రేష్మానీని వెతికిచ్చిన ఆధార్

ప్రతీదానికి ఆధార్ కార్డు అడుగుతున్నారని విసుక్కుంటాం గాని అదే ఆధార్ కార్డు రేష్మానీని తనవారి వద్దకు చేర్చడా నికి ఉపయోగపడింది. వినడానికి చిత్రంగా ఉండవచ్చు గాని, ఇది వాస్తవం. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన రేష్మానీ గురించి తల్లిదండ్రులు, తెలిసినవారూ ఎంతో వెతికి వేసారారు. పిల్ల చనిపోయిం దేమో నన్న అనుమానాలు వచ్చాయి.  జార్ఖండ్ సింగ్బామ్జిల్లాలో ఒక గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం తిండికీ ఎంతో ఇబ్బంది పడుతూండేది. ఇంటో అందరకూ పనికి వెళ్లినా ఇల్లు గడిచే పరిస్థితి లేకపోయింది. ఇంటి బాధ్యతను రేష్మానీ తీసుకోవాల్సివచ్చింది.  రోజూ వారీ కూలీ తప్ప మరేమీ తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉండగా రేష్మీకి ఉద్యోగం ఇప్పిస్తానని మంచి జీతం వస్తుంది, ఇంటికి ఎలాంటి కష్టమూ ఉండదని నమ్మ బలుకుతూ ఆమెకు ఒక వ్యక్తి దగ్గరయ్యాడు. ఆమె ఇంటిపరిస్థితుల వల్ల అతను చెప్పింది పూర్తిగా నమ్మవలసి వచ్చింది. రైలు ఎక్కిన కొంతసేపటికి అతని ప్రవర్తనలో చాలా తేడా  గమనిం చింది రేష్మా. అంతే అతనికి తెలియకుండా ఫతేపూర్ లో దిగేసింది. అక్కడి పోలీసుల సాయంతో పేదల ఆవాస గృహానికి వెళ్లింది. అక్కడ ఆమెను బాగానే చూసుకున్నారు. కానీ అక్కడ ఆమె పేరు రాశీగా మార్చు కోవాల్సి వచ్చింది, ఆమె పరిస్థితుల కారణాల వల్ల.  కొంత కాలం అక్కడ గడిపిన రేష్మీ ఈ ఏడాది జూలై లో లక్నో చేరుకుంది. అక్కడి రిహాబిలిటేషన్ సెంటర్ లో చేరింది. ఆమె వచ్చిన పరిస్థితులు విని తెలుసుకుని ఆమెకు అండగా ఉండాలని   ఆ సెంటర్ అధికారి ఆర్తీ సింగ్  ఆమెకు అన్ని వసతులు కల్పించారు.  పని కోసం అవసరమై ఆధార కార్డు కు పేరు నమోదు చేయించుకున్నప్పుడు ఆమె అసలు పేరు చెప్పింది. కానీ రేష్మీ పేరుతో చాలా కాలం క్రిందటే కార్డు ఆధార్ కార్డు ఉండడంతో కొత్తగా నమోదు చేయడానికి సాంకేతికంగా వీలు కాలేదు. నాలుగయిదు పర్యాయాలు ప్రయత్నించగా చివరగా ఆమె పేరు, ఆధార్ నంబర్ తెలిసాయి. దానితో ఆమె ఊరు, అడ్రస్ తెలిసి అధికారులు జార్ఖండ్ లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసికెళ్లి అప్పగిం చారు. మొత్తానికి ఐదేళ్ల తర్వాత 23 ఏళ్ల రేష్మీ అలా ఇల్లు చేరింది.  ఆధార్ ఆ విధంగా గొప్ప ఉపకారం చేసినందుకు లక్నో ఉదాయి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ ఎంతో ఆనం దించారు. 

గడపగడపకు లో వెల్లువెత్తుతున్న నిరసన సెగలు

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకూ కార్యక్రమంలో ప్రజల నిరసన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబుకు ప్రజా నిరసన ఎదురైంది. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా బుధవారం దొప్పర్ల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో ఎమ్మెల్యే కన్నబాబు వివక్ష చూపుతున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కన్నబాబుతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఒక దశలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధానికి గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు.   ఈ సందర్భంగా జనం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక కర్నూలు జల్లాలో కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఆదోనిలో గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను వివరించబోగా.. ప్రజలు అడ్డుకుని చిన్న గుడిసెకు చూడా రూ.1600 ఇంటి పన్ను వస్తోందని నిలదీశారు. దానిని పట్టించుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించగా, తమకు వచ్చే పథకాలన్నీ ప్రజలు కట్టిన పన్నులే కదా అంటూ జనం ఎదురు ప్రశ్నించారు. జనం ఇంటి పన్ను, చెత్త పన్ను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. అయితే అది కుదరదు అని ఎమ్మెల్యే స్పష్టం చేసి.. ఆ తరువాత జనం నిరసనలను పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

టీ20 కప్ లో ఎట్టకేలకు  నెదర్లాండ్స్ కి ఒక విజయం

ఆస్ట్రేలియాలోజరుగుతున్న టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 విభాగంలో బుధవారం మొదటి మ్యాచ్ లో జింబాబ్వే పై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.  నెదర్లాండ్స్ కి సూపర్ 12లో ఇదే తొలి విజయం. జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జింబాబ్వే ఓడనప్పటికీ సెమీస్ అవకాశాలు న్నాయి. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి బయట పడింది.  నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో దౌద్ ఒక్కడే చక్కటి బ్యాటింగ్ ప్రదర్శించి అార్ధ సెంచరీ చేశాడు. కూపర్ 32 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లు ఎన్ గరవా 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ముజరాబాని 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు.  అడెలైడ్ ఓవెల్ లో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన ఆనం దం మాత్రం నెదర్లాండ్స్ కి ఎప్పటికీ ఉంటుంది. అదీ టీ20 ప్రపంచకప్ లో సాధించిన విజయం మరి. ముఖ్యంగా సీమర్ పాల్ మీకెరాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్ లో కేవలం సికందర్ రజా నే తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించగలిగాడు. మిగతా వారంతా పేలవంగా ఆడటంతో జట్టు పెద్ద స్కోర్ చేయలేకపోయింది.  కాగా బుధవారం రెండో మ్యాచ్ లో భారత్ తో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫలితం మీదనే జింబాబ్వే టోర్నీలో నిలిచే  ఆశలు ఆధారపడ్డాయి. వర్ష సూచన ఉందన్న వార్తలు వినవచ్చినప్పటికీ అడెలైడ్ లో వీరి మ్యాచ్ కి ఆటంకం కలిగించలేదు. కానీ పిచ్ పేసర్లకు బాగా అనుకూలించడంతో నెదర్లాండ్ స్వింగ్ పేసర్లు విజృంభించారు.  లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దాడి చేయవచ్చని అనుమానం ఉన్నప్ప టికీ, జింబాబ్వే కెప్టెన్ ముందుగా బ్యాట్ చేయడానికే ఆసక్తి చూపడం గమనార్హం. ముందుగా బౌలింగ్ ని తీసుకుని ఉంటే తర్వాత బ్యాటింగ్ సమయంలో నిలదొక్కుకునే అవకాశాలుండేవి.  పొరపాటు అంచనా తో బ్యాటింగ్ కి దిగిన జింబాబ్వే పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయ గలిగింది. ఆవిధంగా బ్యాటర్లు ఎవ్వరూ ఛెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు సాధించలేకపోయారు. గెలవా ల్సిన మ్యాచ్ ఆ విధంగా చేజారింది.  నెదర్లాండ్స్ కి  ఇలా ఒక్క విజయం అందించి వారిని సంతోష పెట్టారనే అనాలి. 

ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే!

ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 11,12 తేదీలలో ఆయన విశాఖలో పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 11వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ ఆయనకు వి మానాశ్రయం వద్ద స్వాగతం పలుకుతారు. ఆ రోజు విశాఖలోనే మోడీ బస చేస్తారు. మరుసటి రోజు అంటే నవంబర్ 12న ఆంధ్రావర్సీటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే తన విశాఖ పర్యటనలో మోడీ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ.400 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఈస్ట్ కోస్ట్ జోన్ పాలనా భవన సముదాయానికి శంకుస్థ3ాపన చేస్తారు. అలాగే వడ్లపూడిలో రూ.260 కోట్లతో చేపట్టిన వ్యాగన్ వర్క్ షాప్,, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పాలనా భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు. ఇక చేపల చెరువు నవీకరణ ప్రాజెక్టు, పోర్టు రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఇలా ఉండగా మోడీ సభ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులతో కలిసి బుధవారం (నవంబర్ 2)పర్యవేక్షించారు. 

వర్షం వద్దు....కోహ్లీ మెరుపులే కావాలి

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత్ సూపర్ 12లో నాలుగవ మ్యాచ్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. అయితే బుధవారం మ్యాచ్ వర్షం గండం ఉందన్న అనుమానాలే ఎక్కువగా వ్యక్తమవు తున్నాయి. మ్యాచ్ ఆరంభం కాకుండానే అడ్డుపడుతుందా, మధ్యలో ఆపేయవలసి వస్తుందా అన్నది ఇంకా పూర్తిగా తెలియడం లేదు. కానీ ఇవాళ్టి మ్యాచ్ కి వరుణుడు తప్పకుండ అడ్డుపడే అవకాశం ఉంద నే వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ టోర్నీలో గ్రూప్ 2 సూపర్ 12లో మ్యాచ్  ఎవరు గెలిస్తే  వారికి  సెమీస్ అవకాశాలు పదిలమవుతాయి.   మొన్నటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినప్పటికీ టీమ్ ఇండియా ఫామ్ గురించి పెద్దగా ఆందోళ నపడనవసరం లేదని టీమ్ హెడ్ కోచ్ ద్రావిడ్ అన్నాడు. బంగ్లాదేశ్ మాత్రం ఇంతవరకూ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ  గెలిచి మంచి ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.  కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు, బౌలింగ్ విభాగంలోనూ జట్టులోకి తిరిగి వచ్చిన షమ్మీ, కొత్త కుర్రాడు అర్షద్ సింగ్ లతో పాటు భువీ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. కనుక బంగ్లా దేశ్ మీద పూర్తి  మ్చాచ్ జరిగినా, ఓవర్లు తగ్గించి  జరగకపోయినా గెలిచేది మాత్రం  టీమ్ ఇండియానే.   కానీ వాతావరణ పరిస్థితులు పెద్దగా మ్యాచ్ కి అనుకూలించకపోవచ్చనే వాతావరణ నిపుణులు అంటున్నారు. 60 శాతం మబ్బుగా, తేమగా ఉండవచ్చని, జల్లులు పడవచ్చని అదీ సాయింత్రం పడే అవకాశం ఉందని హెచ్చరిం చారు. బుధవారం చలిగాలి  గంటకు 20  నుంచి 30 కి.మీ.వేగంతో ఉంటాయని తెలిపారు. ప్రస్తుత టోర్నీలో మెల్బోర్న్ లో మ్యాచ్ లు నాలుగు వర్షార్పితం అయిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉండగా, అడెలైడ్ లో మంగళవారం భారీ వర్షం కారణంగా టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్ జరగలేదు. ప్లేయర్లంతా హోటల్ కే పరిమితమయ్యారు.  అంతకుముందు భారత్ 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోగా, బంగ్లాదేశ్ ఇంతకుముందు జింబ్వాబ్వేతో తలపడిన మ్యాచ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ విధంగా భారత్ మూడు మ్యాచ్ ల్లో 2 గెలిచి,  4 పాయింట్లతో 2వ స్థానంలోను, బంగ్లాదేశ్ 3వ స్థానంలోనూ ఉన్నాయి. 2016 టీ20 ప్రపంచక కప్ తర్వాత భారత్ బంగ్లాదేశ్ టీ 20 ల్లో పోటీపడలేదు. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోతే రిజర్వు డే  ఉంటుంది. కానీ అది సెమీస్ మ్యాచ్ లకు మాత్రమే వీలు కల్పిస్తారు. కనుక వర్షం అడ్డుకుంటే చెరో పాయింట్ షేర్ చేసుకోవలసి ఉంటుంది. 

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో తొక్కిసలాట ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రి పాలు

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. కంభంలో  బీఈడీ పరీక్షలు రాసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిన బీఈడీ పరీక్ష రాసిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఈస్ట్ కోస్ట్ ప్రెస్ రైలు ఎక్కారు. దీంతో రైలులోని బోగీలన్నీ కిక్కిరిసి పోయాయి. ఈ సందర్భంగా రైల్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిరువురినీ విజయనగరంలో దించేసి దగ్గరలోని ఆసుపత్రికితరలించారు.  . వీరిరువురినీ దించేసి ఆసుపత్రికి తరలించిన తరువాత రైలు యథాప్రకారం బయలు దేరి వెళ్లింది. తీవ్ర అస్వస్థతకుగురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిన బీఈడీ పరీక్ష రాసి తిరుగు ప్రయాణంలో తమ స్వస్థలం ఒడిశాకు వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారు పూర్తిగా కోలుకోగానే వారిని వారి స్వస్థలానికి పంపిస్తామని తెలిపారు.  

ఉప ఎన్నికకు ముస్తాబయిన మునుగోడు

నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమయింది. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 2,41,855 మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇందులో 50 మంది స‌ర్వీస్ ఓట‌ర్లు ఉన్నారు. 5,686 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు ఉన్న‌ప్ప‌టికీ, కేవ‌లం 739 మంది మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 298 ఉన్నాయ‌ న్నారు. అర్బ‌న్‌లో 35, రూర‌ల్‌లో 263 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానఅధికారి వికాస్ రాజ్ తెలిపారు. 105 స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల‌ను గుర్తిం చామని, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఓట‌రు స్లిప్పుల పంపిణీ ఇప్ప‌టికే పూర్తయింద‌ని చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా ఓట‌రు స్లిప్పుల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. తొలిసారి కొత్త న‌మూనా ఓట‌రు కార్డుల‌ను పంపిణీ చేశామ‌ని తెలిపారు.  అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగనుంద‌ని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లో మెడిక‌ల్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామ‌న్నారు. 3,366 పోలీసు సిబ్బందితో పాటు 15 కంపెనీల‌ కేంద్ర బ‌ల‌గాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంప‌రిధిలో వంద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామ న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రూ. 6.80 కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నాం. 4500 లీట‌ర్ల మ‌ద్యం సీజ్ చేశామ‌న్నారు.  బుధవారం సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తా మ‌న్నారు. ప్రత్యేక యాప్ ద్వారా గంట గంట‌కు ఓటింగ్ శాతాన్ని తెలియ‌జేస్తామ‌న్నారు. రేపు సాయం త్రం 6 త‌ర్వాత బ‌ల్క్మేసేజ్‌లు వ‌స్తే క‌ఠినచ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించా రు. బ‌య‌ట‌ నుంచి వ‌చ్చిన‌వారు నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌కూడ‌దు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్రెడ్డి వివ‌ర‌ణ‌ను ఈసీకి నివేదించా మ‌ని వికాస్ రాజ్ మీడియాకు తెలిపారు. పోలింగ్ కోసం 2,500 మంది స్టేట్ పోలీసులు, 15 కంపెనీల బలగాల సెంట్రల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మునుగోడులో పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లకు కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడీలు పంపిణీ చేశారు.  అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, యాభై ఫ్లైయింగ్ స్కాడ్ టీంలు, 199 మైక్రో అబ్జర్వర్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. 3,366 పోలింగ్ సిబ్బందిని నియమించారు. 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆదివారం (6వ తేదీ) కౌంటింగ్ జరగనుంది.

బొత్స నోట వైసీపీ ఓటమి మాట!

వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని వైసీసీ ఇప్పటికే మానసికంగా ఫిక్సైపోయిందా? బొత్స మాటలు అలాగే ఉన్నాయి మరి. ఎలాగూ పరాజయం తప్పదు కనుక చేయగలిగినంత గందరగోళం చేసి పోవాలని భావిస్తోందా? వైసీపీ నేతలు, మంత్రుల మైండ్ సెట్ అలా ఫిక్సై పోయిందా? ఆ ఫ్రస్ట్రేషన్ లోనే బొత్స నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారా? అన్ని ప్రజలకు చెప్పీ, వారి ఆమోదం పొంది చేయడం మావల్ల కాదు అని అనేందుకు సైతం సిద్ధపడటం వెనుక ఉన్న కారణం అదేనా? పరిశీలకులు మాత్రం బొత్స మాటల వెనుక మర్మం, ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ఒక్క బొత్స  అనే కాదు.. మంత్రి ధర్మాన ప్రసాదరావు.. చివరాఖరికి ముఖ్యమంత్రి జగన్ కూడా రాష్ట్రంలో విధ్వంసం, విచ్ఛిన్నం, విద్వేషం పెచ్చరిల్లేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ ప్రజల అభీష్టాన్ని, ఆకాంక్షలను కించపరుస్తున్నట్లుగా మాట్లాడారు.  ప్రభుత్వం ఏం అనుకుంటుందో అదే చేస్తుంది. అది తప్పయితే పెద్దగా జరిగేదేముంటుంది.. ఓడిపోతాం అంతే కదా అంటూ వ్యాఖ్యానించారు. ఆ మాటల ద్వారా ప్రజా శ్రేయస్సు, ప్రజాభీష్టం, ప్రజల ఆకాంక్షలు తమ సర్కార్ కు ఏ మాత్రం పట్టవని తాము తలచిందే చేస్తాం, మేం చేసిందే చట్టం అని చెప్పకనే చెప్పారు.    ఒక సీనియర్ మంత్రిగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి ఈ వ్యాఖ్యల ద్వారా తాము ప్రజలకు ఎంత మాత్రం జవాబుదారీ తనంగా ఉండాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. తమ విధానాలు, కార్యక్రమాలు, పథకాలు జనానికి నచ్చక పోతే ఓటు వేయకుండా ఓడించండి..  అంతే కానీ ఇదేమిటి? ఎందుకిలా? ఇలా చేయండి వంటి మాటలు మాట్లాడద్దు, వినడానికి మేం సిద్ధంగా లేం అని ఒక విధంగా హెచ్చరిక చేసినట్లుగా  ఆయన మాటలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక అంతకు ముందు మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వం అసలు మూడు రాజధానుల గురించి ఆలోచించడమే లేదనీ.. రాష్ట్రానికి ఒకే రాజధాని అది విశాఖపట్నమేనని చెప్పారు. ఇలా చేప్పడం వెనుక రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలన్న ఉద్దేశమే ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ మూడు రాజధానులంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు విశాఖ మాత్రమే రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం వెనుక రాయలసీమలో అసంతృప్తి రగిలించాలన్న ఉద్దేశమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చే ఎన్నికల పబ్బం గడుపుకుని లబ్ధి పొందాలన్న సంకుచిత  రాజకీయ లక్ష్యంతోనే ధర్మాన ఆ రీతిగా మాట్లాడారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక జగన్ కూడా ఇదే రీతిన ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  రాజధాని అన్నది సీఎం ఇష్టమని కొత్త భాష్యం చెప్పారు. అంటే సీఎం పాలన ఎక్కడ నుంచి సాగించాలని అనుకుంటారో అదే రాష్ట్ర రాజధాని అవుతుందన్నారు. అదెలాగంటే.. సీఎం ఎక్కడ ఉంటే మంత్రులు అక్కడే ఉండాలని, మంత్రులతో పాటే సచివాలయం కూడా అక్కడే ఉంటుందని.. దీనిలో వివాదమేముందని ప్రశ్నించారు. అంటే తాను విశాఖ నుంచి పాలన సాగించాలని భావిస్తున్నందున ఆటోమేటిగ్గా విశాఖే రాజధాని అయిపోతుందని ఆయన మాటల అర్ధం. అంటే ఒక వేళ ప్రధాని మోడీ గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుంచి పాలన సాగించాలనుకుంటే.. దేశ రాజధాని ఢిల్లీ కాకుండా గాంధీనగర్ గా మార్చేయడం కుదురుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్, బొత్స, ధర్మానల మాటల వెనుక ఉన్న మర్మం ఒక్కటే రాష్ట్రంలో ప్రాతీయ విద్వేషాలు పెచ్చరిల్లి.. శాంతి భద్రతల సమస్య సృష్టించడమే. అప్పుడు పోలీసులను రంగంలోకి దింపు అమరావతి రాజధాని అన్న మాట కూడా ఎక్కడా వినిపించకుండా ధిక్కార స్వరాలను అణగదొక్కేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గట్టిగా మాట్టాడకండి, శబ్దాలుచేయద్దు....రైల్వే హెచ్చరిక

చాలాదూరం ప్రయాణించేవారు, అందునా రైలు ప్రయాణంచేసేవారు చాలామంది సరదా కబుర్లలోపడి గట్టిగా మాట్లాడుకోవడం, జోకులేసుకుంటూ ఫ్యాన్ పడేలా గట్టిగా నవ్వుకోవడాలు మామూలే. తోటి ప్రయా ణీకులు నిద్రపోతున్నారన్నది కూడా పట్టించుకోరు. వారి ఆనందంలో వారుంటారు.  రాత్రిపూట ప్రయా ణిం చేటపుడు రాత్రి పది దాటిన తర్వాత పెద్దగా శబ్దాలు చేయడాలు, గట్టిగా ఇతరులకు నిద్రా భంగం కలిగేట్టు మాట్లాడుకోవడాలు, పాటలు వినడాలు అవేమీ చేయవద్దని రైల్వే కొత్త మార్గ దర్శకాలు విడుదల చేసింది.  రాత్రి సమయాల్లో ప్రయాణించేవారికోసం రైల్వేవారు జారీ చేసిన ఈ  కొత్త మార్గదర్శకాలు పాటించకపోతే జరిమానా తప్పదంటూ సూచనలు చేసింది. అందువల్ల ప్రయాణీకులు నిజంగానే ఆ హెచ్చరికను సీరియస్గానే తీసుకోవాలి. నిబంధనల ప్రకారం..రాత్రి వేళల్లో రైలు బోగీలో ఏ ప్రయాణికుడు కూడా గట్టిగా మాట్లాడకూడదు. స్పీకర్‌ పెట్టి (సెల్ ఫోన్లు) పాటలు వినకూడదు. ప్రయాణీకులతో పాటు రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌ అయినా సరే గట్టిగా అరవ కూడదు. అంతేకాదు..మిడిల్‌ బెర్త్‌ ప్రయాణికులు వారి బెర్త్‌పై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చని తెలిపింది.  ప్రయాణీకులకు కాకుండా టీసీకి కూడా ఈ మార్గదర్శలు పాటించాలని సూచిస్తూ.. రాత్రి 10 తర్వాత (రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కే ప్రయాణీకులకు చెల్లదు), టీటీఈ  టికెట్‌ను తనిఖీ చేయరా దని..సీటు కేటాయించిన ప్రయాణికులు రాకపోతే..వెంటనే ఆ సీటు (బెర్త్)ని వెంటనే వేరే ప్రయా ణీకులకు (రిజర్వేషన్ కన్ఫామ్ కాక ఆర్ఏసీ వచ్చినవారికి) కేటాయించకూడదు. ఆ సీటు కేటాయించిన వ్యక్తులు (ప్రయాణీకులు) రాకపోతే గంట తర్వాత లేదా రెండు స్టేషన్లు దాటాకనే (ఏది ముందు అయితే అది) వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలని సూచించింది. కుటుంబంలో ఒకరికి సీటు కన్ఫార్మ్‌ అయ్యి, ఇంకొకరికి కాకపోయినా.. కన్ఫార్మ్‌ అయిన వ్యక్తి ప్రయాణించకపోతే ఆ సీటులో టికెట్‌ కన్ఫార్మ్‌  కాని వ్యక్తి ప్రయాణించొచ్చని కూడా వెల్లడించింది.  అయితే ఈ నిబంధనలు పాటిస్తున్నవే. కానీ వీటికి మరో కొత్త నిబంధన చేర్చారు. మీ సీటు, కంపార్ట్‌మెంట్ లేదా కోచ్‌లో ఉన్న ప్రయాణికులెవరూ మొబైల్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు లేదా బిగ్గరగా సంగీతం వినకూడదు. ఇతర ప్రయాణికుల సౌకర్యార్థం..ప్రత్యేకించి సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం కొత్త నిబంధనను అమలు చేయాలని భావించింది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తమ కోచ్‌లలో పాటలు వింటూ బిగ్గరగా మాట్లాడుతున్నట్లుగా రైల్వే డిపార్ట్ మెంట్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. రైల్వే ఎస్కార్ట్ లేదా మెయింటెనెన్స్ సిబ్బంది కూడా బిగ్గరగా మాట్లాడుతున్నారని కొన్ని ఫిర్యాదులు అందాయి. అలాగే ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత తమ (బెర్తుల వద్ద ఉన్న లైట్లు)లైట్లను ఆన్ చేసినట్లుగాను..కూడా ఫిర్యాదు అందాయి. దీంతో తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకూడదనే యోచనతో ఐఆర్టీసీ ఈ మార్గదర్శకాలను ప్రకటించింది. 

అమరావతి గ్రామాల్లో పేదలకు లక్ష ఇళ్లు.. జగన్ వ్యూహం అదేనా?

ఏపీ సీఎం తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు విషయంలో అదే చేశారు.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రైతుల పాదయాత్రను ఆపడానికి విశాఖ గర్జన పేర చేసిందీ అదే. ఇప్పుడు మరో భయంకరమైన కుట్ర రాజకీయానికి తెర లేపారు. అది కూడా పేదలకు ఇళ్లు అంటూ అమరావతి రైతులను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలకు దూరం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందు కోసం ఆయన కోర్టు తీర్పును ఖాతరు చేయడం లేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. అన్నిటికీ మించి ప్రాంతాల మధ్య చిచ్చు రగిలి రాష్ట్రం రావణ కాష్టం అయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నా లెక్క చేయడం లేదు. ఇంతకీ..ఆయన ఇప్పుడు కొత్తగా రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చడానికి వేసిన ఎత్తేంటంటే.. సకల విలువలకూ తిలోదకాలిచ్చేసి, కోర్టు తీర్పును సైతం బేఖాతరు చేసి.. సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసి మరీ అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు అంటున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులకు సైతం ప్రకటన ఇచ్చేశారు. ఇందులో మతలబు ఏమిటంటే రాజధాని అమరావతి ప్రాంతంలో బయట వారికి స్థలాలు కేటాయించడానికి వీల్లేదని సీఆర్డీయే చట్టం చెబుతోంది. సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. దానిపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు సైతం వెళ్లింది. అక్కడ ప్రభుత్వ పిటిషన్ విచారణ వాయిదా పడింది.   సుప్రీం కోర్టు డైరెక్షన్ వచ్చే వరకూ హైకోర్టు తీర్పును కాదని జగన్ సర్కార్ ఏ విధంగానూ ముందడుగు వేయడానికి వీల్లేదు. అయితే జగన్ రూటే సెపరేటు. కోర్టు తీర్పును బేఖాతరీ చేసి రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక జోను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. రాజధాని పరిధిలో ఉన్న ఐదు గ్రామల్లో 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇందు కోసం సీఆర్డీయే చట్టంలో సవరణ చేసింది. ఆ సవరణ మేరకే జోన్ ఏర్పాటు చేస్తూ  నోటిఫికేషన్ ఇచ్చింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో, అలాగే తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోనూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనడమే కాకుండా ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేస్తూ నోటిఫికేషన్ కూడా జగన్ సర్కార్ ఇచ్చేసింది. జోనింగ్లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేసేందుకు   అక్టోబరు 28వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. అభ్యంతరాలు సూచనలను   సీఆర్డీఏ కార్యాలయంలో లేదా ఈమెయిల్ లేదా  ఫోన్ ద్వారా  తెలియచేయవచ్చని తెలిపింది.   రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనువుగా మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేసేందుకు స్థానిక సంస్థల పాలకవర్గాలకు, ప్రత్యేక అధికారులకు అధికారాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ఇటీవలే చేసిన సీఆర్డీఏ చట్ట సవరణకు  అనుగుణంగా ఈ   నోటిఫికేషన్ జారీ చేశారు.  నిజానికి ఈ వ్యవహారానికి జగన్ సర్కార్ గత ఏడాదే తెరలేపింది. రాజ‌ధాని అమరావతి పరిధిలో పేదలకు   భూములు కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ల‌బ్ధిదారుల‌    ఎంపిక కూడా పూర్తి చేసింది.  అయితే.. తాము రాజ‌ధాని కోసం ఇచ్చిన భూముల‌ను పేద‌ల‌కు ఇవ్వ‌డం కూడదంటూ రాజ‌ధాని రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై  కోర్టు అలా చేయ‌డానికి వీల్లేద‌ని విస్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను మార్పు చేస్తూ.. స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఇది కూడా కోర్టు ధిక్కరణేనని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.  పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎవరూ అడ్డు చెప్పరు కానీ, అమరావతి పరిస్థితులు వేరు అన్నది గుర్తించాలని న్యాయనిపుణులు అంటున్నారు.  రాజధాని కోసం ఏ ప్రాంతంలో ఏది నిర్మిచాలనే నిర్ణయాన్ని కాదని ఇష్టారీతిగా జీవోలు ఇచ్చి అమరావతిని నిర్వీర్యం చేసేందుకుజగన్ సర్కార్  కోర్టు ధిక్కరణకు సైతం వెనుకాడటం లేదనడానికి ఇది తాజా తార్కాణమని అంటున్నారు.   ప్రభుత్వ తాజా మూవ్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందనీ, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు లంక దినకర్ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోక తప్పదని హెచ్చరించారు. ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘిస్తోందని అన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో జగన్ సర్కార్ ఇప్పుడు చేసిన మార్పు ఏపీ హైకోర్టు తీర్పు ఉల్లంఘనేనని పేర్కొన్నారు.

హద్దుమీరిన అభిమానం...ఆగ్రహించిన కింగ్ కోహ్లీ జంట

అందరూ విరాట్ కోహ్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అక్టోబరు 30న పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను పెద్దగా కాల్పులు జరపలేదు, అవునా? అతను నిజంగా చేసిన 12కి బదులుగా హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ సాధించినట్లయితే, భారతదేశం బహుశా 160 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి ఉండవచ్చు, ఆపై, ఎవరికి తెలుసు? ఆట కాదు! ఇది అతని గది లోపలికి సంబంధించినది, అతను మైదానంలో ఏమి చేసాడో కాదు. అక్టోబర్ 31న కోహ్లీ లేని సమయంలో తన గదిలోకి ప్రవేశించిన ఓ చొరబాటుదారుడు ఈ వీడియోను చిత్రీకరించాడని, ఆపై దానిని టిక్‌టాక్‌లో కింగ్ కోహ్లీ హోటల్ గది అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేశాడని కోహ్లీ ఆరోపించాడు. కోహ్లి, అతని భార్య అనుష్క శర్మలు తమాషా చేయలేదు. సరే, అతను వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసి చాలా సంతోషంగా ,  ఉత్సాహంగా ఉంటారని , వారిని కలవడానికి సంతోషిస్తారని నేను అర్థం చేసుకున్నాను  నేను దానిని ఎప్పుడూ అభినందిస్తున్నాను. కానీ ఇక్కడ ఈ వీడియో భయంకరంగా ఉంది ఇది నా గోప్యత గురించి నాకు అశాంతిని కలిగించింది. నేను నా స్వంత హోటల్ గదిలో ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు కల్పిస్తేఎలా? ఈ రకమైన మతోన్మాదం, గోప్యతపై సంపూర్ణ చొరబాటుతో నేను అంగీకరించను. దయచేసి వ్యక్తుల వ్యక్తిగత జీవి తాన్ని, ప్రశాంతతను గౌరవించండి వారిని మీ వినోదం కోసం వస్తువుగా పరిగణించవద్దు. కోహ్లీ కాస్తంత నెమ్మది గానే హెచ్చరించాడు. కానీ ఆయన భార్య, నటి అనూష్కకి మాత్రం కోపం వచ్చింది. అభిమానులయి నంత మాత్రాన ఇంతదారుణంగా అవమానిస్తారా అని సోషల్మీడియాలో మండి పడింది. గతంలో కొంతమంది అభిమానులు ఇలా ప్రవర్తిస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను కానీ ఇది నిజంగా చెత్త విషయం. ఒక మనిషి స్వేచ్ఛని, ప్రశాంతతని అవమానించడమే. కొంత స్వీయ నియంత్రణను పాటించడం ప్రతి ఒక్కరికీ సహాయపడుతుంది. అలాగే, ఇది మీ పడకగదిలో జరుగుతుంటే, లైన్ ఎక్కడ ఉంది? అభిమానానికి ఒక హద్దు ఉండాలి. ఇది అభిమానంతో చేసినది కాదు, మానసిక ఉన్మాదిచేసే పని అంటూ మండిపడింది. అయితే, హోటల్ క్రౌన్టవర్స్ యాజమాన్యం  క్షమాపణలు వేడుకుంది.  అగంతుడు అలా ప్రవేశించ డానికి  కారణమని అనుమానించినవారిని పనిలోంచి తీసేసినట్లూ ప్రకటించింది.  ఆ విషయా న్ని ఆసీస్ మీడియా, క్రికెట్ అధికారులు కూడా స్పష్టం చేశారు.  ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ కార్యాలయం వెబ్‌సైట్‌లో  అనుమతి లేకుండా ఫోటో లేదా వీడియో తీసినా లేదా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినా లేదా మీరు గూగుల్ స్ట్రీట్ వ్యూలో  మీడియాలోని చిత్రం గురించి ఆందోళన చెందు తుంటే ఏమి చేయాలనే సందేహాలు తలెత్తాయి.  ఎవరియినా సరే,  గుర్తింపు స్పష్టంగా ఉంటే లేదా సహేతుకంగా పని చేయగ లిగితే మీ ఫోటోలు, వీడియోలు గోప్యతా చట్టం 1988 (గోప్యతా చట్టం) ప్రకారం వ్యక్తిగత సమాచారంగా పరిగణించబడతాయి. ఫోటోలు, వీడియోల కోసం మీ గోప్యతా హక్కులు పరిస్థితిపై ఆధారపడి ఉంటా యని వివరించారు.  కాబట్టి గోప్యతా చట్టం ఎవరికి వర్తిస్తుంది?...వెబ్‌సైట్ ప్రకారం, ఆస్ట్రేలియాలో నిర్వహించే 3 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలను, మరికొన్ని ఇతర సంస్థలను గోప్యతా చట్టం కవర్ చేస్తుంది. ఆస్ట్రేలియాలో ఒక సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందో లేదో నిర్ణయించడంలో అనేక అంశాలు ఉన్నాయి, అవి ఆస్ట్రేలియాలో ఉనికిని కలిగి ఉన్నాయా లేదా ఆస్ట్రేలియాలో వ్యాపారాన్ని కొనసాగించాలా అనే దానితో సహా మరి కోహ్లీ లాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు?  మొదట, ఫోటో లేదా వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిని తీసివేయమని అడగండని అది చెప్పింది.  అయితే వారు తిరస్కరిస్తే, లేదా అది ఎవరో మీకు తెలియకపోతే, సైట్ నిర్వాహకుడిని సంప్రదించండి,  ఫోటో లేదా వీడియోని తీసివేయమని వారిని అడగండి అని వెబ్‌సైట్‌ సలహా. అయితే, కొన్ని సందర్భాల్లో, మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ప్రైవేట్ కార్యకలాపాలను ఫోటో తీయడాన్ని నిరోధించే ప్రాంతీయ లేదా భూభాగ చట్టాలు ఉండవచ్చు. అటార్నీ జనరల్‌ను సంప్రదించండనీ పేర్కొన్నది.  దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు బస చేసిన సమయంలో క్రౌన్ పెర్త్ హోటల్, అనుమతి లేకుండా భారత మాజీ కెప్టెన్ గదిని యాక్సెస్ చేస్తున్నప్పుడు వారి కాంట్రాక్టర్‌లలో ఒకరు సంగ్రహించిన వీడియోను విరాట్ కోహ్లీ షేర్ చేయడంతో క్షమాపణలు చెప్పిందని ప్రశాంతంగా ఉండడమూ కష్టమే. ఆసీస్ లో ఇలాంటి వేధింపులు అభిమానుల ద్వారా అనుభవంలోకి రావడం చాలా దారుణమని భారత్ క్రికెట్ అందులోనూ కింగ్ కోహ్లీ వీరాభిమానులు చాలావిచారం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే అదేదో జరిగిపోయింది, కోహ్లీ..ప్రస్తుతం ఆట మీదనే ఎక్కువ దృష్టిపెట్టి జట్టుకు కప్ వచ్చేలా చేయి అదే వారికి చెంప పెట్టుకాగలదని ఉత్సాహపరుస్తున్నారు.  కాగా టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పాకిస్తాన్ మీద కోహ్లీ సాధించిన విజయంలో ఎంత ఉరకలేసి ఆనందించాడో అంతగా హోటల్ సంఘటనకు బాధపడ్డాడు. ఇది దారుణం, కనీస భద్రత లేకుండా పోవడమే ఊహించని ఆతిథ్యమని విరుచకుపడ్డాడు. అసలు ఒకరి వ్యక్తిగత జీవితాన్ని, ప్రైవసీని ఎవరయినా ఎలా వ్యతిరేకిస్తారో అర్ధంకాదన్నాడు. సెలబ్రటీ అయినంత మాత్రాన అభిమానుల పేరుతో ఎవరుపడితే వారు అలా వచ్చేయడం, అలా వ్యవహరించడం వ్యక్తి మీద, స్వేచ్ఛమీద పని గట్టుకుని దాడి చేయడం వంటిదే అన్నాడు.  కోహ్లీ గదిలోని షూలు, దుస్తులు, చెప్పులు, వారి వ్యక్తిగత వస్తువులు అన్నింటినీ వీడియో తీయడమేమిటని, ఇందుకు ఎలా వీలు కలగిందో అర్ధంకావడం లేద న్నాడు. రవిశాస్త్రి ఐసిసికి ఫిర్యాదు చేయాల్సిందేనన్నాడు కానీ కోహ్లీ ఈసీరికి వదిలేద్దామన్నాడు. అత నికి కప్ గెలవడం ముఖ్మమని ఇటువంటి చిల్లర పనులను వెంటనే మర్చిపోవడమే మేలని పించింది.

జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ఈడీ నోటీసులు

జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.  అక్రమ మైనింగ్ వ్యవహారంలో గురువారం (నవంబర్ 3) విచారణకు హాజరు కావాలని ఈడీ ఆ నోటీసులో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి హేమంత్ సొరేన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కింద పంకజ్ మిత్రాపై కేసు నమోదు చేసిన ఈడీ.. ఈ కేసుకు సంబంధించి రష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో విస్తృత దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పంకజ్ మిశ్రా నివాసాలతో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించింది. అలాగే దాదాపు 13.32 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసింది.అంతే కాకుండా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ నివాసాలలో కూడా ఈడీ గతంలో తనిఖీలు నిర్వహించిన సంగతి విదితమే. అలాగే ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానే గనుల కేటాయింపు చేసుకున్నారని పేర్కొంటూ.. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటూ జార్ఖండ్ గవర్నర్ కు ఈసీ గతంలో సిఫారసు కూడా చేసిన విషయం తెలిసిందే.   జార్ఖండ్ లో ఓటమి, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కేసీఆర్ కు సన్నిహతంగా మెలగడం బీజేపీ కన్నెర్రకుకారణమైందనీ, అందుకే  ఆయనకు ఇబ్బందులు సృష్టించే దిశగా వేసిన అడుగే ఈసీ నోటీసు అని రాజకీయ నిపుణులు అప్పట్లో అభిప్రాయపడిన సంగతి విదితమే. ఇప్పుడు అదే అక్రమ మైనింగ్ కేసులో ఈడీ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది.   

మునుగోడు ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?

కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు.. కాంగ్రెస్ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది. ఇది వాస్తవం. గతంలోనూ పదే పదే రుజువైన నిజం. ఇప్పుడు తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంతగా పుంజుకుని విజయాల బాట పడుతుందని అనుకుంటున్న వేళ ఆ పార్టీలోని అంతర్గత విభేదాలే ఆ పార్టీని కిందకి లాగేస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం గోచరించింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగానే  మిగిలిపోనుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు చేస్తున్న రాజకీయం ఎదుగుతున్న పార్టీని కిందకు లాగేసి యధాపూర్వ స్థితికి తీసుకు రావడానికి శతధా ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ లకు దీటుగా పోటీ ఇస్తుందన్న పరిస్థితి నుంచి మూడో స్థానంలో కనీసం గౌరవ ప్రదంగానైనా ఓట్లు పడతాయా అని అనుమానించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిపోయిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికపై తాజాగా వెలువడిన సర్వే సైతం కాంగ్రెస్ పుంజుకున్నదన్న సంగతిని గుర్తించలేదు. ఆ పార్టీ యథా ప్రకారం మూడో స్థానానికే పరిమితమౌతుందని తాజా సర్వే వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం ఎవరూ గుర్తించకుండా మిగిలిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కోసం ఆ పార్టీ తెలుగు రాష్ట్రాలలో తనకున్న బలమైన పునాదిని సైతం దెబ్బతీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పాగా వేసే అవకాశం ఉంటుందని ఆశించింది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ త్యాగాలను గుర్తించిన నాథుడే కనిపించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఆవిర్బావం క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ ఖాతాలో పడిపోయింది. ఇందుకు కాంగ్రెస్ స్వయంకృతమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. సరే ఎనిమిదేళ్ల తరువాత ఆధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందన్న అంచనాల మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో పార్టీ హై కమాండ్ రాష్ట్రంలో సీనియర్లను సైతం తోసి రాజని.. తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టినప్పటి నుంచీ సీనియర్ల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నా రేవంత్ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేశారన్నది నిర్వివాదాంశం. అందుకు అధిష్ఠానం ఆయనకు ఇచ్చిన మద్దతు కూడా ఒక కారణమే.  అయితే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి, శాసన సభ్యత్వానికీ రాజీనామా చేసినప్పటి నుంచీ సీన్ మారిపోయింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను సాకుగా తీసుకుని రేవంత్ కి వ్యతిరేకంగా  కోవర్టులు, సీనియర్ల  చర్యలతో ఆ పార్టీ  మళ్లీ తిరుగమనం వైపు తన పయనం మొదలు పెట్టింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేని పరిస్థితులు ఆయనకు ఎదురయ్యాయి. .ఇప్పడు పరిస్థితి ఎలా తయారైందంటే మునుగోడులో గెలుపు సంగతి దేవుడెరుగు.. ఉప ఎన్నిక తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రంగానైనా ఉంటుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ వ్యతిరేకులు మునుగోడులో పార్టీ ఓటమినే కోరుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందకు ఉదాహరణగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను వారు ప్రస్తావిస్తున్నారు. మునుగోడులో పార్టీ పరాజయం ఖాయం. అదే జరిగితే రేవంత్ స్థానంలో టీపీసీసీ చీఫ్ గా తాను వస్తాననని ఆయన తన సన్నిహితులతో మాట్లాడిన మాటల తాలూకా ఆడియో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఇంత డెలిబరేట్ గా వెంకటరెడ్డి పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నా.. ఆయనపై ఇప్పటి దాకా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోకపోవడాన్ని వారు హైకమాండ్ నిస్సహాయతకు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులపై అధిష్ఠానానికి విశ్వాసం లేకపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ బాధ్యతల నుంచి తప్పకుంటానని చెప్పినప్పుడు వారిలో ఒకరికి కాకుండా రేవంత్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించడమే నిదర్శనం. అలా అప్పగించిన తరువాత అధిష్ఠానం కోమటిరెడ్డి సోదరులు అసంతృప్తిని, అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేసిన వెంటనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదని పరిశీలకులు అంటున్నారు. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న చందంగా కాంగ్రెస్ హై కమాండ్ వ్యవహరించడంతో రేవంత్ సాధించిన పట్టు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇక ఇప్పడు మునుగోడు ఉప ఎన్నిక వద్దకు వస్తే.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ప్రచారం తక్కువ,అంతర్గత విభేదాలు ఎక్కువ అన్న చందంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మునుగోడు ఫలితం తరువాత పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వీళ్లు మారర్రా.. మారరు!

ఆకతాయి చేష్టలతో తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టేస్తుంటారు కొందరు. గుజరాత్ లోని కేబుల్ బ్రిడ్జి కుప్ప కూలిన సంఘటనలో 140 మందికి పైగా దుర్మరణం పాలు కావడానికి కొందరు ఆకతాయిలు బ్రిడ్జిని బలంగా ఊపడమే కారణమని అంటున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన దేశ వ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ దుర్ఘటన మరువక ముందే.. కర్నాటకలో మళ్లీ అంతటి ప్రమాదం రిపీట్ అయ్యే పనికి పూనుకున్నారు కొందరు ఆకతాయిలు. కర్నాటకలోని ఓ కేబుల్ బ్రిడ్జిపైకి కొందరు ఆకతాయిలు ఏకంగా కారు ఎక్కించేశారు. స్థానికులు అభ్యంతరం పెట్టినా లెక్క చేయలేదు. కేబుల్ బ్రిడ్జిపైకి కారు తీసుకురావడం కూడదనీ, ఆ బరువుకు బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని వారించిన స్థానికులతో వాగ్వాదానికి దిగారు. బ్రిడ్జిపై కారులో కొద్ది దూరం షికారు చేశారు. అదృష్టం బాగుండి ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ.. వారు బ్రిడ్జిపై కారు తీసుకువచ్చి స్థానికుల అభ్యంతరంతో వెనక్కు వెళ్లే వరకూ అంతా ప్రాణాలుగ్గబెట్టుకుని ఉన్నారు. కర్నాటకలోని యెల్లాపూర్ లోని శివపుర కేబుల్ బ్రిడ్జిపై జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలను తుంగలోకి తొక్కి కేబుల్ బ్రిడ్జిపైకి కారును తీసుకువచ్చిన వారిప కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

జగన్ హయాం.. ప్రగతి పూజ్యం..విద్వేషాలకు అజ్యం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరు ఏపీ భవిష్యత్ లేని రాష్ట్రంగా మారేందుకు దోహదపడుతోంది. ప్రతి విషయంలో ఆయన వితండం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే దిశగానే నడుపుతోంది. అన్ని విషయాలూ పక్కన పెట్టి రాష్ట్ర రాజధాని అమరావతి విషయానికి వస్తే జగన్ తాను పట్టిన కుందేటికి మూడుకాళ్లన్న తీరులో వ్యవహరిస్తున్నారు. వికేంద్రీకరణ అంటూ మూడు ముక్కలాట మొదలెట్టి.. రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకోవడాన్ని ఈ మూడున్నరేళ్లలో జగన్ ఒక అలవాటుగా మార్చేసుకున్నారు.  రాష్ట్రంలో రాజధాని వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టుల నత్తనడక అలాగే ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో పనుల వేగం కన్నా నత్తనడక చాలా వేగం అనిపించేలా ఉంది. అధికారంలోకి వచ్చి రావడంతోనే కూల్చివేతలతో ఆరంభించిన తన పాలనను జగన్ విద్వేషం, విధ్వంసం అన్న రెండు లక్ష్యాల సాధన కోసమే కొనసాగిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. రివర్స్ టెండరింగ్ అంటూ మొదలెట్టిన ఆయన రివర్స్ ప్రగతి దిశగా రాష్ట్రాన్ని నడుపుతున్నారు.  సరే ఇప్పుడిక అమరావతి విషాయానికి వస్తే.. జగన్ అధికారం  చేపట్టి మూడున్న‌రేళ్లు అయ్యింద.. ప్రజారాజధాని అమరావతి పురోగతిని నిర్వీర్యం చేయడం తప్ప ఆయన ఇఫ్పటి వరకూ చేసిందేమీ లేదు. ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ పరిశీలకులు  త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ తీరును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టి అసంపూర్తిగా ఉన్న పనులనే కాదు.. గత ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి వాటిని అమలులో పెడుతున్న తీరును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  ఇక్కడ రెడ్డొచ్చి మొదలాడు అన్న చందంగా గత ప్రభుత్వంలో చేపట్టి దాదాపు పూర్తి కావచ్చిన పనులను కూడా ఆపేసి జగన్ చోద్యం చూస్తుంటే... తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం గత ప్రభుత్వంలో ప్రతిపాదనల దశలోనే ఆగిపోయిన ప్రగతి పనులను చేపట్టి చకచకా పూర్తి చేస్తున్నారు.  తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరించాలని గత పళనిస్వామి ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధాని స్వరూపం చెడిపోకుండా చెన్నై నగరాన్ని విస్తరించాలని   ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వం 2018లో నిర్ణ‌యించింది. అది కాగితాలలోనే మిగిలిపోయింది. కార్యరూపం దాల్చకుండానే పళనస్వామి ప్రభుత్వం దిగిపోయింది. ఎన్నికలలో డీఎంకే విజయం సాధించి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యా రాజకీయ వైరం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ఆ రెండు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. అసెంబ్లీలో జయలలితకు అవమానం, అర్ధరాత్రి కరుణానిథి అరెస్టు వంటి చర్యలు ఆ రెండు పార్టీల మధ్యా ఉన్న ప్రతీకారేచ్ఛలకు నిదర్శనంగా ఈ నాటికీ జనం చెప్పుకుంటారు. కానీ స్టాలిన్ అధికార పగ్గాలు చేపట్టాకా రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయిందని చెప్పాలి. ప్రతి నిర్ణయంలోనూ విపక్షాలను విశ్వాసం లోనికి తీసుకోవడం నుంచీ.. ప్రజలకు మేలు జరుగుతుందంటే.. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కార్యాచరణకు ఉపక్రమించడం వంటి చర్యలతో జగన్ తమిళనాటే కాదు.. దేశ వ్యాప్తంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రాజధాని చెన్నై విస్తరణ విషయంలోనూ ఆ ఒరవడినే కొనసాగిస్తున్నారు. గత పళని స్వామి సర్కార్ నిర్ణయించిన మేరకు తమిళనాడు రాజధాని చెన్నై విస్తరణకు శ్రీకారం చుట్టారు. దీంతో  ఏపీ సరిహద్దుల వరకూ చెన్నై మెట్రోపాలిటన్‌ ప్రాంతం చేరుతుంది. ఈ మేరకు నగరాన్ని భారీగా విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నారు.  ప్రస్తుతం చెన్నై మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఎండీఏ) పరిధి 1,189 చ.కి.మీ.గా ఉంది. విస్తరణతో అది ఏకంగా  5,904 చ.కి.మీ.కు పెరుగుతుంది. ఈ విస్తరణ ఒక్క తమిళనాడుకే కాదు.. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జల్లాకూ ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది.     గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను పక్కన పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఏపీలో జగన్ పాలన సాగిస్తుంటే.. స్టాలిన్ మాత్రం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయ వైరాలను తావివ్వరాదన్న ఆదర్శంతో పని చేస్తున్నారు. తమిళనాడులో ఎంతో ఆదరణ పొందిన అమ్మ క్యాంటిన్లను స్టాలిన్ సర్కార్ కొనసాగిస్తోంది. మరింత ఉపయుక్తంగా తీర్చి దిద్దింది. అదే ఏపీలో జగన్ సర్కార్ అన్న క్యాంటిన్లను మూసి వేసింది. కూల్చివేసింది. దీని వల్ల పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న పరిస్థితి ఏర్పడినా పట్టించుకోలేదు. అ ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వం దివ్యాంగుల‌కు ఇవ్వాల‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల ట్రై సైకిళ్ల‌ను సిద్ధం చేసి.. త‌మ పార్టీ గుర్తులతో పంపిణీ చేయాలని భావించింది. ఏర్పాట్లన్నీ పూర్తై ఇక పంపిణీయే తరువాయి అనుకున్న దశలో ఎన్నికలు వచ్చాయి. ట్రైసెకిళ్ల పంపిణీ నిలిచిపోయింది.  ఎన్నికలలో అన్నాడీఎంకే పరాజయం పాలైంది. డీఎంకే అధికారంలోకి వచ్చింది. స్టాలిన్ సీఎం అయ్యారు. వెంటనూ దివ్యాంగులకు ఈ ట్రై సైకిళ్ల‌ను ల‌బ్దిదారులైన అందించారు.  వాటిపై ఉన్న డీఎంకే రంగులను, చిహ్నాలను మార్చాలని అనుకోలేదు. ఎక్కడా అన్నాడీఎంకే గుర్తులను వేయలేదు. చివరికి ముఖ్యమంత్రి ఫొటో కూడా మార్చలేదు. ప్రజలకు మేలు జరగడమే ముఖ్యమనుకున్నారు. ఇప్పుడు రాజధాని చెన్నై విషయంలో కూడా అదే చేస్తున్నారు.  రాజకీయం అంటే ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు ధోరణితో అభివృద్దిని అడుగంటించేయడం కాదనీ.. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టడమనీ జగన్ స్టాలిన్ ను చూసైనా నేర్చుకోవాలని జనం అంటున్నారు.

పాదయాత్రలో రాహుల్ పరుగో..పరుగు...!

ఎంతో వేగంగా పరిగెట్టడం ఆ పోటీల్లో గెలవడం అనుకున్నంత సులభం కాదు.  మన  స్ప్రింటర్లలో అమియా కుమార్, గురువీందర్ సింగ్  జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు వాళ్లు కూడా అమితాశ్చర్యంతో ఓర్నీ ఈయనున్న పోటీలో పాల్గొనలేదే అనుకుంటున్నారేమో.  జాతీయ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కుమారుడు, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఊహించని విధంగా స్ప్రింటర్ రూపం ఎత్తారు. దేశంలో చాలాభాగం మొన్నటి దాకా భారత్ జోడో యాత్ర చేసి అందులో భాగంగానే తెలంగాణా గొల్లపల్లి  వచ్చిన రాహుల్ గాంధీ అందర్నీ పలకరిస్తూ హఠాత్తుగా పరుగుపోటీకి సిద్ధ మ య్యారు. చిత్రమేమంటే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఓడిపోయారు.  దేశంలో జాతీయ క్రీడల్లో అమ్లా బోర్గాన్, అమియా మాలిక్, ధ్యుతీ చంద్ వంటివారి వేగాన్ని చూసినవారు, రాజకీయ నాయకుల్లో యువ కిశోరంలా  మంగళవారం  రాహుల్ గాంధీ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. భారత్ జోడో యాత్ర  గొల్లపల్లికి చేరుకుంది. రాహుల్ గాంధీ కి అందరూ ఘన స్వాగతం పలికారు. అంద ర్నీ అమితోత్సా హంతో పలకరిస్తూ, అస్సలు అలసటే కనపడకుండా నడుస్తూ అందర్నీ తన వెంట పరుగులాంటి నడక నడిచేలా చేస్తుంటే యువకులు, నాయకులు ఆశ్చర్యంలో అలా ఆయన్నే చూస్తుండిపోయారు.  హఠాత్తుగా పాదయాత్ర కాస్తా పరుగు పోటీగా మారిపోయింది. అయితే ఇందులో రాహుల్ తో రేవంత్ మాత్రమే పోటీ పడ్డారు. అలా రూల్ పెట్టుకున్నారేమో అనిపించింది.  పాదయాత్ర లో రాహుల్ ని కలివడానికి పిల్లలు రావడంతో ఆయన మరింత కుర్రాడయిపోయి పరుగు తీయడం మొదలయిది.. అంతే రేవంత్ కి ఆయనతో పోటీపడాల్సి వచ్చింది. కానీ రేవంత్ వల్ల కాలేదు. చిత్రమేమంటే ఇప్పటికే చాలా దూరం భారత్ జోడో యాత్ర చేస్తూన్నప్పటికీ కుర్రాడిలానే ద్విగుణీకృత ఉత్సాహంతో రాహుల్ పరుగులు తీయడం. పోలీసులు, రేవంత్, కుర్రాళ్లూ , పిల్లలూ అంతా వెనకబడిపోయారు.  ఈ పోటీలో తాము లేకపోయామని మాజీ స్స్రింటర్లు అనుకునే ఉంటారు. పార్టీ నాయకత్వం బాధ్యతను తాను స్వీకరించలేదు కానీ ప్రజలను పార్టీ వేపు తిప్పేందుకు, ఈ తరం వారిని పార్టీలోకి ఆకట్టుకోవడానికి, కేంద్రంతో పోరుకీ రాహుల్ గాంధీలో ఆవేశం, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదన్నది  ఈ పరుగు స్పష్టం చేసింది.  అయితే రాహుల్ తన బాస్ కనుక ఆయన్ను గెలిపించడం ధర్మమనే భక్తి భావంతో రేవంత్ కావాలనే వెనుకడుగు వేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రాహుల్ పరుగు పందెం వీడియో చూసిన, చూస్తున్నవారంతా అసలు పార్టీ పదవిని ఈయనే తీసుకోవాల్సింది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఖర్గే కంటే పార్టీలోకి యువతను రాహుల్ రాబట్టగలడన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబేతరులకు యివ్వాలన్న నిర్ణయం తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం వల్ల ఖర్గే కు పార్టీ పగ్గాలు అందాయి. కానీ ఇటు భారత్ జోడో యాత్ర చేపడుతూ రాహుల్ గాంధీ తక్కువేమీ తినడం లేదు. రోజు రోజుకూ యువకునిగా మారుతూ, మాటల్లో, ప్రసంగాల్లో, యువతను ఆకట్టుకోవడంలో తన శైలితో మరింత ముందుకు వెళుతున్నారు. ఆయన్ను గతంలో చూసినవారు, గమనించినవారు ఆయనలో వచ్చిన మార్పు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పెరోల్ బాబా ఆశీర్వాదానికి బీజేపీ మంత్రి ఠాకూర్

ఊళ్లోకి కొత్త సాములోరు వచ్చారని అంతా వెళ్లారు. తీరా చూస్తే మొన్నామద్య దొంగపనులు చేస్తు న్నారని పోలీసోల్లు పట్టుకెల్లిన కేటుగాడే గదా.. అనుకున్నారంతా.  కానీ పైకి అనుకోలేదు. అంతా భక్తి పారవశ్యాన్ని నటించారు.  చాలాకాలం భక్తిపారవశ్యంతో ఊగిపోతూ ఎన్నో ప్రవచనాలు వల్లించి, పాటలు పాడి భక్తిని ప్రసారం చేసినవాడు  అత్యా చారంలో దొరికిపోయి జైలుకీ వెళ్లాడు. ఆయనే గుర్మీత్ రామ్ రహీమ్ బాబా. ఆయనన్ను ఇటీవలే పెరోల్ మీద విడుదల చేశారు. కానీ భక్తులను ఆకట్టుకోవడంలో ఆయన్ను మించినవారే లేరు గనుక మళ్లీ ప్రవచనాలు, భక్తీగీతాల పనలతో జనాన్ని తన శిబిరానికి వచ్చేట్టు చేసుకున్నారు. బాబా వచ్చేశారని వెర్రి జనం వేలం వెర్రిగా ఎగబడ్డారు. ఆయన దర్శనానికి వెళ్లినవారిలో హిమాచల్ ప్రదేశ్ బీజేపీ మంత్రి విక్రమ్ థాకూర్ , ఇతర మంత్రులు కూడా క్యూకట్టారు.  స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే ఎంతటి కష్టమైనా ఇట్టే దాటేయవచ్చన్న మూఢ నమ్మకం వారిది. సామాన్య జనంతో పాటు వీరు పెరోల్ మీంచి వచ్చిన ఆ దైవాంశసంభూతుడి ఆశీర్వాదం కోసమే వెళ్లారు.  చిత్రమేమంటే మరో నెల రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే బాబాకు పెరోల్ రావడం, ఆయన సత్సంగ్ నిర్వహించడం, అందులో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలూ పాల్గొనడం ట్విస్ట్.  బీజేపీ వారి వింత నిర్ణయాలకు ఇదేమీ కొత్త కాదు. ఎన్నికల ముందు ఏ రాష్ట్రంలో చేయాల్సిన వ్యూహాత్మక ముందడుగును అలానే అమలు చేయడంలో సిద్ధహస్తులు కమలనాథులు. ఎన్నికల సమయంలోనే భక్తి పొంగిపొర్లుతుంటుంది. అప్పుడే తప్పుచేసినవాడు, జైలుకి వెళ్లి వచ్చిన వాడు కూడా మహాత్ముడై పోతుంటాడు. పెరోల్ మీద ఉన్నంత మాత్రాన ఈ బాబా సత్సంగ్ నిర్వహిం చడానికి ఎలా అనుమతించారన్నది ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.

హైకోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురు- రైతుల మహాపాదయాత్రకు ఓకే

జగన్  ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతుల పాదయాత్ర ఇక ఆగిపోయినట్టేనంటూ బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు చేసిన వ్యాఖ్యలు హైకోర్టు తీర్పుతో పసలేనివిగా మారిపోయాయి. అమరావతి రైతులు తమ పాదయాత్రను పున: ప్రారంభించవచ్చని హైకోర్టు విస్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల పాదయాత్ర నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే 600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలన్న పూర్వపు ఆదేశాలను అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఐడీ కార్డులు ఉన్న వారు మాత్రమే పాదయాత్రలో కొనసాగాలన్న తమ పూర్వ ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఐడీ కార్డులను రైతులకు వెంటనే తిరిగి ఇచ్చేయాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక యాత్రకు సంఘీభావం తెలిపే వారిపై ఎటువంటి ఆంక్షలూ లేవని హైకోర్టు తన ఉత్తర్వులలో విస్పష్టంగా చెప్పింది. సంఘీభావం తెలిపే వారు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలుపవచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే సంఘీభావం తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని రైతులకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.ఈ విషయంలో గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ మంగళవారం (నవంబర్1)  తన ఉత్తర్వులలో హై కోర్టు స్పష్ఠం చేసింది. పాదయాత్రను నున: ప్రారంభించుకోవచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది.   కాగా పోలీసుల తీరుకు నిరసనగా గత నెల 22న రైతులు తమ పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి విదితమే.   అమరావతి నుండి అరసవిల్లి వరకు   చేస్తున్న మహాపాదయాత్రకు  విరామం ప్రకటించారు. పోలీసులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులోనే తేల్చుకుని పాదయాత్రను మళ్లీ ప్రారంభిస్తామని అమరావతి రైతుల ఐకాస ప్రకటించింది. కోర్టుకు సెలవులు ఉన్నందున పాదయాత్రకు నా తాత్కాలిక విరామం మాత్రమే ఇస్తున్నట్లు ఐకాస వెల్లడించింది. అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. రైతులు శుక్రవారం రాత్రి బస చేసిన ఫంక్షన్ హాల్ ను ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి చుట్టుముట్టారు. ఈ సందర్భంగా బయటి నుంచి   రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. మద్దతు తెలిపేందుకు వస్తున్న వారని ఎక్కడికక్కడ నిలిపేశారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది రైతుల ఐడీ కార్డులు చూపించాలని ఒత్తిడి తెచ్చారు. అనుమతి ఉన్న వాహహనాలు తప్ప ఇంకే వాహనాన్నీ అనుమతించేది లేదంటూ పోలీసులు   చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు- అమరావతి రైతుల మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. దీంతో అమరావతి రైతుల ఐకాస నేతలు అప్పటికప్పుడు సమావేశమై పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మునుగోడులో టీఆర్ఎస్- బీజేపీ డిష్యుం డిష్యుం..రాళ్ల దాడి, ముష్టిఘాతాలతో పలివెల రణరంగం

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న క్రమంలో టీఆర్ఎస్- బీజేపీ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడం  ఇరు పార్టీల శ్రేణులు ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్గొండ జెడ్పీ చైర్మన్ జగదీశ్ కు దెబ్బలు తగిలాయి. ఈటల రాజేందర్ పీఆర్ఓ కాలికి కూడా గాయం అయింది. ఈటల రాజేందర్ కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకు ప్రచారం సాఫీగానే కొనసాగిందనే చెప్పాలి. మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగుస్తుందనగా మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఘర్షణ జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈటల రాజేందర్ కాన్వాయ్ పలివెల రాగానే కాన్వాయ్ లోని వాహనాలపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాన్వాయ్ వెంటే ఉన్న బీజేపీ శ్రేణులు ఆ దాడిని ఎదుర్కొని, ప్రతిగా రాళ్లతో దాడులు చేశారు. వారు పరస్పరం పిడిగుద్దులు కూడా గుద్దుకున్నారు. ఈక్రమంలోనే ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో కూడా దాడులు చేసుకున్నాయి. అయితే.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్ఎస్- బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు. అయినా.. ఆగ్రహం చల్లారని రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల ఘటనపై ఈటల స్పందిస్తూ.. తాను, తన సతీమణి ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనానికి వచ్చినట్లు చెప్పారు. మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారని తెలిపారు. ఆ సమయంలోనే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం తమ తమ వర్గాలతో కలిసి రాళ్లతో దాడి చేశారని చెప్పారు. పార్టీ జెండాల్లో రాళ్లు, కర్రలు తీసుకొచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారని ఆరోపించారు. ఈ దాడికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కారణమని ఈటల ఆరోపించారు.