చేసుకున్న పార్టీలు ఇపుడు ఈ చిరు కానుకలతోనూ కట్టిపడే స్తున్నారు. చిత్రమేమంటే, ఎన్నికల సమయంలోనే పాపం బీద ఓటర్లంతా ఒక్కసారిగా రాజకీయనాయకుల కలల్లో కనపడ తారు. వీరికి ఎవరూ ఏమీ ఇవ్వలేకపోతే ఎలా? అనే చింతనా వ్యధతో తెల్లారగానే గడియారాలు, గొడుగులు, ఇస్త్రీపెట్టెలు వంటి వాటితో వీధుల్లో, చిన్నగల్లీలోనూ సమావేశాలు పెట్టి మరీ గొప్ప సత్కారం చేసినట్టు ఇవ్వడం పరిపాటి అయింది. ఎన్నికల రోజు ప్రత్యేక బళ్లు ఏర్పాటు చేయడం, ఇళ్లకి వెళ్లి ఓటర్లను చక్కగా పలకరించడం, వీలైతే కుంకుమ భరిణతో సహా సతీ సమేతంగా వెళ్లి పలకరించడం ఆనవాయితీగా చేసుకున్నారు. ఇదో గొప్ప ఆకర్ష్ కళ. ఇదింకా పాపం బీజేపీవారికి తెలియలేదు.
మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడన్నది ఇంకా తెలియకపోయినప్పటికీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలపర్వం మాత్రం జోరుగా కొనసాగుతోంది. నిన్నటి దాకా గోడ గడియారాలు పంచిన టీఆర్‌ఎస్ నేతలు తాజాగా గొడుగుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఒకటి రెండు చోట్ల ఓటర్లు గోడ గడియారాలను తిరస్కరించినా ప్రలోభాలను మాత్రం ఆపడం లేదు.
తాజాగా సీఎం కేసీఆర్ నవ్వుతున్న ఫొటో, పార్టీ కారు గుర్తు ముద్రించిన గొడుగులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీతో పాటు మండలవ్యాప్తంగా శనివారం రాత్రి పంచారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ ఓటర్లు అనుకున్న వారితోపాటు తటస్థులకు కూడా గొడుగు లు పంపిణీ చేశారు. అధికార పార్టీ తన గుర్తును విస్తృతంగా మునుగోడు ఓటర్లకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే రోజువారీగా ఉపయోగించే వస్తువులను ప్రలోభాలకు అస్త్రంగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ గొడుగు టెక్నిక్ మరి ఓట్లను ఏ మేరకు వేయిస్తుందనేది చూడాలి. వర్షాలు, ఎండల రాకపోకలు తెలియని ఈ రోజుల్లో గొడుగులు ఇచ్చి తమ ప్రత్యేకతనీ టీఆర్ ఎస్ చాటుకుంది.