జనం తిరగబడితే ఖాకీల గతేంటి?

ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సామాన్య జనంలో సైతం తీవ్రం అసంతృప్తి పెరిగిపోతోంది. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న కొందరు పోలీసులపై ప్రజలు బహిరంగంగానే రగిలిపోతున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో  కొందరు పోలీసుల వ్యవహార శైలిపై  పెద్ద ఎత్తున , ఆగ్రహావేశాలు, వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో పోలీసుల నిర్లక్ష్య ధోరణి వల్లే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన రెండో రోజున అధికార పార్టీ నేతలు దాడులకు దిగడం, పోలీసులు లాఠీచార్జి చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఏపీ మొత్తంలో పోలీసులు 60 వేల మంది ఉంటే.. టీడీపీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారని, వారంతా వచ్చి మీ మీద పడితే ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారంటేనే పోలీసుల తీరు ఎలా ఉందో అర్ధమౌతుంది. చంద్రబాబు నాయుడు ఎలాంటి సందర్భంలో అయినా సాధారణంగా  సంయమనం కోల్పోకుండా మాట్లాడతారు. అలాంటి చంద్రబాబునే  పోలీసులు  తీరు ఇంతలా రగిలించిందంటే.. ఇక సాధారణ కార్యకర్తలు, ప్రజలలో    ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయని వేరేగా చెప్పనవసరం లేదు. ‘టీడీపీ కార్యకర్తలను కొడితే.. మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించే దాకా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలోనే అధికార పార్టీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లినా.. టీడీపీ ఫ్లెక్సీలను చించేసినా.. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేస్తున్నా పోలీసులు వాళ్లకు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతే కాదు టీడీపీ కార్యకర్తలపై  దాడులకు దిగినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు.  ఏపీలో పోలీసుల తీరు ఇంకా ఇలాగే అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉంటే.. భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడమే కాకుండా.. జనాగ్రహంలో వారు కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయని పలువురు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక సీఐని తీరుపై విపక్షకార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు. జనం నీతి నిజాయితీ ముందు ఖాకీ డ్రెస్ వేసుకుని వీరుల్లా విర్రవీగుతున్న పోలీసులు చిత్తుకాగితం లాంటి వారే అని జనం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీసులకు భవిష్యత్తులో అవమానాలు, ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు. అసలు జనమే తిరగబడితే.. పోలీసులు తాము ఏమైపోతామనేది ఊహించుకోవాలని అంటున్నారు.  

నో రోడ్‌.. నో ఓట్ ... పార్టీలకు ఓట‌ర్ల అల్టిమేటం!

పార్టీలు, అజెండాలు,సిద్ధాంతాలు, వాస్త‌వ కార్యాచ‌ర‌ణ‌ల‌కు ఏమాత్రం సంబంధం లేకుండా రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్నది ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆరోప‌ణ‌. అధికార‌ పార్టీలు ముఖ్యంగా, తాము అధి కారంలో మ‌రింత కాలం ఉండిపోవ‌డానికి, విప‌క్షాలు వారిని చొక్కాలాగి కింద‌ప‌డేయ‌డానికే అన్న‌ట్టు త‌యార‌య్యాయి. ప్ర‌జాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి చేసిన‌, చేస్తున్న ప్ర‌మాణాలు, ఇచ్చిన ఇస్తున్న హామీలు, ప్ర‌సంగాల‌కు బొత్తిగా పొంత‌నే ఉండ‌టం లేదు. కేవ‌లం మంచి రోడ్డు, మంచి ఆస్ప‌త్రి, బ‌డి మించి ఏ ఓట‌రూ ఎక్క‌వ‌గా ఏదీ డిమాండ్ చేయ‌డు. కానీ ఆ చిన్న స‌మ‌స్య‌ను, డిమాండ్‌ను తీర్చ‌డంలోనూ అధికార‌, విప‌క్షాలు ఏమాత్రం కృషి చేయ‌డం లేదు. కేవ‌లం ప్ర‌జ‌ల్ని ఓట‌ర్లుగా చూడ‌ డంతోనే అస‌లు స‌మ‌స్య త‌లెత్తు తోందన్న‌ది విశ్లేష‌కుల మాట‌.  ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో చాలా గ్రామాల్లో రోడ్లు, వంతెన‌లు కొట్టుకుపోయాయి. వాటిని వెంట‌నే ఉప‌యోగ‌ప‌డేలా చేయ‌డానికి ప్ర‌భుత్వం ఏమాత్రం గ‌ట్టి చ‌ర్య తీసుకోలేదు. గ‌తంలో అనేక‌ప‌ర్యాయాలు ప్ర‌భుత్వం గ్రామాల విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేవ‌లం త‌మ పాల‌న ఎలా ఉంది?   మీకు అన్నీ అందుతున్నాయా? ప‌థ‌కాలు ఎలా ఉన్నాయి వంటి ప్ర‌శ్న‌లు అడిగి ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న‌నే కోరుకోవ‌డం త‌ప్ప వాస్త‌వానికి ఏమీ చేయ‌డం లేద‌న్న‌ది సుస్ప‌ష్టం. ప్ర‌తీ చిన్న ప‌ని కూడా అధికారుల చుట్టూ తిర‌గ‌డం సామాన్యుల‌కు అల‌వాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని కార్యాల‌యాల్లోనూ నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌జాసంక్షేమం అంటూనే ప్ర‌జ‌ల‌ప‌క్షంగా ఆలోచించి చేయ‌డ‌మ‌న్న‌ది జ‌ర‌గ‌డమే లేదు. అందుకే ప్ర‌జ‌లు ఆగ్ర‌హించారు. అందుకే ఓట్లు అడ‌గ‌డానికి వ‌చ్చేవారిని ప్ర‌జ‌లే నిల‌దీస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణే మునుగోడు ఓట‌ర్ల అల్టిమేటం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నేతలకు ఓటర్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫి కేషన్కు ముందే తమ డిమాండ్‌లను లేవనెత్తుతున్నారు. ఆ క్రమంలోనే చండూరు మండలం పడమటితాళ్ల గ్రామస్తులు నిరసన చేపట్టారు. మాకు రోడ్లు వేస్తే.. మీకు ఓట్లు వేస్తాం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలతో ర్యాలీ తీశారు.  రోడ్డు సౌకర్యం సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్‌లతో మూకుమ్మడి తీర్మానం చేశారు. అంతేకాదు తమ డిమాండ్‌లను పరిష్కరించకపోతే ఓట్లు వేయబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. నో రోడ్  నో ఓటు అని ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు మును గోడులో హాట్ టాపిక్‌గా మారాయి.

బీజేపీ రాజాసింగ్ ను సస్పెండ్ చేయడానికి కారణమదేనా?

బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకులలో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లను ఇటీవలి వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఆర్ఇర్ గా అభివర్ణించేవారు. అలాంటిది రాజాసింగ్ ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పార్టీ శ్రేణులలో దిగ్భ్రమకు కారణమైంది. అయితే ఆయన సస్పెన్షన్ పై ఎవరూ నోరు మెదపలేదు. ఇటీవలి కాలంలో రాజా సింగ్ బీజేపీకి దూరంగా ఉంటున్నారనీ, అంతే కాకుండా తెరాసకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారనీ ఆయనపై పార్టీలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాను ధర్మాన్నే నమ్ముతాననీ, తనకు ధర్మం కంటే పార్టీ ఏమంత ముఖ్యం కాదనీ రాజా సింగ్ వ్యాఖ్యానించడాన్ని కూడా పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. రాజా సింగ్ మాటలలో పార్టీ ధర్మాన్ని పాటించడం లేదన్న విమర్శ ఉందని కూడా వారంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభ మసకబారిందనీ, బీజేపీ అధికారం చేపట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయనీ బీజేపీ భావిస్తోంది. ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్యే పార్టీ విధానాలను తోసి రాజన్నట్లు మాట్లాడటం, బీజేపీకి నష్టం చేకూర్చేలా సున్నితమైన విషయాలలో అనవసర దూకుడు ప్రదర్శించడం పట్ల పార్టీ నాయకత్వంలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే స్టాండప్ కమేడియన్ మునావర్ షో ను నిరసిస్తూ రాజా సింగ్ చేసిన హడావుడి, ఆ తరువాత ఆయన విడుదల చేసిన వివాదాస్పద క్యాసెట్ అన్నీ కూడా రాజకీయంగా టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేవిగానే ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గత కొంత కాలంగా రాజాసింగ్ వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తున్న పార్టీ అధిష్ఠానం ఆయనను ఇంకెత మాత్రం ఉపేక్షించడం తగదన్న నిర్ణయానికి వచ్చే సస్పెన్షన్ వేటు వేసిందని పరిశీలకులు అంటున్నారు. మునావర్ స్టాండప్ కామెడీ షోకు వ్యతిరేకంగా బీజేపీ ఎటువంటి ఆందోళనా కార్యక్రమాలకూ పిలుపు నివ్వకపోయినా రాజా సింగ్ తన వ్యక్తిగత హోదాలోనే మునావర్ షోను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడం, అరెస్టు కావడం వంటివన్నీ తెరాసకు మేలు చేసేవిగానే ఉన్నాయని వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ వివాదాస్పద వీడియో విడుదల చేయగానే క్షణం ఆలస్యం చేయకుండా రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకండా.. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసిందని చెబుతున్నారు. ఆ తరువాత రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసినా బీజేపీ నుంచి ఎవరూ ఖండించకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా రాజకీయ వర్గాలు చూపుతున్నాయి. అసలు మునావర్ స్టాండప్ కామెడీ షోకు వ్యతిరేకంగా రాజాసింగ్ హడావుడి చేయడం.. ఆ తరువాత తాను స్వయంగా ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా వివాదాస్పద వీడియో విడుదల చేయడం.. వీటన్నిటి వెనుకా టీఆర్ఎస్ అగ్రనేత ఒకరు ఉన్నారని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత హోదాలో మునావర్ షోకు వ్యతిరేకంగా హంగామా చేయడం, ఆ తరువాత వివాదాస్పద వీడియో విడుదల చేయడంతో రాజాసింగ్ టీఆర్ఎస్ తో చేతులు కలిపి ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న నిర్ధారణకు వచ్చిన బీజేపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిందని చెబుతున్నారు.

జ‌గ‌న్‌..  ముస్సోలిని, తావోస్‌!

కాలం క‌లిసిరాన‌పుడు ఏదో ఒక మార్గాన్ని అనుస‌రించి ఆధిప‌త్య ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌నుకోవ‌డ‌మే రాజ‌కీ యాల్లో నాయ‌కుల‌ను అప్ర‌తిష్ట‌పాలు చేస్తోంది. ఈ ప‌రిస్థితి తెలిసి కూడా కొంద‌రు అదే విధంగా పాటిస్తూ మ‌రింత‌గా ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డుతున్నారు. అధికార గ‌ర్వం, అహంకారంతో వ్య‌వ‌హ‌రించిన‌పుడు ఎదు ర‌య్యే స‌మ‌స్య‌లే ఇపుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ఎదుర్కొంటున్నార‌నాలి. రాష్ట్రంలో స‌ర్వ‌త్రా సామాన్య జ‌నం కూడా ఆయ‌న ప‌ట్ల విముఖ‌తే ప్ర‌ద‌ర్శి స్తున్నారు.  ప్ర‌జ‌లకు ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఏమాత్రం న‌మ్మ కం కూడా లేకుండా పోయింది. ప్ర‌జ‌ల‌ను విప క్షాల‌ను ఇబ్బందిపెట్ట‌డ‌మే ధ్యేయంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నార న్న‌ది ఇటీవ‌లి ఆరోప‌ణ‌. ముఖ్యంగా వైసీపీ కార్య క‌ర్త‌ల దాడులు, తిట్ల‌పురాణం అన్నీ ఆ పార్టీ ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్నాయి.    కుప్పంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై వైసీపీ గూండాల దాడి పిరికిపంద చ‌ర్య అని అది కేవ‌లం జ‌గ న్ హ్ర‌స్వ‌దృష్టి, అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని  టీడీసీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నా రు. సీఎం జ‌గ‌న్ ఏపీ ముస్సోలినీగా మారార‌ని ఆయన వ్యాఖ్యానించారు.  తరచూ ప్రతిపక్ష నేత పర్య ట నను అడ్డుకోవటం, దాడులకు పాల్పడటం ఏపీ లో తప్ప దేశంలో మరెక్కడైనా ఉందా?  అని ప్రశ్నిం చారు.  ఇదిలాఉండ‌గా, జ‌గ‌న్‌ను ఎవెంజ‌ర్స్ సినిమాలో విల‌న్‌తో పోల్చారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న ను ద‌త్త‌పుత్రుడు అని అరోపించే జ‌గ‌న్‌కు ఎవెంజ‌ర్స్‌లో విల‌న్ తానోస్ అని పేరు పెట్టాన‌ని ప‌వ‌ర్ స్టార్ అన్నారు.  అంతేకాదు జ‌గ‌న్‌ను సిబిఐ ద‌త్త‌పుత్రుడు అనీ సంబోధించాల్సి వ‌స్తుంద‌నీ హెచ్చ‌రించారు.   ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జపాన్ లో మద్యం పోటీలు పెట్టినట్లు పెడతారని  ఆరోపించారు. వైసీ పీ పార్టీని ఓడించడమే తమ‌ తొలి అజెండా అన్నారు.   ఏపీలో అధికార వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీపై త‌న‌కు ఎలాంటి ద్వేషం లేద‌ని, వైసీపీనేతలు  ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోతే మాత్రం త‌ప్పనిస‌రిగా  నిల‌దీస్తాననీ స్పష్టం చేశారు. 

సుప్రీం కోర్టు ప్రొసీడింగ్స్ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ ప‌ద‌వీ కాలం శుక్ర‌వారం (ఆగ‌ష్టు 26) ముగియ‌ నుంది. కాగా శుక్ర‌వారం కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌నున్నారు. వాస్త‌వానికి కోర్టు ప్రొసీడింగ్స్ ఇలా ప్రత్య‌క్ష‌ప్ర‌సారం ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు.  కోర్టు వాద‌న‌లు టెలికాస్ట్  చేయ‌డం న్యాయ‌ మూర్తుల‌పై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. ఈ కార‌ణంగానే ప్రొసీడింగ్స్‌ను ప్ర‌త్య‌క్ష‌ ప్ర‌సారానికి ఎవ‌రూ అంగీ క‌రించ లేదు.   కాగా,  శుక్రవారం రోజు విచారణకు రానున్న, తీర్పు వెలువరించనున్న కేసులకు సంబంధించిన జాబి తాను ప్రకటించింది. కాగా.. నేడు సీజేఐ‌గా జస్టిస్‌ రమణ ఐదు కీలక కేసులుపై తీర్పులను  వెలువరిస్తు న్నారు. విశేషం ఏంటంటే.. తొలిసారిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ‌తో కూడిన ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.  దీంతో ఇప్పటి వరకూ లైవ్ ప్రొసీడింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదు. కానీ ఎన్వీ రమణ తొలి నుంచి కూడా కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ ఇవ్వాలి అని వాదించారు. కోర్టులో వాదనలు ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం ఇవ్వ‌డం సాధ్యా సాధ్యాల‌పై  ఒక  కమిటీని  కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సైతం లైవ్ ఇవ్వొచ్చు అని నివేదిక ఇచ్చింది. అయితే  దీనిని కొందరు న్యాయమూర్తులు ఇష్టపడలేదు.  చివరికి తన ఫేర్ వెల్‌ను అయినా ఇలా లైవ్ ఇవ్వాలని సీజేఐ ఎన్వీ రమణ భావించారు.

జాతి నిర్మాణంలో శ్రామిక‌శ‌క్తిదే కీల‌క‌పాత్ర‌.. ప్ర‌ధాని మోదీ

క‌రోనా కాలంలో ప్ర‌పంచ‌మంతా భ‌యాందోళ‌నలు పీడిస్తున్న స‌మ‌యంలో దేశాన్ని గ‌ట్టెక్కించేందుకు కార్మికులు పూర్తి శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను వెచ్చించార‌ని ప్ర‌ధాని మోదీ  కితాబునిచ్చారు.  తిరుపతిలో రెండు రోజుల జాతీయ కార్మికసదస్సును ఆయన గురువారం(ఆగ‌ష్టు 25) ఢిల్లీ నుంచీ వర్చు వల్‌గా ప్రారంభిం చారు.  భార‌తదేశ క‌ల‌లు, ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌డం ద్వారా జాతి నిర్మాణంలో శ్రామిక శ‌క్తి ప్ర‌ధాన‌పాత్ర పోషి స్తోంద‌ని ప్ర‌ధాని మోదీ కొనియాడారు. ఈ ఘ‌న‌త త‌ప్ప‌కుండా త‌ప్ప‌కుండా కార్మికుల‌కే ద‌క్కుతుం ద‌న్నారు. దేశంలో  కోట్లాదిమంది సంఘ‌టిత‌, అసంఘ‌టిత రంగాల కార్మికుల సంక్షేమం కోరి నిరంత‌రం త‌మ ప్ర‌భుత్వం శ్ర‌మిస్తున్న‌ద‌ని అన్నారు. ఒక  అధ్యయనం ప్రకారం  ది ఎమర్జెన్సీ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ కరోనా కష్ట కాలంలో 1.50 కోట్ల ఉద్యోగాలను కాపాడిందని తెలిపారు. కార్మిక శక్తికి భద్రత కల్పించడంలో ఇ-శ్రమ్‌ పోర్టల్‌ కీలకపాత్ర పోషిస్తోందని, ఏడాదిలోనే 28 కోట్లమంది కార్మికులు పోర్టల్‌లో నమోదయ్యారని తెలి పారు.  కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌హెచ్‌ భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల కార్మికశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమాయోజన తదితర పథకాలు కోట్లాదిమంది కార్మికులకు ఎంతో కొంత రక్షణ, భద్రత కల్పిస్తున్నా యని ప్రధాని చెప్పారు.  భవన నిర్మాణ కార్మికుల సెస్‌ నిధులను రూ.38 వేల కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం డిజిటల్‌ యుగంలోకి ప్రవేశించిందని, ఆన్‌లైన్‌లో  షాపింగ్‌, హెల్త్‌ సర్వీ సెస్‌, ట్యాక్సీ, ఫుడ్‌ డెలివరీ జీవితంలో భాగమయ్యాయన్నారు. ఈ రంగాల్లో సరైన విధానాలు, సరైన కృషి దేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేస్తాయని చెప్పారు. ఇదిలా ఉండ‌గా, కార్మిక చట్టాలను హరించే సదస్సు.. జాతీయ కార్మికసదస్సును అడ్డుకుంటామని కార్మి క సంఘాల నేతలు ముందుగానే ప్రకటించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.  సుమా రు 200 మందిని అదుపులోకి తీసుకొని రామచంద్రాపురంలో నిర్బంధించారు. సదస్సు జరిగే ప్రాంతానికి ర్యాలీగా వస్తున్న సీపీఎం నేతలు పి.మధు, గఫూర్‌, ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్మిక చట్టాలను హరించేందుకు సదస్సు నిర్వహిస్తుంటే దానికి జగన్‌ ఆతిథ్యమివ్వడం దారుణమని మధు, గఫూర్‌, రవీంద్రనాథ్‌, ఐఎ ఎఫ్‌టీయూ నేత ప్రసాద్‌ విమర్శించారు.  తమను అమానుషంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. దీనిపై శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని ప్రకటించారు.    

రాజాసింగ్ పై పీడీ యాక్ట్..ఇప్పట్లో జైలు నుంచి విముక్తి లేదా?

రాజాసింగ్.. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇప్పుడో సెన్సేషనల్ లీడర్. ధర్మం కంటే పార్టీ ఎక్కవేం కాదని కుండబద్దలు కొట్టేసిన వ్యక్తి. ఆయనే బీజేపీ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజా సింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి అరెరస్టు చేశారు. ఆ యాక్ట్ ప్రకారం అరెస్టయిన తొలి ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. ఇక పీడీ యాక్ట్ కింద రాజా సింగ్ ను అరెస్టు చేయడంతో ఆయన ఇక ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేనట్టేనని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం అరెస్టు చేసిన వ్యక్తిని కోర్టులో హాజరు పరిచే అవసరం ఉండదు. కనిష్టంగా మూడు నెలలు, గరిష్టంగా ఏడాది వరకూ ఆయనను జైల్లో ఉంచొచ్చు.   ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమైన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  2014 నుంచి ఇంత వరకూ ఆయనపై 101 కేసులు నమోదయ్యాయి. అదనంగా 18 మత కల్లోలాల కేసులు ఉన్నాయి. పైగా రౌడీషీట్ కూడా ఉంది. ఈ కారణంగానే ఆయనపై పీడీయాక్ట్ ప్రయోగించామని కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపైనే పీడీయాక్ట్ నమోదు చేస్తూంటారు. కానీ రాజకీయ నేతలపై మాత్రం ఎప్పుడూ అమలు చేయలేదు. అయితే రాజాసింగ్‌పై మాత్రం అమలు చేశారు. అంతే కాకుండా ఒక వర్గం వారి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింద. దీంతో ఆయనకు పార్టీ పరంగా మద్దతు లభించే అవకాశం లేదని తేలిపోయింది. సున్నితమైన అంశం కనుక ఆయనకు ఎటువైపు నుంచీ కూడా మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో ఆయన ఇప్పటిలో బయటకు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

పోటీల‌లో  ఇదో  పోటీ!

పోటీలు అన‌గానే క్రీడారంగంలో పోటీలు, రాజ‌కీయ‌రంగంలో పోటీప‌డ‌టాలు గురించే అంద‌రికీ తెలు స్తుంది. కానీ చిత్రంగా అస్స‌లు ఎవ్వ‌రూ ఊహంచ‌ని స‌రికొత్త పోటీ ఒక‌టి ఈమ‌ధ్య నిర్వ‌హించారు. అపాన‌వాయు పోటీ!  ఆమ‌ధ్య ఏదో సినిమాలో ముగ్గురు క‌మెడియ‌న్లు యూ.ఎస్‌లో ఒక న‌గ‌రం వీధిలో నిల‌బడి అపాన‌వాయు వ‌ద‌లుతారు, దాని ధాటికి చాలామంది పారిపోతారు! ఇదో  సినిమాలో కామెడీ సీన్ ! అది ప్రేక్ష‌కుల‌కు స‌ర‌దా కోసం సినిమావారు క‌ల్పించిన ఒక సీన్‌. త‌ల‌చు కుంటే న‌వ్వొస్తుంది. కానీ అలా నిజంగానే అవుతుందా అంటే ! ఏమో అనే సందేహాస్ప‌ద స‌మాధానాలూ విన‌వ‌ల‌సివ‌స్తుంది. మావూళ్లో ఒక పెళ్లి భోజ‌నం చేసిన ఓ పెద్దాయ‌న‌... అంటూ ఎవ‌రికి తోచిన విధంగా వారు ఏదో ఒక విచిత్ర వివ‌ర‌ణ‌ల‌తో ఇలాంటి సంఘ‌ట‌న‌లు గుర్తుచేసుకున్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ పోన‌క్క‌ ర్లేదు.  ఇలాంటి పోటీ ఏమిట‌న్న‌దే ఇపుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ది. ఇది ఎక్క‌డో విదేశాల్లో కాదు.. చ‌క్క‌గా మ‌న దేశంలోనే నిర్వ‌హించారు.  ఈపోటీలో పాల్గొన‌డానికి ఏకంగా ముంబై, జైపూర్‌, దుబాయ్ వంటి న‌గ‌ రాల నుంచి కూడా పేర్లు న‌మోద‌య్యాయి!  ఒక పెద్ద గ‌ది.. ఎంతో చ‌క్క‌టి సుగంధ‌ద్ర‌వ్యాల‌తో సువాస‌న‌ల‌తో ఆక‌ట్టుకుంటుంది. ఎంతో శుభ్రంగా అలంక‌రించి ఉంటుంది. ఆ గ‌దిలోకి ఒక వ్య‌క్తిని పంపిస్తారు. అత‌ను అపాన‌వాయు వదులుతాడు.. అది ఎంత‌గా దారుణంగా వాతావ‌ర‌ణాన్ని కంపుమ‌యం చేస్తుందో అంచ‌నా వేస్తారుట‌! ఎలా చేస్తార‌న్న‌ది వ‌దిలేద్దాం. అలా చేసిన త‌ర్వాత‌. మ‌రో వ్య‌క్తిని మ‌రో గ‌దిలోకి పంపుతారు. ఇలా ఉన్న రెండు గ‌దుల్లోకి లెక్ ప్ర‌కారం, స‌మ‌యాన్న‌నుస‌రించి శుభ్ర‌త జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ మ‌రీ పంపుతార‌ట‌! ఫైన‌ల్‌గా ఎవ‌రు ఎంత‌గా ఇబ్బందిపెడితే వారే విజేత‌!  ప‌రామ‌ర్ అనే మ‌హిళ ఈ పోటీల‌కి  జ‌డ్జి. ఊహంచ‌ని ఈ పోటీల‌కు త‌న‌ను జ‌డ్జిగా నియ‌మించ‌డం గురించి చెబుతూ న‌వ్వు ఆపుకోలేక‌పోయిందామె.  ఇదే కాంపిటీష‌నండీ! అని చిరాకుప‌డొచ్చు. అనేకానేక వెర్రి ఆట‌లు, కాంపిటీష‌న్ల‌లో ఇదోటి! విదేశాల్లో గిన్నిస్బుక్ రికార్డుల కోసం చిన్న చిన్న విష‌యాల్లోనూ పెద్ద పెద్ధ పోటీలు జ‌రుగుతుంటాయిట‌. తిన‌డం, ర‌న్నింగ్‌, బ‌స్కీలు తీయ‌డం.. ఇలాంటివి. మ‌రి మ‌న‌వాళ్లు క‌నుగొన్న ఈ పోటీ కూడా ఆ స్థాయికి అను మ‌తి ల‌భిస్తుందేమో చూడాలి!  చిత్రంగా ఉంది గ‌దా. ఈమ‌ధ్య‌నే సూర‌త్‌లో ఈ పోటీ జ‌రిగితే పెద్ద సంఖ్య‌ లో ఎవ్వ‌రూ పాల్గొన‌లేదు. కానీ విన్న‌వారు ప‌డి ప‌డి న‌వ్వుకుంటూనే ఉన్నారు! ఇలాంటి పోటీలూ ఉంటా యా అని!  ఇదే కాదు త్రేణుపుల పోటీ కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుం ది. త్రేణుపులు అంత సుల‌భంగా రావు క‌దా!  

చంద్రబాబుకుభద్రత పెంపు

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ భద్రత పెంచింది. గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ సిబ్బంది ఉండగా.. నేటి నుంచి అదనంగా నలుగుర్ని నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 12మంది చంద్రబాబుకు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. అంతే కాదు గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షించనున్నారు. అంతేకాదు గురువారం ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఉండవల్లి నివాసాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇక కుప్పంలో చంద్రబాబుకు  మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.గురువారం ఆగస్టు 25) కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ప్రారంభించనున్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం, ఫ్లెక్సీలను చించివేయడమే కాకుండా చంద్రబాబు సమీపానికి చేరుకోవడానికి ప్రయత్నించడం  తో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యలో చంద్రబాబు భద్రతకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎన్ఎస్జీ అభిప్రాయపడింది. గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎన్ఎస్జీ డీఐజీ భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఈ మేరకు ఆయన నివేదికను పరిశీలించిన ఎన్ఎస్జీ అందుకు ఆమోదం తెలిపింది. దీంతో శుక్రవారం(ఆగస్టు 24) నుంచి చంద్రబాబుకు భద్రతను పెంచారు. 12 ప్లస్ 12 ఎన్ఎస్జీ బృందం ఆయనకు రక్షణ కవచంగ నిలవనుంది.

పిజ్జా  డాగ్‌!

మ‌నిషికి మొద‌ట ప‌రిచ‌యం అయిన జంతువు కుక్క అని అంటారు చ‌రిత్ర‌కారులు. కుక్క‌ల పెంప‌కం ప‌ట్ల మోజు పెరుగుతూ వ‌చ్చింది. బుజ్జి కుక్క‌పిల్ల‌ను పెంచుకోవ‌డంలో అదో ఆనందం, స‌ర‌దా. కేవ‌లం కాప‌లాకే కాదు, అది చిన్నాచిత‌కా ఇంటిప‌నుల్లో సాయం చేస్తూండ‌డం గ‌మ‌నిస్తుంటాం. ఇటీవ‌లి కాలం లో కుక్క‌ల పెంప‌కం పెద్ద వ్యాపకంగానూ మారింది. పిల్ల‌ల‌తో ఆడ‌టం, పెద్ద‌వాళ్ల‌కి వాకింగ్‌లో తోడుగా వెళ్ల‌ డం, ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోతే గేటు ద‌గ్గ‌రే కాప‌లా కాయ‌డం అన్నింటా వాటికి  ప్ర‌త్యేకించి శిక్ష‌ణ నిస్తు న్నారు. చాలా కుటుంబాల్లో కుటుంబ స‌భ్యునిగానే కుక్క‌ను ప్రేమ‌గా చూసుకోవ‌డం గ‌మ‌ని స్తుంటాం.  ఇటీవ‌ల శివాంగ్ అనే నెటిజ‌న్ ఒక వీడియో పెట్టాడు. పిజ్జా బాయ్‌కి ఎంతో స‌హ‌క‌రిస్తోంద‌న్నది దాని కాప్ఫ న్‌. ఇది ఎక్క‌డిది అనే ప్ర‌శ్న వ‌దిలేస్తే ఆ కుక్క అత‌నికి ఏపాటి సాయం చేస్తోంద‌న్న‌ది తెలుసు కోవాలి. ఎందుకంటే, వాటికి ఫ‌లానా ఇంటికి లేదా ఫ్లాట్‌కి వెళ్లి ఇవ్వ‌మ‌న‌గానే సెక్యూరిటి వాడి ద‌గ్గ‌రికి వెళ్లి నిల బ‌డుతుందిట‌. అత‌ను దాన్ని తీసుకుని కుక్క‌తో పాటు ఆ ఫ్లాట్‌కి వెళ్లి సెక్యూరిటీవాడు ఇవ్వ‌గానే  ప‌రు గున వ‌చ్చి త‌న య‌జ‌మానికి ఇచ్చేసిన సంగ‌తి తోక‌తో కొట్టి మ‌రీ చెబుతోంది! ఇలాంటి స‌హాయం చేసే కుక్క‌ల్ని పెంచుకుంటే ప‌ని భారం మ‌రీ త‌గ్గుతుంద‌ని పిజ్జా అమ్మే కంపెనీలూ భావిస్తున్నాయి. నిజంగానే ఇది మంచి సూచ‌న‌. ఆ కుక్క పిజ్జాబాయ్‌తో పాటు బండి మీద తిరుగుతుంది. ఎక్క‌డ ఆపితే అక్క‌డ దిగి ఆ అడ్ర‌స్ ఉన్న ఇంటి ద‌గ్గ‌ర ఎవ‌రు ఉంటే వారిని తానే ముందుగా పిలుస్తోంది. ఆ త‌ర్వాత పిజ్జా బాక్స్ తెమ్మ‌ని తోక ఊపుతుంది. ఇత‌గాడు పిజ్జా ప‌ట్టుకుని వెళ‌తాడు. అదే అపార్ట్‌మెంట్ల‌కి అయితే బండి అక్క‌డ గేటు ద‌గ్గ‌ర ఆగ‌గానే ప‌రుగున ఫ్లాట్స్ కాప‌లావాడి ద‌గ్గ‌రికి వెళ్లి  బ‌య‌టికి ర‌మ్మ‌ని గోల చేస్తుంది! రాగానే అత‌నికి దాని సంగ‌తి తెలుస్తుంది.  ఇది  రోజూవారీ ఆ కుక్క కార్య‌క్ర‌మం. పిజ్జా అమ్మే వాడికి, తీసుకునేవారికి అదో స‌ర‌దాగానూ మారింద‌ట‌! 

టీడీపీలోకి ఆనం రామనారాయణరెడ్డి?

ఏపీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ తీర్థం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లోనే కాకుండా, ఆయన మరణానంతరం ఏర్పాటైన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా కీలక మంత్రి పదవులు నిర్వహించారు. అలాంటి రామనారాయణరెడ్డికి వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయిన విషయం అందరికీ తెలిసిందే. వైఎస్సార్ నుంచీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న తనను వైసీపీ అధినేత, సీఎం జగన్ పూర్గిగా పక్కన పెట్టేయడం రామనారాయణరెడ్డికి తీవ్ర అవమానంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి  ఏపీలో వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి.  2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీలో ప్రత్యేకత గల కుటుంబాల్లో ఆ కుటుంబం కూడా ఒకటి. గతంలో ఆనం కుటుంబం నుంచి రామనారాయణరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా 2004, 2009లలో వైఎస్ రాజశేఖరరెడ్డి  , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల కేబినెట్ లలో  కీలకమైన మంత్రింగా ఉన్నారు. ఒకానొక దశలో  సీఎం పదవికి రామనారాయణరెడ్డి పేరు కూడా చర్చకు వచ్చింది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డిని  జగన్ తన పార్టీలో చేర్చుకుని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, అంతకు మించి ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన ఒకింత ఆగ్రహంతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.   . కాంగ్రెస్ పార్టీకి జగన్ గుడ్ బై చెప్పి సొంతంగా వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయనపై ఘాటుగా విమర్శలు చేసిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి ఒకరు. ఆ కారణం చేతనే జగన్ ఆనంకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు.  అలాగే  2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రామనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి విజయం సాధించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ రాజకీయాల్లో, కేబినెట్ లో కీలకంగా ఉన్న రామనారాయణరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వకుండా జగన్ పక్కన పెట్టేయడానికీ ఇదే కారణం అయి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే తనక ప్రాధాన్యత లేదన్న అసంతృప్తి రామనారాయణరెడ్డిలో ఉందంటారు. రామనారాయణరెడ్డి సీనియారిటీని జగన్ గుర్తించలేదని, సరైన పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఆనం అనుచరుల్లో కూడా ఉంది.  ఎంతో సీనియారిటీ, అనుభవం ఉన్న తనకు జగన్ తన తొలి కేబినెట్ లో స్థానం కల్పించలేదు. సరికదా మంత్రివర్గ పునర్మాణంలో కూడా పట్టించుకోకపోవడంతో రామనారాయణరెడ్డి ఇక పర్టీలో కొనసాగి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు అంటున్నారు. తొలి కేబినెట్ లోకి నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్న జగన్ మలి కేబినెట్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని తీసుకోవడమే కాకుండా తనను అస్సలు పట్టించుకోకపోవడంపై ఆనం రామనారాయణ రెడ్డి రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఇటీవలి టీడీపీ మహానాడు సందర్భంగా రామనారాయణరెడ్డి కుమార్తె  కైవల్యారెడ్డి తన భర్తతో సహా వెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సమావేశం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కైవల్యారెడ్డి టీడీపీలో చేరతారని, ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా జరిగింది. ఇలా లోకేష్ తో కైవల్యారెడ్డి భేటీ అవడం వెనుక ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ మంత్రాంగం ఉందని, ముందు కుమార్తెను టీడీపీలోకి పంపించి, ఆనక ఆయన కూడా తెలుగుదేశానికే  జై కొడతారనే ఊహాగానాలు జోరుగా ప్రచారంలోనికి వచ్చాయి. ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్ పై రామనారాయణరెడ్డి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, అధికారుల తీరుపై ఫైరయ్యారని కూడా అప్పట్లో రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరిగింది. టీడీపీలోకి వెళ్లాలనే యోచన చేస్తున్న వల్లే రామనారాయణరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామనారాయణరెడ్డి టీడీపీలో చేరాలనే ఆలోచన చేస్తున్నారంటూ తాజాగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. రామనారాయణరెడ్డి మాత్రం దీనిపై ఎక్కడా స్వయంగా బయటపడకపోవడం గమనార్హం.

ఇంటికి కిలో బంగారం ఇచ్చినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదు.. కోమటిరెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ పతనానికి నాంది అని బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. శుక్రవారం (ఆగస్టు26) విలేకరులతో మాట్లాడిన ఆయన కేసీఆర్ మునుగోడులో ఇంటికి కిలో బంగారం పంచినా టీఆర్ఎస్ ను గెలిపించలేరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వెనకేసిన అవినీతి సొమ్ముతో మునుగోడు ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారనీ, అయితే మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగరనీ వారు చైతన్యం కలిగిన వారనీ పేర్కొన్నారు. కేసీఆర్ గిమ్మిక్కులకు పడిపోయి మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కు ఓట్లేస్తారనుకోవడం భ్రమేనని అన్నారు. కేసీఆర్ లో ఓటమి భయం మొదలైందని, అందుకు మునుగోడు సభలో కేసీఆర్ మాటలే తార్కానమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టేందుకు మునుగోడు ఉప ఎన్నిక శ్రీకారం చుట్టిందన్నారు. మునుగోడు తీర్పుపైనే తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. మునుగోడు సభలో కేసీఆర్ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. రైతులకు వ్యవసాయ మీట్లర్లు పెడతారని కేసీఆర్ భయపెడుతున్నారనీ, అసలు నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ చేసిందేమిటని విమర్శించారు. గజ్వేల్, సిరిసిల్లకే కేసీఆర్ పాలన పరిమితమైందని, అసెంబ్లీ సాక్షిగా తాను మునుగోడుకు నిధులు మంజూరు చేయాలని అడిగినా కేసీఆర్ స్పందించలేదని దుయ్యబట్టారు.  ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ప్రజల కోసం పని చేయలేకపోతున్నాననే బాధతోనే రాజీనామా చేశానని అన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దింపడం టీఆర్ఎస్ తోనే సాధ్యమౌతుందని, అందుకే తాను బీజేపీలో చేరానని వివరణ ఇచ్చారు. 

వైసీపీకి ప‌సుపు భీతి!

ప్ర‌తి మ‌నిషికీ ఒక రంగు ప‌ట్ల ఇష్టం ఉంటుంది. దారికి కార‌ణం ఫ‌లానా అని చెప్ప‌లేక‌పోవ‌చ్చు. అలాగే వేరే రంగు ప‌ట్ల అయిష్ట‌తా ఉంటుంది. కొంద‌రికి కేవ‌లం తెలుపే యిష్టం, కొందరికి గులాబీ యిష్టం ఉంటే ఇంకొంద‌రికి ప‌సుపు, నీలం బాగా యిష్టం. సాధార‌ణంగా ప‌సుపు శుభ‌కార్యాల్లో ఎక్కువ‌గా క‌నిపించే రంగు. దానికి ఆ ప్రాధాన్య‌త ఉంది. కానీ వైసీపీవారికి మాత్రం ప‌సుపు బొత్తిగా ప‌డ‌టం లేదు. ఆ రంగులో ఏది క‌న ప‌డినా విసుక్కుంటున్నారు. దీనికి కార‌ణం అంద‌రికీ తెలిసిందే. ప‌సుపు తెలుగుదేశం పార్టీవారిది. అందు వ‌ల్ల ప‌సుపు దుస్తుల్లో ఎవ‌రు క‌నిపించినా ఫ్యాన్‌వారికి ఉండ‌డం కాస్తంత ఇబ్బందిక‌రంగా ఉంటుంది.  ప‌సుపు స‌ర్వ‌మంగ‌ళ‌ప్ర‌దాయ‌ని అనే అభిప్రాయంతోనే తెలుగుదేశం ఆవిర్భావంలో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆ రంగుకి అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చారు. అందువ‌ల్ల అలా ఆ రంగు ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకుం టూంది. అయితే ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ‌ప‌రంగానూ రంగుల్ని చూస్తున్నారు గ‌నుక వైసీపీవారికి ప‌సుపు బొత్తిగా గిట్ట‌డం లేదు. ప‌సుపు బ్యాక్‌గ్ర‌గౌండ్‌లో సైకిల్ గుర్తు టీడీపీవారి గుర్తు. దీన్ని క‌ల‌లో కూడా చూడ‌ద‌ల‌చు కో లేదు వైసీపీ వారు.  కానీ  ఏపీలో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీ కొత్త రెండింత‌ల ఉత్సాహంతో ఉర‌క‌లు వేస్తోంది. ఏపీలో వైసీపీ స‌ర్కార్‌కు అభిమానం, ప్ర‌తిష్ట కొంత త‌గ్గింద‌న్న అభిప్రాయాలే ఎక్కువ‌గా విన ప‌డుతున్నాయి. దీనికి తోడు మంతులు, ఎమ్మెల్యేలు ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు గ‌తంలో వ‌లె బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్ట‌డం లేదు. ఎందుకు వ‌చ్చార‌న్నట్టు చూపులు, ప్ర‌శ్న‌లు సంధించ‌డంతో అవ‌మాన‌ప‌రుస్తున్నారు. పాలనా కాలం మూడేళ్లు ముగిసినా ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌న‌సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేక‌పో వ‌డం జ‌గ‌న్ స‌ర్కార్ వైఫ‌ల్యానికి అద్దంప‌డుతుంది. ఇచ్చిన హామీలు, ప‌థ‌కాలు  అన్నీ నీరుగారాయి.   ఈ  ప‌రిస్థితుల్లో ఆగ‌ష్టు 25న కృష్ణాజిల్లా పెడ‌న‌లో నేత‌న్న నేస్తం పేర ఒక కార్య‌క్ర‌మం జ‌రిగింది. అక్క‌డి వారు స‌భాప్రాంగ‌ణాన్ని వైసీపీ ప‌తాకాల‌తో నింపేశారు. ఎక్క‌డా ప‌సుపు, న‌లుపు రంగులు క‌న‌ప‌డ‌కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇది వైసీపీ సంబంధించిన కార్య‌క్ర‌మం గ‌నుక టీడీపీ రంగు, ప‌తాకా లూ ఎక్క‌డా క‌న‌ప‌డ‌కుండా ఉండ‌ట‌మే మంచిద‌ని వారి అభిప్రాయం కావ‌చ్చు, లేదా విప‌క్షాల‌వారు వ‌చ్చి గొడ‌వ‌లు, ర‌భ‌సా సృష్టిస్తారేమోన‌న్న అనుమానమూ కావ‌చ్చు. ఏమ‌యిన‌ప్ప‌టికీ ప‌సుపు రంగు క‌న‌ప‌డ‌కుం డా ఉండ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు.  పెడనలో ‘నేతన్న నేస్తం’ నిధుల విడుదల కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సభకు ఒక వృద్ధుడు పసుపు రంగు చొక్కా వేసుకుని వచ్చారు. అది చూడగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక మహిళా ఎస్సై ఆయనను ఆపారు.  అతడి తలకున్న టవల్‌ తీయించి, చొక్కాపై కప్పించారు.  పైగా ఎట్టి పరిస్థితి లోనూ పైన కప్పుకున్న టవల్‌ తీయవద్దు. పసుపు చొక్కా కనిపించవద్దు’ అని హెచ్చరించారు. పసుపు రంగు చీర ధరించిన ఓ మహిళ వేదిక సమీపానికి వెళ్లకుండా అడ్డుకన్నారు. నలుపు రంగు చున్నీలు, మాస్కులు ధరించిన వారిని కూడా పోలీసులు అటకాయించారు. చున్నీలు, మాస్కులు తొలగించిన తర్వాతే లోనికి అనుమతించారు.  ఇదిలా ఉండ‌గా,  అస‌లు పెడనలో సీఎం సభ ప్రారంభం కాకుండానే జనం వెనుతిరిగి వెళ్లడం కనిపిం చింది. సీఎం సభ ప్రకటించిన సమయానికంటే కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.  ఓవైపు  వ్యాన్లు, బస్సు ల్లో జనాన్ని లోపలికి పంపిస్తుండగా, మరోవైపు నుంచి కొందరు బయటకు వెళ్లడం కనిపించింది.  సీఎం వచ్చాక కూడా ఆయన ప్రసంగం వినకుండానే కొందరు వెళ్లిపోయారు. సీఎం ప్రసంగం రుచించక మరి కొందరు వెళ్లిపోవడం గమనార్హం.  కాగా, ఈ సభలో సీఎం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనన్న ఆశతో ఎదురు చూసిన చేనేత కార్మికులకు నిరాశే ఎదురయింది. చేనేత సమస్యలన్నింటికీ నేతన్న నేస్తమే పరిష్కారమన్నట్లుగా ఆయన ప్రసంగం సాగడం, చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల ప్రస్తావన లేకపోవడంపై నేత న్నలు పెదవి విరిచారు. సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత సంఘాలను బయటపడేస్తానన్న హామీ కూడా  సీఎం నోట రాలేదు.  తమకూ నేతన్న నేస్తం వర్తింపజేస్తామని సీఎం ప్రకటిస్తారేమోనని ఆశతో ఎదురుచూసిన అనుబంధ వృ త్తుల కార్మికులకు నిరాశ మిగిలింది. సభ నుంచి వెళ్లిపోతున్న ప్రేక్షకులను వైసీపీ కార్యకర్తలు లోప లకు పంపేందుకు ప్రయత్నాలు చేసినా.. సీఎం ప్రసంగం చప్పగా సాగడం, ఎండ తీవ్రత కారణంగా జనం చివరి వరకు ఉండకుండా వెనుదిరిగారు.

బిల్కిస్ బానో కేసు.. దోషులకు రెమిషన్ కు నిరసనగా గ్రామం ఖాళీ

దేశ మంతా బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని నిరసిస్తుంటే.. గుజరాత్ ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టైనా అనిపించడం లేదు. నిరసనలను, వ్యతిరేకతను ఇసుమంతైనా లెక్క చేయడం లేదు పైపెచ్చు దోషులకు సన్మానాలు సత్కారాలు జరుగుతున్నా కూడా కిమ్మనడం లేదు.  బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ కింద విడుదల చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా దోషుల విడుదలకు నిరసనగా రంధిక్ పూర్ గ్రామాన్ని ముస్లింలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన దోషులను తిరిగి జైలుకు పంపే వరకూ తిరిగి గ్రామంలోకి అడుగుపెట్టేది లేదని వారు ప్రతిజ్ణ పూనారు.  గ్రామాన్ని విడిచిన ముస్లింలంతా దేవగఢ్ బరియాకు వలస వెళ్లారు.  దోషులను తిరిగి జైలుకు పంపడం  తాము గ్రామంలోకి తిరిగి వచ్చేందుకు పోలీసు రక్షణ కల్పించాలని వారు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడు దేవగఢ్ బరియా గ్రామంలోనే నివసిస్తున్నారు. రంధిక్‌పూర్ గ్రామానికి చెందిన వాహన వ్యాపారి సమీర్ గచ్చి కూడా తన 12 మంది కుటుంబ సభ్యులతో గ్రామాన్ని విడిచిపెట్టి దేవగఢ్ బరియాలోని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. సమీర్ మాట్లాడుతూ.. తమకు తొలుత ఆ 11 మంది రేపిస్టులు, హంతకులు జైలు నుంచి విడుదలయ్యారన్న విషయం తెలియదన్నారు. వారు గ్రామానికి చేరుకున్నాక బాణాసంచా కాల్చి, సంగీత్‌తో సంబరాలు చేసుకున్నారనీ అప్పుడే ప్రభుత్వం వారిని విడుదల చేసందన్న సంగతి తెలిసిందన్నారు.  ఆ వెంటనే తాము గ్రామం విడిచి పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాము కలెక్టర్ కు లేఖ కూడా రాసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన 55 మంది సంతకాలతో కూడిన ఆ లేఖలో బిల్కిస్ బానోకు న్యాయం చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన 11 మందినీ తిరిగి జైలుకు పంపాలనీ కోరినట్లు తెలిపారు. ఆ 11 మందినీ తిరిగి జైలుకు పంపే వరకూ తాము గ్రామంలో అడుగుపెట్టేది లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.  

ఆ ఓటమి ఓ పీడకల.. కపిల్ దేవ్

దేశంలో క్రికెట్ ఒక మతం.. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులకు ఉన్న పాపులారిటీ కంటే.. మ్యాచ్ లో ఓ సెంచరీ చేసిన ఆటగాడికి రాత్రికి  రాత్రి వచ్చేసే పాపులారిటీ అంత కంటే ఎక్కువ.1983లో ఇంగ్లాండ్ లో జరిగిన ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ ఫైనల్ లో అంతకు ముందు వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన విండీస్ ను మట్టి కరిపించిన కపిల్ డెవిల్స్(భారత జట్టు) దేశంలో క్రికెట్ కు ఆదరణ  పెంచేసింది. ఒక్క  సారిగా దేశంలో క్రికెట్ మానియా పెరిగిపోయింది. ఆ తరువాత నుంచి ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఇండియానే గెలవాలి అని అభిమానులు ఆశించారు. అందుకు విరుద్ధంగా జరిగితే ఆగ్రహంతో రగిలిపోయేవారు. ఆటగాళ్ల  ఇళ్లపై దాడులకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. అయితే  ఇవ్వన్నీ ఒకెత్తు.. దాయాది దేశం పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ఒకెత్తులా మారిపోయింది. భారత్ - పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ లా కాకుండా రెండు దేశాల మధ్య యుద్ధం అంత టెన్షన్ ఇరు దేశాల్లోనూ నెలకొని ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఒక విధమైన తెలియని ఉద్వేగం నిండి ఉంటుంది. ఇరు దేశాల మధ్యా సంబంధాల కారణంగా గత కొన్నేళ్ల నుంచీ ఇరు దేశాల మధ్యా సిరీస్ లు జరగడంలేదు. కానీ ఆసియాకప్, వరల్డ్ కప్ టోర్నమెంట్లలో మాత్రం ఇరు జట్లూ తలపడే అవకాశం మాత్రం లభిస్తోంది. ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా తిలకిస్తారు. ఆ సిరీస్ ఏదో ఇరు దేశాల ప్రతిష్టకూ సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. అలాగే  ఇరు జట్లూ కూడా యాషెస్ గెలవడం కోసం సర్వశక్తులూ ఒడ్డి ఆడతాయి. అయితే  భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే యాషస్ ను మించిన ఉత్కంఠ ఉంటుంది. యాషస్ సీరీస్ ను మించిన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ కప్ ముంగిట 1986 ఆసియాకప్ ఫైనల్ లో భారత్- పాకిస్థాన్ తలపడిన మ్యాచ్ గురించి గుర్తు చేసుకోవడం అప్రస్తుతం ఎంతమాత్రం కాదు. చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ గురించి అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ అదో పీడకల అన్నాడు. అసలింతకీ 1986లో ఆషియా కప్ ఫైనల్ మ్యాచ్ గురించి అప్పటి ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ ఏమన్నాడంటే.. గెలిచేశామనుకున్న మ్యాచ్ లో చివరి బంతికి పరాజయం పాలయ్యాం. అది నిజంగా నమ్మలేని సంఘటన. ఆ మ్యాచ్ గురించి తలుచుకుంటే నిద్ర పట్టదు. ఇప్పటి దాకా అలాంటి నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను అంటాడు. ఇంతకీ ఆ మ్యాచ్ లో ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు చేయాలి. క్రిజ్ లో మియాందాద్ ఉన్నాడు. బౌలర్ చేతన్ శర్మ. చివరి బంతికి నాలుగు పరుగులు అంటే ఒక్క బౌండరీ చాలు. ఆ బౌండరీ ఇవ్వకూడదన్న పట్లుదలతో భారత జట్టు ఫీల్డింగ్ ను మోహరించింది. అయితే చివరి బంతికి సిక్సర్ కొట్టి మియాందాద్ భారత్ చేతుల్లోంచి మ్యాచ్ ను ఎగరేసుకు వెళ్లిపోయాడు. భారత జట్టులో నిరాశ, బాధ.. పాక్ శిబిరంలో సంబరాలు. చివరి బంతికి ఓటమిని కెప్టెన్ కపిల్ దేవ్, జట్టు సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కపిల్ అయితే చాలా ఏళ్ల వరకూ ఆ ఓటమి ఓ పీడకలలా వెంటాడిందని చెబుతాడు.  

బాబు భద్రతకు ముప్పు?.. సెక్యూరిటీ పెంచాలని ఎన్ఎస్జీ నిర్ణయం!

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) డీఐసీ భద్రతా ఏర్పాట్లు సమీక్షించం, పర్యవేక్షించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న అతి కొద్ది మందిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒకరు. అటువంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం, ఆయన నివాసంలో ఎన్ఎస్జీ డీఐజీ సమర్దీప్ సింగ్ స్వయంగా పరిశీలించడం. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించి తగు సూచనలు చేయడంతో ఏం జరిగిందన్న ఆందోళన తెలుగుదేశం శ్రేణుల్లోనే కాకుండా సామాన్యులలో కూడా నెలకొంది. ఈ హఠాత్ తనిఖీలు, సమీక్షల వెనుక చంద్రబాబుకు ముప్పు ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ లే కారణమని భావిస్తున్నారు. ఏపీలో ఆయన భద్రతకు సంబంధించిన పలు అనుమానాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యక్తమౌతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నం వంటి సంఘటనల నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ పుట్స్ రావడంతో ఆయన భద్రత  విషయంలో ఎన్ఎస్జా అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రతపై రివ్యూ చేయాలని నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగాద ఎన్ఎస్జీ భద్రత ఉన్నది కేవలం నలభై మందికి మాత్రమే. వారిలో చంద్రబాబు కూడా ఒకరు. ఈ మేరకు ఎన్ఎస్జీ డీఐజీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తేలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పరిశీలించారు. భద్రతా పరంగా కొన్ని లోటుపాట్లను గుర్తించారు. ఆయనకు భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున చంద్రబాబుకు లభిస్తున్న భద్రతా ఏర్పాట్ల పట్ల ఎన్ఎస్జీ బృందం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి చంద్రబాబు పర్యటనలలో ఉన్న సమయంలో రాష్ట్ర పోలీసు విభాగం భద్రతా4 ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, భద్రతా చర్యలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఏపీ పోలీసులు అటువంటి ప్రత్యేక ఏర్పాట్ల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి. ఆయన పర్యటనలలో ఉన్న సమయంలో అధికార పక్ష కార్యకర్తలు ఆయనపై దాడులకు సైతం సిద్ధపడుతున్నా భద్రతా ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్ఎస్జీకి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన సంఘటనలు ఏపీ పోలీసుల తీరు ఎంత దారుణంగా ఉన్నదో తేటతెల్లం చేశాయి. చంద్రబాబు ప్రారంభోత్సవం చేయాల్సిన అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం, ఆయన పర్యటనను అడ్డుకోవడానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఆయన సమీపంలోనికి దూసుకు వెళ్లడం వంటి ఘటనలు ఆందోళన రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్జీ ప్రత్యేక బృందం చంద్రబాబు సెక్యూరిటీపై సమీక్ష చేసింది. స్వయంగా పరిశీలించి భద్రతను పెంచాలని నిర్ణయించింది. 

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హై కోర్టు ఓకే

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎటువంటి షరతులూ లేకుండా యాత్రను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ఆపాలంటూ పోలీసులు బండిసంజయ్ కు ఇచ్చిన నోటీసులను హైకోర్టు స్పస్పెండ్ చేసింది. యాత్రను నిలిపివేయాలంటూ  పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టిన హై కోర్టు  పాదయాత్రకు బేషరతు అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని విఘ్నం కలిగేలా బండి సంజయ్ వ్యాఖ్యానించారంటూ యాత్ర నిలిపివేయాలని నోటీసులు ఇచ్చిన దానిపై ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను చూపాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం పెన్ డ్రైవ్ లో ఆధారాలను సమర్పించింది. అయితే పెన్ డ్రైవ్ ఆధారాలు చెల్లవన్న కోర్టు సరైన పద్ధతిలో ఆధారాలను సమర్పించకపోవడంపై ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. అనంతరం యాత్రకు అనుమతి తీసుకున్నారా అని బండి సంజయ్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. అందుకు తీసుకున్నామంటూ వారు సమాధానమిచ్చారు.  దీంతో బండి సంజయ్ యాత్రకు అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బండి సంజయ్ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంపై తెరాస శ్రేణులలోనే ఒకింత అసహనం వ్యక్తమైంది. ఎవరికీ పట్టని యాత్రను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేయడం వెనుక ప్రభుత్వ వ్యూహమేమి టో అర్దం కావడం లేదని టీఆర్ఎస్ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నది సామెత. టీఆర్ఎస్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ సామెతనే గుర్తు చేస్తున్నది. బండి ప్రజా సంగ్రామ యాత్ర..  ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో కూడా రాష్ట్రంలో జనం పట్టించుకోవడం లేదు. విడతల వారీగా బండి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ నడుస్తున్నారు. ముగింపు సభ పేర పార్టీ అగ్రనాయకులను తీసుకువచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు, ప్రసంగాలలో కొత్తదనమేమీ ఉండటం లేదు.  కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతి అన్న ఊకదంపుడు విమర్శలను జనం పట్టించుకోవడం లేదు  ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బండి పాదయాత్ర వల్ల ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతోందంటూ యాత్రకు బ్రేక్ వేయడం ఎందుకో? దాని వెనక ఉన్న వ్యూహమేమిటో అర్ధం కావడం లేదని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అవసరం లేని ఆంక్షల వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. పైగా బండి సంగ్రామ యాత్ర దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఈ సమయంలో ఆ యాత్రను నిలిపేయాలంటూ నోటీసులు ఇవ్వడం వల్ల యాత్ర గురించి చర్చ జరుగుతుందనీ, అది బీజేపీకే ప్రయోజనకరమని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ యాత్రకు అనుమతి ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని అంటున్నారు. 

రిషీ.కొత్త త‌రం ప్ర‌తినిధి

రిష్వాంజస్ రిషి రాఘవన్ బెంగ ళూరు నవనిర్మాణ పార్టీ (బీఎన్‌ పీ)లో యూత్ వింగ్ లీడర్. అతను సెప్టెంబరు 2021లో బీఎన్‌ పీకి చిన్న వ‌య‌సులోనే గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్ని కయ్యా డు. పార్లమెంటరీ బిల్లులు, యూని యన్ పార్లమెంట్‌లో ఆమో దిం చిన విధానాలపై ఇన్‌పుట్‌లను అం దించడానికి 22 ఏళ్ల యువకుడు కన్నడ న్యూస్ ఛానెల్‌లలో ప్యానె లిస్ట్‌గా కూడా ఆహ్వానం అందు కున్నాడు.  ప్రజాస్వామ్యం కేవలం ఎన్నుకున్న‌ ప్రభుత్వాన్ని కలిగి ఉండటానికే పరి మితం కాకుండా సమాజంలోని అన్ని రంగాలు , స్థాయిల నుండి, ముఖ్యంగా యువకులను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, మేము 40 ఏళ్లలోపు జనాభాలో మెజారిటీని కలిగి ఉన్నాం, 60 ఏళ్లు పైబడిన మెజారిటీ వ్యక్తులను అధికారానికి ఎన్ను కుంటాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశం పురో గమించింది, అయితే మనకు దారి చూపడానికి కొంతమంది యువ జ్యోతులు కలిగి ఉంటే అభివృద్ధి చాలా వేగంగా ముందుకు సాగుతుంది. భారతదేశానికి అన్ని స్థాయిలలో యువ నాయకులు అవసరం, వారు తమ ఉత్సాహాన్ని శక్తిని సమాజ అభివృద్ధికి ఉపయోగించగలరన్న‌ది రిషి అభిప్రాయం. రిషి బెంగళూరుకు చెందిన ఒక యువ రాజకీయ ఔత్సాహికుడు.  నేటి, రేపటి రాజకీయాలను రూపొందించడానికి తన స్థాయిలో దృష్టాంతాన్ని మారుస్తున్నారు. రిషి రాఘవన్ యువతరానికి ఓటుహక్కును కోల్పోకుండా లేదా రాజకీయ ప్రక్రియల నుండి వైదొలగకుండా చూసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ప్రజా సమస్యలను వినిపించడం ముఖ్యమైనది. అతను బెంగుళూరు నవనిర్మాణ పార్టీ (బీఎన్‌పీ)లో యూత్వింగ్ లీడర్, స్కూల్ కెప్టెన్‌గా పోటీ చేస్తున్నప్పుడు పద్నాలుగేళ్ల వయసు లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన డైనమిక్ నాయకుడు. బీఎన్‌పి అనేది  ప్రపంచంలోనే  ఏకైక  నగర పార్టీ. 22 ఏళ్ల అతను అశోక విశ్వవిద్యాలయం నుండి తన బీఎస్సీ (ఆనర్స్) ఎకనామిక్స్, ఫైనాన్స్ పూర్తి చేసాడు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ అభ్యసిస్తున్నాడు. రిషి తన విద్యార్థి నాయకత్వ ప్రయాణంతో కళాశాల వరకు ముందుకు సాగాడు, రికార్డ్ బ్రేకింగ్ ఓట్లతో విద్యార్థి కౌన్సిల్ ఎన్నికలలో విజయం సాధించాడు.  యువ ఔత్సా హికులు జూలై 2019లో కేంద్ర బడ్జెట్‌కు సహకరించారు. 19 సంవత్సరాల వయస్సులో, రిషి లోక్‌సభ, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడానికి ఎంపికయ్యారు.  రిషి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు. ప్రాతినిధ్యం, దేశంలో ఏమి జరుగుతుందో దానికి బాధ్యత వహించాలనే ఆలోచనపై అతను ఆసక్తి కలిగి ఉన్నాడు. అతను ది లాజికల్ ఇండియన్‌తో మాట్లాడాడు మరియు న్యూ ఏజ్ లీడర్‌షిప్, వార్డు స్థాయి ఎన్నికల ప్రాముఖ్యతపై తన ఆలోచనలను పంచుకున్నాడు. వార్డు ఎన్నికలపై తన ఆసక్తి గురించి అడిగినప్పుడు, రిషి మాట్లాడుతూ, మూడు అంచెల రాజకీయాలలో అత్యధిక ప్రభావం చూపే ప్రాంతం అయినప్పటికీ ఇది అత్యంత విస్మరించబడిన ప్రాంతం. మ‌న‌కు రోజువారీ జీవితంలో ఏమి కావాలి,  సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా మాకు మంచి నాణ్యమైన జీవితం అవసరం. అందులో భద్రత, వీధి దీపాలు, వ్యర్థాల సేకరణలు, రోడ్లు ఉన్నాయి. రేపు, నాకు నీటి సరఫరా లేదా విద్యుత్ లేకుంటే, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని పిలవలేనన్నాడు. అందువల్ల, దీనికి చాలా సంభావ్యత ఉంది" అని రిషి చెప్పారు. బీబీఎంపి వర్కర్స్ గురించి వాయించే బీబీఎంపి, ఎన్నుకోబడిన కౌన్సిల్ లేకుండా నగర వార్షిక బడ్జెట్‌ను ఖరారు చేసే ముందు ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలను సంప్రదించాలని బీబీఎంపి నిర్ణయించింది. ఇది మాజీ కౌన్సిలర్‌లచే పెద్దగా పట్టించుకోలేదు. , మేయర్లు మరియు స్టాండింగ్ కమిటీల సభ్యులను అటువంటి కీలక సమావేశాల నుండి ఎలా తప్పించారు. నివేదిక ప్రకారం, పౌర సంఘం కూడా ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారించ డానికి బడ్జెట్ పరిమాణాన్ని తగ్గించాలని యోచిస్తోంది. ఈ సమస్యను రిషి ఫ్లాగ్ చేశారు, అతను బీబీఎంపిని కోరాడు. పనుల నాణ్యత దెబ్బతినకుండా కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లించడంపై దృష్టి సారించారు.కార్పొరేషన్ కార్మికులకు రూ.3,200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, వారి బకాయిలను ఎలా చెల్లిస్తారో మాట్లాడలేదని, దాని ఖాతాలు వేయాలని ఆయన పౌరసరఫరాల సంస్థను కోరారు. గత సంవత్సరాల నుండి పబ్లిక్ ఆడిట్‌లు తద్వారా డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్న‌దీ పౌరులకు తెలుస్తుంది. కార్పొరేషన్ పనితీరును విశ్లేషించడానికి కూడా నివేదికలు ప్రజలకు సహాయపడతాయి. రిషి కౌన్సిల్‌లో ఉండటం  ప్రాముఖ్యత గురించి , స్టాండింగ్ కమిటీల ద్వారా నగర వ్యవహారాలలో ఎలా పాల్గొన వచ్చు అనే దాని గురించి మాట్లాడారు. విద్య, యువజన వ్యవహారాలపై బీబీఎంపీలో ఓ కమిటీ ఉంది. నగరంలో దాదాపు 157 బిబిఎంపి నడిచే పాఠశాలలు ఉన్నాయి, అవి మంచి స్థితిలో లేవు. బెంగళూరులో మాకు ఉన్న ప్రైవేట్ సంస్థల కారణంగా ఈ పాఠశాలలు గుర్తించబడలేదు. నేను దానిపై మక్కువ కలిగి ఉన్నాను. నేను రాష్ట్ర విద్యను విప్లవాత్మకంగా మార్చా లని చూడ టం లేదు. కానీ గణనీయమైన మార్పు తీసుకురావడానికి" అని రిషి చెప్పాడు. నీడ్ ఆఫ్ న్యూ ఏజ్ లీడర్ షిప్ కొత్త యుగం నాయకులను కలిగి ఉండటం  ప్రాముఖ్యతపై మాట్లాడుతూ, పౌరుల అంచనాలకు అనుగుణంగా మార్పును తప్పని సరిగా మార్చుకోవాలని బీఎన్‌పి హెడ్ అన్నారు. నేడు, మనకు స్మార్ట్, సాంకేతికతతో నడిచే పాలన అవసర మైతే, మీరు సాంకేతికతను అర్థం చేసుకునే వ్యక్తులను ఎన్నుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావడానికి ఇదే ప్రధాన కారణం.

నేనెలా అన‌ర్హుణ్ణి అవుతాను?.. హేమంత్ సొరేన్‌ మండిపాటు

ఒక‌రి మీద బుర‌ద‌జ‌ల్లి, త‌ర్వాత వివాదాస్ప‌దుడ‌ని ప్ర‌చారం చేసి భ్ర‌ష్టు ప‌ట్టించ‌డం బీజేపీవారికి అలవాటైన విద్య అని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అన్నారు. త‌నపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాదించిందంటూ వెలువ‌డిన క‌థ‌నాల‌పై   హేమంత్ సోరేన్ స్పందించారు. తనపై అనర్హత వేటుకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు.   అంతకు ముందు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను సీఎం కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని హేమంత్ సొరేన్ పై అనర్హత వేటు వేయాలంటూ   ఎన్నికల కమిషన్ సీల్డ్ కవర్‌లో ఝార్ఖండ్ గవర్నర్ కు పంపిందనీ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.   ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లాభదాయక పదవిని నిర్వహిస్తున్నందువల్ల ఆయన్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించా లని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న  గవర్నర్ కు కలిసి ఫిర్యాదు చేశారు.  ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం హేమంత్  సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, ముఖ్య మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. దీనిపై గవర్నర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు. దీనిపై ఎన్నికల సంఘం  తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు పంపించిందని, ఈ నివేదిక రాజ్ భవన్‌కు చేరిందంటూ వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ ఢిల్లీ పర్య టనలో ఉన్నారు.