English | Telugu

 'ఛాంగురే బంగారు రాజా' పబ్లిక్ టాక్.. రవితేజ అన్నా నువ్వు సూపర్ అంతే !

మాస్ మహారాజా రవితేజ.. మనకు ఇప్పటివరకు హీరోగానే సుపరిచితం. అయితే, తాజాగా ఆయన సరికొత్త అవతారమెత్తారు. నిర్మాతగా మారి ఆర్.టి. టీమ్ వర్క్స్ పతాకంపై సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా ఆ బేనర్ నుంచి వచ్చిన చిత్రం 'ఛాంగురే బంగారు రాజా'. శుక్రవారం (సెప్టెంబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై పబ్లిక్ స్పందన ఇది.

రంగురాళ్ళ చుట్టూ తిరిగే ఈ సినిమాలో కార్తిక్ రత్నం నటన అదిరిపోయిందంటున్నారు. ఇక సత్య, రవిబాబు కామెడీ మరో స్థాయిలో ఉందంటున్నారు. అంతేకాదు.. 'జాతిరత్నాలు', 'డీజే టిల్లు'ని మిక్స్ చేసినట్లు గా సినిమా ఉందని చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్ గానూ రవితేజ సక్సెస్ అయ్యారంటున్నారు. పనిలో పనిగా "రవితేజ అన్నా.. నువ్వు సూపర్ అంతే" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. 'ఛాంగురే బంగారు రాజా' కమర్షియల్ గా ఏ స్థాయిలో ఆదరణ పొందుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.