స‌స్రీకాల్  జీ ..   అంటున్న  కెన‌డా సారా!

కాస్తంత న‌లుపు, రాగి క‌ల‌యిక రంగులో జుత్తు, మెరిసే క‌ళ్లు.. దాదాపు ఆర‌డుగుల అమ్మాయి అమాంతం ఊళ్లోకి దిగింది. ఆటోవాళ్లంతా వెంట‌బ‌డ్డారు.. ఫ‌లానా ప్రాంతానికి వెళ్లాల‌న్న‌ది. ప్రాంతం పేరు చెప్పింది గ‌నుక, ఈమెకు భాష రాదు గ‌నుక మ‌న‌వాళ్లు రెచ్చిపోయి వంద‌ల్లో మీట‌రు రేటు చెప్పారు. మొత్తానికి ఎంతో కొంత త‌గ్గి బ‌య‌ల్దేరారు. డ్రైవ‌ర్‌తో పాటు అత‌ని స్నేహితుడు గైడ్ అవ‌తార‌మెత్తాడు. ఆమెను కేవ లం కెనడా నుంచి వ‌చ్చిన అమ్మాయిగానే అనుకున్నారు. బావా, దీన్ని నాలుగు ఏరియాలు తిప్పితే బాగా డ‌బ్బు గుంజుకోవ‌చ్చు గ‌దా అని స‌ద‌రు గైడ్ ఐడియా ఇచ్చాడు. డ్రైవ‌ర్ అలా కాదు ఆమె ఫోన్ నెంబ‌ర్ ప‌ట్టి ఉన్న‌న్ని రోజులూ ఆమెకు సేవ చేసుకుందాం.. అప్పుడు వేల‌ల్లో లాగించేయ‌చ్చ‌ని పెద్ద ఐడియా ఇచ్చా డు.  అలా ఎన్నో ఐడియాల‌తో ఆ అమ్మాయిని నిజంగానే రెండు మూడు ఏరియాలు తిప్పి మొత్తానికి కెన‌డా పిల్ల వెళ్లాల్సిన చోటికి తెచ్చారు. ఆమె రూ.300 ఇచ్చింది.  వీళ్లు ఆమె మొబైల్ నెంబ‌ర్ అడిగారు. ఇక్క‌డున్న‌న్నాళ్లూ స‌దా సేవ‌లో ఉంటామ‌ని. ఆమె అంతే స‌ర‌దాగా హిందీలో ..హ‌మారా అసిస్టెంట్ య‌హా ర‌హ‌తా..ఆప్ జాయియే!.. అన్న‌ది. అంతే  మ‌న హీరోలు నోరెళ్ల‌బెట్టి రివ్వున వెళిపోయారు. మ‌న భాష ఏద‌యినా ఇత‌రుల‌కు పెద్ద‌గా రాద‌న్న‌దే పొర‌పాటు. ఈరోజుల్లో విదేశాల్లో చాలామంది  మ‌న భాష‌ల మీద మ‌న‌కంటే ఆస‌క్తి చూపుతున్నారు. ఒక‌వేళ ఎక్క‌డ‌న్నా హోట‌ల్లోనో, రోడ్ల‌మీదో  విదేశీయులు క‌న‌ప‌డ‌గానే వాళ్ల‌కేమీ తెల్వ‌ద‌ని రెచ్చిపోతే అవ‌మానం ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తుంది. త‌ల  దించుకోవాల్సి వ‌స్తుంది. అంద‌రికీ అన్నీ తెలుస్తాయి. విదేశీయులు త‌మ అవ‌స‌రాల‌కు కొన్ని త‌ప్ప‌కుండా నేర్చుకుం టారు. అందులోనూ ప్ర‌యాణాల‌కు సంబంధించిన ప‌ద‌జాలం త‌ప్ప‌కుండా నేరుస్తారు. ముఖ్యంగా మ‌న దేశానికి, మ‌న న‌గ‌రాల‌కు వ‌చ్చేవారు మ‌రీ జాగ్ర‌త్త‌గానూ ఉంటారు. అస‌లే మ‌న‌వాళ్ల‌కి ఎర్ర‌టి వాళ్లంటే మ‌రీ చుల‌క‌న‌. చిన్న‌ప‌ర్సుల్లో కోట్లు ఉంటాయ‌న్న భ్ర‌మ‌. వాళ్లు ప‌నిగ‌ట్టుకుని నేర్చుకుంటున్నారు. వాళ్ల పిల్ల‌ల‌కీ నేర్పుతున్నారు.  చాలారోజుల క్రితం టొరాంటోకి చెందిన పాప్ ర‌చ‌యిత‌, గాయ‌ని సారా విక్కెట్ ఢిల్లీ వ‌చ్చింది. ఢిల్లీలో ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అత‌నూ నిజానికి టొరాంటో వాడే. వాళ్లిద్ద‌రూ నెట్ ద్వారా ద‌గ్గ‌ర‌య్యారు. ఆమెకు అత‌ను ఏకంగా పంజాబీ నేర్పించాడు. ముందు ముందు ఎంతో అవ‌స‌రం ఉంటుంద‌న్న ఆలోచ న‌తో.  సారా  అత‌నితో ఎక్కువ‌గా ఇంగ్లీషులో మ‌ధ్య మ‌ధ్య‌లో పంజాబీలోనూ మాట్లాడుతూంటుంది.  కొత్త భాష నేర్చుకోవాల‌నుకునే విదేశీల‌యుల్లో చాలామంది భార‌తీయ భాష‌ల‌ప‌ట్ల ఎంతో మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తా ర‌ని ఆమే అన్న‌ది. ఆమె విదేశీ స్నేహితులు, తోటి విద్యార్ధులు, ఉద్యోగులు చాలామంది భార‌తీయ భాష‌ల్లో చాలా భాష‌లు.. త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన భాష నేర్చేసుకున్నార‌ట‌. వీల‌యితే ఎక్కువ ఆ భాష‌లోనే మాట్లాడు తున్నార‌ట‌! అన్న‌ట్టు సారా ఈ మ‌ధ్య‌నే ఓ ప‌ది నిమిషాలు పంజాబీలో మాట్లాడిన వీడియో ఢిల్లీలో ఇత‌ర స్నేహితు ల‌కూ పంపింది. త‌డ‌బ‌డినా.. బాగానే నేర్చుకుంటున్నావ్ సారా.. అంటూ వీరూ ఆమెను అభినం దించారు. మ‌రంచేత‌.. విదేశీయులు మ‌న న‌గ‌రానికి వస్తే వారికేమీ రాద‌ని అనుకోవ‌ద్దు!

బీహార్ సీఎం నితీష్ కు బిగ్ షాక్.. మంత్రిపదవికి కార్తీక్ కుమార్ రిజైన్

ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గ కూర్పు పూర్తి చేసి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆయన కేబినెట్ నుంచి ఆర్జేడీకి చెందిన కార్తీక్ కుమార్ రిజైన్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ ఆర్జేడీకి చెందిన కార్తిక్ కుమార్ కు న్యాయశాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయనపై కిడ్నాప్ కేసు నమోదై ఉండటంతో నితీష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయశాఖ మంత్రిగా కార్తిక్ కుమార్ తనపై కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ  నేపథ్యంలోనే నితీష్ కుమార్ కార్తిక్ కుమార్ మంత్రిత్వ శాఖ మార్చారు. పెద్దగా ప్రాధాన్యత లేని చెరకు మంత్రిత్వ శాఖ ఇచ్చారు. దీంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. శాఖ మార్చిన వెంటనే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు. చెరకు మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను నేరుగా గవర్నర్ కే పంపారు. ఆయన దానిని వెంటనే ఆమోదించారు. 2014లో జరిగిన ఒక కిడ్నాప్ కేసులో  నిందితుడిగా ఉన్న కార్తీక్ కుమార్ పై ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయశాఖ మంత్రిగా ఆయనను కొనసాగించడం భావ్యం కాదని తలచిన నితీష్ కుమార్ ఆయన శాఖను మార్చారు. మామూలుగా చూస్తే ఇది సాధారణమే అనిపిస్తుంది కానీ బీహార్ లో సామాజిక సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే కార్తీక్ కుమార్ రాజీనామా సీఎం నితీష్ కుమార్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బీహార్ లో రాజకీయంగా శక్తిమంతమైన భూమిహార్లకు చెందిన కార్తీక్ కుమార్ నితీష్ పై అలకపూనడం ఆర్జేడీ, జేడీయూ బంధంపై అంటే పొత్తుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని బీజేపీ కార్తి కుమార్ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఆయనతో పాటుగా మహాఘట్ బంధన్ కూటమిలో మంత్రి పదవులు దక్కక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిపైనా బీజేపీ దృష్టి సారిస్తే నితీష్ కుమార్ కు చిక్కువు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.

దావూద్  ప‌ట్టుకోండి  రూ.25 ల‌క్ష‌లు అందుకోండి .. ఎన్ ఐఏ

భార‌త్‌లో మ‌ళ్లీ క‌ల్లోలం సృష్టించ‌డానికి, ఉగ్ర‌దాడుల‌కుపాల్ప‌డేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్ర‌సంస్థ‌ల‌తో చేతులు క‌లిపి రెచ్చిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న అంత‌ర్జాతీయ తీవ్ర‌వాది దావూద్‌ను ప‌ట్టించిన‌వారికి రూ.25 ల‌క్ష‌లు, అత‌ని అనుచ‌రుడు ఛోటా ష‌కీల్‌ను ప‌ట్టించిన‌వారికి రూ.20 ల‌క్ష‌లు ఇస్తామ‌ని  జాతీయ ఇన్ వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ) న‌జ‌రానా   ప్ర‌క‌టించింది. దేశంలోకి డి కంపెనీ ఇప్ప‌టికే మార‌ణా యుధాలు, డ్ర‌గ్స్‌, దొంగ‌నోట్లు వారికి సంబంధించిన సంస్థ‌ల ద్వారా తెచ్చార‌ని ఎన్ ఐఏ గ్ర‌హించింది.  వారిద్ద‌రే కాకుండా, దావూద్ సోద‌రుడు అనీస్ ఇబ్ర‌హీం అలియాస్ హాజీ అనీస్‌, స‌న్నిహితుడు జావెద్ ప‌టేల్ అలియాస్ జావెద్ చిక్నా,ష‌కీల్ షేక్ అలియాస్ ఛోటా ష‌కీల్‌, ఇబ్ర‌హీం ముష్తాక్ మెమ‌న్ అలి యాస్ టైగ‌ర్ మెమ‌న్ ల విష‌యంలోనూ ఎన్ ఐఏ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  వీరంతా  పాకిస్థాన్ క‌రాచీలోనే  తిష్ట‌వేసి భార‌త్‌లో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. 1993 ముంబై పేలుడు సంఘ‌ట‌న సంబంధించి ఇబ్ర‌హీంపై  ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్యూరిటీ కౌన్సిల్  2003లోనే రూ.25 లక్ష‌లు ప్ర‌క టించింది. అనేక దారుణ సంఘ‌ట‌న‌ల్లో కీల‌క‌పాత్ర ఉన్న ల‌ష్క‌రే తోయిబ ఛీప్ హ‌ఫీజ్ స‌యీద్‌, జైషె మొహ‌మ్మ‌ద్ ఛీఫ్ మౌలానా మ‌సూద్ అజ‌ర్‌, హిజ‌బుల్ ముజ‌హిద్దీన్ స్థాపించిన స‌యీద్ స‌లా ఉద్దీన్‌, అత ని స‌న్నిహితుడు అబ్దుల్ ర‌వూప్ అస్ఝ‌గ‌ర్ల‌ను కూడా భార‌త్‌తో పాటు అనేక దేశాలు ప్ర‌పంచ ప్ర‌మాద క‌ర వ్య‌క్తులు, సంస్థ‌లుగా ప్ర‌క‌టించాయి. దీనికి ఐక్య‌రాజ్య‌స‌మితి మ‌ద్ద‌తు కూడా ల‌భించింది.  పాకిస్థాన్ ర‌హ‌స్య‌సంస్థ‌ల‌తో, ఐఎస్ ఐతో క‌లిసి డి కంపెనీ మ‌ళ్లీ దాడుల‌కు పాల్ప‌డేందుకు సిద్ధ‌ప‌డిం ద‌న్న స‌మాచారా న్ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే ఎన్ ఐఏ అందుకుని దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక న‌గ‌రాల్లో అధికారుల‌ను, పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చ‌రించింది. అంతేగాక‌, ఈ ఏడాది మే నెల‌లో ఎన్ ఐఏ 29 కీల‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక బృందాల‌తో త‌నిఖీలు నిర్వ‌హిం చింది. ఈ సంద‌ర్భంగానే  1993 ముంబై పేలుళ్ల తో సంబంధం ఉన్న హాజీఅలీ ద‌ర్గా, మ‌హీ మ్ ద‌ర్గా ట్ర‌స్టీ సుశీల్ ఖాంద్వానీని, మ‌రికొంత‌మంది కీల‌క వ్య‌క్తుల‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఎన్ ఐఏ అప్ర‌మ‌త్తం కావ‌డం, డి గ్యాంగ్ లీడ‌ర్ ని, అత‌ని స‌హ‌చ‌రుడు ఛోటా ష‌కీల్ పైనా న‌జ‌ రానా ప్ర‌క‌టించ‌డంతో దేశంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్య న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల‌తో పాటు పోలీస్ యంత్రాంగం మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌యింద‌ని చెప్ప‌వ‌చ్చు.  

కేసీఆర్‌తో క‌లిసిన వేళావిశేషం.. నీతిష్‌కు బీజేపీ స‌వాల్‌!

కొంద‌రితో క‌లిస్తే దుర‌దృష్టం వెన్నాడుతుందంటారు. అందులో నిజం ఉందా లేదా అన్న‌ది  అవ‌త‌ల పెడితే, ప్ర‌స్తుతం తెలంగాణా సీఎం కేసీఆర్‌తో క‌లిసిన ప్ర‌తీవారికి ఏదో ఒక స‌మ‌స్య త‌లెత్తుతోంది. తాజాగా బీహార్ సీఎం నీతిష్ కుమార్ ప‌రిస్థితి అదే. మొన్న‌నే తాజాగా నీతిష్‌తో కేసీఆర్ క‌లిశారు. అప్పుడే బీజేపీ హెచ్చ‌రిక‌లు జారీచేసింది.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌లే బీహార్ ప‌ర్య‌టించారు. అది కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సం దేహం అవసరం లేదు. తన  ప్రసంగంలో బీజేపీ ముక్త భారత్ అంశాన్ని ప్రస్తావించారు. అందుకోసం నితీష్ కుమార్తో కలిసి పని చేస్తామన్నారు. కమలం పార్టీ పాలనలో దేశం అన్ని విధాలుగా నష్టపోయిం దన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తు ల ఐక్యత నేడు దేశానికి అత్యవసరమన్నారు. నితీష్ తో కలిసి ఆ దిశగా  పని చేస్తామన్నారు.   రాబో యేది  థర్డ్ ఫ్రంట్  కాదనీ, అది మెయిన్ ఫ్రంట్ అనీ చెప్పారు. ఈ ఫ్రంట్ కు నాయక త్వం ఎవరు వహిస్తారన్న ది ఎన్నికల సమయంలో అందరం చర్చించుకుని నిర్ణయిస్తామని  కేసీఆర్ చెప్పారు.  కేసీ ఆర్ తో  ఎవ‌రు క‌లిసినా భ‌విష్య‌త్తులో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌న్న‌ది  బీహార్ ముఖ్య‌మంత్రి నీతిష్ కూడా గ్ర‌హిం చక‌పోలేదు. క‌నుక‌నే ఆ స‌భ‌లో నీతిష్ కాస్తంత ఇబ్బందిప‌డి మ‌ధ్య‌లోనే లేచి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా, కేసీఆర్ కోరిక‌మీద కూర్చుండిపోయారు.  కానీ, చిత్రంగా బీజేపీ నుంచి అప్పుడే స‌వాలు ఎదుర‌యింది బీహార్ సీఎంకి. గ‌తంలో నీతిష్ కు డిప్యూటీగా చేసిన బీజేపీ ఎంపి సుశీల్ కుమార్ 2024 ఎన్నిక‌ల్లో మీరు ఎవ‌రి మ‌ద్ద‌తు తీసుకున్నా,  ప్ర‌ధాని స్థానం స‌రే,   మీ రాష్ట్ర సీఎంగానూ ఉండ‌గ‌ల‌రా అని స‌వాలు విసిరారు. బీజేపీ కేవ‌లం ప్ర‌చార ఆర్భాట‌మే కానీ వాస్త‌వానికి దేశానికి ప్ర‌త్యేకించి చేస్తున్న‌దేమ‌ని నీతిష్ చేసిన విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా సుశీల్ ఈ స‌వాలు విసిరారు.  నీతిష్గారూ మీరు స‌ర‌యిన స్నేహ‌సంబంధాలు నిర్వ‌హించ‌డం లేదు, బీహార్‌కు మోదీ ఎంతో చేశార‌న్న ది మీరు గ్ర‌హించాల‌ని సుశీల్ అన్నారు. కేసీఆర్‌, నీతిష్ కి ఎన్నిక‌లు గెలిచే ధైర్యం ఉంటే, బీజేపీని ధీటు గా ఎదుర్కోగ‌ల‌మ‌న్న స‌త్తా ఉంటే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ నుంచి పోటీ చేయ‌మ‌ని సుశీల్ కుమా ర్ స‌వాలు విసిరారు. మోదీ ప్ర‌భుత్వం కేవ‌లం ప్ర‌చారం మీద‌నే ఆధార‌ప‌డి ఇంత‌కాలం ఉన్న‌ద‌ని అనుకుంటే, మ‌రి 18 రాష్ట్రాల్లో అధికారంలోకి ఎలా వ‌స్తుంద‌న్న‌ది మీరే ఆలోచించుకోండ‌ని సుశీల్ అన్నారు. 

కేసీఆర్ సారూ.. తెలంగాణలో బాధితులు లేరా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో బాధితులే లేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అంతా భేషుగ్గా ఉంది. ప్రజలకు సమస్యలే లేవు.. కానీ పాపం ఇతర రాష్ట్రాలలో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రాంగా, సమస్యలే లేని రాష్ట్రంగా వారిని ఆదుకోవలసిన బాధ్యత తెలంగాణదే, అంటే తనదే అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన బీహార్ వెళ్లారు. అక్కడ గాల్వాన్ అమరుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే సికిందరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కుటుంబాలనూ పరామర్శించి వారికీ నష్టపరిహారం ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు కన్నుమూస్తే వారి కుటుంబాలను పరామర్శించడానికి మాత్రం కేసీఆర్ కు మనసు రాలేదో లేక తీరిక దొరకలేదో అర్ధంకాదు కానీ ఆయన మాత్రం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలోనూ ఇలాగే జరిగింది. ఆయన పంజాబ్ వెళ్లారు. అక్కడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అంద జేశారు. ఆ సొమ్ములేవీ కేసీఆర్ జేబులోంచో, కుటుంబ ఆస్తులు అమ్మో ఇచ్చిన సొమ్ములు కాదు. తెలంగాణ ప్రజల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసిన పన్నుల నుంచి ఇచ్చినవి. ఆ సొమ్ములపై తొలుత అధికారం తెలంగాణలోని బాధిత ప్రజలదే. రాష్ట్రంలో ప్రజలను వారి కష్టాలకు, వారి నష్టాలకూ వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లి సొమ్ములు పంపిణీ చేసి తన ప్రతిష్టను పెంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారన్న విమక్షాల విమర్శలను జనం కూడా సమర్థిస్తున్నది అందుకే. రాష్ట్రాన్ని గాలికొదిలేసి జాతీయంగా ఓ పెద్ద నాయకుడిగా ఎదగాలన్న కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. ముందు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తూ రాష్ట్ర పోలీసుల నివేదికలే స్పష్టం చేస్తున్నాయి.  అటువంటిది రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి.. ఇతర రాష్ట్రాలలో ప్రజలను ఉద్ధరించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట సామెతగా అభివర్ణిస్తూ పరిశీలకులు సైతం తప్పుపడుతున్నారు. గతంలో  కొండగట్టు వద్ద బస్సు బోల్తా పడి పలువురు మరణించిన సందర్భంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సాయంఅందించలేదు. కేసీఆర్ బాధి కుటుంబాలను పరామర్శించలేదు. ఇప్పుడు కేసీఆర్ బీహార్ పర్యటన సమయంలో ప్రజలు నాటి సంఘటనను గుర్తు చేసుకుని తెలంగాణ ప్రజలు ప్రజలు కారా?  వారి బాధలు బాధలు కావా.. లేక రాష్ట్రంలో బాధితులకు చేసిన సాయం గురించి దేశంలో పెద్దగా మాట్లాడుకోరన్న భావమా అంటూ కేసీఆర్ వైఖరిని తప్పుపడుతున్నారు. జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు కోసం ప్రజాధనాన్ని వాదించుకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సందర్భంలో  దేశవ్యాప్తంగా అన్ని పత్రికలలో భాషతో, వాటి సర్క్యలేషన్ తో సంబంధం లేకుండా పేజీలకు పేజీలు ప్రకటనలు ఇవ్వడాన్ని వారీ సందర్భంగా ప్రస్తావించి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.  

ఆసియాక‌ప్‌.. సూర్య ప్ర‌తాపంతో భార‌త్ ఘ‌న‌విజ‌యం

పాకిస్థాన్‌పై చివ‌రంటా ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో గెలిచిన భార‌త్ త‌న రెండో మ్యాచ్‌లో హాం కాంగ్‌పై సునాయాసంగా విజ‌యం  సాధించింది.  హాంకాంగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. టాస్ గెలిచినా హాంకాంగ్ బౌలింగ్ చేయ‌డానికి నిర్ణ‌యించుకుంది. మొద‌టి ఐదారు ఓవ‌ర్ల‌లో హాంకాంగ్ బౌల‌ర్లు  కొంత భార‌త్ స్టార్ ఓపెన‌ర్లు కెప్టెన్ శ‌ర్మ‌, రాహుల్‌ను క‌ట్ట‌డి చేసిన‌ట్టు క‌నిపించారు. క్ర‌మేపీ భార‌త్ బ్యాట‌ర్లు విజృంభించారు. ఫోర్లు సిక్స్‌ల‌తో బ్యాటింగ్ రుచి చూపించారు. దుర‌దృష్ట‌ వ‌శాత్తూ రోహిత్ శ‌ర్మ ఓ మంచి సిక్స్ కొట్ట‌బోయే ఫీల్డ‌ర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత కింగ్ కోహ్లీ వ‌స్తూనే కాస్తంత ధాటిగా ఆడు తూ సింగిల్స్‌, డ‌బుల్స్ మీద దృష్టిపెట్ట‌డంతో స్కోర్ వేగం పుంజుకుంది. రాహుల్ సిక్స్‌లు, ఫోర్ల‌తో త‌న పాత ఫామ్ మ‌ళ్లీ రుచి చూపించాడు.  అత‌ని త‌ర్వాత వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం కోహ్లీకి ధీటుగా వ‌స్తూనే ఫోర్లు, సిక్స్‌లూ బాది హాంకాంగ్ బౌల‌ర్లకు లైన్ మ‌ర్చిపోయేలా చేశాడు. భారీ సిక్స్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకు న్నాడు. ముఖ్యంగా 20వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లతో సూర్య కుమార్ యాదవ్ హాంకాంగ్ బౌలర్ అర్షద్‌పై విరుచుకు పడ్డాడు. ఆ జోరులోనే భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 20 ఓవ‌ర్ల‌లో 192 ప‌రుగులు చేసింది. సూర్య  26 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో బ్యాట్‌ను గట్టిగా ఝుళిపించి 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలి చాడు. కింగ్‌ కోహ్లీ కూడా 44 బంతుల్లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలి చాడు.  193 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది. బాబర్ హయత్ 41 పరుగులు, కించింత్ షా 30 పరు గులు, మెకెనీ 16 పరుగులు, జీషన్‌ అలీ 26 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, అవీష్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. హాంకాంగ్ జట్టు కెప్టెన్ నిజాకత్‌ ఖాన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌ సూపర్‌-4కు చేరింది. దాదాపుగా భారత్‌, పాక్‌ జాతీయులతో నిండి ఉన్న హాంకాంగ్‌ జట్టు రోహిత్‌ సేనకు ఏవిధంగానూ పోటీ ఇవ్వలేకపోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ 98 పరుగుల భాగస్వామ్యం టీమిండియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఒకే ఒక్కడు కేజ్రీవాల్! బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆప్ వికర్ష్ ఆపరేషన్

దేశంలో మోడీ,షా ద్వయం ఎత్తులను చిత్తు చేస్తూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఒకే ఒక్క బీజేపీయేతర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేల్చేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేజ్రీవాల్ తానే స్వయంగా ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు నమోదు చేసిన తరువాత కూడా ఆప్ ధీమాగా ఉంది. అక్రమ కేసు అంటు నిలబడింది. సోదాలు, తనిఖీలను పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. ఆప్ ఎమ్మెల్యేలు 40 మందికి ఒక్కొక్కరికీ పాతిక కోట్ల రూపాయలు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ అసెంబ్లీ సాక్షిగా ఆరోపించి.. కమలనాథుల ప్రలోభాలకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ లొంగలేదని సగర్వంగా ప్రకటించి.. ప్రభుత్వం పట్ల ఆప్ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా నిరూపించడానికే నంటూ తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకుని మోడీకి సవాల్ విసిరారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్ తన ప్రసంగంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని కాలరాసి.. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రాలలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. వాస్తవానికి అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైందనీ, కానీ కేజ్రీవాలే స్వియంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టి బీజేపీకి కేజ్రీవాల్ షాక్ ఇచ్చారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఏ సీఎం కూడా స్వయంగా తన ప్రభుత్వంపై తానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరు. కానీ కేజ్రీవాల్ రూటే సెపరేటు. తన ప్రభుత్వంపై, తన ఎమ్మెల్యేలపై అచంచల విశ్వాసం, తనకున్న ప్రజాదరణపై నమ్మకం ఉన్నందునే కేజ్రీవాల్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సాధారణంగా విశ్వాస తీర్మానంపై సభ్యులందరూ మాట్లాడిన తరువాత ముఖ్యమంత్రి సమాధానం చెబుతారు. ఈ విషయంలో కూడా కేజ్రీవాల్ బీజేపీకి, కేంద్రానికి ఝలక్ ఇచ్చారు.  ముందుగా తానే ప్రసంగించడం ద్వారా బీజేపీకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి కల్పించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రంలోని మోడీ సర్కార్ కూలదోసిన తీరును కళ్లకు కట్టినట్లు వివంరించారు.  ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం తరువాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబైలో స్పందించిన తీరే కేజ్రీవాల్ ప్రసంగం ఎంత సూటిగా, సుత్తిలేకుండా ఉందో అవగతమౌతుంది. కేజ్రీవాల్ మాదిరిగా తాను కమల నాథుల కుట్రలను ముందుగా పసిగట్ట లేకపోయానని అంగీకరించారు.  దేశమంతటా కాషాయి జెండా ఎగరాలన్న ఆకాంక్షతో కమలనాథులు సాగిస్తున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌ పూర్వపు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిం చిన పార్టీ ఫిరాయింపుల విధానం కన్నా దుర్మార్గమైనదని  కేజ్రీవాల్ విమర్శించారు.    

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం.. లోకేష్ ఫైర్

రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గుండ్రాలు విసిరే సంస్కృతి ప్రస్తుతం ఏపీలో ఉంది. ఒక ఫ్యాక్షనిస్టు, పిరికి వాడు ప్రభుత్వాధినేతగా ఉంటే ఆ రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉంటుందో చెప్పడానికి ఏపీ నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. విమర్శ అంటే భయం, ప్రజలంటే భయం..దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పోలీసుల అండతో అక్రమ కేసులు, అరెస్టులు, వైసీపీ గూండాలతో దాడులు.. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పంలో అన్న క్యాంటిన్ ను రెండో సారి కూల్చేసిన తరువాత ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు పర్యటనలో ఆయన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజాస్వామ్యంపై ఇసుమంతైనా గౌవరం లేని ఒక ఫ్యాక్షనిస్టు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారని దుయ్యబట్టారు. ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయితే రాష్ట్రం ఎంత అధోగతి పాలౌతుందో అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని లోకేష్ అన్నారు. అయిన దానికీ కాని దానికీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 60 మందికి పైగా తెలుగుదేశం కీలక నేతలపై కేసులు పెట్టారనీ, ఐదు వేల మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారనీ లోకేష్ అన్నారు.  ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి తెలుగుదేశం డీఎన్ఎలో భయం అన్న పదానికి తావేలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఐపీసీ(ఇండియన్ పీలన్ కోడ్)ని ఫాలో కావడం లేదనీ, జేపీసీ(జగన్ పీనల్ కోడ్)ని ఫాలో అవుతున్నారనీ లోకేష్ అన్నారు. రాష్ట్రంలో కొందరు పోలీసులకు తెలుగుదేశం నేతల ముందు మీసం మెలేసి, తొడ కొట్టడం, తెలుగుదేశం నాయకులపై దాడులు చేయడం ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారెవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సొంత చెల్లి, తల్లికివ అన్నంపెట్టకుండా బయటకు గెంటేసిన దుర్మార్గుడు జగన్ పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్ లను కూడా కూల్చేస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హయాంలో నడుస్తున్న అన్న క్యాంటిన్లను రద్దు చేశారు, ఇప్పుడు తెలుగుదేశం నిర్వహిస్తున్న క్యాంటిన్లను కూల్చివేస్తున్నారు అని విమర్శించారు. మంగళగిరి లో తాను అన్న క్యాంటీన్ పెడితే ధ్వంసం చేసారు. కుప్పం లో అన్న క్యాంటీన్ పై దాడి చేసారని లోకేష్ విమర్శించారు. ప్రశాంతంగా ఉండే కుప్పం పులివెందుల పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉన్న చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే కనీస భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలకు బాధ్యులు వైసీపీ గూండాలైతే.. అమ్ముడుపోయిన పోలీసులు  టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని, అరెస్టులు చేశారని విమర్శించారు.  వైసిపి గూండాల దాడి ని అడ్డుకుంటే హత్యాయత్నం కేసులా? అన్నారు.  పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వాడు…ఇక్కడికి వచ్చి కుప్పంను అభివృద్ది చేస్తాడా? అని లోకేష్ ఎద్దేవా చేశారు.   గడప గడప కి వెళ్లలేని వైసిపి నాయకులు కుప్పంలో గొప్పలు చెప్పడం హస్యాస్పదంగా ఉందని లోకేష్ అన్నారు.

అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

తన డ్రైవర్ ను మర్డర్ చేసి మృతదేహాన్ని సొంత కారులో డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్న అనంతబాబు గడువులోపల తనపై చార్జిషీటు దాఖలు చేయనందున బెయిలు ఇవ్వాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ ను రాజమహేంద్రవరం ఎస్సీఎస్టీ న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన బెయిలు పిటిషన్ ను  కోర్టు తిరస్కరించడం ఇది రెండో సారి. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనంతబాబుకు కోర్టు మూడు రోజులు కండీషన్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన బెయిలు పొడిగించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ నెల 5 వరకూ బెయిలు పొడిగించింది. అయితే కింది కోర్టు బెయిలు షరతులపై ఇచ్చిన ఉత్తర్వులు యథాతథంగా అమలులో ఉంటాయని స్పష్టం  చేసింది.  మరో నాలుగు రోజులలో హైకోర్టు పొడిగించిన బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో అనంతబాబు మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టులో చుక్కెదురైంది.

సీఎం కేసీఆర్ పరమ దుర్మార్గుడు.. బండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమ దుర్మార్గుడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణిస్తే వారిని కనీసం పరామర్శించకుండా రాజకీయ పర్యటన కోసం బీహార్ వెళతారా అని విమర్శించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలకు మరణించడానికి కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం, మూర్ఖత్వమే కారణమని నిందించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ బుధవారం పరామర్శించారు. ఆ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బాధితులను పరామర్శించకుండా బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలోని పేదలను వదిలేసి పంజాబ్, బీహార్‌లో డబ్బులు పంచటం దారుణమన్నారు. ఆపరేషన్లు వికటించి మరణించిన   మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని   డిమాండ్ చేశారు.   రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమా అని నిలదీశారు.  రాష్ట్ర సీఎంకు పేదల ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుంటామంటే అంగీకరించేది లేదన్నారు.  బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలే స్వయంగా చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు. 

కేసీఆర్ బీహార్ పర్యటన కాయా? పండా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఏ కారణం చెప్పినా ఆయన బీహార్ పర్యటన మాత్రం కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన వేసిన అడుగులకు ఎటువంటి సత్ఫలితాలూ రాలేదు.  బీహార్ పర్యటన కూడా కేసీఆర్ కు రాజకీయంగా ఏ మంత కలిసిరాలేదు.  తన బీహార్ పర్యటనలో కేసీఆర్ ముందుగా చెప్పినట్లే    అక్కడి అమర వీరుల కుటుంబాలకు.. అలాగే సికింద్రాబాద్‌లో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల కుటుంబాలకు దాదాపుగా రూ. కోటి ఆర్థిక సాయం అందచేశారు. అక్కడి వరకూ ఓకే కానీ కేసీఆర్ కు రాజకీయంగా అండగా నిలుస్తామన్న హామీని మాత్రం  బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి పొందడంలో మాత్రం విఫలమయ్యారు. మర్యాదపూర్వకంగా కేసీఆర్ తో కలిసి ప్రెస్ మీట్ లో అయితే పాల్గొన్నారు కానీ నితీష్ కుమార్ ఎక్కడా రాజకీయపరమైన ప్రకటనలు కానీ, జాతీయ స్థాయి రాజకీయాలలో మోడీకి వ్యతిరేక కూటమి గురించి కానీ మాట్లాడలేదు. పైపెచ్చు కేసీఆర్ మాట్లాడటం కూడా తనకు ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పకనే చెప్పాశారు. తన బాడీ లాంగ్వేజ్ ద్వారా అయితేనేమి, కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా నితీష్ తో కలిసి సాగుతామంటూ కేసీఆర్ మీడియా సమావేశంలో చెబుతుండగానే నితీష్ సమావేశం నుంచి లేచి వెళ్లి పోవడానికి ప్రయత్నించారు. అయితే స్వయంగా కేసీఆర్ వారించడంతో సభా మర్యాద పాటించాలి కనుక ఆగిపోయానన్నట్లుగా కూర్చున్నారు. కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీ ముక్త భారత్ అంశాన్ని ప్రస్తావించారు. అందుకోసం నితీష్ కుమార్ తో కలిసి పని చేస్తామన్నారు. కమలం పార్టీ పాలనలో దేశం అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యత నేడు దేశానికి అత్యవసరమన్నారు. నితీష్ తో కలిసి ఆ దిశగా  పని చేస్తామన్నారు.  రాబోయేది  థర్డ్ ఫ్రంట్  కాదనీ, అది మెయిన్ ఫ్రంట్ అనీ చెప్పారు. ఈ ఫ్రంట్ కు నాయకత్వం ఎవరు వహిస్తారన్నది ఎన్నికల సమయంలోఅందరం చర్చించుకుని నిర్ణయిస్తామని  కేసీఆర్ చెప్పారు. ఇక్కడే కేసీఆర్ కు రాజకీయంగా బీహార్ పర్యటన ఏ మాత్రం ప్రయోజనం కలగలేదన్నది అవగతమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ పార్టీ నాయకత్వాన్ని కలిసినా జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక శక్తులకు తానే నాయకత్వం వహిస్తాననీ, జాతీయ రాజకీయాలలో చక్రం  తిప్పుతాననీ చెబుతూ వచ్చారు. అయితే  ఎక్కడా ఆయనకు సానుకూలత వ్యక్తం  కాకపోవడంతో బీహార్ లో బాణి, వాణి మార్చి.. నాయకత్వం విషయాన్ని విస్తృత చర్యల అనంతరం నిర్ణయించుకుంటామంటూ ఓ మెట్టు దిగారు. ఇక బీహర్ సీఎం విషయానికి వస్తే.. తమ రాష్ట్రానికి వచ్చారు కనుక పొగడక తప్పదన్నట్లుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడంటూ ప్రశంసలు గుప్పించారు. గ్రామీణాభివృద్ధి కోసం తెలంగాణలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు భేష్ అన్నారు. మిషన్ భగీరథ పథకాన్నీ పొగిడారు. అంతే తప్ప రాజకీయ విషయాలపై ఒక్కటంటే  ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో బీహార్ పర్యటన కూడా కేసీఆర్ కు జాతీయ రాజకీయాల దిశగా ముందుకు సాగేందుకు ఎంత మాత్రం ఉపయోగపడలేదని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనతో పాటు కలిసి వచ్చేలా, కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా కలిసి పోరాడేందుకు నితీష్ కు ఒప్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని చెబుతున్నారు. పైపెచ్చు మా రాష్ట్రాలనికి వచ్చారు. గాల్వాన్ మృతుల కుటుంబాలనూ, సికిందరాబాద్ అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలనూ కలిసి పరామర్శించి, వారికి ఆర్థిక  సాయం అందజేస్తానన్నారు. ఆ పని చేసుకు వెళ్లండి చాలు అన్నట్లుగా నితీష్ కుమార్ వ్యవహరించారనీ, కేసీఆర్ మాట్లాడుతుండగానే నితీష్ ప్రెస్ మీట్ నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నించడమే.. రాజకీయంగా కేసీఆర్ తో అడుగులు కలిపేందుకు ఆయనకు సుతరామూ ఇష్టం లేదని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. 

కసిరే ఎండలు కాల్చే కాలం ముందుంది!

ముందున్నది ముసళ్ల పండుగ అన్నది సామెత.. అయితే ఒక తాజా నివేదిక ప్రకారం ముందున్నది మండుటెండట కాలం. ఇప్పటికే ఏటికేడు ఎండలు మండి పోతుంటే రానున్న కాలంలో రికార్టులన్నిటినీ తిరగరాసే స్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదౌతాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవ్వడం ఖాయమని   కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ జర్నల్ లో ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొంది. ఇప్పుడు  నమోదవుతున్న ఎండలకే జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే.. ఇక రానున్న కాలంలో మరింతగా ముదిరే ఎండలకు జనం అల్లల్లాడటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే రాబోయే కాలంలో దేశంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరగబోతున్నాయని చెబుతున్నారు. ఇండియాలాంటి ఉష్ణ మండల దేశాల్లో రాబోయే  దశాబ్దాల్లో ఎండలు గణనీయంగా పెరగబోతున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది.  ఈ నివేదిక ప్రకారం  వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల కారణంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఏడాదిలో అత్యధిక కాలం 30-50 శాతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2050 వరకు ఉష్ణ మండల దేశాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఆసియా, ఉత్తర యూరప్‌లో ప్రమాదకరమైన వడగాడ్పులు కూడా వీస్తాయి. కర్బన ఉద్గారాల్ని తగ్గించకపోతే ఇదే రీతిలో ఎండలు పెరిగిపోయే ముప్పు ఉందని నివేదిక పేర్కొంది. ఇటువంటి వాతావరణం దీర్ఘకాలిక అరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.  

జైలుకు ఏపీ మ‌హేష్ బ్యాంక్ డైరెక్ట‌ర్లు

కోర్టు ధిక్కరణ నేరం రుజువవడంతో హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ బ్యాంకు ఎండీ,సీఈవో సహా 11 మందికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. 15 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ జస్టిస్‌ పి.నవీన్‌రావు ధర్మాసనం   తీర్పు వెలువరించింది. ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు సొసైటీకి ఎన్నికలు నిర్వహించే విషయంలో సొసైటీకి చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, ఎన్నికల నిర్వహణను నిలిపేయాలని పలువురు కోర్టును ఆశ్రయించారు.  విచారణ చేపట్టిన హైకోర్టు గత ఏడాది జనవరిలో కామన్‌ ఆర్డర్‌ జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించవచ్చనీ.. అయితే తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు ఎటువంటి విధానపరమైన నిర్ణయాలూ తీసుకోరాదని తెలిపింది. అయితే హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా రూ.100 కోట్ల మేర రుణాలు జారీ చేశారని.. పేర్కొంటూ బ్యాంకు షేర్‌హోల్డర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం డైరెక్టర్ల బోర్డు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలినందున వారికి 15 రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకూ వ్యక్తుల ఖాతాలపై దాడి చేసి దోచుకున్న నేరగాళ్లు ఏకంగా బ్యాంక్‌ సర్వర్‌నే హ్యాక్‌ చేశారు. మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12.90 కోట్లు లాగేశారు. బ్యాంకు సాంకేతిక సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న మొత్తాన్ని 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసేశారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీులు.. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు కనుగొన్నారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సైబర్ నేరగాళ్లు డబ్బుని బదిలీ చేసిన ఖాతాలన్నీ ప్రస్తుతం ఫ్రీజ్ అయి ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కోర్టు అనుమతి లేకుండా బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు బ్యాంకు చైర్మన్ తో పాటు 10 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తెలుగువన్ ఎప్పుడో చెప్పింది... జాతీయ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది!

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో త్వరలో కొత్త కూటమి ఏర్పడనుందని ఇప్పుడు జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయాన్ని తెలుగువన్ ఎప్పుడో చెప్పింది.  . తెలుగుదేశం   నాలుగేళ్ల‌ తరువాత, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) లోకి    తిరిగి రాబోతున్నట్లు జాతీయ మీడియా ఇప్పుడు చెబుతోంది. కానీ ఏపీలో కొత్తటమి కొలువుదీరనున్నదని తెలుగువన్ గతంలోనే చెప్పేసింది. ఏపీ తెలంగాణలలో పరస్పర ప్రయోజనాల పరిరక్షణకు తెలుగుదేశం, బీజేపీలు దగ్గర కాబోతున్నాయని వెల్లడించిన తెలుగువన్  ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు అన్న కథనంలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరౌతున్న విషయాన్నికళ్లకు కట్టినట్లు వివరించింది.  ఇప్పుడు జాతీయ మీడియా కూడా అదే కోణంలో కథనాలు ప్రసారం చేస్తున్నది.   నాలుగేళ్ల కిందట తెగతెంపులు చేసుకుని వెళ్లిన తెలుగుదేశం పార్టీని తిరిగి ఎన్‌డీఏలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుయనీ,  ఆంధ్ర, తెలంగాణల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తున్నదనీ రిపబ్లిక్‌ టీవీ చానల్‌ ఓ కథనం ప్రసారం చేసింది. ఈ   చానల్‌ బీజేపీకి అనుకూలమన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని..   అందుచేత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సానుకూలంగా ఉందని చానల్‌ వెల్లడించింది. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాని మోదీతో కరచాలనం చేసి.. ఐదు నిమిషాలు ముచ్చటించిన విషయాన్ని ప్రస్తావించింది. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చిందని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చంద్రబాబు.. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తుచేసింది. ‘2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ తెగతెంపులు చేసుకున్నాయి. హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ టీడీపీ మోదీ కేబినెట్‌ నుంచి వైదొలగింది. ఇటు బీజేపీ కూడా ఆంధ్రలో చంద్రబాబు మంత్రివర్గానికి గుడ్‌బై చెప్పింది.ఆసందర్భంలో రెండు పార్టీలూ కూడా పరస్పరం ఆరోపణలు గుప్పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ ఇప్పటికీ తెలుగురాష్ట్రాలలో పరిస్థితులలో గణనీయ మార్పు వచ్చిందని పేర్కొన్న ఆ మీడియా టీడీపీ ఎన్‌డీఏలో చేరే అవకాశముందని  వివరించింది.

 అనంత ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌పై కేసు నమోదు

అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై టూటౌన్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్ బాషాపై కేసులు నమోదు చేశారు.  ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను సర్వీస్ నుంచి ఎస్పీ ఫకీరప్ప డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, కానిస్టేబుల్‌పై ఐదు క్రిమి నల్ కేసులు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారుల కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్ప డ్డారని ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై ప్రకాష్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దళితుడిననే చిన్నచూపుతో కుట్రపూరి తంగా తనపై తప్పుడు విచారణ జరిపి.. వాంగ్మూలాన్ని రికార్డు చేశారని ప్రకాష్ పేర్కొన్నాడు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధి కారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌పై ఐదు క్రిమినల్ కేసులు ఉండడంతో పోలీసులు ప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాక, పోలీసు క్వార్టర్ ఖాళీ చేయాలని మంగళవారం నోటీసులు కూడా పంపారు. దీంతో ఆగ్రహించిన ప్రకాశ్.. బాధితురాలు లక్ష్మికి పది లక్షల రూపా యలు ఇచ్చి మరణ వాంగ్మూలం మార్చేశారని, దళితుడైన తనపై చిన్న చూపుతో కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపిం చారు. ఇందుకు బాధ్యులైన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 2019లో తనపై నమో దైన కేసు కోర్టులో విచారణ నడుస్తుండగానే పోలీసులు విచారణ చేపట్టి దోషిగా తేల్చారని మండిపడ్డారు. ప్రస్తుత సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ పాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఇద్దరు సీఐల నేతృత్వంలో పూర్తి పక్షపాతంగా విచారణ సాగిందని వ్యాఖ్యా నించారు. నేరం రుజువైందని వారికి వారే నిర్ణయించుకొని ఉద్యోగం నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఏఆర్ కాని స్టేబుల్ భానుప్రకాష్ వివాదం రోజురోజుకు ముదురుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎఫ్ఐఆర్ నమో దు  చేస్తున్న సమయంలో ఎస్పీ ఫక్కీరప్ప టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కొద్దిసేపటి తరువాత అక్కడి నుంచి వెళ్లి పోయా రు. అనంతరం సిఐ శివరాముడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్పీ, ఏ ఎస్పీ, డీఎస్పీపై నమోదైన కేసుకు సంబంధించి డీఐజీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుందని సీఐ వెల్లడించారు. అయితే.. ఇతర జిల్లాకు చెందిన ఉన్నతా ధికారితో విచారణ జరిపించాలని డీఐజీ నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు.  

తాజ్‌మ‌హ‌ల్ కాదు.. తేజో మ‌హాల‌య‌!

పిల్ల‌కో, పిల్లాడికో ఇంట్లోవాళ్లు తాత‌తండ్రుల పేర్లో, ఇష్ట‌దేవుని పేరో పెట్టుకుంటూంటారు. కానీ బంధువులు, చుట్టుప‌క్క‌ల‌ వారంతా అబ్బే అదేం పేరు అనుకుంటూ.. వారికి తోచిన పేరు పెట్టి పిలుస్తూంటారు.. పెద్ద‌య్యాకా అదే ఖాయ‌మ‌వుతుంది. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతానిక‌యినా, వ‌స్తువుక‌యినా, పురాత‌న క‌ట్ట‌డాల‌క‌యినా, పువ్వుకైనా బీజేపీవారు వారికి తోచిన పేరు మార్చి దాన్ని ఖాయం చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నారు. వారికి అదో స‌ర‌దా అదో తుత్తి! దీన్ని మూర్జ్ఞ‌త్వం అంటు న్నారు యావ‌త్ విప‌క్షాల నాయ‌కులూ. కాదు అస‌లు వాటికి ఉండాల్సిన పేరు ఇదే.. ఇత‌రులు అలా పేరు పెట్టారు అని బీజేపీ వారి జ్ఞాన‌బోధ‌!  షాజహాన్, ముంతాజ్‌ల ప్రేమ మందిరం. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలం. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది పర్యాటకులు తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ ప్రపంచ వింతను చూసి కొత్త అనుభూతిని పొందు తారు. ఇలాంటి తాజ్‌మహల్‌పై మళ్లీ రాజకీయ వివాదం రాజుకుంది. తాజ్ మహల్ పేరు త్వరలో మారబోతోందని యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాజ్ మహల్ స్థానంలో శివాలయం ఉండేదని, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం, త్వరలోనే తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చనుందని ఆయన స్పష్టం చేశారు. తాజ్మహల్  పేరును తేజో మహాలయగా మార్చాలని బీజేపీ కౌన్సిలర్ శోభారామ్ రాథోడ్  ప్రతిపాదించారు. దీనికి సంబంధించి న తీర్మానాన్ని ఆయన బుధవారం ఆగ్రా నగర పాలక సంస్థ  కు సమర్పిస్తారు. దీనిపై నగర పాలక సంస్థ సభ్యులు తదుపరి నిర్ణయం తీసుకుంటారు. తాజ్ మహల్‌లో కమలంతో కూడిన కలశం ఉన్నట్లు రుజువులు తన వద్ద ఉన్నాయని శోభారాం రాథోడ్ తన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజ్ మహల్ గురించి అసలు నిజాలు తెలుసుకు నేందుకు దానిలో తాళాలు వేసి ఉన్న 22 గదులను తెరవాలని కొన్ని నెలల క్రితం అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖ లైంది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది.  ఇదిలావుండగా, తాజ్ మహల్ వాస్తవానికి ఓ శివాలయమని, ఈ విషయాన్ని ప్రాచీన గ్రంథాలు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు చెప్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ, యోగి ఆది త్యనాథ్ ప్రభుత్వం తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చుతుందని చెప్పారు. బీజేపీ అనుకున్న‌ది త‌డ‌వుగా ఎంత ప‌నయినా ఏదో విధంగా త‌మ‌కు అనుకూలం చేసుకోవ‌డం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. దేశంలో ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా, బీజీఏపీ నాయకుల‌కు ఇత‌ర‌త్రా ప్ర‌జ‌ల్ని ప్రాంతీయ‌విభేదాలు రెచ్చ‌గొడుతూ ఇబ్బంది పెట్టాల‌న్న‌దే ల‌క్ష్యంగా చేసుకున్న‌ ట్టుంద‌ని విశ్లేష‌కుల మాట‌. ప్ర‌జాసంక్షేమం, రాష్ట్రాలు కేంద్రం మ‌ధ్య స‌హ‌కార ప‌రిస్థితులు, విదేశీ స‌రిహ‌ద్దుల స‌మ‌స్య‌లు కేంద్రా నికి చిన్నివిగానే క‌న ప‌డుతున్నాయి. మోదీ ప్ర‌భుత్వానికి అర్జెంటుగా ప్రాచీన క‌ట్ట‌డాల పేర్లు, బిల్డింగ్‌ల‌పేర్లు, న‌దుల పేర్లూ మార్చేస్తే అంతా హిందూస్తాన్ అయిపోతేగాని సంతృప్తిగా ఉండ‌దు. అందుకే ప్ర‌తీ రాష్ట్రంలో వారి వీరాభిమా నులు, ప్ర‌చార‌ కుల‌తో ఇలాంటి అర్ధంలేని, ప‌నికి మాలిన కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి ఆనందిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌ కులు అంటు న్నారు. ప్ర‌తీ ఏడాది ఏదో ఒక మ‌త ప‌ర మైన వివాదం రేపి దాన్ని దేశంలో పెద్ద చ‌ర్చ‌గా మార్చి అస‌లు స‌మ‌స్య‌ల మీద‌, పాల‌న‌మీదా ఎవ‌రూ ఆరోప‌ణ‌లు చేయ‌కుండా దృష్టి మ‌ళ్లించ‌డం  ప్ర‌ధాని, హోంమంత్రి షా, రాష్ట్రాల బీజేపీ నేత‌లు ఎంతో అత్య‌ వ‌స‌రంగా భావించ‌డం దుర‌దృష్ట‌క‌రం. 

బ్రాస్‌లెట్ కోసం ఫ్లెక్సీ!

ఒక బొమ్మ కోసం ఒక‌మ్మాయి ల‌వ‌ర్‌తో గొడ‌వ‌ప‌డి బొమ్మ తెచ్చిస్తేనే నిన్ను పెళ్లాడ‌తాన‌ని అంటుంది. వాడు వూరంతా తిరిగి ఓ దుకాణంలో అలాంటిదే కొనిస్తాడు. ఆమె ప‌రిశీల‌న‌గా చూసి బొమ్మ‌ని పారేసి, స‌ద‌రు ప్రేమికుడిని ఇక క‌ల‌వ‌ద్ద‌ని వారిస్తుంది. కావ‌డానికి ఇదో సినిమా సీన్‌. కానీ ఆ బొమ్మ‌కి ఆ అమ్మాయికి ఉన్నఅనుబంధం గ‌ట్టిదే. అది తాను టెన్త్‌లో ఉండ‌గా వాళ్ల డాడీ కొనిచ్చాడు. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత దాంతోనే ఎక్కువ మాట్లాడుతూండేది. అదో బంధం. అది అంద‌రికీ అర్ధ‌మ‌య్యేది కాదు. దానితో మాట్లాడుతూంటే తండ్రితో మాట్లాడుతున్న‌ట్టే ఉంటుంది. ఇదో సెంటిమెంటు కూడా. అందువ‌ల్ల అలాంటి వ‌స్తు వులు ఎవ‌రూ వ‌దులుకోరు, పారేసుకోరు. ప్రాణంతో స‌మానంగా చూసుకునే బ్రాస్‌లెట్ పోగొట్టుకున్న కుర్రాడు మ‌రెంత‌గా బాధ ప‌డుతున్నాడో. అది తెచ్చిచ్చిన‌వారికి త‌గిన బ‌హుమ‌తి ఇస్తాన‌ని ఏకంగా  ఫ్లెక్సీ పెట్టేడు! తల్లి జ్ఞాపకార్ధం గా ఉంచిన బ్రాస్‌లైట్‌ కనిపించకుండా పోయిందని, దానిని అందజేసిన వారికి తగిన బహుమతి ఇస్తానంటూ పుదుకోట జిల్లా పొన్నామరావతికి చెందిన నారాయణన్ విజ్ఞప్తి చేస్తున్నాడు. తల్లి కానుకగా ఇచ్చిన బ్రాస్‌లెట్‌ను ఆమె మరణా నంతరం జ్ఞాపకంగా నారాయణన్‌ ధరిస్తున్నాడు. ఆగ‌ష్టు 22వ తేది ఉసిలంపట్టిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చిన నారా యణన్‌ బ్రాస్‌లెట్‌ కనిపించకపోవడంతో దిగ్ర్భాంతి చెందాడు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తాను వెళ్లి వచ్చి న దారిలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు. అందులో తల్లి జ్ఞాపకంగా ఉన్న బ్రాస్‌లెట్‌ కనిపించలేదని, అందజేసిన వారికి తగిన బహుమతి అందిస్తానంటూ పేర్కొన్నాడు. ఆ ఫ్లెక్సీ ఉన్న దారంట వెళ్లేవారు ఈస‌రికే చాలామంది న‌వ్వుకుని ఉంటారు. నేను ఫ‌లానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ల‌వర్స్ పెట్టుకోవ‌డం చూశాంగాని వీడెవ‌డండీ, పోయిన వ‌స్తువు కోసం ఇలా ప్ర‌చారం చేస్తారా?   వెర్రిగాని! అంటూ ఎగ‌తాళిగా న‌వ్వు కున్నారు కొంద‌రు యువ‌కులు. కానీ అంత ప్రచారం చేస్తున్నాడంటే దాని వెన‌క ఉన్న అనుబంధ బ‌లం అలాంటిది. త‌ల్లి లేని లోటు తీర్చ‌డం చాలా క‌ష్టం. ఆమె యిచ్చిన బ్రాస్‌లెట్‌తో కాలం గ‌డుపుతున్న‌వ్య‌క్తికి అది కూడా దూర‌మ‌యితే న‌ర‌క‌ యాత‌నే. అది చేతికి ఉంటే అమ్మ‌చేతిని ప‌ట్టుకుని న‌డుస్తున్న‌ట్టే ఉంటుంది. ప్లీజ్‌.. బ్రాస్‌లెట్ దొరికితే ఇచ్చేయండి... అత‌నికి త‌ల్లిని ద‌రిచేర్చిన‌ట్ట‌వుతుంది.

ప్ర‌పంచ టీటీకి శ్రీ‌జ‌

ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల టేబుల్‌ టెన్నిస్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్వర్ణంతో అదరగొట్టిన తెలుగమ్మాయి ఆకుల శ్రీజ ప్రపంచ చాంపి యన్‌షిప్‌ జట్టులో చోటు దక్కించుకుంది. టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ వచ్చేనెల 30 నుంచి అక్టోబరు 9 వరకు చైనాలో జరగ నుంది. శ్రీజ, రీత్‌ రిష్యా, దియా, స్వస్తికా ఘోష్‌లతో కూడిన మహిళల బృందానికి మనికా బత్రా.. సానిల్‌, హర్మీత్‌, మానుష్‌ షా, మానవ్‌తో కూడిన పురుషుల జట్టుకు సాతియాన్‌ సారథ్యం వహిస్తారు. కాగా, వెటరన్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ వ్యక్తిగత కారణాల రీత్యా టోర్నీలో ఆడడం లేదు.  ఇటీవలి కామన్వెల్త్‌ క్రీడల్లో శరత్‌ కమల్‌ మూడు స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టులో హైదరాబాదీ స్టార్‌ ఆకుల శ్రీజ చోటు దక్కించుకుంది. కామన్వెల్త్‌ క్రీడల్లో శరత్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన శ్రీజ.. అదే జోరు ఇక్కడ కూడా కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొంది.

ప‌నిమ‌నిషి ని హింసించిన   సీమాపాత్ర అరెస్టు   

కొన్నేళ్లుగా త‌న యింటి ప‌నిమ‌నిషి 29 ఏళ్ల సునీత‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసినందుకు మాజీ ఐఏఎస్ అధికారి భార్య, సస్పెండ్ అయిన బీజేపీ నాయకురాలు సీమా పాత్రాను జార్ఖండ్ పోలీసులు బుధవారం (ఆగ‌ష్టు31) అరెస్ట్ చేశా రు. మాజీ ఐఏఎస్ అధి కారి భార్య పాత్రపై అర్గోరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, సస్పెండ్ చేయబడిన బిజెపి నాయకురాలు, అరెస్టు చేసిన తర్వాత, ఆమె నిర్దోషి అని ఆరోపణలను రాజకీయ ప్రేరేపిత మ‌ని పేర్కొంది. సీమా పాత్ర ఆ మహిళను రాంచీలోని నాగరిక అశోక్ నగర్ ప్రాంతంలోని తన నివాసంలో చాలా సంవత్సరాలు బందీగా ఉంచింది. పాత్రను బిజెపి సస్పెండ్ చేసింది. సునీత అనే మహిళ తనకు ఎదురైన కష్టాలను వివరిస్తున్న వీడియో సోష ల్ మీడియాలో వైరల్ కావడంతో పాత్రను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. సునీతను సీమా పాత్ర కుమారుడు ఆయు ష్మాన్ రక్షించినట్లు సమాచారం. చిత్రహింసల గురించి ఆమె కుమారుడు తన స్నేహి తుడైన ప్రభుత్వ అధికారికి చెప్పి, సహాయం కోరిన తర్వాత పట్టుకున్నారని నివేదికలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన సూచన మేరకు రాంచీ పోలీసులు గత వారం మహిళను పాత్ర నివాసం నుంచి రక్షించి మంగళవారం మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సునీత తన శరీరంపై డజన్ల కొద్దీ గాయాలు అయ్యాయి, ఎందుకంటే ఆమెను వేడి పాన్, ఇనుప రాడ్‌లతో కొట్టారు సంవత్సరాలుగా చిత్రహింసల కారణంగా నేలపై మూత్రా న్ని బలవంతంగా నాకించే వారు. ఇనుప రాడ్‌తో పళ్లు కూడా విరగ్గొట్టిన సునీత.. ఆహారం, నీళ్లు లేకుండా గదిలో బంధించి ఉండడంతో ఆమె దొరికి పోవడం తో ఒక్కసారిగా నిలబడలేకపోయింది. సునీత ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో చికి త్స పొందుతోంది. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేదని గవర్నర్ రమేష్ బైస్ డిజిపి నీరజ్ సిన్హాను అడిగిన ఒక రోజు తర్వాత సస్పెండ్ అయిన బిజెపి నాయకుడి అరెస్టు జరిగింది. కాగా, బీజేపీ నాయకుడు, మాజీ సిఎం బాబులాల్ మరాండి ఆసుపత్రిలో సునీతను పరామర్శించి, మేము బాధితురాలిని కలవ డానికి ఇక్కడకు వచ్చామని, ఆమె పేద మహిళ,  సీమ పాత్ర ఇంట్లో పని చేసేది. ఆమెను కొట్టిన తీరు సరిగా లేదు. సీమ  అరెస్టు చేయడం , పార్టీ ఆమెను కూడా తొలగించడం మంచిదని అన్నారు.