నేరాల్లోనూ నెంబర్ వన్
posted on Aug 29, 2022 @ 11:24AM
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం .. అన్నిట్లోనూ తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్ ...ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు తెరాస నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రతి రోజు పలికే పలుకులే ఇవీ. ఈ పలుకుల్లో ఎంత నిజముంది, ఏమిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ విషయాన్ని అలావుంచి, అసలు విషయంలోకి వస్తే, రాష్ట్రంలో నేరాల సంఖ్య దినదిన ప్రవర్థమానంగా, దిగ్విజయంగా ముందుకు దూసుకు పోతోంది. దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా, ఎక్కడ ఏ ఉగ్రవాద ఘాతుకం జరిగినా దాని మూలాలు హైదరాబాద్’లో తేలడం మొదటి నుంచి ఉన్నదే.. అయితే ఇప్పడు, ఇదీ అదీ అని కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయినా, అంతర్జాతీయా కాసినో కుంభ కోణమే అయినా, ఇంకో ఆర్థిక నేరం అరాచకం ఏదైనా అన్నిని మూలాలు హైదరాబాద్’ లోనే తేలుతున్నాయి.
అదలా ఉంటే, గడచినా మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఎవరో కాదు, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2020లో 1 లక్షా 47 వేల 504 నేరాలు నమొదయితే, 2021లో 1 లక్షా ,58 వేల 809 నేరాలు నమోదయ్యాయి.
హత్యలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు, వృద్ధులపై దాడులు, సూసైడ్స్ పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. గతేడాది 21,315 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 7,447 మంది మృతి చెందారు. రోజూ 20 మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో గతేడాది 10,171 మంది సూసైడ్ చేసుకోగా అందులో కుటుంబ కలహాలు, అనారోగ్యంతో సూసైడ్ చేసుకున్న వారి సంఖ్య 4,464. ఇందులో 45 నుంచి-60 ఏండ్ల వారే ఎక్కువయంతగా ఉన్నారు.
ఆత్మహయ త్యల్లో దేశంలోనే మొదేసుటిస్థానంలో మ ో హారాష్ట్ర నిలంచ వ గ గా త జ మిళ152నాడు, ఎంపీ, బెంగాల్, క‌్మ ర్నాటయల క, తెలంగాణ త‌్థార్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2020లో 802 హత్యలు జరిగితే 2021లో ఆ సంఖ్య 1,026కు పెరిగింది. ఇక కిడ్నాపులు 2,056 నుంచి 2,760కు పెరిగాయి. మహళలపై దాడుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020లో 17,791గా నమోదైతే.. 2021లో అది 20,865కు చేరింది. చిన్నారులపై దాడులు కూడా 4,200 నుంచి 5,667కు పెరిగాయి.
సో .. ముఖ్యమంత్రి మొదలు తెరాస చోటామోటా నాయకులవరకు, ప్రతి ఒక్కరూ, ప్రతి రోజు ‘మేమే నెంబర్ వన్’ అని చెప్పుకోవడం తప్పు కాదని, అనుకోవచ్చునో ఏమూ ..