ఇక కవిత రాజకీయాలకు దూరం అయినట్లేనా.. లిక్కర్ స్కాం ఆరోపణలతో కేసీఆరే దూరం పెట్టారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను రాజకీయాల నుంచి దూరంగా ఉంచి బీఆర్ఎస్ జాతీయ, అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ గా హస్తినకే పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోదని తెలుగు వన్ ముందే చెప్పింది. తెలుగు వన్ అంచనా వాస్తవమే అనడానికి కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ..ఉద్యమ కాలం నుంచీ తెరాసలో అత్యంత చురుకుగా ఉన్న కవిత.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎవరికీ కనిపించకుండా ముఖం చాటేయడమే నిదర్శనం అని చెప్పవచ్చు. మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చే సంరంభంలో కూడా కవిత ఎక్కడా కనిపించలేదు. చివరాఖరికి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించిన తరువాత ఆమె నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. అదీ కార్తీక సోమవారం సందర్భంగా. అసలు ఇన్ని నెలల పాటు ఎక్కడ ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు ప్రజలకు మొహం చాటేశారు.  లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెను కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగా దూరం పెట్టారా? అంటే తెరాస శ్రేణులు ఔననే అంటున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  తనదైన శైలిలో స్పందించారు. కార్తీక సోమవారం సందర్భంగా నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉంటారనే విషయం మరోసారి రుజువైందన్నారు. టీఆర్ఎస్ పై విమర్శలు చేసేవారికి ఈ ఉప ఎన్నికలో ప్రజల తీర్పు చెంపపెట్టు అని అమె అభివర్ణించారు. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు తప్పకుండా కేసీఆర్ పక్షానే ఉంటారనే విశ్వాసం ఉందని కల్వకుంట్ల కవిత ఉద్గాటించారు. అయితే కల్వకుంట్లు కవిత.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన.. దాదాపు 18 గంగటల తర్వాత ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంపై సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు.   సినిమాలో జరగాల్సిందంతా జరిగాకా.. క్లైమాక్స్ సీన్‌లో పోలీసులు వచ్చినట్లు.. మునుగోడు ఉప ఎన్నిక ఎపిసోడ్ పూర్తయిపోయిన తరువాత కవిత మీడియా ముందుకు వచ్చిందని నెటిజనులు సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు. అప్పుడే అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినట్లుగా కవిత వ్యవహారశైలి ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అంతే కాదు... మునుగోడు ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నాటి నుంచి ఆ ఉప ఎన్నిక ఫలితం వెలువడే వరకు ఎక్కడ ఉన్నారంటూ కవితని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదీ కూడా టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న తర్వాత వెలువడిన తొలి ఫలితం కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయని.. వాటిలో కూడా కవిత ఎక్కడ కనిపించలేదు.  మరోవైపు ఈ ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొందని... ఆ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ సంస్థల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లతోపాటు కీలక నేతలను సైతం సీఎం కేసీఆర్..  మునుగోడులో మొహరించారని... సదరు నియోజకవర్గాన్ని యూనిట్లుగా విభజించి... వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా మనుగోడు బహిరంగ సభలో పాల్గొన్నారు. కేటీఆర్ సైతం నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు. ఇలా పార్టీ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక కోసం చెమటోడిస్తే.. స్వయానా కేసీఆర్ కుమార్తె అయి ఉండీ, ఎమ్మెల్సీ అయి ఉండీ ప్రచారంలో ఎక్కడా ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.    ఢిల్లీ లీక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆమెను  మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా ఉంచారని టీఆర్ఎస్ వర్గాలలో చర్చ అయితే జరుగుతోంది.  ఓ వేళ ఆమె ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తే.. ప్రత్యర్థి పార్టీ చేతికి ఆయుధం ఇచ్చినట్లు అవుతోందని భావించడం వల్లనే కేసీఆర్ కావాలనే  ఆమెను మునుగోడు పరిసరాలకు కూడా రానివ్వలేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఇంకో వైపు కల్వకుంట్ల కవిత ఉత్తర భారతదేశంలోని పలు పుణ్య క్షేత్రాలు, దర్గాలు సందర్శన చేస్తున్నఫొటోలు  సోషల్ మీడియా సాక్షిగా తెగ హల్‌చల్ చేయడాన్ని ప్రస్తావిస్తూ... దీంతో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ ఇంత హడావుడి ఉంటే.. ఆమె అక్కడ డివోషనల్ టూర్ ఏమిటని   నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.    జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత  హస్తినకు పరిమితం  చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు తమ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు కేసీఆర్ తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను పూర్తిగా దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా  ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి.  అందుకే కవిత మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం నుంచి ఫలితం వచ్చేదాకా ఎక్కడా బహిరంగంగా కనబడ కుండా జాగ్రత్త తీసుకున్నారనీ అంటున్నారు.

ప్రమాదంలో  సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు ..యుఎన్ నివేదిక

హరిత విప్లవం ద్వారా లభించే అవకాశాలను గుర్తించడంలో విఫలమైన దేశాలు సామాజిక అసమాన తలు, పౌర అశాంతి నెట్‌కు మార్పులను ప్రతిపాదిస్తే తక్కువ పోటీ ఆర్థిక వ్యవస్థలు పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్ డిపి) కొత్త నివేదిక పేర్కొంది. ఉద్గారాలు లేని మార్గాలు సరిగా నిర్వహించలేదు. రాబోయే కోప్ 27 వాతావరణ చర్చల ముందు ఈ నివేదిక విడుదలైంది. దేశాలు స్థిరమైన ఆర్థికవ్యవస్థలకు మారుతున్నందున, ఈ ప్రక్రియ న్యాయమైన, సమాన మైన మార్గాల్లో జరగడం చాలా కీలకం. పారిస్ ఒప్పందం ప్రపంచ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో కేవలం పరివర్తన అనే భావన కీలకం. పారిస్ ఒప్పందం ప్రకారం తాజా జాతీయ వాతా వరణ ప్రతిజ్ఞలలో 38 శాతం, దీర్ఘకాలిక వ్యూహాలలో 56 శాతం ఇప్పుడు కేవలం పరివర్తన సూచించ బడిందని నివేదిక కనుగొంది, అయితే మరింత పని మిగిలి ఉంది. జాతీయంగా పేర్కొన్న విరాళాలు లేదా ఎన్డీ సీలు అని పిలువబడే మెరుగుపరచబడిన స్వల్పకాలిక వాతావరణ హామీలను,  దేశాలు తమ ప్రణాళికలను వివరించే దీర్ఘకాలిక వ్యూహాలను విశ్లేషిస్తుంది. ఇది కేవలం పరివర్తనకు దారితీసే ఐదు దేశాలలో ఉపయోగించబడుతున్న విధానాలను అందిస్తుంది: ఆంటిగ్వా , బార్బుడా, కోస్టా రికా, ఇండియా, సెర్బియా, దక్షిణాఫ్రికా. పారిస్ ఒప్పందాన్ని అందజేయడం లో కేవలం సహాయం చేసే ఐదు కీలక మార్గాలను కూడా ఇది గుర్తిస్తుంది. వాతావరణ మార్పు తీవ్రతరం కావడంతో,  ప్రపంచం విపరీతమైన శక్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నం దున, చాలాదేశాలు  శిలాజ ఇంధనాల నుండి విడదీయడం,  రేపటి గ్రీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెడుతున్నాయి. ఇప్పుడు ఏకైక తార్కిక ఆర్థిక ఎంపిక అని యుఎన్ డిపి నిర్వాహకుడు అచిమ్ స్టైనర్ చెప్పారు. ఈ కొత్త నివేదిక ఇంధన రంగానికి,  అంతకుమించి న్యాయమైన, సమానమైన పరివర్తన చుట్టూ వేగాన్ని ఎలా వేగవంతం చేయాలనే దానిపై వాస్తవ-ప్రపంచ అంతర్దృ ష్టులను అంది స్తుంది: కార్మికులకు కొత్త గ్రీన్ ఎకానమీ నైపుణ్యాలను అందించడం సామాజిక రక్షణకు ప్రాప్యత; దేశాల జాతీయంగా నిర్ణయించిన విరాళాలు నికర-సున్నా భవిష్యత్తుకు స్పష్ట మైన మార్గాన్ని నిర్ధారిస్తాయి. అక్టోబర్ 31, 2022 నాటికి మెరుగుపరచబడిన ఎన్డీసీ ని సమర్పించిన 170 దేశాలలో, 65 (38 శాతం) కేవలం పరివర్త నను స్పష్టంగా సూచిస్తున్నాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య దాదాపుగా కూడా చీలిక ఉంది (51 శాతం, 49 శాతం), మధ్య  తూర్పు ఐరోపా అగ్రస్థానంలో ఉంది, అమెరికా మరియు కరేబియన్ ఆఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆసియా పసిఫిక్,  అరబ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. అయితే, కేవలం 11 దేశాలు (17 శాతం) మాత్రమే పరివర్తనపై తమ ఎన్డీ సీ లో ప్రత్యేక అధ్యాయం లేదా విభాగాన్ని కలిగి ఉన్నాయి. అక్టోబర్ 31, 2022 నాటికి సమర్పించబడిన 52 దీర్ఘకాలిక వ్యూహాలలో (ఎల్టీ ఎస్) 29 (56 శాతం) కేవలం పరివర్త నను స్పష్టంగా సూచిస్తాయి, వీటిలో 17 యూరోప్ , మధ్య ఆసియా దేశాల నుండి, ఆ తర్వాత ఆసియా పసిఫిక్ , అమెరికా ప్రాంతాల నుండి కరేబియన్. ఆఫ్రికా,  అరబ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి.  మెరుగైన ఎన్డీ సీ లు ఉన్న దేశాలు, కేవలం పరివర్తనను సూచిస్తాయి,  ఏది ఏమైనప్పటికీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్డీజీ లు) లేదా స్వల్ప లేదా దీర్ఘకాలిక వాతా వరణ ప్రణాళికలలో లింగ సమానత్వానికి అనుసంధానం చేయడంలో దేశాలు విఫలమవుతున్నా యని నివేదిక కనుగొంది-ఇది ఒక ముఖ్యమైన తప్పిపోయిన అవకాశాన్ని సూచిస్తుంది. కేవలం పరివర్తనను సూచిస్తున్న దేశాలలో, ప్రస్తుతం కేవలం నాలుగుదేశాలు మాత్రమే తమ ఎన్డీసీ లు ఎల్టీఎస్లలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు కేవలం పరివర్తనను అనుసంధా నించాయి.   ఎనర్జీ రంగం కేవలం పరివర్తన కోసం చాలా శ్రద్ధ తీసుకుంటోందని నివేదిక పేర్కొంది, అయితే, సమగ్ర మైన మొత్తం-ఆర్థిక, మొత్తం-సమాజ విధానం - అన్ని రంగాలను పరిష్కరించే మరియు అన్ని వర్గాల నుండి కొనుగోలును సురక్షితం చేసేది.. అవసరం. గొప్ప అభివృద్ధి లాభాలను తీసుకురావడానికి. వాతా వరణ హామీ కింద, యుఎన్ డిపి కేవలం పరివర్తన సూత్రాలు, ప్రక్రియ మరియు అభ్యాసాలను బలో పేతం చేయడానికి  34 దేశాలకు మద్దతు ఇస్తుంది, ఇది ఎన్ డీసిలు, ఎల్ టీఎస్లలో పరిణా మాన్ని చేర్చడంకోసం యుఎన్ డిపి కార్యాచరణను ఉపయోగిస్తుంది. అంచనా; నిశ్చితార్థం; సంస్థాగత విధానం,  సామర్థ్య నిర్మాణం, ఫైనాన్స్, న్యాయమైన పరివర్తన సూత్రాలపై దేశ అవగాహనను పెంచడం, కేవలం పరివర్తన ప్రక్రియలలో పాల్గొనే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, కేవలం పరివర్తన పద్ధతులను అమలు చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అనే అంశాలలో  మద్దతు లభిస్తుంది. 

జగన్ కు కడప సర్పంచ్ ల షాక్

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలంటూ కడప జిల్లా  సర్పంచ్ లు ధర్నాలు, ర్యాలీకి దిగారు. సర్పంచ్ల ఖాతాలోకే నిధులు పడతాయి, పనులు చేపట్టవచ్చని ముఖ్యమంత్రి జగన్ అన్న ప్పటికీ ఇంతవరకూ తమ ఖాతాలో నిధులు వేయలేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. నిధులు వెంటనే విడుదల చేయకుంటే తాము నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చ రించారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్‌లు, పంచాయతీలకు డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇప్పటికైన సీఎం జగన్ స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ సర్పంచ్‌ల నిరసనలు చేపట్టా రు.అర్ధవీడు మండల సమావేశాన్ని బహిష్కరించి అధికార పార్టీ సర్పంచ్‌లు ఆందోళన చేపట్టగా.. కంభంమండలం సర్పంచులు కూడా అదే బాట పట్టారు. మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్క రించి, ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు.  సర్పంచులుగా గెలిచి ఏడాదిన్నర అయినా ప్రభుత్వం పంచాయతీకి నిధులు ఇవ్వలేదని.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ పంచా యతీ అకౌంట్లను జీరో చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయాలని వారు  అప్పట్లో డిమాండ్‌ చేశారు.  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా  ఏజెన్సీలోని సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన చేపట్టారు. నిధుల కోసం సర్పంచ్‌లు మూకుమ్మడిగా వారపు సంతలో బిక్షాటన చేపట్టారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీ ఖాతాలలో జమ చేయాలంటూ మండలంలోని సర్పంచ్‌లు నిరసనగళం విప్పారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కేంద్రంలో జరిగిన వారపు సంతలో మండలంలోని సర్పంచ్‌లందరూ బిక్షాటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం  పంచాయతీలకు కేటా యించవలసిన నిధులను పక్కదారి పట్టించ వద్దంటూ సర్పంచ్‌లు  ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ.. భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.

ఇద్దరూ ఇద్దరే.!

నటన సినీనటులకే పరిమితం కాదు. రాజకీయాల్లోనూ నటుటు, మహానటులు ఉన్నారు. తాజా ఉదా హరణతెలంగా ణా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి.  తమ్ముడికోసం ఏదయినా చేస్తా అనే పాత సినిమా డైలాగే ఈయనకు సూట్ అవుతుంది. అవును. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటపడడంతో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. సోదరుడు రాజగోపాల్ కి కాంగ్రెస్ వ్యవహారాలు నచ్చక బీజేపీ లోకి మారారు. బీజేపీ సీనియర్లు ఈయన రాకతో ఘన విజయం సాధించ గలమనే అనుకున్నారు, తర్వాత సందేహించారు.. చివరగా ఓడిపోయారు.  సరిగ్గా ప్రచారం ఊపం దుకున్న సమయంలో తన పార్టీకి  కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారం చేయలేదు. ఎన్నికల ప్రచారం కంటే విదేశీ పర్యటన అత్యవసరమయింది. పైగా మునుగోడు ఎన్నిక ముందు వరకూ కనిపించననీ అన్నారు. అన్నట్టే చేశారు.  వెళ్లినాయన ఊరికినే తన స్నేహితు లతోనో, బంధువులతోనో తిరిగి సరదాగా గడపకుండా అక్కడి నుంచి గొప్ప వార్త ప్రచారం చేసేరు.. మునుగోడులో మా వాళ్ల రావడం కష్టం సుమా.. అంటూ.  ఇదే పార్టీ వర్గాలను మరింత కుంగదీసింది. అసలే పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధి గెలుపు కాస్తంత కష్టమేనన్నదీ లోలోపల పార్టీ నాయకునికీ ఉన్పప్పటికీ ఆమె తండ్రి పెద్ద నాయకుడు కనుక ఆయన ప్రభతో ప్రచారం సాగించి సాధించవచ్చని అనుకున్నారు. కానీ చతికిల పడ్డారు కాంగ్రెస్ వారు.  టీఆర్ ఎస్ గెలిచింది. బీజేపీ ఓడింది. కానీ మెజారిటీ పరంగా టీఆర్ఎస్ కి పెద్దగా సంతృప్తి నివ్వలేదు, బీజేపీ వారికి రవ్వంత ఆనందాన్నిచ్చింది. కానీ బాగా నవ్వుకుంది మాత్రం కోమటి రెడ్డి బ్రదర్స్ అనాలి. చెరో పార్టీలో ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీ లూ ఓడినప్పటికీ  కేసీఆర్  కంటే ఎంతో ఆనందిస్తున్నారిద్దరూ.  అన్నగారికి తమ పార్టీ ఓడినందుకు కాదు, తమ్ముడు గెలవబోయి గెలుపు గేటు దగ్గర పడిపోయినందుకు ఆనందం.. కేసీఆర్ కి బీజేపీ మెరుగుపడిందని బాధ, కాంగ్రెస్ రేవంత్ కి పార్టీని మరీ దారుణ పరిస్థితికి దిగజార్చేనని బాధా ఉండవచ్చు.  అయితే వెంకట రెడ్డి ముందే ఇవన్నీ ఊహించే సమయానికి తగిన ప్రాంతం ఎంచుకుని పారిపోయారనాలి. దగ్గరుండి ఓటమి కి ప్రచారం చేసుకునే కంటే ఓటు వేయడం మంచిదనే అనుకున్నారనుకోవాలి.  సోదరుడు గెలుస్తాడన్న నమ్మకం పెద్దాయనకు ఉండకపోలేదు. కానీ తమ్ముడు మారిన పార్టీ వారికే ఆయన మీద నమ్మకం సన్నగిల్లింది. అందుకే ప్రచారం పేరుతో బీజేపీ సీనియర్లంతా యాత్రలు చేశారు. ఇదంతా గమనిస్తూ సోదరుడు గెలుస్తాడన్న నమ్మకం వెంకటరెడ్డికీ వచ్చి ఉంటుంది. కానీ చివాఖర్న దెబ్బతీసింది. కానీ రేవంత్ ఏదో సాధిస్తాడని డబ్బాకొట్టుకున్న తన పార్టీవారికి డిపాజిట్ గల్లంతుకావడం విడ్డూరమే.  అంత భారీ ప్రచారాలు, భారీ ప్రసంగాలు ఓటరుని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. తనను స్టార్ కాంపెనీర్ గా పెట్టుకుని, ఆయనే ముందుండి గెలిపిస్తారని కాంగ్రెస్ అనుకున్నప్పటికీ, ఆయనకు అంత ప్రాధాన్యతను వాస్తవానికి ఇవ్వలేదన్న ప్రచారమూ ఉంది. పార్టీ, అందునా పురాతన పార్టీలో విభేదాలు ఉండకా పోవు. కానీ సమయం గాని సమయంలో అభిప్రాయభేదా లతోనే స్టార్ కాంపనర్ గారు ఆస్ట్రేలియా పర్యటించడమే పార్టీని నీరసపరిచింది.  ఎవరో అన్నట్టు తమ్ముడు తమ్ముడే, అన్న మాత్రం అన్నకాదు తమ్ముడి వీరాభిమానే. అందుకే వీరాభి మానం ప్రదర్శించి తమ్ముడి విజయాన్ని ఆశించారు.. వెళుతూ వెళుతూ మావోడిని కాస్తం జూస్కోం డన్నా.. అని చిన్న సందేశం ఓటర్లకు చేరేలా చేసి మరీ పర్యటనకు వెళ్లారు. పార్టీలు వేరయినా సోదర ప్రేమ అంతకు మించి ఉంటుందన్నది కాంగ్రెస్ ఘోర పరాభవం తేటతెల్లం చేసింది.  కోమటిరెడ్డి బ్రదర్స్కి కొంత బాధ కంటే ఆనందమే ఎక్కువ మిగిలిం ది. పార్టీ మారి ఓడినా తన సత్తా ప్రదర్శించానని సోదరుడు తెలియజేశాడు. పెద్దాయన తమ్ముడి విజయాన్ని కాకున్నా విజేత సత్తాని గుర్తించానని ఆనందిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే.

మునుగోడులో బీజేపీ ఓడిందా..? గెలిచిందా..?

‘నేను చస్తే.. గెలుస్తానా… మరి ఇది చస్తే.. నేను గెలుస్తానా..?’ నేచురల్ స్టార్ నాని నటించిన  ఎంసీఏలో నటి భూమిక పాత్రను ఉద్దేశించి విలన్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీకి అతికినట్టు సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడులో హోరాహోరీ పోరాడిన బీజేపీ 10 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ నైతికంగా తానే గెలిచానని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే.. ఓట్ల సంఖ్యా పరంగా బీజేపీ ఓడిందే కానీ.. నైతికంగా గెలిచామనేది వారి అభిప్రాయం. మునుగోడులో తాను ఓడినా.. వచ్చే ఎన్నికల నాటికి 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచే ఛాన్స్ లేదని, ఒక వేళ నిలిచినా ఉన్న కాస్త ప్రతిష్ఠ మంటగలవడం తప్ప మరో ఫలితం ఉండదన్న స్పష్టమైన సందేశాన్ని నియోజకవర్గం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓట్ల పరంగా గెలవకపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ద్వారా బీజేపీ విజయం సాధించినట్లే అంటున్నారు. తనకు- టీఆర్ఎస్ కు మధ్య మాత్రమే ద్విముఖ పోరు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని బీజేపీ తీసికట్టు మిడతంబొట్లు మాదిరిగా చేసిందంటున్నారు. అలా చూస్తే బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేయడంలో సక్సెస్ ఫుల్ గా విజయం సాధించిందనే చెప్పాలంటున్నారు. గతంలో 2014 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ 65 వేల 496 ఓట్లు తెచ్చుకుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీపై 38 వేల 55 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలిచింది. మళ్లీ 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాసప కాంగ్రెస్ పార్టీపై 22 వేల 552 ఓట్ల తేడాతో ఓటమి చవి చూసింది. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికి 74 వేల 687 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి లభించిన ఓట్లు కేవలం 12 వేలు మాత్రమే. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు. రాజగోపాల్ రెడ్డి పది వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు.  రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికీ  రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే. హుజురాబాద్ షాక్ లో సీఎం కేసీఆర్ మునుగోడుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారని బీజేపీ అధినేతలు ముందే పసిగట్టారు. మునుగోడులో గెలిచేందుకు పార్టీ యంత్రాంగాన్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, మద్యం, మనీ ఇలా ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా కేసీఆర్ రంగంలోకి దిగుతారని కూడా బీజేపీ పెద్దలు ముందే   అంచనా వేశారు. 2018లో కేవలం 12 వేల ఓట్లు తెచ్చుకోడానికి ఆపసోపాలు పడిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో 38.4 శాతంతో 86 వేల 697 ఓట్లు రాబట్టుకోవడం అంటే మాటలు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా చూసుకున్నప్పుడు బీజేపీ ఈ సారి గ్రాండ్ సక్సెస్ అయినట్టే అని చెబుతున్నారు. సంఖ్యాపరంగా ఓడినా మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి బీజేపీ పకడ్బందీ వ్యూహంతోనే దిగిందని చెబుతున్నారు. ప్రణాళికలు ముందుగానే రచించుకుని, ఆ  ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించింది. రెండు హేమాహేమీ పార్టీలైన టీఆర్ఎస్- బీజేపీ తలపడిన ఈ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేసింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభావాన్ని తప్పించడంలో కృతకృత్యం అయిందంటున్నారు. ఇక టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనేది జనంలోకి చొప్పించేలా చేయగలిగిందని చెబుతున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షరా మామూలుగానే రచ్చ కొనసాగింది. తొలుత అభ్యర్థి విషయంలో పార్టీలో వివాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక మారరు. రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకారం అందించలేదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా లాభం లేదనే అభిప్రాయం జనంలోకి బాగా వెళ్లిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య రచ్చే  పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేసిందంటున్నారు.  ఇలా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయేలా చేయడంలో బీజేపీ అగ్రనేతల పాచిక పారిందంటున్నారు. తద్వారా కూడా బీజేపీ విజయం సాధించినట్లే అనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని చూపించడంలో ఆ పార్టీ నేతలు గెలిచారనే చెప్పాలని చెబుతున్నారు. టీఆర్ఎస్- బీజేపీ- కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటే గులాబీ పార్టీకి కలిసి రావచ్చని.. అందుకే అక్కడ ద్విముఖ పోటీకి రంగం సిద్ధం చేయాలనే వ్యూహాన్ని అమలు చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందంటున్నారు. టీఆర్ఎస్ తో ముఖాముఖి తలపడితే తిమ్మిని బమ్మిని చేసి అయినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చనేది బీజేపీ వ్యూహం అంటున్నారు. టీఆర్ఎస్ ను మట్టి కరిపించగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందనే సంకేతం పంపడంలో కమలనాథులు విజయం సాధించినట్లే అని చెబుతున్నారు. ఇప్పుడు ఓడిపోతే పోయింది కానీ.. అధికార టీఆర్ఎస్ పార్టీని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గడగడలాడించిందనే చెప్పాలంటున్నారు. ఉప ఎన్నికను సవాల్ గా తీసున్న కేసీఆర్ 14 మంది మంత్రుల్ని, సుమారు వంద మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపారు. తనతో సహా బీజేపీతో ఒక యుద్ధమే చేశారని చెప్పొచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీని చూసి  ఎంతలా వణికిపోతోందో చెప్పకుండానే చెప్పిందంటున్నారు. ఉప ఎన్నికలో బీజేపీ ఓడినప్పటికీ.. వ్యూహాత్మకంగా గెలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం స్వయంగాను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా మొత్తం పార్టీని ఇంతలా మోహరించినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ తక్కువ మెజార్టీ పరిమితం చేయడంలో బీజేపీ గెలిచిందంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సీపీఐ, సీపీఎం ఓట్ల వల్లే టీఆర్ఎస్ కు ఆ మాత్రం మెజారిటీ వచ్చిందంటున్నారు. లేదంటే టీఆర్ఎస్ పరిస్థితి ఇరకాటంలో పడేదనే అభిప్రాయాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెబుతున్నారు.

తమిళిసై.. ఇది మీకు తగునా..!

పక్కింటివాళ్లతో గొడవలు పడగూడదు. అందునా, వారితో ఇంకా సంబంధం ఉన్పప్పుడు. మా ఇంటావిడ మహా చిరాకు మనిషి అంటూ అద్దకి ఉన్న ఇల్లాలు గోడ కబుర్లలో పక్కింటావిడకి మాట చేరవేయ కూడదు. ఇక్కడే ఉంటూ ఇక్కడి భాషని, మనుషులను ఇష్టం లేనట్టుగా వ్యాఖ్యానించి తెలంగాణా గవర్నర్ తమిళిసై లేని తలనొప్పిని చుట్టుకున్నారు. తమిళనాడు వెళ్లి తమిళుల పత్రికలో వచ్చిన వ్యాసానికి హెచ్చరికలు చేయడంలో తప్పు లేదు. కానీ  తెలుగు రాష్ట్రానికి గవర్న్ గా ఉంటూ తెలుగు వారిని తక్కువచేసి మాట్లాడటమే అసలు గొడవ. తమిళులయినంత మాత్రాన తెలుగువారిని అవ హేళన చేయడమో, అవమానించడమో, కించపరచడాన్నో తెలుగువారు ఎలా భరిస్తారు.  ఎవరికి వారి ప్రాంతాలు, భాష ఇష్టం. రాజకీయపరంగా ఆలోచించినా వేరు రాష్ట్రాల్లో పనిచేసేవారు ఆయా ప్రాంతాల భాష, మనుషులను గౌరవించి ఎంతో కొంత కొత్త అంశాన్ని తెలుసుకుంటారు. కానీ అంటీ అంటనట్టుగా వ్యవహరించే గవర్నర్ గా తమిళిసై నే రాజీకీయ విమర్శకులు పేర్కొన్నారు. కారణం ఆమె పూర్తిగా తమిళనాడు మనిషినని, కేవలం గవర్నర్ గిరీ లో తెలుగు రాష్ట్రంలో ఉండవలసి వస్తోందన్న ధోరణనినే ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు బీజేపీ మనిషి అన్న ముద్ర ఉండనే ఉంది.  తెలుగువారు శాంతస్వభావులు గొడవలకు దిగే మనస్తత్వం లేనివారు గనుక పెనుప్రమాదమేమీ ముంచుకురాదు. కానీ అదే తమిళులను ఆమె అవమానించి ఉంటే పరిస్థితులు వేరేగా  ఉండే వేమో. అయినా అందరినీ సమానంగా చూడాల్సిన ఉన్నత పదవిలో ఉన్నవారు తక్కవు స్థాయిలో వ్యవహరించడం, ఇతర భాషను కించపరచడమేమిటి? కేవలం తెలుగు మీద అయిష్టతనే తమిళిసై తీరు ప్రదర్శిస్తుంది. తమిళనాడు లో ఉంటున్న,అనాదిగా అక్కడ ఉంటున్న తెలుగు వారెవరూ తమిళులను, తమిళ భాషను అగౌరవంగా చూసిన దాఖలాలు లేవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే తమిళులు తెలుగు పట్ల తెలుగువారి పట్ల అంటీఅంటనట్టుగా నే ఉంటున్నారు. తమిళనాడు ఒక గ్రామంలో ఒక తెలుగు బడిని మూసివేయాలని అక్కడి తమిళులు పట్టబట్టడం గమనార్హం. ఈ ధోరణిని ఉన్నతపదవుల్లో ఉన్నవారు కూడా ప్రదర్శిం చడమే ఊహించని అంశం.  తమిళనాడులు తమిళులుగా నటించేవారున్నారని, వారు వాస్తవానికి తమిళులు కాకున్నా బయట ఎక్కువగా తమిళం మాట్లాడుతూ, ఇంట్లో తెలుగు మాట్లాడుతూ కాలం గడిపేస్తుంటారన్న అభిప్రాయం తమిళిసై వ్యక్తం చేయడంలో ఆంతర్యమేమిటి అన్నది విశ్లేషకులు అడుగుతున్నారు. ఆమె తమిళురాలే కావచ్చు, కానీ ఒక ఉన్నత హోదాలో ఉన్నపుడు పనిచేస్తున్న ప్రాంతీయ భాషను, ప్రాంతీయులను కూడా అంతే స్థాయిలో చూడాలి, గౌరవిం చాలి. కానీ తెలంగాణ గవర్నర్ గా వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంతో విభేదాలతోనే కాలం గడుస్తోంది.  ముఖ్యమంత్రి చేసే అన్ని సిఫార్సులను గవర్నర్ ఆమో దించాలని లేదని ఆమె గతంలో అన్నారు. రాజ్యాంగ పరిధి కి లోబడే గవర్నర్ విధులు ఉంటాయని, దేన్నయినా విభేదిస్తే ప్రభుత్వం వివాదం చేయడం సరికాదన్నారు. పైగా అన్నింటినీ వ్యక్తి గత వ్యవహారాలకు ఆపాదించరాదనీ తమిళిసై అన్నారు. గవర్నర్ ను ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారంటూ ఆఫాదించడం సమంజసం కాదని, ప్రత్యేక ఆహ్వానాలు తిరస్కరించడం అవమానించడమే అవుతుం దని  తమిళిసై తెలం గాణా సర్కార్ తీరుపై వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు అసలు తెలుగువారి మీదనే పెద్దగా గౌరవం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.  డీఎంకే నేతలంతా వారి పూర్వీకులు తెలుగువారన్న విషయాన్ని మరుగునపరచి తమిళ భాషాభిమానుల వేషంతో ప్రజలను మోసం చేస్తున్నారని, తాను తెలంగాణా గవర్నర్‌గా అక్కడి శాసనసభలో తిరుక్కురళ్‌ను తమిళంలో పఠించి అసలు సిసలైన తమిళ ఆడపడుచుగా వ్యవహరిస్తున్నానని అన్నారు. ఎక్కడుంటే అక్కడి సంప్రదాయా లను, ఎంతో కొంత ఆ భాషాభిమానాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదు. కానీ అది తమిళిసై దృష్టిలో నటన  అయి పోయింది. అనాదిగా తమిళనాడులో ఉంటున్న తెలుగు వారు తాము క్రమేపీ తమిళులమే అంటున్నారు. పైగా ఇప్పటి తరం వారు తమిళులమనే అంటున్నారు. వారితో కలిసిపోయారు. తాము తెలుగు వారమన్న ఆలోచనే మర్చిపోయారు. అలాంటి వారి మధ్య విభేదాలు సృష్టించేలా గవర్నర్ కామెంట్ చేయడం దారుణం. తెలుగువారిని తక్కువ చేయడమే అవుతుందని విశ్లేషకుల మాట.  మనసులో తెలుగు పట్ల, తెలుగువారి పట్ల ఏమాత్రం గౌరవం లేనివిధంగా వ్యవహరిస్తున్నవారే తెలుగు పట్ల వీరాభిమానం ఉన్నట్టు నటించడం జరుగుతోంది. తనకు తెలుగు పట్ల, సంప్రదాయాలు, పండుగల పట్ల ఎంతో గౌరవం ఉందని, తనకూ ఎంతో తెలుసునని తెలంగాణా గవర్నర్ గతంలో అన్నారు. కానీ రాజకీయాల దృష్టితోనే చూడడం తో ఆమె అభిప్రాయాల్లోనూ రాజకీయ కోణమే కనపడుతోంది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రం అనగానే తెలుగువారితో కలిసిన తమిళులు జీవిస్తున్న సమైక్య మద్రాసు రాష్ట్రమే. కానీ కాలక్రమంలో భాషాప్రాంతాలుగా విడిపోయిన సమ యంలో ఆంధ్రప్రదేశ్ అవతరించి ప్రత్యేకతలు చాటుతోంది. కానీ గవర్నర్ గిరీలో వచ్చినవారెవ్వరూ సమైక్యఆంధ్రా గాని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రాంతాన్నిగాని తక్కువగా చూడలేదు. తమిళిసై గవర్నర్ గా వచ్చిన క్షణం నుంచే తెలం గాణా ప్రభుత్వంతో విభేదాలు చోటుచేసుకున్నాయి. ఆమె గవర్నర్గా కంటే బీజేపీ మనిషిలా వ్యవహ రిస్తోందన్న ఆరోపణలే ఎక్కువగా వినపడ్డాయి. కేంద్రం మాట మాత్రమే శిరోధార్యం అంటూనే ఇక్కడి ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా లేకపోవడం పరిస్థితులు మరింత విభేదాలకు దారితీయడం అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. భాష కంటే రాజకీయ కోణంలోనే ఆమె వ్యవహార శైలి వ్యాఖ్యానిస్తోందని అంద రూ గుర్తించారు. 

భారీ వ్యయం.. వృధా ప్రచారం.. మునుగోడు ఫలితంపై విజేతలదీ.. పరాజితులదీ ఒకటే మాట!

మునుగోడు అత్యంత ఖరీదైన ఎన్నికగా చరిత్ర సృష్టించబోతున్నదని తెలుగువన్ ముందుగానే చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. ఎన్నికల వ్యయం విషయంలో మునుగోడు ఉప ఎన్నిక గత రికార్డులన్నీ చెరిపేసింది. డబ్బు మద్యం యథేచ్ఛగా ప్రవహించాయి. గత ఏడాది అక్టోబర్ లో జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అప్పటికి రికార్డు.. మునుగోడు ఉప ఎన్నిక ఆ రికార్డును తిరగరాసింది. మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పది వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించింది. విజయంపై ధీమాతో ఉన్న బీజేపీ చతికిల పడింది. కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాక తన పతనావస్థను మరింత సుస్థిర పరుచుకుంది.  మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అని స్పష్టమైన క్షణం నుంచీ ఆ నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఏరులై ప్రవహించాయి. ఆగస్టు నెలలోనే చుండూరు, నాంపల్లి, రామన్న పేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిథిలో లక్షా పదకొండు వేల 279 కేసుల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.   ఆ తరువాత ఉప ఎన్నిక పోలింగ్ వరకూ అంతకు ఎన్నో రెట్ల కేసుల మద్యం విక్రయాలు జరిగాయని పరిశీలకులు లెక్కలు చెబుతున్నారు. ఇక డబ్బు అయితే చెప్పనే అక్కర్లేదు. నియోజకవర్గంలో గెలవడం కోసం అధికార తెరాస ఓటుకు ఐదు వేలు చొప్పున పంచిందని చెబుతున్నారు. అయితే ఒక్కో ఏరియాలో ఇది పది వేలు కూడా దాటిందన్న సమాచారమూ ఉంది. ఇక బీజేపీ కూడా ఏ మంత తక్కువ తినలేదు.. ఆ పార్టీ కూడా ఓటుకు నాలుగువేల రూపాయల చొప్పున పంచిందని చెబుతున్నారు. వాస్తవానికి అంత కంటే ఎక్కువే పంచిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోనే.. కాదు దేశ వ్యాప్తంగా కూడా అత్యంత ఆసక్తికరమైన ఉప ఎన్నికగా గుర్తింపు పొందిన మునుగోడు  ఉప ఎన్నిక పూర్తయ్యింది. ఫలితం కూడా వెలువడింది.   పది వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తెరాస విజయం సాధించింది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాలలోనే కాదు.. రాజకీయ పార్టీలలో సైతం చర్చనీయాంశంగా మారిన అంశం ఏమిటంటే.. ఒక్క ఉప ఎన్నికకే ఇంత వ్యయం అయితే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకెంత ఖర్చు పెట్టాలనే. ఈ చర్చ రాజకీయ పరిశీలకులోనే కాదు, తెరాస, బీజేపీ పార్టీలలో టికెట్ ఆశావహుల్లో కూడా జరుగుతోంది. ఎన్నికల్లో పోటీకి దిగిన వారందరికీ అంతంత ఖర్చు పెట్టిన స్థోమత ఉంటుందా? అయినా అంత ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా? ఇంత వ్యయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఏ విధంగానైనా దోహదం చేస్తుందా అన్న ప్రశ్నలు పార్టీ వర్గాలలోనే చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించామంటూ సంబరాలు చేసుకుంటున్నప్పటికీ.. అది నిజమైన విజయమేనా అన్న ప్రశ్నలు పార్టీలోనే వినవస్తున్నాయి. అలాగే బీజేపీలో కూడా ఇంత ఖర్చు పెట్టి ఓట్లు, పలుకుబడి పెంచుకున్నామని చెప్పుకుంటున్నా.. నిజంగా మునుగోడులో పార్టీ బలపడిందా అన్న సందేహాలు కమలం శ్రేణుల్లోనే వినవస్తున్నాయి.  ఇక తెరాస విషయానికి వస్తే...    ఆ పార్టీ విజయం సాధించినా కోట్ల రూపాయల వ్యయం చేస్తే కేవలం పది వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ కే పరిమితం కావడం ఆ పార్టీకి పెద్దగా సంతోషాన్నిచ్చే విషయం అయితే ఎంత మాత్రం కాదు. గత ఎనిమిదేళ్లుగా దూరంగా ఉన్న వామపక్షాలను ఈ సారి కలుపుకోవడం వల్లనే ఆ మాత్రమైనా మెజారిటీ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలకు పది వేల ఓట్లు ఉన్నాయి. వామపక్షాల క్యాడర్ పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారన్నది ప్రతీతి. అందుకే కమ్యూనిస్టుల మద్దతు కారణంగానే తెరాస మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిందన్న విశ్లేషణలు వెల్లువెత్తతున్నాయి. ప్రతి ఓటుకూ వేల రూపాయలు వెచ్చించి, మద్యం ప్రవహింప చేసినా సొంత బలం ఇసుమంతైనా పెరగక పోవడం రానున్న అసెంబ్లీ ఎన్నికల విషయంలో ధీమాగా ఉండే అవకాశాన్ని ఈ విజయం టీఆర్ఎస్ కు ఇవ్వలేదనేది పరిశీలకుల మాట. ఇక బీజేపీ విషయానికి వస్తే.. మునుగోడు ఉప ఎన్నిక విజయంతో తెలంగాణలో తమకు తిరుగేలేదని చాటాలనుకున్న ఆ వ్యూహం బెడిసి కొట్టింది. తెలంగాణలో ఆ పార్టీ ఇప్పటి వరకూ చాటుకుంటున్నట్లు బలం పెరగలేదనీ, ఇదంతా కేవలం కమలం నేతల బిల్డప్ మాత్రమేననీ ఈ ఉప ఎన్నిక స్పష్టంగా చాటింది. అన్నిటికీ మించి ఇప్పటి దాకా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ను మట్టి కరిపించానని ఆ పార్టీ చెప్పుకుంటున్న మాటలపై కూడా అనుమానాలకు కలిగేలా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చింది. దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ విజయానికి ఆయా స్థానాలలో గెలిచిన రఘునందనరావు, ఈటలల సొంత ఇమేజేనని మునుగోడు ఫలితంతో తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు మునుగోడులో బీజేపీకి ఓట్లు గణనీయంగా పెరిగాయని చెప్పుకోవాలనుకున్న ఆ పెరిగిన ఓట్లన్నీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సొంత ఇమేజ్ వల్ల వచ్చినవేననీ, కమలానికి పెరిగిన బలమేమీ లేదని వారు చెబుతున్నారు.  ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఈ ఉప ఎన్నికలో పెద్దగా డబ్బు ఖర్చు చేయలేదని చెబుతున్నారు. సిట్టింగ్ సీటును దక్కంచుకోవడం అటుంచి.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎలా నెగ్గుకొస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఈ పరాజయం తెరాసకు మేమే ప్రత్యామ్నాయం అంటు చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నిస్సందేహంగా శరాఘాతమే.  ఏ విధంగా చూసినా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం గెలిచిన పార్టీకీ, ఓడిన పార్టీలకూ కూడా అసంతృప్తినే మిగిల్చింది.

సూపర్ స్టార్ల మధ్యే  అసలు పోటీ!

హమ్మయ్య...సూపర్ 12 గ్రూప్ 42 మ్యాచ్ ల కష్టాల నుంచి బయటపడి మొత్తానికి టీ20 ప్రపంచకప్ సెమీస్ లోకి నాలుగు జట్లు సెమీస్ చేరుకున్నాయి. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, భారత్, 2 నుంచి పాకిస్తాన్, న్యూజి లాండ్ ఊహించని విజయా లతో, అవాంతరాలను అధిగ మించడంతో సెమీస్ లో తల పడేందుకు సిద్ధపడ్డాయి. బుధవారం సిడ్నీలో పాకిస్తాన్  న్యూజిలాండ్ తో తలపడుతుంది. గురువారం మరో సెమీస్ లో భారత్ అడెలైడ్ లో ఇంగ్లండ్ తో తలపడుతుంది. వెస్టిండీస్, ఆతిథ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కూడా చేరలేకపోవడం, టోర్నీ నుంచి ఇక కరాచీ వెళ్లడమే ఆలస్యం అనుకున్న పాకిస్తాన్  కి మంచి అవకాశం రావడం  క్రికెట్ వీరాభిమనానులను ఎంతో ఆశ్చర్యపరిచింది.  ఈసారి సెమీస్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బయటికి పోతుందని అందరూ అనుకున్న పాకిస్తాన్ సెమీస్ చేరుకుంది. వారి సీనియర్లు, మాజీల చేత తిట్టు తింటున్న పాక్ ప్లేయర్లు సెమీస్ చేరడంలో చివరి గ్రూప్ మ్యాచ్ లో రాణించారు. కనుక సెమీస్ కి మరింత ఉత్కంఠత చేకూర్చింది.  వాస్తవా నికి నాలుగు మ్యాచ్ ల మధ్య జరిగే పోరు కంటే సూపర్ స్టార్లు మధ్య పోటీ అనాలి. కేన్ విలియంసన్, కింగ్ కోహ్లీ, జోస్ బట్లర్, అఫ్రిదీ, గ్లెన్ ఫిలిప్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిజ్వాన్ సత్తా మరింతగా ప్రేక్షకులు ఆస్వాదించనున్నారు. గెలిచినా, ఓడినా, చివరగా టైటిల్ పోటీకి నిలిచినా, ఓడినా.. ఏమయినప్పటికీ సెమీస్ నుంచీ టైటిల్, విజేత వరకూ ఈ నాలుగు జట్ల లోని హేమాహేమీల మధ్య హోరాహోరీ పోటీతత్వం చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లెక్కల ప్రకారం చూస్తే, ఇంతవరకూ జరిగిన మ్యాచ్ లు ఫలితాల ప్రకారం చూస్తే అదృష్టం కూడా కలిసి వస్తే భారత్ టైటిల్ నెగ్గడానికే అవకాశాలున్నాయని క్రికెట్ పండితుల మాట. కానీ కివీస్ ని మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మిగతా రెండు జట్ట కంటే ఈసారి కివీస్ మరింత పదునుగా ఉంది.  టైటిల్ సాధించేందుకు అన్ని విధాలా గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. కనుక మనవాళ్లు బహు జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతయినా ఉంది. భారీ షాట్ల మీదనే దృష్టి పెట్టడం కంటే స్కోర్ ను పరుగులెత్తించడానికి వేగంగా పరుగులు చేయడం పైనే కెప్టెన్ శర్మ, రాహు లుడూ శ్రమించాల్సి ఉంటుంది.  గ్రూప్ మ్యాచ్ ల్లో చివరగా విలియంసన్ కివీస్ జట్టు ఆస్ట్రేలియా పై గెలిచి తమ సత్తాను మరోసారి తెలియజేసింది. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడిన మ్యాచ్ వర్షార్ఫణమే అయినా వారి ప్రయాణాన్ని అడ్డుకోలేదు. గ్లెన్ ఫిలిప్స్ వంటి డాషింగ్ బ్యాటర్ వెన్నుదన్నుగా లంక ను వెనక్కి పంపగలిగింది. గ్లెన్ 64 బంతుల్లో సెంచరీ సాధించడంలో గొప్ప బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించి అలరించాడు. ఐర్తాండ్ తో ఆడిన మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ విలియంసన్ మంచి ఫామ్  ప్రద ర్శించి జట్టుకు సునాయాశ విజయాన్నే అందించాడు.  కివీస్  ఆఫ్ఘన్ తో తలపడిన తర్వాత మూడు మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ చేతుల్లో కేవలం 20 పరుగుల తేడాతో ఓడినప్పటికీ ఐర్లాండ్ మీద 35 పరుగులతో గెలచింది. అలా ఈసారి సెమీస్ కు ముందుగా చేరింది. తమ బ్యాటింగ్, ఫీల్డింగ్ సత్తాతో ఆసీస్, ఇంగ్లండ్ జట్లకు హెచ్చరికలు చేయడం గమనించాం.  కానీ భారత్ తో తలపడిన హోరాహోరీ పోరులో మ్యాచ్ లో  2009 ఛాంపియన్లు ఊహించని పరాభవమే ఎదుర్కొన్నది. అంతకు మించి జింబాబ్వే చేతిలో ఓడి అమితాశ్చర్యపరిచింది.  గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టు ఇంగ్లండ్. వర్షం దెబ్బతీసిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై 5 పరుగుల తేడాతో అదీ డిఎల్ఎస్ పద్దతిలో గెలిచి సెమీస్ చేరుకుంది. అయితే అందుకు ముందు మ్యాచ్ జోస్ బట్లర్ జట్టు ఆఫ్ఘన్ పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయమే సాధించింది. అలాగే న్యూజిలాండ్ పై 20 పరుగులతో, లంక పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్ కి మార్గం సుగమం చేసుకుంది.  పాకిస్తాన్ విషయానికి వస్తే, బాబర్ అజామ్ జట్టు కొంత పేలవంగా ఆడుతూ ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ గ్రూప్ మ్యాచ్ ల్లో చివరి దశలో దక్షిణాఫ్రికా పై ఘనవిజయంతో సెమీస్ అవకాశాలు నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ తో హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లో గెలిచి ఫైనల్ ఫోర్ లో నిలిచి అభిమానులకు ఆనందం కలిగించింది. ఆ మ్యాచ్ లో వారి ప్రధాన పేసర్ షాహిన్ అఫ్రిదీ అద్భుతంగా రాణించి 22 పరుగులిచ్చి 4 వికెట్ల తీసుకోవడంలో తాను తిరిగి మంచి ఫామ్ లోకి వచ్చానని ప్రకటించాడు. కానీ  జట్టును మాత్రం కెప్టెన్  బాబార్ అజామ్ అంతగా ఫామ్ లో లేకపోవడమే  ఇంకా వేధిస్తోంది. 5 మ్యాచ్ ల్లో అతను కేవలం 39 పరుగులే చేయగలిగాడు.  రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టు గ్రూప్ మ్యచ్ ల్లో పాకిస్తాన్ పై సాధించిన విజయమే కీలకంగా మారింది. 90 వేలమంది ప్రేక్షకుల మధ్య దాయాదులను చిత్తు చేయడంలో కింగ్ కోహ్లీ సూపర్ డూపర్ బ్యాటింగ్ ప్రదర్శన క్రికెట్ లోకం చూసి ఆనందోత్సాహంలో మునిగితేలింది. పాక్, నెదర్లాండ్స్ పై విజయాలు తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి భారత్ పెద్దగా బాధించలేదు. కానీ గెలిచి ఉంటే ఆనందం వేరేగా ఉండేది. కానీ టోర్నీలో అందరి కంటే ప్రముఖ బ్యాటర్ గా కింగ్ అందరి మన్ననలూ అందుకోవడం గమనార్హం. అతని ధాటికి  ప్రత్యర్థులకు ఫైనల్ భయాలు పట్టుకున్నాయి. అతనితో పాటు సూపర్ ఫాస్ట్ ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ అవతరించడంతో మిడిల్ ఆర్డర్ కు ఢోకా లేకపోవడం మంచి స్కోర్ కి అవకాశాలు మెరుగుపడటంతో ఫైనల్ కి అవకాశాలు మెరుగుపడి నట్టే నని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. టీ20 ప్రపంచకప్ తొలి టైటిల్ సాధించిన భారత్ ఈ పర్యాయం కప్ సాధించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. 

 గాడిద మాంసంతో శృంగార సామర్థ్యం

సరిగా చదవని పిల్లాడిని గాడిద అని మాస్టారు, గాడిదలా ఉన్నావ్.. ఆ మాత్రం తెలీదా అని అసభ్యంగా ప్రవర్తించిన వాడిని అనేయడం సర్వసాధారణం. అసలు లోకంలోకి ముందే  వచ్చిన జంతుజీవాలంటే మనిషికి మహా చులకన.  కొన్నింటిని మన పనులకు, కొన్నింటిని రక్షణకు ఉపయోగించుకుంటున్నా మేగాని, వాటివల్ల కలిగే ప్రయోజనాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. చాలామంది మేకని తింటారు, మేక పాలు తాగుతారు, గాడిద చేత చాకిరీ  చేయించు కుంటారు కానీ పాలు తాగమంటే చిరాకుపడతారు. అది బట్టలు మోసే గాడిదేగాని పాలిచ్చి మనిషి ఆరోగ్యానికి మేలు చేసేంత సీన్ లేదనే అభిప్రాయాలే ఎక్కువ. కానీ గాడిద పాలు, మాంసానికి చాలా డిమాండ్ ఉందన్నది ఇటీవలే బయటపడింది.  గాడిద మాంసం తినడం వల్ల మగవాళ్లలో శృంగార సామర్ధ్యం పెరుగుతుందనే ప్రచారం కూడా ఉంది. అంతే కాదు గాడిద మాంసం తింటే గుండె జబ్బులు, ఆస్తమా., కీళ్ల నొప్పుల సమస్య ఉండవని వైద్యులు సైతం చెప్పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గాడిద మాంసం విక్రయాలు పెరిగాయి. మార్కెట్‌లో గాడిద మాంసానికి ఉన్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని కొందరు అక్రమంగా గాడిద మాంసాన్ని తెచ్చి సొమ్ము చేసుకుంటున్న వాళ్లు బాగా పెరిగిపోయారు. అందుకే అక్రమంగా గాడిద మాంసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడమూ పెరిగింది.   ఆంధ్రప్రదేశ్‌లో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కారణం ఏదైనా కావచ్చు ఇప్పుడు మాత్రం అక్కడి జనం గాడిదమాంసం కోసం ఎగబడుతున్నారు. కిలో 600రూపాయలకు అమ్ముతు న్నారు. అంటే మటన్ కంటే కేవలం వంద రూపాయలు తక్కువ ధరకు, చికెన్‌ కంటే మూడు రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ విషయం జంతుసంరక్షణ కోరుకునే యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్‌, హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీకి చెందిన వాళ్లు పెటా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశా రు. స్థానికులు ఇచ్చిన  సమాచారంతో  బాపట్ల పోలీసులు జిల్లాలోని ఉజిలిపేటలో రెండు చోట్ల వేట పాలెం లోనూ దాడులు నిర్వహించి 400కేజీల గాడిద మాంసంతో పాటు గాడిదతోకలు, గాడిద శరీరభాగాలను స్వాధీ నం చేసుకున్నారు. ఇక అక్రమంగా గాడిద మాంసం విక్రయిస్తున్న వారిపై ఐపీసీ సెక్షన్ 1860లోని వివిధ నిబంధనల ప్రకారం 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లతో పాటు వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. అక్రమ వ్యాపారంతో వధకు పాల్పడిన వ్యక్తులందరినీ కూడా అరెస్టు చేశారు.  అయితే, భారతదేశంలో గత ఏడేళ్లలో గాడిదల సంఖ్య 61శాతం తగ్గింది. 2019 లెక్కల ప్రకారం దేశంలో 1.2లక్షల గాడిదలు మాత్రమే ఉన్నాయి. 2012 నుంచి దేశంలో 60శాతం గాడిదలు అంతరించిపో యా యి. దీంతో వీటిని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ , తమిళనాడు, మహారాష్ట్ర , కర్ణాటకల నుంచి అక్రమంగా తర లిస్తున్నారు.పెటా ప్రకారం గాడిదలను చంపడం, మాంసం తినడం నేరంగా పరిగణించి వారికి కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.

సీబీఐ కిచ్చిన వాంగ్మూలంతో తెలుగుదేశం పార్టీకి షర్మిల క్లీన్ చిట్!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు వెనుక ఉన్న చిక్కుముడులు విడివడుతున్న సంకేతాలు గోచరిస్తున్నాయి. మూడేళ్ల తరువాతైనా ఈ కేసులో నిందితులు ఎవరన్నది బయటపే సూచనలు కనిపించడానికి వివేకా కుమార్తె డాక్టర్ సునీత అలుపెరుగని న్యాయ పోరాటం ఒక కారణమైతే.. మరో కారణం మాత్రం కచ్చితంగా వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలేననడంలో సందేహం లేదు. ఈ కేసులో షర్మిల ఢిల్లీ వెళ్లి మరీ వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసులో నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండటమే కాదు.. తాడేపల్లిలోని జగన్ ప్యాలస్ కూడా షేక్ అవ్వడం మొదలైందని అంటున్నారు. షర్మిల వాంగ్మూలంతోనే వివేకా హత్య కేసు వెనుక కుటుంబ కలహాలు, రాజకీయ నేపథ్యం ఉన్నాయన్న విషయం నిర్ధారణ అయ్యిందని కూడా చెబుతున్నారు. షర్మిల వాంగ్మూలం కారణంగానే వివేకా హత్య కేసు సూత్రధారులు, పాత్రధారులు కూడా తప్పించుకోలేకుండా ఇరుక్కోవడం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ హత్య కేసు విచారణను రాష్ట్రం బయట జరపడానికి సుప్రీం సూత్ర ప్రాయంగా అంగీకరించడంతో విచారణ వేరే రాష్ట్రానికి మారడం ఖాయమనీ, అప్పుడు ఇప్పట్లా కడప జిల్లా పులివెందులలో దర్యాప్తునకు ఆటంకాలు కలిగించినట్లు కలిగించడం సాధ్యం కాదనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వివేకా హత్య కేసులో గుండె పోటు.. నరాసుర రక్త చరిత్ర వంటి వైసీపీ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని ఇప్పటికే తేలిపోయిన నేపథ్యంలో.. అప్పట్లో అటువంటి వార్తలు మీడియాలో రావడానికి వెనుక ఉన్న కారణాలు, వ్యక్తుల గుట్టు కూడా రట్టయ్యే పరిస్థితి షర్మిల వాంగ్మూలంతో ఏర్పడిందని చెబుతున్నారు. షర్మిల వాంగ్మూలం వివేకా హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి క్లీన్ చిట్ ఇవ్వడంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో తన సొంత అన్న జగన్, ఆయన ప్రభుత్వాన్ని షర్మిల వాంగ్మూలం షేక్ చేసేసిందని అంటున్నారు. వైసీపీ శ్రేణులే షర్మిల చెప్పినవే వాస్తవాలు అయి ఉంటాయని భావించే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక ప్రజలు కూడా షర్మిల మాటలనే విశ్వసిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. షర్మిల వాంగ్మూలం ఇప్పటికే వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేసిందనీ, ఇక విచారణ జరిగి దోషులను చట్టం ముందుకు తీసుకురావడం అన్నది కోర్టులు, దర్యాప్తు సంస్థలు చేయాల్సిన పని అని జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో జనం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో సీబీఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలంతో వైసీపీ రాజకీయంగా డిఫెన్స్ లో పడింది.   అందుకు నిదర్శనం షర్మిల వాంగ్మూలం మీడియాలో వచ్చిన తరువాత కూడా వైసీసీ వర్గీయుల నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందనా రాకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు.. కడప ఎంపీ సీటు కోసమేనని షర్మిల మీడియా ముఖంగా ప్రకటించిన తరువాత కూడా వైసీపీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీనినే పరిశీలకులు వైసీసీ ఆత్మరక్షణలో పడిందనడానికి తార్కానంగా చెబుతున్నారు.     షర్మిల తాజాగా వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి ఉన్నారన్నది తన అనుమానం అంటూ సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చినట్లుగా లీక్ అవ్వడంతో వైసీపీ మైండ్ బ్లాక్ అయినట్లు కనిపిస్తోంది.  షర్మిల వాంగ్మూలంతో తెలుగుదేశం ఇంత కాలం భరిస్తూ వచ్చిన ఆరోపణలను నుంచి పూర్తిగా విముక్తి పొందిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  వివేకా కూతురే కాకుండా.. జగన్ కు స్వయానా తోడబుట్టిన సోదరి కూడా  తన చిన్నాన్న హత్యలో ఎవరున్నారో వెల్లడించిన నేపథ్యంలో, జగన్‌ హత్యా రాజకీయాల చరిత్రను గమనించాలంటూ, టీడీపీ విమర్శల దాడి ప్రారంభించింది.  షర్మిల వాంగ్మూలంపై దమ్ముంటే మాట్లాడాలని ఏకంగా జగన్ కే సవాల్‌ విసిరింది. అయినా జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. నిజానికి తన వాంగ్మూలంతోనే వివేకా హత్య పూర్తిగా కుటుంబంలో రాజకీయ ఆకాంక్షల కారణంగా జరిగిందనీ, ఈ హత్య వెనుక ఉన్నది కుటుంబానికి చెందిన వారేననీ షర్మిల విస్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు వైసీపీలో ఎవరైనా సరే ఈ హత్య వెనుక టీడీపీ ఉందని ఎదురుదాడి చేద్దామనుకున్నా, చేయాలనుకున్నా జనం నమ్మరని తెలియడంతోనే ఆ పార్టీ మౌనాన్నే ఆశ్రయించిందని పరిశీలకులు అంటున్నారు. పైగా ఇదంతా జగన్‌ కుటుంబ వ్యవహారం, ఇందులో తలదూర్చి మాట్లాడాల్సిన అవసరం మాకేమిటని కూడా కొందరు వైసీపీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తం మీద షర్మిల వాంగ్మూలం జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసిందన్నది మాత్రం కాదనలేని వాస్తవమని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.అలాగే వివేకా హత్య విషయంలో తమ పార్టీ  టీడీపీపై వేసిన  ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని కూడా ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడిపోయిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.  

అగ్నిపర్వతం హిమాలయాన్నేమీ చేయలేదు..తమిళిసై

తమిళనాడు గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై మళ్లీ ఆగ్రహించారు.  తాము తమిళులమని భావించుకునే వారు అసలుసిసలు తమిళుల వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. డిఎంకె పత్రిక మురసొలి లో ఆమె పై వచ్చిన వ్యాసం పై తమిళిసై స్పందించారు. తనను అగ్నిపర్వతంగా ప్రచారం చేసుకుం టున్న పార్టీ హిమాలయాన్నేమీ చేయలేదని అన్నారు. వాస్తవాలు మింగుడుపడనివారు, నిజాలు మాట్లాడని వారే భయానికి లోనవుతుంటారని, డీఎంకె కి మోదీ ఫోబియా పట్టుకుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలించే విధంగా, సహాయసహకారాలు అందించేవిధంగా పనిచేయాలని లేకుంటే  తెలంగాణా గవర్నర్ తమిళిసై పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందని డిఎంకే తమిళనాడు గవర్న ర్ను హెచ్చరించింది. గవర్నర్లు తమ తప్పులు తెలుసుకుని వ్యవహరించాలని, అందుకు గొప్ప ఉదాహ రణ తమిళిసై అంటూ డిఎంకె అధికార పత్రిక మునసోలీలో ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ విధంగా గవర్నర్ వ్యవస్థను హెచ్చరించచడం, అవమానించడంపై తమిళిసై మండిపడ్డారు. పిరికివారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారన్నారు.  గవర్నర్ వ్యవస్థ గురించి డిఎంకె ఆ విధంగా వ్యాఖ్యానించడం ఎంత వరకూ సబబు అని తమిళ రాజకీయ  పరిశీల కులు ప్రశ్నిస్తున్నారు.  గతంలో తెలంగాణా ప్రభుత్వంతో కూడా తమిళిసై విభేదించారు. రాజ్ భవన్, తెలంగాణ సర్కార్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. నెలరోజుల తర్వాత హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా కలిసినపుడు మాట్లాడుకున్నారు. కానీ విబేదాలు మాత్రం కొనసాగి తనను కేసీఆర్ సర్కార్ అవమా నిస్తోందని ప్రకటనలూ చేశారు. ఇదే పరిస్థితుల్లో ఆమె గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేశారు.  తనది ఎవరికి భయపడే స్వభావం కాదన్న తమిళి సై... తనను ఎవరూ తక్కువగా చేసి చూసినా సహించ నని చెప్పారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిం చారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందన్నారు.ప్రభుత్వం చాలాసార్లు కావాలని ఇబ్బంది పెట్టినా తాను భయపడలేదని గవర్నర్ తమిళి సై తెలిపారు. తనపై ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.  గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. గవర్నర్ కార్యాలయం అయిన రాజ్ భవన్ పై ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కిందన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు

తాడేపల్లి ప్యాలస్ ను ముట్టడిస్తాం జాగ్రత్త.. జగన్ కు గోరంట్ల హెచ్చరిక

జగన్ పాలనలో ఇకపై ఓ ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు నష్టం జరిగినా తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తాం తస్మాత్ జాగ్రత్త అంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సంఘీ భావంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి 125 కార్లలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నర్సీపట్నానికి ర్యాలీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా వారు అయ్యన్న పాత్రుడికి సంఘీ భావం తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వందల మంది వచ్చి మద్దతుగా నిలవడం తనకు కొండంత ధైర్యాన్నిచ్చిందన్న అయ్యన్నపాత్రుడు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. కాగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ఆయన జగన్ పై నిప్పులు చెరిగారు. విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర అంటూ మూడేళ్లు తిరిగిన నిన్ను ఏనాడైనా అడ్డగించామా అంటూ జగన్ ను నిలదీశారు. అయినా సీఐడీ పోలీసులు పగలంతా ఏం చేస్తుంటారు.. అరెస్టులు అర్దరాత్రి దాటిన తరువాతే  ఎందుకు చేస్తారు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిపై ఏదో ఒక సాకుతో   కేసులు పెడుతూనే ఉన్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ అయ్యన్న కుమారుడు విజయ్ ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్ వివేకా కుమార్తెకు క్యాపిటల్ ఫౌండేషన్ పురస్కారం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్   సునీతకు  క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం దక్కింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డాక్టర్ సునీతకు  భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్  అందజేశారు.   వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్.. జస్టిస్ కృష్ణయ్యర్ ఉచిత న్యాయ సేవల విభాగంతో కలిసి ఈ అవార్డులను అందజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో పాటు పలు సంస్థల్లో సభ్యురాలిగా సునీత అందిస్తున్న డాక్టర్ సునీత ఈ పురస్కారం అందుకున్నారు. పురస్కారం అందుకున్న తరువాత మీడియాతో మాట్లాడిన సునీత  అంటువ్యాధుల్లో టీబీతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో అంటువ్యాధుల వ్యాప్తి నివారణపై ప్రపంచ వ్యాప్తంగా శ్రద్ధ తగ్గిందన్నారు. కాగా డాక్టర్ సునీత తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య కేసు విచారణ ఏపీలో అయితే సరిగా జరగదని, నిందితులకు ప్రభుత్వం కాపాడే యత్నం చేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రం బయట విచారణ జరగాలని కోరుతూ సుప్రీం ను ఆశ్రయించిన సంగతి విదితమే. సుప్రీం కోర్టు కూడా ఏపీ బయట విచారణకు అంగీకారం తెలిపింది. ఒక వైపు తన తండ్రి హంతకులకు శిక్ష పడాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తూనే.. మరో వైపు అంటువ్యాధుల నియంత్రణపై వృత్తి పరంగా సేవలు కొనసాగిస్తున్న సునీతకు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం లభించడం ముదావహం.

ఉప ఎన్నికల్లో కమల వికాసం

మునుగోడులో ఓడినా.. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలల బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. తెలంగాణలోని మునుగోడు సహా దేశ వ్యాప్తంగా 7 నియోజకవర్గాలకు జరిగిన ఉన ఎన్నికల ఫలితాలు ఆదివారం (నవంబర్6) వెలువడ్డాయి. వీటిలో నాలుగింటిలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మునుగోడు, బీహార్ లోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే మహారాష్ట్రలోని ఒక నియోజకవర్గంలో బీజేపీకి పరాజయం ఎదురైంది. మిగిలిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ కమల వికాసమే జరిగింది. బీహార్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా వాటిలో మకావూలో పరాజయం పాలైన బీజేపీ గపాల్ గంజ్ నియోజకవర్గంలో జయకేతనం ఎగుర వేసింది.  ఉత్తరప్రదేశ్, , ఒడిశా, హర్యానా, మహారాష్ట్లలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరగగా అక్కడ బీజేపీ గెలుపొందింది.  

బ్యాటింగ్ విధ్వంసానికి కొత్త పేరు సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ క్రికట్ లో ఇప్పుడీ పేరొక సంచలనం. వేసవి కాలం మిట్టమధ్యాహ్నం రోహిణీ కార్తెలో బయటకు వెడితే వడ దెబ్బ తగులుతుందో లేదో చెప్ప లేం కానీ.. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో ఉంటే మాత్రం బౌలర్లకు బౌండరీ దెబ్బలు తప్పవు. మధ్యందిన మార్తాండుడిని మించిన తీక్షణతతో సూర్యకుమార్ యాదవ్ బౌలర్లపై విరుచుకు పడతాడు. అలాంటి బ్యాటింగ్ విధ్వంసం గతంలో డివీలియర్స్ నుంచి చూసేవాళ్లం. ఇప్పుడు డివీలియర్స్ రిటైర్ అయిపోయాడు. ఇక ఆ బ్యాటింగ్ మెరుపులు చూడలేమా? అనుకున్న వారికి సూర్యకుమార్ యాదవ్ అంతకు మించి అంటూ వచ్చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎంతటి వాడైనా తగ్గేదే లే అంటూ బంతిని బౌండరీకి తరలించి ఔరా అనిపిస్తున్నాడు. క్రికెట్ షాట్లకు సృజనను జోడించి క్రికెట్ బ్రెయిన్ ను అప్లై చేసి మంచి బంతిని కూడా సిక్సర్ కొట్టే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదని దిగ్గజ క్రికెటర్లు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆదివారం(నవంబ్6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ నే తీసుకుంటే క్రికెటింగ్ షాట్లతో పాటు..సూర్యకుమార్ తనవైన ప్రత్యేక షాట్లతో అలరించాడు. బంతి ఏదైనా బౌండరీకి తరలాల్సిందే అన్నట్లుగా ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ ఆవల దాదాపు వైడ్ అన్నట్లుగా పడిన బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్రర్ కు తరలించిన షాట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతి ఎక్కడ వేస్తే సూర్యకుమార్ బౌండరీ కొట్టకుండా ఆపగలమో బౌలర్లకే అర్ధంకాలేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఖాతాలోకి పలు రికార్డులు వచ్చి పడ్డాయి. ఒక క్యాలెండర్ ఇయర్ లో టి20ల్లో శతకం చేసిన తొలి ఇండియన్ గా, అలాగే ఒక క్యాలండర్ ఇయర్ గా టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. తన కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకూ 39 మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 1270 పరుగులు చేశాడు. అందులో వేయ్యీ ఆరు పరుగులు ఈ క్యాలెండర్ ఇయర్ లో చేసినవే. ఇక ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లో అయితే ఇప్పటి వరకూ 225 పరుగులు సాధించి మూడో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. 

ఎమ్మెల్యే నివాసం ఎదుట అయ్యప్ప స్వాముల భజన నిరసన

భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజలు భజనలు చేసుకునే అయ్యప్పస్వాములే నిరసనకు దిగాల్సిన పరిస్థితిని వైసీపీ సర్కార్ తీసుకువచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను బద్ధ శత్రువుల్లా చూసే జగన్ సర్కార్ నైజమే ఇందుకు కారణమన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఇంతకూ జరిగిందేమిటంటే..భీమవరంలోని సింహాద్రి అప్పన్న దేవాలయం వద్ద గత 28 ఏళ్లుగా అయ్యప్పమాల ధరంచే వారు పడిపూజ చేసుకుంటారు. సంప్రదాయంగా వస్తున్న ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎవరూ జోక్యం చేసుకోలేదు. కానీ తాజాగా అయ్యప్ప మాల వేసుకున్న జనసేన మద్దతుదారు పడిపూజను   అడ్డుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారుల్ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆదేశించారు. దాంతో పోలీసులు, అధికారులు రంగ ప్రవేశం చేసి అప్పటికే షామియానా వేసి..  పూజా కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న వేళ అడ్డుకున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారు భక్తిభావంతో చేసే కార్యక్రమాన్ని రాజకీయంగా ఎలా చూస్తారని అయ్యప్పలు నిలదీశారు. ఎమ్మెల్యేను అడిగితే ఇప్పుడు ఇంతే అని నిర్లక్షంగా సమాధానమిచ్చారు. దీంతో అయ్యప్పలకు ఆగ్రహం వచ్చింది.  ఎమ్మెల్యే తీరుకు నిరసనగాద శనివారం రాత్రి ఆయన నివాసం ముందు రోడ్డుపై కూర్చుని అయ్యప్ప గీతాలు పాడుతూ, భజన చేస్తూ నిరసనకు దిగారు. అయ్యప్పల నిరసనలకు స్థానికులు కూడా మద్దతు ఇస్తూ ఎమ్మెల్యే తీరును తప్పుపట్టారు. 

కమలానికి మునుగోడు కషాయం? ఊరించి చేజారిన గెలుపు

మునుగోడులో గెలుపుతో టీఆర్‌ఎస్ భవన్‌లో గులాబీపార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నిక నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడింది.  15 రౌండ్లు ముగిసే సరికి 11,666 ఓట్ల స్పష్ట మైన ఆధిక్యంలో నిలిచింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ముం దంజలో నిలిచింది. మొత్తం 686 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోల్ కాగా టీఆర్‌ఎస్‌ 228, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇతరు లకు 88 ఓట్లు సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. ఉప ఎన్నికలో ఉప ఎన్ని కల ఫలి తాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లుగా ప్రకటించారు బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. తెలంగాణ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్ మినహా మిగిలిన అన్నీ రౌండ్లు టీఆర్ఎస్‌ పార్టీ క్రమంగా మెజార్టీ పుంజుకుంటూ చివరకు ఏడు వేల ఓట్ల ఆధిక్యం దాటిపోవడంతో ఆయ న ఓటమిని అంగీ కరించారు.  ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటి రెడ్డి రాజ గోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. మును గోడులో నవంబరు 3న పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటి రెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధి గా ఈ స్థానం నుండి  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం  సాధించా రు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వా యి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది. ఈ  నియోజక వర్గంలో గురువారం జరిగిన పోలింగ్‌ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.   మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు.  ఇందులో 2,25,192 మంది ఓటువేశారు. వీరిలో 1,13,853 పురుషులు, 1,11,338, మంది స్త్రీలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఆ స్థాయిలో మునుగోడు ఓటర్లు పోటెత్తారు. చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లి‌ లో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలి చారు. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్‌ హౌసింగ్‌ గోడౌన్స్‌లో ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐదో రౌండ్ లో  బీజేపీ పై టీఆర్ఎస్ ఆధిక్యంలో  నిలిచింది. 1,4,5  రౌండ్లలో టీఆర్ఎస్  ఆదిక్యంలో  నిలిచింది. రెండు,మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ ఆధిక్యత ను సాధించింది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ లో 1,352 ఓట్లతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్‌కి 6,478, బీజేపీకి 5,126, కాంగ్రెస్‌కి 2,100 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ 563 ఓట్లతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ ఎస్‌ కి 14,211, బీజేపీకి 13,648, కాంగ్రెస్‌కి 3,597 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కి 7,010, బీజేపీకి 7,426, కాంగ్రెస్‌కి 1,532 ఓట్లు పోలయ్యాయి. 4 రౌండ్  ముగిసే సరికి టీఆర్‌ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కి 7,010, బీజేపీకి 7,426, కాంగ్రెస్‌కి 1,532 ఓట్లు పోలయ్యాయి.  ఐదో రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై  తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదిక్యంలో నిలిచారు. ఐదో రౌండ్ లో  టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6,1,62 ఓట్లు, బీజేపీఅభ్యర్ధి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5,245  ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదు  రౌండ్లు కలుపుకుంటే టీఆర్ఎస్ అభ్యర్ది కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డికి 32,605 ,బీజేపీ అభ్యర్ధి  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి 30,974  ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి  స్రవంతికి  10,055 ఓట్లు వచ్చాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి  టీఆర్ఎస్  అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 52,334 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డికి 49,243 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 13,689 ఓట్లు దక్కాయి. బీజేపీ ఎన్నో  ఆశ లు పెట్టుకున్న చండూరు మండలంలోనూ టీఆర్ఎస్‌ కారు దూసుకెళ్లింది. 9వ రౌండ్‌లో కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డికి  7,497 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 6,665 ఓట్లు వచ్చాయి.10వ రౌండ్‌లోనూ కొనసాగిన టిఆర్ఎస్  ఆధిక్యత. మొత్తం మీద 4,416 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్. 11 రౌండ్లు  పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 74,574 ఓట్లు,బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 68,800 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి  స్రవంతికి  16,280  ఓట్లు  వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిపై 5,765 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 7440, బీజేపీ 5398. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం 2042. 12 రౌండ్లు ముగిసేసరికి 7836 ఓట్ల ఆధిక్యంతో గెలుపు వాకిట్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి  ఉన్నారు.  కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆలస్యంగా ప్రకటిస్తుండడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆల స్యంగా ప్రకటిస్తుం డడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలని కోరారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి వివరాలు తెలిపాలని ఆయన కోరారు. దీని పై సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమ వుతుందని చెప్పారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారని, ఆర్వో సంతకం చేశాకే ఫలితాలు విడుదల చేస్తున్నామ ని వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని స్పష్టం చేశారు. ఉదయం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో పాల్వాయి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సక్సెస్ అవుతాయని లేదుగా ప్రశ్నించారు. అయితే ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం.. బీజేపీ, టీఆర్ఎస్‌‌లతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు పోలు కావడంతో పాల్వాయి స్రవంతి నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.  మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కూడా సిట్టిం గ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ముందు నుంచే ప్రయత్నాలు చేపట్టింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ప్రచారంలో విషయంలో మాత్రం ఆ పార్టీ వెనక బడిందనే చెప్పాలి. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీల మాదిరిగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వ హించలేదనే టాక్ కూడా ఉంది. అలాగే ఓటర్లను ప్రలోభ  పెట్టడంలో కూడా కాంగ్రెస్ వెనకబడిందని చాలా మంది మునుగోడు వాసులే స్వయంగా వెల్లడించారు.  మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుపై తన అనుమానం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏడు రౌండ్లు కౌంటింగ్‌ పూర్తైనప్పటికి ఆయనకు కనీసం ఓట్లు పడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. లక్షా 17 వేలు ఓట్లు ఉంగరానికి పడ్డాయని మునుగోడు ప్రజలు చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పటి వరకు తనకు 600 ఓట్లు కూడా నాకు రాకపోవడంపై అను మానం వ్యక్తం చేశారు. ఈవీఎం ల పనితీరుపై తనకు నమ్మకం లేదన్నారు కేఏ పాల్. ఇదంతా బిజెపి, టీఆరెఎస్ పార్టీల కుట్రగా భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో అవినీతి జరిగిందన్నారు కేఏ పాల్. 200ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారాయన. ఎలక్షన్‌ను రద్దు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఫలితాలు ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడితో జాప్యంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ అన్నారు.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప సీఈవో రౌండ్ల వారీ గా ఫలితాలను  అప్ డేట్ చేయడంలేదని ఆరోపించారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడం లేద న్నారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కార ణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎం దుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.  

మునుగోడులో కారు జోరు.. వాడిపోయిన కమలం!

మునుగోడు ఉప ఎన్నికల్లో కమలం వాడిపోయింది. కారో జోరు చూపింది. కమలనాథుల లెక్క తప్పింది. నియోకవర్గ ప్రజలు తెరాసకే బ్రహ్మరథం పట్టారు. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలపై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు.దీంతో తెలంగాణలోని టీఆర్ఎస్ కార్యాలయాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో నిలువగా.. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నిలిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తంలో రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ అధిక్యత ప్రదర్శించింది.   ఆ తరువాత అన్ని రౌండ్లలోనూ  కారు పార్టీ జోరు కొనసాగించింది. చివరకు విజయం తెరాస అభ్యర్థి కూసుకుంట్లనే వరించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మునుగోడు ఉప ఎన్నక అనివార్యమైన సంగతి తెలిసిందే.   ఈ ఉప ఎన్నికను అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలో మునుగోడులో సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన భారీ బహిరంగ సభను బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ సభ సాక్షిగా రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో వైపు అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం.. సదరు నియోజకవర్గాన్ని మొత్తం 86 యూనిట్లుగా విభజించి..  ఇన్‌చార్జులను నియమించారు. 14 మంది మంత్రులు, 72 మంది ఎమ్మెల్యేలకు ప్రచార భాద్యతలు అప్పగించడమే కాదు.. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లును సైతం గులాబీ బాస్ రంగంలోకి దింపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ గడప గడపకు ప్రచారం నిర్వహించినట్లు అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదే జరగనున్న   తరుణంలో.. జరుగుతోన్నఈ  ఉప ఎన్నికను సెమీ ఫైనల్స్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అలాంటి తరుణంలో తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు పోటా పోటీ పడి మరీ ప్రచారాన్ని నిర్వహించాయి. మరోవైపు.. ఈ ఉప ఎన్నికకు కొద్ది రోజుల ముందు.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలుకు బీజేపీ తెర తీసిందంటూ.. కొన్ని వీడియోలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో జరిగిన హడావుడి ఓ రేంజ్‌లో సాగింది. అయితే ఇంకేముందు కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. కమలం పార్టీ నేతలను ఉతికి ఆరేస్తారని.. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా పక్కాగా ఫిక్స్ అయిపోయారు. కానీ దీనిపై కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది లేదు. చివరకు మంత్రి కేటీఆర్ సైతం.. ఈ అంశంపై ఎవరు పెదవి విప్పవద్దంటూ గులాబీ గూటిలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో మునుగోడు ప్రజలే కాదు.. ప్రపంచంలోని తెలుగు ప్రజలు సైతం మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్‌ నిజమేనా?.. కాదా? అనే ఓ సందిగ్థంలోకి వెళ్లిపోయారనే ఓ టాక్ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా నడిచింది.  అయితే మునుగోడు ఉప ఎన్నిక జరిగిన నవంబర్ మూడో తేదీ సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. మొయినాబాద్ పామ్ హౌస్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోను ప్రగతి భవన్ సాక్షిగా విడుదల చేశారు. మరోవైపు మునుగోడు ఓటర్లంతా ఏ పార్టీ వైపు ఉన్నారనే చర్చ సైతం రాజకీయ పార్టీల్లో జోరుగా సాగింది. కానీ మునుగోడు ఓటర్లు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే పట్టం కట్టినట్లు ఈ ఉప ఎన్నిక ఫలితం   రూఢీ చేసింది.  మునుగోడు ఉప ఎన్నికలో  గెలిచి.. తమ సత్తా ఏమిటో గులాబీ బాస్ కేసీఆర్‌కు రుచి చూపిద్దామనుకున్న కమల నాథులు భంగపడ్డారు.   ఈ ఉప ఎన్నిక ద్వారా సీఎం కేసీఆర్.. తెలంగాణ బీజేపీ నేతలకే కాదు.. హస్తినలోని మోదీ, అమిత్ షా ద్వయానికి సైతం ఝలక్ ఇచ్చారనే  ఓ టాక్ అయితే తెలంగాణ భవన్ సాక్షిగా రచ్చ రంబోలా చేసి పారేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జోడో యాత్ర సైతం.. ఈ ఉప ఎన్నికపై ప్రభావం చూపించలేదని.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లను బట్టి అవగతమౌతోంది.   ఈ ఉప ఎన్నికల వేళ అడుగడుగునా చెక్ పోస్ట్‌లు పెట్టడం ద్వారా భారీగా నోట్ల కట్టలే కాదు.. భారీగా మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. అయినా.. ఎప్పటిలాగానే ఈ ఉప ఎన్నికల్లో కూడా నగదు, మద్యంతోపాటు తులం బంగారం సైతం అత్యంత కీలక పాత్ర పోషించాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 

కౌంటింగ్ పూర్తి కాకుండానే ఓటమి అంగీకరించిన రాజగోపాలరెడ్డి

మునుగోడులో రాజగోపాలరెడ్డి పరాజయాన్ని అంగీకరించారు. కౌంటింగ్ పూర్తి కాకుండానే.. ఆయన తన పరాజయాన్ని అంగీకరించారు. అదే సమయంలో టీఆర్ఎస్, వామపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పది రౌండ్లు పూర్తయిన తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చి మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. అధికార పార్టీ విశృంఖలంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.బీజేపీ అభ్యర్థిగా తనను కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని ఆరోపించారు.   టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందని అన్నారు. భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయడం అనేది  మునుగోడు ఉప ఎన్నికలోనే జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్,  పోలీసులు వ్యవస్థ మొత్తం ప్రభుత్వ యంత్రాంగ మొత్తం నియోజకవర్గాన్ని అష్టదిగ్బంధం చేసిందన్నారు.   పోలింగ్ రోజు కూడా డబ్బు మద్యం పంచారని ఆరోపించారు.