గట్టిగా మాట్టాడకండి, శబ్దాలుచేయద్దు....రైల్వే హెచ్చరిక
posted on Nov 2, 2022 @ 11:20AM
చాలాదూరం ప్రయాణించేవారు, అందునా రైలు ప్రయాణంచేసేవారు చాలామంది సరదా కబుర్లలోపడి గట్టిగా మాట్లాడుకోవడం, జోకులేసుకుంటూ ఫ్యాన్ పడేలా గట్టిగా నవ్వుకోవడాలు మామూలే. తోటి ప్రయా ణీకులు నిద్రపోతున్నారన్నది కూడా పట్టించుకోరు. వారి ఆనందంలో వారుంటారు. రాత్రిపూట ప్రయా ణిం చేటపుడు రాత్రి పది దాటిన తర్వాత పెద్దగా శబ్దాలు చేయడాలు, గట్టిగా ఇతరులకు నిద్రా భంగం కలిగేట్టు మాట్లాడుకోవడాలు, పాటలు వినడాలు అవేమీ చేయవద్దని రైల్వే కొత్త మార్గ దర్శకాలు విడుదల చేసింది.
రాత్రి సమయాల్లో ప్రయాణించేవారికోసం రైల్వేవారు జారీ చేసిన ఈ కొత్త మార్గదర్శకాలు పాటించకపోతే జరిమానా తప్పదంటూ సూచనలు చేసింది. అందువల్ల ప్రయాణీకులు నిజంగానే ఆ హెచ్చరికను సీరియస్గానే తీసుకోవాలి. నిబంధనల ప్రకారం..రాత్రి వేళల్లో రైలు బోగీలో ఏ ప్రయాణికుడు కూడా గట్టిగా మాట్లాడకూడదు. స్పీకర్ పెట్టి (సెల్ ఫోన్లు) పాటలు వినకూడదు. ప్రయాణీకులతో పాటు రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్ స్టాఫ్ అయినా సరే గట్టిగా అరవ కూడదు. అంతేకాదు..మిడిల్ బెర్త్ ప్రయాణికులు వారి బెర్త్‌పై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చని తెలిపింది.
ప్రయాణీకులకు కాకుండా టీసీకి కూడా ఈ మార్గదర్శలు పాటించాలని సూచిస్తూ.. రాత్రి 10 తర్వాత (రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కే ప్రయాణీకులకు చెల్లదు), టీటీఈ టికెట్‌ను తనిఖీ చేయరా దని..సీటు కేటాయించిన ప్రయాణికులు రాకపోతే..వెంటనే ఆ సీటు (బెర్త్)ని వెంటనే వేరే ప్రయా ణీకులకు (రిజర్వేషన్ కన్ఫామ్ కాక ఆర్ఏసీ వచ్చినవారికి) కేటాయించకూడదు. ఆ సీటు కేటాయించిన వ్యక్తులు (ప్రయాణీకులు) రాకపోతే గంట తర్వాత లేదా రెండు స్టేషన్లు దాటాకనే (ఏది ముందు అయితే అది) వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలని సూచించింది. కుటుంబంలో ఒకరికి సీటు కన్ఫార్మ్ అయ్యి, ఇంకొకరికి కాకపోయినా.. కన్ఫార్మ్ అయిన వ్యక్తి ప్రయాణించకపోతే ఆ సీటులో టికెట్ కన్ఫార్మ్ కాని వ్యక్తి ప్రయాణించొచ్చని కూడా వెల్లడించింది.
అయితే ఈ నిబంధనలు పాటిస్తున్నవే. కానీ వీటికి మరో కొత్త నిబంధన చేర్చారు. మీ సీటు, కంపార్ట్‌మెంట్ లేదా కోచ్‌లో ఉన్న ప్రయాణికులెవరూ మొబైల్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు లేదా బిగ్గరగా సంగీతం వినకూడదు. ఇతర ప్రయాణికుల సౌకర్యార్థం..ప్రత్యేకించి సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం కొత్త నిబంధనను అమలు చేయాలని భావించింది.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తమ కోచ్‌లలో పాటలు వింటూ బిగ్గరగా మాట్లాడుతున్నట్లుగా రైల్వే డిపార్ట్ మెంట్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. రైల్వే ఎస్కార్ట్ లేదా మెయింటెనెన్స్ సిబ్బంది కూడా బిగ్గరగా మాట్లాడుతున్నారని కొన్ని ఫిర్యాదులు అందాయి. అలాగే ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత తమ (బెర్తుల వద్ద ఉన్న లైట్లు)లైట్లను ఆన్ చేసినట్లుగాను..కూడా ఫిర్యాదు అందాయి. దీంతో తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకూడదనే యోచనతో ఐఆర్టీసీ ఈ మార్గదర్శకాలను ప్రకటించింది.