టీ20 కప్ లో ఎట్టకేలకు నెదర్లాండ్స్ కి ఒక విజయం
posted on Nov 2, 2022 @ 2:07PM
ఆస్ట్రేలియాలోజరుగుతున్న టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 విభాగంలో బుధవారం మొదటి మ్యాచ్ లో జింబాబ్వే పై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్ కి సూపర్ 12లో ఇదే తొలి విజయం. జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జింబాబ్వే ఓడనప్పటికీ సెమీస్ అవకాశాలు న్నాయి. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి బయట పడింది.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో దౌద్ ఒక్కడే చక్కటి బ్యాటింగ్ ప్రదర్శించి అార్ధ సెంచరీ చేశాడు. కూపర్ 32 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లు ఎన్ గరవా 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ముజరాబాని 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. అడెలైడ్ ఓవెల్ లో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన ఆనం దం మాత్రం నెదర్లాండ్స్ కి ఎప్పటికీ ఉంటుంది. అదీ టీ20 ప్రపంచకప్ లో సాధించిన విజయం మరి. ముఖ్యంగా సీమర్ పాల్ మీకెరాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్ లో కేవలం సికందర్ రజా నే తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించగలిగాడు. మిగతా వారంతా పేలవంగా ఆడటంతో జట్టు పెద్ద స్కోర్ చేయలేకపోయింది.
కాగా బుధవారం రెండో మ్యాచ్ లో భారత్ తో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫలితం మీదనే జింబాబ్వే టోర్నీలో నిలిచే ఆశలు ఆధారపడ్డాయి. వర్ష సూచన ఉందన్న వార్తలు వినవచ్చినప్పటికీ అడెలైడ్ లో వీరి మ్యాచ్ కి ఆటంకం కలిగించలేదు. కానీ పిచ్ పేసర్లకు బాగా అనుకూలించడంతో నెదర్లాండ్ స్వింగ్ పేసర్లు విజృంభించారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దాడి చేయవచ్చని అనుమానం ఉన్నప్ప టికీ, జింబాబ్వే కెప్టెన్ ముందుగా బ్యాట్ చేయడానికే ఆసక్తి చూపడం గమనార్హం. ముందుగా బౌలింగ్ ని తీసుకుని ఉంటే తర్వాత బ్యాటింగ్ సమయంలో నిలదొక్కుకునే అవకాశాలుండేవి. పొరపాటు అంచనా తో బ్యాటింగ్ కి దిగిన జింబాబ్వే పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయ గలిగింది. ఆవిధంగా బ్యాటర్లు ఎవ్వరూ ఛెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు సాధించలేకపోయారు. గెలవా ల్సిన మ్యాచ్ ఆ విధంగా చేజారింది. నెదర్లాండ్స్ కి ఇలా ఒక్క విజయం అందించి వారిని సంతోష పెట్టారనే అనాలి.