ఎన్డీఏ, టీడీపీ కలయిక ఖాయం...రఘురామరాజు
posted on Aug 29, 2022 @ 10:03AM
ఎన్డీఏ ప్రభుత్వంతో తెలుగుదేం పార్టీ మరోసారి జతకట్టే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఎన్డీఏ లో టీడీపీ చేరికపై జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే, గ్రౌండ్ ప్రిపరేషన్ మొత్తం జరిగిపోయిందని, చేరికపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందనే రీతిలో వార్తలు వినిపిస్తు న్నాయి. తాజాగా ఢిల్లీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, ఒక ఉపద్రవం వచ్చినప్పుడు రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని, రాష్ట్రంలో అది జరుగుతుందని విశ్వసిస్తున్నానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబా బు కలిసి మాట్లాడడం శుభ పరిణామం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కలిసినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ పరిశీ లిస్తే ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ పార్టీకి నష్టమని ఆయన అన్నారు.
సీఎం జగన్ విచారణ కోసం కోర్టుకు హాజరు కావలసిన అవసరం లేదని హైకోర్టు తీర్పును ఇవ్వడాన్ని తప్పుపట్టారు. చట్టం ముందు అందరూ సమానమే అని తాను ఇప్పటివరకూ నమ్మూతూ వచ్చినది నిజం కాదని తెలిసిందన్నారు. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్తుందో లేదో చూడాల న్నారు. తన ఆత్మహత్య చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉన్నదేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు
టీడీపీ-ఎన్డీఏ మధ్య కొత్త పొత్తు పొడుస్తుందా లేక పాత పొత్తు కొనసాగుతుందా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడారు. కాని, ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మాట్లాడారని వార్త ఇచ్చింది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పై రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని, ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి. బీజేపీకి టీడీపీ క్రమంగా దగ్గరవుతోందంటూ ఇప్పటికే ఏపీ రాజకీయాల్లోనూ, అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది.
ఈ కథనాలకు బలాన్నిస్తూ, ఈ మధ్య మునుగోడు సభకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు, ఎన్టీ ఆర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఇవన్నీ టీడీపీ-ఎన్డీఏ పొత్తు గురించి జరిగినవే నన్న చర్చ జరుగుతోంది. అమిత్‌షాతో రామోజీరావు, ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో ఏపీ రాజకీ యాలపైనే ప్రధా న చర్చ జరిగిందని తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు సైతం మాట్లాడుకుం టున్నారు.