English | Telugu
రూ. 700 కోట్ల క్లబ్ కి చేరువలో జవాన్.. 8 రోజుల కలెక్షన్స్ ఇవే
Updated : Sep 15, 2023
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తండ్రీకొడుకులుగా నటించిన చిత్రం జవాన్. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అట్లీ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం జనం ముందుకు వచ్చింది. గురువారంతో 8 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకున్న ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ. 697. 90 కోట్ల గ్రాస్ ఆర్జించింది. వీక్ డేస్ లో కాస్త జోరు తగ్గినప్పటికీ.. సెకండ్ వీకెండ్ (శని, ఆది వారాల్లో)లో బాక్సాఫీస్ ని షేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఏరియాల వారిగా 'జవాన్' 8 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.42. 80 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.35 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ. 35.75 కోట్ల గ్రాస్
కేరళ: రూ. 11.70 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 344. 80 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.225.90 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల కలెక్షన్స్ : రూ.697.90 కోట్ల గ్రాస్
హిందీ వెర్షన్ 7 రోజుల నెట్: రూ. 347. 98 కోట్లు