సంక్షోభ‌న్నుంచీ బ‌య‌ట‌ప‌డేందుకు సంఘ‌ర్షించాలి.. కేసీఆర్‌ 

దేశాన్ని సంక్షోభాన్నుంచీ బ‌య‌ట‌కు తేవ‌డానికి ప్ర‌జాసంక్షేమం కోరుకునే శ‌క్తులు సంఘ‌ర్ష‌ణ సాగించాల‌ని తెలంగాణా ముఖ్య మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు రంగాల అభివృద్థి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లోని ప్రగతిని   పరిశీలించేందుకు 26 రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు వంద‌ మంది రైతు సంఘాల నాయకులతో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్  రెండో రోజు ఆదివారం సమావేశమ య్యారు. శ‌నివారం (ఆగ‌ష్టు27) నుంచి సమావేశ‌మ‌వుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌,  దేశంలో వ్యవసాయం ఏదుర్కొంటున్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతు న్నట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నెలకొల్పిన అంశాలపై జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ వివరించ నున్నారు. జాతీయ రైతు సంఘాల నేతలతో  సీఎం కేసీఆర్ రెండో రోజు సమావేశ‌మ‌య్యారు. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులు, ఐక్య వేదిక గా ఏర్పాటు కావాలని తీర్మానించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ జిల్లాల్లో పర్యటించి రైతు సంక్షేమం గురించి తెలు సుకున్న జాతీయ రైతు సంఘాల నాయకులు ఆ వివరాలు నోట్ చేసుకున్నారు.  అయితే ఒక పక్క జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, తాజాగా జాతీయ  రైతు సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీరు అందించడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి సదుపాయాలను చూసి తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహ కారానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించడం కూడా తెలిసిందే. రైతు సంఘాల నేతలు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా ఖండించారు. పంటలు పండిం చ \డంతో పాటు, గిట్టుబాటు ధరలను కల్పించాల‌ని డిమాండ్ చేశారు. అసంఘటితంగా ఉన్న రైతాంగం సంఘ‌టితం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని రైతు సంఘాల నాయ‌కులు ఆకాంక్షించారు. దేశంలో సరికొత్త రైతు ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరమున్న దని వారు స్పష్టంచేశారు.

కాళేశ్వ‌ర సంద‌ర్శ‌న‌కు అనుమ‌తించండి... సిఎస్ కు బండి సంజ‌య్ లేఖ‌

కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం విష‌యం లో త‌మ అనుమా నాలు నివృత్తి చేసు కోవాల‌నుకుంటు న్నామ‌ని, ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు అను మ‌తిని కోరుతూ ఏపీ సీఎస్‌కు బండి సంజ‌య్ లేఖ రాశా రు. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోత ల ప్రాజెక్టులో మోటా ర్లకు  ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించ డానికి బీజేపీ బృందం  పర్యటిస్తుం దన్నారు.   1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్‌ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించాయన్నారు. 2004 - 2009లో జరిగిన జలయజ్ఞం పనులపై  వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను  అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందన్నా రు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇరిగేషన్‌ అధికారులను పంపి తమ సందేహాలను నివృత్తి చేయాలని బండి సంజయ్ ఆ లేఖ లో పేర్కొన్నారు. త‌మ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సాగునీటి పారుద‌ల రంగం నిపుణుల‌తో కూడిన 30 మంది ప్ర‌తినిధి బృందం ప్రాజెక్టును సంద‌ర్శించాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు.సెప్టెంబ‌ర్ తొలి వారంలో ఈ సంద‌ర్శ‌న‌కు వెళ్లాల‌నుకుం టున్న‌ట్లు  లేఖ‌లో పేర్కొన్నారు. ప్రాజెక్టు ప‌రిశీల‌న ద్వారా త‌మ‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తి చేసుకోవాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు.అదేవిధంగా త‌మ బృందంతో పాటు ప్ర‌భుత్వ సాగునీటి శాఖ అధికారుల‌ను పంపి అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్ ను లేఖ‌లో కోరారు. ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన  పంప్ హౌస్ ముంపునకు గురైన విష‌యం తెలిసిందే.  ఈ పంప్ హౌస్ ముంపునకు గురి కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.  కృష్ణానదికి 1998లో వరదలు వచ్చిన సమయంలో కూడా శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వరద నీరు వచ్చిన విషయం తెలిసిందే.  ఆ సమయంలో విపక్షాలు  శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన విషయాన్ని బండి సంజయ్ ఆ లేఖలో గుర్తు చేశారు. 2004 - 2009 లో జరిగిన జలయజ్ఞం పనులపై  వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానా లను నివృత్తి చేసిందని బండి సంజయ్ ప్రస్తావించారు.

ఝార్ఖండ్ లో రాజ‌కీయ అల‌జ‌డి

ఝార్ఖండ్ రాజ‌కీయ ముఖ‌చిత్రం మార‌నుంది. ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ శాస‌న‌స‌భ్య‌త్వానికే దెబ్బ‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే జ‌రిగితే సోరేన్ నాయ‌క‌త్వంలోని జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జేడీల సంకీర్ణ ప్ర‌భుత్వం నిల‌బ‌డే అవ‌కాశాలు త‌క్కువేన‌ని విమ‌ర్శ కులు అంటున్నారు. దీన్ని గురించే ఇపుడు అంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేల క్యాంపు రాజ‌కీయాలు ఆరంభమ‌య్యాయి.  ప్ర‌భుత్వం ఊగిసలాటలో ఉన్న త‌రుణంలో, సంకీర్ణ కూటమిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హేమంత్‌ సోరేన్‌ సీఎంగా ఉంటూ గనుల లీజును తనకు తానే కేటాయించుకోవడ‌మే వివాదా స్పదమైన సంగతి తెలిసిందే. సోరేన్‌ శాసన సభ్యత్వంపై అనర్హత వేటు వేసేందుకు ఈసీఐ పచ్చజెండా ఊపినట్లు రాజ్‌భవన్‌ వర్గా లు అనధికారికంగా ప్రకటించాయి. దీంతో.. గవర్నర్‌ ఏ క్షణాన్నైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే సీఎం హేమంత్‌ సోరేన్‌ నష్టనివారణ చర్యలను ప్రారంభించారు.  శుక్రవారం నుంచి తమ వర్గం ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన మూడో విడత భేటీకి ఎమ్మెల్యే లంతా లగేజీతో రావడం గమనార్హం. ఆ వెంటనే.. సీఎం ఇంటి వద్ద సిద్ధంగా ఉన్న మూడు బస్సుల్లో.. భారీ భద్రత నడుమ ఎమ్మె ల్యేలను తరలించారు. వీరిని కుంతీ జిల్లాకు తరలిస్తున్నట్లు అధికార కూటమి వర్గాలు తెలిపాయి. అయితే.. అక్కడి నుంచి బీజేపీ యేతర రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌ లేదా పశ్చిమబెంగాల్‌కు ఎమ్మెల్యేలను తరలించే అవకాశాలున్నాయంటూ వార్తలు వెలువడ్డా యి. ఎమ్మెల్యేలంతా పిక్‌నిక్‌కు వెళ్తున్నారని ఝార్ఖండ్‌  మంత్రి ఆలంగీర్‌ ఆలం వెల్లడించారు. అందుకోసం కుంతీ జిల్లాలోని ఓ రిసార్ట్ను బుక్‌ చేశామని వివరించారు.  అయితే.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. క్యాంపు రాజకీయాలు ప్రారంభమ య్యాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.  దీంతో అధికార పక్షం.. అది పిక్‌నికేనంటూ కొందరు ఎమ్మెల్యేలు లాత్రాతు డ్యామ్‌ వద్ద బోట్‌ షికారు చేస్తున్న వీడియోలను మీడి యాకు విడుదల చేసింది. సాయంత్రానికి ఎమ్మెల్యేలందరినీ రాంచీకి తరలించింది. 81 మంది సభ్యులున్న జార్ఖండ్‌ అసెంబ్లీ లో సోరెన్‌ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో జార్ఖండ్‌ ముక్తి మోర్చా అతి పెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది సంకీర్ణ కూటమి.  గనుల లీజును సోరెన్‌.. తనకు తానే కేటాయించుకోవడం  ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష బీజే పీ.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్ నిబంధనలను ఉల్లంఘిం చార ని..  సీఎంగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు అందించిన వినతిపత్రాన్ని గవర్నర్ రమేష్ బైస్.. ఎన్నికల సంఘానికి పంపించారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని గురువారం సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

జగనన్న... ఆంక్షల పాలన ఏం ధర్మం?

ఇంటిల్ల‌పాదినీ సంతోషంగా జీవించేలా చూడ‌టం ఇంటిపెద్ద క‌ర్త‌వ్యం. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటూ అంద‌రి ఆనందాన్ని కోరుకోవ‌డం ఇంటి పెద్ద ధ‌ర్మం. ఇదే ధ‌ర్మం రాష్ట పాల‌కుల‌కు వ‌ర్తిస్తుంది. ప్ర‌జ‌లంద‌రినీ ప్ర‌శాంతంగా, సంతోషంగా జీవించేలా చూడ‌టం ప్ర‌భుత్వం, సీఎం ధ‌ర్మం. అలాగాకుండా ప్ర‌భుత్వ‌మే అడ్డంకులు క‌ల్పిస్తూ, ముఖ్య‌మంత్రి, అధికారులు అన్ని ర‌కాల అడ్డంకులు పెడుతూంటే ప్ర‌జ‌లు ఎలా ఉంటారు. ఏపీలో రాను రాను ప‌రిస్థితులు ప్ర‌జాహితంగా లేవ‌న్న‌ది విమ‌ర్శ‌కుల మాట‌. తాజాగా తాడిపత్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చేసిన కామెంట్ అందుకు అద్దంప‌డుతోంది. ప్ర‌జ‌లు సంతోషంగా ఉండ‌డం అధికార పార్టీ నాయ‌కుల‌కు, అధికారుల‌కు ఇష్టంలేకుండా పోయింద‌ని ఆయ‌న మీడియాతో అన్నారు. దీనికితోడు పండ‌గ‌లు నిర్వ‌హించుకోవాలా వ‌ద్దా అన్న‌ది కూడా ప్ర‌భుత్వం అనుమ‌తి తీసుకున్న‌త‌ర్వాత‌నే అన్న‌ది మ‌రీ దారుణ‌మ‌ని ఆగ్ర‌హించారు.  ప్ర‌స్తుతం అన్ని ప్రాంతాల్లోనూ వినాయ‌క‌చ‌వితికి సిద్ధ‌ప‌డ‌డంలో ప్ర‌జ‌లు త‌ల‌మున‌క‌ల‌య్యారు. విగ్ర‌హాల ఏర్పాటు విష‌యంలో కొన్ని సాధార‌ణ ఆంక్ష‌లు ఉంటాయి. కానీ ఆంక్ష‌లు హ‌ద్దులు మీరి ఉంటున్నాయ‌న్నారు.  ... తాడిపత్రి ప్రజలు సంతోషంగా ఉండడం అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఇష్టం లేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారులు దయ దాక్షిణ్యాలతో హిందూ పండుగలు నిర్వహించుకోవాలా? అని ప్రశ్నించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం గంటల తరబడి యువత నిరీక్షిస్తు న్నా రని మండిపడ్డారు.  వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణతో వైసీపీ  పతనం మొదలైందని ప్ర‌భాక‌ర్ న్నారు. శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణ సరికాదన్నారు. మున్సిపల్ చైర్మన్ అయిన తనకే అనుమతి కోసం ఆయా అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చెయ్యి స్వామి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు

దాడుల‌కు గుర‌య్యేవారికి అండ‌గా ఉంటాం.. అచ్చెన్నాయుడు

ప‌రిస్థితులు అన‌నుకూలించిన‌పుడే దుష్ట ఆలోచ‌న‌లు మొద‌ల‌ వుతాయి. ప్ర‌జ‌ల నుంచి తిర‌స్కారం ఎదుర్కొంటున్న జ‌గ‌న్ స‌ర్కా ర్ విప‌క్షాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంతో పాటు, వారి నాయ‌కులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌మీదా దాడుల‌కు వెనుక‌డ‌టంలేద‌ని విమ‌ర్శలు వెల్లువెత్తు తున్నాయి. దాదాపు రాష్ట్రంలో ప్ర‌తిప్రాంతంలోనూ ఈ ర‌క‌మైన విప‌ క్షాల‌పై దాడులు, తిట్ల‌పురాణాలకు వైసీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రి స్తోంది. దానికితోడు పోలీసు యంత్రాంగం కూడా అధికార‌గ‌ణానికి వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని విప‌ క్షాలు మండిప‌డుతున్నాయి. మూడేళ్ల పాల‌న కాలంలో రాష్ట్రంలో జ‌రిగిన దాడుల సంఘ‌ట‌న‌ల్లో ఎంత‌మందికి శిక్ష‌ప‌డింది, ఎంత‌మందిపై కేసులు న‌మోద‌ య్యాయో లెక్క‌లేద‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని ఎంతో మందిని జైళ్ల‌కు త‌ర‌లించార‌న్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొం టున్న కార్యకర్తలకు నాయకు లకు టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయి అక్రమ కేసులు, అర్థరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రిలతో  టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం పోలీసులు డ్యూటీలో భాగం అనుకుంటున్నారా?.. లేక ఫ్యాషన్ అనుకుంటు న్నారా? అని ప్రశ్నించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదన్నారు.  చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టా తయారు చేస్తున్నామన్నారు. తమ కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన ఖాకీలను, వైసీపీ నేతల్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే వారిపై చర్యలకు శ్రీకారం చుడతామన్నారు. 2024 తర్వాత ఏపీ రాష్ట్రంలో వైసీపీ ఉండదని, జగన్ రెడ్డి ఉండరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

స్వోత్కర్ష.. కేంద్రంపై నింద.. రైతు సంఘాలతో కేసీఆర్ సమావేశం సారాంశమిదే!

కేసీఆర్ సమావేశమంటే స్కోత్కర్ష.. పరనింద మాత్రమే. సభ ఏదైనా, సమావేశం ఏదైనా, ఎవరితో భేటీ అయినా కేసీఆర్ చెప్పే ఆవుకథ ఒక్కటే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కానీ అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టని సంక్షేమ కార్యక్రమాు తెలంగాణలో చేపట్టాం.. కేంద్ర ప్రభుత్వం కనీసం ఊహకు కూడా రాని అభివృద్శి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. అది భరించలేకే.. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ వ్యవసాయ విధానాలు బహు భేషుగ్గా ఉన్నాయనీ, తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం బహు గొప్పగా విలసిల్లుతోందనీ దేశ వ్యాప్తంగా చాటేందుకు కేసీఆర్ జాతీయ స్థాయిలో రైతు సంఘాల ప్రతినిధులను తెలంగాణకు పిలిపించుకుని మరీ సమావేవమయ్యారు.  ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగ సారాంశమంతా ముందుగా చెప్పుకున్నట్లు ఆవు కథే. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా చేస్తోందని అహో.. ఓహో పొగుడు కోవడం వచ్చిన వారి చేత పొగిడించుకోవడం ఇందు కోసం కేసీఆర్‌కి ఎవరినైనా సరే ప్రగతి భవన్ కు ఆహ్వానిస్తారు. పిలిపించుకుంటారు.బ్రహ్మాండమైన ఆతిధ్యం ఇస్తారు.  గత మూడేళ్లుగా కమ్యూనిస్టులను అత్యంత చులకనగా మాట్లాడిన కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడాయనకు కలిగింది. అందుకే వారికి ఇటీవల ప్రగతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. రాజమర్యాదలతో విందు దొరికింది. అదంతా మునుగోడు మహాత్మ్యమే అని విమర్శకులు అన్నా.. కేసీఆర్ కు వారితో అంతకు మించిన అవసరమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడిన. ఇప్పటికీ విభజనపై విమర్శలు గుప్పిస్తున్న ఉండల్లికీ,  అలాంటి చాలా మందికీ ఇటీలి కాలంలో ప్రగతి భవన్ ద్వారాలు బార్లా తెరుచుకుంటున్నాయి. అదంతా వారి గొప్పదనం కాదు. వారితో కేసీఆర్ కు అవసరం పడటమే కారణం. అది కాస్తా తీరిపోతే... మళ్లీ వారికి ప్రగతి భవన్ దర్శనం గగనమే అవుతుంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.  తాజాగా ఉత్తరాది రైతు సంఘాల నేతలతోన కేసీఆర్‌కు అవసరం వచ్చింది. తెలంగాణలో వ్యవసాయ రంగం అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్లి వీరంతా  ప్రచారం చేయాలి. అందుకే ఆహ్వానించారు. రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. తెలంగాణ రైతు సంక్షేమ, వ్యవసాయ, అభివృద్ధి విధానాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తామని వారు భోజనం తర్వాత హామీ ఇచ్చారు. అదీ సంగతి. ఈ భేటీ వేదికగా కేసీఆర్.. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు   రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశంలో తీర్మానం చేసింది. కాదు కాదు చేయించారు. దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ మోడల్ అత్యవసరం అని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రైతు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో అసంఘటితంగా ఉన్న రైతాంగం మొత్తం సంఘటితం కావాలని అందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని రైతు నేతలు కోరారు. ఉత్తర, దక్షిణ భారత్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయం, రైతు సంక్షేమంపై సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా  చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళైనా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూడాల్సి రావడం దారుణం అన్నారు. దేశంలో మొత్తం 70వేల టీఎంసీల నీటి వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు కేసీఆర్. తాగునీరు, సాగునీరుకు 50వేల టీఎంసీల నీరు సరిపోతుందని.. అయినా ఇంకా వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగా రాష్ట్రం.. రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ సాగునీటిని అందిస్తున్నప్పుడు ఈ పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు కేసీఆర్. రైతులు కూర్చుని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? అని నిలదీశారు. రైతు సంఘాల నేతలకు ప్రగతిభవన్ లోనే అల్పాహారం, లంచ్ ఏర్పాటు చేశారు. రాకేశ్ టికాయత్ ఆదివారం ప్రగతి భవన్ కు రానున్నారు. ఆదివారం కూడా రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది.  మొత్తం 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్‌... భార‌త్ జోడీకి కాంస్యం

కాంస్య పతకం సాధించడం ద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి చిరస్మ రణీయం చేసుకున్నారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీ్‌సలో భారత జంట హోరాహోరీగా పోరాడింది. కానీ ఆరో సీడ్‌ ఆరోన్‌ చియా/సోయి ఇక్‌ ఇన్‌ (మలేసియా) 20-22, 21-18, 21-16 స్కోరుతో సాత్విక్‌/షెట్టి జోడీపై గెలుపొందింది. 77 నిమిషాల మ్యాచ్ లో భారత జంట తొలి గేమ్‌ను సొంతం చేసుకొని ఆధిక్యం ప్రదర్శించినా..అదే జోరును కొనసాగించలేక పరాజయం చవిచూసింది. ఇండోనేసియా ద్వయం చేతిలో ప్రపంచ ఏడో ర్యాంక్‌ జంట సాత్విక్‌, చిరాగ్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.  ఇటీవలి కామన్వెల్త్‌ క్రీడల మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లోనూ చియా/సోయి జంట భారత్‌ జోడీపై నెగ్గింది. సెమీస్‌లో ఓడినా. .ప్రతిష్ఠా త్మక వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో పతకం అందుకున్న తొలి భారత జోడీగా సాత్విక్‌/చిరాగ్‌ చరిత్ర సృష్టించారు. అంతే కాదు..2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం సాధిస్తూ వస్తున్న భారత రికార్డును వారు కొనసాగిం చారు.  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ జంటగా అవతరిం చిన భారత జంట శుక్రవారం భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. మహిళల డబుల్స్‌లో 2011లో కాంస్యం సాధించిన జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప తర్వాత డబుల్స్ ఈవెంట్‌లో భారత్‌కు ఇది రెండో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం.

ఆసియా క‌ప్‌... లంక‌ను చిత్తు చేసిన ఆఫ్ఘ‌నిస్థాన్‌

ఆసియాక‌ప్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్ ఊహించని విధంగా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో శ్రీ‌లంకను ఓడిం చింది. శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ 8 వికెట్ల తేడాతో శ్రీ‌లంను చిత్తు చేసిం ది. మొద‌ట బ్యాట్చేసిన లంక  19.4 ఓవర్లలో 105 పరుగు లకే కుప్పకూలింది. రాజపక్సే (38), కరుణరత్నె (31) టాప్‌ స్కోరర్లు. స్వల్ప లక్ష్యాన్ని అఫ్ఘాన్‌ 10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుర్బాజ్‌ (40), హజ్రతుల్లా (37 నాటౌట్‌) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించడంతో.. అఫ్ఘాన్‌ మరో 59 బంతులు మిగిలుండగానే అలవోకగా నెగ్గింది.సియాకప్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. ఆల్‌రౌండర్లతో బలంగా ఉన్న శ్రీలంక జట్టును ఆఫ్ఘని స్థాన్ మట్టి కరిపించింది.   ఎంతో వ్యూహాత్మ‌కంగా బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌నతో శ్రీలంకను 105 పరుగులకే కట్టిపడేసిన ఆఫ్ఘన్.. ఆ తర్వాత బ్యాటింగులోనూ రెచ్చి పోయి  10.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జాజయ్ 28 బంతు ల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37(నాటౌట్) పరుగులు చేయగా, రహ్మతుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరు గులు చేశా డు. ఇబ్రహీం జద్రాన్ 15, నజీబుల్లా జద్రాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన లంక.. కుశాల్ మెండిస్ (2), అసలంక (0), పాథుమ్ నిశ్శంక (3) విఫలం కావ‌డంతో లంక పీక‌ల్లోంత క‌ష్టాల్లో ప‌డింది. కేవ‌లం 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లంక అభిమానుల‌ను నిరాశ‌ప‌ర‌చింది. ఆఫ్ఘ‌న్ మీద సునాయాస విజ‌యం సాదిస్తుం ద‌న్న ఆశ‌లు ఆడియాస‌లయ్యాయి. చూస్తుండ‌గానే మంచి స్కోర్ చేయ‌గ‌ల లంక బ్యాట‌ర్లు ఒక‌రి వెనుక మ‌రొక‌రు వెనుదిరి గారు. ఈ ప‌రిస్థితిలో  లంకను గుణతిలక (17), బి.రాజపక్స (38) కొంత ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో కుదు రుకున్నా రనుకున్న సమయంలో మరోమారు ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గుణతిలకను అవుట్ చేయడంతో ద్వారా ముజీబ్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటికే బి.రాజపక్స రనౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక మరోమారు కష్టాల్లో కూరుకుపోయింది.  హసరంగ(2), కెప్టెన్ శనక డకౌట్ కావడంతో ఇక కోలుకోలేకపోయింది. చివర్లో కరుణరత్న 31 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తీక్షణ ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్‌గా వెను దిరగ్గా, మహీశ పథిరన 5, దిల్షాన్ మధు శంక ఒక పరుగు చేశాడు. ఫలితంగా లంక ఇన్నింగ్స్ 19.4 ఓవర్లలో 105 పరుగుల వద్ద ముగిసింది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫజల్లా ఫరూకీ 3 వికెట్లు తీసుకోగా, ముజీబ్, కెప్టెన్ నబీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్-పాక్ జట్లు తలపడతాయి. శ్రీలంక:19.4 ఓవర్లలో 105 ఆలౌట్‌ (రాజపక్సే 38; ఫారూఖీ 3/11);అఫ్ఘానిస్థాన్‌:10.1 ఓవర్లలో 106/2 (గుర్బాజ్‌ 40, జజాయ్‌ 37 నాటౌట్‌; హసరంగ 1/19).

కేసీఆర్‌ని క‌లిశారు... చిక్కుల పాలయ్యారు!

కొంద‌రి క‌ల‌యిక అద్భుతం అంటారు, మ‌రికొంద‌రి క‌ల‌యిక ఎంతో మేల‌యిన‌దంటారు, కానీ కేసీఆర్‌తో భేటీ అయిన‌వారంతా రాజ‌కీయాల్లో ఊహించ‌ని షాక్‌లు తింటూండ‌టం గ‌మ‌నార్హం. ఇది యాదృచ్ఛిక‌మా, టీఆర్ ఎస్ అధినేత ఐర‌న్‌లెగ్ మ‌హ‌త్య‌మా అన్నది పక్కన పెడితే...  కేసీఆర్ కు రాజకీయంగా సన్నిహితం అవ్వడానికి ప్రయత్నించిన వారంతా ఏదో విధంగా చిక్కులలో పడుతున్నారన్నది మాత్రం వాస్తవం.  మోదీ ప్ర‌భు త్వాన్ని గ‌ద్దె దించ‌డానికి కేసీఆర్  తాప‌త్ర‌యం, దూకుడుకు ఒక్క‌సారిగా బ్రేక్ ప‌డడానికి మాత్రం ఆయన వెనుక అడుగు వేయడానికి లేదా ఆయనతో కలిసి నడవడానికి ముందడుగువేసిన వారంతా ఇబ్బందులలో పడుతుండటంతో జాతీయ రాజకీయాలలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు చేసిన చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందాన సాగుతున్నాయి.   ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు కేసిఆర్ బీజేపీ మీద దూకుడుగానే ముందుకు వెళ్ళారు. కేసిఆర్ వెళ్లిన ప్రతి రాష్ట్రం లో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో అదరగొట్టారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ప్రచారంతో ఊదరగొట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అంచనాతో కేసిఆర్ కేంద్రం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇక తాను కలిసిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో కూడా బీజేపీ పతనం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావించి తనతో కలిసి రావాల్సిందిగా కోరారు. రాజకీయ వ్యూహకర్త పీకే సలహాలతో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ బీజేపీ ఓడుతుందని కేసిఆర్ వేసిన అంచనాలు తప్పాయి. .సామాజిక న్యాయం, సమానత్వా న్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకు వచ్చేందు కు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్  ప్రయత్నాలు  చేశారు. జాతీయ స్థాయిలో పార్టీల నేతలు, పౌర సమాజ సభ్య లు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఉమ్మడి వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని భావించారు కేసీఆర్. ఈ లక్ష్యాలను సాధించే దిశగా అన్ని పార్టీల, వివిధ ప్రజా సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.  పీపుల్స్ ఫ్రంట్ అని సీఎం కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా కేసీ ఆర్ ఎన్డీయేతర నాయకులను వరసగా కలిశారు.  మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతోనూ మంతనాలు జరిపారు. కేసీఆర్. అటు మాజీ  ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కూడా  కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి ముచ్చ‌ట‌ప‌డ్డారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారని, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరా టం కొనసాగించాలని.. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కేసీఆర్‌కు ఉద్ధవ్ థాక్రే మద్దతు ప్రకటించారు. ముంబై వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని ఉద్దవ్ కోరారు. కానీ చిత్ర‌మేమంటే,  కేసీఆర్‌ను క‌లిసి చ‌ర్చించిన వేళావిశేష‌మేమోగాని, ఉద్ధ‌వ్ థాక్రే ఏకంగా సీఎం ప‌ద‌విని కోల్పోయి, అధికార నివా సం నుంచి స్వంత నివాసాన్ని చేరుకున్నారు. ఊహించ‌నివిధంగా బీ\జేపీ పావులు వేగంగా క‌దిపి థాక్రేకు షాక్ ఇచ్చింది. శివ‌సేన పార్టీలోనే అస‌మ్మ‌తి నాయ‌కుల‌ను ప్రోత్స‌హించి థాక్రేకు ఊపిరాడ‌నీయ‌కుండా చేసింది బీజేపీ. త‌న‌కు ప‌ద‌వుల మీద ఎన్న‌డూ ఆస‌క్తి లేద‌ని, ప్ర‌జ‌లు మా పార్టీని న‌మ్ముతున్నార‌ని, వారి అభిప్రాయాన్ని అంగీక‌రిస్తాన‌ని నిండు స‌భ‌లో ప్ర‌క‌టించి మ‌రీ గ‌ద్దె దిగారు.  అలాగే  జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో కేసీఆర్‌ భేటీల తరువాతే  గనుల లీజు వ్యవహారంలో హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని..  కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనపై అనర్హత వేటు వేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేసీఆర్ తో భేటీ తరువాతే చిక్కుల్లో పడ్డారు. ఆమె కేబినెట్ లో  మంత్రి అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. అరెస్టయ్యారు. కనీసం ఆయనకు మద్దతుగా మమత చిన్న ప్రకటన కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు.  ఇక ఆప్ విషయానికి వస్తే కేసీఆర్ తో భేటీల తరువాతే ఆ రాష్ట్రంలో లిక్కర్ స్కాం వెలుగులోనికి వచ్చి ఆ కుంభకోణం కేసులో ఏకంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఏ వన్ గా ఈడీ కేసు నమోదు చేసింది.  కారణాలేమైతేనేం కేసీఆర్ తో రాజకీయంగా కలిసి నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వివిధ పార్టీల నాయకులు ఒకరి తరువాత ఒకరుగా చిక్కుల్లో పడటంతో ఆయనతో కలిసేందుకు, భేటీ అయ్యేందుకూ జాతీయ స్థాయి రాజకీయాలపై చర్చించేందుకూ కూడా పార్టీలనాయకులు భయపడుతున్నారు. రాజకీయ నేతలలో ఆయనది ఐరన్ లెగ్ అన్నముద్రపడిందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.

భేటీల వెనక బలమైన వ్యూహం ?

కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్’ వచ్చారు. మునుగోడు మాజీ శాసనసభ్యుడు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి  భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వెంకట రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసని ఓడించి  ముఖ్యమంత్రి కేసీఆర్, అరాచక, కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  అయితే, వచ్చిన పని చూసుకుని  ఇంచక్కా విమానం ఎక్కరా అంటే లేదు.  పనిలో పనిగా, రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి, ఈనాడు, ఈటీవీ సంస్థల అధినేత రామోజీ రావుతో భేటి అయ్యారు. అంతే కాదు, అక్కడి నుంచి నోవాటెల్’ హోటల్’కు వచ్చి జూనియర్ ఎన్టీఆర్’ తో సంవేసంయ్యారు. ముందు 15 నిముషాలు అనుకున్న ఈభేటీ సుమారు 40 నిముషాలకు పైగా సాగింది. డిన్నర్ తో ముగిసింది. రామోజీ రావును అమిత్ షా ఎందుకు కలిశారు? జూనియర్ ఎన్టీఆర్’తో అంతసేపు ఏమి ముచ్చటించారు? ఈ ప్రశ్నల చుట్టూ రాజకీయ చర్చ ఇంకా అలా సాగుతూనే వుంది. ఊహాగానాలు. రాజకీయ విశ్లేషణలు వినిపిస్తూనే ఉన్నాయి.   ఇంతలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మూడవ విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్’ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆరాచక పాలన, నియత్రుత్వ పోకడలను ఎండగట్టారు. ఎన్నికల ఎప్పుడొచ్చినా అధికారం తమదేనని రొటీన్ స్పీచ్ ఇచ్చారు.  అయితే, అమిత్ షా తమ పర్యటనలో ఈనాడు, ఈ టీవీల అధినేత రామోజీ రావును, ఫిల్మ్ స్టార్’ జూనియర్ ఎన్టీఆర్’ ను కలిస్తే, నడ్డా  టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. అలాగే, మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ కూడా నడ్డాతో సమావేసమయ్యారు.  ఈ సమావేశాలు ఒకెత్తు అయితే, టీవీ 9 అధిపతి, రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోం రామేశ్వరరావుతోనూ జేపీ నడ్డాతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రామేశ్వర రావు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య నిన్న మొన్నటి వరకు మంచి సాన్నిహిత్యముంది. ఆర్థిక బంధాలు, బంధనాలు ఉన్నాయి. కేసేఆర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రామేశ్వర రావు ఆర్థిక సహాయం చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ అణా పైసలతో సహా తిరిగి చేల్లిచండమే కాకుండా,  ఆయన వ్యాపార అభివృద్ధికి అన్ని విధాలా సహకరించారు. బినామీ వ్యవహారాలు నడిచాయని అంటారు.  అయితే, ఈ మధ్య కాలంలో, రామానుజుల వారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇద్దరికీ పెద్ద దిక్కుగా ఉన్న చిన్న జీయర్ స్వామితో  ముఖ్యమంత్రి  కీసీఆర్’ కు చెడింది. ఆ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కాణంగా  రామేశ్వరరావు, కేసీఆర్ మధ్య కూడా దూరం పెరిగిందని, పుంఖాను పుంఖాలుగా కథనాలు, కథలు వస్తూనే ఉన్నాయి.  ఇక ఆతర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ, రామేశ్వరరావు ఇప్పుడు బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన పలుమార్లు రహస్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారన్న ప్రచారం ఉంది. అలాగే, బీజేపీ ఆయనకు యూపీ లేదా మరో రాష్ట్రం నుంచి  రాజ్య సభ టికెట్ ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపధ్యంలో  మైహోం రామేశ్వరరావు, జేపీ నడ్డాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.  నిజం రాజకీయ నాయకులు, ముఖ్యంగా  బీజేపీ అగ్ర త్రయం రాజకీయ ఉద్దేశ, దురుద్దేశాలు  లేకుండా ఎవరినీ కలవరు. కలసినా,, ఇలా గంటల గంటలు సమయం వృధా  చేసుకోరు.. సో ఈ వరస భేటీల వెనక బీజేపీ పెద్దల, ‘పేద్ద’ వ్యూహమే ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు , ఓ వంక ఇతర పార్టీల  నుంచి సీనియర్ నాయకులను తెచ్చుకోవడంతో పాటుగా, ఇతర రంగాల్లో ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాల్లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న వారిని ఆకర్షించేందుకే, మోడీ, అమిత్ షా, నడ్డా ఎక్కడికి వెళ్ళినా అక్కడి లోకల్ టాలెంట్’ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే  రాష్ట్రానికి వచ్చిన నాయకులు వివిద రంగాల ప్రముఖలతో సంవేసమవుతున్నారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అలగే, ఇది ఏదో ఒక్క తెలంగాణకు సంబందించిన వ్యూహం కాదని, దేశం అంతటా ఉన్నదనే అని కూడా  అంటున్నారు.

అప్పులు చేస్తే తిప్పలు తప్పవు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. ఇదేమి రహస్యం కాదు. అందరికీ తెలిసిన వాస్తవం. నిజానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మొదలు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర నాయకులు ఇదే మాట.. మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నది లేదు. కొత్త కొత్త మార్గాలలో కొత్త అప్పులు చేస్తూనే ఉన్నారు. సంక్షేమం పేరుతొ పందారం కానిచ్చేస్తున్నారు. ప్రజల సొమ్ములతో ప్రజల ఓట్లను కొల్లగొట్టే ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగేసి, మోసం చేస్తున్నారు.  అదలా ఉంటే ఇప్పుడు తాజగా కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్’ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు హద్దులు లేకుండా పోయాయని, విమర్శించారు. శ్రీ లంక పరిణామాల నుంచి, ఏపీ ముఖ్యమంత్రి గుణ పాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. లోక్‌సభ ప్రవాసీ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి విశాఖలో పర్యటించారు. పక్క దేశాల్లో అప్పు పెరిగితే ఏ రకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో గమనించాలని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికిసూచించారు.  చివరకు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి మరీ, ఎక్కడంటే అక్కడి నుంచి  అప్పు తీసుకుంటున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు కూడా ఇది వ్యతిరేకమని వివరించారు. ప్రభుత్వం చట్టబద్ద పరిపాలనా పద్దతులను పాటించాలని చెప్పారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు.  ప్రభుత్వాలు ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉండాలే తప్ప యజమానుల్లా వ్యవహరించరాదని హెచ్చరించారు. అలాగే, ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి పేరు లేదంటే ముఖ్యమంత్రి  కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవడం మంచి పద్దతి కాదన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు కుటుంబ పాలనను తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు. మూడేళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని, ఈ ప్రభుత్వ హయాంలో విశాఖలో భూకబ్జాల సంస్కృతి, కమిషన్లు, లంచాలు ముట్టజెప్పితే భూములను క్రమబద్ధీకరిస్తామనడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇది చాలా సిగ్గుచేటని, ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగితే ఈ రకమైన ఫిర్యాదులపైన విమర్శలపైన వెంటనే విచారణ నిర్వహించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు

కేసీఆర్ ఛీ అన్నా మోడీనే నంబర్ వన్

“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో, దేశానికి పనికొచ్చే ఒక్క మంచి పనిచేసింది, లేదు. ఏ వర్గాన్ని సంతృప్తి పరిచిందీ లేదు. మోడీ వట్టి పనికిమాలిన  ప్రధాని. ఇంత పనికి మాలిన ప్రదానిని నేను నా 40 సంవత్సరాల  రాజకీయ జీవితంలో చూడలేదు.” ఈ మాటలు ఎవరివో వేరే చెప్పనక్కరలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచు చేస్తున్న విమర్శ ఇది. నిజమే, ఒక్క కేసీఆర్ అనే కాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ, మోడీని విమర్శించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు.   కానీ, దేశంలో విపక్షాలు మోడీని ఎంతగా విమర్శించినా, అంతర్జాతీయంగా ఆయన ప్రతిష్ట మరింతగా పెరుగుతూనే వుంది, కానీ, గ్రాఫ్ పడిపోయిన దాఖలాలు మాత్రం లేవు. నిజానికి, అంతర్జాతీయంగానే కాదు, జాతీయంగానూ, రాహుల్ గాంధీ సహా ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరికంటే, మోడీనీ ఫస్ట్ ప్లేస్’లో ఉన్నారు. ఓ పక్షం రోజుల క్రితం ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ డి నేషన్ సర్వే’లోనూ 53 శాతం మంది ప్రజలు మాలీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మోడీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని అనుకుంటోంది కేవలం 9 శాతం మంది మాత్రమే. అలాగే, జస్ట్ ఓ 7 శాతం మంది కేజ్రీవాల్’ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. సో, రాహుల్ గాంధీ, కేసీఆర్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు మోడీని  పనికిమాలిన ప్రధాని అని ఎద్దేవా చేసినా దేశ ప్రజలు మాత్రం  మోడీకే జై కొడుతున్నారని, అనుకోవచ్చును. సర్వేలే కాదు. ఎన్నికల ఫలితాలు కూడా అదే సుస్చిస్తున్నాయి, అనుకోండి, అదివేరే విషయం.    అదలా ఉంటే, దేశీయంగానే కాదు, అంత‌ర్జాతీయంగా కూడా  ప్రధాని మోడీ ఛ‌రిష్మా ఒకేలా వుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న మోడీకి జాతీయ స్థాయిలో ఎంత ఫాలోయింగ్ ఉందో అంత‌ర్జాతీయంగా కూడా అంటే  ఫాలోయింగ్ ఉందని మరో మారు రుజువైంది. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ "మార్నింగ్ కన్సల్ట్‌ "ప్ర‌పంచ అత్యుత్త‌మ నేత‌” ఎవరనే విషయంగా నిర్వహించిన స‌ర్వేలో మోడీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచారు. ఓటింగ్’లో పాల్గొన్న వారిలో 75 శాతం మంది, ‘మోడీ ది బెస్ట్’  అని కితాబు నిచ్చారు.  ప్రపంచ నేతల్లో నరేంద్ర మోడీయే మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు. మొత్తం 22 మంది అంతర్జాతీయ నేత‌ల‌పై మార్నింగ్ కన్సల్ట్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ 22 మంది దేశాధినేతల్లో అత్యధికంగా 75 శాతం రేటింగ్ సంపాదించుకుని మోడీ ప్రధమ స్థానంలో  నిలిచారు. 63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. అయితే ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో బైడెన్ తర్వాత స్థానంలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్‌... పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్‌ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మోడీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కొవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన ఒక సర్వేలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు.ఇప్పడు మళ్ళీ అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

తెలంగాణాను న‌యా నిజాం దోచేస్తున్నారు.. జేపీ న‌డ్డా

తెలంగాణాను న‌యా నిజాం దోచేస్తున్నార‌ని, మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాట‌లోనే కేసీఆర్ న‌డుస్తున్నాడ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. వ‌రంగ‌ల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో న‌డ్డా ప్ర‌సంగించారు. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు కేసీఆర్‌ను ఇంటికి పంపు తార‌ని, రాష్ట్రంలోప్ర‌జాస్వామ్యాన్ని కేసీఆర్ సాగ‌నీయ‌డం లేద‌ని న‌డ్డా అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటిఎంలా మారింద‌ని ఎద్దేవా చేశారు. మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చ జైలును కూల్చ‌డం త‌ప్ప మ‌రే  నిర్మాణం చేప‌ట్ట‌లేద‌ న్నారు.    టీఆర్ ఎస్ పాల‌న‌లో తెలంగాణా అంధ‌కారంలోకి వెళ్లింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బండి సంజ య్ చేప‌ట్టిన మూడు విడ‌త‌ల పాద‌యాత్ర విజ‌య‌వంత‌మైంద‌ని న‌డ్డా ఆనందం వ్య‌క్తం చేశా రు. కేసీఆర్ పాల‌న‌కు ముగింపు ప‌ల‌కాల‌నే సంజ‌య్ పాద‌యాత్ర చేప‌ట్టార‌ని న‌డ్డా అన్నారు. బీజేపీ స‌భ ఏర్పాటుకు ఇక్క‌డి ప్రభుత్వం అడుగ‌డుగునా ఆంక్ష‌లు పెట్ట‌డంప‌ట్ల బీజేపీ నేత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 144 సెక్షన్ బూచి చూపి జనం రాకుండా అడ్డుకున్నారని.. హైకోర్టు అనుమతితో సభ నిర్వహించు కుంటున్నామని జేపీ నడ్డా తెలిపారు.   కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తోంది.  జల్‌ జీవన్‌ మిషన్  కింద తెలంగా ణకు కేంద్రం 3,500 కోట్లు కేటాయింపు.  తెలంగాణ ప్రభుత్వం రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు.  అవినీతికి పాల్పడ్డ కేసీ ఆర్‌లో భయం మొదలైంద‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.   

మూజ్ పాట‌.. భార‌త్‌,పాక్ సైనికుల ఆనందం!

ఎవ‌ర‌యినా పాట విన‌గానే కాస్తంత మ‌న‌సూ పారేసుకుంటారు. సినిమాపాట మ‌రీ న‌చ్చిన పాట ఎక్క‌డి నుంచి విన‌ప‌డుతున్నా ఓ క్ష‌ణం ఆగి ఓ ముక్క అలా విని మ‌రీ క‌దులుతారు. అదీ సంగీతం మ‌హిమ‌. సంగీతానికి దేశ‌,ప్రాంత‌, జాతీ భేదాలు ఉండ‌వు. పాట పాటే, సంగీతం సంగీత‌మే. వినే మ‌న‌సుండాలే గాని తెలుగు, హిందీ, పంజాబీ.. మ‌రే భాష‌ద‌యినా స‌రే విన‌సొంపుగా ఉంటే చాలు. కొన్ని పాట‌లు దేశ విదేశాల్లో వీరాభిమానుల‌ను ఎప్ప‌టికీ ఆక‌ట్టుకుంటాయి. అదుగో అలాంటి ఇటీవ‌లి పాటే బంబిహా బోలే అనే పాట‌. పంజాబీ సింగ‌ర్ సిద్ధు మూస్‌వాలా అద్భుతంగా పాడిన‌ది. దీనికి పాకిస్తాన్ పంజాబీలు ఫిదా అయ్యారు. అది విన‌కుండా నిద్ర‌పోనంత‌గా ఆ పాట వీరాభిమానుల‌ను సంపాదించుకుంది. అన్న‌ట్టు భార‌త సైని కులు భార‌త్‌,పాక్ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర స‌ర‌దాగా పాడుకుంటూంటే, అటు వేపు పాకిస్తాన్ సైనికులూ స‌ర‌దాగా డాన్స్ వేస్తూ వారి అభిమానాన్నీ చాటారు. అదీ మూజ్ పాట మ‌హ‌త్తు! దీనికి సంబంధించి ఓ ట్విట‌ర్ ను ఐపిఎస్ అధికారి హెచ్‌జి ఎస్‌.ధాలివాల పోస్టు చేశారు. సిద్దు పాట స‌రిహ‌ద్దుకి రెండు వేపులా ఎంతో యిష్టంగా వింటూ డాన్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. అదో అద్భుతం. పాట‌కు, సంగీతానికి దేశ స‌రిహ‌ద్దులు తుడిపేసే శ‌క్తి ఉంద‌న‌డానికి ఇదో తాజా రుజువు!  శారీర‌కంగా రెండు దేశాల పౌరులుగా విడ‌పోయిన‌ప్ప‌టికీ పంజాబీలుగా సంగీత‌ప్రియులుగా అంతా ఒక్క‌టే అని ఒక నెటిజ‌న్ టాగ్‌పెట్ట‌డం మ‌రింత ఆక‌ట్టుకుంది. నిజ‌మే. ఒక్క పాట‌, ఒక్క గాయ‌కుడు ఎంత దారు ణాన్న‌యినా, విబేదాల‌న‌యినా మ‌ర్చిపోయేలా చేస్తారు. ఈ పంజాబీ పాట 2020లో విడుద‌ల అయింది. మూజ్‌తో పాటు అమృత్ మాన్ కూడా గొంతు క‌లిపారు. 207 మిలియ‌న్ మంది చూసి త‌రించార‌ట‌!  కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ అంత అద్బుత సింగర్ మూజ్ మే 29న మాన‌సా జిల్లా జ‌వ‌హార్కె గ్రామంలో హ‌త్య‌కు గుర‌య్యాడు. 

కింగ్ కోహ్లీ ప‌రుగుల వ‌ర‌ద సృష్టిస్తాడా?

ర‌న్‌మిష‌న్‌, రికార్డుల రాజు, కింగ్ కోహ్లీ మ‌రొక రికార్డుకు అత్యంత చేరువ‌లో ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఇటీవ‌ల అంత‌గా ప‌రుగులు చేయ‌క ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను కాస్తంత నిరాశ ప‌ర‌చిన మాట వాస్త‌వ‌మే. గ‌తం గ‌తహా అన్నారు పెద్ద‌లు. ఆ ఆలోచ‌న‌ల్లోంచి బ‌య‌ట‌ప‌డి కొత్త‌గా కింగ్ ఆసియా క‌ప్ లోకి దిగ‌నున్నాడు. ఫామ్ కోల్పోయి విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌డం స‌చిన్ అంత‌టివాడికీ త‌ప్ప లేదు. అవ‌న్నీ క్రీడారంగంలోనూ మామూలే. ప్ర‌స్తుతం ఆ పాచ్ దాటి కొత్త కోహ్లీ నూత‌నోత్సాహంతో రెచ్చి పోయే స‌మ‌యం వ‌చ్చింద‌ని వీరాభిమానుల మాట‌. ఎవ‌రెన్ని చెప్పినా రికార్డులు సృష్టించ‌డం కోహ్లీ వంటివారికే సాధ్య‌ప‌డుతుంది. విమ‌ర్శ‌కుల‌కు ఆసియాక‌ప్ లో మంచి స్కోర్ త‌ప్ప‌కుండా సెంచరీ సాధించి బ్యాట్‌తో స‌మాధానం చెబుతాడ‌నే ఆశించాలి.  ఆసియాక‌ప్‌లో తొలిమ్యాచ్‌లోనే చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇంత‌వ‌ర‌కూ 99 టీ 20 మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన కోహ్లీకి ఈ తొలి మ్యాచ్ వందో మ్యాచ్ అవుతుంది. అంటే క్రికెట్ అన్నిఫార్మాట్స్‌లోనూ సెంచరీ సాధించిన భార‌త్ సూప‌ర్‌స్టార్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. 2008లో అంత‌ర్జా తీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ కెరీర్ అద్భుతంగా మ‌ల‌చుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల‌ను సంపాదించుకున్నాడు.  ఇప్పటి వరకు 99 టీ20లు ఆడిన కోహ్లీ 50.12 సగటుతో 3,308 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 94 పరుగులు. 30 అర్ధ సెంచరీలు చేశాడు. 2017-2021 మధ్య కాలంలో కోహ్లీ 50 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో 30 మ్యాచుల్లో జట్టును విజయాల బాటలో నడపగా 16 మ్యాచుల్లో జట్టు ఓటమి పాలైంది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మరో రెండింటిలో ఫలితం తేలలేదు. కెప్టెన్‌గా అతడి విజయాల రేటు 64.58గా ఉంది.  ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా జట్టుకు విజయాన్ని అందించడంతోపాటు తన సెంచరీల సంఖ్యను 71కి పెంచుకోవాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. కోహ్లీ చివరి సారి నవంబరు 2019లో సెంచరీ బాదాడు. ఆ తర్వాత 27 టీ20లు ఆడినా సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. అలాగే, చివరి సెంచరీ తర్వాత ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే, చివరి సెంచరీ తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 2,554 పరుగులు చేశాడు. అందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  ఈ ఏడాది కోహ్లీ ఇప్పటి వరకు ఆడింది నాలుగు టీ20 మ్యాచ్‌లే. 81 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఈ ఏడాది విరాట్ అత్యధిక స్కోరు 52 పరుగులు మాత్రమే. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది 16 మ్యాచుల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 476 పరుగులు మాత్రమే చేశాడు. బెస్ట్ 79 కాగా, నాలుగు అర్ధ సెంచరీలు మాత్ర మే చేశాడు. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. 

రామ‌గుండం ఎరువుల ప‌రిశ్ర‌మ‌పై కేసీఆర్‌కు రేవంత్ లేఖాస్త్రం

తెలంగాణాలో ఎరువుల ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకుంటున్న అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతి ప‌ట్ల టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. రామ‌గుండం ప‌రిశ్ర‌మ‌లో ఉద్యోగాల నియామ‌కంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగా య‌ని ఆయ‌న తెలంగాణా సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ‌లో తెలియ‌జేశారు.  మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్‌ కలిసి దాదాపు 800 మంది నిరుద్యోగుల నుంచి రూ. 6 లక్షల నుంచి రూ.15 లక్షలవరకు వసూలుచేసి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చారని లేఖలో తెలిపారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని..అవసరం అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్ముకోవచ్చని బాధితులకు నమ్మబలికారన్నారు. ఉద్యోగాల నియామకంలో దాదాపు రూ. 50 కోట్లు చేతులు మారాయని సీఎం కేసీ ఆర్ కు రాసిన లేఖలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.  ఈనేపథ్యంలోనే ఇటీవల రామగుండం ఉద్యోగాల నియామక కాంట్రాక్ట్ మారిందని..వారు గతంలో నియ మించిన వారిలో సగం మందిని తొలగించారని పేర్కొన్నారు. ఇప్పుడు బాధితులంతా ఆందోళనలు, ఉద్య మాలు చేస్తున్నారని చెప్పారు. ఈక్రమంలోనే తీవ్రంగా మానసిక ఆందోళన గురై కేశవపట్నం మండలం అమ్మలపురానికి చెందిన హరీష్‌ అనే యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి బావిలో దూకి ఆత్మ హత్య చేసుకు న్నాడని లేఖలో సీఎం దృష్టికి తీసుకొచ్చారు రేవంత్‌రెడ్డి. 

కుటుంబ‌పాల‌న‌ను త‌రిమికొట్టాలి.. రాజ‌గోపాల్‌రెడ్డి పిలుపు

తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచి పోయే తీర్పు ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి కోరారు.  త‌న రాజీనామా త‌ర్వాత‌నే సీఎం కేసీఆర్ ఫామ్‌ హౌస్‌నుంచి మునుగోడుకి వ‌చ్చార‌ని, త్వ‌ర‌లోనే కేసీఆర్‌, కేటీఆర్ స్కామ్‌లూ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని మాజీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.  ఆయ‌న శ‌నివారం (ఆగ‌ష్టు 27) మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షా రాక‌తోనే ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ లిక్క‌ర్ బాగోతం బ‌య‌ట‌ప‌డింద‌ని అన్నారు. మునుగోడు ఉపఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే ప్ర‌చారాన్ని త‌ల‌పించేఆ బ‌హిరంగ స‌భ‌లు, స‌మావేశా లు, చేరిక‌ల్లో పార్టీలు త‌ల‌మున‌క‌లు కావ‌డం గ‌మ‌నిస్తున్నాం. మోవంక అధికారులు మునుగోడు ఉప ఎన్నిక కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌షెడ్యూల్‌ను ప్ర‌క‌టించేలోగా ఈవీఎంలను సిద్ధం చేస్తు న్నారు. జిల్లాలో ఈవీఎంల కొరత ఉండగా, ఎన్నికల కమిషన్‌ అనుమతి మేరకు యాదాద్రి జిల్లా నుంచి వాటిని తీసుకోనున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైందన్న‌ది తెలిసిందే.  ఆయన రాజీనామాతో ప్రధాన పార్టీలు భారీ సభల తో తొలి దశ ప్రచారానికి తెర లేపాయి.

క‌ర్ణాట‌క విద్యారంగం పై మోదీకి  ఫిర్యాదు

క‌ర్ణాట‌కాలో అవినీతి మితిమీరింద‌ని రాష్ట్రంలో విద్యాసంస్థ‌ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాఠశాల‌ల‌కు గుర్తింపు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికీ లంచాలు డిమాండ్ చేయ‌డం దారుణ‌మ‌ని, దీనిపై వెంట‌నే ద‌ర్యాప్తు చేప‌ట్టా ల‌ని ప్ర‌ధాని మోదీకి రాసిన లేఖ‌లో కోరారు.  ది అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్, ది రిజిస్టర్డ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ లేఖను రాశాయి. దాదాపు 13వేల  ప్రైవేటు పాఠశా లలు, విద్యా సంస్థలకు ఈ సంఘాలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. అశాస్త్రీయమైన, హేతుబద్ధత లేని, వివక్షాపూరితమైన, ఆచరణ సాధ్యంకానటువంటి నిబంధనలను కేవలం అన్ఎయిడెడ్ పాఠశా లలకు మాత్రమే వర్తింపజేస్తోందని ఈ లేఖలో మోదీకి తెలిపాయి. అవినీతి తారస్థాయిలో ఉందని ఆరోపిం చాయి.   రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌కు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదని చెప్పా యి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అస‌లు విద్యావ్యవ‌స్థ‌నే నీరుగార్చార‌ని ఆరోపించారు. బడ్జెట్ స్కూళ్ల‌కు ఇద్ద‌రు బీజేపీ విద్యాశాఖా మంత్రులు తీర‌ని న‌ష్టం చేశార‌ని ఆరోపిం చాయి. అంతే గాక‌, పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి విద్యాశాఖ ఆస‌క్తి చూప‌డంలేద‌ని పేర్కొన్నారు.  బడ్జెట్ స్కూళ్ళకు ఇద్దరు బీజేపీ విద్యాశాఖ మంత్రులు తీరని నష్టం చేశారని ఆరోపించాయి. తల్లి దండ్రుల నుంచి భారీ స్థాయిలో ఫీజులు గుంజుతున్న పాఠశా లల కన్నా బడ్జెట్ స్కూళ్ళను దారుణంగా దెబ్బతీశారని పేర్కొన్నాయి. 

జీఎన్ ఏ  డిఎన్ ఏ ..మోడీ ఫైడ్‌... ఆజాద్‌పై కాంగ్రెస్ పంచ్‌లు

పార్టీనుంచి బ‌య‌ట‌ప‌డిన‌పుడే అవ‌త‌లి వ్య‌క్తి నిజ‌స్వ‌రూపాలు బ‌య‌ట‌ప‌డ‌టం ఈమ‌ధ్య కాంగ్రెస్‌కీ అను భ‌వమ‌వుతోంది. సీనియ‌ర్ నేత గులాంన‌బీ అజాద్ పార్టీ ప‌ద‌వులు, స‌భ్య‌త్వాన్ని కాద‌ని బ‌య‌ట ప‌డ్డారు. అయితే దాని వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం లేద‌న్న‌ట్టుగా కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. ఆజాద్‌కి బీజేపీ వారి ప‌ట్ల అనూహ్య‌రీతిలో ప్రేమ క‌ల‌గ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నా యి. జీఎన్ ఏ (గునాంన‌బీ ఆజాద్‌) డీఎన్ఏ మోడీ ఫై అయింద‌ని పంచ్‌లు విసురుతు న్నారు. పార్టీ నాయ కత్వం పట్ల ద్రోహానికి పాల్పడి.. తన నిజ స్వరూ పాన్ని బయటపెట్టారని దుయ్య బట్టారు.  ఆజాద్‌ రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని మోదీ చేతిలో ఉందని, ఈ విషయం రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలోనే బయటపడిందని విమర్శించారు. ఆజాద్‌, మోదీల మధ్య ప్రేమ పార్లమెంటులోనే కని పించింద‌ని వ్యాఖ్యానించారు. తొలుత మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత పద్మవిభూషణ్‌ ఇచ్చారు. అనంతరం నివాస సదుపాయాన్ని పొడిగించారు.  ఇవేమీ యాదృచ్చికంగా జరిగినవికాదు. వ్యూహాత్మకంగా, సహకార పద్ధతిలో జరిగినవేన‌ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి జైరాం రమేశ్‌ దుయ్యబట్టారు. తన రాజీనామా లేఖలో అగ్ర నేత రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని రమేశ్‌ తప్పుబట్టారు.   పార్టీని బలహీన పరుస్తున్నవారే.. పార్టీ బలహీనపడిందని ఎదురు దాడి చేస్తున్నారని మీడియా విభాగం ఇన్‌చార్జి పవన్‌ ఖేరా నిప్పులు చెరిగారు. ఆజాద్‌ రాజీనామా జీ-23 నేతలను కూడా విస్మయానికి గురి చేసిం ది. తాము కోరుకున్నది ఇది కాదని వారిలో ఒకరైన మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ అన్నారు.