English | Telugu
ఎ.పి. పాలిటిక్స్‌పై స్పందించిన మంచు లక్ష్మీ... వైరల్ అవుతున్న ట్వీట్!
Updated : Sep 15, 2023
ప్రస్తుతం ఎ.పి. రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అందరి దృష్టీ వాటిపైనే ఉంది. దీనిపై మంచు లక్ష్మీ ట్విట్టర్‌లో స్పందించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఎ.పి. పాలిటిక్స్‌లో రోజు రోజుకీ లెక్కలు మారుతున్నాయి. దానికి తగ్గట్టుగానే నేతలు పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలో ‘వావ్.. ఎ.పి. రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి’ అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మోహన్‌బాబు ఆల్రెడీ వైసిపీలో ఉన్నారు. అలాగే మంచు మనోజ్ ఆమధ్య సతీ సమేతంగా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడుని కలిశారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ట్వీట్ వెనుక ఏదైనా విషయం దాగి ఉందా అనే కోణంలో కూడా నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.