మోదీజీ...మహిళా శక్తి అంటే ఇదేనా?

పొద్దుటే అమ్మాయి ఇంటికి రాగానే తల్లిదండ్రులు చెప్పాపెట్టక ఇలా వచ్చేసేవేమిటే.. ప్రశ్నల మీద ప్రశ్నలు.. కాఫీ తాగి తీరిగ్గా మా ఆయన తిట్టాడు వచ్చేశానంది అమ్మాయి.. అంతే అల్లుడి ఇంటి మీదకు దండయాత్రకి వెళ్లినట్టు వెళ్లారు. తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని పక్కింటివారూ తోడయ్యారు. అం దర్నీ చూసి ఖంగారుపడ్డాడు సదరు అల్లుడుగారు. తినకుండా కూచుంది తిట్టానన్నా డు.. అంతేగదా..అని నవ్వుకున్నారు.  మొన్నామధ్య ఒకతను పెళ్లం మీద కోపగించుకుని ఇంట్లోంచి వెళి పోయాడు. ఆ సంగతి విని అతని తల్లితో పాటు ఊరంతా నవ్వుకుంది. మొగాడివి ఏడుస్తూ వచ్చే డమేమిటని హేళనా చేశారంతా. మగవాడు బాధపడితే ఎందుకు నమ్మరో తెలీదు గాని, ఇటీవలి కాలంలో భార్యాబాధితులు కూడా తయారయ్యారు. కానీ కోర్టు దాకా ఎవరూ వెళ్లరు. పోనీ వెళ్లినా కోర్టంతా బామ్మగారిలా నవ్వుతుంతే.  కర్ణాటక బెంగుళూరుకి చెందిన యదునందన్ అనే వ్యక్తిది దాదాపు ఇదే అవస్థ. అతని బాధలు అంా యింతా కాదట. డబ్బుకి, స్థిరాస్తులకు ఇబ్బంది పెట్టడం కంటే ఎక్కువట.  తిట్టడం, కొట్టడం స్థాయి దాటి ఏకంగా కత్తితో దాడి చేసిందట అతని భార్య. అరచేయి కోసుకుపోయిందిట. రోజూ తనను ఏదో ఒక కారణంతో చిత్రహింసలకు గురిచేస్తోందని వాపోతు న్నాడు. ఎవ్వరూ తనకు మద్దతుగా మాట్లాడలేక పోతున్నారు. అది కుటుంబ సమస్య అని, భార్యాభర్తలు మీరే తేల్చుకోవాలని చెప్పి తప్పించుకుం టున్నారు. ఇదే భార్య మీద చిన్న మాటతో రెచ్చిపోయినా ఊరంతా మీదపడే కాలంలో ఇలాంటి మగవారికి ఏమాత్రం మద్దతు లభించదన్నది యదునందన్ గోడు తెలియజేస్తోంది.   ఇక లాభం లేదని యదునందన్ ఏకంగా ప్రధాని మోదీ కార్యాలయానికి ట్వీట్  చేశాడు.. తనను భార్య నుంచి కాపాడ మని. అసలే దేశ రాజకీయాల్లో తలమునకలయిన ప్రధానికి ఇలాంటి భార్యాబాధితుల గోడు సీరియస్ గా పట్టించుకుంటారా  అను మానమే అంటున్నారు యదునందన్ సంగతి తెలిసినవారు. పైగా తనలాగా ఎందరో భార్యాబాధితులు ఉన్నారని వారిని రక్షించే బాధ్యత తీసుకోవాలన్నాడు. ఆ పురుష పుంగవుడు చేసిన ట్వీట్, పీఎంఓనూ ఆలోచనలో పడవేసిందట. అంతేకాదు,  మీరు చెప్పే నారీ శక్తి అంటే ఇదేనా? అని ఆవేశపడి.. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి?ఆమెపై గృహహింస కేసు పెట్టవచ్చా? లేదా?అని అమాయకంగా పీఎంఓనే సలహా అడిగాడు.  ఇప్పుడు ఈ ట్వీట్  సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయి, సాటి పురుష పుంగవుల సానుభూతిని టన్నుల కొద్దీ దోచేస్తోంది. ఇక యదునందన్ భావీజీవితం పీఎంఓ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడిందనాలేమో. అసలే రాజకీ యాలతో సతమతమవుతున్న ప్రధాని, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, సమాచారాలతో బిజీగా ఉన్న పీఎంఓ మరి యదునందన్ కు మద్దతునిస్తుందో లేదో చూడాలి. 

ఇప్పటం కూల్చివేతలపై చంద్ర నిప్పులు

ఏపీలో వైసీపీ దుర్మార్గాలతో పాటు అసాధ్యాలను చేస్తామంటూ అరాచకాలకూ పల్పడుతోంది. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత ఆ కోవలోకే వస్తుంది. రాష్ట్రంలో రోడ్ల అధ్వాన స్థితిపై రోజూ వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ నిర్వాకాన్ని ఏకి పాడేస్తున్నా ఖాతరు చేయడంలేదు. కానీ అవసరం లేని చోట్ల రోడ్ల విస్తరణ అంటూ ఇళ్లను కూల్చేస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణే ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో 53 ఇళ్ల కూల్చివేత. ఇళ్ల కూల్చివేతను అడ్డుకోవాలంటూ ఆ గ్రామస్తులు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు నిర్ణయం వెలువరించడానికి ముందే దౌర్జన్యంగా పోలీసుల పహారాతో గ్రామంలో ఇళ్లను కూల్చేశారు. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ కు పోయే కాలం దాపురించిందనీ, అందుకే దిక్కుమాలిన పనులన్నీ చేస్తోందనీ నిప్పులు చెరిగారు. తప్పులు చేయడంలో జగన్ శిశుపాలుడిని దాటేశాడని దుయ్యబట్టారు. వంద తప్పులు చేసిన శిశుపాలుడికి శిరచ్ఛేదన జరిగిందనీ, వంద తప్పులు దాటేసిన జగన్ ప్రభుత్వం కూలిపోక తప్పదని అన్నారు. అరాచకపాలకు, విధ్వంసాలకు ఏపీని కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని అన్నారు. సీఎం జగన్ అధికార మదానికి, అహంకారానికి, దౌర్జన్యాలకీ, దుర్మార్గాలకూ చరమ గీతం పాడేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. నిండా 600 గడప కూడా లేని ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు నిర్మిస్తారా? అసలు మీవి రోడ్లేసే మొహాలేనా అంటూ చంద్ర నిప్పులు చెరిగారు. ఇప్పటం వెళ్లకుండా జనసేనానిని అడ్డుకునే ప్రయత్నాల ద్వారానూ, విద్యుత్ సరఫరా నిలిపివేసి మాపై రాళ్ల దాడి చేస్తేనో మిమ్మల్ని చూసి భయపడే పరిస్థితుల్లో ఎవరూ లేరని చంద్రబాబు అన్నారు. కూల్చవేతలకు కాదు.. ఏదైనా నిర్మించి చూడండి అని సవాల్ చేశారు.  

భూమికి తిరిగి వచ్చేసిన రిసాట్2

భారతదేశ మొట్టమొదటి 'ఐ ఇన్ ది స్కై' ఒక దశాబ్దానికి పైగా కీలక సహాయక పనులు పూర్తి చేసిన తర్వాత భూమికి తిరిగి వచ్చేసింది. ఇస్రో  రాడార్-ఇమేజింగ్ ఉపగ్రహం రిసాట్-2 భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, అక్టోబర్ 30 న జకార్తా సమీపంలో హిందూ మహాసముద్రంలో పడింది, ఇది భారత్ మొట్ట మొదటి  'గూఢచారి' లేదా నిఘా  ఉప గ్రహం, 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత దేశం దానిని నిలుపుకోవడం కోసం ప్రారంభించింది. సరిహద్దులు, సము ద్రాలు సురక్షితంగా ఉన్నాయి.  పాకిస్తాన్‌పై రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రారంభించడానికి దాని చిత్రాలే ఎంతో ఉపకరించాయి. 30 కిలోల ఇంధనాన్ని మోసుకెళ్లిన రిసాట్-2, 13.5 సంవత్సరాల పాటు అనేక చొరబాట్లు , ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో కీలకపాత్ర పోషించింది. ఆశించిన జీవిత కాలానికి మించి తన విధిని నిర్వహించింది. 2016లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లోని టెర్రర్ లాంచ్‌ ప్యాడ్‌ లపై సర్జికల్ స్ట్రైక్ మరియు ఫిబ్రవరి 2019లో బాలాకోట్ వైమానిక దాడిని ప్లాన్ చేయడంలో ఈ ఉపగ్రహంలోని చిత్రాలు భద్రతా మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సహాయ పడ్డాయి. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అందించిన ఎక్స్-బ్యాండ్ సింథటిక్-ఎపర్చర్ రాడార్ ప్రధాన సెన్సార్  కాబట్టి రిసాట్-2 ఇజ్రాయెల్ సహాయంతో నిర్మించారు. రిసాట్-1 ఉపగ్రహం కోసం స్వదేశీంగా అభివృద్ధి చేసిన సి- బ్యాండ్‌లో జాప్యం కారణంగా 2008లో 26/11 ఉగ్రదాడుల తర్వాత రిసాట్-2 ప్రయోగం వేగవంతమైంది. అందుకే  ఏప్రిల్ 26, 2012న రిసాట్-1 ప్రయోగానికి మూడేళ్ల ముందు ఏప్రిల్ 20, 2009 న రిసాట్-2ను ప్రయోగించారు. ఈ  ఉప గ్రహం పగలు-రాత్రి  అన్ని వాతావరణాలను పర్యవేక్షించే సామ ర్థ్యాన్ని కలిగి ఉంది. హిందూ మహాసముద్రం అరేబియా సముద్రంలో భద్రతా ముప్పుగా భావించే శత్రు నౌకలను ట్రాక్ చేయడానికి కూడా ఇది ఉపయోగించబడింది. సెప్టెంబరు 2, 2009న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు తోటి ప్రయా ణీకుల ప్రాణాలను బలిగొన్న హెలికాప్టర్ క్రాష్ యొక్క శిధిలాలను వెతకడానికి, గుర్తించడానికి ఉప గ్రహాన్ని రెస్క్యూ మిషన్లలో కూడా ఉపయోగించారు. అక్టోబర్ 30న జకార్తా సమీపంలోని హిందూ మహా సముద్రంలో అంచనా వేసిన ఇంపాక్ట్ పాయింట్ వద్ద రిసాట్-2 భూ వాతావరణంలోకి నియం త్రణకు వీలులేకుండా చేరిందని ఇస్రో తెలిపింది. ఇస్రోలోని స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్ బృందం కక్ష్య, మిషన్ ప్లానింగ్  సరైన నిర్వహణతో  ఇంధనం  ఆర్థిక వినియోగం ద్వారా, రిసాట్-2 13 సంవత్సరాలకు పైగా చాలా ఉపయోగకరమైన పేలోడ్ డేటాను అందిం చింది. దాని ఇంజెక్షన్ నుండి, రిసాట్-2 యొక్క రాడార్ పేలోడ్ సేవలు వివిధ అంతరిక్ష అనువర్తనాల కోసం అందించబడ్డాయి, ఏజెన్సీ తెలిపింది. “రీ-ఎంట్రీలో, శాటిలైట్‌లో ఇంధనం మిగిలి లేదు మరియు అందువల్ల కాలుష్యం లేదా పేలుడు లేదు... ఏరో-థర్మల్ ఫ్రాగ్మెంటేషన్ కారణంగా ఉత్పన్నమయ్యే ముక్కలు రీ-ఎంట్రీ హీటింగ్‌లో ఉండవని అధ్యయనాలు నిర్ధారించాయి మరియు అందువల్ల శకలాలు లేవు. భూమిపై ప్రభావం చూపాయని పేర్కొంది. రిసాట్-2 భూమిపైకి తిరిగి ప్రవేశించినప్పుడు, అంతరిక్ష శిధిలాల కోసం అవసరమైన అన్ని అంతర్జాతీయ ఉపశమన మార్గదర్శ కాలను ఇది పాటించింది, బాహ్య అంతరిక్షం దీర్ఘకాలిక స్థిరత్వం పట్ల ఇస్రో  నిబద్ధతను చూపిస్తుంది.

ఇప్పటంలో ఏం జరుగుతోందసలు?

మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో రోడ్డు విస్తరణ నెపంతో 53 ఇళ్లు, ప్రహారీగోడలను అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలు ఇప్పుడు ఏపీలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇప్పటం గ్రామంలో అనేక మంది జనసేన మద్దతుదారులు ఉన్నారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వారు ధైర్యంగా ముందుకు వచ్చి స్థలం ఇవ్వడమే ఇప్పుడు ఈ కూల్చివేతలకు కారణమని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ‘కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంద’ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసానికి ఇది పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఫైరయ్యారు. ఇప్పటంలో రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చివేశారని బాధితులతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటంలో అసలు ఏమి జరుగుతోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటంలో బాధితులను పరామర్శించి, వారికి మద్దతుగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం ఆ గ్రామానికి బయలుదేరారు. అయితే.. అంతకు ముందే పవన్ కళ్యాణ్ వాహనం వెళ్లే దారికి అడ్డంగా పోలీసులు కంచెలు వేశారు. అయినప్పటికీ పవన్ తన వాహనంలో ముందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పవన్ వాహనం దిగి కొంతదూరం నడిచి వెళ్లారు. ఈ క్రమంలో వేలాది మంది ఆయన మద్దతుదారు వచ్చి పవన్ కళ్యాణ్ వెంట నడిచార. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పవన్ మరో వాహనంలో ఇప్పటం చేరుకుని, ఇళ్లు కూలగొట్టిన ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించి, సంఘాభావం తెలిపారు. ‘ఇప్పటం చిన్న గ్రామం. కాకినాడా లేదా రాజమండ్రీయా.. రోడ్లు వెడల్పు చేయడానికి? ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి ఎందుకు విస్తరించడం లేదు?  బాధితులతో కనీసం మాట్లాడకుండా ఆపేందుక మీరెవరు? మా సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్ర చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారు.  వైసీపీ నేతలూ.. ఇడుపులపాయలో మేము హైవే వేస్తాం. గుంతలు పూడ్చలేరు. రోడ్లు వేయలేరు గానీ.. విస్తరణ కావాలా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా. కూల్చివేస్తున్నవారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా జనసైనికులు మౌనంగా ముందుకు నడవండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. అరెస్టులకు భయపడేది లేదు. దేనికైనా సిద్ధమే. వైసీపీ వాళ్లకు చెబుతున్నా.. మా మట్టిని కూల్చారు. మీ కూల్చివేత తథ్యం’ అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభను అమరావతిలో నిర్వహించాలని సభాస్థలి కోసం ఆ పార్టీ నేతలు అన్వేషించిన సమయలో సభకు ఎక్కడా చోటు దొరకకుండా అధికార వైసీపీ నేతలు బెదింపులకు పాల్పడ్డారు. హెచ్చరికలు కూడా చేశారు. ఆ సందర్భంలోనే ఇప్పటం గ్రామస్తులు ధైర్యంగా ముందుకు వచ్చి జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారు. దాంతో జనసేన ఆవిర్భావ సభ జరిగిపోయింది. అప్పటి నుంచీ ఇప్పటం తమకు అధికార పార్టీ నుంచి వేధింపులు, బెదిరింపులు మొదలయ్యాయని బాధితులు వాపోతున్నారు. మార్చిలో జనసేన సభ జరిగిన తర్వాత ఏప్రిల్ లోనే రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇప్పటం గ్రామస్తులకు నోటీసులు ఇచ్చారు. నిజానికి ఇప్పటం ప్రధాన రహదారికి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉండే గ్రామం. ఇప్పటం మీదుగా వాహనాల రాకపోకలు కూడా ఉండవు. అయినప్పటికీ గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంది. దాన్ని ఇప్పుడు 120 అడుగులకు విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధి ఉవ్విళ్లూరిపోతున్నారట. అయితే.. ఆ ప్రజాప్రతినిధి ఉత్సాహానికి, ఉవ్విళ్లూరడానికి కారణం కక్ష సాధింపు ఒక్కటే అంటున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారి ఇళ్లను రోడ్డు విస్తరణ వంకతో తొలగించాలని ఆ ప్రజాప్రతినిధి, వైసీపీ సర్కార్ కుట్ర చేయడమే ఈ మొత్తం విధ్వంస కాండకు కారణం అంటున్నారు. ప్రధాన రహదారి నుంచి ఇప్పటం గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు కేవలం 15 అడుగులు మాత్రమే ఉంది. మరో రెండు మార్గాలు కూడా ఇరుకుగానే ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు వైసీపీ సర్కార్ కూల్చేసిన ఇళ్లున్న రోడ్డు 70 అడుగులు ఉంది. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డును వెడల్పు చేసే యోచన చేయని వారికి ఇప్పటికే చాలినంత వెడల్పుతో ఉండే గ్రామంలోని రోడ్డును 120 అడుగులకు వెడల్పు చేయాలనడం వెనకు కుట్ర, కక్ష తప్ప మరేమీ లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకునేందుకు యత్నించిన జన సైనికులు, వీర మహిళలను అదుపులోకి తీసుకుని, సర్కార్ దుర్మార్గానికి అండగా నిలవడం ఏమిటని పోలీసులపై ఇప్పటం బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇప్పటంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సందర్శించి, గ్రామ సభలో ప్రసంగిస్తున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపేసిన జగన్ సర్కార్ కుటిల బుద్ధి గురించి జనం చెప్పుకుంటున్నారు. కూల్చివేత నోటీసులపై ఇప్పటం గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఏ క్షణంలో అయినా హైకోర్టు ఆదేశాలు రావచ్చని.. ఆగమేఘాల మీద ఈ నెల 4వ తేదీన కూల్చివేతలకు తెగబడడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న వైసీపీ సర్కార్ ఇప్పటంలో విశాలంగా ఉన్న రహదారిని విస్తరించే నెపంతో ఇళ్లు, ప్రహారీ గోడలను కూల్చివేయడం కక్షపూరితం, కుట్రలో భాగం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన గ్రామాల్లోని రోడ్లు ఇప్పటంలోని రహదారికన్నా ఇరుకుగానే ఉన్నా తమ గ్రామంలోనే విస్తరించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో తమను వైసీపీ సర్కార్ భయాందోళనలకు గురిచేస్తోందని ఇప్పటం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

హిమాచల్, గుజరాత్ లలో మళ్లీ కమల వికాసమే.. తేల్చేసిన సర్వే

హిమాచల్, గుజరాత్ రాష్ట్రాలలో మరోసారి కమలమే విజయకేతనం ఎగుర వేసి అధికారాన్ని నిలబెట్టుకోనుందని సర్వే వెల్లడించేసింది. ఆ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్న సంగతి విదితమే. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి  ఈ నెల 12 ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల1, 5 తేదీలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీకే విజయావశాకాలున్నాయని ఇటీవల ఇండియా టీవీ-మాట్రిక్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. హిమాచల్ లో తొలి సారిగా ఆనవాయితీకి భిన్నంగా ఆ రాష్ట్రంలో వరుసగా రెండో సారి కమలం పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుందని సర్వే పేర్కొంది. అలాగే గుజరాత్ లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని పేర్కొంది.   రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అధికారం చేపడుతుందని సర్వే పేర్కొంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ వరుసగా రెండు సార్లు ఒకే పర్టీ విజయం సాధించి అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. ప్రతి సారీ ఆ రాష్ట్ర ప్రజలు అధికార పార్టీని ఓడించడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. అయతే ఈ సారి మాత్రం ఆ ఆనవాయితీని అధిగమించి హిమాచల్ లో మరో సారి బీజేపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటుందని సర్వే ఫలితం చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో 46 శాతం ఓటర్ల మెగ్గుతో బీజేపీ, 41 విజయం సాధిస్తుందని  ‘ఇండియా టీవీ-మాట్రిక్స్’నిర్వహించిన సర్వే వెల్లడించింది.  ఇక కాంగ్రెస్ పాతిక స్థానాలకే పరిమితమౌతుందని పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించే అవకాశం లేదని సర్వే తేల్చింది. అలాగే గుజరాత్ విషయానికి వస్తే.. టైమ్స్ నౌ- ఈటీజీ నిర్వహించిన సర్వేలో గుజరాత్ లో మరో సారి అధికారం బీజేపీదేనని పేర్కొంది. రాష్ట్రంలో ఆ పార్టీ 125 నుంచి 135 స్థానాల వరకూ కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.  కాంగ్రెస్ 29 నుంచి 31 స్థానాలు,  ఆమ్ ఆద్మీ పార్టీ  20-24 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితం పేర్కొంది. 

21 రోజుల పసిబిడ్డ గర్భం లో 8 పిండాలు

రాంచీ రాంఘర్ లో దంపతులు తమ నవజాత శిశువు ఏడుపు తట్టుకోలేక ఆస్పత్రికి తీసికెళ్లారు. పసి కందు కడుపునొప్పితో బాధపడుతోందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. పరీక్షించగా ఆశర్యర్యకర సంగతి తెలిసింది. వైద్యులు స్కానింగ్‌ తీయగా.. శిశువు కడుపులో కణితి ఉన్నట్లు భావించారు. ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఈ నెల 1వ తేదీన ఆపరేషన్‌ చేయగా.. వైద్యులకు శిశువు కడుపులో కణితి బదులు 8 పిండాలు కనిపించాయి. ఇదెలా సాధ్యమని డాక్టర్లు కుటుంబసభ్యులు, బంధువులు అంతా విస్తు పోయారు. పసికందు ప్రాణాలతో గట్టెక్కు తుందా అని భయపడ్డారు. పసికూన సురక్షితంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పసికందు గర్భంలో 8 పిండాలు ఎక్కడైనా కన్నామా విన్నామా? ప్రపంచంలోనే అరుదైన ఘటనగా నిపు ణులు పేర్కొంటున్నారు. దీనిని వైద్య పరిభాషలో ఫిఫ్ అంటారు. అంటే పిండంలో పిండం ఉండటం. ఇది ప్రపచంలోనే అరుదైన ఘటన స్థితిగా పేర్కొన్నారు. అదీకాక వెన్నుపూసలో పిడం ఉండ డం డాక్టర్స్ గుర్తించారు. ఇప్పటిదాకా ప్రపంచలో ఇలాంటి అరుదైన కేసులు 200లోపే వెలుగు చూశా యని.. భారత్‌లో 10 మాత్రమే నమోదయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. పదిలక్షల మంది పిల్లల్లో ఇలా ఒకరికే జరిగే అవకాశముందని వైద్యులు పేర్కొన్నారు. ఫిఫ్ పిండంలో పిండం అన్నది చాలా అరుదైన  స్థితిగా పేర్కొన్నారు. శరీరం లోని వెన్నుపూసలో రెండు పిండాలు ఉండడాన్ని గమనించినట్లు డాక్టర్స్ తెలిపారు.రాంచి నగరానికి చెందిన పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ, 5 లక్షల మందిలో ఎవరూకరికి మాత్రమే వస్తుందని  ఈ అంశం అంతర్జాతీయ  జర్నల్ లో ఫిఫ్ ఒక కేసు మాత్రమే ఉంటుందనిఅయితే చాలా పిండాలు ఉండ డం చూడలేదని డాక్టర్ పేర్కొన్నారు.

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయ్యా కొడాలి నానీ!

‘ఒళ్లు బలిసిన కోడి మిద్దెనెక్కి పిచ్చికూతలు కూసిందట’ అన్న చందంగా ఉంది మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీరు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు ఏర్పాటు చేసిన వలయం ఉందని, పవన్ కళ్యాణ్ కు మంచి జరిగినా.. చెడు జరిగినా చంద్రబాబే కారణం అని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కోడి కూతల సామెతను గుర్తు చేస్తున్నాయంటారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు ‘పవన్ కళ్యాణ్ మీద దాడులు చేస్తారా? చంపేస్తారా?’ అని వ్యాఖ్యానించిన సంగతి విదితమే. దీనిపై బూతులు అలవోకగా మాట్లాడి, బూతుల మంత్రిగా ప్రసిద్ధుడైన కొడాలి నాని స్పందన బలిసిన కోడి   సామెతలా ఉందంటున్నారు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని, బైక్ లపై కూడా ఫాలో అవుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద రెక్కీ చేసిన విజువల్స్ కూడా కొన్ని మీడియాల్లో ప్రసారం కావడం కలకలం రేపింది. తనను, తన భార్యా, పిల్లలను చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని పవన్ కళ్యాణే స్వయంగా తన పార్టీ నేతల సమావేశంలో చెప్పడం గమనార్హం. పవన్ కళ్యాణ్ నివాసం   కొందరు యువకులు అర్ధరాత్రి పూట కారు నిలపడమే కాకుండా ఇదేమిటని అడిగిన ఆయన భద్రతా సిబ్బందిని దూషించిన వైనం మీడియాలో విజువల్స్ తో సహా ప్రముఖంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర జరుగుతోందంటూ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళ్లినా.. బయటి నుంచి ఇంటికి వచ్చినా కార్లలో   కొందరు వెంబడించడమే కాకుండా పవన్ రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నారని, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ లపై సమీపం నుంచి ఫాలో అవుతుండడం కలకలం రేపిన సంగతి విదితమే. ఈ అంశంపై కొడాలి నాని స్పందిస్తూ.. ‘నాదెండ్ల మనోహర్ ఎవడు..? జనసేన పార్టీనా గాడిదగుడ్డా..? జనసేనలో చంద్రబాబు నియమించిన ఏజెంటు నాదెండ్ల మనోహర్. పవన్ పై రెక్కీ నిర్వహిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అనటం హాస్యాస్పదం.  పవన్ కల్యాణ్ కోసం ఎవరైనా రెక్కీ నిర్వహించినా.. ఆయనను చంపాలనుకున్నా తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు నాయుడే చేస్తారు. చంద్రబాబు నాయుడు సానుభూతి రాజకీయాల్లో ఆరితేరిపోయారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు వలయం ఉంది. పవన్ కు ఏం జరిగినా.. అంటే మంచి జరిగినా.. చెడు జరిగినా.. చంద్రబాబుదే బాధ్యత’ అన్నారు. పవన్ పై కుట్ర చేస్తే.. అది చంద్రబాబే చే అన్నారు. ‘పవన్ కళ్యాణ్ చుట్టూతా ఉండేది ఎవరు? నాదెండ్ల మనోహర్. చంద్రబాబుకు సలహాలు చెప్పేది రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు. పవన్ కళ్యాణ్ కు సలహాదారులు ఎవరు? పవన్ కళ్యాణ్ ఎలా నడవాలి? ఎలా ఉండాలని ఎవరు చెబుతారు. పవన్ చుట్టూ ఎవరి వలయం ఉంది? నా వలయం ఉందా? చంద్రబాబు నాయుడి వలయం ఉంది. పవన్ కళ్యాణ్ ను ముంచినా.. తేల్చినా.. బతికించినా.. చంపేసినా.. ఏం చేసినా చంద్రబాబు నాయుడే.. చంద్రబాబుకు ఏది ఎడ్వాంటేజ్ అంటే అదే చేస్తాడు. ముక్కుసూటిగా వెళ్లి గుద్దడమే జగన్ కు తెలుసు. ఈ రెక్కీలు నిర్వహించడం.. రిహార్సల్స్ చేయడాలు, డైలాగ్ ట్రైనింగ్ లు ఇవ్వడాలు.. ఇవన్నీ సినిమా పరిశ్రమలో ఉంటాయి’ అనడాన్ని జనం తప్పుపడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ చీఫ్ ఎంతకైనా వెళ్తారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయనపైన కూడా ఆరోపణలు వస్తున్న విషయం కొడాలికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మృతికి కారణంటూ ఆయన బంధువులు కొడాలి నానిని శ్మశానంలోనే నిలదీసిన వైనాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదంటున్నారు. అలాగే అడపా బాబ్జీ బావమరిది వంకా విజయ్ ఆత్మహత్యతో కూడా కొడాలికి లింక్ ఉందనే ఆరోణలున్నాయి. ఎన్నో తప్పులు తన కింద పెట్టుకున్న కొడాలి నాని నిస్సిగ్గుగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై రెక్కీ జరగడాన్ని చంద్రబాబు, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఖండిస్తుంటే.. కొడాలి నాని కనీసం మనిషిగా స్పందించకపోగా ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్‌...ఓవర్ కి ఐదు బంతులేనా? 

ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియా తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌లో భారీ అంపైరింగ్ తప్పిదం హైలైట్ అయిం ది. శుక్రవారం, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇప్పటికే తొలగించబడిన ఆఫ్ఘనిస్తాన్ మధ్య  గ్రూప్ 1 చివరి గేమ్‌లో, భారీ అంపైరింగ్ లోపం జరిగిపోయింది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సూపర్ 12 దశలోని గ్రూప్ 1లో సెమీ-ఫైనల్ స్థానం కోసం జరిగిన పోరును నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర్)కి తగ్గించింది. టోర్నమెంట్  ఆరంభ దశలో వర్షం ప్రభావం చూపడంతో కీలకమైన మ్యాచ్‌లు వాష్ అవుట్ అయినందున, గ్రూప్‌లో తదుపరి ఫలితాలు సెమీస్ బెర్త్ కోసం నాలుగు జట్లు పోరాడేందుకు దారితీశాయి.  అటువంటి సందర్భాలలో, ప్రతి పరుగు మరింత ముఖ్యమైనది, ఇది అంతిమంగా ఎన్ఆర్ఆర్ ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఒక చిన్న అంపైరింగ్ లోపం  జట్టుకు చాలా ఖరీదైనదే అవుతుంది. అడిలైడ్‌లో జరిగే మ్యాచ్ ఆస్ట్రేలియాకు తప్పక గెలవాల్సిన గేమ్, అయితే, వారు ఎన్ఆర్ఆర్ లో భారీ తేడాతో గెలవాలని కోరుకున్నారు.  ఆట  నాల్గవ ఓవర్ సమయంలో, ఆస్ట్రేలియా బ్యాటర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ కలిసి ఓవర్‌లో కేవలం ఐదు బంతులు ఎదుర్కొన్నారు. మార్ష్ మూడో బంతికి బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ కోసం హాఫ్-వాలీని ఛేదించే ముందు బ్యాటర్‌లలో ఎవరైనా మొదటి రెండు బంతుల్లో ఒక్క స్కోర్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి కొంత అలసత్వపు ఫీల్డింగ్ కారణంగా మార్ష్ తర్వాతి బంతికి మూడు పరుగులు చేసి ఓవర్‌త్రోకి దారితీసాడు. ఐదో డెలివరీ డాట్ బాల్. ఆ ఓవర్‌లో ఆరో బంతి వేయలేదు. ఎన్ఆర్ఆర్ పరంగా ఇంగ్లండ్‌తో జరిగే పోరులో ముందుండాలనుకునే ఆస్ట్రేలియాకు ప్రతి బంతిని ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, తిరస్కరించిన డెలివరీ  ఖరీదైనదిగా మారవచ్చు. న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్ 1లో ఇప్పుడు ఇంగ్లండ్, శ్రీలంక  ఆస్ట్రేలియాల మధ్య యుద్ధం ఉంది. ఆస్ట్రేలియా గెలవాలి , ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ తేడాతో విజయం సాధించాలి. 

విపక్ష నేతపై దాడి జరిగితే చర్యలు పక్కన పెట్టి కాకమ్మ కబుర్లా..?!

తెలుగుదేశ అధినేత చంద్రబాబు నందిగామ పర్యటనలో  జరిగిన సంఘటనపై పోలీసులు ఒకలా, అధికార వైసీపీ నేతలు ఒకలా స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరి స్పందనా ఆయనపై దాడిని సమర్ధించేందుకు చేస్తున్న ప్రయత్నంగానే ఉంది. విజయవాడ సీపీ అయితే దూడ మేత కోసం తాటిచెట్టు ఎక్కారన్న చందంగా బాబుపై పూలవర్షం కురిపించారనీ, ఆ సమయంలో పొరపాటుగా రాయో, రాయిలాంటి వస్తువో పడి ఉంటుందని అన్నారు. ఇక వైసీపీ వాళ్లయితే ఏకంగా ఈ దాడి సానుభూతి కోసం చంద్రబాబే స్వయంగా చేయించుకున్నారని పేర్కొన్నారు. నందిగామలో జరిగిన సంఘటనను ఒక సారి పరిశీలిస్తే.. ఇది ఉద్దేశపూర్వకంగా, పక్కా ప్రణాళికతో బాబును గాయపరచడమే లక్ష్యంగా జరిగిందని అవగతమౌతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు రోడ్ షోకు అసంఖ్యాకంగా జనం తరలి వచ్చారు. పక్కన ఉన్న భవనాలపై నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం చంద్రబాబుకు జేజేలు పలుకుతూ నిలుచున్నారు. రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఎత్తైన భవనం నుంచి ఓ రాయి సూటిగా చంద్రబాబు వైపు దూసుకు వచ్చింది. దానిని గమనించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ క్షణంలో స్పందించి చంద్రబాబుకు అడ్డుగా నిలబడటంతో ఆయన చేతికి గడ్డానికి గాయమైంది. కాగా ఈ దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంటే దాడి చేసింది ఎవరన్నది గుర్తించకుండా ఉండేందుకు ప్రణాళిక ప్రకారమే ఆ సమయంలో విద్యుత్ సరఫరాను నలిపివేశారని పరిశీలకులు అంటున్నారు. ఒక వేళ చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మెరుపు వేగంతో స్పందించలేకపోయి ఉంటే.. ఆ రాయి నేరుగా చంద్రబాబుకే తగిలి ఉండేది. ఏడు పదుల వయస్సు పైబడిన వ్యక్తికి ఆ రాయి తగిలితే తీవ్ర గాయం అయ్యేదని అంటున్నారు. ఇంతటి తీవ్ర విషయాన్ని సీరియస్ గా తీసుకుని దాడికి పాల్పడిన వారెవరన్నది ఆరా తీయాల్సిందిపోయి.. పోలీసులు పూలవర్షం అంటూ, వైసీపీ నాయకులు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అంటే విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించడం దారుణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఒణికిస్తున్న చలిపులి, మంచుపొగ భూతం!

అరచేతులు రాసుకుంటూ పరుగున వెళ్లి వేడి వేడి మొక్కజొన్నపొత్తు తినేయడానికి సరదాపడడంలో సరదా పోయేంతగా చలి క్రమేపీ పెరిగిపోతోంది. ఇంట్లోనే పకోడీలు, ఆరు బయట కుంపటి , కర్రల మంట చుట్టూ చేరి కూచోడాలు అలవాటు చేసేసుకున్నవారందరికీ ఈసారి మరింత ఆటపాటలు అవసరమవుతాయేమో. ప్రతీ ఇంట్లొ జలుబు దగ్గుతో తుమ్ములతో తిరిగే వారి సంఖ్యా పెరుగుతోంది. చలి అమాంతం పట్టేసి ఇంట్లోంచి కదలనీయడం లేదు. చల్లగాలిలో అలా బండి మీద తిరగాలనుకునే జంటలకీ ఈసారి చలి పులి భయపెడుతోంది.  చలి ఒణికించేస్తోంది.. చలిమంటలు కాసుకోవలసివస్తోందని పల్లెప్రజలు అంటున్నారు. అయితే ఈసారి మరీ  ఎక్కువగా ఉంది. పొగమంచుతో జలుబు, దగ్గు మించి జ్వరాలకు దారితీసేంతగా చల్లదనం పట్టే స్తోంది. చలి పులిని  వది లించుకునే మార్గాలన్నీ వెదకడం మొదలయింది. మామూలుగా పల్లెల్లో అతిగా చలి అనిపిస్తుంది. కానీ ఈసారి పట్టణాల్లోనూ చలిపులి ప్రవేశించి ఇబ్బందికరంగా మారింది.  ఏ కాలానికి ఆ కాలం కవ్విస్తుంది, కొంత భయపెడుతుంది.  కానీ చాలా కాలం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చా యనే వాతావరణ నిపుణులూ చెబుతున్నారు. మరీ ఇటీవలి కాలంలో ఊహించని మార్పులేచోటుచేసుకుంటు న్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో స్థాయి  పొగమంచు, చలిగాలులు దక్షిణాదిన కూడా వీస్తున్నాయి. దీనికి తోడు ఊహించని విధంగా హఠాత్తుగా మబ్బులు కమ్మేయడం అమాంతం భారీ వర్షం పడటం చలి ఒణికించేస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాలను పొగమంచు మేఘంలా కమ్మేస్తోంది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరు స్తున్నా..మరోవైపు వాహనదారులకు నరకం చూపుతున్నాయి. విజయవాడ, రాజమండ్రి, ఆదిలాబాద్, మెదక్ వంటి ప్రాంతాలనే కాదు ఇతర పట్టణాలను కూడా పొగమంచు క్రమేపీ కప్పేస్తోంది. ముఖ్యంగా వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దారి సరిగా కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు.  విజయవాడ మచిలీపట్నం, రాజమండ్రి రైల్‌కమ్‌ బ్రిడ్జిపై దట్టమైన పొగమంచుతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో.. చలి, పొగమంచు తీవ్రత మరింత పెరిగింది.

బాబుపై పూలు వేస్తుంటే రాయి పడిందట.. నందిగామ ఘటనపై సీపీ వివరణ

తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటూ దూడగడ్డి కోసం అన్నాడట వెనకటికెవడో? అలా ఉంది నందిగామ పర్యటనలో శుక్రవారం రాత్రి (నవంబర్4) చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడిపై విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా స్పందన చూస్తుంటే. చంద్రబాబుపై పూలు వేశారనీ, ఆ సమయంలో పొరపాటున రాయో అలాటి వస్తువు ఏదో పడి ఉండొచ్చని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  నందిగామ పర్యటనలో  కరెంటు సరఫరా నిలిచిపోయిన సమయంలో రాళ్ల డాడి జరగడం ఆ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడటం తెలిసిందే. ఈ సంఘటనపై విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా స్పందించారు. రాయి తగిలి సీఎస్ఓ కు గాయమైనట్లు వెల్లడించారు. ఆయనకు ప్రథమ చికిత్స అందించిన తరువాత యధావిధిగా విధులకు హాజరయ్యారని చెప్పారు. 15 కెమెరాల ఫుటేజ్, మీడియా ఫుటేజ్ ల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగరీ సెక్యూరీటీ ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని బహుళ అంతస్తుల భవనాలపై సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్న క్రాంతి రాణా.. ఇద్దరు ఐపీఎస్ లతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జగ్గయ్యపేట నుంచీ మొత్తం భద్రత ఏర్పాటు చేసామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతోందన్న సీపీ.. పూలు వేయడంలో రాయి లేదా అలాంటిది ఏమైనా పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాగే దాడి జరిగినప్పుడు అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ జనం భావప్రకటనా స్వేచ్ఛ ఉపయోగించుకున్నారని వ్యాఖ్యనించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. సరే బాబుపై తాజా దాడికి సంబంధించి మరో రెండు రోజుల్లో నిజానిజాలు బయటపెడతామని  సీపీ క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు. 

ప్రధాని తెలంగాణ పర్యటన.. కేసీఆర్ మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన?

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మోడీ తెలంగాణ పర్యటన అనగానే అందరూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసి చూస్తున్నారు. ఇటీవలి కాలంలో మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతి సారీ ప్రొటోకాల్ ను సైతం పట్టంచుకోకుండా కేసీఆర్ ఆయనకు ముఖం చాటేశారు. ఇప్పుడు మళ్లీ మరో మారు అదే జరగనుందా అన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధాని నరేద్ర మోడీ ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. ఆ సందర్భంగా ఆయన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.   ఈ సభకు కేసీఆర్ హాజరౌతారా? మోడీతో భేటీ అవుతారా  మోడీని కలుస్తారా?  లేక గతంలో ఎలా అయితే డుమ్మా కొడుతున్నారో అదే విధంగా ఈ సారి కూడా ముఖం చాటేస్తారా  అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.  ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య అగాధం పెరిగిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కేసీఆర్ మోడీ లక్ష్యంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో కేసీఆర్ విమర్శలన్నీ మోడీ లక్ష్యంగానే సాగాయి.   ఈ వ్యవహారంలో ఆయన మీడియా మీట్ లో కూడా నేరుగా మోడీనే నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా ప్రధాని పర్యటన పై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ సంబంధితి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.  

గుజరాత్ లో బీజేపీ హవా కొనసాగుతుందా?

డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించింది. నవంబర్ 12న ఓటింగ్ జరిగే  హిమాచల్ ప్రదేశ్‌తో పాటు డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసారి మాదిరిగానే 2017, 2012లో కూడా గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 182 సీట్లకు గాను 99 సీట్లు గెలుచుకుని 1995 తర్వాత బీజేపీ తన సీట్ల సంఖ్య కనిష్ట స్థాయికి  పడిపో యింది. కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. అయితే గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటికీ దాదాపు 50%(49.05%) ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 41.44% ఓట్లు వచ్చా యి. అక్టోబరు 2001లో నరేంద్ర మోదీ తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అధికారంలో లేకుండా బీజేపీ పోరాడిన తొలి ఎన్నికలు కూడా ఇదే. 2017 నుండి ఒక ముఖ్యమైన మార్పు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉనికిని కలిగి ఉంది, ఇది బీజేపీ , కాంగ్రెస్ రెండింటికీ బలమైన పోటీని ఇస్తుంది, కాంగ్రెస్ ఓట్లను చీల్చుతుందని భావిస్తున్నారు. 2017లో, పెద్ద రెండు మినహా, పోటీలో వాస్తవంగా మరే ఇతర పార్టీ లేదు, స్వతంత్రులు (వీరిలో ముగ్గురు గెలిచారు) ఎన్సీపీ , బీజేపీ కంటే ఎక్కువ ఓట్లను పొందారు, ఇది వరుసగా 1 , 2 స్థానాలను కైవసం చేసుకుంది. భారతీయ ట్రైబల్ పార్టీ, ఏఐఎంఐఎం,  ఎన్సీపీ వంటి కొన్ని చిన్న పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. 2012 తో పోలిస్తే 2017లో బీజేపీ గెలిచిన సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ, వాస్తవానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2012లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ 115 సీట్లు, 47.85 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ సంఖ్య 61 సీట్లు  38.93% ఓట్లు,  ఐదేళ్ల తర్వా త ఆ పార్టీ భారీ జంప్‌ను సూచిస్తుంది, ఎక్కువగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటిదార్ కోటా ఉద్యమ బలంపై. 2012లో కూడా, రెండు పార్టీలకు వాస్తవంగా మూడో పోటీదారు లేరు. 2012 నుండి జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికలు కూడా రాష్ట్రంలో బిజెపికి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తు న్నాయి, 2014లో పార్టీ 60.1% ఓట్లను, 26 సీట్లలో 26 (కాంగ్రెస్‌కు 33.5% ఓట్లు) 63.1% ఓట్లను గెలుచు కుంది. 2019లో మళ్లీ అన్ని సీట్లు (కాంగ్రెస్‌కు 32.6% ఓట్లు వచ్చాయి). 2019 ఎన్నికల్లో ఆప్ ఉనికిని నమోదుచేసుకోలేదు. బిజెపి బలమైన అధికార వ్యతిరేకతను ఎదుర్కొంది, వరుసగా ఆరవ సారి పదవిని ఆశిస్తోంది, విజయ్ రూపానీ మొత్తం ప్రభుత్వాన్ని దాదాపు అనుభవం లేని భూపేంద్ర పటేల్ మంత్రి వర్గంతో భర్తీ చేయడం ఎలా సహాయ పడుతుందనే దానిపై జ్యూరీ ఇంకా తెలియలేదు. 1995లో కేశూభాయ్ పటేల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంకర్‌సింగ్ వాఘేలా తిరుగుబాటు చేసిన నేప థ్యంలో గుజరాత్‌లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాఘేలా తిరుగుబాటు విఫలమై, కేశూభాయ్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, గుజరాత్‌లోని పెద్ద ప్రాంతాలను చదును చేసిన భారీ భూకంపం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శల తర్వాత, 2001లో బీజేపీ హైకమాండ్‌చే ఆయన స్థానంలో మోడీని నియమించారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం,  గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో జరిగిన 2002 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ 182 సీట్లలో 127 (49.8% ఓట్లు) గెలుచుకున్నప్పుడు, రాష్ట్రంపై మోడీ , బీజేపీ పూర్తి నియంత్రణ అనుసరించింది. ఇప్పటి వరకు గుజరాత్‌లో బీజేపీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాంగ్రెస్ 51 స్థానాలకు పడిపోయింది. 2007లో, గోర్ధన్ జడాఫియా వంటి పలువురు సీనియర్ నాయకులు విడిపోయినప్పటికీ, మోడీ నేతృత్వంలోని బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది. 2002 అల్లర్ల సమయంలో జడాఫియా హోం శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. బీజేపీ సంఖ్య కేవలం 117 స్థానాలకు (49.12% ఓట్లు) పడి పోయింది, కాంగ్రెస్ 59కి వ్యతిరేకంగా. 2012 ఎన్నికలలో కూడా బీజేపీ తన ఆధిక్యాన్ని 115 స్థానాలతో నిలబెట్టుకుంది, కాంగ్రెస్ కేవలం రెండు మాత్రమే పెరిగి 61కి చేరుకుంది. 2014లో మోదీ ప్రధానిగా ఢిల్లీకి వెళ్లగా, గుజరాత్ ప్రభుత్వ పగ్గాలు తన సన్నిహితురాలు ఆనందీబెన్ పటేల్‌కు అప్పగించారు. అప్పటి నుండి, రాష్ట్ర నాయకత్వం వరుసగా సిఎం మార్పులతో మోడీ బూట్లు నింపడానికి కష్టపడు తోంది. 2015 కోటా ఆందోళన తర్వాత, ఆనందిబెన్ స్థానంలో విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా నియమించారు - 2017 ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఆ ఎన్నికలలో, బీజేపీ 99కి దిగజారింది. కాంగ్రెస్ 77కి పెరిగింది, కానీ వరుస ఫిరాయింపుల తర్వాత అసెంబ్లీలో ఇప్పుడు 62కి దిగజారింది - ఇది సభలో అత్యల్పంగా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరు ణంలో, పెద్ద నాయకులు ఇంకా బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, ఆప్‌ ప్రతిపక్ష స్థలాన్ని దోచుకోవ డంతో అది విపరీతమైన పోరాటం చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో దూకుడుగా అడుగులు వేస్తున్నందున, నేరుగా మోడీకి వ్యతిరేకంగా పోటీ పడుతుం డగా, మూడవ ఫ్రంట్ కోసం ఇప్పటికే ఆప్‌కి అవకాశం లభించింది. 2017లో ఆప్ ద్వారా బరిలోకి దిగిన మొత్తం 29 మంది అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా మలుపు. అసదు ద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం దృష్టిలో నాల్గవ పార్టీ ఉంది, ఇది తొలిసారిగా గుజరాత్ ఎన్నికల్లో పోరాడు తుంది , ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.

ప్రాణ రక్షణ కోసం చిరుత పోరాటం!

పిల్లైనా సరే తలుపులు మూసి కొడితే తిరగబడుతుంది. అది చిరుతపులి అయితే ఇక చెప్పేదేముంది. తలుపులు మూయక్కర్లే ఒకింత అదిలించినా, బెదిరించినా తిరగబడటం ఖాయం. అదే జరిగింది. కర్నాటకలోని మైసూరులో పొరపాటున ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చేసింది. దానిని చూసిన స్థానికులు రాళ్లు రువ్వారు. అసలే కొత్త ప్రాంతం అప్పటికే భయంతో ఉన్న ఆ చిరుత జనం రాళ్లు రువ్వడంతో  మరింత భయపడింది. తప్పించుకోవడానికి ఆ చిరుత చేసిన ప్రయత్నంలో ఇద్దరిపై దాడి చేసి గాయపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను అటవీ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో వైరల్ అయ్యింది. జనావాసంలోకి వచ్చిన చిరుతపై ఓ భవనంపై ఉన్న వ్యక్తులు రాళ్లురువ్వారు. దీంతో ఆ చిరుత తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు పైకి పరుగుతీసింది. ఆ సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిపై దాడి చేసింది. అతడు గాయపడ్డాడు. ఇది చూసిన మరో వ్యక్తి చిరుతను అదిలించే ప్రయత్నం చేస్తే అతడిపైనా దాడి చేసి గాయపరిచింది. చిరుత తన ప్రాణ రక్షణ కోసం పోరాడిందనీ, దాని తప్పేమీ లేదనీ నందా తన పోస్టులో పేర్కొన్నారు. ఆ తరువాత అటవీ అధికారులు చిరుతను కాపాడి బంధించి తీసుకువెళ్లారు.  

సుప్రీంలో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ.. అమరావతి కేసు అత్యవసర విచారణకు నో

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ సత్వర విచారణ కోరగా సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ  హైకోర్టు మార్చిలో తీర్పు ఇస్తే.. సప్రీం కోర్టులో సెప్టెంబర్  వరకూ సుప్రీంను ఆశ్రయించకుండా.. ఇప్పుడు సత్వర విచారణ అంటారేమిటని నిలదీసింది. అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం వీటిపై సత్వర విచారణ చేయాలని గతంలో ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ ను కోరింది. అయితే నాట్ బిఫోర్ మీ అంటూ ఆయన  విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో   జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.   అమరావతి పిటిషన్లను ఏపీ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్లతో కలిపి విచారణ చేయాలని సీజేఐ ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఈ రెండు అంశాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. దీంతో ఈ విచారణ ఆలస్యమవుతుందని భావించిన ఏపీ సర్కార్ అత్యవసరంగా దీనిపై విచారణ చేయాలని కోరింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసఫ్   మార్చిలో హైకోర్టు అమరావతిపై తీర్పు ఇస్తే సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు.  అత్యవసర విచారణ విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. అమరావతి పిటిషన్లను అధ్యయనం చేయడానికి   కొంత సమయం పడుతుందని న్యాయమూర్తులు అన్నారు తెలిపారు. ఈ దశలో రైతుల తరఫు న్యాయవాది ఫాలీ నారిమన్ బ్రీఫ్ నోట్ ఇస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం 14న విచారణను వాయిదా వేసింది.

నందిగామ పర్యటనలో బాబు లక్ష్యంగా రాళ్ల దాడి

రెండు రెళ్ళు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ప్రభుత్వ ప్రజా వ్యతరేక చర్యలను ప్రశ్నించే నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడటమే ఏపీలో పాలన అయిపోయింది. అరాచక పాలనకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్రంలో గూండాయిజం రాజ్యమేలుతోంది. అధికార పార్టీని విమర్శించే వారెవరూ రోడ్ల మీద తిరగడానికి వీల్లేదన్నట్లుగా పాలన సాగుతోంది. పోలీసుల డ్యూటీ విపక్ష నాయకులు, కార్యకర్తల ఇళ్ల పై దాడులు చేసి అరెస్టు చేయడానికే పరిమితమైంది. ప్రభుత్వాన్ని వ్యతరేకించేవారెవరూ రాష్ట్రంలో బతకడానికి వీల్లేదన్నంతగా రాజ్య హింస ప్రబలిపోయింది. విపక్ష నేతకూ భద్రత లేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. తెలుగుదేశం అదినేత నారా చంద్రబాబునాయుడు   నందిగామ జిల్లాలో పర్యటిస్తూంటే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఆ సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నందిగామలో చంద్రబాబు పర్యటనకు జనం భారీగా వచ్చారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అందుకోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లుగా ఆ వెంటనే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారి గాయపడ్డారు.  విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఆ వెంటనే రాళ్ల దాడి జరగడం కాకతాళీయమని ఎవరూ భావించడం లేదు. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందన్న టీడీపీ నేతలవి కేవలం ఆరోపణలు కాదనే జనం అంటున్నారు.  ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మొత్తం పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ రౌడీలకు భయపడే ప్రశ్నే లేదన్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ఇదే విధంగా వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగే వారా అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల జగన్ కు ఇసుమంతైనా గౌరవం, నమ్మకం లేదని చంద్రబాబు విమర్శించారు. పోలీసులు   ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని.. భద్రత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. 

సింహయాజి స్వామి అలియాస్ అశోక్ ఒక ఫ్రాడ్..!

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు ఒక్క తెలంగాణ రాష్ట్రాంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలు, పదవులు, కాంట్రాక్టులు ఇవ్వ జూపారనీ, ఇందు కోసం డీల్ కుదుర్చుకునేందుకు అడ్వాన్స్ సొమ్ములతో మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు బీజేపీ దూతలు వచ్చి బేరసారాలాడారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ వీడియోలను కూడా విడుదల చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా బీజేపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందని విమర్శలు గుప్పిస్తోంది. అయితే టీఆర్ఎస్ బీజేపీ దూతలని చెబుతున్న ఆ ముగ్గురిలో ఒకరు సింహయాజ స్వామి. ఆయన నిజంగా స్వామీజీయేనా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన గత, వర్తమానాలను పరిశీలిస్తే ఆయన వాస్తవంగా స్వామీజీ కాదనీ, ఆయనకు వెనుక పెద్ద నేర చరిత్రే ఉందని తెలుస్తోంది. స్వయంగా సింహయాజి స్వామికి  స్వయాన పెదనాన్న ఈ సింహయాజి స్వామి బాగోతం అంతా చెప్పారు. చాలా చిన్న వయస్సులోనే సింహయాజి స్వామిని రమణారావు అనే వ్యక్తి దత్తతకు తీసుకున్నారు. సింహయాజి స్వామి అసలు పేరు అశోక్.. అన్నమయ్య జిల్లా అయ్యవారి పల్లి ఆయన స్వస్థలం. అయితే పదేళ్ల కిందటే అశోక్ అలియాస్ సింహయాజి స్వామి స్వగ్రామం వదిలి తిరుపతి వెళ్లిపోయారు. ఇంటర్ వరకూ చదివిని సింహయాజి స్వామి ఒక ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పని చేశారు. ఆ సమయంలోనే స్వగ్రామానికి వచ్చి అక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని వెళ్లిపోయారు.  ఆ తరువాత దాదాపు ఏడెనిమేళ్ల కిందట ఆయన స్వామీజీ అవతారం ఎత్తి పేరును సింహయాజి స్వామిగా మార్చుకున్నారు. ఇందుకు ఆయన చెన్నైకి చెందిన చతుర్వేది స్వామిని ఆశ్రయించి పీఠాన్ని స్థాపించి పీఠాధి పతి అయ్యారు. అయితే ఈ సిహయాజి స్వామి పీఠం ఏమిటో.. అక్కడేం చేస్తారో ఎవరికీ అర్ధం కాదు. ఒక ఇంటిని చూపి అదే పీఠం అని చెబుతారు. ఆ పీఠానికి సింహయాజ స్వామి ఎప్పుడో కానీ అదీ అర్దరాత్రి వేళ మాత్రమే వస్తుంటారని సాయంత్రం చెబుతారు. ఇక దేవగుడి పల్లిలో వెయ్యేళ్ల నాటి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తానంటూ అందరినీ నమ్మించారు. కోట్ల రూపాయల వ్యయానికి కూడా సిద్ధమేనంటూ నమ్మబలికే వారు. అయితే పురాతన ఆలయ పునర్నిర్మాణం పేర గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక సారి అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుంటే జనం సింహయాజి స్వామిని తరిమికొట్టారు. ఆ గుడి ఆర్కియాలజీ శాఖకు సంబంధించిన గుడి కావడంతో రాయచోటికి చెందిన న్యాయవాది రాజేశ్వరి కుమార్తె ఆర్కియాలజీ శాఖకు ఫిర్యాదు చేయడంతో సింహయాజి స్వామి ఆగడాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇక సింహయాజి స్విమి అలియాస్ అశోక్ కు భార్య,  ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో కుమారుడు మానసిక వికలాంగుడు. భార్యా  పిల్లలను పట్టించుకోకుండా తిరిగే సింహయాజి స్వామి ఒక ఫ్రాడ్ అని స్వయానా ఆయన పెదనాన్నే చెప్పారు. తిరుపతిలో ఉండి సింహయాజి స్వామి ఏం చేశాడో ఎవరికీ తెలియదని ఆయన పేర్కొన్నారు. అదో రహస్యం అన్నారు. ఎలాగోలా పీఠాధిపతి అయ్యి నామాలు పెట్టుకుని పూజలూ, యాగాలూ చేస్తూ వచ్చాడని సింహయాజి స్వామి పెదనాన్ని చెప్పారు. ఏం చేస్తాడో, ఏక్కడ తిరుగుతాడో తెలియదు. ఎలా బతుకుతున్నాడో తెలియదని సింహయాజ స్వామి పెదనాన్న చెప్పారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న సింహయాజ స్వామి ఎలా బీజేపీ తరఫున ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు దూతగా మారాడో అర్ధం కాదని అంటున్నారు. కాగా సింహయాజస్వామికి ఎమ్మెల్యే పైలట్ రెడ్డి భక్తుడని తరచూ కలుస్తుంటారని అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎవరు ఎవరి తరఫున ఉన్నా రంగంలో ఉన్నది మాత్రం క్రిమినల్స్ అని సామాన్యులు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ఆయనకు బీజేపీలోని ఒక అగ్రనేతతో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతుంటే.. బీజేపీ వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయన భక్తుడని చెబుతున్నారు. నిజానిజాలెలా ఉన్నా దేశాన్ని కుదిపేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఒక ఫ్రాడ్ కీలక పాత్ర వహించడమే కొసమెరుపు.

తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్ణానేశ్వర్

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఇప్పటి వరకూ   ఆ స్థానంలో ఉన్న   బక్కిని నరసింహుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో కాసాని జ్ణానేశ్వర్ ఇటీవలే తెలుగుదేశం గూటికి చేరిన సంగతి విదితమే.  బీసీ నాయకుడిగా గట్టి పట్టున్న నాయకుడిగా కాసానికి గుర్తింపు ఉంది. గత కొంత కాలంగా కాసాని రాజకీయంగా క్రియాశీలంగా లేకపోయినా.. ముదిరాజ్ సామానిక వర్గానికి చెందిన కాసానికి బీసీలలో గట్టి పట్టు ఉందని అంటారు.  2018 ఎన్నికలలో ఆయన సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అబ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. అంతకు ముందు ఆయన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పని చేశారు. అయితే ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ వంతు ప్రయత్నాలు చేశాయంటేనా కాసాని ప్రాముఖ్యత అర్ధమౌతుంది.  ఇటీవల ఆయనను హరీష్ రావు కలిసి చర్చించినట్లు చెబుతారు. అలాగే బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కూడా జ్ణానేశ్వర్ కు కలిసి కమలం గూటికి రావలసిందిగా కోరారు. అయితే జ్ణానేశ్వర్ మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపి చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయనను చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించారు. 

షర్మిల వాంగ్మూలం.. జగన్ చిందులు.. విజయమ్మ ఇబ్బందులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం తాడేపల్లి ప్యాలెస్‌లో తీవ్ర ప్రకంపనలకు కారణమైందంటున్నారు. దీంతో షర్మిల ఎపిసోడ్‌పై  జగన్.. నేరుగా తన తల్లీ, వైసీపీ మాజీ అధ్యక్షురాలు   విజయమ్మకు ఫోన్ చేసి.. వైయస్ షర్మిల వ్యవహారశైలి పట్ల మండిపడినట్లు తెలుస్తోంది. వద్దు వద్దంటే.. తెలంగాణ వెళ్లి పార్టీ స్థాపించడంతోపాటు.. ఈ మూడున్నరేళ్లుగా చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా ఫోన్‌లో జగన్ ఏకరువు పెట్టారని లోటస్ పాండ్‌లోని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై వైయస్ విజయమ్మ.. మౌనంగానే విని.. కామ్‌గా ఉండిపోయారని లోటస్ పాండ్‌లోని నేతలు అంటున్నారు. అయితే  జగన్.. షర్మిలల మధ్య ఏర్పడిన దూరం.. తగ్గాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని విజయమ్మ... తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు   చెబుతున్నారు. వివేకా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట చేసిన వ్యాఖ్యలే... తాజాగా   షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని.. అలాగే తన తండ్రి హత్య కేసులో సోదరుడు సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరి పట్ల.. వై వివేకా కుమార్తె  సునీత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించి.. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారని.. అలాంటి వేళ  షర్మిల ఇలా వాంగ్మూలం ఇవ్వడాన్ని ఆమె సోదరుడు,ఏపీ సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. షర్మిల వాంగ్మూలం అంటూ మీడియాలో వచ్చిన వార్తలను ప్రతిపక్ష టీడీపీ ఓ ఆస్త్రంగా మలుచుకుని రచ్చ రచ్చ చేసి పెడుతోందని.. ఇది జగన్ పార్టీకి గట్టి దెబ్బేనని కూడా అంటున్నారు. మరో వైపు ఉమ్మడి కడప జిల్లాలో   వివేకా హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారు... ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినా ఎందుకు ముందుకు సాగడం లేదనే అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే  వచ్చే ఏన్నికల్లో కూడా విజయం సాధించి మరో సారి ఏపీలో అధికార పగ్గాలు చేపట్టాలన్న జగన్  ఆకాంక్షలకు షర్మిల కారణంగా విఘాతం కలుగడం తథ్యమని రాజకీయ పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.