మోదీజీ...మహిళా శక్తి అంటే ఇదేనా?
posted on Nov 5, 2022 @ 3:18PM
పొద్దుటే అమ్మాయి ఇంటికి రాగానే తల్లిదండ్రులు చెప్పాపెట్టక ఇలా వచ్చేసేవేమిటే.. ప్రశ్నల మీద ప్రశ్నలు.. కాఫీ తాగి తీరిగ్గా మా ఆయన తిట్టాడు వచ్చేశానంది అమ్మాయి.. అంతే అల్లుడి ఇంటి మీదకు దండయాత్రకి వెళ్లినట్టు వెళ్లారు. తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని పక్కింటివారూ తోడయ్యారు. అం దర్నీ చూసి ఖంగారుపడ్డాడు సదరు అల్లుడుగారు. తినకుండా కూచుంది తిట్టానన్నా డు.. అంతేగదా..అని నవ్వుకున్నారు. మొన్నామధ్య ఒకతను పెళ్లం మీద కోపగించుకుని ఇంట్లోంచి వెళి పోయాడు. ఆ సంగతి విని అతని తల్లితో పాటు ఊరంతా నవ్వుకుంది. మొగాడివి ఏడుస్తూ వచ్చే డమేమిటని హేళనా చేశారంతా. మగవాడు బాధపడితే ఎందుకు నమ్మరో తెలీదు గాని, ఇటీవలి కాలంలో భార్యాబాధితులు కూడా తయారయ్యారు. కానీ కోర్టు దాకా ఎవరూ వెళ్లరు. పోనీ వెళ్లినా కోర్టంతా బామ్మగారిలా నవ్వుతుంతే.
కర్ణాటక బెంగుళూరుకి చెందిన యదునందన్ అనే వ్యక్తిది దాదాపు ఇదే అవస్థ. అతని బాధలు అంా యింతా కాదట. డబ్బుకి, స్థిరాస్తులకు ఇబ్బంది పెట్టడం కంటే ఎక్కువట. తిట్టడం, కొట్టడం స్థాయి దాటి ఏకంగా కత్తితో దాడి చేసిందట అతని భార్య. అరచేయి కోసుకుపోయిందిట. రోజూ తనను ఏదో ఒక కారణంతో చిత్రహింసలకు గురిచేస్తోందని వాపోతు న్నాడు. ఎవ్వరూ తనకు మద్దతుగా మాట్లాడలేక పోతున్నారు. అది కుటుంబ సమస్య అని, భార్యాభర్తలు మీరే తేల్చుకోవాలని చెప్పి తప్పించుకుం టున్నారు. ఇదే భార్య మీద చిన్న మాటతో రెచ్చిపోయినా ఊరంతా మీదపడే కాలంలో ఇలాంటి మగవారికి ఏమాత్రం మద్దతు లభించదన్నది యదునందన్ గోడు తెలియజేస్తోంది.
ఇక లాభం లేదని యదునందన్ ఏకంగా ప్రధాని మోదీ కార్యాలయానికి ట్వీట్ చేశాడు.. తనను భార్య నుంచి కాపాడ మని. అసలే దేశ రాజకీయాల్లో తలమునకలయిన ప్రధానికి ఇలాంటి భార్యాబాధితుల గోడు సీరియస్ గా పట్టించుకుంటారా అను మానమే అంటున్నారు యదునందన్ సంగతి తెలిసినవారు. పైగా తనలాగా ఎందరో భార్యాబాధితులు ఉన్నారని వారిని రక్షించే బాధ్యత తీసుకోవాలన్నాడు. ఆ పురుష పుంగవుడు చేసిన ట్వీట్, పీఎంఓనూ ఆలోచనలో పడవేసిందట. అంతేకాదు, మీరు చెప్పే నారీ శక్తి అంటే ఇదేనా? అని ఆవేశపడి.. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి?ఆమెపై గృహహింస కేసు పెట్టవచ్చా? లేదా?అని అమాయకంగా పీఎంఓనే సలహా అడిగాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి, సాటి పురుష పుంగవుల సానుభూతిని టన్నుల కొద్దీ దోచేస్తోంది. ఇక యదునందన్ భావీజీవితం పీఎంఓ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడిందనాలేమో. అసలే రాజకీ యాలతో సతమతమవుతున్న ప్రధాని, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, సమాచారాలతో బిజీగా ఉన్న పీఎంఓ మరి యదునందన్ కు మద్దతునిస్తుందో లేదో చూడాలి.