వర్షం వద్దు....కోహ్లీ మెరుపులే కావాలి
posted on Nov 2, 2022 @ 12:37PM
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత్ సూపర్ 12లో నాలుగవ మ్యాచ్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. అయితే బుధవారం మ్యాచ్ వర్షం గండం ఉందన్న అనుమానాలే ఎక్కువగా వ్యక్తమవు తున్నాయి. మ్యాచ్ ఆరంభం కాకుండానే అడ్డుపడుతుందా, మధ్యలో ఆపేయవలసి వస్తుందా అన్నది ఇంకా పూర్తిగా తెలియడం లేదు. కానీ ఇవాళ్టి మ్యాచ్ కి వరుణుడు తప్పకుండ అడ్డుపడే అవకాశం ఉంద నే వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ టోర్నీలో గ్రూప్ 2 సూపర్ 12లో మ్యాచ్ ఎవరు గెలిస్తే వారికి సెమీస్ అవకాశాలు పదిలమవుతాయి.
మొన్నటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినప్పటికీ టీమ్ ఇండియా ఫామ్ గురించి పెద్దగా ఆందోళ నపడనవసరం లేదని టీమ్ హెడ్ కోచ్ ద్రావిడ్ అన్నాడు. బంగ్లాదేశ్ మాత్రం ఇంతవరకూ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచి మంచి ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు, బౌలింగ్ విభాగంలోనూ జట్టులోకి తిరిగి వచ్చిన షమ్మీ, కొత్త కుర్రాడు అర్షద్ సింగ్ లతో పాటు భువీ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. కనుక బంగ్లా దేశ్ మీద పూర్తి మ్చాచ్ జరిగినా, ఓవర్లు తగ్గించి జరగకపోయినా గెలిచేది మాత్రం టీమ్ ఇండియానే.
కానీ వాతావరణ పరిస్థితులు పెద్దగా మ్యాచ్ కి అనుకూలించకపోవచ్చనే వాతావరణ నిపుణులు అంటున్నారు. 60 శాతం మబ్బుగా, తేమగా ఉండవచ్చని, జల్లులు పడవచ్చని అదీ సాయింత్రం పడే అవకాశం ఉందని హెచ్చరిం చారు. బుధవారం చలిగాలి గంటకు 20 నుంచి 30 కి.మీ.వేగంతో ఉంటాయని తెలిపారు. ప్రస్తుత టోర్నీలో మెల్బోర్న్ లో మ్యాచ్ లు నాలుగు వర్షార్పితం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, అడెలైడ్ లో మంగళవారం భారీ వర్షం కారణంగా టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్ జరగలేదు. ప్లేయర్లంతా హోటల్ కే పరిమితమయ్యారు. అంతకుముందు భారత్ 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోగా, బంగ్లాదేశ్ ఇంతకుముందు జింబ్వాబ్వేతో తలపడిన మ్యాచ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ విధంగా భారత్ మూడు మ్యాచ్ ల్లో 2 గెలిచి, 4 పాయింట్లతో 2వ స్థానంలోను, బంగ్లాదేశ్ 3వ స్థానంలోనూ ఉన్నాయి.
2016 టీ20 ప్రపంచక కప్ తర్వాత భారత్ బంగ్లాదేశ్ టీ 20 ల్లో పోటీపడలేదు. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోతే రిజర్వు డే ఉంటుంది. కానీ అది సెమీస్ మ్యాచ్ లకు మాత్రమే వీలు కల్పిస్తారు. కనుక వర్షం అడ్డుకుంటే చెరో పాయింట్ షేర్ చేసుకోవలసి ఉంటుంది.