విజయమో..వెనక్కి తిరగడమో తేల్చేది వీళ్లే
posted on Nov 8, 2022 @ 2:11PM
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ ఈసారి అనేక ట్విస్టులతో సెమీస్ వరకూ సాగింది. వెస్టిండీస్, దక్ణిణాఫ్రికా వంటి హేమా హేమీ జట్లు వెనుదిరగడం, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పిల్ల జట్లు తమ సత్తా ఏమిటన్నది నిరూపించడం అన్నీ అంతా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. వారితో పాటు క్రికెట్ వీరాభిానులు, అధికారులు, మాజీ ప్లేయర్ల సైతం గొప్ప ప్రదర్శన ఇస్తారనుకున్నవారు కాస్తంత పేలవంగా ఆడి క్రమేపీ పుంజుకోవడం, సులభంగా గెలవవచ్చన్న మ్యాచ్ లు చివరి బంతికీ తాడో పేడో తేల్చుకునేంత ఉద్రిక్తస్థాయిలో ముగియడం అన్నీ చూశాం. మొత్తానికి బయటికి వెళ్లిపోతుం దనుకున్న పాకిస్తన్ సెమీస్ కి చేరి సెమీస్ పోటీలు రసవత్తరంగా పోటాపోటీ గా జరిగే వీలుందన్నది తెలియజేసింది. ఇక అందరూ రేపు జరిగే తొలి సెమీస్ పై దృష్టి పెట్టారు. ఈ సెమీస్ లో జట్టు విజ యమో.. వెనుదిరగడమో తేల్చగలిగే ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.. ఎందుకంటే ఇప్పటివరకూ వీళ్లే ఈ జట్లను గెలిపించి ఇక్కడిదాకా తీసుకువచ్చారు.
భారత్ తో తలపడే ఇంగ్లండ్ తప్పకుండా కింగ్ కోహ్లీ ని కట్టడి చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్ట నుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును విజయావకాశాల వేపు మళ్లించగలిగే విచిత్రమైన సత్తా ఉన్నవాడు కోహ్లీ. ఇది ఊహించని ప్రత్యేకత. అసలు సిసలుు ప్లేయర్లే దీన్ని ప్రదర్శించగల్గుతారు. 34 ఏళ్ల కోహ్లీ ప్రస్తుత టోర్నీలో ఇంతవరకూ 246 పరుగులు చేశాడు. అందులో అర్ధసెంచరీతో అజేయంగ నిలిచిన ఇన్నింగ్స్ చెప్పుకోదగ్గది. ఓటమి ఖాయమన్న మ్యాచ్ లో ఊహించని ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలోకి లాక్కెల్లడంలో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. అతనికి పరుగులు వరద సృష్టిం చడంలో ఉన్న వేగం, వ్యూహం ఓ ప్రత్యేక శైలిగానే సీనియర్లు, మాజీలు గుర్తించారు. అతను ఒత్తిడిలోనే అద్భుత ప్రదర్శన చేయడం గమనార్హం. బ్యాటింగ్ ను పూర్తిస్థాయిలో ఆశ్వాదించడం అతనిలోనే చూడగల్గుతామంటారు మాజీలు. ఇది ముమ్మాటికీ నిజం. అందుకే అతన్ని రెచ్చగొట్టవద్దని అంటూం టారు పాక్ సీనియర్లు సైతం. అతనంతే.. బౌలర్లను, ఫీల్డింగ్ పొజిషన్లను ఏమాత్రం లెక్క చేయడు.
ఇటీవలి కాలంలో జట్టు మిడిల్ ర్డర్ను ఆదుకుంటున్న గొప్ప వేగం కలిగిన బ్యాటర్ గా ఉద్భవించినవాడు సూర్యకుమార్ యాదవ్. మామూలు ప్లేయర్ లా కనిపించే ఈ బ్యాటర్ ఆకాశమే హద్దుగా సునాయాసంగా సిక్స్ లు కొట్టడంలో మాజీలను తలపిస్తున్నాడు. అందుకే అతన్ని అందరూ స్కై అనీ పిలుస్తున్నారు. ఏమాత్రం కష్టపడుతున్నట్టు ఒత్తిడికి గురయిన దాఖలాలు కనపడవు. అవతలి టీమ్ ఏదయినా, బౌలర్ ఎవరయినా సరే కడు ధైర్యంగా, నైపుణ్యంతో ఫోర్లు, సిక్స్లు బాదేయడంతో పాటు స్కోర్ ను పరుగు లెత్తించడంలో అతనికి అతనే సాటి. అతన్ని రెండో కోహ్లీ అన్నా ఫరవాలేదేమో. సూపర్ 12 చివరి మ్యాచ్లో జింబాబ్వే మీద శరవేగంగా కేవలం 25 బంతుల్లో 61 పరుగులు చేయడమే అందుకు అద్దంపడుతుంది. అంతర్జాతీయ కెరీర్ లోకి అడుగులు వేస్తున్న తొలి రోజుల్లోనే ఇతను ఇలా ధాటిగా ఆడుతుండడం సీనియర్లను సైతం ఆహ్లాదపరుస్తోంది. చాలా కాలానికి మిడిల్ ఆర్డర్ లో మంచి ధీటయిన బ్యాటర్ దొరికాడని హెడ్ కోచ్ ద్రావిడ్ కూడా ఎంతో ఆనందిస్తున్నాడు.
అందరూ తప్పకుండా గమనించాల్సిన కుర్రాడు అర్షదీప్ సింగ్. చూడ్డానికి సన్నగా పీలగా కనపడతాడు గాని ఈ ఎడమచేతి పేసర్ బంతిని స్వింగ్ చేస్తుంటే ప్రత్యర్ధి జట్టు ఓపెనర్లు కంగారుపడటం చూశాం. కాలేజీ అయి ఉద్యోగ వేటలో ఉన్న యువకుడిలా కనిపించే సిగ్గరి లో ఇంత వేగం, యాక్యురసీ చూసి పాక్ మాజీ ప్లేయర్లు కూడా ఆశ్చర్యపడుతున్నారు. క్రమేపీ ఇతగాడు భారత్ ఓపనింగ్ బౌలింగ్ కి నాయ కత్వం వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సెమీస్ లో తప్పకుండా ఇంగ్లండ్ కి బెంబేలెత్తించగలడనే అనుకోవాలి. అతనిలో అంతటి సత్తా ఉంది. ఈ టోర్నీలో ఈ 23 ఏళ్ల కుర్ర పేసర్ 10 వికెట్లు తీసుకుని ముందంజలో నిలిచాడు. భువీ తో కలిసి విజృంభిస్తే భారత్ కు విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఇక ఎప్పుడు సరదాగా నవ్వుతూ కనపడే ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ సామర్ధ్యం అనన్య సామాన్యమనే అంటున్నారు కామెంటేటర్లు. నిజమే, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ ఈ ఫార్మేట్ లోనూ అద్భుతంగా బ్యాట్ చేస్తున్నాడు. ఆరంభ మ్యాచ్ ల్లో అంతగా స్కోర్ చేయకపోయినా చివరి మ్యాచ్ లో లంక మీద 36 బంతుల్లో 42 పరుగులు చేసి తను తన పాత ఫామ్ లోకి వచ్చానని ప్రత్యర్ధులకు హెచ్చరిక చేశాడనే అనాలి. అతను ధాటిగా ఆడితే ఇంగ్లండ్ కలలు పండినట్టే. అతన్ని నిలువరిం చడమ ప్రత్యర్ధి జట్టుకు అత్యంత అవసరం.
ఇక జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ద్వయం ఊహించని బ్యాటింగ్ సత్తా ఉన్నవారు. ఇద్దరూ చూస్తుండగానే పరుగుల వరదతో జట్టుకు భారీ స్కోర్ సాధించగల నైపుణ్యం ఉన్నవారే. కివీస్ స్టార్ పేసర్లు టిమ్ సౌధీ, ట్రెంట్ బౌల్ట్ వంటి పేసర్లను అవలీలగా ఎదుర్కొని 81పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారంటేనే వారి బ్యాటింగ్ సత్తాను అంచనా వేయవచ్చు.
మరో వంక చిన్న పిల్లాడిలా కనిపించే బౌలర్ కరెన్ అతనితో పాటు మార్క్ఉడ్ నీ ప్రత్యేకంగా గమనిం చాలి. తన జట్టుకు బౌలర్ గా సామ్ కరన్ 2010లోనే గొప్ప విజయాన్ని అందించాడు. ఉడ్ ఇంతవరకూ టోర్నీలో అత్యంత వేగంగా బంతిని వేయగల సత్తా ఉన్న బౌలర్ గా అందరూ గుర్తించారు. వేగంతో పాటు స్వింగ్ చేయగల సత్తాతో ప్రత్యర్ధులను భయపెట్టగల పేసర్ ఉడ్.
...