English | Telugu
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 8 రోజుల కలెక్షన్స్.. సెకండ్ వీకెండ్ పై ఆశలు సజీవం!
Updated : Sep 15, 2023
సినిమాలో సరైన కంటెంట్ ఉండాలే గానీ.. ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే. ఈ విషయాన్ని మరోసారి నిరూపించిన చిత్రం.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. బోల్డ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి టైటిల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేశారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తాజాగా రెండో వారంలోకి ఎంటరైంది.
వరల్డ్ వైడ్ గా 8 రోజుల్లో రూ. 17.39 కోట్ల షేర్ ఆర్జింజిన ఈ సినిమా.. ఇప్పటివరకు రూ. 3. 89 కోట్ల వరకు ప్రాఫిట్స్ చూసింది. వీక్ డేస్ లోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా.. సెకండ్ వీకెండ్ (శని, ఆదివారాల్లో) లోనూ హవా సాగించే అవకాశం లేకపోలేదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 8 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 5.48 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 89 లక్షల షేర్
ఆంధ్రా: రూ. 3.57 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.9.94 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.35 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.6.10 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల కలెక్షన్స్ : రూ.17.39 కోట్ల షేర్