గోరంట్ల మాధవ్ మళ్లీ దొరికిపోయాడు!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. ఈ సారి రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఆయన  ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని.. పోని ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని  ఆ ఇంటి ఓనర్ మల్లిఖార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   36 నెలలుగా అంటే మూడేళ్లుగాఇంటి అద్దె చెల్లించడంలేదనీ, అది దాదాపు36 లక్షల రూపాయిలనీ, అలాగే దాదాపు రెండు లక్షల రూపాయలకు పైగా విద్యుత్ బకాయి ఉందని చెల్లించలేదని.. అలాగే కరెంట్ బిల్లు దాదాపు రెండు లక్షల రూపాయిలకు పైగా బకాయి ఉందని..  ఇంటి ఓనర్ మల్లికార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిసెంబర్ లో తమ ఇంట్లో వివాహ వేడుక ఉందని.. ఈ నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలని కోరగా.. తన సిబ్బందితో గోరంట్ల మాధవ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన... ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.  ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ నివాసం ఎదుట.. ఇంటి ఓనర్ మల్లిఖార్జునరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగేందుకు సమాయత్తమవుతోండగా.. ఈ విషయం తెలుసుకోన్న ఎంపీ గోరంట్ల .. వెంటనే పట్టణంలోని వివిధ పోలీసు అధికారులను రంగంలోకి దింపి.. వారి వద్దకు రాయబారానికి పంపి చర్చించారని అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంటి ఓనర్ మల్లికార్జునరెడ్డి ఇళ్లు ఖాళీ చేయాల్సిందే, అద్దె చెల్లించాల్సిందే, విద్యుత్ బకాయిలు కట్టాల్సిందే అని కచ్చితంగా చెప్పడంతో   చర్చలు అసంపూర్తిగా మిగిలాయని తెలుస్తోంది.  మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియో తనది కాదంటూ ఆయన మీడియా సాక్షిగా స్పష్టం చేశారు. కానీ ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై పలువురు నేతలు..  లోక్‌సభ స్పీకర్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్, ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఆ వీడియో నిజమైనదా? కాదా? అనే అంశాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చాలంటూ మహిళా కమిషన్ జిల్లా ఎస్పీకి ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ సైలెంట్ కావడంతో.. ఈ వ్యవహారం మరుగున పడిపోయింది.   తాజాగా మళ్లీ ఎంపీ గోరంట్ల మాధవ్ ..తనదైన శైలీలో ఇంటి ఓనర్‌పై బెదిరింపులకు దిగడం.. హిందూపురం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది   గతంలో సీఐగా విధులు నిర్వహించిన గోరంట్ల మాధవ్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2019 ఎన్నికలకు మందు  జగన్ పార్టీలో చేరారు. ఆయనకు వెంటనే హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు  జగన్. ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొంది... లోక్‌సభలో అడుగు పెట్టారు. అయితే గతంలో ఆయన పోలీస్ శాఖలో విధులు నిర్వహించినప్పుడు.. పలు వివాదాల్లో చిక్కుకున్నారు.... ఆ క్రమంలో ఆయనపై ఆరోపణలు  వెల్లువెత్తాయనే ఓ టాక్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేటికీ ఉంది.  అయితే గతంలో గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంశం రచ్చ రచ్చ కావడంతో ఆయనపై వేటు వేసేందుకు జగన్ సిద్దమయ్యరు. కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనపై వేటు వేస్తే.. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు వెనకడుగు వేశారని అప్పట్లో బాగా వినిపించింది. అదీకాక.. గోరంట్ల మాధవ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య  కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీగా ఉండటం,  ఆ ఓట్లే.  ఆయా జిల్లాల్లోని అభ్యర్థుల గెలుపొటములను  చేస్తాయన్న భయంతోనే గోరంట్ల మాధవ్ పై చర్యలకు జగన్ వెనకడుగు వేసారని వైసీపీ శ్రేణులే అప్పట్లో చెప్పాయి. ఇప్పుడు మళ్లీ ఇంటె అద్దె ఎగ్గొట్టడమే కాకుండా, అద్దె అడిగిన ఇంటి ఓనర్ పై బెదరింపులకు దిగి వార్తల్లోకెక్కడంతో జగన్ ఏం చర్య తీసుకుంటారన్న చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. 

అమెలా.. నా చెల్లి

ఐదారేళ్ల వయసు పిల్లలు కొత్తవారు కనపడితే, పలకరిస్తే కాస్తంత భయపడతారు. పేరు అడిగినా తల్లిచాటుకి వెళ్లి గొణిగినట్టు చెప్తారు. చాలా కొద్దిమందే ధైర్యంగా మాట్లాడుతూంటారు. ఇంట్లో ఎవ్వరూ లేనపుడు లేదా తల్లి దగ్గరో అరిచి గోల చేసే పిల్లలు ఎప్పుడూ అంతే. స్కూల్లో వేసినా  ఒకరిద్దరు మంచి స్నేహంగా ఉండేవరకూ బెరుగ్గానే ఉంటారు. కానీ అమాండా అలా కాదు.. చాలా మంది ముందు మైక్ పట్టుకుని చక్కగా మాట్లాడింది. అదీ తన చిట్టి చెల్లి అమెలా గురించి. అమాండా కి మొన్నీమధ్యనే ఈ చిట్టి చెల్లి పుట్టింది. బంధువులు, స్నేహితులు వారి పిల్లలతో సహా వాళ్లింటికి వచ్చారు.  చిన్నారిని అందరికీ పరిచయం చేయాల్సిన సమయం వచ్చింది. అమాందా తల్లిదండ్రులు చిన్నారిని ఒళ్లో కూచోబెట్టుకున్నారు. ఒక పెద్దాయన హఠాత్తుగా ఇపుడు అమాందా మాట్లాడుతుంది అన్నాడు. అంతే అందరూ ఆశ్చర్యపోయారు. బడికే భయపడి వెళుతోంది.. ఏం మాట్లాడుతుందబ్బా అనుకున్నారు. చక్కగా బుట్టబొమ్మలా ముస్తాబయిన అమాందా మైకు అందుకుంది. అందరినీ చూసి అందరికీ నమస్కారం. మీరంతా మా యింటికి వచ్చినందుకు సంతోషం. నా చెల్లెలు ..అమెలా.. మొన్ననే పుట్టింది.. అది నా చెల్లెలు. నేను అక్కనయ్యాను.. నేనే ఇక ఇంటి పెద్దదాన్ని.. చెల్లి ఏడ్చినా అమ్మ కంటే నేనే పరుగున వెళతాను... అమెలా  నన్ను గుర్తించి నవ్వింది...మేం అక్కాచెల్లెళ్లం..అండ్ ఫ్రెండ్స్ కూడా.   ఇంకేమీ చెప్పాలో తడుముకుంది.. వచ్చిన అతిథులందరూ లేచి చప్పట్లు కొట్టారు. అమాండా మైక్ పడేసి తల్లి , చెల్లి దగ్గరికి పరిగెట్టింది.  తెలిసినవారు వీడియో తీసారు. నెటిజన్లకు విందు చేస్తోంది. మరో పదేళ్ల తర్వాత అక్కాచెల్లెళ్లకు మరింత విందు అవుతుంది.

అసదుద్దీన్ పై రాళ్ల దాడి.. మోడీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానం

అసదుద్దీన్ లక్ష్యంగా మరోసారి దాడి జరిగింది. ఈ సారి ఈ దాడి సూరత్ సమీపంలో సూరత్ సమీపంలో జరిగింది. గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ అహ్మదాబాద్ నుంచి సూరత్ వెళుతుండగా ఈ దాడి జరిగింది. అసదుద్దీన్ ఒవైసీ ఆహ్మదాబాద్ నుంచి సూరత్ కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తుండగా, సూరత్ కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఆయన కూర్చుని ఉన్న బోగీ లక్ష్యంగా దుండగులు రాళ్ల దాడికి పాలప్పడ్డారు. ఈ దాడిలో ఆయన ప్రయాణిస్తున్న బోగీ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.  ఈ దాడిని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ ధృవీకరిస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. కాగా అసదుద్దీన్ పై దాడి జరగడం ఇదే తొలి సారి కాదు. రెండేళ్ల కిందట ఆయనపై యూపీలో దాడి జరిగింది. యూపీలోని మీరట్ లో ఆయన ప్రయాణిస్తున్న కారుపై ఫిబ్రవరి 3, 2020న దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. అప్పుడు కాల్పులు జరిగిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా తాజాగా ఆయన ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిని ఎంఐఎం ఖండించింది. ఇటువంటి దాడులతో తమను బయపెట్టలేరని ఎంఐఎం నేత  వారిస్ పఠాన్ పేర్కొన్నారు. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా ఉందనడానికి ఈ దాడే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే నెల రెండు విడతలలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. గుజరాత్ లో ఎంఐఎం బరిలోకి దిగుతున్నది. రాష్ట్రంలో కనీసం పాతిక నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారని అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఆయన అహ్మదాబాద్ నుంచి సూరత్ వెళుతుండగా ఈ దాడి జరిగింది. 

వైద్య విద్యార్ధుల బాండ్ పాలసీ సబబేనా?

వైద్య విద్య ను అభ్యసించే వైద్య విద్యార్ధులపై ముఖ్యంగా గ్రేడ్యుయేట్, పోస్ట్ గ్రేడ్యు యేట్ విద్యార్ధులపై బాండ్ పాలసీ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బాండ్ పాలసీ ప్రకారం అవసరమైన ఆయా రాష్ట్రాల లోని ఆసుపత్రులు ప్రాంతాలాలో కొంత కాలంవరకు వైద్య సేవలు తప్పనిసరి చేస్తూ నిబందనలు రూపొందిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఈ నిబంధనను అతిక్రమిస్తే, అయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్య కళాశాలలు నిర్ణయించిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబందనలో పేర్కొన్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ డాక్టర్లకు బాండ్ పాలసీని అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తోంది. బాండ్ పాలసీని వ్యతిరేకిస్తూ దూరంగా వారి పట్ల కఠిన చర్యలు చేపట్టాలని లేదా వారివద్ద పరిహారం కట్టే విధంగా చర్యలు చేపట్టే విధానం జాతీయ మెడికల్ కమీషన్ బాండ్ రూపకల్పన లో ప్రభుత్వానికి విధి విధానా లను సూచించిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మేరకు నిర్దేశించే కాలానికి అండర్ గ్రేడ్యుయెట్, పోస్ట్ గ్రేడ్యుయెట్, సమయం తరువాత పని చేయాల్సి ఉంటుంది.     ఆయా రాష్ట్రాలు బాండ్ పాలసీ ని 2౦19 లోనే సుప్రీం కోర్ట్ నిలుపుదల చేసింది. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఖచ్చితమైన కట్టినమైన నిబందనలు అమలు  విధించడా న్ని గుర్తించింది. కేంద్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక యునిఫాం ఒకే విదివిధానాన్ని రూపొందించాలని సూచించింది. డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలాలో  తప్పని సరిగా సేవలు  చేయాలని అధికారులు వెల్లడించారు. 2౦19 నిబందనల ప్రకారం బాండ్ చట్టంలేదా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 19 56 నిబందనల ప్రకారం రూపొందిన్చాలా అన్నది సందిగ్ధం లో ఉంది. ఆయారాష్ట్రాల పరిదిలో వైద్యసేవలు అందించాల్సి ఉన్నందున ఖాళీ ఉన్నస్థానాలను తక్షణం భర్తీ చేయడం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో  నియమించాల్సి ఉన్నందున సి హెచ్ సి. డి హెచ్ సి లు, పి హెచ్ సి లు ఆరోగ్యకేంద్రాలాలో నియమించాలని నిర్ణయిం చారు. బాండ్ నిబంధనల ప్రకారం జరిమానా 5 లక్షలు రూపాయలు గోవా, రాజస్థాన్ లలో అమలులో ఉందని. ఉత్తరాఖండ్ లో 1 కోటి రూపాయలు. కేరళలో  ఉత్తరాంచల్ లో మహారాష్ట్రాలలో పి జి సూపర్ స్పెషాలిటి2.25 కోట్లు సూచించింది. అయితే, పునఃసమీక్ష తరువాతే బాండ్ అమలు చేయాలని నిర్ణయించాయి. సుప్రీం మార్గనిరేదేశం ప్రకారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటి అధ్యక్షునిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రధాన సలహాదారు డాక్టర్ బి డి అతాని ని నియమించింది. 2౦19 నాటి బాండ్ పాలసీ విధానాన్ని పూర్తిగా సమీక్షించాలని కోరింది ఈమేరకు అతాని నేతృత్వం లోని బృందం 2౦2౦ మే నాటికి కమిటి నివేదికను సమర్పించింది. నివేదిక పై ఎన్ ఎం సి నేషనల్ మెడికల్ కమీషన్ తమ వ్యాఖ్యను పంపాలని కోరింది. డాక్టర్ బి డి అదాని నేతృత్వం లోని బృందం ఇచ్చిన నివేదిక పై అసలు సంప్రదాయమ విధానాలు తప్పనిసరిగా బాండ్ పాలసీలో నిబందనలు ఒక్కోరాష్ట్రంలో  ఒక్కో ఒక్కో విధానం ఉందని పెర్కొన్నారు. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్లు తీవ్రంగా తప్పు పట్టారు.  బాండ్ పాలసీ కి వ్యతిరేకంగా హర్యానాలో డాక్తర్లసంఘం బ్లాక్ డే పాటించింది.  హర్యానాలో పోలీసులు బాండ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపు తున్న డాక్టర్ల పై అమానుషంగా ప్రవర్తించ డాన్ని తీవ్రంగా ఖండించింది. డాక్టర్ల పై బాండ్ చట్టాన్ని బల వంతంగా రుద్దేందుకు  హర్యానా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తమ పై దాడి చేయడం అనైతిక మని దీనిని అంగీక రించబోమని డాక్టర్లు హెచ్చరించారు. హర్యానాలో వివిధ డాక్టర్ల సంఘాలు బ్లాక్ డే ను పాటించాయి. ఎం బి బి ఎస్ అడ్మిషన్ల ప్పుడేబాండ్ ను అమలు చేయాలన్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. ఫార్డా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ విద్యార్ధులకు మద్దతుతేలిపింది. హర్యానా వైద్య విద్యార్ధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఈ అంశంపై ఫెడెరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మంసూక్ మాండ వీయ కు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు. ప్రభుత్వ వైద్యకళాశాలలో ఇటీవలే డాక్టర్ల ఫీజు పెంపుపై హర్యానాలో ఇటీవలే డాక్టర్లు ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడిందని తీవ్రంగా పరిణమించింది . వైద్య విద్యార్దుల పై వాటర్ కేనన్లు ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు తెలిపారు. ఇది వైద్య విద్యపై మరోదాడి.గా అభివర్ణించారు. అనవసరపు ఫీజు పెంపు బాండ్ పోలసీ అమలు పోలీసుల అమాయక విద్యార్ధుల పై దాడి చేయడాన్ని సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కోవిడ్ సమయం లో అత్యవసర సమయం లో డాక్టర్లు అందించిన సేవలు అద్భ్తతమని ప్రభుత్వం విస్మరించరాద ని లేఖలో పేర్కొన్నారు. ఫార్డా జాతీయ కార్యదర్శి ఉపాధ్యక్షుడు సర్వేశ్ పాండే హర్యానా పోలీసులతీరును వ్యవహార శైలిని అనాగరిక చాయగా పేర్కొన్నారు. బాండ్ ను హర్యానా ప్రభుత్వం బలవంతంగా అమలు చేయాలని చూస్తోందని ఇది అనైతిక చర్యాగా పేర్కొన్నారు. ఫైమా ముఖ్య సలహాడారు డాక్టర్ మనీష జాం గ్రా రోహ్ తక్ చేరుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. డాక్టర్ జంగ్రా మాట్లాడు తూ 4౦ లక్షల బాండ్ పోలసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మేము వైద్య విద్యార్ధు లకు అండ గా ఉంటామని వారికి మా సంపూర్ణ మద్దత్తు ఉంటుందని పేర్కొన్నారు. బాండ్ పాలసీని అయారాష్ట్రాలు ఇప్పటికే మార్పులు చేశాయని దేశంలో వైద్య విద్య అంశాలు మరల పునః సమీ క్షించాలని సూచించింది. చాలా ప్రభావ వంతంగా ఉండేవిధంగా రాష్ట్రాలకు నివేదించాలని సూచించారు. నేషనల్ మెడికల్ కమిషన్ కూలంకషంగా పరిశీలించింది. ఇప్పటికే సుప్రీం బాండ్ పాలసీని నిలుపు దల చేసిందని బాండ్ ద్వారా అయితే వైద్య విద్యార్ధులు రాష్ట్ర ప్రభుత్వానికి  భారంగా మారరాదని పేర్కొంది. సహజ న్యాయానికి విరుద్ధంగా ఉందని అధికారులు పేర్కొనడం గమనార్హం. బాండ్ విధానం పై  ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతుందని మొత్తంగా బాండ్ పాలసీని పరీ క్షించి రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించింది. బాండ్ పాలసీపై విధి విధానాలు బాండ్ రూపు రేకలు ఎలా ఉండాలి. బాండ్ అమలుకు ముందే ఆయా సమయానికి పోస్టులు ఉన్నాయా ఇంటర్న్ షిప్ పూర్తి చేయాలని అధికారులు వెల్లడించారు.

పాత ముఖాలు వద్దు.. కొత్త ముఖాలకే టికెట్లు.. జగన్ వర్క్ షాపు లక్ష్యం అదేనా?

వచ్చే ఏన్నికలు వైసీపీకి చావో రేవో అని ఫిక్సైపోయిన ముఖ్యమంత్రి జగన్.. పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గడప గడపకూ అంటూ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ పరుగులు పెట్టిస్లున్నారు. 24x7 సర్వేలు, నిఘాలు అంటూ చెమటలు పట్టిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వ గ్రాఫ్ ఇసుమంతైనా పెరగడంలేదన్న నిఘా నివేదికలతో జగన్ ఖంగారెత్తిపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలంటే వచ్చే ఎన్నికలలో సాధ్యమైనంత మంది కొత్త వారికి పార్టీ టికెట్లు ఇచ్చి పోటీలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే ఈ మూడున్నరేళ్లలో పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను కలవడానికి పెద్దగా ఆసక్తి కనబరచని జగన్ ఇప్పుడు ఎ  విజయం కోసం తాను నమ్ముకున్న గడపగడపకూపై వరుస సమీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు. తాజాగా మరో సారి గడపగడపకూ పై వర్క్ షాపు పెట్టాలని నిర్ణయంచుకున్నారు. ఇందుకు వచ్చే నెల 4 ముహూర్తం ఖరారు చేశారు. వైనాట్ 175 అవుటాఫ్ 175 అంటున్న జగన్ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇప్పటికే జరిగిన రెండు వర్క్ షాపులతో.. వారిలో జగన్ తో బేటీ అంటేనే ఇదెక్కడి గోలరా భగవంతుడా అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గడపగడపకూ మన ప్రబుత్వం కార్యక్రమంపై ఫీల్డ్ నుంచి నేరుగా అందిన  ఫీడ్ బ్యాక్ ప్రాతిపదికగా ఎమ్మెల్యేల పనితీరును జగన్ బేరీజు వేస్తున్నారు. ప్రజలలో ఎమ్మెల్యేల పట్ల ఉన్న సానుకూలత, ప్రతికూలతలను అంచనా వేస్తున్నారు. అసలు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమమే.. ప్రజలలో ఎమ్మెల్యేల పట్ల సానుకూలత, వ్యతిరేతకలను బేరీజు వేసి వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి తిరస్కరించాలి అన్న విషయాన్ని జగన్ నిర్ణయిస్తారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పాలన, సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమే గడపగడపకు అని చెబుతున్నప్పటికీ ఈ కార్యక్రమ వాస్తవ లక్ష్యం మాత్రం ఎమ్మెల్యేల పనితీరు బేరీజు వేయడానికేనని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందన్న సమాచారం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనంత మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా..ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 4న జగన్ మరో సారి వర్క్ షాప్ నిర్వహించనున్నారు.  ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులకు  ఈ మేరకు వారికి ఇప్పటికే సమాచారం పంపారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యల  పరిష్కారం  విషయంలో ఏ మేరకు చొరవ చూపుతున్నారు,  ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత, సానుకూలత తదితర అంశాలపై ఇప్పటికే జగన్ వద్ద నివేదిక ఉందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.    ఐప్యాక్‌ టీమ్‌లు  జగన్ ఎప్పటికప్పుడు  నివేదికలు సమర్పించినట్లు  సమాచారం. గతంలో జరిగిన రెండు వర్క్‌షాప్‌ లలో కొందరు ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే.  అలా జగన్ వార్నింగ్ ఇచ్చిన వారిలో మంత్రులు కూడా ఉణ్నారు. తాజాగా వచ్చే నెల 4న జరిగే వర్క్ షాపులో అప్పుడు వార్నింగ్ ఇచ్చిన వారి పని తీరును మరోసారి సమీక్షిస్తారనీ, ఏ మాత్రం మెరుగుపడకపోయినా.. ఇక వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ హేళక్కేననీ అంటున్నారు. అదే విషయాన్ని ఈ వర్క్ షాపులో జగన్ విస్పష్టంగా తేటతెల్లం చేసే అవకాశం ఉందని అంటున్నారు.  ఇప్పుడు అదే విషయంపై ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో వార్నింగ్ ఇచ్చిన వారే కాకుండా.. తాజాగా తన వద్ద నివేదికలో పనితీరు మెరుగ్గా లేదని తేలిన ఎమ్మెల్యేల పట్ల కూడా జగన్ కఠిన వైఖరినే అవలంబించనున్నారన్న పార్టీ పెద్దల సంకేతాలతో పలువురు ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. 175 కు 175 స్థానాల్లో విజయం అన్న అసాధ్యమైన లక్ష్యన్ని పెట్టుకుని జగన్ తమను ఇరుకున పెట్టి  వేధిస్తున్నారన్న అభిప్రాయమే మెజారిటీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. ముందు స్వయంగా జగన్ తన పనితీరుపై నివేదిక తెప్పించుకుని ఉంటే.. ఆయన మీద ఆయనే వేటు వేసుకోవలసిన పరిస్థితి ఉండేదని పలువురు ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మొత్తం మీద వచ్చే నెల 4న జరగనున్న వర్క్ షాప్ విషయంలో ఎమ్మెల్యేలలో ఆందోళనే తప్ప ఆసక్తి లేదని పరిశీలకులు చెబుతున్నారు.  

విజయమో..వెనక్కి తిరగడమో తేల్చేది వీళ్లే 

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ ఈసారి అనేక ట్విస్టులతో సెమీస్ వరకూ సాగింది. వెస్టిండీస్, దక్ణిణాఫ్రికా వంటి హేమా హేమీ జట్లు వెనుదిరగడం, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పిల్ల జట్లు తమ సత్తా ఏమిటన్నది నిరూపించడం అన్నీ అంతా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. వారితో పాటు క్రికెట్ వీరాభిానులు, అధికారులు, మాజీ ప్లేయర్ల సైతం గొప్ప ప్రదర్శన ఇస్తారనుకున్నవారు కాస్తంత పేలవంగా ఆడి క్రమేపీ పుంజుకోవడం, సులభంగా గెలవవచ్చన్న మ్యాచ్ లు చివరి బంతికీ తాడో పేడో తేల్చుకునేంత ఉద్రిక్తస్థాయిలో ముగియడం అన్నీ చూశాం. మొత్తానికి బయటికి వెళ్లిపోతుం దనుకున్న పాకిస్తన్ సెమీస్ కి చేరి సెమీస్ పోటీలు రసవత్తరంగా పోటాపోటీ గా జరిగే వీలుందన్నది తెలియజేసింది. ఇక అందరూ రేపు జరిగే తొలి సెమీస్ పై దృష్టి పెట్టారు. ఈ సెమీస్ లో జట్టు విజ యమో.. వెనుదిరగడమో తేల్చగలిగే ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.. ఎందుకంటే ఇప్పటివరకూ వీళ్లే ఈ జట్లను గెలిపించి ఇక్కడిదాకా తీసుకువచ్చారు. భారత్ తో తలపడే ఇంగ్లండ్ తప్పకుండా కింగ్ కోహ్లీ ని కట్టడి చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్ట నుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును విజయావకాశాల వేపు మళ్లించగలిగే విచిత్రమైన సత్తా ఉన్నవాడు కోహ్లీ. ఇది ఊహించని ప్రత్యేకత. అసలు సిసలుు ప్లేయర్లే దీన్ని ప్రదర్శించగల్గుతారు. 34 ఏళ్ల కోహ్లీ ప్రస్తుత టోర్నీలో ఇంతవరకూ 246 పరుగులు చేశాడు. అందులో అర్ధసెంచరీతో అజేయంగ నిలిచిన ఇన్నింగ్స్ చెప్పుకోదగ్గది.  ఓటమి ఖాయమన్న మ్యాచ్ లో ఊహించని ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలోకి లాక్కెల్లడంలో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. అతనికి పరుగులు వరద సృష్టిం చడంలో ఉన్న వేగం, వ్యూహం ఓ ప్రత్యేక శైలిగానే సీనియర్లు, మాజీలు గుర్తించారు. అతను ఒత్తిడిలోనే అద్భుత ప్రదర్శన చేయడం గమనార్హం. బ్యాటింగ్ ను పూర్తిస్థాయిలో ఆశ్వాదించడం అతనిలోనే చూడగల్గుతామంటారు మాజీలు. ఇది ముమ్మాటికీ నిజం. అందుకే అతన్ని రెచ్చగొట్టవద్దని అంటూం టారు పాక్ సీనియర్లు సైతం. అతనంతే.. బౌలర్లను, ఫీల్డింగ్ పొజిషన్లను ఏమాత్రం లెక్క చేయడు.  ఇటీవలి కాలంలో జట్టు మిడిల్ ర్డర్ను ఆదుకుంటున్న గొప్ప వేగం కలిగిన బ్యాటర్ గా ఉద్భవించినవాడు సూర్యకుమార్ యాదవ్. మామూలు ప్లేయర్ లా కనిపించే ఈ బ్యాటర్ ఆకాశమే హద్దుగా సునాయాసంగా సిక్స్ లు కొట్టడంలో మాజీలను తలపిస్తున్నాడు. అందుకే అతన్ని అందరూ స్కై అనీ పిలుస్తున్నారు. ఏమాత్రం కష్టపడుతున్నట్టు ఒత్తిడికి గురయిన దాఖలాలు కనపడవు. అవతలి టీమ్ ఏదయినా, బౌలర్ ఎవరయినా సరే కడు ధైర్యంగా, నైపుణ్యంతో ఫోర్లు, సిక్స్లు బాదేయడంతో పాటు స్కోర్ ను పరుగు లెత్తించడంలో అతనికి అతనే సాటి. అతన్ని రెండో కోహ్లీ అన్నా ఫరవాలేదేమో. సూపర్ 12 చివరి మ్యాచ్లో జింబాబ్వే మీద శరవేగంగా కేవలం 25 బంతుల్లో 61  పరుగులు చేయడమే అందుకు అద్దంపడుతుంది. అంతర్జాతీయ కెరీర్ లోకి అడుగులు వేస్తున్న తొలి రోజుల్లోనే  ఇతను ఇలా  ధాటిగా ఆడుతుండడం సీనియర్లను సైతం ఆహ్లాదపరుస్తోంది. చాలా కాలానికి మిడిల్ ఆర్డర్ లో మంచి ధీటయిన బ్యాటర్ దొరికాడని హెడ్ కోచ్ ద్రావిడ్ కూడా ఎంతో ఆనందిస్తున్నాడు.  అందరూ తప్పకుండా గమనించాల్సిన కుర్రాడు అర్షదీప్ సింగ్. చూడ్డానికి సన్నగా పీలగా కనపడతాడు గాని  ఈ ఎడమచేతి పేసర్ బంతిని స్వింగ్ చేస్తుంటే ప్రత్యర్ధి జట్టు ఓపెనర్లు కంగారుపడటం చూశాం. కాలేజీ అయి ఉద్యోగ వేటలో ఉన్న యువకుడిలా కనిపించే సిగ్గరి లో ఇంత వేగం, యాక్యురసీ చూసి పాక్ మాజీ ప్లేయర్లు కూడా ఆశ్చర్యపడుతున్నారు. క్రమేపీ ఇతగాడు భారత్ ఓపనింగ్ బౌలింగ్ కి నాయ కత్వం వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సెమీస్ లో తప్పకుండా ఇంగ్లండ్ కి బెంబేలెత్తించగలడనే అనుకోవాలి. అతనిలో అంతటి సత్తా ఉంది. ఈ టోర్నీలో ఈ 23 ఏళ్ల కుర్ర పేసర్ 10 వికెట్లు తీసుకుని ముందంజలో నిలిచాడు. భువీ తో కలిసి విజృంభిస్తే భారత్ కు విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.  ఇక ఎప్పుడు సరదాగా నవ్వుతూ కనపడే ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ సామర్ధ్యం అనన్య సామాన్యమనే అంటున్నారు కామెంటేటర్లు. నిజమే, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ ఈ ఫార్మేట్ లోనూ అద్భుతంగా బ్యాట్ చేస్తున్నాడు. ఆరంభ మ్యాచ్ ల్లో అంతగా స్కోర్ చేయకపోయినా చివరి మ్యాచ్ లో లంక మీద 36 బంతుల్లో 42 పరుగులు చేసి తను తన పాత ఫామ్ లోకి వచ్చానని ప్రత్యర్ధులకు హెచ్చరిక చేశాడనే అనాలి. అతను ధాటిగా ఆడితే ఇంగ్లండ్ కలలు పండినట్టే. అతన్ని నిలువరిం చడమ ప్రత్యర్ధి జట్టుకు అత్యంత అవసరం.  ఇక జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ద్వయం ఊహించని బ్యాటింగ్ సత్తా ఉన్నవారు. ఇద్దరూ చూస్తుండగానే పరుగుల వరదతో జట్టుకు భారీ స్కోర్ సాధించగల నైపుణ్యం ఉన్నవారే. కివీస్ స్టార్ పేసర్లు టిమ్ సౌధీ, ట్రెంట్ బౌల్ట్ వంటి పేసర్లను అవలీలగా ఎదుర్కొని 81పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారంటేనే వారి బ్యాటింగ్ సత్తాను అంచనా వేయవచ్చు.   మరో వంక చిన్న పిల్లాడిలా కనిపించే బౌలర్ కరెన్ అతనితో పాటు మార్క్ఉడ్ నీ ప్రత్యేకంగా గమనిం చాలి. తన జట్టుకు బౌలర్ గా సామ్ కరన్ 2010లోనే గొప్ప విజయాన్ని అందించాడు. ఉడ్ ఇంతవరకూ టోర్నీలో అత్యంత వేగంగా బంతిని వేయగల సత్తా ఉన్న బౌలర్ గా అందరూ గుర్తించారు. వేగంతో పాటు స్వింగ్ చేయగల సత్తాతో ప్రత్యర్ధులను భయపెట్టగల పేసర్ ఉడ్.  ...

ధర్మానకు ఇప్పటికి తెలిసొచ్చింది.. అయినా బలే కవర్ చేశారుగా?

మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సీనియర్ రాజకీయ నాయకుడు. మంత్రి కూడా. ఆయనకు ఇన్నాళ్లకు ఒక విషయం అర్ధమైంది. అదేంటంటే తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని. గడపగడపకూలో ఎదురౌతున్న నిరసనలు, మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా ఎదురైనా చేదు అనుభవాలు ఏవీ కూడా ఆయనకు ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రతీకలుగా కనిపించలేదట. తమ అధినేత చెప్పిన విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీసీ 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించేస్తుందన్న నమ్మకాన్నే ఇంత కాలం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వీటన్నిటికీ మించి మూడు రాజధానులకు అనుకూలంగా చేపట్టిన విశాఖ గర్జనకు జనం మొహం చాటేసినా, ఇదే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశాల్లో, రౌండ్ టేబుల్ సదస్సుల్లో మూడు రాజధానులకు అనుకూలంగా వాణి వినిపించకపోయినా ధర్మానకు ప్రజా వ్యతిరేకత కనిపించలేదు. పై పెచ్చు మూడు రాజధానులకు అనుకూలంగా తాను కోరినా గట్టిగా గళం విప్పలేదని జనంపై చిర్రుబుర్రులాడారు కూడా. జనం అంతా జగన్ వెనకే ఉన్నారని చాలా ధీమాగా చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి ధర్మానకు హఠాత్తుగా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపించేసింది. వెంటనే ఆయనా మాట తనలో దాచుకోకుండా శ్రీకాకుళంలో మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పేశారు. ‘ఔను.. మా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది’ అంటూ కుండబద్దలు కొట్టేశారు. అయితే ఆ వ్యతిరేకత అంతా ప్రభుత్వ విధానాలను ప్రజలు అర్ధం చేసుకోకపోవడం వల్లనే వచ్చిందని తనదైన శైలిలో కవరింగ్ ఇచ్చేశారు. ఏ ప్రభుత్వానికైనా సరే సంస్కరణలు చేపట్టినప్పుడు తొలుత ప్రజా వ్యతిరేకతక రావడం సహజమేనని సూత్రీకరించారు. ఇప్పుడు జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు కూడా ఆయన అమలు చేస్తున్న సంస్కరణలు ప్రజలకు అర్ధం కాకపోవడం వల్లనేనని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఏపీలో జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయలో ఉందని మంత్రి ధర్మాన స్వయంగా అంగీకరించేశారు. ఆయనే స్వయంగా తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని అంగీకరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ధర్మన వాస్తవం అంగీకరించేశారని జనం అంటున్నారు.  

జనవరిలో టీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కు? ఇక జాతీయ రాజకీయాలకే కేసీఆర్ పరిమితం

దీర్ఘ కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కేటీఆర్ ఆకాంక్ష నెరవేరే సమయం వచ్చేసిందా అంటే ఔననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. పాన్ ఇండియా పార్టీగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక పూర్తి సమయం కేటాయించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు లేదని చాటిన ఆయన ఇక తన జాతీయ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించనున్నారనీ,  అందు కోసం రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పగ్గాలను తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించేందుకు నిర్ణయం తీసేసుకున్నారనీ అంటున్నారు.   తొలుత వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి.. ఆ ఎన్నికలలో మూడు నుంచి నాలుగు సీట్లు గెలుచుకోవడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీకి గట్టి సవాల్ గా నిలిచేందుకు ప్రణాలిక రూపొందించిన కేసీఆర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పగ్గాలను కేటీఆర్ కు అప్పగించనున్నారు. గుజరాత్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న కవితను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జోరుగా జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఎక్కడా కవిత ప్రమేయం లేకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక వేళ గుజరాత్ ఎన్నికలకు ముందే..ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచి కవితకు సమన్లు జారీ చేయడం, విచారణకు పిలవడం, అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడితే.. గుజరాత్ ఎన్నికలలో పార్టీకి సానుభూతి పవనాలు వీచేలా అదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అంశాన్ని గుజరాత్  అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ ప్రధాన ఎన్నికల అంశంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ అంశం ఇప్పటికే గుజరాత్ లో బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. దీనికి తోడు మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా బీజేపీని ఆత్మరక్షణలో పడేసిందంటున్నారు. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు నెమ్మదిస్తుందని అంటున్నారు. కేసీఆర్ కూడా అదే అంచనాతో ఉన్నారంటున్నారు. ఆ కారణంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కవితపై ఆరోపణలను తురఫు ముక్కగా వాడే అవకాశాలను రిజర్వ్ లో ఉంచారని అంటున్నారు. ఇక తాను అనుకున్నట్లుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మూడు నుంచి నాలుగు స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. రాష్ట్ర పగ్గాలను తనయుడు కేసీఆర్ కు అప్పగించేసి కుమార్తె కవితతో కలిసి పూర్తిగా జాతీయ రాజకీయాలపై కాన్సన్ ట్రేట్ చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. గుజరాత్ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటితే తాను ఇంత కాలం చెబుతూ వచ్చిన మూడో ఫ్రంట్ సాకారం అవ్వడానికీ, ఆ ఫ్రంట్ కు తానే నాయకత్వం వహించడానికి మార్గం సుగమమౌతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారు కేసీఆర్ వెంట ర్యాలీ అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

ఓబుళాపురం కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కి క్లీన్ చిట్ 

ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను నిర్దోషిగా పరిగణించి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆమెపై ఉన్న అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓబుళాపరం కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నా రని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కేసు నమోదుతో ఏడాది పాటు ఐఏఎస్ అధికారిణి జైలులో గడపాల్సి వచ్చింది. మైనింగ్ కు పాల్పడిన వారికి ఐఎఎస్ అధికారిగా శ్రీలక్ష్మి సహకరించారని ఆరోపణలతో పాటు భారీ ముడుపులు తీసుకున్నారనీ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ ఆరోపణల్లో  సాక్ష్యాధారాలు లేనందున  ఆమెపై అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టివేస్తూ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.  1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గనుల కేటాయింపులో ఆయాచిత లబ్ధి కలిగించారన్న ఆరోపణలతో అరెస్టయి, దాదాపు ఏడాది పాటూ జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్‌‌లో ఉన్నారు.‌  తెలంగాణ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని దరఖాస్తు చేసుకోగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ కేడర్‌కు రాగానే ఆమెకు పురపాలకశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చారు. పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి  లెవెల్‌ 15కి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆ శాఖలోనే ముఖ్య కార్యదర్శిగా నియమించింది. వాటిని రెగ్యులర్‌ ప్రమోషన్లుగానే పరిగణించారు. ఆమెపై పెండిం గ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి పదోన్నతి కొనసాగింపు ఉంటుందని అప్పటి ఉత్త ర్వుల్లో ప్రస్తావించారు. ఆమెకు అబౌ సూపర్‌టైమ్‌ స్కేల్‌ (2), అపెక్స్‌స్కేల్‌- లెవెల్‌ 17కి పదోన్నతి కల్పించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దాన్ని అడ్‌హాక్‌ ప్రమోషన్‌గా పేర్కొన్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు తొలగి పోయాయనే చర్చ జరుగుతోంది. కాగా...ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు.

ఆశ్రమపాఠశాలల కరిక్యూలమ్... ఎంఇసి స్థానంలో ఎంపిసి

సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల్లో కరిక్యూలమ్ లో మార్పు చేసేందుకు ఏపీప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో ఎంఇసీ (మాథ్స్,ఎకనామిక్స్, సివిక్స్) కి డిమాండ్ పెద్దగా లేదన్నది విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ కారణంగా దాని స్థానంలో ఎంపీసీ(మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) అలాగే బైపీసీ(బయోలజీ,ఫిజిక్స్, కెమిస్ట్రీ)లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎంఇసీ విభాగంలో సుమారు 8వేల సీట్లు మిగిలిపోవడంతో ప్రభుత్వం కరిక్యూలమ్ మార్పు నిర్ణయం తీసుకుంది.  సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల్లో పెద్దగా డిమాండ్ లేని విభాగాలను గతంలో గుర్తించి వాటి స్థానంలో డిమాండ్ ఉండే విభాగాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. పాఠశాలలు, కాలేజీలలో విద్యార్ధులు అధికంగా కోరుకుంటున్న విభాగాలకే అధిక ప్రాధాన్యతనీయాలన్నది అధికారు లు గుర్తించారు. కానీ అధికారులు ఈ విషయంలో జాప్యం చేశారని సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల , ఆశ్రమ పాఠశాలల పనితీరును మంత్రి సోమవారం సమీ క్షించారు. ఈ సందర్భంగా అధికారులను పాఠశాల, కాలేజీలలో డిమాండ్ ఉన్న విభాగంలోకి సీట్ల మార్పు అంశంలో వెంటనే చర్యలు చేపట్టాలని, వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉండేట్టు చూడాలని అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల అన్ని బ్రాంచీల్లోనూ దాదాపు 1.17 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది సుమారు 1.09 లక్షల మంది చేరారని మంత్రి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ సీట్లకు డిమాండ్ బాగా పెరిగిందని, అందుబాటులో ఉన్న సీట్ల కంటే అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు.  అలాగే జిల్లాల్లో పాఠశాలల్లో మెడికల్, ల్యాబ్ టెక్నాలజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని అధికారులును మంత్రి ఆదేశించారు. ఈ కారణంగా భవిష్యత్తులో ఈ కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు వెంటనే లభించే అవకాశం ఉంటుందన్నారు. అంతేగాక, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు పాఠశాలల కోఆర్డినేటర్లు, ప్రినిపాల్స్ కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయడంలో నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకోవ డానికి వెనుకాడవద్దనీ సూచించారు. 

పాన్ ఇండియా పార్టీగా బీఆర్ఎస్.. గుజరాత్ ఎన్నికలలో పోటీ!?

మునుగోడు ఉప ఎన్నికలో విజయం తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ ను పాన్ ఇండియా పార్టీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదీ ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో సత్తా చాటడం ద్వారా దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చె నెల రెండు విడతలుగా జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. గుజరాత్ లో ఇప్పటికే పట్టు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాలని కేసీఆర్ భావించినా ఆ దిశగా ఎటువంటి ముందడుగూ పడలేదు. ఆప్ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తో పొత్తుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. అయితే గుజరాత్ లో ఒక బలమైన నేతను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వఘేలాతో కేసీఆర్ చర్చలు ఫలప్రదమయ్యాయనీ, ఆయన నేడో రేపో బీఆర్ఎస్ గూటికి చేరనున్నారనీ చెబుతున్నారు.  గత సెప్టెంబర్ లో శంకర్ సింఘ వఘేలా హైదరాబాద్ ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో బేటీ అయిన సంగతి విదితమే. ఆ భేటీలోనే బీఆర్ఎస్ గుజరాత్ రాష్ట్రంలో పోటీకి దిగితే సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా, తాను జాతీయ పార్టీ ఏర్పాటును విరమించుకుని బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా శంకర్ సింగ్ వఘేలా కేసీఆర్ తో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు అదే జరగబోతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ దిశగా తన తొలి అడుగుతోనే ఏను కుంభ స్థలాన్ని ఢీ కొనాలని కృత నిశ్చయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆయన గుజరాత్ లో బీఆర్ఎస్ నాయకుడిగా శంకర్ సింగ్ వఘేలాను ప్రొజెక్టు చేయనున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న శంకర్ సింగ్ వఘేలా బీఆర్ఎస్ లో చేరడం వల్ల ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ లాంఛింగ్ కు పెద్ద ప్లస్ అవుతుందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఇక గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారి మద్దతుతో కొన్ని స్థానాలలో విజయం సాధించడం పెద్ద కష్టం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసంలో కనీసం పది స్థానాలలోనైనా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారంటున్నారు.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసం పది స్థానాలలో పోటీ చేసి, వాటిలో ఎంత లేదన్నా నాలుగు స్థానాలలో విజయం సాధించగలమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారంటున్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ను కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగి.. కొన్ని స్థానాలలో విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీకి గట్టి గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికిప్పుడు తనతో చేతులు కలపడానికి ఒకింత సంకోచిస్తున్న బీజేపీయేతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లో  బీఆర్ఎస్ కొన్ని స్థానాలలో విజయంతో సత్తా చాటితే.. వాటంతట అవే ముందుకు వచ్చి తనతో జట్టు కడతారన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఆవిర్బావం సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన ప్రణాళికలో గుజరాత్ లో పోటీ అంశం లేదు. ఆ తరువాత సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో తన తొలి అడుగు మోడీని ఢీకొట్టడంతోనే వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ రాష్ట్రలో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో మనీష్ సిసోడియాపై కేసు అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా తెరమీదకు తీసుకురావడంతో బీజేపీ డిఫెన్స్ లో పడిందంటున్నారు. అందుకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు పెద్దగా దూకుడు ప్రదర్శించే అవకాశం లేదన్న కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెరాస శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోనికి దింపి కొన్ని స్థానాలను గెలుచుకోవడం ద్వారా మోడీకి గట్టి సవాల్ విసిరినట్లౌతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గుజరాత్ ఫలితాల తరువాత బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ తన దూకుడును మరింత పెంచే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మోడల్ గా దేశ ప్రగతి అంటూ దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వ పటిమను ప్రచారం చేస్తూ జారీ చేసిన ప్రకటనల ప్రభావం గుజరాత్ మీద కూడా గణనీయంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో.. గుజరాత్ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ సభ్యులు రంగంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 

హిమాచల్ గుమ్మంలోకి ఎన్నికలు...గూడు దాటిన కాంగ్రెస్ నాయకులు

అసలే ఎన్నికల సమయం అందునా దక్షిణాదిన దెబ్బతింటున్న కాంగ్రెస్ పార్టీకి ఇపుడు మరో షాక్ తగిలింది.  హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల సమయం గుమ్మం వరకూ వచ్చింది  అంతా యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. నినాదాల ప్లకార్డులు, జండాలు, వాహనాలు అన్నీ సిద్ధమయి నాయకులు ఇప్ప టికే అనుచరులను ఉత్సాహ పరుస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒకరిద్దరు కాదు.. ఏకంగా 26మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ లోకి దూకారు.  హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ తో పాటు మరో 25 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఇలా వారు పార్టీకి ఝలక్ ఇవ్వడం పార్టీ అధినేతకు నోటమాట రాకుండా చేసింది. ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకున్నారన్నది చర్చగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికలఇన్ఛార్జి సుధాన్ సింగ్ సమక్షంలో వారంతా పార్టీ కండువా మార్చు కున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి రాష్ట్రంలో పెరుగుతున్న అభిమానం, ప్రతిష్టకు విపక్షాల నుంచి కూడా నాయకులు ఆకర్షితులయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా ప్రకటించారు. మోదీ తో ఉంటే రాజకీయ ప్రగతి ఉంటుందన్న నమ్మకంతోనే కాంగ్రెస్ నుంచి పార్టీ లోకి వచ్చారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ ను ముందడుగు వేయించడంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అంతగా అన్నిప్రాంతాలవారినీ ఉత్సాహపరిచే స్థాయిలో లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పట్ల విముఖత క్రమేపీ అన్ని ప్రాంతా ల్లోనూ వ్యక్తమవుతుండడంతో బీజేపీ పార్టీ అలాంటి నాయకులను, రెబెల్స్ ను ఆకట్టుకోవడంలో విజయవంత మయింది.    ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ థాకూర్ పాలన ప్రజారంజకంగా ఉందని, అన్ని పథకాలను సక్రమంగా ప్రజలకు ఉపయుక్తంగా అమలుచేస్తున్నారన్న నమ్మకం కలగడంతోనే కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి వచ్చారని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంటో అన్ని గ్రామాల్లోనూ పథకాలు బ్రహ్మాండంగా అమలు జరుగుతున్నాయని, ప్రజలు పార్టీ పట్ల, మోదీ నాయకత్వం పట్ల ఎంతో నమ్మకం చూపుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. పార్టీ వర్గాల ప్రచారం కంటే విపక్షాలను ఆకట్టుకోవ డంలో పార్టీ విజయవంతమయిందన్నది కాంగ్రెస్ నాయకులు బీజేపీ నీడన చేరడం స్పష్టం చేస్తుందని బీజేపీ నాయకులు అంటున్నారు.   కాగా నవంబర్ 12న రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్లు పార్టీ మారడం కాంగ్రెస్ ను దెబ్బతీస్తుందనే అంటున్నారు. ముఖ్యంగా ధర్మపాల్ థాకూర్ వంటి వారు పార్టీని వీడదం పార్టీని మరింత బలహీనపరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే థాకూర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

నగరిలో రోజాకు మరో పరాభవం.. కనీసం ప్రొటోకాల్ కూడా దక్కని వైనం!

నగరి నియోజకవర్గంలో రోజా ప్రభ రోజు రోజుకూ తగ్గిపోతోంది. ఆమెకు నియోజకవర్గంలో కనీసం ప్రొటోకాల్ కూడా అమలు కావడం లేదు. ఈ విషయంలో రోజా తన అసంతృప్తిని పలు మార్లు వెల్లడించినా ఫలితం లేకపోయింది. పార్టీ హై కమాండ్ కూడా ఆమె ఆవేదనను పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటుంది.. సర్దుకు పోవాల్సిందే అని అన్యాపదేశంగానైనా పలు మార్లు రోజాకు అర్ధమయ్యేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరించింది. అయినా నియోజకవర్గంలో తన పట్టును నిరూపించుకుని ప్రత్యర్థుల చేత  శభాష్ అనిపించుకోకపోయినా.. మంత్రిగా తనకు దక్కాల్సిన గౌరవాన్ని వారి ద్వారా పొందాలన్న ప్రయత్నాలను రోజా విడవ లేదు. ఈ క్రమంలోనే తాజాగా రోజాకు మరో పరాభవం ఎదురైంది. వైసీపీ శ్రేణుల కథనం మేరకు ఆ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  నగరి నియోజకవర్గంలో రోజాకు ప్రధాన ప్రత్యర్థి అయిన  రెడ్డివారి చక్రపాణి రెడ్డికి  జగన్  శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన కూడా నగరి నియోజకవర్గంలో బలం పుంజుకుని మంత్రి రోజాకు దీటుగా నిలబడే అవకాశం వచ్చింది. ఇటీవల రోజా ప్రమేయం లేకుండా నగరి నియోజకవర్గంలో.. ఓ రైతు భరోసా కేంద్రానికి రెడ్డి వారి చక్రపాణి రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి విదితమే. ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ రోజా మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతోటే రోజాకు నగరిలో సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదన్న సంగతి బహిర్గతమైంది.   రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన వ్యవహారం ఇంకా పూర్తిగా మరుగున పడకుండానే రోజాకు మరో పరాభవం ఎదురైంది. మంత్రి హోదాలో రోజా.. శ్రీశైలం అలయానికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రికి ఆలయ చైర్మన్ స్వాగతం పలకాలి.  కానీ ఆలయం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి శ్రీశైలంలోనే ఉన్నప్పటికీ మంత్రి రోజాకుస్వాగతం చెప్పడానికి రాలేదు. ఆయన వస్తారేమోనని కొద్ది సేపు ఎదురు చూసిన రోజా  ఆయన రాకపోవడంతో చిన్న బుచ్చుకున్నారు. చివరికి ఆలయ ఈవోనే లాంఛనంగా మంత్రి రోజాకు స్వాగతం పలికారు.  మంత్రి హోదాలో ఆలయ దర్శనానికి వెళ్లినా రెడ్డివారి చక్రపాణి రెడ్డి ప్రొటోకాల్ పాటించి స్వాగతం పలకకపోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. 

ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్ బి), హైదరాబాద్ ద్విదశాబ్ది  ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. ఐఎస్‌బీ నుంచి ఉన్నత స్థాయి బృందం చంద్రబాబు నివాసానికి వచ్చి మరీ ఆహ్వానం అందించారు. ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం నిజంగా పెద్ద విశేషమే. ఎందుకంటే ఐఎస్ బీ హైదరాబాద్ లో స్థాపించిన క్రెడిట్ ను ఇంత కాలం ఆయనకు ఇవ్వకుండా రాజకీయం అడ్డుపడిందని పరిశీలకులు పలు విశ్లేషణలు చేశారు. అయితే ఇప్పుడు రాజకీయం మారిందా అంటే పరిస్థితిని బట్టి మారిందనే అనుకోవాల్సి వస్తోంది.  రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబును ఐఎస్ బీ విషయంలో ఇగ్నోర్ చేసినా హైదరాబాద్ కు ఐఎస్ బీ రావడం వెనుక ఆయన కృషి దార్శనికత మాత్రం ఎవరూ కాదనలేరు. అది చరిత్ర. మహా మహా నగరాలను కాదని ఐఎస్ బీ హైదరాబాద్ లోనే ఏర్పాటు కావడానికి వెనుక ఎం జరిగిందో ఒక సారి అవలోకనం చేసుకుంటే... అప్పటికే ఐటీ హడ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చిన చంద్రబాబు సమర్థత కళ్లకు కడుతుంది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు  తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.    ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన తరుణంలో  నాడు అంటే 1988లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటే తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటూ అప్పటికే ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన కర్నాటక సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తొలుత బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం పరిశీలించినది కూడా బెంగళూరునే.. ఏపీలో ఐఎస్ బీ అనే ఉద్దేశమే   బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన నగరం కోసం అన్వేషించేందుకు వచ్చిన ప్రతినిథి బృందానికి లేదు. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్నవిధానంపై  దేశంలోనే కాదు, ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు సైతం  గుర్తించారు. అయినా కూడా అప్పటికి ఐఎస్ బీ ప్రమోటర్లు బిజినెస్ స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అప్పుడప్పుడే హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్ గా ఎదుగుతున్న దశ.  దక్షిణాదిన ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రమోటర్లు ముందుకు వస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా వారిని సంప్రదించారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రమోటర్లతో సంప్రదింపులకు ఆయన వెనుకాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా కంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే ఎక్కువ కష్టపడ్డారు.  ఆ చొరవతోనే ఆయన ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లతో స్వయంగా మాట్లాడారు. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ వారు కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు.  ఆ బృందాన్ని హైదరాబాద్ కు ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని ఆయన తేనేటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లు అప్పటి వరకూ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏపీ నుంచి సంప్రదింపుల ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచే రావడం వారికి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకూ వారితో సంప్రదింపులకు వచ్చింది అధికారులే. అందుకు భిన్నంగా సీఎం స్వయంగా ఆహ్వానించడంతో వారు కాదనలేక కేవలం మొహమాటంతోనే హైదరాబాద్ వచ్చారు. అలా వచ్చినంత మాత్రాన    హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు  గ్యారంటీ అని భావించవద్దని వారు ముందుగానే చంద్రబాబుకు చెప్పారు.  అందుకు సమ్మతించే చంద్రబాబు వారిని ఆహ్వానించారు.  అలా వచ్చిన వారిని  ప్రొటోకాల్ ను సైతం కాదని ఎదురేగి ఆహ్వానించారు.   స్వయంగా  బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. తన నివాసంలోనే ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వారికి ఎరుకపరిచారు.  చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత ఆ బృందాన్ని మెస్మరైజ్ చేశాయి. చంద్రబాబు నివాసంలో తేనీటి విందు తరువాత కొన్ని రోజులకే హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది.  బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం ఐఎస్ బి బృందం మీడియా సమావేశంలో వివరిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు.   అయితే అంతటితో  పని అయిపోలేదు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులు, రాజకీయంగా చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలన్న శక్తులు తమతమ ప్రయత్నాలను కొనసాగించాయి. ఐఎస్బికి హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.  స్టాంపు డ్యూటీ మినహాయింపుతో పాటు కొన్ని రాయితీలూ కల్పించింది. దీనిపై నాడు ఏపీలో విపక్షం అయిన   కాంగ్రెస్‌ పలు విమర్శలు చేసింది.  ఆరోపణలు గుప్పించింది.    కొందరు నాయకులైతే కేసులు పెట్టారు. కానీ న్యాయస్థానం  సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ బికి రాయతీలు ఇవ్వడంలో  రాష్ట్ర ప్రభుత్వం  ఎటువంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.   చంద్రబాబు ఐఎస్ బీని సాధించడం ద్వారా ఏపీకి గొప్ప మేలు చేకూరిందంటూ జాతీయ పత్రికలు అప్పట్లో సంపాదకీయాలు రాశాయి. ఆయన దార్శనికత దేశానికి అవసరమంటూ ప్రశంసలతో ముంచెత్తాయి. 1999లో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌కు పునాదిరాయి పడింది.  2001లో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవ వేడుక   ఘనంగా జరిగింది.   ఈ విషయాలన్నిటినీ   మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల ఐఎస్‌బీలో జరిగిన ఓ కార్యక్రమంలో గుర్తు చేశారు.  ఐఎస్‌బీ వృద్ధికి సహకరించిన అందరి ఫోటోలు ఉన్నా.. చంద్రబాబు ఫోటో లేకపోవడం వెలితిగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల తరువాత  ఐఎస్పీలో చంద్రబాబు చిత్రపటం పెట్టారో లేదో తెలియదు కానీ..  ఇప్పుడు ఐఎస్ బీ ద్విదశాబ్ది వేడుకలకు ఆహ్వానించారు. ఒక దార్శనికుడి ఘనత, ప్రతిభలను ఏవో సంకుచిత కారణాలతో కొద్ది కాలం మరుగున పెట్టగలరే తప్ప ఎల్లకాలం కాదని చంద్రబాబు విషయంలో మరోసారి రుజువైంది. 

నీ గుణ మిదేనా తిలకా?

సినీస్టార్లతో సమానం క్రికెట్ హీరోలు. అంతగా ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉంటారు. భారత్ అయినా, చిన్నపాటి లంక అయినా, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ అయినా సరే.. సూపర్ ప్లేయర్ కి ఎప్పుడూ యావత్ క్రికెట్ లోకం వీరాభిమానం ప్రకటిస్తూనే ఉంటుంది. సచిన్, పాంటింగ్, ధోనీ లు రిటైరయినా ఇంకా రోజూ తల్చుకుంటూనే ఉంటారు. అంతటి మహా స్థాయి కాకున్నా గుణ తిలక మంచి ఆల్ రౌండర్ గా ఎంతో పేరున్న లంక ప్లేయర్.  ఆటలో గొప్ప నైపుణ్యం ప్రదర్శించేవాడు హఠాత్తుగా గుణం వదిలేసి కేవలం తిలకంగా మిగిలిపోతాడనుకోలేదు ఏ ఒక్కరూ. కానీ ఊహించని విధంగా అదే జరిగింది. టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్‌ల నుంచి సస్పెండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ సోమవారం నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జాతీయ క్రీడాకారుడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. గుణతిలకను అరెస్టు చేసి ఆస్ట్రేలియాలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం అందిన తర్వాత అతనిని ఎటువంటి ఎంపికల కోసం పరిగణించరని లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతేకాకుండా, శ్రీలంక క్రికెట్ ఆరోపించిన నేరంపై తక్షణమే విచారణ చేపట్టడానికి అవసరమైన చర్య లు తీసుకుంటుంది. ఆస్ట్రేలియాలోని పైన పేర్కొన్న కోర్టు కేసు ముగిసిన తర్వాత, నేరం రుజువైతే, జరిమానా విధించడానికి చర్యలు తీసుకోబడతాయి" అని పేర్కొంది. . పోలీసులు ఆదివారం (నవంబర్ 6) తెల్లవారుజామున సిడ్నీలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని శ్రీలంక జట్టు హోటల్‌లో దిగారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై గుణతిలకను అరెస్టు చేశారు. సిడ్నీ శివారు లోని రోజ్ బేలోని ఒక ప్రైవేట్ నివాసంలో 29 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపుల నివేదికలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసుల ఒక ప్రకటన ప్రకారం, ఆ మహిళ ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్ ద్వారా చాలా రోజుల పాటు అతనితో కమ్యూనికేట్ చేసిన తర్వాత అతనితో కలిశారు; అతను 2 నవంబర్ 2022 బుధవారం సాయంత్రం ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించబడింది. స్టేట్ క్రైమ్ కమాండ్ సెక్స్ క్రైమ్స్ స్క్వాడ్ , ఈస్టర్న్ సబర్బ్స్ పోలీస్ ఏరియా కమాండ్ నుండి డిటెక్టివ్‌ లుగా ఆస్ట్రేలి యన్ మీడియా నివేదికలలో  స్పెషలిస్ట్ పోలీసుల క్రైమ్ సీన్ పరీక్ష తర్వాత  31 ఏళ్ల వ్యక్తిని ససెక్స్‌లోని  ఒక హోటల్‌లో అరెస్టు చేశారని పేర్కొన్నారు. శ్రీలంక క్రికెట్  ఆ తర్వాత గుణతిలక అనే ఆటగాడి గుర్తింపును ధృవీకరి స్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియాపై ఒక నివేదిక డిటెక్టివ్ సూపరింటెండెంట్ జేన్ డోహెర్టీని ఉటంకిస్తూ వారు ముందుగా డ్రింక్స్  కోసం కలుసుకున్నారు, తిన్న తర్వాత  మహిళ ఇంటికి తిరిగి వెళ్లారు. మహిళ అన్ని జాగ్రత్తలు తీసుకుంది, ఆమె బహిరంగ ప్రదేశంలో కలుసుకుంది, ఇది దురదృష్టకరం. పోలీసుల కథనం ప్రకారం, గుణతిలకను సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సమ్మతి లేకుండా లైంగిక సంపర్కానికి సంబంధించి నాలుగు ఆరోపణలపై అభియోగాలు మోపారు. ఈ రోజు ఏవిఎల్ ద్వారా పర్రమట్టా బెయిల్ కోర్టులో హాజరు కావడానికి శ్రీలంక జాతీయుడికి బెయిల్ నిరాకరించారు. సిడ్నీలో ఒక మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై క్రీడాకారిణి దనుష్క గుణతిలకను అరెస్టు చేసినట్లు ఐసిసి ద్వారా తెలియజేసినట్లు శ్రీలంక క్రికెట్ ధృవీకరించినట్టు లంక బోర్డు ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌లో గుణతిలక వాస్తవానికి మంచి ప్లేయర్ గా బ్రహ్మాండంగా రాణించాడు.  అతను టోర్నమెంట్  మొదటి రోజు అక్టోబర్ 16న రౌండ్ 1లో నమీబియాతో ఒకే ఒక గేమ్ ఆడాడు. నమీబియా 55 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్‌లో అతను మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. తరువాత అతను స్నాయువు గాయంతో బాధపడ్డాడు మరియు టోర్నమెంట్‌లో ఇకపై ఆడలేకపోయాడు, కానీ జట్టులోనే ఉన్నాడు. గుణతిలక  పాయిజ్డ్, అటాకింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ గా అభివర్ణించింది క్రికెట్ లోకం. అతను శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కరను ఎంతో  మెచ్చుకుంటాడు. నవంబర్ 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి గుణతిలక శ్రీలంక తరఫున ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు, 47 వన్డేలు, 46 టీ 20లు ఆడాడు. టీ20 వరల్డ్‌లో దేశ ప్రచారం సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆస్ట్రేలియాలో అరెస్టయిన తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు  జాతీయ జట్టు ఆటగాడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి సస్పెండ్ చేసింది.

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతు.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమా?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సరే ఆ మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించింది. ఎన్నికల వ్యయంలో కానీ, పోలింగ్ శాతంలో కానీ గత రికార్డులను బద్దలు కొట్టేసింది.  బీజేపీ, టీఆర్ఎస్ లు సొమ్ము వెదజల్లి మరీ గెలుపు ధీమాను ప్రదర్శించడంలో పోటీలు పడ్డారు. కానీ చివరాఖరికి తెరాస బీజేపీపై పై చేయి సాధించి మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది. సరే మునుగోడులో నైతిక విజయం మాదేనని బీజేపీ చెప్పుకుంటోంది. అది వేరే సంగతి. తెరాస విజయానికి కమ్యూనిస్టులతో  పొత్తే తెరాస విజయానికి కారణమని బీజేపీ అంటోంది. వంద మంది ఎమ్మెల్యేలు, నాయకులను మోహరించి మునుగోడును ఒక విధంగా అష్టదిగ్బంధనం చేసేసి విపక్షాలను ప్రచారం చేసుకోనీయకుండా పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సాధించిన ఈ విజయం తెరాసకు వాపే కానీ బలుపు కాదని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అదంతా పక్కన పెడితే..  బీజేపీ మాత్రం మునుగోడులో తనకు ఓటు బ్యాంకు బాగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదే ఊపుతో మరో ఉప ఎన్నికకు తెరతీయడానికి అప్పుడే తెరవేనుక ప్రయత్నాలు మొదలెట్టేసిందని పరిశీలకులు అంటున్నారు. ఈ సారి అసెంబ్లీకి కాకుండా పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా ప్రణాళిక రూపొందించిందని చెబుతున్నారు. ఈ సారి నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత రాజీనామా చేయించి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చేలా ప్రణాళిక రూపొందించిందంటున్నారు. ఇందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సై అన్నారనీ, త్వరలో ఆయన రాజీనామా చేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టిన బీజేపీ, టీఆర్ఎస్ లు నల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. 

పేదోడి బియ్యాన్ని కూడా బొక్కేసిన జగన్ సర్కార్: గోరంట్ల

జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అధ్వానంగా తయారైంది. తన తుగ్లక్ విధానాలతో ఆయన రాష్ట్రంలోని ప్రతి వర్గాన్నీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తాజాగా ధాన్యంకొనుగోళ్ల విషయంలో జగన్ సర్కార్ విధానాలు అన్నదాతలను నట్టేట ముంచుతున్నాయని తెలుగుదేశం సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఆరోపిస్తున్నారు.  రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పేదోడి బియ్యాన్ని కూడా బొక్కేసే దౌర్బాగ్య స్థితికి చేరిందన్నారు.  తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతటి దౌర్భాగ్య సర్కార్ అధికారంలో ఉండటం ఏపీ దౌర్బాగ్యమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నూతన నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గోరంట్ల అన్నారు. గత ఏడాది రైతులు విక్రయించిన ధాన్యానికే ఇప్పటికింకా సొమ్ములు అందక నానా అగచాట్లూ పడుతున్నారని ఆయన అన్నారు. జగన్ పాలనలో రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారనీ, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు. పంటలకు మద్దతు ధర లేదు, పంట నష్టపోయిన వారికి పరిహారం లేదు, రైతు భరోసా రైతు దగాగా రూపాంతరం చెందిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. అన్న దాతల ఆత్మహత్యలలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందంటే వ్యవసాయాన్ని జగన్ సర్కార్ ఎంత సంక్షోభంలో ముంచేసిందో అర్ధం చేసుకోవచ్చని గోరంట్ల చెప్పారు. గత తెలుగుదేశం పాలనలో రైతులకు వారం రోజుల్లోనూ ధాన్యం బకాయిలు అందేవనీ, జగన్ హయాంలో అయితే నెలలు గడుస్తున్నా ధాన్యం బకాయిలు చెల్లించడం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జగన్ నూతన నిబంధనలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌)లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని  డిమాండ్‌ చేశారు.   జగన్ రెడ్డి ఆర్భాటంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు వైకాపా నేతల అవినీతి కేంద్రాలుగా మారాయని దుయ్యబట్టారు. వైసీపీ నేతల ఇష్టాయిష్టాల మేరకు అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని విమర్శించారు.ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు.  

ప్రధానిలో నిరుత్సాహం దేనికో?

దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ భారతీయ జనతాపార్టీ విజయపథంలోనే దూసుకుపోతోందని నాయకులు, వీరాభిమానులు తెగ ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రధానిలో ఆ ఉత్సాహంకంటే అందరినీ నియం త్రించ లేకపోతున్నాననే నీరసం కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయోత్సవాలు, రవ్వంతలో విజయం చేజార్చుకున్నా మెజారిటీ సాధించామన్న వార్తలు కూడా ఆయన్ను పెద్దగా సంతోషపెట్టడం లేదు.  బీజేపీ సారధిగా ఆయన బీజేపీ నాయకులను కలిసికట్టుగా ముందుకు నడిపిం చలేక పోతు న్నారనే విశ్లేషకుల మాట.  హిమాచల్ ప్రదేశ్‌లోని ఫతేపూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తనను 15 సంవత్సరాలుగా అవమానపరిచారని రాష్ట్ర బిజెపి మాజీ ఉపాధ్యక్షుడు కృపాల్ పర్మార్‌ వాదిం చారు. నామినేషన్ ఉపసంహరణ చివరి రోజు ముగిసిపోయినందున, రెండు రోజుల ముందే తనకు పిలుపు రావాలని ప్రధానికి చెప్పినప్పుడు, మోదీ అచ్చా భయ్యా, అచ్చా జీ అంటూ ఫోన్‌ని విరమించు కోవడంతో విసుక్కున్నాడు. ప్రధాని మోదీతో వాదిస్తున్న సాధారణ బీజేపీ కార్యకర్త! మరుసటి రోజు, బిజెపి పర్మార్‌తోపాటు మరో నలుగురు తిరుగుబాటుదారు లను పార్టీ నుండి బహిష్కరించింది. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో-వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీఎంవో కానీ, బీజేపీ కానీ ఇప్పటి వరకు ఖండించలేదు.  ఇప్పుడు మరో నాయకుడు సాహెబ్ స్వయంగా తిరుగుబాటుదారులకు ఫోన్ చేస్తున్నాడు. రాబోయే ఓటమి సాహెబ్‌కు నిద్రలేకుండా చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే ట్వీట్ చేశారు. ఆర్థిక, జాతీయభద్రత విదేశాంగవిధాన సవాళ్లపై దృష్టి సారించడం కంటే మోడీ బిజెపి తిరుగుబాటు దారులను పిలవడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుం దని ప్రతిపక్ష నాయకులు భావించాలి. సరే, వారు మోడీపై ఎలా స్పందిస్తారో తెలియదు. జోక్ అతని మీద కాదు, తన పార్టీ పట్ల ప్రధానమంత్రి నిబద్ధతను చూడండి. ఆయనకు బీజేపీ ప్రయోజనాలే ప్రధానం. మోడీ యాత్రలు-దేశీయంగా, కనీసం-అన్నీ బిజెపికి సంబంధించినవి అయితే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీని యాత్రికుడని, పార్టీ అధ్యక్షతకు తగడని ముద్రవేయడం. మహా రాష్ట్రలో తన యాత్రను విజయవంతం చేసేందుకు శివసైనికులు,  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోయే ప్రయత్నంలో భాగంగా శరద్ పవార్ , ఉద్ధవ్ ఠాక్రేలను కూడా గాంధీతో చేరాలని కాంగ్రెస్ ఆహ్వా చింది. సోలన్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ, మీరు అభ్యర్థులను ఎవరినీ గుర్తుంచుకో వాల్సిన అవసరం లేదు. నేనే  మీ వద్దకు వచ్చాను మీ ప్రతి ఓటు కమలానికి వేసి మోదీని ఆశీర్వదిం చాలన్నారు.  నిజానికి ఆయన బీజేపీకి తనదైన బ్రాండ్‌ను కట్టబెట్టారు. భారత ప్రధాని, తన కార్యాలయం పై అపారమైన బాధ్యత ఉన్నప్పటికీ, బిజెపి తిరుగుబాటుదారులకు డయల్ చేయడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఆడియోక్లిప్ ప్రభావం విషయానికొస్తే.. బీజేపీ శిబిరంలోని లోపాలను బయటపెడుతోం దని కాంగ్రెస్ భావించవచ్చు. కానీ, మనకు తెలిసిన విషయమేమి టంటే, మోడీ తిరుగుబాటు అభ్యర్థిని అభ్యర్థించడం, అధికారిక అభ్యర్థుల వెనుక బిజెపి శ్రేణులను ఏకం చేయడం కూడా ముగుస్తుంది. అయితే, ఆడియో క్లిప్ ఒక పెద్ద సమస్యను తెలియజేసింది. క్యాడర్ ఆధారిత పార్టీలో పెరుగుతున్న క్రమశిక్షణ,  కక్ష సాధింపు, అగ్ర నాయకత్వం నిస్సహాయంగా చూస్తోంది. నడ్డా సొంత గడ్డ అయిన హిమాచల్‌లోని 68 స్థానాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు బీజేపీ తిరుగుబాటుదారులు పోటీ చేయడం, మోడీ,  పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షాలను అప్రమత్తం చేయాలి. నడ్డా అకస్మాత్తుగా తన సొంత రాష్ట్రంలో తన లోతులను చూస్తున్నా, తన సొంత జిల్లా బిలాస్‌పూర్‌లోని నాలుగు నియోజకవర్గాలలో రెండింటిలో బిజెపి తిరుగుబాటురులు పోటీ చేస్తున్నారు. నయా రివాజ్ బనాయేంగే లేదా కొత్త సంప్ర దాయం (అధికారం నిలుపుకోవడం ద్వారా) అనే బీజేపీ నినాదం కొత్త అర్థాన్ని సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఇంటి గడ్డపై మంటలను ఆర్పేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగాల్సి వస్తే, అది పార్టీ నాయకత్వం గురించి చాలా చెబుతుంది. ఈ సందిగ్ధత  హిమాచల్ ప్రదేశ్‌కే పరిమితం కాకపోవడం మోడీని కలవరపెడుతోన్న విషయం. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీలో అంతర్గత యుద్ధాలు కొనసాగుతున్నాయి. బీజేపీ హైకమాండ్ బి.ఎస్. యడియూరప్ప మరియు అతని స్థానంలో బసవరాజ్ బొమ్మైని కర్ణాటక ముఖ్యమంత్రిగా నియ మించారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రోజుకు ఒక వివాదాన్ని ఆశ్రయించడం మరియు ముఖ్యమంత్రి క్లూ లెస్‌గా కనిపించడం వల్ల బొమ్మై విపత్తుగా మారింది. దీంతో హైకమాండ్ యడియూరప్పను బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి చేర్చుకోవాల్సి వచ్చిందంటే, ఆయన్ను సహకరించేందుకు ప్రయత్నించారు. మధ్యప్రదేశ్‌లో, జ్యోతిరాదిత్య సింధియా విధేయులు సీఎం శివరాజ్ చౌహాన్‌పై వేడిని పెంచారు. ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ గ్వాలియర్‌లోని కుండలు ఉన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడిచి ఇతరులు అనుభవించే బాధను అనుభవించారు. పంచాయితీ , గ్రామీణాభివృద్ధి మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా, మరొక సింధియా విధేయుడు, రాష్ట్ర పరిపాలనను "నిరంకుష్" లేదా నిరంకుశ అని పిలిచారు మరియు దీనికి చౌహాన్ నమ్మకస్తుడైన చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ కారణమని ఆరో పించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయర్గియా, సింధియాతో పెరుగుతున్న అను బంధం పార్టీ వర్గాల్లో ఉత్సుకతను పెంచింది, ఈమధ్యనే సీఎం చౌహాన్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత శివరాజ్ చౌహాన్ "త్వరలో" రాజీనామా చేయకుంటే 2018లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేది. ఉత్తరప్రదేశ్‌లో అమిత్ షాకు సన్నిహితుడిగా చెప్పబడుతున్న ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, సిఎం యోగి ఆదిత్య థ్‌కు సన్నిహితుడైన అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వద్ద తన తుపాకీలకు శిక్షణ ఇస్తున్నారు. అనేక మంది ఇతర మంత్రులు రాష్ట్రంలోని సీనియర్ బ్యూరోక్రాట్‌లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రాస్తున్నారు, ఇది శక్తివంతమైన సిఎంపై పుష్‌బ్యాక్‌గా పరిగణించబడు తుంది. హర్యానాలో సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హోంమంత్రి అనిల్‌ విజ్‌ మధ్య చిరకాల వాగ్వాదం ఇకపై వార్తల్లో కనిపించడం లేదు. రాజస్థాన్ బిజెపి ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు సిఎం ఆశావ హుల నుండి సవాలును ఎదుర్కొంటున్న మాజీ సిఎం వసుంధర రాజేతో కూడా తీవ్రమైన అంతర్గత పోరును చూస్తోంది. ఈ అంతర్గత గొడవలు కొత్త కాదు. అయితే, వారిని నిలువరించడంలో బీజేపీ హైకమాండ్ విఫలమవడం ఆశ్చర్య కరం. నిజానికి, ఇది రోజురోజుకు మరింత దిగజారుతోంది. జనాదరణ పొందిన ప్రధానమంత్రి  ఉత్తమ వ్యూహకర్త నేతృత్వంలోని పార్టీకి, ఈ వైఫల్యం ఆశ్చర్యకరమైనది. తటస్థ మధ్యవర్తిగా కాకుండా హైకమాండ్ (ప్రధానమంత్రిని మినహాయించి) పార్టీగా మారినందున ఇది కొంతవరకు కావచ్చు. ఈ రాష్ట్రాలన్నింటిలో, హైకమాండ్ మద్దతు ఉందని చెప్పబడే ఒక వర్గం ఉంది మరియు మరొకటి మూలన ఉంది. మనుగడ కోసం పోరాడాలి. తరువాతి వర్గంలో ఉన్నవారు మోడీపై ఆశలు పెట్టుకున్నా రు  కానీ ప్రధాని రోజువారీ సంస్థాగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరు. అయితే, అతను హిమాచల్‌లో చేస్తున్నట్లు లేదా పార్టీ పార్లమెంటరీ బోర్డులో యడియూరప్పను చేర్చు కోవడం ద్వారా కర్ణాటకలో చేసినట్లుగా అతను జోక్యం చేసుకోవలసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు, మహారాష్ట్రలో, ఉద్ధవ్థాకరే నేతృత్వంలోని ప్రభుత్వపతనానికి నెలలు గడుపుతున్న ప్పటికీ, ఏక్‌నాథ్ షిండేను సీఎం చేయాలనే హైకమాండ్ నిర్ణయంతో దేవేంద్ర ఫడ్నవీస్ అవాక్కయ్యారు. ప్రభుత్వంలో భాగం కావడానికి నిరాకరించారు. అమిత్ షా, నడ్డా నుండి పిలుపులు ఉన్నప్పటికీ అతను తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, ఫడ్నవీస్ తర్వాత వెల్లడించినట్లుగా, ప్రధాని జోక్యం తర్వాత మాత్రమే తాను డిప్యూటీ సీఎం అయ్యేందు కు అంగీకరింనని చెప్పారు. ప్రధాని మోదీ నుంచి ఆశించడం చాలా ఎక్కువ,  ఆయన దేశాన్ని నడపాలి. ఆయన బీజేపీకి ఓట్లు పడేలా చూడాలి. ఇప్పుడు  మధ్యవర్తిగానూ ఆడాలని  అందరినీ కట్టుదిట్టంగా  కలిసి ఉంచాలని భావిస్తు న్నారు. ప్రధానమంత్రి బిజెపి కోసం అన్ని భారీ-ఎత్తులను తక్షణమే చేస్తున్నారు, అయితే ఆయన తన సీనియర్ పార్టీ సహచరులతో నిరాశ చెందడానికి కారణాలు ఉండవచ్చు.

అప్రూవర్ దొరికాడు.. ఇక కవితకు చుక్కలే!?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి దాకా కవితపై ఆరోపణలు వెల్లువెత్తినా ఆమెను ఈడీ కానీ సీబీఐ కానీ ఇప్పటి వరకూ విచారించలేదు. అయితే ఆమెకు సన్నిహితులను మాత్రం విచారించారు. వారిలో బోయనపల్లి అభిషేక్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారారు. ఈయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అసలు ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన రామచంద్రపిళ్లై అప్రూవర్ గా మారుతారని ఇంత వరకూ లీకులు వదులుతూ వచ్చారు. అనూహ్యంగా సీబీఐ దినేష్ అరోరాను అప్రూవర్ గా ప్రకటించి, ఆయనను సాక్షిగా పరిగణించాలని కోర్టును కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ముగ్గురిలో దినేష్ అరోరా ఒకరన్న సంగతి తెలిసిందే.దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ కుమార్తె కవిత ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి విదితమే. కవిత పీఏగా ప్రచారంలో ఉన్న బోయినపల్లి అభిషేక్‌నుఇప్పటికే  అరెస్ట్ అయ్యారు. బోయినపల్లి అభిషేక్ కు బెయిలిస్తే  ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ   సీబీఐ అడ్డుకుంది. ఇప్పుడు దినేష్ అరోరాను సాక్షిగా చేయడంతో.. కవిత చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఏ క్షణంలోనైనా కవితను సీబీఐ విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద దినేష్ అరోరా అప్రూవర్ గా మారడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు జోరందుకున్నట్లేనని అంటున్నారు.