ఉప ఎన్నికకు ముస్తాబయిన మునుగోడు
posted on Nov 2, 2022 @ 11:47AM
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమయింది. మునుగోడు నియోజకవర్గం పరిధిలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 5,686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పటికీ, కేవలం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 298 ఉన్నాయ న్నారు. అర్బన్‌లో 35, రూరల్‌లో 263 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి వికాస్ రాజ్ తెలిపారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిం చామని, మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా ఓటరు స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. తొలిసారి కొత్త నమూనా ఓటరు కార్డులను పంపిణీ చేశామని తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుందని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో మెడికల్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. 3,366 పోలీసు సిబ్బందితో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గంపరిధిలో వంద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామ న్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో రూ. 6.80 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. 4500 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు.
బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తా మన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా గంట గంటకు ఓటింగ్ శాతాన్ని తెలియజేస్తామన్నారు. రేపు సాయం త్రం 6 తర్వాత బల్క్మేసేజ్‌లు వస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. బయట నుంచి వచ్చినవారు నియోజకవర్గంలో ఉండకూడదు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వివరణను ఈసీకి నివేదించా మని వికాస్ రాజ్ మీడియాకు తెలిపారు.
పోలింగ్ కోసం 2,500 మంది స్టేట్ పోలీసులు, 15 కంపెనీల బలగాల సెంట్రల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మునుగోడులో పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లకు కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడీలు పంపిణీ చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, యాభై ఫ్లైయింగ్ స్కాడ్ టీంలు, 199 మైక్రో అబ్జర్వర్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. 3,366 పోలింగ్ సిబ్బందిని నియమించారు. 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆదివారం (6వ తేదీ) కౌంటింగ్ జరగనుంది.