ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే!
posted on Nov 2, 2022 @ 1:45PM
ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 11,12 తేదీలలో ఆయన విశాఖలో పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 11వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ ఆయనకు వి మానాశ్రయం వద్ద స్వాగతం పలుకుతారు.
ఆ రోజు విశాఖలోనే మోడీ బస చేస్తారు. మరుసటి రోజు అంటే నవంబర్ 12న ఆంధ్రావర్సీటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే తన విశాఖ పర్యటనలో మోడీ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ.400 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
అలాగే ఈస్ట్ కోస్ట్ జోన్ పాలనా భవన సముదాయానికి శంకుస్థ3ాపన చేస్తారు. అలాగే వడ్లపూడిలో రూ.260 కోట్లతో చేపట్టిన వ్యాగన్ వర్క్ షాప్,, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పాలనా భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు. ఇక చేపల చెరువు నవీకరణ ప్రాజెక్టు, పోర్టు రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఇలా ఉండగా మోడీ సభ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులతో కలిసి బుధవారం (నవంబర్ 2)పర్యవేక్షించారు.