స్వరాజ్ సీరియల్ చూడండి... మన్ కీ బాత్‌లో ప్రధాని
posted on Aug 28, 2022 @ 4:32PM
దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న స్వరాజ్ సీరియల్‌ను చూడాలని ప్రజలను కోరారు. స్వాతంత్ర్య సమర యోధుల జీవిత విశే షాలను, వారు చేసిన త్యాగాలను ఈ సీరియల్‌లో చూపిస్తున్నారని తెలిపారు. అమృత మహోత్సవాల అమృత ధార దేశం నలు మూలలా ప్రవహిస్తోందన్నారు. అమృత స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మన దేశ సమష్టి బలాన్ని మనం చూడ గలిగా మనితెలిపారు. ప్రతినెలా ఆయన నిర్వహించే ‘మన్ కీ బాత్’రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆఆయన మాట్లా డారు.
భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమం ఘన విజయం సాధించిందని చెప్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమృత స్వాతంత్ర్య మహోత్సవాలను ఇతర దేశాల్లో కూడా నిర్వహించారని తెలిపారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు సైతం జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు.
సెప్టెంబరు నెలను పోషణ మాసంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. పోషకాహార లోపా నికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలని చెప్తూ, సెప్టెంబరు నెలను పోషకాహార మాసంగా జరుపుకోవాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అమృత సరోవరాల నిర్మాణం సామూహిక ఉద్యమంగా మారింద న్నారు. దేశ వ్యాప్తంగా ప్రశంసనీయమైన కృషి జరుగుతోందని చెప్పారు.
మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం 2014 అక్టోబరు 3న ప్రారంభమైంది. ప్రతి నెలా చివరి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని మోదీ కోరారు. ప్రజలు న మో యాప్ ద్వారా కానీ, 1800-11-7800 నెంబరుకు ఫోన్ చేసి కానీ తమ అభిప్రాయాలను, సలహాలను తెలియజేయవచ్చు.