పాదయాత్రలో రాహుల్ పరుగో..పరుగు...!
ఎంతో వేగంగా పరిగెట్టడం ఆ పోటీల్లో గెలవడం అనుకున్నంత సులభం కాదు. మన స్ప్రింటర్లలో అమియా కుమార్, గురువీందర్ సింగ్ జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు వాళ్లు కూడా అమితాశ్చర్యంతో ఓర్నీ ఈయనున్న పోటీలో పాల్గొనలేదే అనుకుంటున్నారేమో. జాతీయ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కుమారుడు, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఊహించని విధంగా స్ప్రింటర్ రూపం ఎత్తారు. దేశంలో చాలాభాగం మొన్నటి దాకా భారత్ జోడో యాత్ర చేసి అందులో భాగంగానే తెలంగాణా గొల్లపల్లి వచ్చిన రాహుల్ గాంధీ అందర్నీ పలకరిస్తూ హఠాత్తుగా పరుగుపోటీకి సిద్ధ మ య్యారు. చిత్రమేమంటే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓడిపోయారు.
దేశంలో జాతీయ క్రీడల్లో అమ్లా బోర్గాన్, అమియా మాలిక్, ధ్యుతీ చంద్ వంటివారి వేగాన్ని చూసినవారు, రాజకీయ నాయకుల్లో యువ కిశోరంలా మంగళవారం రాహుల్ గాంధీ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. భారత్ జోడో యాత్ర గొల్లపల్లికి చేరుకుంది. రాహుల్ గాంధీ కి అందరూ ఘన స్వాగతం పలికారు. అంద ర్నీ అమితోత్సా హంతో పలకరిస్తూ, అస్సలు అలసటే కనపడకుండా నడుస్తూ అందర్నీ తన వెంట పరుగులాంటి నడక నడిచేలా చేస్తుంటే యువకులు, నాయకులు ఆశ్చర్యంలో అలా ఆయన్నే చూస్తుండిపోయారు.
హఠాత్తుగా పాదయాత్ర కాస్తా పరుగు పోటీగా మారిపోయింది. అయితే ఇందులో రాహుల్ తో రేవంత్ మాత్రమే పోటీ పడ్డారు. అలా రూల్ పెట్టుకున్నారేమో అనిపించింది. పాదయాత్ర లో రాహుల్ ని కలివడానికి పిల్లలు రావడంతో ఆయన మరింత కుర్రాడయిపోయి పరుగు తీయడం మొదలయిది.. అంతే రేవంత్ కి ఆయనతో పోటీపడాల్సి వచ్చింది. కానీ రేవంత్ వల్ల కాలేదు. చిత్రమేమంటే ఇప్పటికే చాలా దూరం భారత్ జోడో యాత్ర చేస్తూన్నప్పటికీ కుర్రాడిలానే ద్విగుణీకృత ఉత్సాహంతో రాహుల్ పరుగులు తీయడం. పోలీసులు, రేవంత్, కుర్రాళ్లూ , పిల్లలూ అంతా వెనకబడిపోయారు. ఈ పోటీలో తాము లేకపోయామని మాజీ స్స్రింటర్లు అనుకునే ఉంటారు.
పార్టీ నాయకత్వం బాధ్యతను తాను స్వీకరించలేదు కానీ ప్రజలను పార్టీ వేపు తిప్పేందుకు, ఈ తరం వారిని పార్టీలోకి ఆకట్టుకోవడానికి, కేంద్రంతో పోరుకీ రాహుల్ గాంధీలో ఆవేశం, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదన్నది ఈ పరుగు స్పష్టం చేసింది. అయితే రాహుల్ తన బాస్ కనుక ఆయన్ను గెలిపించడం ధర్మమనే భక్తి భావంతో రేవంత్ కావాలనే వెనుకడుగు వేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రాహుల్ పరుగు పందెం వీడియో చూసిన, చూస్తున్నవారంతా అసలు పార్టీ పదవిని ఈయనే తీసుకోవాల్సింది అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఖర్గే కంటే పార్టీలోకి యువతను రాహుల్ రాబట్టగలడన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబేతరులకు యివ్వాలన్న నిర్ణయం తప్పని పరిస్థితుల్లో తీసుకోవడం వల్ల ఖర్గే కు పార్టీ పగ్గాలు అందాయి. కానీ ఇటు భారత్ జోడో యాత్ర చేపడుతూ రాహుల్ గాంధీ తక్కువేమీ తినడం లేదు. రోజు రోజుకూ యువకునిగా మారుతూ, మాటల్లో, ప్రసంగాల్లో, యువతను ఆకట్టుకోవడంలో తన శైలితో మరింత ముందుకు వెళుతున్నారు. ఆయన్ను గతంలో చూసినవారు, గమనించినవారు ఆయనలో వచ్చిన మార్పు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.