ఆసియా క‌ప్ ..లంక ను గెలిపించిన  ధ‌నాధ‌న్ కుషాల్ మెండిస్

కుషాల్ మెండిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో  ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 కు అర్హత సాధించింది. గురువారం (ఆగ‌ష్టు 1) ఉత్కంఠ భరితంగా జరిగిన గ్రూప్‌ చివరి లీగ్‌ పోరులో రెండు వికెట్లతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. 184 పరుగుల లక్ష్యాన్ని ఇంకా నాలుగు బంతులుండగానే 8 వికెట్లు కోల్పోయి శ్రీలంక ఛేదించింది.  టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు..ఓపెనర్‌ మెహ్దీ హసన్‌ (38) అద్భుత ఆరంభం ఇచ్చా డు. కానీ మధ్య ఓవర్లలో శ్రీలంక బౌలర్లు క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. అయితే  అఫీఫ్‌ హొసేన్‌ (39), చివర్లో మొసాదిక్‌ మెరుపులతో బంగ్లాదేశ్‌  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆఫిఫ్ హొస్సేన్ 39 పరుగులు, హసన్ మిరాజ్ 38 పరుగులతో రాణించారు. షకీబుల్ హసన్ (24), మహ్మ దుల్లా (27), మొసద్దిక్ హొస్సేన్(24) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ, చమిక కరుణరత్నే రెండేసి వికెట్లు పడగొట్టారు. మదుశంక, మహేశ్ తీక్షణ, అషిత ఫెర్నాండో ఒక్కో వికెట్ తీశారు.  184 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిశాంక, కుశాల్ మెండిస్ శుభారంభాన్ని ఇచ్చా రు. మొదటి వికెట్ కు 45 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో  నిశాంక, చరిత్ అస లంక వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత‌ మెండిస్ మాత్రం బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిం చాడు.  చ‌క్క‌టి బ్యాటిం గ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చిపోయాడు.  కేవలం 37 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు.  అయితే మిగిలిన బ్యాట్స్మెన్ అంతగా రాణించలేకపోవటంతో లంక కష్టాల్లో పడింది. చివర్లో దసున్ శనక 45 పరుగులతో జట్టును విజయానికి చేరువ చేశాడు. 17వ ఓవర్లో అతను ఔటయ్యాడు మ్యాచ్ చివరి 2 ఓవర్లు అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగాయి.  కేవ‌లం రెండు ఓవ‌ర్ల‌లో  విజయానికి 25 పరుగులు అవసరమైన వేళ లంక మ్యాచ్ గెలవడం కష్టమే అనిపించింది. అయితే 19వ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయిన లంక 17 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సిరాగా తొలి బంతికి ఒక పరు గు వచ్చింది. రెండో బంతికి ఫెర్నాండో ఫోర్ కొట్టాడు. మూడో బంతికి నో బాల్ సహా 3 పరుగులు రావటం తో లంకను విజయం వరించింది. బంగ్లా బౌలర్లలో హొస్సేన్ 3 వికెట్లతో రాణించాడు.  ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 లో అడుగుపెట్టింది. గ్రూప్- బీ నుంచి ఇప్పటికే అఫ్ఘనిస్థాన్ సూపర్- 4 కు క్వాలిఫై అయ్యింది. గ్రూప్- ఏ నుంచి భారత్ సూపర్- 4 కు చేరుకుంది. ఇంక పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఎవరు క్వాలిఫై అవుతారో తెలియాల్సి ఉంది.  బంగ్లాదేశ్‌:20 ఓవర్లలో 183/7 (అఫీఫ్‌ 39, మెహ్దీ హసన్‌ 38, కరుణరత్నే 2/32 హసరంగ 2/41); శ్రీలంక:20 ఓవర్లలో 19.2 ఓవర్లలో 184/8 (కుశాల్‌ మెండిస్‌ 60, షనక 45, ఎబాదత్‌ 3/51).

విద్యాహక్కు చట్టం అమలు చేయకపోతే జైలుకే.. ఏపీ అధికారులకు హైకోర్టు వార్నింగ్

విద్యాహక్కు చట్టం కింద ఎంత మంది పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చారో తమకు లెక్కలు చెప్పాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చట్టం కింద ప్రతి ప్రైవేటు స్కూళ్లోనూ పాతిక శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. అయితే ఈ చట్టం ఏపీలో సరిగా అమలు కావడం లేదంటూ ఓ న్యాయవాది కోర్టుకు ఎక్కారు. దీనిపై ఏపీ సర్కార్ పై సీరియస్ అయిన హైకోర్టు.. విద్యాహక్కు చట్టం అమలుపై తాము గతంలో ఇచ్చి ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యాహక్కు చట్టాన్ని, తమ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేసినట్లు ఆధారాలు చూపాలని, విద్యాహక్కు చట్టం కింద ఎంత మంది పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలనీ పేర్కొంది. లేకపోతే అధికారులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. విద్యాహక్కు చట్టం కివంద పేద విద్యార్థులు స్కూళ్లో లేకపోతే మీరు జైల్లో ఉండాలని తీవ్ర హెచ్చరిక చేసింది.  

ఆపరేషన్ లోటస్ ఫెయిల్.. విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ పాస్

ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై పై చేయి సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మీద తానే ప్రవేశ పెట్టుకున్న విశ్వాస పరీక్షలో నెగ్గారు.  మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కు 62 మంది సభ్యలు ఉన్నారు. వీరిలో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. మరొకరు జైల్లో ఉన్నారు. ఇంకొకరు స్పీకర్. దీంతో సభలో ఆప్ కు చెందిన   58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ పై విశ్వాసం ప్రకటిస్తూ ఓటేశారు. దీంతో సునాయాసంగా విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ విజయం సాధించారు. కేవలం 8 మంది సభ్యులతో ఆప్ సర్కార్ ను కూల్చేయడానికి బీజేపీ పన్నాగాలు, ఎత్తుగడలను తాము సక్సెస్ ఫుల్ గా తిప్పి కొట్టామని విశ్వాస పరీక్షలో విజయం సాధించిన తరువాత కేజ్రీవాల్ అన్నారు.   బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవా ల్ తో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. ఆప్ ను వీడి కమలం గూటికి చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు  20 కోట్ల రూపాయలను బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ నేతలు ఆరోపించారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణతోనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ఆప్ నాయకులను టార్గెట్ చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ఢిల్లీ అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్ తన ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించారు. గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా నివాసాలలో సీబీఐ జరిపిన దాడుల్లో  ఏం కనుక్కొలేదని..  ఢిల్లీ సీఎం వ్యాఖ్యానించారు. బీజేపీ ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే గుజరాత్ లో కూడా ఆప్ పాగా వేయడం ఖాయమన్నారు. అసలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి భయంతోనే ఆప్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులకు గురి చేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.

చెవినొప్పికి ఆపరేషన్ చేసి ఎడమ చేయి తీసేశారు!

ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిందన్నది సామెత.. ఈ సామెతను దాదాపు నిజం చేసిన సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళకు చెవి నొప్పికి చేసిన చికిత్స ఆమె చేతిని కోల్పోయేలా చేసింది. బీహార్ కు చెందిన 20 ఏళ్ల రేఖ అనే మహిళ చెవి నొప్పితో పాట్నాలోని మహావీర్ సంస్థాన్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి చెవి నొప్పి పోవడానికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. జులై 11 ఆపరేషన్ చేశారు. అంత వరకూ అంతా బానే ఉంది. కానీ ఆపరేషన్ తరువాత ఆమె చేతికి ఒక ఇంజక్షన్ చేశారు. అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తరువాత రేఖకు ఇంజక్షన్ చేసిన ఎడమచేయిలో నొప్పి మొదలైంది. చేయి రంగు కూడా మారిపోయింది. దీంతో ఆమె మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది. అయితే వైద్యులు నిర్లక్ష్యంగా కొన్ని రోజులకు అదే తగ్గుతుంది లెమ్మని పంపేశారు. అయితే ఆమెకు నొప్పి తగ్గకపోవడంతో పాట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆమె చేతిని పరీక్షించిన వైద్యులు ప్రాణం నిలబడాలంటే మో చేయి వరకూ తొలగించాలని నిర్ణయించి, గత నెల 4న శస్త్ర చికిత్స చేసి  ఆమె ఎడమ చేతిని మోచేతి వరకు తొలగించారు. దీంతో నవంబర్ లో జరగాల్సిన ఆమె పెళ్లి రద్దయ్యింది.    

రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణది నాలుగో స్థానం!

దేశానికే తెలంగాణ మోడల్ అని పదే పదే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ ఫైర్ అయ్యారు. ఆయన చెబుతున్న మాటలన్నీ డొల్ల అని గణాంకాలతో సహా వివరిస్తూ గాలి తీసేశారు.ఆర్థిక అరాచకత్వానికి తెలంగాణ సర్కార్ నమూనాగా నిలిచిందంటూ విమర్శలు గుప్పించారు. ఘనంగా వాగ్దానం చేసిన రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదనీ, రైతు ఆత్మహత్యలలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణ అప్పుల కుప్పలా మారిందన్నది వాస్తవమన్న నిర్మలా సీతారామన్.. రాష్ట్రాల అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందన్నారు.  ఇక తెలంగాణలో కోటి ఎకరాలను సాగులోకి తీసుకువస్తామంటూ ఘనంగా చెప్పుకున్న కేసీఆర్  అందు కోసం ప్రాజెక్టులు నిర్మాణం అంటూ ఘనంగా ప్రచారం చేసుకున్నారనీ, వాస్తవంలో ఆయన చేసంది ప్రాజెక్టుల వ్యయాన్ని   ఇష్టం వచ్చినట్లుగా పెంచడమేనని దుయ్యబట్టారు.   కామారెడ్డిలో   జరిగిన ఒక సభలో గురువారం పాల్గొన్న ఆమె తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.   కేసీఆర్ తీరుతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాగే ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్నారు. కాళేశ్వరం పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం .38,500 కోట్ల రూపాయలైతే కేసీఆర్ సర్కార్ దానిని లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలకు పెంచిందని నిర్మలాసీతారామన్ వివరించారు.  ఎఫ్ఆర్‌బీఎమ్ పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిందన్న ఆమె, రాష్ట్రంలో పుట్టే ప్రతి శిశువుపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు. కేంద్రం  పథకాల పేర్లు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నారన్నారు. 8 ఏళ్లలో ఉపాధిహామీ పథకం కింద తెలంగాణకు కేంద్రం  20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు.  అప్పులపై కేంద్రం కోతలు పెడుతోందని కేసీఆర్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అబద్ధమన్నారు. బడ్జెట్లో పెట్టకుండా అప్పులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు? ఇష్టానుసారంగా అప్పులు చేస్తే కేంద్రం అడగకుండా ఎందుకు ఉంటుందన్నారు? జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ గొప్పలు చెప్పుకునే ముందు మీ నిర్వాకంపై రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పి దేశంలో తిరగాలని నిర్మలా సీతారామన్ అన్నారు.

జ‌స్ట్ ఆస్కింగ్ ..  బీజేపీని నిల‌దీస్తున్న న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌

ప్ర‌భుత్వాలు స‌రిగా ప‌నిచేయ‌న‌పుడు ప్ర‌జాహితం ప‌ట్ట‌కుండా ఉన్న‌పుడు, సామాన్య ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తుంటాయి. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి విప‌క్షాల నాయ‌కులు, రాజ‌కీయ నాయ‌కులే కాన‌క్క‌ర్లేదు రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న కాలేజీ విద్యార్ధి కూడా కావ‌చ్చు, సినీ న‌టుల‌యినా కావ‌చ్చు. ఇప్పుడే కాదు చాలాకాలం నుంచి దేశ రాజ‌కీయాల మీద త‌న అభిప్రాయాలతో, న‌చ్చ‌ని అంశాల‌ను లేవ‌నెత్తి ఘాటు విమ‌ర్శ‌ల‌తో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నిస్తున్నారు సినీ న‌టుడు ప్ర‌కాష్  రాజ్‌. తాజాగా ఆయ‌న బీజేపీ స‌ర్కార్ విధానాల‌ను ఎండ‌గ‌డుతున్నారు.  జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ, ఆయ‌న ట్విట‌ర్ ద్వారా సంధించే ప్ర‌శ్న‌లు, చేస్తున్న విమ‌ర్శ‌లు చాలామంది రాజ‌కీయ‌నాయ‌కుల‌కు మిం గుడు ప‌డ‌టం లేదు. కొంద‌రికి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తెలియ‌జేస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. తాను హిందూత్వానికి వ్య‌తిరేకిని కాన‌ని కేవ‌లం మోదీ, షా ద్వ‌యానికే వ్య‌తిరేకిన‌ని ప్ర‌కాష్ రాజ్ ప్ర‌క‌టించారు.   వినాయక చవితి సందర్భంగా ఆయన మరొక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్యానం చేసుకుంటూం డగా, వినాయకులు ఆయనకు ఇరువైపులా నిల్చున్నట్లు, వినాయకుడు ఆరెస్సెస్ యూనిఫాం ధరించినట్లు, కేజీఎఫ్, అల్లు అర్జున్ లను గుర్తు చేస్తూ వినాయకుడి విగ్రహాలను రూపొందించడాన్ని గట్టిగా ప్రశ్నించారు.  ఇలాంటివాటి వల్ల మనోభావాలు దెబ్బతినవా? అని నిలదీశారు.  ప్రకాశ్ రాజ్ సందర్భం వచ్చిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తూనే ఉంటారు. గత నెలలో కర్ణాటకలోని మైసూరులో మైసూరు జిల్లా పాత్రికేయుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చాలా ఘాటుగా మాట్లా డారు. విలేకర్ల ప్రశ్నలకు స్పందిస్తూ, అవకాశం ఉంటే కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలకు తాను మైనస్ మార్కులు ఇస్తాన న్నారు. మైనస్ మార్కులివ్వడానికి వీల్లేదు కాబట్టి, తాను ఆ ప్రభుత్వాలకు సున్నా మార్కులు ఇస్తున్నానని చెప్పారు. 30 కన్నా తక్కువ మార్కులు వస్తే ఫెయిలయినట్లే కదా! అన్నారు. సాగు భూముల కొనుగోళ్ళపై ఆంక్షలన్నీ తొలగించారని, ఉద్యోగ కల్పనకు ఏమాత్రం కృషి చేయడం లేదని, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో దాని ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతోందని మండిపడ్డారు. దార్శనికత లేకుండా ప్రభుత్వాలను ఎలా నడుపుతారని నిలదీశారు.  ఇంటింటా త్రివర్ణ పతాకంపై మాట్లాడుతూ, స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఇంటిం టా త్రివర్ణ పతాకం కార్యక్రమం గురించి విలేకర్ల ప్ర‌శ్న‌కు ప్రకాశ్రాజ్ స్పందిస్తూ, నిత్యావసరాల ధరలను తగ్గించడం, ఉద్యోగా లను కల్పించడం ద్వారా  దేశ భక్తిని ప్రోత్సహించాలన్నారు. చేనేత పరిశ్రమలోని కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే జాతీయ జెండాలను పాలిస్టర్‌తో తయారు చేయడానికి అనుమతించడంపై మండిపడ్డారు. పాలపై సైతం జీఎస్‌ టీని విధిస్తున్నారని, ఇటువంటి సమయంలో తాను ఆ ప్రభుత్వాలు అద్భుతంగా ప‌నిచేస్తున్నాయ‌ని ఎలా చెప్ప‌గ‌ల‌ను అని ప్రశ్నించారు.  నటుడు ప్రకాశ్ రాజ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడి పోయారు. దీనిపై అప్పట్లో ఆయన స్పందిస్తూ, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజా గళంగానే ఉన్నానని, అదే శక్తి మంతమైనదని తాను భావిస్తానని తెలిపారు. తాను గళమెత్తే నటుడిగానే కొనసాగుతానని తెలిపారు.  దేశంలో పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూంటారు. వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని, దీనిని చక్కదిద్దడం ఏ నాయకుడికీ సాధ్యం కాదని, కేవలం ప్రజలు మాత్రమే దీనిని సరిదిద్దాలని అన్నారు.   ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేవలం కొద్ది గంటలపాటు పర్యటిం చేందుకు వచ్చినపుడు కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నారని, వీథి దీపాలను మరమ్మతు చేస్తున్నారని, హోర్డింగులను తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. పన్ను చెల్లించే ప్రజల కోసం రోడ్లు వేయాలన్నారు. నా కోసం రోడ్లు వేయండి, నేను పన్ను చెల్లిస్తున్నానని అన్నారు. 

మ్యాచ్ ఓడినా.. చెలి చేయిప‌ట్టాడు!

నవాబ్ ప‌టౌడీ ష‌ర్మిలా టాగోర్ ల ప్రేమ నుంచి నిన్న‌టి వ‌ర‌కూ చాలామంది క్రీడాకారులు ప్రేమ‌ పెళ్లిళ్లూ జిందాబాద్ అంటు న్నారు.అనేక టోర్నీల్లో సిక్స్ కొట్టిన ప్లేయ‌ర్ స్టాండ్స్‌లో ఉన్న ప్రేయ‌సికి ఫ్ల‌యింగ్ కిస్ ఇచ్చిన సంద‌ర్భాలు ఎన్నో. మ‌న‌కు తెలిసి భార‌త్ స్టార్ట్స్‌లో ఇలాంటి సీన్ కింగ్ కోహ్లీయే చేశాడు. సినీ న‌టి అనుష్క ప్రేమ‌లో తల‌మున‌క‌ల‌య్యాడు. ఇద్ద‌రూ ఒక్క‌ట‌ య్యారు. ఇపు డు స‌రికొత్త జంట తెర‌మీద క‌న‌ప‌డుతోంది. అదే హాంకాంగ్ ఆల్‌రౌంద‌ర్ కించిత్ షా ల‌వ్ ఎఫైర్‌. అత‌గాడు మంచి ప్లేయ‌ర్‌గా భార‌త్ ప్లేయ‌ర్ల‌నూ ఆక‌ట్టుకున్నాడు. ఇత‌ను భ‌విష్య‌త్తులో మ‌రింత మంచి ప్లేయ‌ర్‌గా నిలుస్తాడ‌ని అంద‌రి మ‌న్న‌ న‌లు అందుకున్నాడు. ఇపుడు అత‌నిలో ప్రేమికుడినీ బ‌య‌ట‌పెట్టాడు. అదే ప‌వ‌ర్ ఆఫ్ ల‌వ్‌. అత‌ను త‌న ల‌వ‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి రింగ్ తొడిగేవర‌కూ ఈ కుర్రాడిలో ఈ కోణం ఉందా అని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ ఇదో మంచి ముచ్చ‌టా అంద‌రూ చెప్పు కుంటున్నారు. ఆనందిస్తున్నారు.  ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించి సూప ర్-4 లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో హాంకాంగ్ పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత, హాంకాంగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కించిత్ షా  స్టాండ్స్‌లోకి వెళ్లి తన గాళ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కించిత్ షా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా స్టాండ్స్‌లో వెళ్లిన కించిత్ అక్కడ నిలబడి ఉన్న తన గాళ్ ఫ్రెండ్ భుజం తట్టాడు. ఆపై మోకాళ్లపై కూర్చుని బాక్స్‌లోంచి ఉంగరం తీసి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అస‌లు సిస‌లు ప్రియుడిలా అడిగాడు.  అంతే, ఈ ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌ నుంచి తేరుకునేందుకు ఆమెకు చాలా సమయమే పట్టింది. క్షణకాలంపాటు తనను తాను నమ్మలేక పోయింది. కాసేపటి తర్వాత తేరుకుని ‘యస్’ అంటూ తన అంగీకారం తెలిపింది. ఆ మాట వినగానే పైకి లేచి ఆనందంతో తన చేతిలోని ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ కౌగిలించుకుని ఆనంద డోలికల్లో తేలియాడిపోయారు. ఇదంతా చూస్తున్న స్టేడియంలోని అభిమానులు తమ సెల్‌ఫోన్లను క్లిక్‌మనించారు. కరతాళ ధ్వనులతో వారిని అభినం దించారు. ఇందు కు సంబంధించిన వీడియోను ఆసియా కప్‌ను నిర్వహిస్తున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వారికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో కించిత్ షా ఓవర్ నైట్ స్టార్‌గా అయ్యాడు.

బీజేపీతో పొత్తు టీడీపీకి అవసరమా? అనర్ధమా?

అన్నీ అనుకున్నట్లే జరిగితే, అతి త్వరలోనే, టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడిచే అవకాశాలున్నాయనే సంకేతాలు రోజు రోజుకు మరింతగా స్పష్టమవుతున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర నాయకులు, అబ్బే అలాంటిదేమీ లేదని బుకాయించినా, కేంద్ర నాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తు విషయంపై సీరియస్ గానే ఆలోచిస్తోంది. ఇంకా స్పష్టంగా పొత్తు వైపే మొగ్గు చూపుతోందని, ఢిల్లీ మీడియా వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తోంది. మరో వంక, వరస పెట్టి మిత్ర పక్షాలు అన్నీ, ఎన్డీఏని వదిలి పోవడంతో పాత మిత్రులతో కొత్త పొత్తులకు సంబంధించి పునరాలోచించక తప్పని పరిస్థితి బీజేపీకి ఏర్పడిందని, ముఖ్యంగా నితీష్ కుమార్ గుడ్ బై  చెప్పిన తర్వాత  పార్టీ వ్యూహకర్తలు  ఆ దిశగా ఆలోచనలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  అదొకటి అలా ఉంటే, ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ఉన్నది లేదు,పోయేది లేదు. టీడీపీతో పొత్తు వలన వస్తే అసెంబ్లీలో ఓ నాలుగు, లోక్ సభలో ఒకటో రెండో  సీట్లు వస్తే వస్తాయి. వచ్చే విషయం పక్కన పెడితే, పోయేది అయితే అసలే లేదు. అయితే, పొరుగు రాష్ట్రం తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడమే కాకుండా, ఇంకొక్క మెట్టెక్కితే,సునాయాసంగా అధికారంలోకి రాగలమని,బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటుగా, తెలంగాణ బీజేపీలోనూ గట్టి విశ్వాసం ఏర్పడింది.  ఇదే విషయంపై బీజేపే సీనియర్ నాయకుడు ఒకరు, బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో బాగా ప్రచారం అయిన స్లోగన్   ‘ఔర్ ఏక్ ధక్కా, మారో ని గుర్తు చేస్తూ ఇంకొక్క దెబ్బ పడితే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టగలమని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం గట్టిగా నమ్ముతోందని అన్నారు.   మరో వంక,తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, జాతీయ రాజకీయాలపై కన్నేసి, కమల దళానికి సవాలు విసురుతున్నారు. నిజానికి ఇప్పటికిప్పుడు, కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీకి సవాలు కాకపోవచ్చును, కానీ, లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, అయన ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సొంతం చేసుకుంటే మాత్రం ఆయన ప్రభావం జాతీయ రాజకీయాల పై, ఉంటుందని బీజేపీ వ్యూహ కర్తలు లెక్కలు వేస్తున్నారు. సో .. కేసీఆర్ జాతీయ ఆశలను మొగ్గలోనే తుంచేయాలాంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసని ఓడించడం కమల దళానికి అవసరమని, ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.   అదలా  ఉంటే, తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్వ వైభవం కోల్పోయినా, ప్రజల్లో ముఖ్యంగా బీసీల్లో ఆ పార్టీకి ఇంకా పట్టుంది. రాష్ట్ర విభజనకు నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే 2018 ఎన్నికలలో కాంగ్రెస్, కోదండ రామ్ పార్టీలతో కలిసి ప్రజా ఫ్రంట్’గా ఏర్పడి పోటీ చేసినా, పెద్దగా ఫలితం దక్కలేదు. కేవలం మూడు శాతం ఓట్లు, రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఇద్దరు కూడా కారెక్కడంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. మరో వంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సహా అనేక మంది నాయకులూ తెరాస, బీజేపే, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోయారు. ప్రస్తుత తెరాస మంత్రివర్గంలో అరడజను మందికి పైగా మాజీ టీడీపీ నేతలే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రస్ ఎమ్మెల్యే సీతక్క సహా చాలా మంది కాంగ్రెస్ నాయకులు  మాజీ టీడీపీ నేతలే.. ఇందులో రేవంత్ రెడ్డి సహా చాలా మంది  చంద్రబాబును గౌరవించే.. అభిమానించే వారే ఉన్నారు.  అదెలా ఉన్నప్పటికీ, తెలంగాణలో ఇంచుమించుగా 32 అసెంబ్లీ నియోజక వర్గాల్లో , ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఆంధ్రా సెటిటర్స్ గెలుపు ఓటములను నిర్ధారించే నిర్ణాయక శక్తిగా ఉన్నారు. సహజంగా సెట్ల్లెర్స్  పై టీడీపీ ప్రభావం ఉంటుందని. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు ఇప్పటికీ టీడీపీ వైపు మొగ్గుచుపుతున్నారని, బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో కీలక పదవులు అందుకున్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ వంటి  కొందరు బీసీ నేతలు టీడీపీతో పొత్తు  తెలంగాణలో బీజేపీకి కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు.  అందుకే బీజేపీ జాతీయ నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశంతో పొత్తును కోరుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  ముఖ్యంగా తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీడీపీతో పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, గత ఎన్నికలలో కేసీఆర్,  చంద్రబాబు భుజం మీద సెంటిమెంట్ తుపాకి పెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన విధంగా రేపటి ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీస్తారని ఈ వర్గం వాదిస్తోంది. అయితే, ఉభయ వర్గాలు కూడా అంతిమ నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి వదిలేసినట్లు చెపుతున్నారు. అలాగే, బీజేపీ జాతీయ నాయకత్వం అంత త్వరగా నిర్ణయం తీసుకోదని, టీడీపీతో పొత్తును బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ ప్రయోజనాల కోణంలోనే చూస్తుందని అంటున్నారు. తెలంగాణలో బీజేపీకి  మేలు జరుగుతుందంటే, ఏపీలో పార్టీ లాభనష్టాలను పక్కన పెట్టి,    ఉభయ తెలుగు రాష్ట్రాలలో టీడీపీతో పొత్తుకు టిక్కు పెడుతుందని అంటున్నారు.  అదలా ఉంటే, టీడీపీ, బీజేపీ పొత్తు వలన ఏపీలో టీడీపీకి ఏ మేరకు మేలు జరుగుతుందనే  విషయంలో, ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీకి గత ఎన్నికల్లో నిండా ఒక శాతం ఓటు కూడా రాలేదు. ఇప్పుడైనా, రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది అనేందుకు ఎక్కడా దాఖాలాలు లేవు. తిరుపతి లోక సభ, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, టీడీపీ పోటీలో లేకున్నా, బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ దక్కలేదు. అయినా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, అలాగే,  ఓ ఐదారు శాతం వరకు ఓటు షేర్ ఉంటుందని భావిస్తున్న జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండడం వలన చేత, టీడీపీ, నాయకత్వం బీజేపీతో పొత్తుకు సిద్ధమైందని అంటున్నారు.   ఈ రెండు కారణాల చేతనే, తెలుగు దేశం పార్టీ ఏపీలో బీజేపీతో పొత్తును కోరుకుంటోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో, బీజేపీతో పొత్తు వలన టీడీపీకి నష్టం జరిగే ప్రమాదం లేక పోలేదని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గడచిన ఎనిమిది సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విభజన హమీలతో సహా, రాష్ట్రానికి మేలు చేసే ఏ ఒక్క మంచి పని చేసింది లేదని, సామాన్య ప్రజలకు కూడా అర్థమై పోయింది. అలాగే, గడచిన మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికృత మానస పుత్రిక మూడు రాజధానుల ప్రతిపాదన సహా, జగన్ రెడ్డి అరాచక పాలనకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందనే అభిప్రాయమే ఆందరిలోనూ వుంది. నిజానికి, 2019 కంటే ఇప్పుడే బీజేపీ పట్ల జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని అంటున్నారు. అప్పుడు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం ఇతరత్రా చేయవలసిన సహాయం చేయక పోవడం వలన, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పట్ల వ్యక్తమైన ప్రజాగ్రహానికి,ఇప్పడు జగన్ రెడ్డి అరాచక పాలను కేంద్ర ప్రభుతం గుడ్డిగా సంర్దిస్తోందనే ఆగ్రహం తోడైంది.ఒక  విధంగా ఏపీ ప్రజల్లో బీజేపీ పట్ల డబుల్ ఇంజిన్ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో, టీడీపీ, బీజేపీ పొత్తును సమాన్య   ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనే విషయంలో అనుమానాలున్నాయని అంటున్నారు.   ఈ అన్నిటినీ మించి గత 2019 ఎన్నికల్లో  బీజేపీ ఓటర్లు, టీడీపీ ఓటమే లక్ష్యంగా, సొంత పార్టీ అభ్యర్ధులు ఉన్నా, వైసీపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని మరిచి పోరాదని అంటున్నారు. ఇప్పడు కూడా పార్టీ జాతీయ నాయకత్వం బలవంతంగా టీడీపీతో పొత్తుకు ఒప్పించినా,  బీజేపీ ఓటు, అది ఎంతైనా కానీ, టీడీపీకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుందనే నమ్మకం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహం, పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత కుమ్ములాటల నేపధ్యంలో, ప్రజలు టీడీపీవైపు చంద్రబాబు వైపే చూస్తున్నారు. ఈ  పరిస్థితిలో  బీజేపీతో పొత్తు అవసరమా? అనర్ధమా? అనే విషయంలో తెలుగు దేశం పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించు కోవలసిన  అవసరం ఉందని అంటున్నారు.  నౌ ది బాల్ ఈజ్ ఇన్ టీడీపీ కోర్ట్ ... నిర్ణయం తీసుకోవలసింది, టీడీపీనే కానీ, రాష్ట్రంలో ‘జీరో’ పార్టీ బీజేపీ కాదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

ఫేస్ రిక‌గ్నిష‌న్ యాప్ ...ఏపీ ఉపాధ్యాయుల నిర‌స‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వానికి ఉపాధ్యాయుల‌కు మ‌ధ్య నిప్పు మ‌రింత రాజుకుంది. పాఠ‌శాల విద్యాశాఖ‌లో సెప్టెంబ‌ర్ 1(గురువా రం) నుంచి ఫేస్ రిక‌గ్నైజేష‌న్ హాజ‌రు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భీష్మించింది. కానీ అందుకు ఉపాధ్యాయులు ఏమాత్రం అంగీక‌రించే ప్ర‌స‌క్తే లేద‌ని క‌రాఖండీగా చెప్పేశారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఫోన్‌లలో యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోమని తెగేసి చెబుతు న్నారు.  ప్రభుత్వ మే  అందుకు సంబంధిం చిన పరికరాలు విద్యాశాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.  ఇదే విషయంపై ఆగస్టు 18న తొలిదశ చర్చలు ఫలించలేదు. ప్రభుత్వం తొలుత 15 రోజులు ఈ-హాజ రుపై శిక్షణ ఇస్తామని ప్రకటించి.. నేటి నుంచి మార్గదర్శకాలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పాఠశాలల వద్ద హాజరు పరికరాలను ప్రభుత్వమే ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా హాజరు వేసే విధానాన్ని విద్యా వ్యవస్థలో ముందుగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. ప్రభుత్వ టీచర్లకు హాజరును ఈ యాప్ ద్వారా తీసుకుంటున్నారు. అయితే, ఈ యాప్ విషయమై ఉపాధ్యా యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు పోలీసులకు వరంగా మారింది. ఏయే ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నారు.? ఎవరెవరు ఎక్కడి నుంచి విజయవాడకు వచ్చేందుకు ప్రయ త్నిస్తున్నారు వంటివన్నీ ప్రభుత్వానికి  ఈ యాప్ ద్వారా తెలుస్తాయ్. పోలీసులు ఆ యాప్‌ని వినియోగించి ఉపాధ్యాయుల్ని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వాలు తీసు కునే నిర్ణయాలు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలా భంగం కలిగిస్తాయో చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నేతలూ ఆరోపిస్తున్నారు.

జ‌గ‌న్‌కు మ‌రో త‌ల‌నొప్పి... వినుకొండ వైసీపీలో ర‌గ‌డ‌

రాజ‌కీయాల్లో మిత్రులు శ‌తృవులు కావ‌డానికి ఆట్టే కాలం ప‌ట్ట‌దు. ముందు తెర‌మీద కావ‌లించుకుని క‌నిపించిన నేత‌లు ఆన‌క ఏదో అంశంలో విభేదించి ప‌క్కా శ‌తృవులుగా మారి ఒక‌రి న‌ష్టాన్ని మ‌రొక‌రు ఆశిస్తుంటారు. ఇపుడు స‌రిగ్గా ఇదే సీన్ ప‌ల్నాడు జిల్లా వినుకొండ వైసీపీలో జ‌రుగుతోంది. వినుకొండ కాంగ్రెస్‌లో రాజ‌కీయాల్లో స‌ర్పంచ్ స్థాయి నుంచి ఎదిగిన మ‌క్కెన మల్లికార్జు న రావు ఆ త‌ర్వాత కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. అంతేకాదు వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌ నాయుడు న‌ర‌స‌రావు పేట ఎంపీ విజ‌యానికి ఎంతో కృషి చేశారు. ఆ త‌ర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే మొత్తం వ్య‌వ‌హారం మారింది. మ‌క్కెన‌ను ఎమ్మెల్య బోల్లా దూరంగా పెట్టారు. దీంతో మ‌క్కెన వ‌ర్గీయులు ఏమి జ‌రుగుతోందో అర్దంగా సందిగ్ధంలో ప‌డ్డారు. మ‌క్కెన‌పై ఎమ్మెల్యే క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు బాగా ప్ర‌చార‌మ‌య్యాయి.  ఇదిలాఉండ‌గా, చేప‌ల‌చెరువు వ్యాపారంలో ఉన్న మ‌క్కెన ఆర్ధిక మూలాల‌ను దెబ్బ‌కొట్టేందుకు సోసైటీలో ఎమ్మెల్యే ఎదురు తిరి గారు. దీంతో మ‌క్కెన వ్యాపారం ఊహించ‌ని విధంగా చాలా దెబ్బ‌తిన్న‌ది. ఎమ్మెల్యే ఒత్తిడితోనే మ‌క్కెన‌పై సొసైటీ రుణాల విష యంలో ఇబ్బందుల్లో ప‌డ్డారు. ఏకంగా మ‌క్కెన చాలాకాలం నుంచి ఉంటున్న ఎన్ ఎస్పీ భ‌వ‌నాన్ని కూల్చివేశారు. బాగున్న భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవాలని,  కూల్చవద్దని మక్కెన స్వయంగా ఎమ్మెల్యే బొల్లాకు విన్న వించినా పట్టించుకోలేదు మక్కెన వ‌ర్గీయులు అంటున్నారు.  అస‌లే వైసీలో ఇప్ప‌టికే చాలా ప్రాంతాల్లో పార్టీలో లొసుగులు బ‌య‌ట‌ప‌డి పార్టీ అధినేత‌కు త‌ల‌భారం పెరిగింది. వారిని బుజ్జ‌గించి  పార్టీ ప‌రువుతీయ‌వ‌ద్ద‌ని విబేదాలు లేకుండా పార్టీకి ప‌నిచేయ‌మ‌ని స‌ర్దిచెప్ప‌లేక నానా తంటాలు ప‌డుతున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ప‌ల్నాడు జిల్లాలో త‌లెత్తిన మ‌రో పోరు జ‌గ‌న్‌ను నిద్ర‌పోనీయ‌దేమో. ఇప్పుడు మ‌క్కెన‌, బొల్లా వ‌ర్గాల మ‌ధ్య పోరు పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌కుండా జ‌గ‌న్ కాపాడుకోవాలి. విభేదాలు ముదిరితే పార్టీకి క‌ట్టు బడి ఉన్న‌వారు ఏమేర‌కు స‌ర్దుకుపోతారో చూడాలి. 

ఒక విజ‌న‌రీ రాజ‌కీయ యాత్ర‌

ఇవాళ్టికి స‌రిగ్గా ఇరవై ఏడేళ్ల ఏళ్ల కిందట   సెప్టెంబర్ 1, 1995వ తేదీన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా  నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అప్ప‌టినుంచి ప‌ధ్నాలుగేళ్లు ప్ర‌జా రంజకంగా ప‌రిపాల‌న సాగించారు. ఈ ప‌ధ్నాలుగేళ్ల ప్ర‌స్థానంలో ఎన్నో మైలురాళ్లు, మ‌రెన్నో కీల‌క మ‌లు పులు.  ప్రజలకు జవాబుదారీ పాలన అందించడం గురించి పాలకులు అంటే ప్రజలకు సేవకులు అన్న ఎన్టీ ఆర్ నినాదాన్ని అమలులోకి తెచ్చేందుకే ప్రజల వద్దకు పాలనతో ప్రభుత్వ అధికార గణాన్ని ప్రజలకు చేరువ చేశారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో ప్ర‌శ్నించే త‌త్వం పెరిగింది. మ‌రీ ముఖ్యంగా జ‌న్మ‌భూమి వంటి కార్య క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌ను పాల‌న‌లో భాగ‌స్వాములు చేయ‌డం. ఒక పనిని సాధించాలంటే ఒక విజన్ తో కూడిన స్పష్టమైన ప్రణాళిక అవసరం. అలాగే ఒక రాష్ట్రానికి కూడా దీర్ఘకాల ప్రణాళిక ఉండాలి. అదే చంద్ర‌బాబు రూపొందించిన 'విజన్-2020' అనే విజన్ డాక్యుమెంట్. అప్పట్లో ఎగతాళి చేసినవారే, ఆ తర్వాత ఆ విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా అనుభ‌విస్తున్నారు.  మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి, ప్రపంచ ఐటీ రంగం దృష్టి రాష్ట్రంపై పడేలా చేయడంతో లక్షలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేసేందుకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలను అందుబాటులోకి తేవడం  ఆయ‌న పాల‌న కాలంలోనే  జరిగింది అలాగే విద్యారంగంలో సమూల మార్పులు చేసి విద్యను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసారు. ఆరోజు పడిన కష్టానికి ఫలితంగా ఈరోజు  ఒక రైతు బిడ్డ నుంచి  ఒక కార్మికుని కొడుకు వరకు దేశ విదేశాల్లో ఉద్యో గాలు చేస్తూ  కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈరోజు అమెరికాలో ఎక్కువ ఆదాయం పొందుతోన్న భారతీయుల్లో 30 శాతం మంది తెలుగువారే అన్న మాట వింటున్నాం. ఇది బాబు హ‌యాంలో విదేశాల‌కు విద్యార్ధులు వెళ్లి చ‌దువుకోవ‌డానికి వీలు క‌ల్పిం చిన తాలూకు స‌త్ఫ‌లితంగా చెప్పాలి.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు హ‌యాంలో  పదేళ్ల పాటు దేశంలో ఎవరి నోట విన్నా ఆంధ్రప్రదేశ్ మాటే విని పించేది. రాష్ట్రానికి ఆయ‌న  తెచ్చిన పెట్టుబడులు, సంస్థలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పెరుగుతున్న మన అవసరాలు తీరాలంటే సంపద సృష్టి జరగాలన్నది టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆలోచన. ఏపీకి వచ్చే సంస్థల కోసం మౌలిక రంగాన్ని అభివృద్ధి చేసారు. ఉత్త‌మ‌ పాలసీలను తీసుకు వచ్చారు. అందుకు ఉదాహరణ సైబరాబాద్ నగర నిర్మాణం. ఇప్పుడు సైబరాబాద్ దేశ విదేశా ల్లోని అనేక సంస్థలకు కీలక వేదికగా నిలిచింది.  అలాగే కొన్ని రంగాల్లో సంస్కరణలు చాలా అవసరం  అని భావిం చారు.  అదే సమయంలో బాబు విజ‌న్‌కు ఫిదా అయి  అప్ప‌టి  ప్ర‌ధాని వాజ్ పేయి  అండ‌గా నిలిచారు.  జాతీయ స్థాయిలో ఓపెన్ స్కై పాలసీ,టెలికాం పాలసీ, స్వర్ణ చతుర్భుజి రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లు, సూక్ష్మ సేద్యం వంటివి దేశానికి చంద్ర‌బాబు  పరిచయం చేశారు.  అబ్దుల్ కలాం వంటి వారిని రాష్ట్రపతి గా ఎంపిక చేయ‌డంలోనే బాబు విజ‌న్‌కు అద్దం ప‌డుతోంది.  అలాగే రంగరాజన్ వంటి వారిని గవర్నర్ గా ఏపీకి తీసుకురాగ‌లిగారు. తెలుగుదేశం నేతల్లో బాలయోగి ని దేశానికి తొలి దళిత స్పీకర్ గా, ఎర్రం నాయుడుని కేంద్రమంత్రిగా చేసి తెలుగుదేశం ఆత్మ సామాజిక న్యా యాన్ని మరింత విస్తృత పరిచారు.  రాష్ట్ర విభజన తర్వాత 2014 లోనూ ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇస్తే, లోటు బడ్జెట్ రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించి చూపించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మిం చేందుకు చేసిన‌ కృషి అన‌న్య‌సామాన్యం. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ద్వారా నదుల అనుసంధానం అనే కీలక ప్రక్రియను మొదలు పెట్టిన తొలి సీఎంగా  కీర్తిగ‌డించారు.  అన్న క్యాంటీన్,  విదేశీ విద్య, చంద్రన్న బీమా వంటి  వినూత్న సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారు.   ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు ఏం చేసినా భావితరాల ఉజ్వల భవిష్యత్తే  ఆయ‌న లక్ష్యం అయ్యింది. 14 సంవత్సరాల పాలనా కాలంలో ముఖ్యమంత్రిగా  సాధించిన విజయాలు తెలుగు ప్రజలవి అని చెప్పు కున్నారు.  తాను కేవలం ప్రజలు త‌న‌కు ఇచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని వారికి మంచి చేసేందుకు సద్వినియోగం చేసుకున్నానంతేనని చంద్ర‌బాబు చెబుతూంటారు. 

ఆ ప్రచారంపై నేనేం మాట్లాడను : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరే విషయంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరౌతున్నాయనీ, తెలుగుదేవం ఎన్డీయే గూటికి చేరనుందని వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. దానికి తాను కాదు.. అలా ప్రచారం చేసిన వారే బదులివ్వాలన్నారు. ఈ విషయంపై తాను ఇప్పుడు స్పందించబోనని చంద్రబాబు పేర్కొన్నారు. నాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ నష్టపోయిన దాని కన్నా ఇప్పుడు జగన్ పాలనలోనే ఎక్కువ నష్టపోయిందని ఆయన అన్నారు.   తానేం చేసినా, ఎ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. తాను కేంద్ర రాజకీయాలను కూడా ఈ కోణంలోనే  చూస్తామని చంద్రబాబు అన్నారు. తాను పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయిందని... రాష్ట్రానికి మంచిపేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా కూడా నష్టపోయామని అన్నారు. సంక్షేమ పథకాలపై టీడీపీ ఎంతో దృష్టిపెట్టిందని... మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తామన్నారు.   తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోడానికి తెలుగుదేశంతో చెలిమికి బీజేపీ సంసిద్ధత   వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో చేరడంపై చంద్రబాబు స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఎన్డీయేలో చేరిక వార్తలను చంద్రబాబు పూర్తిగా ఖండించలేదు.. అలాగని సమర్ధించనూ లేదు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో గత మూడేళ్లుగా జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరిందని చంద్రబాబు అన్నారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పునరుద్ఘటించారు. అందు కోసం ఏమైనా చేస్తామన్నారు. తన సొంత నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ జగన్, ఆయన పార్టీ ప్రచారం చేస్తున్నాయన్నారు. అసలు సంక్షేమం మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అనీ, అటువంటిది తాను సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు నిలిపివేస్తానని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి తనకు రెండు కళ్లు అని చెప్పారు.

 ముంబైలో మ‌హిళ‌పై ఎంఎన్ ఎస్ దాడి

రాజ‌కీయ‌పార్టీలు త‌మ ప్ర‌చారంలో భాగంగా రోడ్ల‌కి అడ్డంగానో, ప‌క్క‌నో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్ట‌డం మామూలే. కానీ ప్ర‌జ‌లకు ఇబ్బంది లేనంత‌వ‌ర‌కే. తాము బ‌ల‌వంతుల‌మ‌ని అతిగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌జ‌లు స‌హించ‌రు. ముంబైలో  అదే జ‌రిగింది. కానీ పోలీసులు, ఆ ప్రాంతంవారూ ప‌ట్ట‌న‌ట్టే ఉండ‌డం విచిత్రం.  ముంబైలో ముంబా దేవి ప్రాంతంలోని తన మందుల దుకాణం ముందు ప్రచార స్తంభాన్ని, బోర్డులు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయవద్దని మహిళ మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలను కోరింది.  రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ ఎస్‌)కార్యకర్తలు ఒక మహిళను నెట్టడం చెప్పుతో కొట్టడం చూపించే వీడియో వైరల్ అయ్యింది. ప్రకాష్ దేవి అనే మహిళ ఆగస్ట్ 28న వినోద్ అర్గిలే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కార్య‌క‌ర్త‌లు ప్రచారబోర్డుల కోసం స్తంభాన్ని ఏర్పాటుచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వీడియోలో, కొంతమంది మిస్టర్ ఆర్గిల్‌ను దూరంగా లాగడం కనిపించింది, కానీ అతను దాడి చేయడం, కొట్టడం, నెట్టడం  కొనసాగించాడు, ఆ సమయంలో ఆమె వీధిలో పడిపోయింది. 80-సెకన్ల  క్లిప్‌ను వీడి యో చూపింది.  దారిలో వెళ్లేవారు జోక్యం చేసుకోలేదు. ఏమీ ప‌ట్ట‌న‌ట్టే సినిమా చూసిన‌ట్టు చూశారు. కానీ ఎవ్వ‌రూ అడ్డుకోలేదు.  ఆలయానికి ప్రసిద్ధి చెందిన ముంబా దేవి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు వెదురు స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు, అయితే ప్రకాష్ దేవి తన మందుల దుకాణం ముందు వాటిని ఏర్పాటు చేయవద్దని చెప్పారు. తనపై శారీరకంగా దాడి చేయడమే కాకుండా, ఎంఎన్ఎస్ కార్య‌క‌ర్త‌లు వినోద్ ఆర్గిల్ నాయ‌ క‌త్వంలో విరు చుకుప‌డి,   తనపై కూడా దుర్భాషలాడారని ఆమె ఆ తర్వాత చెప్పారు. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఆగస్టు 31న ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించామని, త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ సంఘ‌ట‌న గురించి ఎంఎన్ ఎస్ పార్టీ అధినేత రాజ్ థాక్రే ఎలాంటి ప్ర‌కట‌నా  చేయలేదు. 

కేసీఆర్ రాజకీయ వ్యవసాయం.. ఆ మూడు రాష్ట్రాలపైనే గురి!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనక ఒక వ్యూహం ఉంటుంది. ఒక ఎత్తుగడ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్  26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్ కు పిలిపించుకుని, మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. విందు వినోదాలతో చక్కని ఆతిధ్య మిచ్చారు. శాలువాలు కప్పి సన్మానాలు చేశారు.  ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ మూడు రోజుల రైతు వేడుకలకు, సర్కార్ ఖజానా నుంచి తెలంగాణ ప్రజల సొమ్ము ఎన్ని కోట్లు  ఖర్చైదో, ఏమో మనకు తెలియదు. ఎందుకంటే శ్రీ సర్కార్ వారు చెప్పలేదు. చెప్పరు. అదొకటి అలా ఉంటే, అన్ని రాష్ట్రాల రైతు నాయకులను విమానాలు ఎక్కించి తీసుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక్క ఆహ్వానం పంపిస్తే రెక్కలు కట్టుకుని వచ్చి వాలే, తెలంగాణ రైతు రైతు సంఘాల నాయకులను మాత్రం ఎందుకనో పిలవలేదు.  ఎందుకనో ఏముంది , పిలిస్తే, అందరి ముందు అసలు బండారం బయట పడుతుందనే. అందుకే రాష్ట్ర రైతులను రైతు వేడుకలకు దూరంగా ఉంచారని అంటున్నారనుకోండి అది వేరే విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందు కోసం దేశంలో ఉన్న రైతు నాయకులు అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంటే, అందుకు సమాధానం వెతుక్కోవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం జాతీయ రాజకీయాలపై కేంద్రీకృతమై వుంది. రాష్ట్రంలో వీస్తున్న ఎన్నికల ఎదురు గాలిని తట్టుకోవాలన్నా, రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎదురవుతున్న సమస్యల నుంచి బయట పడాలన్నా, మరీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కుంటున్న అవినీతి ఆరోపణల ఉచ్చులోంచి బయటపడాలన్నా, జాతీయ రాజకీయాల పంచన చేరడం మినహా మరో దారి కనిపించడం లేదు. అందుకే, ఏదో విధంగా జాతీయ రాజకీయాలలో గుర్తింపు కోసం ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అందులో భాగంగానే,  వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులను రప్పించి వారిచేతే, ఆహా వోహో అనిపించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.  జాతీయ రాజకీయాలలో కూసింత గుర్తింపు కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్,బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు మొదలు, బీజేపీ ముక్త భారత్ నినాదంతో కొత్త పార్టీ లేదా ఫ్రంట్ ఏర్పాటు వరకు ఆయన చేయని ప్రయత్నం ఏదీ లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జాతీయ పత్రికలు మీడియాలో ప్రచారం చేసుకున్నారు,. అదొకటనే కాదు,ఒక విధంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాసింత గుర్తింపు కోసం రాజకీయ అష్టావధానం, శతావధానం ఒకేసారి చేస్తున్నారు..అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో, భారత  రైతు సమితి (బీఆర్ఎస్) పేరిట రైతు నాయకులను ప్రయోగాత్మకంగా బరిలో దించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే జాతీయ స్థాయిలో రైతు వేదిక ఏర్పాటు పేరిట  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.  అలాగే, ఈ మూడు రాష్ట్రాలను ఎంచుకోవడంలోనూ కేసీఆర్ మార్క్ రాజకీయం ఉన్నది అంటున్నారు. . ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. తెలంగాణలో అమలవుతున్న రైతు భీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, వంటి పథకాలను ప్రచారం చేసుకోవడంతో పాటుగా బీజేపీ వ్యతిరేక  ప్రచారం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీజేపీ నేతలు గుజరాత్ మోడల్ పేరుతో జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ మోడల్‌ను తెరపైకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల్లో రైతుల నేతలు అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ... ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆ మూడు రాష్ట్రాలలో ప్రచారం చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ పై  చర్చ జరిగేలా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అది సాధ్యమేనా? ఒక జాతీయ పార్టీతో పట్టుమని పది పార్లమెంట్ స్థానాలు లేని ఒక ప్రాంతీయ పార్టీ పోటీ పడటం అయ్యే పనేనా , అంటే, ఏమో ..  గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.

 కొరియా పిల్లాడి నోట  జ‌న‌గ‌ణ‌మ‌న‌!  

ఉయ్యాల్లో పిల్ల‌కి జోల‌పాడుతుంది త‌ల్లి. త‌ల్లి పాట‌లు పాడుతూనే బువ్వాపెడుతుంది, బ‌డికీ పంపు తుంది. అలా వినీ వినీ పిల్లా ఏదో కూనిరాగాలాల‌పిస్తుంటుంది. అది గొప్ప పాటా కాక‌పోవ‌చ్చు, గొంతు ల‌తాదీ కాక‌పోవ‌చ్చు. కానీ అలా కూనిరాగాలతో రోజు గ‌డిపేయ‌డం అదో స‌ర‌దా. టెన్ష‌న్ త‌గ్గుతుంద‌న్న‌ది చాలా మంది మాట‌. క్ర‌మేపీ పాట సినిమా పాటే అవుతోంది. ఈరోజుల్లో అంతా ఫాస్ట్‌బీట్‌. రాగం ప‌ట్ట‌డానికి పెద్ద క‌ష్టాప‌డ‌క్క‌ర్లేదు. కానీ జాతీయ‌గీతాలు అలాకాదు. ఎన్నిత‌రాల‌యినా, ఎంత‌కాల‌మ‌యినా అది అలాగే పాడాలి. అదే శృతిలో, అదే ల‌య‌లో పాడాలి. ఎవ‌రి జాతీయ‌గీతం వారికి గొప్ప‌. భార‌తీయులం ద‌రికీ జ‌నగ‌ణ‌మ‌న వ‌చ్చి తీరుతుంది. కాకుంటే, సైన్యంలో ఉన్న‌వారు రోజూ తప్ప‌కుండా పాడుకుం టారు, వింటారు. సామాన్య జ‌నులు ఆగ‌ష్టు 15, జ‌న‌వ‌రి 26 త‌ప్ప మ‌రేరోజూ జాతీయ‌గీతం త‌ల‌వ‌నైనా త‌ల‌వ‌రు.  అస‌లు పిల్ల‌ల‌కు దేశ‌భ‌క్తి ఉండి తీరాల‌న్న రూలు ఎవ‌రూ ప‌నిగ‌ట్టుకుని బోధించే య‌త్నం చేయ‌రు. అది స్వ‌త‌హాగానే ఉంటుంది. ఎవ‌రి  త‌ల్లి వారికి గొప్ప అలాగే  దేశమూ! ఇటీవ‌ల బీజేపీ ప్ర‌భుత్వం ప‌నిగ‌ట్టు కుని ప్ర‌జ‌ల‌కు మ‌నం భార‌తీయులం గ‌నుక ప‌తాకాన్ని, జాతీయ‌గీతాన్ని రోజూ గుర్తుచేసుకోవాల‌న్న భారీ ప్రచారంతో దేశ‌భ‌క్తిని రాజ‌కీయ ల‌బ్ధికి బాగా ఉప‌యోగించుకుంటోంది. పిల్ల‌ల‌కు, యువ‌త‌కు జాతీయ గీతం కంటే సినిమాపాట‌లే తేలిగ్గా ఇష్టం, నేర్చుకుంటున్నారు. పాట‌ల పోటీలు అవే జ‌రుగుతున్నాయి. చిత్ర‌మేమంటే విదేశీయుల‌కు మ‌న భాష‌లు, మ‌న జాతీయ‌గీతం మీద మ‌క్కువ పెరిగింది. ఆమ‌ధ్య ఒక కొరియా మ‌హిళ హిందీ నేర్చుకుంది, మ‌రో మ‌హిళ ప‌కోడీ చేయ‌ డం నేర్చుకుంది. ఇపుడు ఇంకో మ‌హిళ త‌న పిల్లాడికి ఏకంగా భార‌త్ జాతీయ గీతం నేర్పించ‌డంలో త‌ల‌మున‌క‌ల‌యింది! విదేశీ ప‌ర్యాట‌కుల‌కు తాము వెళ్లిన దేశాల్లో త‌మ‌కు బాగా న‌చ్చిన‌వి, త‌మ‌ను ఎంతో ఆక‌ట్టుకున్న అంశా లను మ‌రింత తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. కొంద‌రు డైరీ రాస్తారు, కొంద‌రు ఆయా ప్రాంతాల గురించి వ్యాసాలు రాస్తారు, నేర్చుకున్న పాటో, ప‌ద్య‌మో మ‌ళ్లీ నేర్చుకుని పిల్ల‌ల‌కూ నేర్పుతారు. వారికి అదో స‌ర‌దా. దీనికి భార‌త్ అంటే అపార‌మయిన అభిమానం ఉంద‌ని కాదు. కొన్ని విన‌సొంపుగా ఉండ‌ డం వ‌ల్ల సంగీత‌జ్ఞానం స‌హ‌జంగా ఉన్న‌వారికి ఇలాంటివి మ‌న‌సును హ‌త్తుకుంటాయి. అందువ‌ల్ల ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. దీనికి దేశీయులు, విదేశీయుల‌న్న తేడా లేదు. తెలుగు ఇష్ఠ‌ప‌డే గుజ‌రాతీయులు, గుజ‌రా తీని ఇష్ట‌ప‌డే బెంగాలీలు ఉన్న‌ట్టే మ‌న జాతీయ‌గీతాన్ని ఇష్ట‌ప‌డే  విదేశీయులు కూడా చాలా మందే ఉన్నారు.  కిమ్ అనే కొరియా మ‌హిళ త‌న పిల్లాడు ఆదికి   జ‌న‌గ‌ణ‌మ‌న నేర్పించి వాడితో క‌లిసి పాడుతూ వీడ‌యో రిలీజ్ చేసింది. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కిమ్ భ‌ర్త భార‌తీయుడు. అందువ‌ల్ల భార‌త్ గురించిన స‌ర్వవిశేషాలు ఆమెకి తెలిసే ఉంటుంది. వారికి ఆ దృష్టి ఉంటుంది. మ‌న‌కి గుజ‌రాత్ గురించి తెలియ‌క‌పోవ‌చ్చుగానీ, విదేశీయుల‌కు మాత్రం భార‌త్ గురించిన ప్ర‌త్యేక విశేషాల‌న్నీ తెలుసు కునే ఆస‌క్తి ఉంటుంది. 

కుప్పం వైసీపీలో డిష్యుం..డిష్యుం.. రక్తమోడిన విభేదాలు

సినిమాలో హీరో విల‌న్ వ‌ర్గాలు కొట్టుకుంటారు, వీధిలో రెండు వ‌ర్గాల‌వారు కొట్టుకుంటారు. ఒక్క వైసీపీలోనే వాళ్ల‌లో వాళ్లు కొట్టుకుంటున్నారు.  అయితే వైసీపీలో ఇటీవ‌లి   ప‌రిణామాల దృష్ట్యా ఇదేమీ పెద్ద వింత కాదు. ఈ మ‌ధ్య‌నే అనంత‌పురంలో పోలీసుల స‌మ‌క్షంలో ఏకంగా పోలీస్ స్టేష‌న్‌లోనే వైసీపీకి చెందిన రెండు వ‌ర్గాలు వారు కొట్టుకున్నారు. పోలీసులు అలా సినిమా చూసిన‌ట్టు చూస్తూనే ఉన్నారు. ఎవ‌రినీ నిలువరించడానికి వీలు కాలేదు. అంతా అయ్యాక కేసు రాసుకుని వ‌దిలించుకున్నారు. ఇపుడు తాజాగా మ‌రో కోట్లాట సీన్ తెర మీద‌కు వ‌చ్చింది.   ఇది ఏకంగా టీడీపీ అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌రిగింది. విప‌క్షానికి చెందిన నియోజ‌క‌వ‌ర్గంలో అధి కార పార్టీ, విప‌క్ష వ‌ర్గీయుల మ‌ధ్య గొడ‌వ‌లో, కొట్లాటో ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ   అధికార వైసీపీ ప‌క్షం వారి మ‌ధ్య‌నే గొడ‌వ జ‌రిగింది.  ఈ సంఘటనకు ముందు మూడు రోజుల పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులుశతథా ప్రయత్నించాయి. అది అలా ఉంటే.. ఇప్పుడు కుప్పంలో వైసీపీలోనే వర్గపోరు రోడ్డున పడింది. ఇందుకు మూలం ఇటీవల వైసీపీ నియోజకవర్గ సమీక్షలో కుప్పం నియోజకవర్గం నుంచి వైసీపీ  అభ్యర్థిగాఎమ్మెల్సీ భ‌ర‌త్ కుమార్ సీఎం జగన్ ప్రకటించేశారు. అక్కడితో ఆగకుండా.. ఆయన గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని ప్రకటించారు. ఇదంతా వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం. అయితే రెండేళ్ల ముందే కుప్పం అభ్యర్థిని జగన్ ప్రకటించిన వ్యూహం వికటించింది.   కుప్పంలో  భరత్ వ్యతిరేక వర్గంలో ఈ ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది. ఈ నేపథ్యంలోనే  భ‌ర‌త్  పీఏ మురుగేశ‌న్‌, వైస్ ఛైర్మ‌న్ మునుస్వామి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. బాబాబాహీ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో మురుగేశ‌న్ తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రి పాలయ్యారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం అధినేత తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి  నయానో భయానో నియోజక వర్గ ప్రజలను లొంగదీసుకోవాల చూస్తున్నారని వైసీపీ నాయ‌కులు తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.   మరోవైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే దాడులకు పాల్పడుతున్నారంటూ  టీడీపీ  వైసీపీ విమర్శిస్తోంది. వాటికి భిన్నంగా    గురువారం అధికార పార్టీ ఎమ్మెల్సీ భ‌ర‌త్ పిఏ మురుగున్‌పై వైసీపీ వర్గీయులే దాడి చేయడంతో ఆ పార్టీ పరువు అమాంతం గంగలో కలిసింది.  భ‌ర‌త్‌కి  టికెట్ ప్ర‌క‌టించిన ప్ప‌టి నుంచి కుప్పంలో అనేక‌మంది పార్టీ నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారనడానికి ఈ సంఘటనే సాక్ష్యమని పరిశీలకులు అంటున్నారు.

తృణ‌మూల్ ని  వీడ‌ని ఈడీ.. మ‌రో మంత్రికి స‌మ‌న్లు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవ‌లం రాజ‌కీయ క‌క్ష‌తోనే విప‌క్షాల మీద‌కు ఈడీ, సిబిఐ వ్య‌వ‌స్థ‌ల‌ను ఉసి గొల్పుతోంద‌న్న ఆరోప‌ణ‌లు దేశ‌మంత‌టా విప‌క్షాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇటీవ‌ల తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ , కాంగ్రెస్ పార్టీల‌ను ఈడీలు వెంటాడుతున్నార‌నే చెప్పాలి. ఈ మ‌ధ్య‌నే తృణ‌మూల్ కాంగ్రెస్ అధి నేత మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు, పార్టీ కార్య‌ద‌ర్శి అభిషేక్‌ను ఆయ‌న భార్య‌ను ఈడీ ప్ర‌శ్నించింది.  ఇపుడు తాజాగా ఆ పార్టీ మ‌రో మంత్రి మోలాయ్ ఘ‌ట‌క్ కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. బొగ్గు  కుంభ‌కోణం కేసులో వీరిని ఈడీ విచారిస్తున్న‌ది. మంత్రి మోలాయ్  గతంలో  విచారణలో వివరాలు  చెప్పక పోవ డంతో అతన్ని మరోసారి విచారించాలని  ఈడీ  నిర్ణయించింది. మంత్రి మోలాయ్ తో పాటు టీఎంసీ ఎమ్మెల్యే మహతోకు  కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.  బొగ్గు అక్రమ రవాణా ఆరోపణలపై  అంత‌కుముందు  మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌  బెనర్జీకి  ఈడీ మంగళవారం సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం శుక్ర వారం ఉదయం కోల్‌కతాలోని కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ అధికారులు ఎంపీ అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో భాగంగా అభిషేక్ బెనర్జీ భార్యకు , అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న రెండుసంస్థల విదేశీబ్యాంకు ఖాతాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈవ్యవహారంలో అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ విచార ణకు హాజరు కావా లని ఈడీ అధికారులు ఆదేశించారు. విద్యా సంస్థల్లో నియామకాల కుంభకోణం కేసులో పార్థ ఛటర్జీ ఇటీవల అరెస్టయ్యారు. తాజాగా గురు వారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెకు  షాక్ ఇచ్చింది. ఆమెకు అత్యంత సన్నిహిత సహచరుడు, టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్‌ను అరెస్ట్ చేసింది.ఆవులను అక్రమంగా రవాణా చేసి నట్లు 2020 లో నమోదైన కేసులో ఆయనపై ఈ చర్య తీసుకుంది. ఆయనను అరెస్ట్‌ చేస్తున్నారన్న సమా చారంతో టీఎంసీ కార్యకర్తలు, మోండల్‌ మద్దతుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. వారందరీ చెదర గొట్టి మోండల్‌ను అరెస్ట్‌చేసి తీసుకెళ్లారు. తమ ఎదుట హాజరు కావాలని ప‌ది పర్యాయాలు సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని సీబీఐ వెల్లడిం చింది.  దీంతో సీబీఐ కోర్టును ఆశ్ర యించింది. అంతకుముందు ఆయనను రెండు సార్లు సీబీఐ ప్రశ్నిం చింది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, 2015 నుంచి 2017 మధ్య కాలంలో విదేశాలకు తరలిస్తుండగా 20 వేలకుపైగా ఆవుల తలలను  బిఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. దీనిపై సీబీఐ 2020లో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. 8 మంది ఐపిఎస్ లకు ఈడీ సమన్లు    ఇలా ఉండగా, గ‌తంలో  సుకేష్ జైన్, జ్ఞానవంత్ సింగ్, రాజీబ్ మిశ్రా, శ్యామ్ సింగ్, సెల్వ మురుగన్, కోటే శ్వర్ రావు వంటి టాప్ పోలీసులు సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎనిమిది మంది ఐపిఎస్ అధికారుల ను ఈడీ ప్ర‌శ్నించింది. పశ్చిమ బెంగాల్‌లో అక్రమ బొగ్గు మైనిం గ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసు కు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.ఈ కేసులో ఇది మూడో అరెస్టు.  అంతకుముందు, పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. 2021లో వారిపై చార్జి షీట్ కూడా దాఖలయింది. నిందితుడు గురుపాద మాజీని పిఎంఎల్ఎ చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం అరెస్టు చేసినట్లు సీనియర్ ఈడీ  అధికారి ఒకరు తెలిపారు. ఈడీ  రోస్ అవెన్యూ కోర్టులో మాజీని హాజరు పరిచింది. కోర్టు అతడిని ఏడు రోజుల కస్టడీకి పంపింది. అతను పశ్చిమ బెంగాల్‌లోని అక్రమ బొగ్గు మైనింగ్ వ్యాపార కార్యకలాపాల కింగ్‌పిన్ అనుప్ మజీ భాగ స్వాములలో ఒకడు. మజీ, అతని సహచరుల నుండి అక్రమ బొగ్గు గనుల వ్యాపారం ద్వారా వచ్చిన నేరాల ద్వారా రూ. 66 కోట్లకు పైగా మాజీ అందుకున్నాడు. ఇంకా, అతను వసతి ఎంట్రీలను తీసుకునే ఉద్దేశ్యంతో షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి కోల్‌కతాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్‌కు రూ. 26 కోట్ల నగదు అందించాడ‌ని ఈడీ  అధికారి తెలిపారు. ఇవి రాజకీయ వేధింపులేనని అభిషేక్‌ ఆరోపించారు. ఈడీ నోటీసులు పంపిస్తుందని మమతా బెనర్జీ ముందే అన్నారని, అలాగే జరిగిందని తృణమూల్‌ నేత సౌగత్‌ రాయ్‌ గుర్తుచేశారు. 

అనుకున్నదొకటి ..అయినది ఇంకొకటి.. కేసీఆర్ బీహార్ యాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, బీహార్ వెళ్ళారు. ఈ మధ్యనే బీజీపీతో తెగతెంపులు చేసుకుని, మహా ఘటబంధన్’(ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి)తో జట్టుకట్టిన  ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి లాలూ రబ్రీ తనయుడు తేజస్వి యాదవ్’తోనూ సమావేశమయ్యారు. అవును,ముఖ్యమంత్రి బీహార్ వెళ్ళింది, గుల్వాన్ ఘర్షణలలో అమరులైన ఇద్దరు బీహారు అమరజవానుల కుటుంబాలకు, అదే విధంగా, ఇటీవల సికింద్రాబాద్’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస  కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకే, అయినా, అసలు పని మాత్రం అది కాదు. అది స్వామి కార్యం, స్వ కార్యం రాజకీయం.  అదే కోణంలో చూసినప్పుడు, కేసీఆర్ పాట్నా పర్యటన ఆశించిన లక్ష్యం సాధించక పోగా, ఇంటా బయట కొత్త సమస్యలకు శ్రీకారం చుట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  నిజానికి కేసీఆర్ ఇప్పటికే సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏ ముహూర్తాన, ఎందుకోసం ఆయన, జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్నారో, అందుకోసంగా ఏ క్షణాన కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారో గానీ, ఆక్షణం నుంచి ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రాజకీయాలు ఆయనకు ఏమాత్రం అచ్చిరావడం లేదు.  అంతే కాదు, ఆయన జాతీయ రాజకీయ ప్రయత్నాలు, సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చింది అన్న రీతిన, కేసీఆర్ ఏరాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో రాజకీయం తలకిందులు అవుతోంది. ప్రభుత్వాలు సంక్షోభంలో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. మహా రాష్ట్ర విషయాన్నీ తీసుకుంటే, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వుంది, అయినా ఫలితం లేక పోయింది.కానీ, కేసీఆర్ ఇలా ముంబై  వెళ్ళి అలా శివసేన ఆధినేత ముఖమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత సరద పవార్ తో చర్చలు జరిపి వచ్చారు.ఈ మొత్తం వ్యవహారంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్’తో పోటీపడి మోడీ పై ఒంటి కాలు పై లేచారు. నెలరోజులు తిరక్కుండానే, ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి పోయింది. సంజయ్ రౌత్ జైలు పాలయ్యారు.అలాగే, జార్ఖండ్ ముఖ్యమంత్రి, సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్’ కూడా కేసీఆర్’ను కలిసిన తర్వాతనే రాజకీయ రాజకీయ చిక్కుల్లో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  ఎప్పుడైతే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టాలనే ఆలోచనను బయట పెట్టారో, అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆయన చుట్టూ ఉచ్చులు బిగిస్తోంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని పాటిస్తోంది. కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ అవినీతి టార్గెట్ గా  అస్త్రాలను సంధిస్తోంది. నిజానికి బీజేపీ, ఒక్క కేసీఆర్  తెరాస విషయంలోనే కాదు, ఎక్కడెక్కడ బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్నాయో, అక్కడక్కడల్లా, ముఖ్యంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తోంది. అయితే ఐటీ కాదంటే సీబీఐ అదీ కాదంటే ఈడీ అస్త్రాలను సంధించి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. మహారాష్ట్రలో శరద్ పవార్ అంతటి ఉద్దండ నేత పౌరోహిత్యంలో నడుస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీ, శివ సేన కూటమి,(మహా వికాస్ అఘాడీ) కూటమి ప్రభుతాన్ని కూల్చేసింది. అలాగే, మోడీ మీద పులిలా రంకెలు వేసిన మమతా బెనర్జీ, ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. పార్థా చటర్జీ అవినీతి  ‘భాండాగారం’ బయట పడిన తర్వాత ఆమె సైలెంట్ అయి పోయారు.  అదే విధంగా ఓవంక ఢిల్లీలో మరో వంక ఝార్ఖండ్ లో హై డ్రామా నడుస్తోంది. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మూడు నెలలుగా జైల్లో ఉన్నారు. మరో వంక, మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పీకలలోతున కురుకుపోయారు. రేపో మాపో ఆయన కూడా జైలుకు పోవడం ఖాయమని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘంటాపథంగా చెపుతున్నారు. ఈ  స్కాంలో సీబీఐ 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1 గా మనీష్ సిసోడియా ఉన్నారు.  ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.దేశ వ్యాప్తంగా సంచలనమైన ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తున్న ఢిల్లీ బీజేపీ ఎంపీ.. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. మరో వంక కొంత కాలంగా కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గత ఎనిమిది ఏళ్లుగా సాగిన అవినీతి, అక్రమాలు బయటికి తీస్తున్నామని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా, ఇది, ఇది కాకపోతే అది, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ,ఆయన కుటుంబ అవినీతి పై ఫోకస్ పెట్టింది. సో, ఈ గండం నుంఛి బయట  పడేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరున రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారు. ఇప్పుడు బీహార్ పర్యటన కూడా అందులో భాగమే, అయినా ఫలితం మాత్రం లేదు. ఇక్కడ ప్రగతి భవన్ లో తెలుగులో చెప్పిన కథనే అక్కడ పాట్నాలో,బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పక్కన కూర్చోపెట్టుకుని చెప్పుకొచ్చారు, కానీ నితీష్ కుమార్ విన్నంతవరకు విని చెప్పింది చాలని లేచి పోవడంతో, కేసీఆర్ ఇజ్జత్ పోయిందని అంటున్నారు. ఇంతకు ముందు ఝార్ఖండ్ వెళ్ళినప్పుడు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే లేచి పోయారు. సో .. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు అచ్చిరాలేదు అని మరో మారు రుజువైంది. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు ఇంట ఓడి రచ్చ గెలవాలంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.

కోహ్లీ ... కింగ్  కోహ్లీయే!

దేశంలో క్రికెట్ పిచ్చికి అంతులేదు. గ‌తంలో స‌చిన్‌, ఇపుడు విరాట్ పిచ్చి. విరాట్ కోహ్లీని ఓట్టినే విరాట్ అన్నా, కోహ్లీ అన్నా స‌హించ‌లేనంత ఆగ్ర‌హం. కింగ్ కోహ్లీ అనాల్సిందే. ఇపుడు తెర‌మీద దేవుడు అత‌నే. కోహ్లీ రావ‌డంతోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌చిన్‌ని మ‌రిపించాడ‌న్న టాక్ బాగా ఉంది. వాస్త‌వ‌మే. మ‌నోడు ఫుల్ ఫామ్‌లో ఉన్న రోజుల్లో ప‌రుగుల వ‌ర‌ద‌నే సృష్టించాడు. సూప‌ర్ బ్యాటర్ అన‌గానే ఫోర్లు, సిక్స్‌లు కొట్టడం కాదు, చూడ‌ముచ్చ‌టైన క‌వ‌ర్ డ్రైవ్‌లు, హుక్ షాట్స్‌తో ఫోర్లు కొట్ట‌డంలోనే అస‌లు స‌త్తా బ‌య‌ట ప‌డుతుంది. అంతేకాదు వికెట్ల మ‌ధ్య పులిలా ప‌రిగెడుతూ ప్ర‌త్య‌ర్ధుల ఫీల్డ‌ర్ల‌కు వీడెవడ్రా బాబూ చీటికీ మాటికీ ర‌న్ తీసుకుంటాడు అని బెంబేలెత్తించే స‌త్తా ఇటీవ‌లి కాలంలో కోహ్లీయే చూపించాడు. అందుకే  కోహ్లీ కింగ్ కోహ్లీ అయ్యాడు.  ఆడుతున్న‌ది గ‌ల్లీ క్రికెట్‌, రంజీ మ్యాచ్‌లూ కాదు అంత‌ర్జాతీయ టోర్నీలు క‌నుక ఒక ప్లేయ‌ర్ జీవితంలో  ఫిట్నెస్ , ఏకాగ్ర‌త కూడా అంతే ప్రాధాన్య‌త సంత‌రించుకుంటాయి. అది కోహ్లీకీ వ‌ర్తిస్తుంది. ప‌దేళ్ల పాటు అనేక టోర్నీల్లో, అనేక ప్రాంతాల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన బ్యాట‌ర్ ఎవ‌ర‌యినా స‌రే ఆ త‌ర్వాత కాస్తంత వేగాన్ని త‌క్కువే  ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తీ మ్యాచ్ అప్పుడే టీమ్‌లోకి వ‌చ్చిన పిల్లాడిలా మారి ఆడాలి. అంతే వేగాన్ని, అంతే ప‌రుగుల దాహాన్ని ప్ర‌ద‌ర్శించాలి. సుమారు ప‌న్నెండేళ్లు ఆడిన‌వారికి కాస్తంత దూకుడు త‌గ్గుతుంది. స‌చిన్ కావ‌చ్చ‌, అంత‌కుముందు గ‌వాస్క‌ర్‌, క‌పిల్, ర‌విశాస్త్రి, శ్రీ‌కాంత్ కావ‌చ్చు. ఎవ‌రయినా కెరీర్‌లో ఏదో ఒక ద‌శ‌లో కొంత త‌గ్గాల్సి వ‌స్తుంది. దానికి అనేక కార‌ణాలు ఉండ‌వ‌చ్చు.  2014, 2019 మధ్య ఐదేళ్లపాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన బ్యాట్స్‌మన్, కానీ అప్పటి నుండి కష్టకాలంలో పడిపోయిన బ్యాట్స్‌మన్ గురించి ఊహించిన గందరగోళానికి చాలా తక్కువ సాక్ష్యం ఉంది. అతను దాదాపు 33 నెలలుగా అంతర్జాతీయ సెంచరీ చేయలేదనేది  జరగవచ్చు.  ఏ సందర్భంలోనైనా, మూడు అంకెల నాక్, అయితే, ప్రతిష్టాత్మకంగా  చేప‌డ‌తారు, ఇది ఒక మైలురాయి. ఒక బ్యాట్స్‌మెన్  విలువను కేవలం మూడు అంకెలపైనే కొలవలేం.  కాబట్టి అలాంటి విజయాన్ని సాధించకపోవడం  గొప్ప పతన మేమీ కాదు. కోహ్లీ ఆసియాక‌ప్‌కి అస‌లు జ‌ట్టులోకి ఎంపిక అవుతాడా అని దేశ‌మంత‌టా క్రికెట్ వీరాభిమానులు అనుమానించారు. అయ్యో మావాడు లేకుండా టీమ్ ఏమిటి అని బాధ‌ప‌డిన‌వారూ ఉన్నారు. కానీ ఊహించ‌నివిధంగా మ‌ళ్లీ కింగ్ జ‌ట్టులోకి వచ్చాడు. అదే ఫిట్నెస్‌, అదే వేగంతో ఆడుతున్నాడు. త‌న వందో టీ 20 మ్యాచ్‌లో మ‌ళ్లీ బ్యాట్‌తో బౌల‌ర్ల‌కు గ‌ట్టి స‌మాధాన‌మే చెప్పాడు. తాను మ‌ళ్లీ ప‌రుగులవ‌ర‌ద సృష్టించ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం అభిమానుల‌కు, అధికారుల‌కూ తెలియ‌జేశాడు  పాకిస్తాన్‌పై, సున్నాపై సెకండ్ స్లిప్‌లో త‌ప్పించుకున్న‌ తర్వాత, కోహ్లీ 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు, ఇది ఒంటరిగా టీ20 క్రికెట్‌లో ఫర్వాలేదనిపించినప్పటికీ, 148 ఛేజింగ్‌లో భారత్ విజయంలో కీలకమైనది. హాంకాంగ్‌పై, 2022 ఆసియా కప్‌లో కోహ్లి అర్ధశతకం సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను ఇప్పుడు టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా కూడా ఉన్నాడు.  హాంగ్‌కాంగ్‌పై ఈ అర్ధ సెంచరీ గత నెలలో అతని భయంకరమైన ఇంగ్లండ్ పర్యటన తర్వాత కోహ్లీకి పెద్ద ఉపశమనం కలిగించింది, అక్కడ అతను తన 6 ఇన్నింగ్స్‌లలో దేనిలోనూ 20 దాటలేకపోయాడు. కోహ్లీ 44 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో, అతను ఒక బౌండరీని సాధించాడు, కానీ అతను 3 అనూహ్యంగా  కొట్టిన సిక్సర్‌లను కొట్టాడు, 134 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. మొత్తంమీద, రెండు ఇన్నిం గ్స్‌ లలో అతను 94 యొక్క భారీ సగటుతో 94 పరుగులు చేశాడు. ఒక్క‌సారి 2018లోకి వెళితే.. 30ఏళ్ల కోహ్లీ ఇంగ్లండ్‌లో విజృంభించాడు. రెండు సెంచ‌రీలు, 3 అర్ధ సెంచ‌ రీల‌తో 593 ప‌రుగులు చేసి వ‌రెవ్వా.. కోహ్లీ అనిపించాడు.  కానీ మ‌రు సంవ‌త్స‌రం 2019లో అదే కోహ్లీ అంత గా రాణించ‌లేక‌పోయాడు. ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్‌లో కేవ‌లం 134 ప‌రుగులే చేశాడు. ఇది యావ‌త్ ప్ర‌పంచ కోహ్లీ అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. కింగ్ ఇలా నీరుగారాడేమిటా అని మ‌ద‌న‌ప‌డ్డారు. అధికారులు ఏమీ మాట్లాడ‌లేక‌పోయారు. ఢిల్లీలో ప్ర‌తీ గ‌ల్లీక్రికెట‌ర్ అన్నా బ్యాట్ కి ఏమ‌యింది అన్నారు.  ఇలాంటి ప‌రిస్థితులు ప్ర‌తీ క్రికెట‌ర్‌కీ వ‌స్తాయి. అయితే కోహ్లీ ఫైట‌ర్. త‌న పొర‌పాట్లూ, త‌ప్పిదాలు తెలుసు కుని త్వ‌ర‌లోనే మ‌ళ్లీ విజృంభిస్తాడ‌ని రవిశాస్త్రి, ద్రావిడ్‌, గంగూలీ వంటివారు క్రికెట్ లోకానికి త‌మ సందే శాలు పంపారు. కోహ్లీ ఆట‌లో వేగం త‌గ్గింద‌ని, ఇక ముందు ఇంత‌గా ఆడ‌లేడ‌న్న అనుమానాలు వ‌ద్దు, అత‌ను మ‌ళ్లీ ఆడ‌తాడు, జ‌ట్టులో అత‌ని స్థానం ప‌దిలం అని భారీ ఆశ‌లు క‌ల్పించారు.  2020లో మ‌ళ్లీ ఫామ్‌లోకి తిరిగి వ‌చ్చాడు కింగ్‌. అస‌లు అంత‌ర్జాతీయ కెరీర్‌ని ప‌రిశీలిస్తే, అత‌ను ఆడినన్ని మ్యాచ్‌లు కేవ‌లం 15 మంది మాత్ర‌మే ఆడ‌గ‌లిగారు. కోహ్లీ యావ‌రేజ్ 53 కాగా వారి యావ‌రేజ్ 50 మాత్ర‌మే! గ‌తం వ‌దిలేద్దాం.. మ‌న కింగ్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇక ఆసియాక‌ప్ లో ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత‌ని బ్యాట్ నుంచి ప‌రుగుల వ‌ర‌దే ఉంటుంద‌ని ఆశిద్దాం.