విమర్శించే ముందు అభివృద్ధిని గమనించండి... మంత్రి దయాకర్
posted on Aug 29, 2022 @ 10:34AM
అవతలివారు ప్రశాంతంగా ఉండకూడదని కోరుకుంటే ఎన్ని అడ్డంకులైనా సృష్టిస్తారు. దానికి సామా జిక, రాజకీయాలనే వ్యత్యాసం ఉండదు. ఎలాంటి సమస్యా లేని చోట కూడా ఉందని భ్రమింప చేసి, గొడవలు సృష్టించి విభేదాలు తేవడం వారికి మించినవారుండరు. ఆ కోవకి చెందినవారే బీజేపీ నాయకులని టీఆర్ ఎస్ భావిస్తోంది. బీజేపీ కావాలనే ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతోందని టీఆర్ ఎస్ మండిపడుతోంది. తెలంగాణా అభివృద్ధి బాటలో ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోందన్న అభిప్రాయాలు తెలంగాణాలో ప్రచారంలో ఉన్నాయి. తమ అభి వృద్ధికి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రె స్ లు విమర్శలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఆగష్టు 29 సోమవారం రాయపర్తి మండలం కొండూరులో 14 కోట్ల50 లక్షలతో చేపట్టిన పలుఅభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణా ప్రభుత్వంమీద విమర్శలు చేసే ముందు అభివృద్ధిని ని పరిశీలించాల న్నారు. అసలు తెలంగాణాలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవు తున్నదీ లేని దీ తెలుసుకోవాలని అన్నారు.
బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావద్దని ప్రజలకు హితవు పలికారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తుంటే.. రైతుల నడ్డి విరిచేలా బీజేపీ కుట్రలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమి దేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ది చెందుతుందని తెలిపారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.