English | Telugu
‘చంద్రముఖి 2’ రన్ టైమ్ ఫిక్స్!
Updated : Sep 15, 2023
ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ త్వరలోనే ‘చంద్రముఖి 2’ చిత్రంతో మనల్ని పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. 17 ఏళ్ల క్రితం రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమాకు ఇది సీక్వెల్. అయితే ఈ సీక్వెల్‌లో రజినీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటించారు. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా అలరించబోతున్నారు. ‘చంద్రముఖి 2’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రన్ టైమ్ ఫిక్స్ చేసుకుంది. 170 నిమిషాలుగా ఈ సినిమా రన్ టైమ్‌ను లాక్ చేశారు. దాదాపు మూడు గంటల వ్యవధి ఉండటంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాను గ్రిప్పింగ్‌గా లేకపోతే సినిమా రన్ టైమ్‌పై కూడా ప్రశ్నలు లేవనెత్తుతారనటంలో సందేహం లేదు.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 15న ముందుగా ఈ సినిమాను మేకర్స్ విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సాంకేతిక కారణాలతో ‘చంద్రముఖి 2’ మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయటానికి ఫిక్స్ అయ్యారు. నాటి చంద్రముఖి సినిమాను తెరకెక్కించిన సీనియర్ డైరెక్టర్ పి.వాసునే ఈ సీక్వెల్‌ను తెరకెక్కించారు. ఇంకా ఈ చిత్రంలో మహిమా నాయర్ తదితరులు కూడా నటిస్తున్నారు. చంద్రముఖిలో బసవయ్య పాత్రలో నటించి మెప్పించిన వడివేలు ‘చంద్రముఖి 2’లో నటించటం విశేషం.
అప్పటి చంద్రముఖి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ‘చంద్రముఖి 2’ అలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా? అనే విషయాన్ని అందరూ ఆసక్తికరంగా గమనిస్తున్నారు.