పాక్‌ను బెంబేలెత్తించిన పాండ్యా.. ఆసియాకప్ లో భారత్ విజయం
posted on Aug 29, 2022 8:06AM
ఆసియాకప్ అనగానే ఉత్కంఠభరిత దాయాదుల పోరే ఆశిస్తారు ప్రపంచ క్రికెట్ వీరాభిమానులంతా. సరిగ్గా అంతే పోటాపోటీగా జరిగిన ఆసియాకప్ 2022 గ్రూప్-ఏ రెండవ మ్యాచ్‌లో పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో భారత్ సునాయాస విజయం సాధిం చింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకు న్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతని నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపిం చా రు. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా సత్తా చాటడంలో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడనాలి. కింగ్ కోహ్లీ, రవీంద్రజడేజా, భువనేశ్వర్కుమార్, పాండ్యా లు నలుగురు పాకిస్తాన్‌కు ఊహించని ప్రదర్శనతో బెంబే లెత్తించారు. తొలుత బ్యాటిం గ్ చేసిన పాక్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.
పది నెలల క్రితం ఇక్కడే ఈ వేదిక మీదనే పది వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఓడిన భారత్ ఇపుడు పగదీర్చుకుందనాలి. టాప్ ముగ్గురు బ్యాటర్లూ అంతగా రాణించలేక కేవలం 18 పరుగులకే వెనుదిరిగి పాక్ కి ఆనందం కలిగించారు. వారిలో గెలుస్తామన్న ధీమా వారి కొత్త పేసర్ కలిగించాడు. ముఖ్యంగా మొదటి ఓవర్ రెండో బంతికే కే.ఎల్ వికెట్ కోల్పోవడం భారత్‌కు నిరాశకలిగించిన మాట వాస్తవమే. టాప్ఆర్డర్ చెప్పుకోదగ్గ స్వేచ్ఛతో ఆడలేక పోయినా మిడిల్ ఆర్డర్, చివరగా వచ్చినవారంతా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఎంతో స్వేచ్ఛగా తన అనుభవాన్ని, ఆటలో చురుకుదనాన్ని ప్రదర్శించడంలో పాక్ బౌలర్లకు, ఫీల్డర్లను ఖంగారెత్తించాడు. పాండ్యా 33 పరుగులు మెరుపు వేగంతో చేయడం, చివరిగా ఒక అద్భుత సిక్స్ కొట్టి విజయాన్ని అందించడం .. అంతా ధోనీని తలపించాడు. విరాట్ 34 బంతుల్తో 35 పరుగులు చేసి తన పాత ఫామ్‌లోకి వచ్చి అందరినీన ఎంతో ఆకట్టుకున్నాడు. అతను క్రీజ్‌లో ఉన్నంతసేపూ విజయం అతనితోనే సాధ్యమవు తుందనుకున్నారు. కానీ 35 పరుగులు మించి పరుగులు చేయలేదు. కానీ చాలా రోజుల తర్వా త ప్రేక్షకులు అతని మెరుపు బ్యటింగ్ కి ఫిదా అయ్యారు.
అయితే అందరూ ఎంతగానో ఎదురుచూసిన సూర్య కుమార్ (18)అంతగా రాణించలేకపోయాడు. నసీమ షా క్లీన్ బౌల్డ్ చేశాడు. నసీమ్ డెలివరీని సరిగా అర్ధం చేసుకోలేకపోయాడు. దీంతో భారత జట్టు 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. కానీ పాండ్యా ప్రదర్శనతో కోహ్లీ పరుగుల ధాటిని ప్రేక్షకులు అం తగా గుర్తుంచుకోరేమోననిపించింది. కారణం పాండ్యా అంతగా ప్రేక్షకులను అలరించాడు. 15వ ఓవర్ ముగిసే సరికి భారత్ కేవలం 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా, హార్దిక్ కలిసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నారు. 18వ ఓవర్‌లో నసీమ్ షా ఓవర్‌లో జడేజా ఒక ఫోర్, సిక్సర్ బాదగా, ఆ తర్వాతి ఓవర్‌లోనే హార్దిక్ మూడు ఫోర్లు బాది భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. అయితే చక్కటి ఇన్నింగ్స్‌ఆడిన జడేజా ఆఖరి ఓవర్ తొలి బంతికే అవుటయ్యాడు. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. అయితే హార్దిక్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు.
పాండ్యా ముందు బౌలింగ్‌లోనూ 25 పరుగు లిచ్చి 3 వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూలదోయడంలో భువనేశ్వర్‌కు ఎంతో సహకరించాడనాలి.
పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో మహమ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికార్ అహ్మ ద్ (28) మాత్రమే రాణించారు. కోహ్లీతో సమానధీరుడుగా పేరున్న రిజ్వాన్ క్రీజ్‌లో ఉన్నంతసేపూ మెరుపు వేగంతో పరుగులు సాధించాడు. దీంతో పాక్ భారీ స్కోర్ సాధిస్తుందని అందరూ భావించారు. అతని వికెట్ కోసమే భారత్ పేసర్లు ఎదురుచూశారు. అర్ధసెంచరీకి దగ్గరలో పడిన రిజ్వాన్ ఊహించనివిధంగా ఓ సిక్స్ కొట్టబోయి పెవిలియన్ దారి పట్టాడు. వేగంగా స్కోర్ చేయగల పాక్ ఓపెనర్, కెప్టెన్ రిజ్వాన్ వెనుదిరగడంతోనే భారత్ ప్లేయర్లు, ప్రేక్షకుల్లో సంతోషం అందలాన్ని దాకింది. పాక్ బ్యాటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో పోటాపోటీగా ఆట ప్రదర్శించినప్పటికీ పాక్ బ్యాటర్లు జట్టు స్కోర్ 100 తర్వాత అంతగా రాణించలేకపోయారు. భారత్ బౌలర్లను ఎదుర్కొనడంలో కొంత ఇబ్బందిపడ్డారు.