English | Telugu
స్మగ్లర్ పాత్రలో కార్తి.. బన్నీని ఫాలో అవుతున్నాడా?
Updated : Sep 15, 2023
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో 'పుష్ప ది రైజ్' ఎంత స్పెషల్ మూవీనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకోబోతున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో స్మగ్లర్ గా కనిపించి పాన్ ఇండియా స్థాయిలో మెప్పించాడు బన్నీ.
కట్ చేస్తే.. ఇప్పుడు బన్నీ తరహాలోనే మరో హీరో స్మగ్లింగ్ బాట పడుతున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు.. కార్తి. త్వరలో ఈ టాలెంటెడ్ స్టార్ స్మగ్లర్ పాత్రలో ఎంటర్టైన్ చేయనున్నాడు. అయితే, బన్నిలా ఎర్రచందనం కాకుండా బంగారాన్ని స్మగ్లింగ్ చేసే పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. దీపావళికి రాబోతున్న 'జపాన్' సినిమాలో ఇలా గోల్డ్ స్మగ్లర్ గా అలరించబోతున్నాడు కార్తి. మరి.. బన్ని లాగే కార్తి కూడా స్మగ్లర్ గా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.